లోకోక్తి ముక్తావళి/సామెతలు-బె
బు
2496 బుట్టాలోపామువలె మణిగినాడు
2497 బురదగుంటలో పందిసామెత
2498 బురదబుక్కడము వంటి వాడు
2499 బుర్రకు ఒక గుణము జిహ్వకు ఒక రుచి
2500 బుట్టమీద గొట్ట భుజగంబు చచ్చునా
2501 బులుపు తీరిన గాని వలపుతీరదు
2502 బురదలోపడ్డ పేడపురుగువలె
బూ
2503 బూడిదలో నెయ్యి పోసినట్లు
2504 బూడిదలో చేసిన హోమము
2505 బూడిదలో పోసిన పన్నీరు
2506 బూరుగ పండుకు చిలుక కాచియున్నట్లు
బె
2507 బెదిరించి బెదిరించి బెల్లపుకుండకు తూటు పొడిచినదట
2508 బెల్లపు పిళ్ళారికి ముడ్డిగిల్లి నైవేద్యము
2509 బెల్లం పారేసి ఆకు తాకినత్లు
2510 బెల్లంవుంటే యీగలు ముసురుతవి
2511 బుడ్డను నమ్మి యేటపడ్డట్టు