లోకోక్తి ముక్తావళి/సామెతలు-బి

2479 బాలనాయకం బహునాయకం స్త్రీ నాయకం

2480 బాలలేని యింట్లో వృద్ధు డంబాడెనట

2481 బావమరిది బ్రతక గోరును దాయాది చావగోరును

2482 బావా నీభార్య ముండమోసిందోయి అంటే మొర్రోఅనియేడ్చెనట

2483 బావి తవ్వబోగా భూరము బయలు దేరెనట

2484 బావి లోతు చూడవచ్చును కాని మనసులోతు చూడరాదు

2485 బాస తప్పినవాదు బడిందిగినవాడు ఒక్కటే

బి

2486 బిచ్చపుకూటికి పేదరిక మా

2487 బిచ్చపు కూటికి శనైశ్వర మడ్డం పడ్డట్టు

2488 బిచ్చపువాణ్ణి చూస్తే బీదవానికి కోపము

2489 బిచ్చమువేయకున్నమానె కుక్కనువిడువకు మన్నట్లు

2490 బిచ్చానికిపోయినా బిగువుతప్పలేదు దుప్పటిపోయినా వల్లెవాటుతప్పలేదు

2491 బిఒడ్డను వేసి లోతుచూచినట్లు

2492 బిడ్డయెదిగితే కుండయెదుగుతుంది

2493 బిడ్డలేనిముద్దు వానలేనివరద

బీ

2494 బీడునకు కురిసినవర్షం అడివిని కాచినవెన్నెల

2495 బీదవాడు బిచ్చపువానికి లోకువ