లీలావతీగణితము
శ్రీరస్తు —శ్రీరామచంద్రాయనమః
శ్రీ భాస్కరాచార్య విరచిత మగు
వాసనాభాష్య సహిత
లీలావతీ గణితము
నకు
పిడపర్తి కృష్ణమూర్తిశాస్త్రి
ప్రణీతమగు
ఆంధ్రవ్యాఖ్యానము
ప్రతిపద టీకా, తాత్పర్య, ఉదాహరణ, ఉపపత్తి,
ప్రశ్న, విశేషాది బహువిషయములతో గూడియున్నది.
మొదటి కూర్పు 1200
శ్రీ విద్యాముద్రాక్షరశాలయందు ముద్రితము
విజయనగరం సిటీ
1936
సర్వస్వామ్య సంకలితము]
[దీనివెల 4-0-0
ఈ గ్రంథము గోదావరీమండలమునందు వాసిష్ఠాగౌతమీమధ్యభాగమున గోపాలపుర సంస్థానములో చేరిన, పొడగట్లపల్లి జానకీపురాగ్రహారము నివాసముగాగల, పిడపర్తి చినపూర్ణయ్య సిద్ధాంతిగారి, తృతీయపుత్రుడు కృష్ణమూర్తిశాస్త్రిచే రచించి ప్రకటింపబడినది. మఱియు జ్యోతిశ్శాస్త్రమునకు సంబంధించిన గణిత, సిద్ధాంత, జాతక, ముహూర్త, వాస్తు సంహితాది భాగములందును ఉద్గ్రంథములు గ్రంథమాలగా ప్రకటింపబడగలవు.
వలయు వారు :—
దైవజ్ఞభూషణ పిడపర్తి కృష్ణమూర్తిశాస్త్రి,
పొడగట్లపల్లి,
గోపాలపురం సబ్ పోష్టు : తూర్పు గోదావరిజిల్లా.
OPINIONS.
Lilavati, an anclent mathematical treatise composed by Bhaskaracharya, is a work of undying interest and inspiration to all our present day Hindu mathematicians. The position which Bhaskara oocupies in the galaxy of our ancient mathematicians and astronomers is unique.
A study of old Indian mathematical books is not merely of historical interest to us. Translation of these books into our mother tongue provides us with a very useful instrument in the vernacularisation of studies in our schools and colleges. The extent of mathematical knowledge which this book displays, covers S.S.L.C. and Intermediate syllabuses and a part of the B.A., syllabus.
Mr. Krishnamurty Sastri, besides possessing an extensive and deep knowledge of the ancient mathematical and astronomical treatises, reveals a firm grip on modern mathematical books. His clear exposition and explanations make the book easily intelligible to all.
I hope that teachers and students of mathematics in our Andhra Country will read this book with profit and encourage the author to make this the beginning of a series of such books.
Vizianagram,
(Sd.) SONTI PURUSHOTHAM,
CHIEF LECTURER IN MATHEMATICS.
D. 2-1-36
MAHARAJAH'S COLLEGE.
పి. ఎల్. నరసింహము, బి.ఏ., బి.ఎల్.
విశాఖపట్నం,
అడ్వకేటు.
శ్రీ
తే 28 డింశబరు 1935
మాతృభాషాభివృద్ధికి సాధనములుగ ప్రాచీన సంస్కృతగ్రంథములు, వివిధశాస్త్రములకు సంబంధించినవి, పరివర్తింపబడుట మిక్కిలి యవసరమని పలువిధముల చిరకాలమునుండి యుపన్యసించుచుంటిని. శాస్త్రీయ పారిభాషిక శబ్దనిఘంటువు లేమిని, కొలది పరివర్తన ప్రయత్నములును, పలుతెఱగుల బట్టి సుబోధములు కాక యున్నవి.
