లోకోక్తి ముక్తావళి/సామెతలు-పొ

పై

2375 పైన పటారం లోపలలొటారం

2376 పైకము భాగవతపువారికి తిట్లు చాకలి మంగలివారికి

2377 పైనపారే పక్షి క్రిందపారే చీమ

2378 పైపెట్టుగా వర్షించిన పైరు పగవానిముఖమూచూడరారు

2379 పైరుగాలికి ప్రత్తిచెట్టు ఫలించును

2380 పైరుకుముదురు పసరమునకు లేత

2381 పైరుపెట్టక చెడిపోవడముకంటే పైరుపెట్టి చెడిపోవడం మేలు

పొ

2382 పొంగేదంతా పొయ్యిపాలు

2383 పొక్కటిరాళ్ళకు పోట్లాడినట్లు

2384 పొట్టకంకులు తిన్నవారికి వూచబియ్యం లేవు

2385 పొట్టకు పుట్టెదురిని ఆట్లకు ఆదివారం

2386 పొట్టపైరుకు పుట్టేడు నీరు

2387 పొట్టిగట్టి పొడుగులొట్టి

2388 పొట్టి పోతరాజు కొలువు

2389 పొట్టివాడికి పుట్టేడు బుద్ధులు

2390 పొట్టివానినెత్తి పొడుగువాడు కొట్టె పొడుగువాని నెత్తి దేముడు కొట్టె

2391 పొత్తులమగడు పుచ్చిచచ్చెను 2392 పొదుగు చింపిన పసరం పోతును యీనుతుంది

2393 పొదుగుకోసి పాలుత్రాగినట్లు

2394 పౌయ్యిఅరిస్తే బంధువులు కుక్క అరిస్తే కరువులు

2395 పొయ్యిలో పిల్లి లేవలేదు

2396 పొయ్యివూదమంటే కుండలు బ్రద్దలు కొట్టినాడు

2397 పొరుగింటచూడరా నాపెద్దచెయ్యి

2398 పొరుగింటి కలహము విన వేడుక

2399 పొరుగింటి పుల్లకూర రుచి

2400 పొరుగు పచ్చగావుంటే పొయ్యిలోనీళ్లు పోసుకున్నట్లు

2401 పొరుగూరి చాకిరం పొరుగూరి వ్యవసాయం తనను తినేవే గాని తినేవిగావు

2402 పొల్లుదంచి బియ్యము చేసినట్లు

2403 ప్రొద్దుటిది పొట్టకు మాపటిది బట్టకు

2404 పొమ్మనలేక పొగపెట్టినట్లు


2405 పొయ్యి వూదినమ్మకు బుక్కెడైనా దక్కదా

2406 పొర్లించి పొర్లించి కొట్టుతూవుండగా మీసాలకు మన్నుతగుల లేదన్నట్లు

పో

2407పోకలకుండ చట్రాతిమీద పగులగొట్టినట్లు

2408 పొడు బాము సామెత

2409 పోగాపోగా పైగుడ్డ బరువవుతుంది

2410 పోతేపల్లివారికి పప్పే సంభావన