లోకోక్తి ముక్తావళి/సామెతలు-దు

దు

1767 దుక్కిటెద్దు దేశాంతరం వెళ్లినట్లు

1768 దుక్కిచలవవేచలవ తల్లి పాలేపాలు

1769 దుక్కికొద్దీ పంట బుద్ధికొద్దీ సుఖము

1770 దుక్కిదున్నితే భూమికి శాంతము

1771 దుక్కిగల భూమికి దిక్కుగల మనుజుడు చెడడు

1772 దుక్కివుంటే దిక్కువుంటుంది

1773 దున్నక చల్లితే కొయ్య పండింది

1774 దున్నక వేసిన ఆముదాలు మాదిగకు యిచ్చిన అప్పు తిరిగిరావు

1775 దున్నగలిగితే మన్నుముట్టవలెను

1776 దున్నపోతుపై వర్షము కురిసినట్లు

1777 దున్నపోతు యీనిందంటే చెంబు తేరా పాలు పితుక్కుందాం అన్నట్లు

1178 దున్నపోతు యీనిందంటే తూడను కట్తివెయ మన్నట్లు

1779 దున్నబోతే దూడల్లో, మెయ్యబోతే ఆవుల్లో

1780 దున్నేరోజులలో దేశంమీదపోయి కోతరోజులలో కొడవలి పట్టుకొచ్చినట్లు

1781 దున్నేవాళ్ళకు వేళచూపినట్లు

1782 దున్నలా కష్టపడి దొరలా తినవలెను

1783 దున్నినపొలానకూ తాగిన గంజికి సరి

1784 దున్నేవాడు లెక్కచూస్తే నాగలికూడా మిగలదు 1785 దుబ్బుకాగెడు వెన్ను మూరెడు, దూసితే దోసెడు, వూదితే యేమీలేదు

1786 దుమ్ముపోసి అంబలి కాచినట్లు

1787 దురాశ దు;ఖముచేటు

1788 దుర్మార్గమునకు తండ్రి బద్ధకము

1789 దుష్టునికి దూరముగా వుండవలను

దూ

1790 దూడ కిడిచినట్లా దుత్తలలో పడ్డట్లా

1791 దూడకుడిస్తే గాని ఆవు చేపదు

1792 దూడచస్తే కమ్మలం (దూడ లేని పశువుపాలు) గేదెచస్తే నిమ్మళం

'1793 దూడపాలు దుత్తకాయె

1794 దూడలేని పాడి దు:ఖపుపాడి

1795 దూడ బర్రెవుండగా గుంజ అరజినట్లు

1796 దూబరతిండికి తూమెడు, మానవతికి మానెడు

1797 దూరపు కొండలు నునుపు

దె

1798 దెబ్బకు దెయ్యంసహా హడలుతుంది

దే

1799 దేవుడిచ్చునేగాని తినిపించునా

1800 దేవుడితోడు నామీద దయవుంచు