లంకావిజయము/ప్రథమాశ్వాసము
లంకావిజయము
ప్రథమాశ్వాసము
కథాప్రారంభము
ఆ. | అమరు సకలలోకసమితి కు య్యేరీతి | 1 |
| [ఈ పద్యము మొదలు రెండర్థములు వచ్చునట్లు చెప్పుచున్నాడు. నియమప్రకారము మొదటియర్థమున రామకథయును, రెండవయర్థమున లంకమాన్యమును ధర్మరావు హరించుట మొదఁగు లక్ష్మణకవిపక్షమైన యర్థమును దోఁచుచుండును.] | |
రాఘవ. | సకలలోకసమితికుయ్యి = సకలజనసముదాయముయొక్క మొఱ్ఱ, ని. “లోకస్తుభువనేజనే" అని యమరము. ఏరీతిన్ = ఏప్రకారముచేతను, రహితముగను = లేనట్లుగా, ఇక్కడఁ గుయ్యిశబ్దములోని యికారమునకు “కిమాదికస్యేతః" అను నాంధ్రశబ్దచింతామణి సూత్రముచేత లోపము. సిరికి = లక్ష్మికి, ఇరవును = స్థానమును, విబుధవిలసితంబును = పండితులచేఁ బ్రకాశింపఁజేయఁబడినదియు, అగుచు=దిప్పుచు, విపులంబు=విశాలమైన, అయోధ్యయను = అయోధ్యయను పేరుగల, (ఇచ్చట, అనుశబ్దములోని అకారమునకు, అం. శ. చిం. “యశ్రుతిమార్యా లఘుయం ప్రవదంతి" యను సూత్రమువలన యకారము.) నగరము = పట్టణము , సురపురిని = అమరావతిని, అనుకరించి = పోలినదియై, ఆమరున్ = వెలయును. | |
తా. | జనులకు సౌఖ్యకరమయినది, సంపదలచే నొప్పునట్టిది, విబుధులు గలిగి స్వర్గముం బోలినది యయోధ్యయను పట్టణ ముండెను. | |
లక్ష్మణ. | సకలలోకసమితి - సకల = విద్యలతోఁ గూడుకొనిన, లోక = జనమునకు, సమితి = సభాస్థాన మైన, “సంఘే సభాయాం సమితిః" అని యమరము. కుయ్యేరు=కుయ్యేరను గ్రామము, ఈతిరహితముగను = ఈతిబాధలు లేరీతిని, “అతివృష్టి రనావృష్టి ర్మూషికా శ్శలభా శ్శుకాః, అత్యాసన్నాశ్చరాజానః షడేతే ఈతిబాధయః" సిరికి = సంపత్తికి, లక్ష్మికి, ఇరవును = నివాసస్థానమును, విబుధవిలసితంబును = పండితులచేఁ బ్రకాశింపఁజేయబడినదియు (విబుధశబ్దమున దేవతలనియైన జెప్పవచ్చును), అగుచు, విపులన్ = భూమియందు “విపులాగహ్వరీ ధాత్రీ” యని యమరము. విపుల శబ్దములోని దీర్ఘ మునకు, ఆం. శ. చిం. “దీర్ఘాణాం హ్రస్వస్యాత్” అను సూత్రముచే హ్రస్వ మైన - ప్రథమమీఁది - ఆం. శ. చిం. “కూర్చిలను నయో భవేద్ద్వితయ్యాతు” అనుసూత్రముచే సుకారము రాఁగా ఆం. శ. చిం. "బిందుం ప్రవదంతి తం క్వచిత్కేచిత్” అను సూత్రముచే బిందువు రాఁగా, “ఇతరత్రచద్వితీయా" అనుసూత్రముచే సప్తమ్యర్థము వచ్చినవి.) పయోధ్యయను - పయోధి = సముద్రము, ఆయను = స్థానముగాఁ గల విష్ణువుయొక్క, పా “ఇకోయణచి" యనుసూత్రము ఇచ్చట “పరుషాద్ద్రుతప్రకృతికా త్సరళాస్యుః"అను ఆం.శ.చిం. సూత్రముచేఁ బత్వము వచ్చినది. పయోధ్యయను, అను ద్వితీయకు “షష్ఠీభవేద్ద్వితీయాతుల్యా” అనుసూత్రమువలన షష్ఠ్యర్థము వచ్చినది. నగరము = వైకుంఠము (పయోధ్యయను నగరము = వైకుంఠము), “నిరమో మహతాం లుక్చస్యాత్"అను సూత్రముచే నుకారలోపము, సురపురినిః = స్వర్గపట్టణమును, అనుకరించి = పోలి, అమరు = ప్రసిద్ధమగును. | |
తా. | పండితులు గలిగినది, ఈతిబాధలు లేనిది, సిరిసంపదలు గలది, వైకుంఠమును స్వర్గమును మించినది కుయ్యే రను గ్రామము గలదు. | |
ఆ. | తత్పురమున నియతి దశరథకుంభినీ | 2 |
రాఘవ. | తత్పురమున = ఆయయోధ్యాపట్టణమున, నియతి = నియమమున, దశరథకుంభినీపతి = దశరథహారాజు, భటాశ్వముఖ్యబలచయాప్తిఁ దగు మహిపతిసమితిన్ = చతురంగబలయుతరాజసముదాయమునందు, తనపేరు వెలయన్ = తనపేరు ప్రసిద్ధి కెక్కునట్లు, గోపాలమంత్రి బుద్ధిపటిమన్ - గోపాల = ఇంద్రునియొక్క, మంత్రి = బృహస్పతియుక్క, బుద్ధిపటిమన్ = బుద్ధిపటిమవంటి బుద్దిపటిమచేతను, “స్వర్గేషు పశు వాగ్వఙ్రిదిఙ్నీత్రఘృణిభూజలే, లక్ష్యద్రుష్ట్యోస్త్రియాం పుంసి గౌః" అని యమరము. అమరును. | |
తా. | ఆపట్టణములో దశరథుఁడను రాజు గలడు. బుద్ధికి బృహస్పతివంటివాడు. చతురంగబలము కలవాడు. | |
లక్ష్మణ. | తత్పురమున = ఆ కుయ్యేటియందు, నియతిదశ = నియమావస్థచే, రథకుంభినీపతిభటాశ్వముఖ్యబలచయాప్తిన్ = రథములు, , పురుషగజములు (మగయేనుఁగులు), భటులు, ఆశ్వములు మొదలగు బలసముదాయముచేతను, తగు ఒప్పునట్టి మహిపతి = మహిపతిరావుయొక్క, సమితిన్ = సభయందు, తనపేరు వెలయ, గోపాలమంత్రి = గోపాలుఁడను నియోగి, బుద్ధిపటిమన్ = అతిశయ మైన బుద్ధిగలిగి, అమరున్ | |
తా. | కుయ్యేరను గ్రామము, మహిపతిరా వనునధికారిసభలో గోపాలమంత్రి యను బ్రాహ్మణుఁడు గలఁడు. | |
క. | ఎన్న మహాభోగరమా | 3 |
| కుండు - దేవలోకపటుచేతోహర్ష = దేవతల సంతోషమును, దా = ఖండించునట్టి, అహీన- (ఆహి+ఇన) అహి = క్షుద్ర శత్రువులలో, ఇన + ప్రభువు లగు తమిధ్వజాది రాక్షసులను, దాన = కొట్టివేయుటయందు, నిరూఢ = తప్పిపోవని, ఉజ్జ్వల = వాఁడిగల, పత్రికుండు = బాణములు గలవాఁడు, అతఁడు = ఆదశరథుఁడు, సన్మాన్యుండు గాక, యల్పుఁడా! కాడనుట. “అహిర్వృత్రే క్షుద్రశత్రౌ" అనియు, “ఇనస్సూర్యే ప్రథౌ" అనియు నమరము. | |
తా. | ఆదశరథుఁడు పూర్వము తన సూర్యవంశస్థు లైనరాజులందఱికంటె మంచివాఁడను పేరును సంపాదించినాఁడు. శిష్టరక్షణమునందు నిపుణుఁడు. | |
లక్ష్మణ. | తన భాస్వత్కులమందు = తన ప్రకాశించెడు వంశమందు, ఆద్యు లగు= ఆద్యులైన, మేధాశాలిసద్రాజులందునను - మేధా = బుద్ధిచే, శాలి = ప్రకాశించినవారు అయిన, సద్రాజులందునను = (సత్ + రాజు = సజ్జనసముదాయము) సత్పురుషపంక్తులయందు, రాజన్ శబ్దమురకు “ఊద్బహుత్వే" యనుసూత్రముచే నుత్వము. ప్రబలుం డితం డని, ఇనుల్, స్తోత్రంబు సేయంగ, నెందు, నెసంగున్, మహిదేవ ... పత్త్రికుండు - మహిదేవలోక = బ్రాహ్మణనముదాయమునకు, పటుచేతోహర్షదా = సమర్థమైన మనస్సంతోషమును గావించెను, అహీన = తక్కువ కాని, దాన = దానములయందు, నిరూఢ = రూఢము చేయు, ఉజ్జ్వల = స్పష్టమయిన, పత్త్రికుడు = దానపత్రములు గలవాఁడు, అతఁడు = ఆమంత్రి, సన్మాన్యుండు గాక, యల్పుఁడే! | |
తా. | ఆగోపాలమంత్రి తనపూర్వులకంటె బుద్దిమంతుఁ డను పేరు | |
ఆ. | సరభసముగఁ బూని పరులజీవనములు | 5 |
రాఘవ. | అతఁడు, ఉదయించినది మొదల్గాఁగన్ = పుట్టినది మొదలుకొని, సరభసముగ = వేగముతో, పూని = పట్టుపట్టి, పరులజీవనములు = శత్రు. | |
| ప్రాణములను, పిండి = పిండివైచి, ప్రోలివారిన్ = పురవాసులను, నిండువేడ్క, నొందఁ జేసెన్ = మిక్కిలి యానందింపఁ జేసెను. అతని, నెన్నఁగా, వశంబె! | |
తా. | శత్రువులను సంహరించి జనులను సంతోషపెట్టుటకే యాతఁడు పుట్టినది మొదలు యత్నించెను. | |
లక్ష్మణ. | సరభసముగ = సంతోషముతో, పూని, పరులజీవనములు = అన్యులజీవనములను, పిండిప్రోలివారిన్, నిండువేడ్కన్, ఒందఁ జేసెను, (పుట్టినది మొదలు చేసికొని) అతని, నెన్నఁగా, వశంబె, పొగడఁ దరము కాదని భావము. | |
తా. | గోపాలమంత్రి పుట్టినది మొదలు, పిండిప్రోలివారిని యితరులను సంతోష పెట్టెను. | |
క. | గణుతింతు రెపుడు నాతని | 6 |
రాఘవ. | కోవిదులు = విద్వాంసులు, సుధీగణకవితతులందునన్ = విద్వత్కవిసముదాయము నందును, ఉల్బణతంగనువిద్యలన్ = అతిశయించిన విద్యలయందు, పలంతియగుటన్ = సమర్థుఁ డగుటను, అతనిగుణములు = ఆదశరథునిగుణములు, సత్కృతులలోను = రామాయణాది సత్కావ్యములలో, ఎపుడు =ఎల్లకాలమును, గణుతింతురు= ఎన్నుదురు. | |
తా. | దశరథుఁడు విద్యావంతుఁ డని యాతని గుణములను రామాయణాది గ్రంథములలోఁ బొగడుచుండిరి. | |
లక్ష్మణ. | కోవిదులు, సుధీ . . . అందు - సుధీ = మంచిబుద్ధిగల, గణకవితతులందు = కరణముల సముదాయమును, సత్కృతులలోను = యోగ్యులగు నేర్పరులలోను (సత్ + కృతులు), “సత్యే సాధౌవిద్యమానే ప్రశస్తేభ్యర్హితే చసత్.” అని యమరము, అతనిగుణములు = ఆగోపమంత్రిగుణములు, ఎపుడును, గణుతింతురు. ఏల? ఉల్బణతంగనువిద్యలన్, వలంతి, యగుటచేతన్. | |
తా. | బుద్ధిమంతు లగుకరణములలో, యోగ్యజనులలో నధికుఁడని యాగోపాలమంత్రిగుణములను గొనియాడుచుందురు. | |
