వికీసోర్స్:తెలుగు వికీసోర్స్ కాపీహక్కుల మార్గదర్శిని

కాపీహక్కులు

మార్చు
 
కాపీహక్కులన్న పదం నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలసి ఉంటుంది???

కాపీహక్కులు అన్న పదం తమ స్వంత సృజనల (original creations) మీద వాటి సృష్టికర్తలకు (రచయితలు, సంగీతకారులు, శిల్పులు, చిత్రకారులు, వగైరా) దక్కే పలు చట్టపరమైన హక్కుల సమూహానికి పేరు. సాహిత్యం, సంగీతం, కళారూపాల్లో ఉండే స్వంత సృజనలకు (original creations) కాపీహక్కులు విస్తృతార్థంలో వర్తిస్తాయి; అయితే ఏ రూపంలో ఈ స్వంత సృజన ఉందన్నదాని ఆధారంగా ఈ హక్కులు మారతాయి. ఈ హక్కుల సమూహాన్ని రచయితల వైపు నుంచి వారి ఆర్థిక, నైతిక పరిరక్షణగా కూడా అర్థం చేసుకోవచ్చు.[1] ఆర్థిక హక్కులు కాపీహక్కుల్లో ఉన్న రచనకున్న ఆర్థిక విలువను కాపాడతాయి, ఉదాహరణకు రచయిత అనుమతి లేకుండా కాపీహక్కుల్లో ఉన్న కృతి(work)ని ప్రచురించడాన్ని నియంత్రిస్తుంది.[2] అదనంగా, నైతిక హక్కులు అన్నవి రచయిత తనకు తన రచనకు ఉన్న సంబంధాన్ని తమకు నచ్చినట్లు స్థాపించుకోగలిగేలా కొన్ని చర్యలు చేసే వీలు కల్పిస్తుంది, ఉదాహరణకు రచయిత తన కృతిని అనామకంగానో, మారుపేరుతోనో ప్రచురించేందుకు ఇది వీలిస్తుంది. [3]

TERM EXPLANATION
కాపీహక్కు వివిధ రంగాలకు చెందిన వ్యక్తులకు తమ కృతిని ప్రజాభిప్రాయం కోసమూ, అనువాదం ద్వారానో, అదే రూపంలోనో పున:సృష్టించడానికి, తిరిగి ప్రచురించడానికి పూర్తిహక్కులు ఇచ్చే సమూహ హక్కులను కాపీహక్కులు అంటారు.
సంయుక్త కర్తృత్వం ఏ రచయిత హక్కుపైనా వివాదం లేకుండా ఇద్దరు కానీ, అంతకన్నా ఎక్కువమంది కానీ రచయితలు కలిసి సృష్టించిన కృతి.
భారతదేశంలో కాపీహక్కుల సంరక్షణ అందుబాటులో ఉండే కృతుల రకాలు
  • మౌలికమైన (Original) సాహిత్య, నాటక, సంగీత, కళా కృతులు
  • సినిమాటోగ్రాఫ్ ఫిల్మ్స్
  • ఆడియో రికార్డింగులు
కళాకృతులు
  • పెయింటింగ్, శిల్పం, డ్రాయింగ్ (బొమ్మ, మ్యాప్, చార్ట్ లేక ప్లాన్ కలుపుకుని), మలిచి చెక్కినవి (engraving) లేక ఫోటోగ్రాఫ్ లేదా కళాత్మక లక్షణం కలిగిన ఇటువంటి ఏదైనా కృతి;
  • నిర్మాణశిల్ప (architecture) కృతి;
  • కళాత్మకమైన నిపుణతతో రూపొందిన ఏ ఇతర కృతులైనా.
సంగీత కృతి సంగీతం ఉన్న కృతి (సంగీతానికి సంబంధించిన గ్రాఫికల్ నొటేషన్లతో సహితంగా). దీనిలో సంగీతం మాత్రమే ఉంటుంది, సంగీతంలో చేర్చి పాడేందుకు ఉద్దేశించిన పదాలు కానీ, చేసే చర్యలు కానీ దీని కిందికి రాదు. కాపీహక్కుల పరిరక్షణ పొందేందుకు సంగీత కృతి రాసే ఉండనక్కరలేదు.
సౌండ్ రికార్డింగ్ రికార్డు చేసిన లేక నిర్మించిన మాధ్యం ఏదన్నదానితో సంబంధం లేకుండా ఏ సౌండ్ రికార్డింగ్ అయినా
సినిమాటోగ్రాఫిక్ ఫిల్మ్ మాధ్యమంతో, పద్ధతులతో సంబంధం లేకుండా ఏ దృశ్యపరమైన రికార్డింగ్ అయినా ఈ నిర్వచనం కిందికి వస్తుంది. దృశ్యంతో కలిపిన ఆడియో రికార్డింగులు కూడా పరిరక్షిత కృతుల్లోకి వస్తుంది.
ప్రభుత్వ కృతి
  • ప్రభుత్వం కానీ, ఏదైనా ప్రభుత్వ శాఖ కానీ
  • భారతదేశంలోని ఏ శాసనమైనా, వీటితోపాటు
  • భారతదేశంలోని ఏదైనా కోర్టు, ట్రిబ్యునల్ లేక జ్యుడీషియల్ అథారిటీ

