లోకోక్తి ముక్తావళి/సామెతలు-జి

1422 జాతికొద్దిబుద్ధి కులముకొద్ది ఆచారము

1423 జనుములోపాముపోతే పాతికనష్టం

1422 జానెదు యింట్లో మూరెడు కర్ర

జి

1425 జీతగాణ్ణీ తెచ్చుకుంటే యింటికిమగడైనట్లు

1426 జిల్లేడుచెట్టుకునకు పారుజాతం పుట్తునా

1427 జీతములేనినౌకరు కోపంలేనిదొర

1428 జీతముభత్యములేకుండా తోడేలు మేకల కాస్తానన్నదట

1429 జీవన్మృతుడు మృతజీవుడు

1430 జెముడుకు కాయలున్నవా నీడవున్నదా

1431 జోగీజోగీరాచుకుంటే బూడిద రాలినట్లు

1432 జ్ఞాతిగుర్రు అరటికర్రు వదలదు

1433 జ్వరజిహ్వకు పంచదార చేదైనట్లు

1434 జొన్నపెరిగితే జాడు వరిపెతిగితేవడ్లు

135 జీవరత్నము యిత్తడిని పొదిగితే రత్నానికేమిలోపము

1436 జంగానికిబిడ్డలు పుట్టితే వూరికివుపాది

1437 డబ్బు పాపిష్టిది

1438 డబ్బు యివ్వనివాడు ముందు పడవెక్కినట్లు

1439 డబ్బులెనివాడు డుబ్బుకు కొరగాడు

1440 డబ్బులేనివానికి బోగముది తల్లివరస