రావమ్మ మహలక్ష్మి రావమ్మా

ఉండమ్మా బొట్టు పెడతా! (1968) సినిమా కొసం దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన పాట.

పల్లవి:

రావమ్మా! మహలక్ష్మి రావమ్మా(2)

ఈ కోవెల నీ యిల్లు కొలువై ఉందువుగాని (2)

కొలువై ఉందువుగాని కలుముల రాణి

రావమ్మా! మహలక్ష్మి రావమ్మా, రావమ్మా

కృష్ణార్పణం.


చరణం:

గురివింద పొదకింద గొరవంక పలికే

గోరింట కొమ్మల్లో కోయిల్లు కులికే | గురివింద |

తెల్లారి పోయింది పల్లె లేచింది (2)

పల్లియలో ప్రతి యిల్లు కళ్ళు తెరిచింది

రావమ్మా! మహలక్ష్మి రావమ్మా, రావమ్మా

కృష్ణార్పణం.


చరణం:

కడివెడు నీళ్ళు కల్లాపిజల్లి గొబ్బిళ్ళో గొబ్బిళ్ళో

కావెడు పసుపు గడపకు పూసి గొబ్బిళ్ళో గొబ్బిళ్ళో |కడివెడు |

ముత్యాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిళ్ళో గొబ్బిళ్ళో

రతనాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిళ్ళో గొబ్బిళ్ళో | రతనాల|

రావమ్మా! మహలక్ష్మి రావమ్మా, రావమ్మా

కృష్ణార్పణం.


చరణం:

పాడిచ్చే గోవులకు పసుపు కుంకం

పనిచేసే బసవనికి పత్రీ పుష్పం | పాడిచ్చే |

గాదుల్లో ధాన్యం, కావిళ్ళ భాగ్యం (2)

కష్టించే కాపునకు కలకాలం సౌఖ్యం

కలకాలం సౌఖ్యం

రావమ్మా! మహలక్ష్మి రావమ్మా, రావమ్మా

ఈ కోవెల నీ యిల్లు కొలువై ఉందువుగాని

కొలువైవుందువు గాని కలుముల రాణి

రావమ్మా! మహలక్ష్మి రావమ్మా, రావమ్మా

కృష్ణార్పణం.