లాలనుచు నూచేరు (రాగం: ) (తాళం : )

ప|| లాలనుచు నూచేరు లలనలిరుగడల |
బాలగండవీర గోపాలబాల || -- (నీలాంబరి)

చ|| ఉదుట గుబ్బల సరసము లుయ్యాల లూగ |
పదరి కంకణరవము బహుగతులమ్రోగ |
వొదిగి చెంపల కొప్పు లొక్కింత వీగ |
ముదురు చెమటల నళికములు తొప్పదోగ || -- (మోహన)

చ|| సొలపు తెలిగన్నుగవ చూపులిరువంక |
మలయు రవళులకు బహుమారును బెళంక |
కొలది కోవిగములు క్రోలుమదనాంక- |
ములగ్రేణిసేయు రవములు వడిదలంక || -- (హుస్సేని)

చ|| సరుస పదములు జంగ చాపుచే బాయ |
గురులీల మీగళ్ళ గుచ్చెళ్ళరాయ |
కరమూలముల కాంతి కడుజాయజేయు |
సరస నురుకుసుమ వాసన లెదురుడాయ || -- (సారంగ)

చ|| కొలది నునుమేనుల కూనలసి యాడ |
మెలకువతో నొకరొకరి మెచ్చి సరిగూడ |
తలలూచి చొక్కి చిత్తరు బొమ్మలాడ |
అలరి యెల్లరు మోహనా కృతులు చూడ || -- (కాపీ)

చ|| లలిత తాంబూల రసకలితంబులైన |
తళుకు దంతములు కెంపుల గుంపులీన |
మొలక వెన్నెల డాలు ముసురు కొనితోన |
చెలగి సెలవుల ముద్దు చిరునవ్వులాన || -- (లలిత)

చ|| మలయ మారుత గతులు మాటికి జెలంగ |
పలుకు గపురపు తావి పైపై మెలంగ |
పలుగాన లహరి యింపుల రాల్గరగంగా |
బలసి వినువారి చెవి బడలిక దొలంగ || -- (మధ్యమావతి)

చ|| లలనా జనాపాంగ రలిత సుమచాప |
జలజలోచన దేవ సద్గుణ కలాప |
తలపు లోపల మెలగు తత్త్వప్రదీప |
భళిర గండపరేశ పరమాత్మరూప || -- (సురటి)


lAlanucu nUcEru (Raagam: ) (Taalam: )

pa|| lAlanucu nUcEru lalanalirugaDala |
bAlagaMDavIra gOpAlabAla || -- (nIlAMbari)

ca|| uduTa gubbala sarasamu luyyAla lUga |
padari kaMkaNaravamu bahugatulamrOga |
vodigi ceMpala koppu lokkiMta vIga |
muduru cemaTala naLikamulu toppadOga || -- (mOhana)

ca|| solapu teligannugava cUpuliruvaMka |
malayu ravaLulaku bahumArunu beLaMka |
koladi kOvigamulu krOlumadanAMka- |
mulagrENisEyu ravamulu vaDidalaMka || -- (hussEni)

ca|| sarusa padamulu jaMga cApucE bAya |
gurulIla mIgaLLa gucceLLarAya |
karamUlamula kAMti kaDujAyajEyu |
sarasa nurukusuma vAsana leduruDAya || -- (sAraMga)

ca|| koladi nunumEnula kUnalasi yADa |
melakuvatO nokarokari mecci sarigUDa |
talalUci cokki cittaru bommalADa |
alari yellaru mOhanA kRutulu cUDa || -- (kApI)

ca|| lalita tAMbUla rasakalitaMbulaina |
taLuku daMtamulu keMpula guMpulIna |
molaka vennela DAlu musuru konitOna |
celagi selavula muddu cirunavvulAna || -- (lalita)

ca|| malaya mAruta gatulu mATiki jelaMga |
paluku gapurapu tAvi paipai melaMga |
palugAna lahari yiMpula rAlgaragaMgA |
balasi vinuvAri cevi baDalika dolaMga || -- (madhyamAvati)

ca|| lalanA janApAMga ralita sumacApa |
jalajalOcana dEva sadguNa kalApa |
talapu lOpala melagu tattvapradIpa |
BaLira gaMDaparESa paramAtmarUpa || -- (suraTi)


బయటి లింకులు

మార్చు

LaalanuchuNoocheru





అన్నమయ్య పాటలు  
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |