రేఫఱకారనిర్ణయము
శుభమస్తు
శ్రీమతేరామానుజాయనమః
రేఫఱకారనిర్ణయము
[తాళ్లపాక అన్నమాచార్యులకుమారుండు తిరుమలయ్యంగారు కవిత్రయము మొదలైన పూర్వకవీశ్వరుల ప్రబంధాలలోని రేఫఱకారా లేర్పఱచి లక్షణగ్రంథముగా నానతిచ్చిన రేఫఱకారారపద్యాలు.]
క. | శ్రీ వేంకటేశ నీకుం, గావించెద నంకితంబుగా ఱారేఫల్ | 1 |
క. | అచ్చులు హల్లులు వరుసన, వచ్చిన రేఫలును ఱాలు వర్ణించెద మున్ | 2 |
క. | ఇచ్చిరి తెచ్చిరి యనియెడి, యచ్చతెలుంగులఁ గ్రియాపదాంతంబులపై | 3 |
క. | ఇల ఘోషాక్షరములపైఁ, గలుగవు తెలుఁగునను ఱాలు కడఁగును రేఫల్ | 4 |
క. | ఎఱుక యిర వనుట మొదలగు, మొఱసెడి యెత్వములు నిత్వములు తెలుఁగున నేఁ | 5 |
క. | అరి యనఁగ నప్పనం బగు,...............................గ న్ననఁగా | 6 |
క. | ఆరసి చల్లారఁగఁ గ, న్నారఁగ నా రెండు ననఁగ నారఁగ ధర్మం | 7 |
క. | ఆరెకులనఁగాఁ దలవరు, లారాటము నారటంబు నారయ నట పొం | 8 |
క. | ఇర యనఁగ నెలవు చెప్పుట, యిరువురు నిరువది యని రవు నిరవారంగా | 9 |
క. | ఈరికెలొత్తె మనంబున, నీరస మీరెలుఁగు దాన మీరి యనంగా | 10 |
క. | ఉరులొడ్డి యురులఁద్రోయుట, యురవడితో నురవణించు టొత్తుట డెందం | 11 |
క. | ఊరకయుండుట యనఁగా, నూరార్చుట యనఁగ దుఃఖ ముడుపుట భువిలో | 12 |
క. | ఎరుగలి చిచ్చున నెరియఁగ, నెరగా నాహార మనఁగ నేరికిఁ జిత్తం | 13 |
క. | ఒరు లోరసేసి రన మి, న్నొరయంగా నోరలేక యోరీ యౌరా | 14 |
క. | కర మిష్టము కరణియనం, గరువునఁ బోసిరి యనంగఁ గరఁగి రనంగాఁ | 15 |
క. | కో రప్పన మనఁగాఁ జే, కూరుటయనఁ దక్కి రనఁగఁ గోరుట యనఁగాఁ | 16 |
క. | కో రనఁగ గిన్నె యమ్ములు, కూరంగా నాటె ననఁగఁ గురిసెను వానల్ | 17 |
క. | కారుకొనె మొగులు శత్రులు, గా రనఁగాఁ దాఁకి రనఁగఁ గరువలి యనఁగాఁ | 18 |
క. | కరికరిఁ గరమొప్పఁగఁ దొ, ల్కరివాన లనంగఁ గెరలి కరకరఁ గాలన్ | 19 |
క. | కూరలు గాయ లనంగాఁ, గారాటము తోడ నొకరిఁ గరిఁ గోరి రనన్ | 20 |
క. | గారవము గలిగె గరువము, గారా మన మ్రగ్గి రనఁగ గరునడి యన బం | 21 |
క. | గురువు లన గతివిశేషము, గరుత్రాల్చెను మే ననంగఁ గడఁగి రనంగా | 22 |
క. | గురుసులఁ గూడంగా వే, గిరపడి జేగురున గోర గిరగిర వ్రాయన్ | 23 |
క. | చేరువఁ దెచ్చిరి చెచ్చెరఁ, జేరిరి యచ్చెరువు చొరగఁ జెరువుట చీరల్ | 24 |
క. | చిరుఁగని చీరలతో వ, చ్చిరి యచ్చర లనఁగ జరగి జీరలఁ దగని | 25 |
క. | తరిచాడె తరువ తరమిడి, తిరుగుట తిరియుటయుఁ దిరము తెరలుట తెరువున్ | 26 |
