వాడుకరి:Pavan (CIS-A2K)/నా పని
సీఐఎస్-ఎ2కె ప్రోగ్రాం అసోసియేట్ గా చేస్తున్న పనుల వివరాలు ఇక్కడ రాస్తున్నాను:
నెలవారీ కార్యకలాపాలు
మార్చునెలవారీగా చేయడానికి ఉద్దేశించిన నా పనుల జాబితా (టాస్క్ లిస్ట్) ఇక్కడ రాస్తున్నాను, గమనించగలరు.
ఏప్రిల్ 2018
మార్చు- కొత్త భాగస్వామ్య అవకాశాలకు ప్రయత్నం
- స్వాధ్యాయ పరిశోధన సంస్థ, గ్రంథాలయం వారిని భాగస్వామ్య అవకాశాలు పరిశీలించేందుకు సంప్రదించడం
- సుపథ పత్రిక వారి 20 వసంతాల వేడుకకు హాజరై వారి పత్రిక, సనాతన సుపథ ప్రచురణలకు సంబంధించి భాగస్వామ్యం అవకాశాలు చర్చించడం.
- సాక్షి, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ మొదలు కొత్తగా నెలకొల్పుతున్న ప్రతిష్టాత్మక పత్రిక సహా పలు పత్రికల సంపాదక వర్గంతో వికీపీడియా గురించి ప్రత్యేక కథనాలకు వీలు కల్పించే అంశంపై సంప్రదించడం, చర్చించడం.
- జరుగుతున్న కార్యకలాపాలకు కొనసాగింపు
- విశాఖపట్టణం, హైదరాబాదుల్లో మహిళావరణం కార్యక్రమాల ఫాలో-అప్ కార్యకలాపాలు
- సంచిక ఇ-పత్రికలో వరుస కథనాల కోసం ముడిసరుకు అన్వేషించి, రాసేందుకు తగిన వికీపీడియన్లను ప్రోత్సహించి, కొంతమేరకు సంపాదకత్వ సమన్వయం చేయడం
- తెలుగు వెలుగు, బాలభారతం పత్రికల్లో ఎటువంటి కథనాలో రాయవచ్చో తెలుగు వికీపీడియన్లకు సూచనలు ఇవ్వడం, ఆ అంశాన్ని సమన్వయం చేయడం
- ప్రస్తుత భాగస్వామ్యాలలో కార్యకలాపాలు
- తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యానికి సంబంధించి ఫోటోల విడుదలకు కామన్సులో ఏర్పాట్లు సమన్వయం చేయడం
- అమ్మనుడి పత్రిక స్వేచ్ఛా నకలు హక్కులలో విడుదల విషయమై తేలికైన కొత్త మార్గాల అన్వేషణకు చర్చ
- ప్రణాళికలోని కార్యకలాపాలకు కార్యరూపం
- తెలుగు వికీపీడియా శిక్షణాభివృద్ధి కార్యక్రమాలు (మినీ టీటీటీ, ఎండబ్ల్యుటీ) గురించి చర్చ ప్రారంభం, తేదీలు, వివరాలు ఖరారు
- సినిమా వ్యాసాల అభివృద్ధికి ప్రత్యేక కృషి, ప్రధానంగా వనరుల అందజేత ద్వారా అభివృద్ధి
- గూగుల్ అనువాద వ్యాసాల అభివృద్ధికి - ప్రధానంగా ప్రాధాన్యతా క్రమంలో ముందున్నవాటి అభివృద్ధికి - అవకాశాల అన్వేషణ
- నెలవారీ సమావేశాల నిర్వహణకు సహకారం, నైపుణ్యాభివృద్ధి. విశాఖపట్టణంలో కొత్త నెలవారీ సమావేశం ఏర్పాటుకు ప్రయత్నం.
- ఎ2కె జట్టులో భాగంగా నా ఇతర కృషి
- ప్రసార, సామాజిక మాధ్యమాలపై వ్యూహాత్మక కృషిపై జాతీయ స్థాయి కాన్ఫరెన్సు ప్రతిపాదనలు, చర్చ ప్రారంభం
- ఎ2కె ప్రతిపాదిత కార్యప్రణాళిక ప్రధానాంశాలు బహుభాషల వికీపీడియాల్లోకి అనువదించి, ప్రచురించే కృషి సమన్వయం
- సముదాయం ప్రతిపాదించిన అంశాలు
- ఇప్పటికే పూర్తైన పుస్తకాన్ని కాపీహక్కుల విడుదల కోసం డాక్టర్ సమరాన్ని, స్వేచ్ఛానకలుహక్కుల స్పష్టత కోసం డాక్టర్ గుమ్మా సాంబశివరావుని సంప్రదించడం
- కాశీయాత్రచరిత్ర పుస్తకం పూర్తిచేయడంలో సహకరించడం