వడ్డూరి అచ్యుతరామ కవి భక్తిమాల

వేణుగోపాల స్తుతి మార్చు

  1. కరములకంకణంబులు ముఖంబున వెన్నెలలోల్కునవ్వులున్

శిరమున బర్హి బర్హ మతసీ కుసుమద్యుతి నొప్పు దేహమున్ దరదరవింద నేత్రములుదార కృపారసమొప్ప మాధవా మురళీధరించి నాకు కనుమూసిన విచ్చిన కానుపింపవే!

  1. కలకలలాడు నెమ్మొగము కస్తూరి కాంచిత ఫాలభాగమున్

మిల మిలలాడు కేశములు మేటి శిరంబున బర్హి బర్హమున్ విలసిలు నిన్ను కన్నులకు విందుగ కాంచగ దివ్య భాగ్యమున్ కలుగగ జేయుమయ్య నవకంజదలేక్షణ భక్త రక్షణా !

  1. కరమున వేణువూదుచును కంకణ నిక్వణముల్ సెలంగగా

యురమున కౌస్తుభ ప్రభ మహోజ్వల కాంతుల వీవ దివ్యమౌ శిరమున బర్హి బర్హ మతి చెల్వు ఘటించి నటింప దరులను గూడి యాడుచును దర్శన మీయవే నందనందనా !

  1. నల్లని మోముపైన చిరునవ్వు మెరుంగులు వెట్ట నందమౌ

పిల్లనగ్రోవి నూదుచును పింఛము చక్కదిద్దుకొంచు నా యుల్లము పల్లవింప దయయొప్పగ దర్శనమీగదే జగ ద్వల్లభ పల్లవీ హృదయవల్లభ నీకు నమస్కరించెదన్!

  1. గజ్జలు ఘల్లు ఘల్లుమన గంతులు వేయుచు గాన వృస్టిచే

సజ్జనచాత వ్రజము సంభ్రమ మొందగ మేనికాంతిచే ముజ్జగముల్వెలుగ నవమోహన దివ్య సుమంగళాకృతిన్ సజ్జనవంద్య దర్శన మొసంగవె నీకిదె కేలు మోడ్చెదన్! </poem> శ్రీ వేంకటేశ్వర భక్తిమాల లోని వేణుగోపాల స్తుతి పద్యాలు.


శ్రీ సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవము .బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపముగా సర్వ జనులచే ఆరాధింప బడుచున్నాడు ."యానికృత్యాని లోకేషు సర్వాన్యేషు రవి ప్రభు:" అని అగస్త్య మహర్షి శ్రీరామునకు ఉపదేశించిన "ఆదిత్య హృదయమున ప్రవచించి యున్నాడు . కులమత భేదములకు లోను గాని సర్వ మానవారాధకుడు .ఆయనను ఆరాధించి అనేకులు సఫల మనోరధులై ఆయురారోగ్య భాగ్యములంది సుఖించినారు. నేను (రచయిత శ్రీ వడ్డూరి అచ్యుతరామ కవి ) అనారోగ్య సమయములో ఈ స్తోత్రము వ్రాసి ఆరోగ్యము పొందినాను ఆ స్తోత్రములోని కొన్ని పద్యములు మీ కోసం

శ్రీ సూర్యనారాయణమూర్తి పద్యాలు మార్చు

  1. " ఓంకారంబున సంభవించు జగమా యోకార మదంతమౌ

నోంకారంబున వృద్ధి జెందు సకలంబోకారమై యొప్పు నా

యోంకారాకృతియై వెలింగెడి పరంజ్యోతిన్ పరబ్రహ్మమున్
ఓంకార ప్రణవ స్వరూపునకు దేజోమూర్తికిన్ మ్రొక్కెదన్ !
  1. .సరసిజ బాంధవా !నిగమ సన్నుత ! దీనశరణ్య !మౌని ఖే
   చర గరు డోరగ ప్రముఖ సన్నుత భక్త జనావనా శుభం 
   కర శరణంటి బ్రోవగదే కాలనియామక !కాలరూప ! యో 
   హరిహర ధాతృ తేజ !పరమాత్మ !దయానిధీ !దేవ ! భాస్కరా !