క. | తోరంబు తెరయుఁ దొరుగుట, తేరా భూషణము లనఁగఁ దెకతేరయు నే | 27 |
క. | తర మెంచక చనుదెంతురు, తొరలినఁ బలుతెరఁగు లందుఁ దూరుపుదెస వ | 28 |
క. | తెరలంగాఁగిననెయి క, స్తురివంటిది మంచి దనఁగఁ దొలితొలి కడుఁ జి | 29 |
క. | దరికొని కుదురుగఁ జూదరి, దొర దొరకో ల్దురము నెదురు దురపిల్లుట యున్ | 30 |
క. | దొరకొన్నయపుడె చెంతకు, దొరకొల్పుట మే లనంగ దూరులు వల్కన్ | 31 |
క. | నేరిమి సరములు నరలును, నారలు నోరెత్తి నీరు నారసమును గ | 32 |
క. | నేరేడు పండ్లు నెరసులు, నేరుపుతో వింటినారి నిగిడింపుచు ను | 33 |
క. | పరఁగఁ బరికింపఁ బరువడి, పురు డీ డగు సూతకంటు పురు డగుఁ బరిమా | 34 |
క. | పొరిఁబొరిఁ బరుసనఁ బొరిగొని, పురఁబురఁ బొక్కంగఁ బెరుగు పొంపిరివోవన్ | 35 |
క. | పరిగొని పరిచనుదెంచుట, పరువము పెనుపరియు నేరుపరి పురిగొలుపన్ | 36 |
క. | పోరితము పోరు పిరిగొనఁ, బే రన నామంబు తేనెపెర పేరురమున్ | 37 |
క. | పరువుగలచోటఁ బరువులు, పరుసములును బెరడు బద్దపరి పరిగోలల్ | 38 |
క. | పేరిననేతికినై కడుఁ, బోరాటము లేల వలదు పోరా యనినన్ | 39 |
క. | బూరటిల బారిసమరెన్, బోరగిలం బరవసంబు బోరని మ్రోసెన్ | 40 |
క. | బురజ లనంగా గజ్జెలు, బిరుదులు పాదములఁ గట్టి పెట్టఁగవలె నా | 41 |
క. | మురిసెం దొండము దంతికి, మరలుట మరిగించి కొనుట మది మెరతొర సు | 42 |
క. | మేరలు దప్పిన శత్రుల, మారిమసంగుటలు మొరడు మరియాద యగున్ | 43 |
క. | మురియ లనంగాఁ దునియలు, మిరియము లని పల్కుచోట మెలఁతల మనముల్ | 44 |
క. | మురిపెముతో నిలిచెను గ్ర, మ్మర మారట విగ్రహంబు మది వేమారున్ | 45 |
క. | రూపించి రేయు రచ్చయు, రూపును రమ్మనుట రచ్చ రోయక రెండున్ | 46 |
క. | రాయంచ రిత్త రక్కసి, రాయుచు రాయుటయు రాడు రాచూలి యనన్ | 47 |
క. | రారు రమణ నటు రోఁజుచు, రారా రాగిల్లి రమ్ము రాసి యొకటనే | 48 |
క. | వారించుట యెవ్వరికిన్, వారికి వారకము విరులు వారక యొసఁగన్ | 49 |
క. | వరటము వరువు ళ్లేవురు, విరియుట యున్ వరుస వెరవు విరవిర మనఁ గా | 50 |
క. | వారకుల నెక్కి యార్వురు, వేరము తలవరులు వెరసు విరియం జల్లెన్ | 51 |
క. | శరబడి సేసిరి సైరణ, సురిగితి రన సరియ నంగ సూరె లనంగన్ | 52 |
క. | సురియలు సోరణగండ్లును, సొరిదిన్ వేసరుల నెక్కి సొరటా సారెల్ | 53 |
క. | మోహరము చొచ్చి యెడనెడ, నోహరి గా మలసి మలసి యొక్కొక్క దెసన్ | 54 |
