రాజా బహద్దరు వేంకట రామారెడ్డి జీవితచరిత్ర/నాల్గవ ప్రకరణము

నాల్గవ ప్రకరణము

ప్రారంభోద్యోగము

ముదిగల్లు చారిత్రిక స్థలము. అందొక కోటయు కలదు.ఆకోటకై విజయనగర రాజులకును. బహమనీ నుల్తానులకును పలుమారు యుద్ధములు జరిగియుండెను. అట్టి యుద్దములలో నొక విచిత్ర యుద్ధము కూడ జరిగియుండె సని ఫిరిస్తాయను చరిత్రకారుడు వ్రాసి యున్నాడు. అదేమన ముదిగల్లులో ఒక కంసాలి వారి యువతి చక్కని చుక్కయై దక్కనీ రాజులకే మోహము కలిగించెసట. అకాలమందు విజయనగర చక్రవర్తి యైన మొదటి దేవరాయలు ఆ కంసాలి సుందరిని తనకిచ్చి పెండ్లి చేయుమని కోరెనట! కంసాలి అది మంచిమనుము కాదని నిరాకరింవెనట!! దేవరాయలు ఆగ్రహోదగ్రుడై ముదిగల్లును పెద్ద సేనతో ముట్టడించెనట. కాని గ్రామజనులతో పాటు ఆ సుందరాంగియు బహమనీ సుల్తాను రాజ్యములోనికి పారిపోయెనట. బహమనీ రాజ్యమును 1400 క్రీ. శ. ప్రాంతములో "ఫీరోజుషా”  అను సుల్తాను రాజ్యము చేయుచుండెను.అతనికిని ఆకన్నెపై మోహమంకురించెను. దేవరాయలకును ఫీరోజుషాకును యుద్ధము జరిగెనట. అందు దేవరాయలే ఓడిపోయి తన కూతునే ఫీరోజిషాకిచ్చి పెండ్లి చేసి సంధి చేసుకొనెనట! ఇది పిరిస్తాకథ, అంతయు కల్పిత మేయని కొ॥ లక్ష్మణరావు మున్నగు చరిత్ర కారులు స్థిరపరచినారు. ఇంతటి ముఖ్యాంశమును గురించి సమకాలికులగు అబ్దుర్రజాఖ్ అను సుప్రసిద్ధ ముస్లిం చరిత్రకారుడు గాని, నూనిజ్ అను పాశ్చాత్య చరిత్రకారుడుగాని, ఇతర దేశీయ సమళాలిక చరిత్ర కారులు కాని, ఒక్కమాట యైనను వ్రాయలేదు. కాని 200 ఏండ్ల తర్వాత పుట్టిన ఫిరిస్తా కిది యెట్లు తెలిసెనో యేమో!