భుజంగప్రయాతము. | హరించెం దగన్ దుర్జనాత్మానురక్తిన్ | 7 |
తా. | దుర్మతుల యతిశయమును హరించెను. విష్ణుభక్తిని భరించెను. జనులందఱుఁ దన్నుఁ బొగడునట్టియుపాయమును గలిగియుండిను. మంత్రతంత్రములయొక్క శక్తిని ధరించెను. | |
గీ. | అతఁడు రాజమందారాచ్ఛవితతకీర్తి | 8 |
రాఘవ. | రాజమందారాచ్ఛవితతకీర్తి - రాజ = చంద్రునివలె, మందార = కల్పవృక్షమురీతి, అచ్ఛ = స్వచ్ఛమైన, వితత = విస్తారమైన, కీర్తి = యశస్సుగలవాఁడు, వంశశుక్తిముక్తామణి = కులమనుముత్తెపుచిప్పకుమణియు(నైన), అతఁడు = ఆదశరథుడు, కాళికాసమానవేణిళలన్ = మేఘపఙ్క్తితో సమానమైనజడలుగలవారిని, శోభఁగ్రాలువారిన్ = సౌందర్యముచే బ్రకాశించువారిని, ముగురన్ = ముగ్గురుకన్నెలను, వరుసన్ = క్రమముగా, సమ్మదం బొప్పన్, పెండ్లియాడె. “మేఘజాలేపి కాళికా" యని యమరము. | |
తా. | ఆదశరథుఁడు యశస్సు, సత్కులము, సౌందర్యము గల ముగ్గురు కన్యలను బెండ్లియాడెను. | |
లక్ష్మణ. | అతఁడు =గోపాలుఁడు, రాజమన్ = రాజమ్మయనెడు, తారాచ్ఛ = నక్షత్రములవలె స్వచ్ఛమైన (ముత్యాలవలె నని యైన) దానిని, వితతకీర్తి | |
| వంశశుక్తిన్ - వితత = ప్రసిద్ధమైన, కీర్తి = కీర్తియను నింటిపేరుగల, వంశ = కులమనెడు, శుక్తి = ము తైపుఁజిప్పను, ముక్తామణివరుసన్ = ముత్తెముభంగిని, శోభఁగ్రాలు = శోభ యతిశయించిన, వారిము . .. వేణికన్ - వారిముక్ = మేమములయొక్కయు, ఉరగ = సర్పములయొక్కయు, ఆళికా = పఙ్క్తితో, సమాన = సమానమైన, వేణిక = జడగల దానిని, సమదం బొప్పఁ బెండ్లియాడెన్ = సంతోషపూర్వకముగ వివాహము చేసికొనియెను. | |
తా. | గోపాలమంత్రి కీర్తియనునింటిపేరుగలవారి వంశమాణిక్యమయిన రాజమ్మయను సుందరాంగిని వివాహము చేసికొనియెను. | |
వ. | మఱియు. | 9 |
| అర్థము రెంటికి సమానము. | |
సీ. | సరసరామాజనవరకోసలేశజ, | |
గీ. | ననఘుఁ డతఁ డజసంతతిఘనుఁడు ధైర్య | 10 |
రాఘవ. | సరస . . . లేశజ - సరస = రసికురాండ్రయిన, రామాజన = స్త్రీలలో, వర = శ్రేష్ఠురాలవైన, కోసలేశజ = కోసలరాజపుత్త్రీ! ఆత్మహర్ష ముగ = మన | |
| స్సున నంతోషముగ, మాటాడుము = పల్కుము, అనును = గోరును. కై క = కేకయరాజపుత్త్రీ! రమ్మా = ఇందురమ్ము, ననున్, కదియించి = కౌఁగిలించి, మదిన్, ఆత్మభూలీలన్ = మన్మథలీలయందు, ప్రోవుము = రక్షింపుము. అంచున్, ఓలి = వరుసఁ గా, పల్కున్ = అనును. స్తోత్రార్హభావ = స్తుతింపఁదగినభావముగల, సుమిత్రాబ్జనయన = సుమిత్రయను సుందరీ, నన్ను, ఆదరించుము. అటంచున్, ఆశ్రయించు = చేరును. అట్లు, రహస్యంబునందు, ఆత్మదేవులన్ = తన భార్యలను, ఇష్టార్థసిద్ధికై = కోరికఁ దీరుటకై , ఎపుడున్, వేఁడున్, అనఘుఁడు = పాపరహితుఁడు, అతఁడు' (దశరధుడు), అజసంతతి = అజమహారాజు కొడుకు, ఘనుఁడు = గొప్పవాఁడు, ధైర్యమునను, గాంభీర్యమున, నీతిన్, భూతిన్ = ఐశ్వర్యమున, కీర్తిన్, మూర్తిన్ = ఆకారమున, మానమునను = పౌరుషమున, దానమున, ద్యుతిన్ = కాంతిచే, మతిన్ = బుద్ధిని, శాంతిన్ = కామక్రోధాదిరాహిత్యమున, దాంతిన్ = తపఃక్లేశాదులనోర్చుటయందు, అరయన్ = వెదుకు, ఎందున్ = ఏతావునను, సవతు లేక = ఈడు లేనివాఁడుగానుండి (నక్ష్మమాణపదముతో నశ్వయము). | |
తా. | దశరథుడు కౌసల్యా నాతో సంతోషముగ మాటాడుము. కైకా నన్ను గదియుము. సుమిత్రా నన్నాదరించు మని రహస్యమున భార్యలను వేఁడును. ధైర్యగాంభీర్యదానాదుల నతని కొరులు సమానులు లేరు. | |
లక్ష్మణ. | సరస = సరసుఁడా! రామా! జనవర = రాజా! కోసలేశ! జయాత్మ = జయస్వభావముగలవాఁడా! ఆత్మహర్షముగ మాటాడుము అనును. కై = చేయి, కరమ్ము = చేయిని, ఆనను = అనునట్లు, కదియించి = కూర్చి, మదిని, ఆత్మభూ = బ్రహ్మదేవుఁడా! లీలఁ బ్రోవుము = విలాసముగా రక్షింపుము. అంచు, ఓలిన్, పల్కున్ = కొనియాడుననుట. స్తోత్రార్హభా = స్తుతించుట కర్హమైన కాంతిగల, వసుమిత్రాబ్జనయన = అగ్నియు, సూర్యుడు, చంద్రుఁడును నేత్రములు గలవాఁడా! న న్నాదరించు మటంచున్, ఆశ్రయించున్ = శివుని భజించును. (వసు = అగ్ని, మిత్ర = సూర్యుఁడు,అబ్జ = చంద్రుఁడు) "దేవభేదేన వేరశ్మౌవసుః" అమరము. అట్లు, రహస్యంబునన్ = మనస్సులో ననుట. ధ్యాన | |
| విశేషమునందు, ఆత్మదేవున్ = తనయిష్టదేవతలను, అజసంతతిఘనుఁడు = బ్రాహ్మణశ్రేష్ఠుఁడు (అజ = బ్రహ్మ, సంతతి = కులము), ఇష్టార్థసిద్ధికై, ఎపుడున్, వేఁడున్, అతఁడు, అనఘుఁడు, ధైర్యమునను ...... నెందుసవతు లేక. (ముందఱ కన్వయము.) | |
తా. | గోపాలరామా! నన్ను రక్షింపుము. బ్రహ్మదేవుఁడా! కరుణించుము. ఈశ్వరా! యాదరింపుము. అని యాత్మదైవతములను బ్రార్థించును. ఎందును నతని కితరు లీడురారు. | |
వ. | ఇవ్విధంబున నిచ్ఛానువర్తనంబులు బ్రవరిల్లుచు నొక్కనాఁడు. | 11 |
| దీనియర్థము రెండుపక్షముల స్పష్టము. | |
చ. | అతులితరూపనిర్జితసుమంబగుఁ డాతఁడు సర్వలోకస | 12 |
రాఘవ. | అతు...సుమాంబకుఁడు - అతులిత = ఉపమానరహితమైన, రూప = సౌందర్యముచే, నిర్జిత = జయింప బడిన, సుమంబరుఁడు = పుష్పాస్త్రుఁడు (మన్మథుఁడు) గల, ఆతఁడు = దశరథుఁడు, సుమంత్రముఖ్యు లగుమంత్రులగోష్ఠిన్, గురూపదేశసంగతిన్ = వసిష్ఠోపదేశమున, సర్వలోకసమ్మతిని = సర్వజనుల సమాధానముతో, తనయాలినొందు = పుత్రసముదాయమును గనునిమిత్తమై, నదధ్వరక్షణాదృతిని - సత్ = శ్రేష్టమైన, అధ్వర = యజ్ఞమనెడు, క్షణ = ఉత్సవమునందలి, ఆదృతిని = ఆదరణముచే, పురోహితున్ - పురా = ఇంతకుముందే, ఊహితున్ = ఊహింపఁబడియున్న, శాంతవరున్ = శాంతాదేవీభర్తయైన ఋష్యశృంగుని, ప్రియాన్వితున్ = భార్యాసహితుని. | |
తా. | ఆదశరథుఁడు సుమంత్రాదిమంత్రులతో నాలోచించి సంతానము కలుగుటకై యొక యజ్ఞము చేయవలయు నని శాంతపెనిమిటి యగు ఋష్యశృంగుఁడను మునీంద్రుని (పిలిచెను). | |
లక్ష్మణ. | అతఁడు = గోపాలమంత్రి, అతులితరూపనిర్జితసుమాంబకుఁడు, సుమంత్రముఖ్యులగు = సుష్ఠువులైన యాలోచనములు ముఖ్యముగా గలిగిన, మంత్రుల గోష్టిన్ = నియోగుల గోష్ఠిలో (గోష్టి సభ), గురూపదేశసంగతిన్ = గురువు లుపదేశించినరీతిని, తనయాలిన్ = తనభార్యను, ఒందు = పొందుకొఱకు, సదధ్వరక్షణాదృతిని - సదధ్వ = మంచిమార్గముగలవానిని, రక్షణ = రక్షించుటయందైన, ఆదృతిని = ఆదరణముచే, శాంతవరున్ = శాంతులలో శ్రేష్టుఁడయిన, ప్రియాన్వితున్ = ఇష్టముతోఁ గూడిన, పురోహితున్ = పురోహితుని. | |
తా. | పెద్దలు చెప్పినరీతిని, తనవారియనుమతిపై పునస్సంధనకార్యము జరగించుకొనవలయునని శాంతుని బుద్ధిమంతుని బురోహితుని (బిలిపించెను.) | |
వ. | ప్రార్థనాపూర్వకంబుగా రప్పించి యతనికిం దగువిధంబునం | 13 |
| అర్థము రెండింటికి స్పష్టము. | |
ఉ. | ఆప్తత గానిపింపఁ దనయాశయముం దెలియంగఁ జేసి త | 14 |
రాఘవ. | ఆప్తత = స్నేహభావము, కానిపింప = తోఁచునట్లు, తనయాశయము - (తనయ+ ఆశయము) తనయ = పుత్రులను గూర్చిన, ఆశయము = అభిప్రాయమును, తెలియంగఁ జేసి, తత్ప్రాప్తికిన్ = ఆ తనయులు గలుగుటకు, తొల్త = ప్రథమమున, ఓయనఘ, భవ్యశుచిక్రియన్ - భవ్య = ఉత్తమమైన, శుచిక్రియం = అగ్నికార్యము (హోమము మొదలైనవి), యుష్మదాత్మనిక్షిప్తము లైనమంత్రములన్ - యుష్మత్ = నీయొక్క, ఆత్మ = మనస్సులో, నిక్షిప్త - ఉంచబడిన, మంత్రములు - మంత్రములచేత, మన్యువున్ = యజ్ఞమును, చేయుము. పాపహారి = పాపమునడంచి, | |
| ధర్మాప్తి నొనర్పన్ = ధర్మమును బొందున ట్లొనర్చుటకు, నాకు, అరయన్, గురువు, నీవ = నీవే, అటంచున్, పల్కుచున్. | |
తా. | ఋశ్యశృంగమునీంద్రా! మీరలే నాకు గురువులు, పుత్రులు కలుగున ట్లనుగ్రహించి యొక పాపహారియైన యగ్నికార్యమును జేయుమని కోరెను. | |