నామిత్రులు బ్ర. పిడపర్తి కృష్ణమూర్తిశాస్త్రిగారు గణితశాస్త్రమునం దిట్టి కొఱంతను బాపదలచి సుప్రసిద్ధలీలావతీగణితము నాంధ్రీకరించియుండిరి. జ్యోతిశ్శాస్త్రమందు వారిప్రజ్ఞ యాంధ్రలోకమునకె కాక యితకులకును దెలిసిన విషయమే. గణితశాస్త్రమునందు లేశమాత్రము ప్రవేశములేనివారికి గూడ నతిసులభముగ బోధపడునట్లు వారు రచించిన వ్యాఖ్య వర్ణనాతీతము. ఆంగ్లభాషాభ్యాసవశమున నాభాషాసాంప్రదాయముల ననుసరించిగాని యవగాహన చేసికొన జాలని యాధునిక యువజనులకు గూడ నాశ్చర్యజనకమగు రీతిని క్లిష్టవిషయములను కరతలామలకముల గావించిరి.
దీనివలన ప్రాచీనవిద్యాగౌరవోన్నతులు గోచరింపక తప్పవు. గణితశాస్త్రమునందు ముఖ్యముగ బీజగణిత రేఖాగణితములందును ఖగోళశాస్త్రమునందును పూర్వులు సల్సిన కృషి యత్యద్భుతమై పాశ్చాత్యవిజ్ఞానమున కేమాత్రము దీసిపోవునది కాదని తెలిసికొనదగినట్లు బోధింపగల శ్రీ కృష్ణమూర్తిశాస్త్రిగారి బోధనశక్తియు నపారమే. ఇంకను జ్యోతిశ్శాస్త్రగ్రంథముల నాంధ్రమున పరివర్తనముచేసి దేశోపకారము కావించునటుల నాంధ్రులు వారికి ప్రోత్సాహము కలిగింపవలసినవిధి యై యున్నది. ఇట్టి యుత్తమగ్రంథము లింకను వివిధశాస్త్రముల వెలువడినయెడల భాషాదారిద్ర్యము తొలగి మాతృభాషయందే యుత్తమవిద్య గఱపుటకు విశ్వవిద్యాలయములకు సాధ్యమగును. ఆ మూలమున దేశోన్నతియు, భాషాసేవయు, విద్యార్ధిజనమునకు కేవల మనుకరణపద్ధతులే కాక మౌలికపరిశోధనశక్తియు వికాసమును లభ్యము లగును. భారతీయులకు స్వతంత్రవిజ్ఞానశక్తి కొలదిమాత్ర మను నపవాదయు నశించును. విజ్ఞానసంపద పెంపు వహించును. కళాశాలలయం దిట్టి యుత్తమగ్రంథములు పఠనీయములుగ చేయదగును.
(Sd.) ప్రభల లక్ష్మీనరసింహము,
అడ్వకేటు.
శ్రీ
ఈగ్రంథము
శ్రీమన్మహారాజ రాజశ్రీ శ్రీ మద్రాజాధిరాజ
శ్రీమదుత్కలరాష్ట్రాంతర్గత జయపుర మండలాధీశ్వరులును
సాహిత్య సమ్రాట్, డి. లిట్ ఇత్యాదిపదభూషితులును
సంస్కృతాంధోత్కలాది భాషాకవిత్వదురంధరులును
జ్యోతిషాలంకారాది బహుశాస్త్రపారంగతులు నగు
మహారాజా శ్రీ శ్రీ శ్రీ విక్రమదేవవర్మ ప్రభువర్యులకు
సమర్పింపబడినది.
కృతిపతులు
శ్రీ మన్మహారాజ రాజశ్రీ శ్రీమద్రాజాధిరాజ శ్రీమజ్జయపుర
సంస్థానాధీశ్వర సాహిత్య సమ్రాట్, డి. లిట్
శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ విక్రమదేవ వర్మ మహారాజావారు
శ్రీరస్తు
కృతి సమర్పణము
1 | శ్రీమాన్జయపురరా ష్ట్రాధీశ శ్రీకృష్ణ చంద్ర దేవ విభోః। | |
2 | అనేకభాషాకవితావిశారద | |
3 | ధర్మాత్మజో ధర్మవివేచనే, నయే | |
4 | ప్రభో రయుక్తం త్విదమేవ మన్యే | |
5 | సర్వాశా వల యావకాశ విమలో ద్వేల్ల ద్యశో భాసుర | |
6 | నేతా కృతే ర్మే నృపపుంగ వోసా | |
శ్రీ శ్రీ శ్రీ