ప్రచురించినది కానీ, వాటి మార్గనిర్దేశంలో ప్రచురితమైనది కానీ అయిన కృతి

భారతీయ కృతి
  • కృతికర్త భారతీయ పౌరుడైనా; లేక
  • మొదట భారతదేశంలో ప్రచురితమైనా; లేక
  • ప్రచురణ పొందని రచనల విషయంలో కృతికర్త ఆ కృతిని సృజించే సమయంలో భారతీయ పౌరుడైనా

అటువంటి సాహిత్య, నాటక, సంగీత కృతులు.

కాపీహక్కుల స్థితిని పరిశీలించడం

మార్చు

సాహిత్య రచనలు, ఫోటోలు, వీడియోలు లేదంటే మరేదైనా మెటీరియల్ వికీమీడియా కామన్స్‌లోకి ఎక్కించదలుచుకుంటే ముందుగా మీరు ఆ రచన ప్రచురితమైన దేశంలోనూ, వెబ్‌సైట్ సెర్వర్ ఉన్న దేశంలోనూ కూడా స్వేచ్ఛా నకలు హక్కుల్లో ఉందో లేదో చూసుకోవాలి.

భారతదేశంలో ప్రచురితమైన రచనలకు

మార్చు
భారతదేశంలో ఒక కృతి సార్వజనీనం(public domain) అవునా కాదా అన్నది తెలియాలంటే, అది 1957 నాటి భారత కాపీహక్కుల చట్టానికి అనుగుణంగా పరిశీలించాలి[4], ఆ చట్టం ఇలా చెప్తోంది
  • అనామక కృతులు, ఫోటోగ్రాఫ్‌లు, సినిమాటోగ్రాఫిక్ కృతులు, సౌండ్ రికార్డింగులు, ప్రభుత్వ రచనలు, కార్పొరేట్ కర్తృత్వం లేక అంతర్జాతీయ సంస్థలకు కర్తృత్వం ఉన్న రచనలు (సంస్థాగత కర్తృత్వం ఉన్నవి) ప్రచురించిన నాటి నుంచి 60 సంవత్సరాలకు సార్వజనీనం అవుతున్నాయి, ఈ అరవై ఏళ్ళన్నది ఆ ప్రచురితమైన తేదీ తర్వాతి కాలెండర్ సంవత్సరం ప్రారంభం నుంచి లెక్కించాలి (ఉదాహరణకు 2018 నాటికి 1 జనవరి 1958కి ముందు ప్రచురితమైన పై విధమైన కాపీహక్కుల పరిధిలో ఉన్న రచనలు భారతదేశంలో సార్వజనీనంగా పరిగణించవచ్చు).
  • (పై వర్గంలో చేరని) కృతికర్త మరణానంతరం ప్రచురితమైన కృతులు ప్రచురితమైన తేదీ నుంచి 60 సంవత్సరాల తర్వాత సార్వజనీనం అవుతాయి.
  • ఏ ఇతర రచనలైనా రచయిత చనిపోయిన 60 సంవత్సరాలకు సార్వజనీనం అవుతాయి. 1941కి ముందు మరణించిన రచయితల విషయంలో మాత్రం 1991 నాటి క్లాజు ప్రకారం 50 సంవత్సరాలకు అంటే 1991 నాటికి సార్వజనీనం అయివున్నాయి.
  • సంబంధిత అధికారులు పున:ప్రచురణ కానీ, ప్రచురణ కానీ నిషేధిస్తే తప్ప ఏ అధికారిక గెజెట్‌లో అయినా, ఏ శాసనాల్లో అయినా, ఏ తీర్పులో అయినా, ఏ జ్యుడీషియల్ అధారిటీ ప్రచురించిన ఆర్డర్‌లో అయినా, టేబుల్ ఆఫ్ లెజిస్లేచర్‌లో చేర్చిన ఏ ప్రభుత్వ నివేదికల్లో అయినా ప్రచురించిన ఏ పాఠ్యమైనా సార్వజనీనంగా పరిగణించాలి.
పుస్తకం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో సార్వజనీనంగా ఉందా లేదా అన్నది సరిచూడాలంటే, ఈ కింది విషయాలు కనగొనాలి
  • 1923 జనవరి 1 ముందు ప్రచురితమైనది కానీ, యు.ఎస్. కాపీరైట్ ఆఫీసులో రిజిస్టరై ఉన్నది కానీ అయింది;
  • భారతదేశంలో తొలుత ప్రచురించి, ఆ వెనువెంటనే ఓ ముప్పై రోజుల కాలంలో అమెరికాలో ప్రచురితమై ఉండనిది;
  • భారతదేశం అమెరికాతో కాపీహక్కుల సంబంధాలు ఏర్పరుచుకున్న నాటికి అంటే యురుగ్వే రౌండ్ అగ్రిమెంట్స్ యాక్ట్ [5] తేదీ 1996 జనవరి 1 నాటికి భారతదేశంలో సార్వజనీనం అయివుండడం లేదా కాపీహక్కుల నోటీసు లేకుండా 1989 మార్చి 1కి ముందు ప్రచురితమైనది లేదా కాపీహక్కుల పునరుద్ధరణ పొందకుండా 1964కి ముందు ప్రచురితమైనది.
