లోకోక్తి ముక్తావళి/సామెతలు-పూ
2299 పులికడుపున చలిచీమలు పుట్టునా
2300 పులికాకలైతే గడ్దితింటుందా
2301 పులినాకి విడిచినట్లు
2302 పులిని చూచి నక్క వాతపెట్టుకున్నట్లు
2303 పులిపక్కను జోరీగవున్నట్లు
2304 పులిపిల్ల పులిపిల్లే మేకపిల్ల మేకపిల్లే
2305 పులిగాడికి గిలిగాడు
2806 పులిమీసాలుపట్టుకు వుయ్యాలలూగినట్లు
2307 పువ్వు విప్పగానే పరిమళం
2308 పుష్యమాసమునందు పువ్వులుగుచ్చ పొద్దుండదు
2309 పుష్యమాసానికి పూసంతవేసంగి
పూ
2310 పూజకొద్దీ పురుషుడు పుణ్యంకొద్దీ పుత్రుడు
2311 పూటకూళ్ళకు వచ్చినవాడికి పుట్లధర యెందుకు
2312 పూటకూళ్ళమ్మ పుణ్యమెరుగదు
2313 పూచినతంగేడు వేసినా కాసినవెంపలి వేసినా నేను వండుదును
2314 పూచిన పూవెల్లా కాయాఐతే భూమిపట్ట చోటుండదు
2315 పూతకుముందే పురుగుపట్టినది
2316 పూరా మణిగిన వానికి చలేమి, గాలేమి 2317 పూల చేరెత్తినట్లు
2318 పూలమ్మిన చోట పుడక లమ్మినట్లు 2319 పూస గూర్చినట్లు
2320 పూస పోగూ వుంటే బుజమెక్కవలెనా
పె
2321 పెంటమీద పంట, మంట మీద వంట
2322 పెండ్లికి పోదాం అంటే వెళ్లిపోదాం అన్నట్లు
2323 పెండ్లినాటి సౌఖ్యం లంఖణాలనాదు తలచు కొన్నట్లు
2324 పెండ్లి మర్నాడు పెండ్లికొదుకు ముఖాన పెద్దమ్మ వ్రేలాడుతుంది
2325 పెండ్లివారు వచ్చి పెరట్లో దిగినారా
2326 పెండ్లిస్ందట్లో తాళిబొట్తు కట్ట మరచినట్లు
2327 పెట్టకూస్తే పుంజు కేరుతుంది
2328 పెట్టగల బచ్చలిపాదు కొనగల కట్ట మరచినట్లు
2829 పెట్టనమ్మ పెట్టనెపెట్టదు పెట్టేముండ కేమి వచ్చినది పెద్దరోగం
2330 పెట్టితే తింటారు గాని తిట్టితే పడరు
2331 పెట్టితే పెండ్లి పెట్టకపోతే శ్రార్ధము
2332 పెట్టినమ్మకు ప్రాణహాని చెప్పినమ్మకు జన్మహాని
2333 పెట్టినమ్మకు ప్రాణహాని చెప్పినమ్మకు పుట్టనిదేసాక్షి
2334 పెట్టినవారికి తెలుసు నిక్షేపం
2335 పెట్టినదంతయు పైరగునా? కన్నదంతయు కాన్పగునా
2336 పెట్టే పోతలు లేని వట్టి కూతలేల
2337 పెట్టీపొయ్య నమ్మ కొట్టి పొమ్మన్నదట