లోకోక్తి ముక్తావళి/సామెతలు-తి
తి
1602 తింటేకదలలేను తినకపోతే మెదలలేను
1603 తింటేగాని రుచి చెలియదు దిగితేగాని లోతుతెలియదు
1604 తిండికెచేటు నేలకుబరువు
1605 తిండికితిమ్మరాజు పనికిపోతురాజు
1606 తిండికివచ్చినావా తీర్ధానికి వచ్చినావా
1607 తిట్టిచచ్చినవాడూలేడు దీవించి బ్రతికినవాడూలేడు
1608 తిట్టితేగాలికిపోతవి తింటే లోనికిపోతవి
1609 తిట్టుగాదురా తొత్తుకొడకా
1610 తినకపూర్వమురుచి దిగకపూర్వము లోతు తెలియవు
1611 తిట్తితేకోపం కొట్టితేనొప్పి
1612 తినమరగినకోది యిల్లెక్కికూసింది
1613 తినమరిగినప్రాణం అల్లాడిచచ్చింది
1614 తిన్నకుక్క తినపోతే కన్నకుక్కనుపట్టి కాళ్లువిరుగగొట్టినట్లు
1615 తిన్నయింటివాసాలు లెక్కించుతావేమిరా అంటే పొరుగింటికిపోతే వూరుకుంటానా అన్నాడట
1616 తిన్నయింటివాసాలెన్నేవాడు
1617 తిన్నయిల్లు గుద్దలిస్తావెమిరా అంటే తిననియిల్లు నేనేమేరుగుదును అన్నట్లు
1618 తిన్నవాడే మన్నవాడు మన్నవాడే మహారాజు
1619 తిమ్మన్నబంతికి తియ్యచారూ అన్నము
1620 తిట్టేనోరు తిరిగేకాలు వూరకకుండవు 1621 తిమ్మన్నబంతికి రమ్మంటారు గాబోలు
1622 తిమ్మన్నా తిమ్మన్నా నమస్కారంఅంటే నాపేరునీకేట్లు తెలిసినదంటే నీమొఖమే చెప్పుతుందన్నట్లు
1623 తిమ్మనిబ్రహ్మిని బ్రహ్కినితిమ్మి చేసేవాడు
1624 తియ్యగా తియ్యగా రాగము మూలగ్గా మూలగ్గా రోగం
1625 తియ్యనిరోగాలు కమ్మనిమందులు
1626 తిరగమరిగినకాలు తిట్టమరిగిననోరు వూరుకుండవు
1627 తిరిగితే వరిపొలం తిరగకపోతే అడవిపొలం
1628 తిరపతికిపోగానే తురక దాసరి యగునా
1629 తిప్పలాడీ మాఅప్పనునుచూచినావా, తీర్ధములో మాబావనుచూచినారా
1630 తిరిపెవు మజ్జిగకువచ్చి పాడిబఱ్ఱెను బేరమాడినట్లు
1631 తిరుపతి మంగలివాడి వత్తు
1632 తిలా:పాపహరాన్నిత్యం తలోపిడికెడు పిడికెడు
1633 తీగపట్టుకుంటే డొంక అంతా కదిలినట్లు
1634 తీట పట్టినవాడు గోకు కుంటాడు
1635 తిరిపమెత్తేవానికి పెరుగన్నముకు కరువా
1636 తిరునాళ్ళకా తిండికా
తు
1637 తుంటిమీద కొట్టితే నోటిపళ్లు రాలినవట
1638 తుడుం తుడుం అంటే దురాయు దురాయి అన్నట్లు
1639 తుడుము కాడినుంచి దేవతార్చనదాకా వొకటేమూట