లక్ష్మణ | ఆప్తత, కానిపింపన్, తనయాశయమున్ = తన యభిప్రాయమును (తన + ఆశయము) దెలియంగఁ జేసి, తత్ప్రాప్తికిన్ = తనయభిప్రాయమును పొందుటకు, తొల్తన్, ఓయనఘ = ఓ పాపరహితుఁడా! భవ్యశుచిక్రియన్ = ఔపాసనాదికమును, మన్యువుఁ బాప = కోపమును బోఁగొట్టుకొఱకు, హారిధర్మాప్తిన్ = మనోహర మైనపుణ్యప్రాప్తిని, ఒనర్పన్ = ఒనరించుటకు, యుష్మదాత్మ...మంత్రములన్, జేయుము, అరయ,నాకు, గురువు, నీవ, యటంచున్, పల్కుచున్. | |
తా. | గోపాలమంత్రి పురోహితునితో దనయభిప్రాయముం జెప్పి ఔపోసనాదిక్రియలు చేయించుమనియెను. | |
వ. | అతని నొడంబఱిచి. | 15 |
| అర్థము రెండు తావుల స్పష్టము. | |
గీ. | తదనుమతి నొక్కశుభముహూర్తమున దార | 16 |
రాఘవ. | తదనుమతిన్ = ఋశ్యశృంగునియిష్టము ననుసరించి, ఒక్క శుభముహూర్తమున, దారసహితముగన్ = భార్యలతోఁ గూడ, పూతమంగళస్నానము, ఒగిన్ = క్రమముగ, ఒనర్చి = చేసి, ప్రచురవిధిని = ప్రకటప్రకారముగ (స్పష్టముగ), శుచిగురుసపర్య మున్నుగాన్ = శుచిర్భూత | |
| గురుపూజ మొదలుకొని, కృత్యము = చేయఁదగినదానిని, అంతయు, నడపెన్ = జరగించెను. | |
తా. | ఋష్యశృంగుఁడు చెప్పినట్లు శుభముహూర్తమున మంగళస్నానము చేసి భార్యలతోఁ గూడి దానికిఁదగినవిధానము నడపెను. | |
లక్ష్మణ. | తదనుమతిన్ = ఆపురోహితునియిష్టము చొప్పున, శుచిగురుసపర్య మున్నుగాన్ - శుచి = అగ్నిహోత్రుని, గురు = గురుని, సపర్య = పూజ, మున్నుగా = ముందుగా, తక్కినది సామాన్యముగానున్నది. | |
తా. | ఒక్క సుముహూర్తమునఁ బురోహితుఁడు చెప్పినట్లు భార్యతోఁ గూడ స్నానము చేసి యగ్నికార్యాదు లొనర్చెను. | |
వ. | తదనంతరంబ. | 17 |
సీ. | శాంతాంచితద్విజసన్మనూజ్జ్వలఘనా, | |
ఆ. | భవ్యపరమభక్తపాత్రికాలసదరు | 18 |
రాఘవ. | శాంతాం.......గతి - శాంతాంచితద్విజ = శాంతాదేవితో నొప్పుచుండినఋష్యశృంగునియొక్క, సన్మనూజ్జ్వల = సన్మంత్రములచేఁ బ్రకాశిం | |
| చెడు, ఘనాధ్వర = పుత్రకామేష్టియందు, చితగతి = వ్యాపించినగతిగల, విభావసుఁడు= అగ్నిహోత్రుఁడు, వెలుఁగన్ ,అప్పుడు, తన్మధ్యమందుండి = ఆయగ్నిలోనుండి, కృష్ణాభిఖ్యుఁ డగు = నీలవర్ణముగల, దివ్యపురుషుఁడు = ప్రాజాపత్యపురుషుఁడు, దివ్యభూషణభూషితుడు, సులక్షణయుతుండు, దృష్టిగోచరతనొందన్ =కనఁబడఁగా, అంతన్, ఆగోపాలుఁడు = నరపాలుఁడు, అతిభక్తిన్ = మిక్కుటమైన భక్తితో, కేల్మోడ్చుచున్ = నమస్కరించుచుండగా, వరవిభాప్రసన్నమూర్తి = శ్రేష్ఠకాంతిచే నిర్మల మైనయాకారముగల, భవ్య . . . స్థితి. భవ్య = శుభప్రదమైన, పరమభక్తపాత్రికా = పరమాన్నపాత్రతో (భక్తం = అన్నము, పరమ+భక్త = పరమాన్నము), “భిస్సాస్త్రీభక్తమంధోన్న” అమరము. లసత్ = ప్రకాశించుచున్న, ఉరుశ్రీ = గొప్పశోభకల, కరస్థితి = చేతులయొక్క స్థితి గలిగినట్టియు, శుభకృద్గతి = శుభము చేసెడునడకగలిగినట్టియు, అనుగుణమహిమయుతుఁడు = తగినమహిమతోఁగూడినట్టియు, గురుబుద్ధి = శ్రేషబుద్ధిగల, అతఁడు = అప్పురుషుఁడు, హితతన్ = స్నేహభావముగ, చేరి = సమీపించి, పేరన్ = పేరు పెట్టి, (దశరథుఁడాయని) అతనిన్, పిలిచెను. | |
తా. | ఋష్యశృంగుఁడు చేయించుయజ్ఞమునం దగ్ని ప్రజ్వరిల్లుచుండ నందుండి యొకదివ్యపురుషుఁడు నల్లనిమేనివాడు బైలుదేఱెను. దశరథుఁ డాతనికి భక్తిపూర్వకముగ నమస్కరించుచుండఁగా నొకపాయసపాత్రఁ జేతఁ బట్టుకొని యాదివ్యపురుషుఁడు దశరథునిఁ బిలిచెను. | |
లక్ష్మణ. | శాంతాం...గతి - శాంతా = శాంతముచే, అంచిత = పూజ్యులైన, ద్విజ= బ్రాహణుల, సన్మను = సన్మంత్రములచే, ఉజ్జ్వల = ప్రకాశించెడువాఁడు కావుననే, ఘనాధ్వ= అంతరిక్షముందు, రచితగతి = చేయఁబడిననడకగల, విభావసుఁడు = సూర్యుఁడు, వెలుఁగన్, అప్పుడు, తన్మధ్యమందుండి = ఆసూర్యమండలములోనుండి, ఒప్పారు, కృష్ణాభిఖ్యుఁడగు = కృష్ణనామముగల, దివ్యపురుషుఁడు = నారాయణమూర్తి, దివ్యభూషణభూషితుఁడు, సులక్షణయుతుఁడు, అగుచు, దృష్టిగోచరత నొందన్, అంతన్, గోపాలుఁడు = గోపాలమంత్రి, అతిభక్తిన్, కేల్మోడ్చుచున్, నవ. . . మూర్తి - నవ = నూతన మైన, రవిప్రభా = సూర్యకాంతి యనెడు, | |
| ప్రసన్నమూర్తి = నిర్మలమైన దేహముకలవాఁడా! భవ్యపరమభక్తపా - భవ్య = శుభులైన, పరమ = ఉత్కృుష్టులైన, భక్త = భక్తులను, పా = పాలించువాఁడా! త్రికా.. స్థితి - త్రికాల = మూఁడుకాలములయందు, సత్, ఉరు, శ్రీకర = శుభకరమైన, స్థితి = ఉనికిగలవాఁడా! శుభకృద్గతి = శుభప్రదగమనముగలవాఁడా! అను = అనునట్టి, గుణమహిమయుతుఁడు = గుణమహిమతోఁ గూడుకొనినట్టియు, గురుబుద్ధి = బృహస్పతిబుద్ధివంటి బుద్ధిగల, అతఁడు = గోపాలుఁడు, హితతఁ జేరి, పేరను, అతని = నారాయణమూర్తిని బిలిచెను. | |
తా. | సూర్యబింబము ప్రకాశించుచుండఁగా నాబింబమధ్యమున గృష్ణనామముగల యొక్కదివ్యభూషణభూషితుఁ డైనపురుషుఁడు తనకన్నులకు బొడగట్ట, గోపాలమంత్రి ననుస్కారము చేయుచు, ఓప్రసన్నమూర్తీ! భక్తపాలక! శుభకర! మహిమాన్వితా! యని (సూర్యమండలవర్తి యైన) నారాయణుని స్తుతించెను. | |
క. | శ్రీపాయసంబు తోడుత | 19 |
రాఘవ. | శ్రీపాయసంబుతోడుతన్ = శోభాయుక్త మైనపరమాన్నముతో, ఏపగు = హెచ్చయిన, కల్యాణపాత్రము = సువర్ణ పాత్రము, ఈవు = నీవు, ఇదె = ఇదిగో, కొనుము = పుచ్చుకొమ్ము, అంచు = అని పలుకుచు, ఓపికన్, అతివాం . . .ముగ - అతి = విస్తారమైన, వాంఛా = కోరికను, పూరణ = పూర్తిచేయుటకు, కారణముగ, సరసోక్తులతోన్, ఒసంగెను. | |
'
తా. | పరమాన్నముతో నిండినయొక బంగారుగిన్నెను, ఇదిగో నీవు పుచ్చుకొమ్మని దశరథునికోరిక తీరుటకుఁ గారణమయినదాని నాప్రాజాపత్యపురుషుఁ డిచ్చెను. | |
లక్ష్మణ. | శ్రీపా = శ్రీపతీ! యసంబుతోడుతన్ = కీర్తితో, ఏపగు, కల్యాణపాత్రము = శుభమునకు యోగ్యమైనవాఁడవు, “యోగ్యభాజనయోః పాత్రం" | |
| అమరము. ఈవు, ఇదె, కొనుమంచున్, ఓపికన్, నతిన్ = నమస్కారమును, వాంఛాపూరణకారణముగన్, సరసోక్తులతోన్, ఒసంగెన్. | |
తా. | ఓలక్ష్మీపతీ! శుభాకరుఁడవు. ఇదె స్వీకరింపు మని గోపాలమంత్రి యాతనికిఁ దనకోర్కులు నెఱవేఱుటకై నమస్కారము చేసెను. | |
వ. | అ ట్లొసంగి మఱియు నిట్లనియె. | 20 |
| అర్థము రెంటస్పష్టము. | |
క. | అలయకమున్ బాయసమున్ | 21 |
రాఘవ. | అలయకమున్ = అలయకమునుపు (ప్రాతఃకాలమందు), లలితామృతమూర్తినిన్ - లలిత = సుందరమైన, అమృతమూర్తినిన్ = అమృతస్వరూపమైన, పాయసమున్ = పరమాన్నమును, ఘనశ్యామలు = మంచివయస్సుగల, భామలు = స్త్రీలు (కౌసల్యాదులు), సేవింపఁగన్ = భుజించుటకై, ఇమ్ము, ఇఁకన్ = ఇంకమీఁద, అలఘుమతిన్ = యోగ్యమైనమనస్సుతో, దీనన్ = ఈపాయసముతో, కోర్కులన్నియున్, అమరున్ = ఒనగూడును. | |
తా. | అమృతస్వరూపమైన యీపాయసమును నీ భార్యలకు బ్రాతఃకాలమందు భుజింప నిమ్ము. దీనివలన నీకోర్కులు సిద్ధించును. | |
లక్ష్మణ. | అల... బాయన్ - ఆల = ఆ, ఆకమున్ = పాపమును, పాయన్ = పాపుకొఱకు "అకంపాపేచదుఃఖేన” అని విశ్వప్రకాశము. సమున్ = సముఁడవైనట్టియు, లలితామృతమూర్తిన్ = సుందరమైన మోక్షస్వరూపుడవైనట్టియు, ఘనశ్యామలున్ = మేఘముభంగి శ్యామల(నీల)వర్ణుఁడ వైనట్టియు, భామలున్ - భా = కాంతిచే, అమలు = స్వచ్ఛమైనట్టియు, నిన్ = నిన్ను, సేవింపఁగ నిమ్ము = కొలువనిమ్ము, అలఘుమతిన్, దీనన్ = ఈసేవవలన, కోర్కులన్నియున్, అమరున్ = సమకూరును. | |
తా. | పాపపరిహారమునకై యమృతస్వరూపుఁడవైన, మేఘవర్ణముగల కాంతియుతుని నిన్ను నా కోర్కులు ఫలించునిమిత్తమై నన్ను సేవించనిమ్ము. | |
గీ. | అనుచుఁ బలికి యాతం డక్షిగోచరుఁడుగా | 12 |