వేంకట రామా రెడ్డి గారికీ చరిత్రాంశము చూచాయగా తెలిసి ముదిగల్లులో అట్టి కంసాలి వంశమున్నదా యని విచారించి, పరిశోధన చేసినారు. ఆ కంసాలి వంశము నిజముగా నుండనే యుండెను. వారి వంశములో ఉభయ రాజుల మోహింప జేసిన, మోహనాంగి వంటి వారిప్పటికిని కలరట! ఆ వంశము వారిని పూర్వ చారిత్రక కథలోని యాధార్యమును విచారించగా నిట్లు చెప్పినారట. “మా వంశములో పూర్వము అపురూప సుందరాంగి యుండినది నిజమే. ఆమెను, ఫీరోజుషా మోహించి నికా చేసుకొన్నాడు. అందుకు ప్రత్యుపకృతిగా మాకు చాలా ఇనాము లిచ్చినాము. ఇనాము సనదులు ప్రాత కాగితాలమీదను, రాగి రేకుమీదను వ్రాసి యిచ్చినాడు , రాయచూరు జిల్లాను మొదట నిజాముల వద్దనుఁడి ఇంగ్లీషు వారు తీసుకొన్నప్పుడు మా ఇనాము లన్నియు లాగుకున్నారు. ఇప్పుడు మాకు సనదులే మిగిలినయాస్తి” వారి వద్ది సనదులనుకూడ తెప్పించి రెడ్డిగారు చూచినారు. ఒక కాగితము అప్పటికే పురుగులు తిని అంతయు రంధ్రములు పడి యుండెను. రాగి రేకు సనదుకూడ యుండెను. అందేమి వ్రాసి నారో జ్ఞాపకము లేదని రెడ్డి గారు చెప్పి నారు. ఈ విషయమును బట్టిచూచిన ఇంతమాత్రము నిజమని విశ్వసింప వచ్చును. దేవ రాయలు హిందూ మతాచారముల ప్రకారము పరకుల స్త్రీని పెండ్లాడజాలడు. కాని, ఫిరోజుషా మాత్రము ఆ కన్యను వివాహము చేసుకొన్నాడు. దీని పై ఫిరిస్త కథ కల్లలు కొల్లలుగా పెంచి వ్రాసినాడు, ఫిరిస్తాకిట్టి వ్రాతలల నాటేయని యెన్నియో యితరాంశములు స్థిరపరచుచున్నవి. అది విషయాంతరము,వేంకట రామా రెడ్డి గారు రెండేండ్ల కాలము ముదిగల్లులో అమాను పదవిని నిర్వహించుచు వచ్చినారు. అనగా కార్యభార మంతయు చేతి క్రింద మొహరీలు దే! మొహరిర్ పేరు రాబానాయక్ .అతడు భారీమనిషి. బాగా కల్లు, సారాత్రాగ నేర్చి న నాడు. మొగలాయి. కాలపు పద్ధతులపై అపరాధ పరిశోధనలు చేయ నేర్చినట్టివాడు. ముదిగల్లు తహసీల్ దారు పదవిపై కన్నయ్యాలాల్ అను వారుండిరి. అతడు రాజా కంద స్వామికి బావమరది. అతనికి ఉర్దూ సరిగా రాదు. తనతీర్చులు కూడా తెగుగులో వ్రాసేవాడు. ఆ కాలములో తహసీల్దారులనిన నిరంకుశ మండలాధి కారులకన్న మిన్నయైన వారు. భూమ్యాదాయశాఖకు సంబంధించిన అధికారమలే కాక, మున్సిఫీ అధి కారము లన్నియు వారియందే కేద్రీకరించి యుండెను. తహసీల్దారు కన్నయ్యలాలు వద్ద ఒక కార్కూక్ (గుమాస్తా) వెంకోబారావు అను నతడుండెను. చాలామంది అధి కారులు పుష్కలముగా లంచములు: తినెడి వారు. కార్కూను అయిన వెంకోబరావు ఆ విద్యలో పేరు పొందినవాడు.

రెడ్డిగారి అమీను ఉద్యోగ కాలములో ఈముది గల్లులో చెప్పదగిన విశేషము లేమియు లేవు. ఒక్కయంశము మాత్రము పేర్కొన దగినదై యున్నది. ఆ కాలములో దొంగతనాలు సర్వప్రాంతములో విశేషముగా జరుగుచుండెడివి. ముదిగల్లులో గుజుగ భీమడు అను - గజదొంగ యుండెను. వాని కొడుకు కూడ గజదొంగ. వారు ఒక గాండ్లవాని యింటిలో కొందరి స్నేహితులతో కలిసి దొంగతనము చేసినాడు. గాండ్ల వాడును జరిగినది. మంచి సర్దారుమనిషి. గుజుగ భీమని కొడుకును మాత్రము గట్టిగా పట్టుకొని వదలిన వాడు కాడు. అదే దినము రెడ్డిగారి ఠాణాకు వానిని పట్టుకొని వచ్చినాడు. ముహరిరు తన విచారణ ప్రారంభించినాడు. అనగా పది పండ్రెండు మారులు కట్టెతో దొంగను మోదినాడు. దొంగ మూగివాడైపోయి నాడు. కన్నయ్యాలాల్ తహసీల్దారు వద్ద విచారణ జరిగినది. తహసీల్దారుగారితో వెంకోబరావు ఆదొంగ యొక్క నిర్దిషితమును గురించి గట్టిగా నచ్చ చెప్పినాడు. పైగా దొంగమూగి వాడని పైననే కనబడు చుండెను. దొంగ నిర్దోషియని నిర్ణయించి విడిచి పెట్టినాడు, రెడ్డిగారు రెండు దినాల తర్వాత ఏదోపని పై వెంకోబరావు ఇంటికి పోయి చూడగా ఆ మూగి దొంగ వెంకోబ రావుతో ముచ్చట్లు చేయుచున్నాడు! రెడ్డిగారీ ఆశ్చర్యమును జూచి దొంగ కిలకిల నవ్వినాడు. ఇప్పుడేమి భయము. తాను నిర్దోషియై పోయినాడు కదా!