క. | పుట్టిరి తిట్టిరి కూలిరి, నెట్టన భూపాలు రనఁగ నెయ్యురు లేరే | 55 |
పెద్దఱాలు
క. | అఱవఱలై యఱకట ను, క్కఱ యఱిముఱి యఱచు ననఁగ నఱువుడు జోళ్లే | 1 |
క. | అఱపొఱఁడు గుజ్జు రూపఱ, నఱపులు బిట్టఱ యనంగ నఱచితి కింగా | 2 |
క. | అఱ లేనివాని కఱుగును, అఱకాలం దన్నుఁ దన్ని యఱుకమ్ముట నా | 3 |
క. | ఆఱడి యన నడలాఱఁగ, నాఱంపులు నాఱుచవులు నాఱనితేజం | 4 |
క. | ఇఱికొని యిఱులు కొనఁగా, నిఱికిట మిఱు చన్నుఁగవయు నిఱమి యనం గ్రి | 5 |
క. | ఉఱవుగ సేనలమీఁదట, నుఱుకుడుఁ బడ మూఱి మెట్టి యుఱుముచు నేన | 6 |
క. | ఉఱఁడనఁ గైకొనఁ డను నది, యుఱున ట్టేవంబె యీగి యూఱడిలంగా | 7 |
క. | ఎఱచి యన మాంస మేఱులు, నెఱగుట వందనము దిగుట యెఱ మం టనఁగా | 8 |
క. | ఒఱవ శరీరము మన్మథు, నొఱుపుల నొఱిగాల నుండి యొఱగె ననంగా | 9 |
వ. | కవర్గువు. | |
క. | కఱపె ననఁగ నేర్చుట య, క్కఱపడి క్రిక్కిఱిసి వేడ్క కాఱులు వెస ను | 10 |
క. | కఱపించుఁ గఱచుఁ బండ్లను, గఱపెడి ననఁ గఱచు ననఁగఁ గల వవి నేర్పుల్ | 11 |
క. | కొఱమాలి కొఱత వడినను, గఱవుం గొఱ గాదు కొఱవి కాఱియఁ బెట్టన్ | 12 |
క. | కుఱుగలి యనఁ జేర్పనఁ బడుఁ, గొఱలుట యనఁ బూర్ణ మగుట కోఱలు వచ్చెన్ | 13 |
క. | కుఱుచనఁ గాఱెడు ననఁగాఁ, గొఱపము కాఱడవి కొఱడు కుఱుమా పనఁగాఁ | 14 |
క. | కఱ లేని కందుచే కుఱుఁ, గఱు కెక్కినపింజ వింజ గఱచి కొఱుకుటల్ | 15 |
క. | గిఱుపుట గుఱుకొని గొఱియల, గిఱిగొనఁ గన్గిఱిపి పగఱ గీఱినగుఱుతున్ | 16 |
క. | గిఱుఁ జెప్పులతో డగ్గఱి, గుఱిచి యనఁగఁ గూర్చి యనుట గుఱుగుఱ్ఱనుచున్ | 17 |
క. | చెఱుచు నది యనఁగఁ గ్రచ్చఱ, చఱు కనఁ బెడచేతఁ జఱచు చఱిఁ జిఱుముట చి | 18 |
క. | చెఱ నునుచుట చెఱు నమయుట, చుఱుపుచ్చుట చెఱకు విల్లు చూఱ విడుచుటల్ | 19 |
క. | చఱిగొనె ననఁ జలమగు ము, చ్చిఱుట య ముచ్చటయుఁ జెఱఁగు చీఱుట యనవా | 20 |
క. | జఱిగొని యొకచో జాజఱ, జఱజఱ నొకజెఱ్ఱిపోతు జాఱె ననంగా | 21 |
క. | తఱిగొని నడవఁగ దఱుముచు, దొఱఁగువడుట తొఱఁగె ననుట తూఱుచుఁ బనులన్ | 22 |
క. | తఱియగుఁ దఱ చగునత్తఱి, తెఱవలు వాతెఱలు దెఱచి తెఱపి గనుట యే | 23 |
క. | తెఱగినతావియు నిడుమల, తొఱగమిఁ గడుఁ దుఱగలింపఁ దుదఁగలుపంబున్ | 24 |
క. | తుఱుము తుఱిగొనియె ననఁగాఁ, తఱిగె ననఁగఁ దక్కువనుట తలపోయంగాఁ | 25 |
క. | తఱిమి యని నేసె ననఁగాఁ, దఱియం జాఱు మనఁగఁ దలలు దఱగెద రనఁగాఁ | 28 |