రచయిత మరణం ప్రచురితమైన తేదీ లైసెన్సు భారతదేశంలో కాపీహక్కుల స్థితి* యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కాపీహక్కుల స్థితి* కామన్సులోకి చేర్చవచ్చా వ్యాఖ్య**
ఏదైనా >1958 కాపీహక్కుల పరిధిలోనిది సార్వజనీనం కాదు సార్వజనీనం కాదు చేర్చకూడదు రచయిత కానీ, రచయిత మరణించివుంటే వారసులు కానీ స్వేచ్ఛా నకలు హక్కుల్లో విడుదల చేస్తే (OTRS పద్ధతి అనుసరణీయం) తప్ప చేర్చరాదు.
>1958 ఏదైనా కాపీహక్కుల పరిధిలోనిది సార్వజనీనం కాదు సార్వజనీనం కాదు చేర్చకూడదు రచయిత కానీ, రచయిత మరణించివుంటే వారసులు కానీ స్వేచ్ఛా నకలు హక్కుల్లో విడుదల చేస్తే (OTRS పద్ధతి అనుసరణీయం) తప్ప చేర్చరాదు.
<1918 <1918 {{PD-old-100-1923}} సార్వజనీనం సార్వజనీనం చేర్చవచ్చు
<1923 <1923 {{PD-old-80-1923}} సార్వజనీనం సార్వజనీనం చేర్చవచ్చు
<1923 1923 - 1940 {{PD-India-URAA}} సార్వజనీనం సార్వజనీనం చేర్చవచ్చు
<1923 1941-1958 {{PD-India}} సార్వజనీనం సార్వజనీనం కాదు చేర్చకూడదు తెలుగు వికీసోర్సు పాలసీ నిర్ణయం తీసుకుని స్థానికంగా ఎక్కించవచ్చు
1923 - 1940 <1923 {{PD-old-70-1923}} సార్వజనీనం సార్వజనీనం చేర్చవచ్చు
1923 - 1940 1923 - 1940 {{PD-India-URAA}} సార్వజనీనం సార్వజనీనం చేర్చవచ్చు
1923 - 1940 1941 - 1958 {{PD-India}} సార్వజనీనం సార్వజనీనం కాదు చేర్చకూడదు తెలుగు వికీసోర్సు పాలసీ నిర్ణయం తీసుకుని స్థానికంగా ఎక్కించవచ్చు
1941 - 1958 <1923
  • {{PD-1923}}
  • {{PD-India}}
సార్వజనీనం సార్వజనీనం చేర్చవచ్చు
1941 - 1958 1923 - 1940 {{PD-India}} సార్వజనీనం సార్వజనీనం కాదు చేర్చకూడదు తెలుగు వికీసోర్సు పాలసీ నిర్ణయం తీసుకుని స్థానికంగా ఎక్కించవచ్చు
1941 - 1958 1941 - 1958 {{PD-India}} సార్వజనీనం సార్వజనీనం కాదు చేర్చకూడదు తెలుగు వికీసోర్సు పాలసీ నిర్ణయం తీసుకుని స్థానికంగా ఎక్కించవచ్చు
అనామకం <1923
  • {{PD-India}}
  • {{PD-US}}
సార్వజనీనం సార్వజనీనం చేర్చవచ్చు
అనామకం 1923 - 1940 {{PD-India-URAA}} సార్వజనీనం సార్వజనీనం చేర్చవచ్చు
అనామకం 1941 - 1958 {{PD-India}} సార్వజనీనం సార్వజనీనం కాదు చేర్చకూడదు తెలుగు వికీసోర్సు పాలసీ నిర్ణయం తీసుకుని స్థానికంగా ఎక్కించవచ్చు
Licenses
  • {{PD-old-100-1923}} [6]
  • {{PD-old-80-1923}} [7]
  • {{PD-India-URAA}} [8]
  • {{PD-India}} [9]
  • {{PD-old-70-1923}} [10]
  • {{PD-1923}} [11]
  • {{PD-US}} [12]

మూలాలు, నోట్స్

మార్చు

ఇతర వివరాలు

మార్చు

ఈ పాఠ్యం బోధిసత్వ, అనంత్ సుబ్రాయ్ సంపాదకత్వంలో, అంబికా టాండన్ సరిజూడగా సీఐఎస్-ఎ2కె రూపొందించిన Wikisource Handbook (వికీసోర్సు హ్యాండ్ బుక్) నుంచి స్వీకరించినది.
* ఈ భాగం పవన్ సంతోష్ రాసినది
** ఇది పవన్ సంతోష్ తెలుగు వికీసోర్సు పాలసీ మార్పు గురించి వెలిబుచ్చుతున్న అభిప్రాయం.