లోకోక్తి ముక్తావళి/సామెతలు-ప్రీ
ప్రా
2424 ప్రాణంతీపా బెల్లంతీపా
2425 ప్రాణంపోయినా మాసందక్కించుకోవలెను
2426 ప్రాతబడ్డబావినీరు మేకలపాడి రోత
2427 ప్రాణంవుండేవరకు భయంలేదు
2428 ప్రాతస్సంధ్యావందన అర్ధహృదయపాఠ అర్ధపుస్తకపాఠ మధ్యాహ్న సంధ్యావందన నమ్మకు తెలియదు నమ్మఆచారి తెలియదు సాయంసంద్యావందన యధోచితం
ప్రీ
2429 ప్రీతితోపెట్టింది పిడికెడేచాలు
243O ప్రీలేనికూడు పిండాకూదు
2431 వండించి పదిమందికిపెట్టవచ్చు మడిదున్నుక బ్రతుకవచ్చు
2432 పెద్దలమాటలు పెరుగుచద్దులు
2433 పొలములో పొలము స్తలములోస్తలము
2434 పైపడ్డమాట మడిపడ్డనీళ్లూ పోతవా
2435 పడమటకొరడువేస్తే పాడుగుంటలన్నీ నిండును
2436 పైకంలేనివాదు పరస్త్రీవర్జితుడు
బ
2437 బంగారపుకత్తి
2438 బంగారపు పిచ్చుక
2439 బంగారపుపొల్లు వున్నదిగాని మనిషిపొల్లులేదు
'