లోకోక్తి ముక్తావళి/సామెతలు-కి
899 కాలుజరితే తీసుకోవచ్చునుగాని నోరు జరితే తీసుకోరాదు
900 కాలుజారి నేలపడి భూమి అచ్చివచ్చినది కాదన్నట్లు
901 కాలుపట్టుకొని లాగితే చూరుపట్తుకొని వ్రేలాడినట్లు
902 కాలువంగినదాని గంగానమ్మ అయినా పట్టదు
903 కాలువిరిగినయెద్దు గట్టెక్కితే కొమ్మువిరిగిన యెద్దెక్కడ
904 కాలేకడుపు మండేగంజి
905 కాళ్ళను చుట్టుకున్నపాము కరవక మానునా!
906 కాళ్ళు కడుక్కోండవయ్యా అని చాపచేసినట్లు
907 కావడి యెన్నివంకలు తిరిగినా యిల్లు జేరితేసరి
908 కాశికి పోగానే కర్రికుక్క గంగిగోవవునా
909 కాశికిపోయి కుక్కబొచ్చు తెచ్చినట్లు
910 కాశికిపోయి గొంగరెక్క తెచ్చినట్లు
911 కాశికిపోయి గాడిద గుడ్డు తెచ్చినట్లు
912 కాశికి పోయినవాడు, కాటికిపోయినవాడు సమము
913 కాశికి పోవడము ఒకటి కావడి తేవడము ఒకటి
914 కాసుకు గతిలేదు కోటికి కొడియెత్తినాడట
916 కాసు గొడ్దుకు రూకబందె
కి
917 కిం అంటే కం అనలేడు
918 కిమాలస్యం? ఆలస్య, అరసస్య, వుంగస్య, వుళియస్య, వేపస్య