లోకోక్తి ముక్తావళి/సామెతలు-గా

గా

1108 గాండ్లవాని ఆశ గోతమైనా పట్టదు

1109 గాజులగుదికి రోకలి పూసినట్లు

1110 గాజుపూసల గనిలో ఘనమైన మణి దొరకునా

1111 గాజులబేరం భోజనాలకు సరి

1112 గాడిద గంపెడు వూక తిన్నది అన్నట్లు

1113 గాడిద గత్తర

1114 గాడిద గాడిదే గుర్రము గుర్రమే

1115 గాడిద పుండుకు బూడిద మందు

1116 గాడిద పిల్ల కోమలము

1117 గాడుపుకు గడ్డపార కొట్టుకుపోతే ఉల్లిగడ్డపొర నాగతేమి అన్నదట

1118 గాదె కింద యెలుక గాదె క్రిందనే బ్రతుకవలెను

1119 గాదెనిండా బియ్యంవుంటే కరువు కాలాన నా భార్యాను పిల్లలను రక్షిస్తానన్నట్లు

1120 గానుగరోట్లో చెయ్యిపెట్టి పెరుమాళ్లు నీకృప అన్నట్లు

1121 గానుగాపె గానుగాపె నీవు గూర్చున్న పనేగదా నూనె పొయ్యడం

1122 గాము సోకినట్లు

1123 గారాబం గారెలు కేదిస్తే వీపు దెబ్బల కేడ్చినట్లు

1124 గారాబాల బిడ్డ పుట్టితే గడ్డపారతో చెవులు కుట్టినట్లు

1125 గాలికి పుట్టి ధూళికి పెరిగి నట్లు

1126 గాలికి పోయిన పేలపిండి భగవంతుని కర్పణము 1127 గాలిలో దీపం పెట్టి దేవుడా నీమహిమ చూపు అన్నట్లు

1128 గాలివచ్చి నప్పుడుగదా తూర్పార పట్టవలెను

1129 గాలీవాన వస్తే కధే మానుతుంది

గి

1130 గింజలు ముత్తుము పిట్టలు పన్నిద్ధుము

గు

1131 గుండెలు తీసిన బంటు

1132 గుండ్రాయి దాస్తే కూతురు పెళ్లి ఆగుతుందా

1133 గుండ్లుతేలి చెండ్లు మునిగినట్లు

`1134 గుడినుండి గుళ్ళోరాళ్ళు తీసినట్లు

1135 గుడిపాము కరచినట్లు గంగిగొవు పొడిచినట్లు

1136 గుడి మింగేవానికి గుళ్లోలింగమెంత?

1137 గుడిమిం గేవానికి గుళ్లోలింగము వట్రవడియము

1138 గుడి మింగేవానికి దలుపు లప్పడములు

1139 గుడిలో గంటపోతే నంబి శఠమైనా వూడదు

1140 గుడివచ్చి మీద పడ్డట్టు

1141 గుడ్డికన్నా మెల్ల మేలు

1142 గుడ్దికన్ను తెరచినా ఒకటే మూసినాఒకటే

1143 గుడ్దిగుర్రాలకు పండ్లు తోముచున్నాడు

1144 గుడ్దినక్క పూరిన పడ్డట్టు