లోకోక్తి ముక్తావళి/సామెతలు-పి
2205 పాలుచిక్కనైతే వెన్న నెక్కసం
2206 పాలొల్లని పిల్లియున్నదా
పి
2207 పిండిఎంతో నిప్పటి (రొట్టె) అంతే
2208 పిండికిదగ్గ పిడచ
2209 పిండిప్రోలూలేనిది పెండ్లిఅగునా
2210 పిండిబొమ్మనుచేసి పీటమీద కూర్చుండపెట్టితే ఆడబిడ్డల్ తనాన అదిరి పడ్డదట
2211 పిందెలో పండిన పండు
2212 పిచ్చుకమీద బ్రహ్మాస్త్రమా
2213 పిచ్చికుదిరింది రోలు తలకు చుట్టమన్నట్లు
2214 పిచ్చుగుంటలవాని పెండ్లెంత వైభమెంత
2215 పిచ్చివానికి లోకమంతయు పిచ్చగానె యుంటుంది
2216 పిట్టకొంచెము కూతఘనము
2217 పిట్ట పిట్ట పోరు పిల్లి తీర్చినది
2218 పిఠాపురంవెళ్ళి పిడికెడు నీళ్ళు తెచ్చినట్లు
2219 పిడుకిపొగకు సిగమూగితే గుగ్గిలంపొగ కెట్లాగనలె
2220 పిడుకలు తీసుకురార సివ్వయంటే నాపిక్కలు నొస్తున్నవి అవ్వా అన్నాడట
2221 పిడుక్కూ బియ్యానికి వొకటే మంత్రం
2222 పిడుగుకు గొడుగడ్డమా
2223 పిడుగు పడడానకు వారసూలా 2224 పితికేబర్రెను యిచ్చి పొడిచే దున్నను తెచ్చుకున్నట్లు
2225 పినతండ్రి పెళ్ళాం పినతల్లి గాదు, మేనమామ పెళ్లాము మేనత్తగాదు
2226 పిరికి బంటుకు తుమాన్ఖ
2227 పిరికి బంటుకు ఆయుధ మెందుకు
2228 పిలవని పేరంటం, చెప్పని ఒక్కపొద్దు
2229 పిలిస్తే బిగిస్తే సరిగాని వస్తే వాడబ్బతరమా
2230 పిల్లకా కేమెరుగును వుండేలు దెబ్బ
2231 పిల్లకాయలకు పీట కోళ్లకు చలిలేదు
2232 పిల్ల బావిలో పడ్డదిరా అంటే వుదుకంబలి తాగిస్తా నన్నాడట
2233 పిల్ల ముడ్దిగిల్లి వుయ్యాల వూపేవాడు
2234 పిల్లగలవాడు పిల్ల కేడిస్తే కాటివాడు కాసుకేడిచినట్లు
2235 పిల్లకు సొమ్ముబెట్టిచూడు గోడకు సున్నం పెట్టిచూడు
2236 పిల్ల కోసరం గడ్డి తింటాడు
2237 పిల్ల లేనియింట తాత తడువు లాడినట్లు
2238 పిల్లి కండ్లు మూసుకొని పాలు త్రాగుతూ ఎవరున్నూ చూడలేదను కొన్నట్లు
2239 పిల్లి కండ్లు పోగోరును, కుక్క పిల్లలు గలుగ గోరును
2240 పిల్లికి చెలగాటము, ఎలుకకు ప్రాణ సంకటము
2241 పిల్లితోక బర్రె త్రొక్కితే పిల్లి ఎలుక మీద మీసాలు దువ్వెనట 2242 పిల్లికి రొయ్యల మొలత్రాడు గట్టితే అసుంటాబోయి నోట్లో వేసుకున్నదట
2243 పిల్లికి యెలుక సాక్షి
2244 పిత్రార్జితం అంతా కరారావుడి చుట్టటం అయింది
2245 పిల్లిని చంక బెట్టుకొని పెండ్లికి వెళ్ళినట్లు
2246 పిల్లిని చంపిన పాపం నీది బెల్లం తిన్న పాపం నాది
2247 పిల్లి బ్రహ్మహత్య
2248 పిల్లి బ్రాహ్మణుడు, పీట ముత్తైదు
2249 పిల్లి శాపాలకు ఉట్లు తెగునా
2250 పీటకు పిఱ్ఱకూ వైరం
2251 పిరికిఅంటూ రానేగూడదుగాని వచ్చిందంటే పిచ్చికుక్క కరచినట్లే
2252 పిల్చేవారుంటే బిగిసేవారు శానామంది
పీ
2253 పీతాంబరం ఎరువిచ్చినమ్మ పీటవెంబడి పెట్టుకు తిరుగ వలసినది
2254 పీనుగకు చేసిన జాతర
2255 పీనుగుకు ఎక్కదో గద్దలక్కడ
పు
2256 పుంగనూరు సంస్థానం
2257 పుంజం పెట్టినది బట్ట లంచం పెట్టినది మాట
2258 పుంటిశూరలో పుడక రుచి మాంసములో బొక్కరుచి