లోకోక్తి ముక్తావళి/సామెతలు-దా

1730 దయగల మొగుడు దండుకుపోతూ రోలుతీసి రొమ్మున వ్రేలవేసి పోయినట్లు

1731 దయతో దండాలుపెట్టితే పడవేసి బందాలు పెట్టినట్లు

1732 దయదగ్రుమంటే నెత్తి చుర్రుమంటుంది

1733 దయ్యపు కంటికి పేలగింజ వెంగెము

1734 దయ్యము కొట్టనూ బిడ్డ బ్రతకనూనా

1735 దయ్యాల ముండగ బిడ్డ బ్రతుకుతుందా

1736 దరిద్రుడు తల కడలోతే వడగండ్ల వాన వెంబడే వచ్చినదట

1737 దరిద్రుని సంగీతానికి భూమ్యాకాశాలే తాళపుచిప్పలు

1738 దయలేనత్తకు దండం పెట్టినా తప్పే

1739 దర్భామే కష్ కష్

1740 దశరానాలకూ తొటకూరకట్ట

1741 దశా దసా రావే అంటే దరిద్రాన్ని పిలు అన్నదట

దా

1742 దాగబోయిన చోట దయ్యాలు పట్టుకున్నట్లు

1743 దాన్యమైతే యివ్వలేను దండుగైతే పెట్టగలను

1744 దాయకట్టు యావు పొడవక మానునా

1745 దారినపొయ్యే వ్యాజ్యం కొనితెచ్చుకున్నట్లు

1746 దాసరిపాటకు ముష్టి ముదరా

1747 దాసరిపాట్లు పెరుమాళ్ళ కెరుక

1748 దాసరివా జంగమవా అంటే ముందరివూరుకొద్దీ అన్నట్లు 1749 దాసీకొడుకైనా కాసుగలవాడు రాజు

1750 దాస్తిని వేరుండు మొగుడా

ది

1751 దివిటీ క్రింద దీపము

1752 దివ్వె తీసిన గూడు

1753 దిసమొల వాడా కాళ్ళకట్టువానికి కప్పమన్నట్లు

1754 దిసెనెమొలవాది దగ్గ్తరికి దిగంబరుడు వచ్చి బట్ట అడిగి నట్లు

1755 దినము మంచిదని తెల్లవార్లు దొంగిలించినట్లు

1756 దిన దిన గండము వెయ్యేళ్ళు ఆయుస్సు

1757 దుక్కులేని దివాణం

1758దిక్కులేని యింట్లో దెయ్యాలు కాపురముంటాయి

1759 దిగులుపడితే వెతలుతీరునా

దీ

1760 దీపంపేరుచెప్పిన చీకటిపోవునా

1761 దీపంముడ్డిక్రింద చీకటి

1762 దీపంవుండగానే చక్కబెట్టుకో

1763 దీపముండగా నిప్పుకు దేవులాడనెల

1764 దీపాన వెలిగించినది దివిటీ

1765 దీపావళికి దీపమంత చలి

1766 దీపావళివర్షాలు ద్వీపాంతరం దాటును