రాఘవ. | అనుచున్, పలికి, ఆతఁడు = ఆదివ్యపురుషుఁడు, అక్షిగోచరుండు, కాకుంట = కనఁబడకపోవుటను, తెలిసి = తెలిసికొని(అంతర్ధానమగుటఁ గనిపెట్టి), గురుతరప్రతిభుఁడు = గొప్పదైన ప్రభావముగలిగిన, గోపాలుఁడు = జనపతియగు, అజకులోద్వహుండు = దశరథుఁడు, అప్పుడు, వేడ్కతోడన్, ఒక్కవెరవు = ఒకయుపాయమును, పట్టి. | |
తా. | ఇట్లని చెప్పి యాదివ్యపురుషుఁ డంతర్ధానము నొందిన, దశరథుండు సంతోషముతో. | |
లక్ష్మణ | అనుచునా, పలికి, ఆతఁడు = ఆనారాయణమూర్తి, అక్షిగోచరుఁడు గాకుంటఁ దెలిసి, గురుతరప్రతిభుఁడు, అజకులోద్వహుఁడు = బ్రాహ్మణుఁడు, గోపాలుఁడు=గోపాలమంత్రి, అపుడు, వేడ్కతోడన్, ఒక్కవెరవు, వట్టి. | |
తా. | ఇట్లని గోపాలుఁడు స్తుతించి సూర్యబింబములోని నారాయణుఁడు కనబడకుండుటఁ దెలిసికొని. | |
క. | వెలయ మనం బాయసమున్ | 23 |
రాఘవ. | వెలయన్ = ప్రకాశించునట్లు, మనన్ = మన్నెడుకొఱకు, పాయసమున్, లలి=మిక్కిలి, సాము = సగము, ఆదిప్రియకు = మొదటిభార్యకు (కౌసల్యకు), అర = సగము, లలితా. . . నందనకున్ - లలిత = ఒప్పుచుండు, ఆమ్నాయోక్తుల = సంప్రదాయవాక్యములుగల “ఆమ్నాయస్సంప్రదాయః" అమరము. కేకయనందనకు = కైకకు, ఇంపలరు, రసజ్ఞకు = జిహ్వకు, అమృతంబునట్టు లొసంగెన్. | |
తా. | పెద్దభార్యకును, గైకకును, జిహ్వ కమృతమువంటి రుచిగలపాయసముం బెట్టెను. | |
లక్ష్మణ. | మనంబు = మనస్సు, వెలయన్, ఆయసమున్ = ఆసమానుఁడు లేని విష్ణుమూర్తిని, లలిన్, సామాది... క్తులకు - సామాది = సామవేదము మొదలగు, ప్రియకర = ప్రియముం గావించు, లలిత = మనోహరము లైన, ఆమ్నాయోక్తులకు = శ్రుతివాక్యములకు, ఏక యనన్ = ముఖ్యమైనది యనునట్లుగ, తనకు ఇంపలరురసజ్ఞకు, అమృతంబునట్టులొసంగు (స్తుతిచేసెననుట.) | |
తా. | సంతసముచే నాయసమానుఁ డైనవిష్ణుదేవుని సామాదివేదోక్తులచే తననోటి కమృతప్రాయమైన స్తోత్రము గావించెను. | |
వ. | అ ట్లొసంగి యంతలోన మఱియొకతలంపు పుట్టుటయుఁ ద | 24 |
| అర్థము రెంటికిని స్పష్టము. | |
మ. | నలి దేవు ల్ముగు రేకమైన మిము నానందంబుగాఁ జూడ నేఁ | 25 |
రాఘవ. | నలి = మిక్కిలి, దేవు ల్ముగురు = భార్యలు ముగ్గురును, ఏకమైనన్ = భేదభావము లేక యుండిరేని, మిమున్, ఆనందంబుగాఁ జూడ నేఁ దలఁతున్ | |
| గావున, గోతులార = ఓ స్త్రీలారా! హితతన్ = ఇష్టముచేత, తద్ది... లోనన్ - తత్ = =ఆ, దివ్య = దేవతాసంబంధమైన, సద్భక్తరాసులలోనన్ = శ్రేష్ఠమైన పరమాన్నపుముద్దలలో, సాములు = సగములు, తగనుంచి, బుధస్తుత్యస్థితుల్ = పండితులు స్తుతింపఁదగిన స్థితులుగల, మీరు, వేడ్కల, మీఱంగ, భద్రపద = శుభములకు స్థాన మైన, సుమిత్ర = సుమిత్రాదేవిని, మెక్కంజేయుట = భక్షించునటుల చేయుట, అర్హంబగున్ = తగును. | |
తా. | నాభార్యలైనమీరు ముగ్గురు నొక్కటిగా మెలఁగుట నా కెంతయు నిష్టము కావున, మీకు నే నిచ్చిన పాయనములోని సగము సగము భాగములు సుమిత్రకుఁ గూడఁ బెట్టుఁ డని దశరథుఁడు కౌసల్యను గైకను గోరెను. | |
లక్ష్మణ. | నలి, దేవు ల్ముగు రేకమైన మిమున్ = త్రిమూర్త్యాత్మకమైన మిమ్మును, ఆనందంబుగాఁ జూడ నేఁ దలతున్, గో = భూమియందు, తులారహితతన్ = సామ్యము లేనట్టుగా, తద్దివ్యసద్భక్తిరాసులలో = ప్రసిద్ధమైన భక్తసముదాయమునందు, నన్ = నన్ను, తగనుంచి, సాములు = స్వాములు, బుధస్తుత్యస్థితుల్ మీరు, సుమిత్రభద్రపదము - సు = శ్రేష్ట మైన, మిత్ = సూర్యునియొక్క, భద్రపదము = శుభస్థానమును, ఎక్కంజేయుట = ఎక్కునట్లు గావించుట, అర్హంబగున్. | |
తా. | త్రిమూర్త్యాత్మక మైనమిమ్ము నేఁ జూడఁ గోరెదను. ఈభూలోకమున ననుపమాను లైననీభక్తకోటిలో నన్నుఁ గూడ నొకనిగ జేర్చుకొని స్వామివారలు నన్ను సూర్యపదప్రాప్తుని చేయవలెను. అని గోపాలుఁడు స్తుతించెను. | |
గీ. | అనుచుఁ బల్కి యాతఁ డపుడే తదనుమతి | 26 |
రాఘవ. | అనుచుఁ బల్కి, అతఁడు = ఆదశరథుఁడు, అపుడే, తదను....డగుచున్ - తదనుమతిమిళిత = ఆయిద్దఱుభార్యలయిష్టముతో మిళితమైన, వాంఛి | |
| తోక్తికలితుఁ డగుచున్, (సుమిత్రకుఁ దమతమపాయసభాగమును బెట్టుటకు సమ్మతింపఁగా) వసతిన్ = గృహము నందు, “వసతీ రాత్రివేశ్మనో” అమరము. అనుప.....యుతతన్ - అనుపమాన = ఉపమానము లేని, పాయసరస = పరమాన్నరసమును, సుఖానుభవ = సుఖముగా భుజించిన, దార = భార్యలతో, యుతతన్ = కూడుకొనుటచేతను, శుభతన్, తాల్చెన్. | |
తా. | తాను గోరిన ట్లాయిద్దఱును సుమిత్రకుఁ గూడఁ బాయసము పెట్టఁగా, దానిని భుజించిన భార్యలతో గూడి శోభాయుక్తుఁడై యుండెను. | |
లక్ష్మణ. | ఏతదనుమతిమిళితవాంఛితోక్తికలితుఁడు = పుర్వోక్తవాంఛితోక్తితో నొప్పుచున్నవాఁడై, వసతిన్ = రాత్రియందు, అనుప.....తతన్ - అనుపమ = సాటిలేని, అనపాయ = అపాయశూన్యమైన, సరససుఖనుభవము గలిగిన, దారయుతతన్ = భార్యతో నుండుటచే, శుభత దాల్చెన్ - శోభిల్లెను. | |
తా. | సూర్యోపాస్తిచే నానందించుచు గోపాలమంత్రి రాత్రులయందు భార్యతో సరససుఖానుభవముల నొప్పుచుండెను. | |
వ. | ఇవ్విధంబున నిష్టవినోదంబుల నుండి కొన్నిదినంబులకు | 27 |
రాఘవ. | భార్యల + సద్రూపము అని పదచ్ఛేదము. | |
లక్ష్మణ. | భార్య+లసద్రూపము అని. తక్కినది సమము సులభము. | |
శా. | ఆరన్ రాజమహేలలందునను బెద్దై యొప్పుసత్పుణ్య సు | 28 |
రాఘవ. | ఆరన్ = వృద్ధిఁ బొందునటుల, రాజమహేలలందునను = రాజస్త్రీలయందు, పెద్దైయొప్పు = జ్యేష్టురాలైన, సత్పుణ్య = పుణ్యాత్మురాలు, (కౌసల్య | |
| యనుట) “మహేలామహిళాదిస్యాత్” అని ద్విరూపకోశము. సుశ్రీరాజద్వరపాదభక్తిన్ - సు = యోగ్యమైన, శ్రీ = శోభచే, రాజత్ = ప్రకాశించెడు, పర = భర్తయొక్క, పాదభక్తిన్ = పదభక్తిచేత, శ్రీరామనామున్ = శ్రీరాముఁ డనుపేరుగలవానిని, నుతుల్ నేరంగనియెన్, భార్గవురేణుకాతరుణిపోల్కిన్ = పరశురాముని రేణుక కనినయట్లును, భవ్య . . . జాతున్ - భవ్య = శుభదమైన, నానాతపశ్శ్రీ = నానావిధప్రకాశసంపత్తి కలిగిన, రక్తమరీచిజాతున్ = ఎఱ్ఱనికిరణసముదాయముగలవానిని (సూర్యుని), అదితిస్త్రీలాగునన్, బాగుగన్. | |
తా. | పెద్దభార్య యైనకౌసల్య పతిపాదభక్తివలన, శ్రీరాముఁ డనుకొమరుని, రేణుక పరశురాము గనినయట్లు అదితి సూర్యుని గనినయట్లు కనియెను. | |
లక్ష్మణ. | ఆరన్, రాజమ = రాజమ్మయనుస్త్రీ, హేలలందునను = విలాసములందున, పెద్దై = శ్రేష్ఠురాలై , ఒప్పు = తగునట్టి, సత్పుణ్య . . . భక్తిన్ - సత్పుణ్యసుశ్రీ = పుణ్యముయొక్క శ్రేష్ఠమైనశోభచే, రాజద్వరపాదభక్తిన్ = ప్రకాశించు పెనిమిటియొక్క పాదసేవను, మున్ = పూర్వము, శ్రీరామనా = లక్ష్మీకాంతవలె, భార్గవురేణుకాతరుణిపోల్కిన్ = జమదగ్నిని రేణుకవలె, భవ్యనానా... లాగునన్ - భవ్య = శుభకరమైన, నానాతపశ్శ్రీ = నానావిధతపస్సంపత్తియందు, రక్త = అనురక్తమైన, ఆత్మ = బుద్ధిగల, మరీచిజాతున్ = కశ్యపుని, అదితిస్త్రీలాగునన్ = అదితివలె, బాగుగన్, నుతుల్సేరన్, కనియెన్ = పొందెను. | |
తా. | గోపాలుని భార్య రాజమ్మ, తన పెనిమిటిని, పూర్వము, లక్ష్మీదేవివలె, భృగుమహర్షిని రేణుక వలె, కశ్యపుని అదితివలె సేవించెను. | |
వ. | మఱియును. | 29 |
| అర్థము సమము. | |
క. | శ్రీకేకయనందన భ | 30 |
రాఘవ. | శ్రీకేకయనందన = శోభతోఁ గూడిన కైకేయి, భవ్యాకృతిన్ =శుభాకారముగల, భరతసుసమాఖ్య నలరుకొమరున్ = భరతుఁ డను శ్రేష్ఠనామము గలకుమారుని, ముల్లోకములు మెచ్చ, శ్రీకరసుమవల్లి = శోభాయుక్తమైన పువ్వులతీఁగ, తావిరీతిన్ = పరిమళమును వలెనే, ప్రీతిన్ = ప్రేముడిచే, కాంచెను = కనియెను. | |
తా. | కైక, పువ్వుఁదీఁగె పరిమళమును గాంచినట్లు భరతుఁడను పుత్త్రుని బడసెను. | |
లక్షణ. | శ్రీకేకయనన్ = సంపత్తికి ముఖ్యమైనవి యనునట్టులు, తనభవ్యాకృతిభరతన్ = తనశుభాకారభరణముచేత, సుసమాఖ్యనలరు కొమరున్ - సుసమాఖ్యనలరు = సుకీర్తిసహితమైన, కొమరున్ = తేటను (సౌందర్యమును), శ్రీకరసుమవల్లితావిరీతిన్, ముల్లోకములు మెచ్చన్, ప్రీతిన్ = ప్రేముడిచే, కాంచెను = పడసెను. | |
