లోకోక్తి ముక్తావళి/సామెతలు-పే
2359 పెరుగూవడ్లూ కలిపినట్లు
2360 పెసరకుపరుగాలి పసరమునకు నోటిగాలి ప్రమాదకరములు
పే
2361 పేగుచుట్టమా పెట్టుచుట్టమా
2362 పేడకుప్పకు దృష్టిమాత్రమా
2363 పేడలోపొదిగిన వుల్లిగడ్డ
2364 పేదల బిగువు
2365 పేదబ్రతుకు గోధుంరొట్టె అద్దుకతిన ఆవునెయ్యి మూతి కడుగ నేతిబొట్తు
2366 పేదవానికోపము పెదవికిచేటు
2367 పేనుకుక్కినా కుక్కుతాడు చెవికరచినా కరుస్తాడు
2368 పేనుకు పెత్తనంయిస్తే తలంతా తెగకొరికినది
2369 పేరంటానికివచ్చి పెండ్లికొడుకు వరుసయేమి అన్నట్లు
2370 పేగుగంగానమ్మ తాగబోతే నీళ్ళు లేవు
2371 పేరుగొప్ప వూరుదిబ్బ
2372 పేరు పల్లకీమీద కాలు నేలమీద
2373 పేరు పెనిమిటిది అనుభవం మామగారిది
2374 పేరు పెన్న మేసింది వేళ్లు నేలమోసింది