ఇట్లుండ మరికొన్ని దినాల తర్వాత మస్కీలో “డాకా" (బందిపోటు దొంగతనము), జరిగినది. సుమారు 40 మంది కొరవలు దివటీలు పట్టుకొని గ్రామములో ప్రవేశించి యెదిరించిన వారిని మెదుగగొట్టి ఒక ధనికుని యింటిలో బడి అంతయు లూటీచేసుకొని పోయినారు. టాణా వార్త వచ్చిన వెంటనే రాజానాయకు మొహిరిర్ , కొందరి జవాసుల వెంటతీసికొని మేకటరామారెడ్డిగారిని వెంబడించుకొని బయలు దేరినారు. దొంగల జాడలు తీసి వారు రాయచూరు జిల్లా మాన్వీ తాలూకాలో నాగల్ బండ కస దొడ్డి అను గ్రామాలలో ఈ కొరవ లుండిరని ఒకని వలన విని ముందు నాగల్ బండకు పోయిరి. అచ్చట ఆనాడు దొంగలకు పండుగ. వారున్న యింటిని ముట్టడి వేసి లోపల దూరినారు. దొంగలు ఒక గదిలో జొరబడినారు. దొజకిరి లే యని బయట చిలుకు 'పెట్టి పోలీసువారు కావలి కూర్చున్నారు. కొంత సేపటికి దివటీలు తీసికొని తిన్నగా తలుపుతీసి నాలుగు మూలలు పరికిం చుచు లోపలికి వెళ్లినారు. ఎవ్వరును లేరు! - ఇంకొక గది కనబడినది. అందున్నారని తెరచి చూచినారు. అందునులేరు. ఇదేమిరా యని దిగ్బ్రమజెందినారు. మరొకలోపలి కొట్టిడీ చూచినారు. అందు మిద్దెలో ఒక పెద్ద రంధ్రము పడినది ఆ గదిలోని గుమ్ముల పై కెగబాకి గవాక్షమునుండి అందరును పారిపోయి నారు. అప్పుడు కసక్ దొడ్డి గ్రామములో ఆదొంగల జాడ కనిపెట్టి రాత్రి యంతయు సడిచి వెళ్లినారు. వారాగ్రామము లోను లేరు. తెల్ల వార నాలుగు గంటల కాలమైనది. ఊరిబయట చావడిలో పండుకొనుటకై పడకలు వేసినారు. అప్పుడొక గ్రామస్థుడు వచ్చి యిట్లని ఎచ్చరించినాడు. " మీ చావడీ ముందటి చెట్టు పైన నీ మంచెలు వేసుకొని కొంపదొంగలు పండు

కున్నారు. పోలీసులు నిద్ర దులుపుకొవి చెట్టును ముట్టడి వేసినారు, కొరవలు తుప్పు తుప్పున చెట్లపైని మంచెలమిది నుండి క్రిందికి దుమికినారు. కొందరు దొరకినారు. కొందరు పెనుగులాడి తప్పించుకొని పోయినారు. పట్టుబడిన వారిలో మన గుజుగ భీముడును, వాని కొడుకగు మూగిదొంగయు నుండిరి. ఈ మూగిదొంగ యిదివరలో పండితుడైన వాడే కొన్ని దినాలకు ముందు వెంకోబరావుకు 300 రూపాయల లంచమిచ్చి సిఫారసు పొంది తప్పించుకొన్న వాడే! దానికి ప్రత్యుపకారముగా వెంకోబ రావు, ఇంటిలో 5- 6 వేల ధనము దోచుకొని పోయియుండెను. ఇప్పుడు పట్టు బడినప్పుడు వెంకోజరావు యొక్క దుస్తులనే ధరించియుండెను. కొరవలు చాల మొండి దొంగలు. రాజానాయకు కూడ ఘోరాతి ఘోరుడు. వారిని చావకుండి నా నావిధముల' హింసించినాడు. తలక్రిందుగా వేలాడగట్టి క్రింద నీటితోట్లలో తలలుముంచి లేవ నెత్తుచు పీడించినాడు. వేకటరామా రెడ్డి గారికీ దృశ్య ములు ఘోరమనిపించి తన మొహిరిర్ ను మందలించినాడు. కాని అన్నిటికి మొహిరి రేకదా ఉత్తరవాది! “ఉండవయ్యా. మీరు చూస్తుండండి యీ తమాషాలంతా" అనేవాడు. మొహరిర్ ఇంకొక యుక్తి పన్నినాడు, ఆ కొరవలవారి ఒక యువతిని పరిచయము చేసికొని దానికి ప్రియుడైనాడు. ఇద్దరును