తా. | రాజమ్మ పతిసేవవలన సంపత్తికి ముఖ్యమైన తనశరీరకాంతిచేత నొకవిధమైన సౌందర్యమును వహించెను. | |
వ. | తదనంతరంబ. | 31 |
| స్పష్టము. | |
మ. | గణనాతీతమనోరథాళి స్వకుచాగ్రత్విడ్జితామర్త్యరా | 32 |
రాఘవ. | గణనాతీతమనోరథాళి = లెక్కకు మించిన దౌహృదములు కలిగినట్టియు, స్వకు.... రాణ్మణి - స్వ = తన, కుచాగ్ర = చూచుకములయొక్క, త్విట్ = కాంతిచే, జిత = జయించఁబడిన, అమర్త్యరాణ్మణి = ఇంద్రనీలమణులు కలిగినట్టియు, శుభ్రాస్యజితాబ్దరాజమ - శుభ్ర = తెల్లనైన, ఆస్య = ముఖముచే, జిత = జయింపఁబడిన , అబ్జ = పద్మములయొక్క, రాజ = చంద్రునియొక్క, మ = శోభ కలిగినట్టియు, సుమిత్ర, ముహర్మందాంఘ్రవిన్యాసయై - ముహుః = మాటి | |
| మాటికి, మంద = మందమైన, అంద్రువిన్యాస = అడుగులు పెట్టునది, యై, ప్రణుతింపంబడుచున్ = స్తుతింపఁబడుచు, హిత....షాప్తిన్ - హిత = ఇష్టమైన, గర్భశ్రీ = గర్భసంపదయొక్క, విశేషాప్తిన్ = అతిశయప్రాప్తిచేత, లక్ష్మణు, శత్రుఘ్నునిన్, పుత్రకుల, సత్సంతోషము = సత్పురుషుల కానందము, ఏపారంగన్ = వృద్ధియగునట్లు, కాంచె = కనియెను. | |
తా. | అనేకములయిన మనోరథములు గలిగి నల్లనైన స్తనాగ్రములు గలిగి నడక మందగించినసుమిత్ర లక్ష్మణుని శత్రుఘ్నుని గనియెను. | |
లక్ష్మణ. | శుభ్రాస్యజితాబ్జ = తెల్లనిముఖముచే జయింపఁబడిన చంద్రుఁడు గల, రాజమ= రాజమ్మ, సుమిత్ర ... షాప్తిన్ -సు, మిత్ర, హిత, గర్భశ్రీవిశేషాప్తిన్, లక్ష్మణు = లక్ష్మీవంతుఁడును, శత్రుఘ్నునిన్ = శత్రునాశకుఁడును, అయిన పుత్రకున్ = కొడుకును, లసత్సంతోష మేపారఁగన్, కాంచెన్. | |
తా. | రాజమ్మ, తన బాంధవులకు స్నేహితులకుఁ బ్రియమగునట్లు గర్భము దాల్చి లక్షణవంతుఁ డైనయొకకొడుకును గనియెను. | |
వ. | అంత. | 33 |
సీ. | కన్నమ్మ కోసలక్ష్మావరసుత ప్రీతి | |
గీ. | నలినియోగులు బుధులు నెన్నఁగ నలుగురు | |
| నొప్పెనయ లీల లభివృద్ధి నొంద నెసఁగు | 34 |
రాఘవ. | పురుషోత్తమ = విష్ణుమూర్తివైన శ్రీరామా! కన్నమ్మ = కన్నతల్లియైన, కోసలక్ష్మావరసుత = కౌసల్య, ప్రీతిన్, నిలన్ = నిలుచుకొఱకు, కలిగి తనుచు=పుట్టితి వనియు, సుశ్రీ = మంచిశోభగలభరతుఁడా! భయదారివి - భయ = భయమును, ద = ఖండించు, అరివి = విష్ణుచక్రమైన, ఈవు = నీవు, గోపాలజుండౌట = దశరథపుత్రుఁడవౌటచే, కైక = కైకయొక్క, వాంఛ = కోరిక, రాజిలె నటంచున్ = ప్రకాశించె ననియును, భోగీంద్రున్ = ఆదిశేషుఁడవైన (లక్ష్మణుడు), నిన్ను, నేఁడు, ఈగతిన్ (పుత్రుగా), కనుట, సుమిత్ర = సుమిత్రదేవియొక్క, మోదస్థితి = సంతోషము, మించెన్ = ఎక్కుడయ్యె, ననుచున్, పితృ.. న్నతిన్ - పితృ = తలిదండ్రుల, సుకృత = పూర్వపుణ్యముయొక్క, ఉన్నతిన్ = అతిశయముచే, వలమురి = విష్ణుశంఖము, పురుషాకృతి = పురుషరూపముచేత, హారివి = మనోహరుఁడవైన, ఈవు = శత్రుఘ్నుఁడ వైననీవు, నలిని = అత్యంతము, యోగులు = తపస్వులును, బుధులు = దేవతలును, ఎన్నఁగ = మెచ్చఁగా, నలుగురు = ఆనలుగురుకుమారులు, రూపమున మీఱిరి = చక్కఁదనము గలవారైరి. అమలసద్రుచిబలమునన్ = స్వచ్ఛమైన దొడ్డతేజస్సుయొక్క సామర్థ్యమున, ఒ ప్పెనయన్ = సొగసు హత్తునట్లు, లీల లభివృద్ధి నొందన్ = విలాసము లభివృద్ధి నందునట్లు, ఎసఁగు = ప్రకాళించెడు, ఆ, యనఘ = నిర్దోషమైన, నయ = నీతి, శోభ = శోభలయొక్క, నియతులు = నియమములు, ఎదుగఁగ = వృద్ది పొందుకొఱకు, అని వెనుక కన్వయము. | |
తా. | కౌసల్య సంతోషమునకై, ఓ రామా! విష్ణుమూర్తివి నీ విట్లు పుట్టితివని, కైకవాంఛ తీర విష్ణుచక్రమవైనభరతుఁడా! నీవు పుట్టితివని, సుమిత్ర సంతోషించున ట్లాదిశేషుఁడా! నీవు లక్ష్మణుఁడవై పుట్టితివని, తండ్రి చేసినపుణ్యవశమున విష్ణుశంఖాంశమున శత్రుఘ్నా! నీవు జన్మించితి వని మునీంద్రులు మున్నగువారు స్తుతింప, రూపమున బలమున నసమానులై నల్వురుకొమరు లెదిగిరి. | |
లక్ష్మణ. | కన్నమ్మకు = రాజమ్మకు, ఓసలక్ష్మా = శుభలక్షణసహితుఁడా! వరసుత = జ్యేష్ఠపుత్రుఁడా! ప్రీతినిలన్ = సంతోషస్థితికొఱకు, పురుషోత్తము = ఉత్తముపురుషుఁడా! కలిగితి, అనుచున్, భయదారిని = భయమును బోఁగొట్టువాఁడవు, అయిన, ఈవు = నీవు, గోపాలజుం డౌటన్ = గోపాలమంత్రి పుత్రుఁడ వౌటచే, సుశ్రీకైక - సుశ్రీ = సుసంపత్తిగలవారిలో, ఏక = ముఖ్యుఁడా! వాంఛ = మాకోరికి, రాజిలెన్, అటంచున్, భోగీంద్రున్ = భోగవంతులలో మిన్నవైన, నిన్ను, నేఁడు, ఈగతిఁ గనుటన్ = ఈచొప్పునఁ జూచుటచే, సుమిత్రమోదస్థితి=మంచిమిత్రులసంతోషము, మించె , అనుచున్, పితృకృతసుకృతోన్నతి(యొక్క), వలము = బలము, రిపురుషాకృతిహారివి - రిపు = శత్రువుల, రుషా = కోపముయొక్క, ఆకృతి = ఆకారమును, హారివి = వారించువాఁడవు, (అయిన) నీవు, అయ్యెననుచున్ (తలిదండ్రుల పుణ్యబలమే నీయాకార మయ్యె ననుట), నలి, నియోగులు = స్వశాఖీయులయిన బందుగులు, బుధులు = పండితులు, ఎన్నఁగ = గణించగా, నలు = నలునియెక్క, గురు = గౌరవమైన, రూపమున = ఆకారమున, మీఱి, రమన్ = లక్ష్మిచే, లసద్రుచిన్ = శోభచే, బలమునన్, ఒప్పెను. అయలీలలు = భాగ్యవిలాసములు, అభివృద్ధి నొందన్, ఎసఁగున్, ఆయన = ఆచిన్నవాఁడు, (నాయన = తండ్రియొక్క) ఘనయశోభానియతు లెదుగఁగన్ = సుకీర్తిప్రభానియమవృద్ధికొఱకు, అని, వెనుకక్రియతో నన్వయము. | |
తా. | రాజమ్మకు నీవు సలక్షణుఁడవు పురుషోత్తముఁడవు కలిగతివి. భయమును బోఁగొట్టువాడవు, ఇంద్రభోగము లనుభవిందు ని న్నీగతి జూచుచున్న స్నేహితులసంతోషము మించుచున్నది. నీతండ్రి చేసిన పుణ్యమే నీవై పుట్టె నని నియోగులు, పండితులు నెన్న, నలరాజు వంటి సౌందర్యముతో గోపాలమంత్రి కుమారుఁ డుండెను. | |
వ. | అంత నగ్గోపాలుండు తత్సంతానంబుఁ గాంచి పెన్నిధిఁ గన్న | |
| దనిపి సముచితసమయంబునఁ బుణ్యాహవాచనపూర్వకంబు | 35 |
రాఘవ. | అగ్గోపాలుండు = ఆదశరథుఁడు, తత్సంతానంబున్ = ఆనలుగురుపుత్రులను, కాంచి = కని. | |
లక్షణ. | అగ్గోపాలుండు = ఆగోపాలమంత్రి, తత్సంతానంబు = ఆకుమారుని. తక్కి నది సమము స్పష్టము. | |
సీ. | క్షమరుచి రాజిసుసంతతి యట్లు నా | |
గీ. | వేదములచందమునను బవిత్రతలను | 36 |
రాఘవ. | క్షమ ... సంతతి - క్షమ = సమర్థమైన, రుచిర = సుందరమైన, అజిసంతతి=దశరథపుత్రులు (అజుఁడను రాజు కొడుకు - అజి = దశరథుఁడు, అజిసంతతి = దశరథుని సంతానము), అట్లు, నానాఁటికిన్, మెఱయన్, ఏఁటేఁటన్ = ప్రతిసంవత్సరము, ఒకొకకొమురు - ఒక్కొక్కతేటను, కామితలక్షణము లొప్పన్ = కోరఁబడిన చిహ్నములు ప్రకాశించునట్లుగా, కాంచెన్, సత్సుధాంశుమండలముఖులన్ = చంద్రబింబములవంటి ముఖములుగల, మాతలన్ = | |
| తల్లులను, మువ్వురన్ = కౌసల్య, కైక, సుమిత్రలను, తండ్రినిన్ = దశరథుని, ముదమందఁ జేయుచున్ (వెనుక కన్వయము); అందు = ఆనలువురుకొడుకులలో, అగ్రజుండు = పెద్దవాఁడు (రాముఁడు), గుణాధికతను = విశేషగుణములచే, పొలిచెన్ = ప్రకాశించెను. ఆరీతి = అట్లు, తత్పుత్రులు నల్వురు = రామలక్ష్మణభరతశత్రుఘ్నులు, అచ్యుతభుజములయట్లు = విష్ణుదేవుని నాలుగుభుజములవలె, బల్మి = బలమును, వేదములచందమునను = చతుర్వేదములవలె, పవిత్రతలను, కమలసంభవుముఖములగతిన్ = బ్రహ్మదేవుని నాల్గుమోములరీతిని, చదువులన్ = విద్యలను, జలధులపగిదిన్ = నాలుగుసముద్రములయట్లు, గాంభీర్యములను = గంభీరభావనలను, కాంచన్, తగుటలు = తగియుండుటలు, జనంబు వినుతింప, నెగడిరి. అంత. | |
