వలదన నొరులకు (రాగం: ) (తాళం : )

ప|| వలదన నొరులకు వశమటనే | తలచినట్లనిది దైవమెచేసె ||

చ|| తరుణికుచములను తామరమొగుడలు | విరిసెనోయని వెరపునను |
సరగున పతిసఖ చంద్రశకలములు | దరులుగలుగనిది దైవమెచేసె ||

చ|| పొలతివదనమను పున్నమచంద్రుడు | బలిమినెగయునని భయమునను |
మెలుతచికురధ మ్మిల్లపురాహువు | తలచెదరగనిది దైవమెచేసె ||

చ|| వనితకువాడునొ వలపుతాపమున | తనులతికయనుచు తమకమున |
ఘనవేంకటపతి కౌగిటచమటల | తనివి దీర్చనిది దైవమెచేసె ||


valadana norulaku (Raagam: ) (Taalam: )

pa|| valadana norulaku vaSamaTanE | talacinaTlanidi daivamecEse ||

ca|| taruNikucamulanu tAmaramoguDalu | virisenOyani verapunanu |
saraguna patisaKa caMdraSakalamulu | darulugaluganidi daivamecEse ||

ca|| polativadanamanu punnamacaMdruDu | baliminegayunani Bayamunanu |
melutacikuradha mmillapurAhuvu | talacedaraganidi daivamecEse ||

ca|| vanitakuvADuno valaputApamuna | tanulatikayanucu tamakamuna |
GanavEMkaTapati kaugiTacamaTala | tanivi dIrcanidi daivamecEse ||


బయటి లింకులు

మార్చు




అన్నమయ్య పాటలు  
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |