రామచంద్రుడితడు రఘువీరుడు
రామచంద్రుడితడు రఘువీరుడు
కామిత ఫలములీయ గలిగెనిందరికి
గౌతము భార్యపాలిటి కామధేనువితడు
ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము
సీతాదేవి పాలిటి చింతామణి యితడు
యీతడు దాసుల పాలిటి యిహపర దైవము
పరగసుగ్రీవుపాలి పరమ బంధువితడు
సరిహనుమంతుపాలి సామ్రాజ్యము
నిరతి విభీషణునిపాలి నిధానము యీతడు
గరిమజనకు పాలి ఘనపారిజాతము
తలప శబరిపాలి తత్వపు రహస్యము
అలరిగుహునిపాలి ఆదిమూలము
కలడన్నవారిపాలి కన్నులెదుటి మూరితి
వెలయ శ్రీవేంకటాద్రి విభుడితడు
Raamachamdruditadu raghuveerudu
Kaamita phalamuleeya galigenimdariki
Gautamu bhaaryapaaliti kaamadhaenuvitadu
Ghaatala kausikupaali kalpavrkshamu
Seetaadaevi paaliti chimtaamani yitadu
Yeetadu daasula paaliti yihapara daivamu
Paragasugreevupaali parama bamdhuvitadu
Sarihanumamtupaali saamraajyamu
Nirati vibheeshanunipaali nidhaanamu yeetadu
Garimajanaku paali ghanapaarijaatamu
Talapa Sabaripaali tatvapu rahasyamu
Alariguhunipaali aadimoolamu
Kaladannavaaripaali kannuleduti mooriti
Velaya sreevaemkataadri vibhuditadu
రామచంద్రుడితడు = రామచంద్రుడు ఇతడు
రఘువీరుడు = రఘు వంశానికి చెందిన వీరుడు
కామిత = కోరుకున్న
ఫలములీయ = ఫలములివ్వ
గలిగెనిందరికి = గలిగెను + ఇందరికి
గౌతము = గౌతమ ముని
భార్య = భార్య
పాలిటి
కామధేనువితడు = కామధేనువు + ఇతదు
- కామధేనువు = కోరిన కోర్కెలు తీర్చువాడు
- ఇతడు = ఈ శ్రీ రామ చంద్రుడు
ఘాతల =
కౌశికుపాలి = కౌశిక మహా మునికి
కల్పవృక్షము = కల్ప వృక్షము (కోరిన కోర్కెలు తీర్చు వృక్షము)
సీతాదేవి పాలిటి = సీతా దేవికి
చింతామణి = చింతామణి (కోరిన కోర్కెలు తీర్చు మణి)
యితడు = ఈ శ్రీరామ చంద్రుడు
యీతడు = ఈ శ్రీరామ చంద్రుడు
దాసుల పాలిటి = దాసులకు
యిహపర = ఇహమునందూ (ఈ లోకమునందూ) పరమునందూ (పరలోకమునందు)
దైవము = దేవుడు
పరగ =
సుగ్రీవుపాలి = సుగ్రీవునకు
పరమ = గొప్ప
బంధువితడు = చుట్టము
సరి =
హనుమంతుపాలి = హనుమంతునకు
సామ్రాజ్యము = రాజ్యము
నిరతి =
విభీషణునిపాలి = విభీషనుకు
నిధానము
యీతడు = ఈ శ్రీరామ చంద్రుడు
గరిమ
జనకు పాలి = జనక మహా రాజునకు
ఘనపారిజాతము = గొప్ప పారిజాతము (సాటిలేని పుష్పము)
తలప
శబరిపాలి = శబరికి
తత్వపు = తత్వపు
రహస్యము = రహస్యము
అలరి
గుహునిపాలి = గుహునికి
ఆదిమూలము = తొలి మూలము (అన్నింటికీ కారణమైనవాడు )
కలడన్నవారిపాలి = కలడు అన్నవారికి
కన్నులెదుటి = కన్నుల ఎదుటి
మూరితి = మూర్తి (విగ్రహము)
వెలయ
శ్రీవేంకటాద్రి విభుడితడు = శ్రీ వేంకటాద్రిపై దేవుడితడు
బయటి లింకులు
మార్చు--- రామచంద్రుడితడు రఘువీరుడు--పి.సుశీల]
అన్నమయ్య పాటలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | ఱ
|