తా. | రామలక్ష్మణభరతశత్రుఘ్నులు ఓర్పున, కాంతిని, నాఁనాఁటికి, ఏఁటేఁట నొకవింతచెలువము గానుపింప, తల్లిదండ్రుల కానందముం గల్పించుచుండిరి. ఆందుఁ బెద్దవాఁడు గుణాధిక్యమును వహించెను. ఆనలుగురు, విష్ణుదేవుని బాహువులవలె బలిమిని, వేదములవలెఁ బవిత్రతలను, బ్రహ్మముఖమువలె విద్యలచేతను, సముద్రములవలె గాంభీర్యముల జనులు పొగడఁ బెరిఁగిరి. | |
లక్ష్మణ. | క్షమన్ = భూమియందు, రుచిరాజిన్ = కాంతిపఙ్క్తిగల, సుసంతన = ఆగోపాలుని చక్కనికుమారుఁడు (తిరుపతి మంత్రి). అట్లు, నాఁనాఁటికిన్ = దితిక్రమమున, మెఱయన్ = ప్రకాశించుచుండగా, ఏఁటేఁటన్, ఒకొకకొమరుగాన్ = ఒక్కొక్కకొమారుని చొప్పున, మితలక్షణము లొప్పన్ = శాస్త్ర్రోక్తలక్షణములు కలుగునటుల, కాంచెన్, మాత = తల్లియైన రాజమ్మ, లసత్+సుధాంశుమండలముఖులన్ = వెలుఁగుచున్న చంద్రమండలముల వంటి మోములు గల, మువ్వురన్ =ముగ్గురు కుమారులను, కనియెననుట. తండ్రిన్ = గోపాలమంత్రిని, ముదముందఁ జేయుచు, అందగ్రజుండు = తిరుపతియను పుత్రుఁడు, గుణాధికతను, పొలిచెను. ఆరీతిన్, తత్పుత్రులు నల్వురు = తిరుపతి, రామకృష్ణ, లక్ష్మణ, రామనామములు గలనల్గురు, కాంచఁదగుటలు = పొందఁదగియుండుటలు, జనంబు వినుతింపన్, నెగడిరి = వృద్ధినొందిరి. | |
తా. | గోపాలమంత్రి పెద్దకొడు కట్లు దినదినాభివృద్ధి నొందుచుండ బ్రతిసంవత్సరము నొక్కొక్కకుమారునిగా మఱిమువ్వురకు రాజమ్మ సలక్షణములు గలవారిని గనియె, వారిలో పెద్దవాడైన తిరుపతి, తండ్రి కానందము గలిగించుచు గుణవంతుఁ డనిపించుకొనియెను. ఇట్లు నలుగురుపుత్రులు, తిరుపతి, రామకృష్ణ, లక్ష్మణ, రామ నామముగలవారు వర్ధిల్లుచుండిరి. | |
వ. | అట్లు క్రమక్రమంబున. | 37 |
క. | తారాగ్రహములు తమలోఁ | 38 |
రాఘవ. | తారాగ్రహములు = నక్షత్రములు, గ్రహములు, తమలోన్, తారు = తమరు, ఆగ్రహములు = విరోధభావములు, వదలి, తద్దయున్ = ఎంతయు, శుభసంచారులగువేళన్, మారసమాకారులు - మా = లక్ష్మిని, ర = గ్రహించిన (విష్ణువుతో), సమాకారులు = సమానమైనయాకారములుగల, అక్కుమారులు = రామాదులు, ధీరుల్, పుట్టిరి. | |
లక్షణ. | మారసమాకారులు = మన్మథాకారులు, తక్కినది సమానము. | |
తా. | నక్షత్రములు గ్రహములు మంచిస్థితియందుండఁగా, శుభసంచారములు చేయుచుండఁగా నానల్వు రుదయమందిరి. | |
సీ. | రుచిరతాస్పదము దిరుపతి నా భాసితు | |
| ణుని సుమిత్రానందనుని సమస్తజనమా | |
గీ. | రూఢిగా రాము బలియు శత్రుఘ్ను నాల | 39 |
రాఘవ. | రుచిర... పతినా - రుచిరతా = సుందరత్వమునకు, ఆస్పద = స్థానమైన, ముదిరు= మేఘునియొక్క, “ఘనజీమూతముదిరజలముగ్ధులనుయోనయః" అమరము. పతినా = ప్రభువైన యింద్రుని వలె, భాసితున్ = ప్రకాశించుచున్నవానిని, పతినా = ప్రతి యనునట్టులు, (ప్రతిశబ్దద్భవము, పతి. దేశ్యమని కొంద ఱందురు.) క్షేమమానయశోభి = శుభసంపత్తి, నీతులచేఁ బ్రకాశించువానిని (క్షేమమా+నయ+శోభి), రామున్ = రాముని, జ్యేష్టున్ = మొదటివానిని, శ్రీలనేలుమనియు = సంపదల నేలుమనియు, రెండవసతున్ = రెండవకొడుకును, కీర్తిజితరూప్యగిరిశున్ - కీర్తి = యశస్సుచే, జిత = జయింపఁబడిన, రూప్య = వెండియు, గిరిశున్ = శివుఁడును గలిగినట్టివానిని , రామకృష్ణున్ = రామునివలె నల్లనికాంతి గలవానిని, భరతుని, మహనీయవృత్తిని విలసిల్లుమనియు, మూఁడవయతనిన్, సుమిత్రానందనుని, లక్ష్మణుని, సమస్తజనమాన్యప్రవర్తనలఁ జెన్నలరుమనియు, నాలవకొమరుని, రూఢి. . . త్రుఘ్ను - రూఢి గారాము = ముద్దుచేత, బలియు = ప్రబలు, శత్రుఘ్నుని, ఘనవృత్తిని వఱలుమనియు, తద్గురుండు = వారిగురువైన వసిష్ఠుఁడు, నిరూపణముగ ధరణిజనులెల్ల మెచ్చ, దీవించి పలికెను. | |
తా. | మేఘశ్యాముఁ డైన రాముని, రామునిం బోలిన భరతుని, లక్ష్మణుని, శత్రఘ్నుని శ్రీల నేలుమనయు, కీర్తిచే వర్ధిల్లుమనియు, జనమాన్యప్రవర్తనము గలిగియుండు మనియు, ఘనుఁడవై యలరు మనియు గురువైన వసిష్ఠమహర్షి దీవించెను. | |
లక్ష్మణ. | రుచిరతాస్పదము = సౌందర్యస్థానమైనవానిని, దిరుపతినా = తిరుపతిమంత్రియన, భాసితున్, క్షేమ+మాన+యశోభిరామున్, జ్యేష్ఠుని, కీర్తిజితరూప్యగిరిన్, శుభరతునిన్ = శుభాసక్తుని, రామకృష్ణునిన్ = ఆపేరుగలవానిని, లక్ష్మణునిన్ = లక్ష్మణనామముగలవానిని, సుమిత్రానందను = మంచిస్నేహితుల కానందము గల్గించువానిని, రూఢిగా = నిర్ణయముగ, రామున్ = ఈపేరిటివానిని, ప్రబలుమని, శత్రుఘ్నుని = శత్రునాశకుని, తద్గురుండు = వారితండ్రి గోపాలమం త్రి, దీవించి పలికెను. | |
తా. | గోపాలమంత్రి, తిరుపతిని, రామకృష్ణుని, లక్ష్మణుని, రాముని (తననలువురు కొడుకులను), దీవించెను. | |
వ. | అంత. | 40 |
ఉ. | తాతను గన్నతండ్రి నుచితస్థితిఁ బోలిన పెద్దచిన్నవాఁ | 41 |
రాఘవ. | తాతను = బ్రహ్మను, కన్నతండ్రిన్ = కనినతండ్రియైన విష్ణుదేవుని, ఉచితస్థితిన్ = తగినరీతిని, పోలిన = అనుకరించిన, పెద్దచిన్నవాఁడు (రాముడు), ఆతతబుద్ధిశాలియగుచు = విస్తారమైన జ్ఞానవంతుఁడై, ఆత్మమునందలపోయ = మనస్సున నాలోచింపగా, బాల్యమందే = చిన్నప్పుడే, తెలివిన్, ఘనుండగుటన్, ఎంతయున్ = మిక్కిలి, విస్మయ మొప్పు= ఆశ్చర్యకరము గాఁగ, పెంపునన్ = అతిశయముచే, సజ్జనవ్రాతముఁ బ్రోవన్ = శిష్టజనసమూహమును రక్షించుటకున్ను, దుష్టజనవర్గము చేవ = దుర్జనులగర్వమును, అడంపన్ = తగ్గించుటకును. | |
తా. | విష్ణుమూర్తివలె రాముఁడు చిన్నతనమునందే బుద్ధిశాలియై దుష్టశిక్షణ శిష్టరక్షణములయందు నేర్పరియై జనులకు విస్మయముం బుట్టించె ననుట. | |
లక్ష్మణ. | తాతను = తాతగారిని, కన్నతండ్రిని = తండ్రి గారిని, ఉచితస్థితిన్ = వారివారిగుణములచేత, పోలిన పెద్దపిన్నవానిని, తక్కినది సులభము. | |
గీ. | అన్న గారిభోగోన్నతి వన్నెమీఱు | 42 |
| కులకము, నాల్గు పద్యములు. | |
రాఘవ. | ఆ+నగారిభోగోన్నతి - ఆ, నగారి = ఇంద్రునియొక్క, భోగోన్నతి = భోగాతిశయమువంటి భోగాతిశయము, వన్నెమీఱుచుండన్, రెండవయాతఁడు = భరతుఁడును, అక్కొండిక లిరువురున్ = ఆతమ్ములిద్దఱును (లక్ష్మణశత్రుఘ్నులు), భక్తియు, భయము, కదురఁగన్, చేరి, కొలుచుచుండన్, గభీరతన్ = గాంభీర్యముచే, పొలుచుచుండు. | |
తా. | రాముఁడు, ఇంద్రభోగము లనుభవించుచు భరతలక్ష్మణశత్రుఘ్నులు తన్నుఁ బరివేష్టింప నుండును. | |
లక్ష్మణ. | అన్నగారి = తిరుపతియొక్క, భోగోన్నతి = భోగాతిశయము, వన్నెమీఱుచుండన్, రెండవయాతండు = రామకృష్ణుఁడు, కొండిక లిరువురును = చిన్నవాండ్రైన లక్ష్మణరాములు, కొల్చుచుండన్, గభీరతఁ బొలుచుచుండును. | |
తా. | అన్నగారైన తిరుపతిని తక్కినమువ్వురును గొలుచుచుండిరి. | |
క. | తన కందమ్ములు నెఱయఁగఁ | 43 |
రాఘవ. | తనకున్ = రామునకు, అందమ్ములు నెఱయఁగన్ = చెలువములు విస్తరించునట్లు, గనుఁగొన = కంటితుద, సిరులీనునట్లు = సంపద లిచ్చునట్లుగ, క్రాలుచునుండున్, పెనుపొందన్, లక్ష్మణాఖ్యుఁడు = లక్ష్మణుఁడను, ఘనమతి = బుద్ధిమంతుఁడు, తోడగుచునుండన్ = జతకాఁగా, నిత్యంబున్ = ప్రతిదినమును. | |
తా. | రామునకు లక్ష్మణుఁడు జతయయ్యెను. | |
లక్ష్మణ. | తనకందమ్ములు = తన నేత్రపద్మములు, నెఱయఁగఁ గనుఁగొనన్ = తేఱిచూడఁగా, సిరులీనునట్లు, లక్ష్మణుఁడను కుమారుఁడు, ఘనమతి = మంచిబుద్ధియే, జోడు = కవచము, అగుచునుండన్ = కాఁగా, నిత్యంబున్ = ప్రతిదినము, క్రాలుచునుండున్ = ప్రకాశించుచుండును. | |
తా. | గోపాలమంత్రి తనయులలోని లక్ష్మణుఁడు (ఈతఁడే యీగ్రంథకర్త లక్ష్మణకవి), తనకు బుద్ధియే కవచముగా వెలుంగుచుండెను. | |
ఉ. | అన్నలసుందరత్వము సమంచితధర్మవిచక్షణత్వసం | 44 |
