లోకోక్తి ముక్తావళి/సామెతలు-చే

చే

1387 చేతనైనమగవాడు చాలాప్రొద్ధునలేచి మూడ్చుకొని చల్లుకొని మరియొక చోట పండుకున్నాడాట

1388 చేతిలో లేనిది చేనులో యెలాగువస్తుంది

1389 చేతులు కాలినవెనుక ఆకులుపట్టుకున్నట్లు

1390 చేతులుచేయవు నోరుతినదు

1391 చేదుతింటారా చెట్టుకొట్టుతారా

1392 చేనికియెరువు మడికిమండ

1393చేనికుదురు ఆలికుదురు వుండవలె

1394 చేనిపంట కొయ్యకాలే చెవుతుంది

1395 చేనిపంట చారెడైనా చాలు

1396 చెనిలోపుట్టినబీడు ఎక్కడికిపోదు

1397 చెప్పవచ్చునుగాని రొప్పరాదు

1398 చేనుకు ఘట్టు ఊరికి కట్టు వుండవలెను

1399 ఛెనుచేసి చెడలేదు చెడ్డాచేసి బ్రతకలేదు

1400 చేనులో చేనుకలసినా జాగాలో జాగాకలిసినా పోనివ్వరాదు

1401 చేను కొడవలి నీచేతి కిచ్చినాను

1402 చేయని శృంగారం మాయని మడత

1403 చేపపిల్ల కీత నేర్పవలెనా

1404 చేలోపత్తి చేలోవుండగానె పోలికి మూడు మాళ్లు నాకు ఆరుమాళ్లు అన్నట్లు 1405 చేసిన చేష్ట లెవరెరుగరుగాని కోసినముక్కు అందరూ చూచినారట

1406 చేసిన పాపము చెప్పితే తీరుతుంది

1407 చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవ

1408 చేసేది బీదకాపురం వచ్చేది రాచరోగాలు

1409 చేసేవి నాయకాలు, అడిగేవి తిరిపాలు, పెట్టకుంటె కోపాలు

1410 చేసేవి శివపూజలు దూరేవి దొమ్మరిగుడిసెలు

1411 చిద్రమునకు చీడపేలు దరిద్రమునకు తలపేలు

1412 జంగానికి బిడ్డలు పుట్టితే వూరికి వుపాధి

1413 చెట్టైవంగనిది మ్రానై వంగునా?

1414 చెడ్డ కాపరానికి ముప్పేమిటి చంద్రకాంతాలు వండేపెండ్లామాఅంటే, ఐన అప్పకి అంతమేమిటి అవేవండుతానురా మగడా అన్నదిట

1415 చెట్టు వేసినవాడు నీళ్ళు పొయ్యడా?

1416 చుక్కలూళ్లో చక్కిలాలు తేబోయునాడు

1418 జగమెరిగిన బ్రాహ్మణునకు జంద్యమేల

1419 జడ్డిగములో మిడతపోటు

1420 జయింపుండేవరకు భయంలేదు

1421 జరిగేమటుకు జయభేరి జరక్కపోతే రణభేరి