క. | తెఱగొప్పఁ గన్ను దెఱవఁగఁ, దెఱ గన్నన దూఱె ననఁగఁ దీఱుదు రనఁగాఁ | 27 |
క. | దఱకె నన వెలితి యగుముం, దఱ యన నొకకాల వాచి తన యెదుఱను ముం | 28 |
క. | ఇందఱ మిద్దఱు చెదఱుట, యెందఱు కొందఱు ననంగ నే దిఱ యనఁగా | 29 |
క. | నెఱి నెఱయ నెఱసి నఱికిన, నెఱి దప్పం బడియె ననఁగ నెఱమంటలు నా | 30 |
క. | నెఱకులె యమ్ములు నఱుమై, నుఱుముగ నఱుమాడె నంత నుఱుమాడె ననన్ | 31 |
క. | నూఱుపదు లనఁగ నెఱుసన, నీఱు పయిం గవిసి యున్న నిప్పు లనంగా | 32 |
క. | నెఱి లేనిసఖుం డె మ్మెలు, నెఱపఁగ నెఱనారసంబు నీఱుగఁ జేయన్ | 33 |
క. | నెఱి చెడక నెఱిక గట్టుట, నెఱవాదులు నఱువు దుడిచి నెఱి మొగ మనఁగా | 34 |
క. | పఱచె నన వేగఁ బోవుట, పఱపెదఁ బఱపితి ననంగ బడిఁదోలు టగున్ | 35 |
క. | పిఱికి తనంబడు.....నం, పఱ కోపక పఱియ లగుచుఁ బఱిమార్చె ననన్ | 36 |
క. | పెఱమూకలు పెఱచేతను, బఱిపఱియలు సేయు టనఁగఁ బఱివోయె ననం | 37 |
క. | పెఱిగినచందము చూపఱ, బిఱిదికిఁ బాఱెడుననంగఁ బిఱుదు లనంగన్ | 38 |
క. | పాఱించు నాజి నెడతెగఁ, బాఱుట జలమెల్ల నింకఁ బాఱుట యనఁగాఁ | 39 |
క. | పెఱికితిఁ గొండలు పెంపఱఁ, బొఱ యన గఱుపాఱె ననఁగఁ బొఱతెగె ననఁ దె | 40 |
క. | పఱవఁగ ననఁ బ్రవహించుట, పఱవుపయిం బాట్లఁ బఱచి పఱిపఱియలు గాఁ | 41 |
క. | బిఱువోవుచుఁ గదనంబున, బిఱబిఱ గద ద్రిప్పి వైవఁ బేర్కొని యది ద | 42 |
క. | మఱచిన మజవక మఱియును, మెఱయునెడన్ మెఱసి మఱపు మిఱుమిట్లుగొనన్ | 43 |
క. | ముఱిముఱి చీఁకటి గ్రమ్మఱి, మఱుఁగున విహరించి మఱఁది మాఱుమొగము ప | 44 |
క. | మెఱుఁగును మేఘము మఱతురు, మఱుచునొకో మొఱకి యింకమాఱట నోళ్లన్ | 45 |
క. | మా ఱేడగు నాతఁడు వే, మాఱును గునియంగ నేల మచ్చిక తోడన్ | 46 |
క. | మెఱములు వైచుచు మెఱసియు, మొఱుఁగుచు ముఱుమొండె మనఁగ మొఱలిడి రనఁగా | 47 |
క. | మఱ లేక పెక్కు మాఱులు, మఱునాఁ డన మాఱుపడుట మైమఱువు లనన్ | 48 |
క. | వఱలఁగ ననుటయ వేడుక, వెఱవఱ వెఱచఱవ విల్లు విఱుగఁగ ననిఁ దా | 49 |
క. | వఱడులు గూసెను వేఱొక, నఱతం ద్రోవంగ వెఱచి వఱలివెఱుఁగుతో | 50 |
క. | సుఱ సుఱ యని యెడిచోటను, సొఱసొచ్చుట యనుట ఱాలు చొప్పడె నిటపై | 51 |
ఆ. | ఱట్టు ఱవికె ఱంకు ఱాయి ఱిక్కించుట, ఱేపు ఱేవు ఱేను ఱేసి ఱెక్క | 52 |
గీ. | క్షీరనీర విభేదంబు చేసినట్లు, ధరణి రేఫఱకారముల్ తాళ్లపాక | |
శ్రీకృష్ణార్పణమస్తు.
[యథామూలముగా ముద్రింపఁబడినది. ఈ నిర్ణయమునకు నిప్పటివ్యవహారమునకును బలుచోట్ల భేదము గలదు.]