రాఘవ. | ఆ+నలసుందరత్వము = ప్రసిద్ధమైన నలమహారాజు సౌందర్యమువంటి సౌందర్యమును, ఇక్కడ (ఆ+నల = అన్నల) “ఊష్మరేఫాన్ పరిత్యజ్య ద్విత్వం సర్వహలాం మతం" అనుకారిక వలన ద్విత్వము. సమంచి. .. సంపన్నత - సమంచిత = ఒప్పుచున్న, ధర్మ = ధనుస్సు నుపయోగించుట యొక్క, విచక్షణత్వసంపన్నత = ప్రవీణతయొక్క యతిశయమును, బాహుశక్తి = బాహుబలమున, అత్యున్నతి కెక్కి = మిక్కిలిప్రసిద్ధుఁడై, తనతేజము = తనపరాక్రమము, సముజ్జ్వలతన్ = ప్రకాశమానమై, ఒప్పఁగా, పిన్నలు, పెద్దలు, అందఱును, తన్ను గని, ముద్దు సేయఁగన్, బాలుడు, రాముఁడు, మిక్కిలి, వెలసెను. | |
తా. | నలునిమించిన రూపమున, ధనుర్విద్యావికాసమున, బాహుశక్తిని, ప్రతాపమునఁ, బిన్న పెద్దలు తన్ను, ముద్దు చేయురీతిని రాముఁడు సర్వోత్కృష్టుఁడై యుండెను. | |
లక్ష్మణ. | అన్నల = ముగ్గురన్నలయొక్క, సుందరత్వము = సౌందర్యమును, సమందితధర్మవిచక్షణత్వసంపన్నత = ధర్మము నెఱుంగుటయందలి నేర్పును (న్యాయమును దెలిసికొనుట), బాలుడు, రాముఁడు = రాముఁడను నాలుగవపుత్రుఁడు ప్రకాశించెను. తక్కినవి సమానము. | |
తా. | రాముఁడను గోపాలుని నాల్గవకుమారుఁడు న్యాయాన్యాయవిచారణదక్షుఁడై యెల్లవారికి ముద్దుగ నెగడెననుట. | |
ఉ. | అవ్విధిఁ బుత్రవంతుఁ డగు చయ్య మహీపతియాజ్ఞ నెల్లెడన్ | 45 |
రాఘవ. | అవ్విధిన్ = ఆప్రకారమున, పుత్రవంతుఁడు = పుత్రసంతానముంబొందిన, అయ్య = తండ్రియైన, మహీపతి = దశరథుఁడు, ఆజ్ఞన్ = తనయానతిచే, ఎల్లెడన్ = అన్నితావులను, ఎల్ల నెవ్వగలు = దుఃఖములన్నియు, వీడఁగన్ = పోవునట్లు, నేర్పుమెయిన్ = నైపుణ్యమున, పురిన్ = అయోధ్యలో, ఎల్లవేడుకల్ = సమస్తవినోదములు, నివ్వటిలన్ = జరుగఁగా, వినీతిని = న్యాయమార్గమున, ప్రజాతతిన్ = జనసముదాయమును, రక్షణ మొందఁజేయుచు = కాపాడుచు, ఇట్లు, అవ్వనజాయతాక్షుని కటాక్షమునన్ = నారాయణునిదయవలన, ధృతిన్ = ధైర్యమున, బల్మిన్ = బలమున, ఒప్పుచున్. | |
తా. | సులభము. | |
లక్ష్మణ. | అవ్విధిన్, పుత్రవంతుఁ డగుచున్, అయ్య = జనకుఁ డైనగోపాలమంత్రి, మహీపతియాజ్ఞ = మహీపతిరావుగారియాజ్ఞచే, ఎల్లెడన్, నెవ్వగలెల్ల వీడఁగను, పురిన్ = కుయ్యేరను గ్రామమందు, ప్రజాతతిన్ = జనులను, రక్షణ మొందఁజేయుచు, అవ్వనజాయతాక్షుని కటాక్షమునన్, ఒప్పుచున్. | |
తా. | గోపాలమంత్రి మహీపతిరా వనునధికారిక్రిందఁ గుయ్యరుగ్రామమునందలి జనులను నిర్భాధముగ, వేడుకలు పుట్టునట్లు న్యాయమార్గమున నేర్పునఁ బాలించుచుండెను. | |
క. | తదనంతరంబ సుతులకు | |
| మదిఁ దలఁచి సర్వసమ్మతి | 46 |
టీ. | తదనంతరంబ = పిమ్మట, సుతులకున్ = కొడుకులకు, విదితముగాఁగన్ = ఎల్లవారికిఁ దెలియునట్లు, ఉపనయనవిధి గావింపన్ = వడుగులు చేయుటకు, మదిఁ దలఁచి = ఎంచి, సర్వసమ్మతిన్ = అందఱియిష్టమును గొని, శుభవేళన్ = శుభలగ్నమున, అట్లు గావించెన్ = తాను దలఁచిన ట్లుపనయనములు జేసెను. | |
చ. | అంత. | 47 |
గీ. | రాముఁడును లక్ష్మణుండు గారాముమీఱ | 48 |
రాఘవ. | రాముఁడును లక్ష్మణుండును = రామలక్ష్మణు లిరువురును, ఉన్నవారిద్దఱును = మిగిలిన భరతశత్రుఘ్ను లిద్దఱును, గారాము మీఱన్, కూడి = జతలు గూడి, ఉచితవిద్యలు = వేదము ధనుర్విద్య మొదలైనవిద్యలను, నిజగురునానతిన్ = తమయొజ్జలు చెప్పునట్టు, అధ్యసించుచు = నేర్చుచు, మిక్కిలి పెంపుతోడ, నుండిరి. | |
లక్ష్మణ. | రాముఁడును = నాల్గవకుమారుఁడును, లక్ష్మణుండు = మూఁడవకుమారుఁడును, ఉన్నవారిద్దఱును = తిరుపతి, రామకృష్ణులును, గారాము మీఱ, కూడి = కలసి, ఉచితవిద్యల = తగినవిద్యలను, నిజగురునానతిన్ = తమయుపాధ్యాయులు చెప్పినరీతిని, అభ్యసించుచు, చరింపుచుండిరి. | |
తా. | గోపమంత్రి నలువురుపుత్రులును గూడి సకలవిద్యలు నేర్చుకొనుచుండిరి. | |
క. | తాలిమి సద్విద్యలు గడు | 49 |
రాఘవ. | తాలిమి = ఓర్పు, సద్విద్యలు = మంచినిద్యలు, కడుమేలగు గుణములును = శ్లో. “కార్యం తేజోధృతిర్దాక్ష్యం యుద్ధేచా ప్యపలాయనం, దాన మీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం" అనునట్టి మేలిగుణములను, కలిగి మెలఁగెడు, అగ్గోపాలాంశభవుల = ఆవిష్ణువునంశమున జనించినవారల, ఇనకులపాలకులు = సూర్యకులపాలకులు, అనువాంఛన్ = అనునట్టికాంక్షతో, చూచి, ప్రజ లెంచిరి, (ఒగిన్.) | |
తా. | శాంత్యాదిగుణములు, విద్యలు, గలిగిన నారాయణాంశసంభూతులైన యాసూర్యవంశపురాజపుత్రులను జనులు పొగడిరి. | |
లక్ష్మణ. | తాలిమి, సద్విద్యలు, కడుమేలగుగుణములును గలిగి మెలఁగెడు, అగ్గోపాలాంశభవులన = ఆగోపాలమంత్రి యొక్క యంశమున సంభవులైనవారిని, కులపాలకులను = కులము నుద్ధరించువారిని, ప్రజలు, వాంఛన్ = కోరికతో, చూచి, ఒగిన్, ఎంచిరి. | |
తా. | సద్గుణములు సద్విద్యలుగల గోపాలమంత్రి పుత్రులను జనులు వంశవర్ధను లని యెంచిరి. | |
వ. | తదనంతరంబ. | 50 |
సీ. | స్థిరపరభాద్రికౌశికుఁ డయ్యజనరక్ష | |
| తా నహల్యను జాతదయ శుద్ధినొంది యా | |
గీ. | నంత నాతండ్రి తనపెద్దయాత్మజునకు | 51 |
రాఘవ. | స్థిరపరభాద్రి - స్థిర = స్థిరమైన, పర = శ్రేష్టమైన, భా = కాంతిచేతను, అద్రి = సూర్యుఁ డైన, “రవిరద్రిరవిర్హేళిః" అని యమరశేషము. కౌశికుఁడు = విశ్వామిత్రుఁడు, అయ్యజనరక్షకై = ఆయజ్ఞమును రక్షించుటకై, నియోగింపన్ = నియమింపఁగా, తదగ్రసూతి = ఆదశరథుని పెద్దకొడుకైనరాముఁడు, సుందరమణిన్ - సుంద = సుందుఁడను రాక్షసుని, రమణిన్ = భార్యయైనతాటకను, సుబాహు = సుబాహుఁడరు రాక్షసుని, తక్కుఁగలవారి = మిగిలిన రాక్షసులను, నిజవిద్యన్ = తనవిలువిద్యచేతను, తగుశిక్ష నెరయఁజేసి = తగినశిక్ష యొనర్చి (చంపి), తాన్ = తాను, అహల్యను = అహల్యాదేవిని, జాతదయన్ = పుట్టినదయతో, శుద్ధినొంది = పవిత్రురాలై, ఆత్మవరసౌఖ్యంబు నొందఁగన్ = తనపెనిమిటితోడిసుఖములను పొందునట్లు, ఒనర్చి = చేసి, సకలజనుల్, మెచ్చ, సంప్రీతితోడుత, ఉగ్రధర్మము = శివధనుస్సును, అడంచి = విఱిచి, ఒప్పుమీఱన్, అంత = అంతట, ఆతండ్రి = దశరథుఁడు, తనపెద్దయాత్మజునకున్ = తనపెద్దకొడుకునకు (రామునకు), నేలబొట్టె నిచ్చుట = భూపుత్రికయైన సీత నిచ్చుట, ఇఁక నిజము, పెండ్లికి, ఏతెండు = రండు, అటంచును = అని చెప్పుచు, పిల్వవచ్చినట్టివారలను = పిల్వవచ్చినవారలను, మన్నించి = గౌరవించి, ఆదరించె. | |
తా. | రాముఁడు విశ్వామిత్రునియాగమును రక్షించుటకై చని తాటకను సుబాహుఁడు మొదలైన రాక్షసులను జంపి అహల్యను రాతిరూపమునుండి నాతిం జేసి శివునివిల్లు విఱిచినందున సీతను రామునకుఁ బెండ్లి సేసెదము రమ్మని పిలువవచ్చిన జనకరాజుపక్షమునారిని దశరథుఁ డాదరించెను. | |
లక్ష్మణ. | స్థిర... కౌశికుఁడు - స్థిర = స్థిరమైన, పరభా = శత్రుతేజమును, అద్రి = పర్వతములకు, కౌశికుఁడు = ఇంద్రుఁ డైన, “మహేంద్రగుగ్గులూలూకవ్యాళగ్రాహిషుకౌశికః” అమరము, అయ్య = తండ్రి, జనరక్షకై = పాలనమునకు, నియోగింపన్ = ఏర్పఱచుటకు, సుందరమణిన్ = సుందరులలో శ్రేష్ఠుడును, సుబాహున్ = మంచిబాహువులు గలిగినవాఁడునైన, తదగ్రసూతి = ఆనలుపురుపుత్రులలోఁ బెద్దవాడైన తిరుపతిని, తక్కుఁగలవారిన్ = తక్కిన ముగ్గురను, నిజవిద్యన్ = తననియోగవిద్యయందు, తగుశిక్షణ = తగినయుపదేశము చేసి, తాన = తానే, హల్యనుజాతదయన్ - హలి = బలరాముని, అనుజాత = తమ్ముఁడైన శ్రీకృష్ణుని, దయన్ = దయచే, శుద్ధినొంది = పవిత్రుఁడై, ఆత్మ = మనస్సును, వరసౌఖ్యంబు నొందఁగ నొనర్చి = శ్రేష్ఠసుఖములను బొందింప నెంచి, ఉగ్రధర్మము = తీష్ఠ మైన ధర్మమును, అడంచి = విడిచి, అంతన్, ఆతండ్రి తన పెద్దయాత్మజునకు, సొంపుతో నేలన్ = చక్కఁగాఁ గాపురము చేయుటకు, బొట్టె నిచ్చుట నిజము = మాబిడ్డ నిచ్చుట సత్యము. ఇంకఁ బెండ్లి కేతెండటంచునుఁ బిల్వవచ్చినట్టివారల మన్నించి యాదరించె. | |
