వందేభారతమాతరం దేశ భక్తీ గీతం యమునా కళ్యాణి రాగం ,మిస్రచాపు తాళం

రచన : శ్రీ వడ్డూరి అచ్యుతరామ కవి, స్వాతంత్య్ర సమరయోధులు, తామ్ర పత్ర గ్రహీత.

 	కన్నాపురం ,పశ్చిమ గోదావరి జిల్లా  సమర్పణ : వడ్డూరి రామకృష్ణ ,తణుకు ఫోన్ :9959117167

వందేభారతమాతరం

మార్చు

ప: వందేభారత మాతరం
            వందారు జన సుర మందారం  !!వందే !!

చ1. మందరాచల వింధ్య హిమగిరి
            సుందరోన్నత శిఖర చుంబిత
            చంద్ర తారక మండలాం
            సాంద్ర ఫలతరు మండితాం  !!వందే !!

చ2 . గౌతమీ కావేరి గంగా
            కృష్ణవేణి తరంగ రంగ
            మంగళోదక పోషితాఖిల
            భూతజాల విభాసితే  !!వందే !!

చ3. అంగ వంగ కళింగ కాశ్మీ
           రాంధ్ర సౌరాష్ట్రాది మండల
           సంగరాంగణ విజితరిపుజన
           వీర భారత బృంద వంద్యాం  !!వందే !!

చ4. లలిత కుసుమిత ఫలిత వికసిత
          సస్య తరులత పల్లవాం
          కిలకిలారవ ఝంకారిత
          కలనినాద పతంగ బృందాం  !!వందే !!

చ5. చందనాగరు పారిజాత మం
         దార కుంద కమల సు
         గంధ బంధుర మందానిల
         కందళిత హృదయార విందాం  !!వందే !!

చ6. చతుష్షష్ఠి కళాన్వితాం
         చతుర్వేద నివేదితాం
         చతుస్సాగర వేల్లితాం
         చతురంగ బలోపేతామ్  !!వందే !!

చ7. శాంత శమ దమ నియమ వితారణ
          సత్యశౌచ దయార్త రక్షణ
          ధీర గంభీరాది సుగుణ
          గుణాభిరామ కుమార జననీం  !!వందే !!

చ8. వ్యాస వాల్మీకి కాళిదాసా మర
          మయూర శుకాది కవికుల
          భాసమాన మహా కవిత్వ
          సుధాతరంగ సురంజితాం  !!వందే !!

చ9. కృష్ణ శంకర బుద్ధ గాంధీ
         రామకృష్ణ సుభోదామృత
         రసఫ్లావిత మానకాఘాం
         విశుద్దాంచిత కర్మ బద్ధామ్  !!వందే !!

చ10. ధర్మ సత్య దయాశ్రితావన
          ద్వాత్రింశ త్సుగుణ భూషిత
          రాజ రాజాధిప మహా
          రాజభుజ పరిపాలితాం  !!వందే !!

చ11 . ఋగ్య జుస్సా మాధర్వణ
          శృతి స్మ్రుతి పురాణోదిత
          వాదగాధా బోధితాం
          వేదనాద వినోదితాం  !!వందే!!

చ12. సరిగమ పదని సంయుత
          సప్తస్వర గానలోలాం
          తధిమిధిమికిట ధణమ్ ధణ ముఖ
          తాళ బంధుర నటనఖేలాం  !!వందే !!

చ13. కమల దళ సన్నిభ విలోచన
          కమల కేసర వర్ణినీ
          కమల భవముఖ వినుత సుచరణ
          కమల యుగళ విభాసినీం  !!వందే !!

చ14. అభయముద్ర త్రివర్ణ కేతన
          శూలకమల కరాంబుజాం
          విబుధలోక సమర్చనీయ సు
          దివ్య మంగళ విగ్రహాం  !!వందే !!

చ15. ప్రాశ్చ పాశ్చాత్యాది భూతల
          భాసమాన శిరోరత్నాం
          అచ్యుతార్చిత చరణ పద్మాం
          నిత్య ఫలిత సురత్న గర్భాం  !!వందే !!