తా. | గోపాలమంత్రి తాను దైవధ్యానమున మనస్సునకు సుఖపెట్టదలఁచి పెద్దకుమారునకుఁ దక్కినవారికిని, తన ప్రజాపాలనభారము నీయ నిశ్చయించుకొని యుండఁగా, పెద్దకొడుకు తిరుపతిమంత్రి కొకరు కన్నె నిచ్చెద మని చెప్పవచ్చిరి. | |
వ. | అట్లాదరించిన యతండు తత్కన్య కావృత్తాంతం బాత | 52 |
| అర్థము తాత్పర్యము రెండుపక్షముల సమానము సులభము. | |
ఉ. | భూమి జనించి మించువిరిఁబోణులలో నుతిగాంచినట్టియ | 53 |
రాఘవ. | భూమి జనించి = భూమిలోఁ బుట్టి, మించువిరిఁబోణులలో = మెఱపుయొక్కయు పుష్పములయొక్కయుఁ గాంతిగలిగిన స్త్రీలలో (మించుఁబోణులు - విరిఁబోణులలో), కచ్ఛపప్రపదభాగయునున్ - కచ్ఛప = తాఁబేళ్లవంటి, ప్రపదభాగయు = మీగాళ్లుగలదియు, మకరేంద్రజంఘయున్ = శ్రేష్ఠమైన మొసళ్ల వంటి పిక్కలుగలదియు, కోమలశంఖకంఠియును = సుందరమైన శంఖమువంటికంఠము గలదియు, కుందరదాళియున్ = మొల్లమొగ్గలవంటి దంతపఙ్క్తి గలదియు, పద్మవక్త్ర = పద్మమువంటి ముఖము గలదియు, దీప్తామలనీలవేణియున్ = ప్రకాశించెడు చక్కనినల్లనిజడ గలదియు, వరాంగియున్ = శ్రేష్ఠావయవములుగలదియునై, నిధిరీతిన్ = నవనిధులవలె, ఒప్పఁగన్, నిధి యనుటచే భూమిలోఁ బుట్టినదనియు, కచ్ఛప, మకర, శంఖాదులగునవవిధులరీతి నున్నదనియు ధ్వనించుచున్నది. | |
తా. | (సీత) భూమిలో పుట్టి, యందఱుస్త్రీలను మించి, సర్వాంగసుందరియై యున్నది. | |
లక్ష్మణ. | భూమి జనించి మించు = భూలోకమునం బుట్టి యతిశయించిన, విరిబోణులలోన్ = స్త్రీలలో, ప్రసిద్ధికెక్కినకన్యయై యున్నది. తక్కినది | |
తా. | తిరుపతన్న కిచ్చెదమన్నకన్యక లోకములో నున్న యువిదలలో నెన్నికయైనది యనుట. | |
చ. | గొనకొని పెండ్లికూతుజనకుండు వివాహము సేయఁగోరి పూ | |
| గను శివధర్మమున్ గుణము గైకొని యాశ్రుతిమార్గవర్తనం | 54 |
రాఘవ. | నొనకొని = ఆరంభించి, జనకుండు = జనకమహారాజు, తనకూఁతున్ = జానకిని, వివాహము సేయఁగోరి, మున్ను = పూర్వము, ఒగిన్ = క్రమమున, అనేకతరంబులనుండి = తరతరములనుండి, తమయింట = తమగృహమున, పూజ్యతంగను = పూజింపఁబడుచున్న, శివధర్మము = శివధనుస్సును, గుణము గైకొని = నారిని గ్రహించి, ఆశ్రుతిమార్గవర్తనం బొనరఁగఁ దాల్చునట్టి = ఆకర్ణాంతము దిగదీసిన, పురుషోత్తముతోన్ = పురుశశ్రేష్ఠునితో (విష్ణ్వంశగలవానితో), తనకూఁతున్, కూర్పఁగన్, పూనె = ప్రతిజ్ఞ చేసెను. | |
తా. | జనకుఁడు తనయింటనున్న శివునివి ల్లెవ్వ రెక్కుపెట్టెదరో వారికి నాజానకి నిచ్చెదనని ప్రతిజ్ఞ చేసెను. | |
లక్ష్మణ. | పెండ్లికూతుఁన్ = కన్యను, జనకుండు = తండ్రి, వివాహము సేయఁగోరి, తమయింటన్, మున్నొగిన్, ఆనేకతరంబులనుండి = బహుతరంబులనుండి, పూజ్యతంగను = ఆవరించబడుచు వచ్చిన, శివధర్మమున్ = శుభాచారమును, గైకొని = స్వీకరించి, ఆ = ప్రసిద్ధమైన, శ్రుతిమార్గవర్తనంబు = వేదమార్గప్రవర్తనమును, ఒనరఁగ దాల్చునట్టి = విడువకుండఁ బూనునట్టి, పురుషోత్తముతోన్ = మంచిపురుషునితో, తనకూఁతున్, కూర్పఁగ = పెండ్లిచేయవలయునని, పూనెన్ = యత్నించెను. | |
తా. | తనయింట ననుగతమై వచ్చుచున్న యాచారప్రకారము వేదోక్తాచారవర్తకుఁ డైన యొక్కచక్కనిపురుషునకుఁ దనబిడ్డ నీయవలయునని పెండ్లికూఁతుతండ్రి యత్నము చేసెను. | |
వ. | అట్లు పూని యున్నంత. | 55 |
క. | ధరణివరు లెందఱేనియు | |
| త్తురు తజ్జనకుఁడు సెప్పిన | 56 |
రాఘవ. | ధరణివరులు = రాజులు, ఎందఱేనియున్ = ఎందఱైనను (అనేకులు), అరుదుగన్ = ఆశ్చర్యముగ, తత్కన్యన్ = సీతను, పెండ్లియాడుటకై వత్తురు. తజ్జనకుఁడు = సీతతండ్రి, చెప్పినసరణిన్ = చెప్పినచొప్పున, మెలగంగ వర్తించుటకు (వి ల్లెక్కుపెట్టుటకు), అనయముగా, ఒకఁడుఁ జాలఁడు = ఒక్కఁడును దగినవాడు కాఁడయ్యెను. (సమర్థుఁడు లేఁడు.) | |
తా. | ఎంతమంది రాజులో వత్తురుగాని వి ల్లెక్కుపెట్టుట యొక్కనికిని సాధ్యముగా దయ్యెను. | |
లక్ష్మణ. | ధరణిన్ =భూమియందు, వరులు = పెండ్లికొడుకులు, ఎందఱేనియున్ =ఎంతమందియో, అరుదుగఁ దక్కన్యఁ బెండ్లియాడుటకై, వత్తురు. కాని, తజ్జనకుడు సెప్పినసరణిన్ మెలఁగంగన్, ఒకఁడున్, చాలఁ డనయమున్. | |
తా. | ఎంతమంది పెండ్లికొడుకులైన వచ్చెదరు గాని యాకన్యతండ్రి చెప్పినట్లు, వేదమార్గప్రవర్తకుఁ డొకఁడును లేకపోయెను. | |
వ. | అట్లప్రాప్తమనోరథుండై యుండఁ గొంతకాలం బరిగె నంత | 57 |
| రెంటికి స్పష్టము. | |
క. | అతనికి నభిరతిఁ దోఁచెన్ | 58 |
రాఘవ. | అతనికిన్ = ఆజనకమహారాజునకు, అభిరతిన్ = ఆసక్తిచేత, జతయై యొప్పారు మీసుసంతతితోన్ = జంటలై యున్న మీపుత్రులతో, అంచితసంబంధము గలుగన్ = ఒప్పుచుండెడు సహవాసము గలుగుటకు, గురుతరా = | |
పుట:Lanka-Vijayamu.pdf/71 పుట:Lanka-Vijayamu.pdf/72 పుట:Lanka-Vijayamu.pdf/73 పుట:Lanka-Vijayamu.pdf/74 పుట:Lanka-Vijayamu.pdf/75 పుట:Lanka-Vijayamu.pdf/76 పుట:Lanka-Vijayamu.pdf/77 పుట:Lanka-Vijayamu.pdf/78 పుట:Lanka-Vijayamu.pdf/79 పుట:Lanka-Vijayamu.pdf/80 పుట:Lanka-Vijayamu.pdf/81 పుట:Lanka-Vijayamu.pdf/82 పుట:Lanka-Vijayamu.pdf/83 పుట:Lanka-Vijayamu.pdf/84 పుట:Lanka-Vijayamu.pdf/85 పుట:Lanka-Vijayamu.pdf/86 పుట:Lanka-Vijayamu.pdf/87 పుట:Lanka-Vijayamu.pdf/88 పుట:Lanka-Vijayamu.pdf/89 పుట:Lanka-Vijayamu.pdf/90 పుట:Lanka-Vijayamu.pdf/91 పుట:Lanka-Vijayamu.pdf/92 పుట:Lanka-Vijayamu.pdf/93 పుట:Lanka-Vijayamu.pdf/94 పుట:Lanka-Vijayamu.pdf/95 పుట:Lanka-Vijayamu.pdf/96 పుట:Lanka-Vijayamu.pdf/97 పుట:Lanka-Vijayamu.pdf/98 పుట:Lanka-Vijayamu.pdf/99 పుట:Lanka-Vijayamu.pdf/100 పుట:Lanka-Vijayamu.pdf/101 పుట:Lanka-Vijayamu.pdf/102 పుట:Lanka-Vijayamu.pdf/103 పుట:Lanka-Vijayamu.pdf/104 పుట:Lanka-Vijayamu.pdf/105 పుట:Lanka-Vijayamu.pdf/106 పుట:Lanka-Vijayamu.pdf/107 పుట:Lanka-Vijayamu.pdf/108 పుట:Lanka-Vijayamu.pdf/109 పుట:Lanka-Vijayamu.pdf/110 పుట:Lanka-Vijayamu.pdf/111 పుట:Lanka-Vijayamu.pdf/112 పుట:Lanka-Vijayamu.pdf/113 పుట:Lanka-Vijayamu.pdf/114 పుట:Lanka-Vijayamu.pdf/115 పుట:Lanka-Vijayamu.pdf/116 పుట:Lanka-Vijayamu.pdf/117 పుట:Lanka-Vijayamu.pdf/118 పుట:Lanka-Vijayamu.pdf/119 పుట:Lanka-Vijayamu.pdf/120 పుట:Lanka-Vijayamu.pdf/121 పుట:Lanka-Vijayamu.pdf/122 పుట:Lanka-Vijayamu.pdf/123 పుట:Lanka-Vijayamu.pdf/124 పుట:Lanka-Vijayamu.pdf/125 పుట:Lanka-Vijayamu.pdf/126 పుట:Lanka-Vijayamu.pdf/127 పుట:Lanka-Vijayamu.pdf/128 పుట:Lanka-Vijayamu.pdf/129 పుట:Lanka-Vijayamu.pdf/130 పుట:Lanka-Vijayamu.pdf/131 పుట:Lanka-Vijayamu.pdf/132 పుట:Lanka-Vijayamu.pdf/133 పుట:Lanka-Vijayamu.pdf/134 పుట:Lanka-Vijayamu.pdf/135 పుట:Lanka-Vijayamu.pdf/136 పుట:Lanka-Vijayamu.pdf/137 పుట:Lanka-Vijayamu.pdf/138 పుట:Lanka-Vijayamu.pdf/139 పుట:Lanka-Vijayamu.pdf/140 పుట:Lanka-Vijayamu.pdf/141 పుట:Lanka-Vijayamu.pdf/142 పుట:Lanka-Vijayamu.pdf/143 పుట:Lanka-Vijayamu.pdf/144 పుట:Lanka-Vijayamu.pdf/145 పుట:Lanka-Vijayamu.pdf/146 పుట:Lanka-Vijayamu.pdf/147 పుట:Lanka-Vijayamu.pdf/148 పుట:Lanka-Vijayamu.pdf/149 పుట:Lanka-Vijayamu.pdf/150 పుట:Lanka-Vijayamu.pdf/151 పుట:Lanka-Vijayamu.pdf/152 పుట:Lanka-Vijayamu.pdf/153 పుట:Lanka-Vijayamu.pdf/154