కల్లుకుండలపై కాలము గడిపినారు. ఆ ముచ్చటలో కొరవల దాపరక స్థలాలన్నియు కని పెట్టినాడు. కొరవలకు చిన్నప్పటి నుండియు ఎంత కొట్టిసను “ఇల్ రీ” (నాకు తెలియను ) అనుపదమే నేర్చెడివారు. మొహరిక్ ద్బెలకన్నిటికి ఇల్ రీ జవాబే దొరి కెడిది. ఇప్పటి కొత్త పద్దతి చేత దాచిన సొమ్ములన్నియు గుర్తుపట్టినాడు. దొంగల కందరికిని శిక్ష యిప్పించినాడు.


వేంకట రామారెడ్డిగారు ముదిగల్లు నుండి 9 ఫర్యర్ధి 12 8 సలీనాడు రాయచూరు జిల్లాలోని యాద్ గీరు ఠానాకు మార్చబడినారు. యాగిర్ లో ఒకటిన్నర సంవత్సర కాలము అనగా 1 మెహర్ 1300 ఫసలీ వరకు ఉద్యోగము చేసినారు. యాద్గీలో అప్పుడు వరదారావు అను వారు తహ సీల్దారుగా పనిచేయుచుండిరి. ఈ వరదారావు గారు న్యాయ శాస్త్రము (ఖానూను,లో మంచి ప్రవీణులని పేరుగన్న వారు. తాలూకాలో ముఖ్యాధికారులు గాన రెడ్డిగారికిని, పరదారా పుగారికిని మంచి పరిచయ మేర్పడినది. పలుమారు ఈ తహ సీల్దారువద్ద రెడ్డిగారు న్యాయశాస్త్ర మభ్యసింప మొదలు పెట్టి నారు. కాని ఉభయులును ఉద్యోగులగుట చేత రెడ్డిగారి కంతగా అవకాశము దొరక లేదు. అదే కాలములో సుప్రసిద్ధ న్యాయ వాదులును తర్వాత హైదరాబాదు ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తులును (రుకున్ ) అయినట్టి రాజాబహద్దరు గిరి


రావుగారు యాద్గీరులోని తహసీలు కచ్చేరీలో కార్కూన్ ఉద్యోగము సంపాదించు కొనుటకై ఉమిద్వాగు (ప్రొబేషఃర్ ) గా పనిచేయు చుండిరి. గిరిరావు గారు తహసీల్దారు వద్ద న్యాయ శాశ్రముభ్యసించి వకీలు పరీక్షకు కూర్చుని మూడవదర్జావకాలతులో కడతేరి ప్రాక్టీసు చేయుటకై రాయచూరునకు వెళ్లిరి, వారు యాద్గీరులోనుండు కాలములో వేంకటరామా రెడ్డి గారి పరిచయము కలిగెను. నాటి నుండి సుమారు 45 ఏండ్ల కాలములో ఉభయులు తమ తమ జీవితములను వేరు వేరు శాఖలలో నడుపుచు నుండిరి. ఉబయులలో గాఢమగుమైత్రి యేర్పడి, అది రాజబహద్దరకు గిరిరావు గారి అవసాన కాలము వరకును అవిచ్ఛిన్నముగా దినదిన ప్రవర్ధమానముగా నుండుచు వచ్చెను.


యాద్గీరు తహసీలు కచ్చేరీలో కొందరు కార్కూను లుండిరి, అందొక కార్కూనుంకును వరదారావునకును ఏదో యొక విధముగా ప్రేమ సుబంధము లేర్పడినవి. దాని ఆధార ముచేత కార్కూను లంచములు అపరిమితముగా తినుచు ధనికుడయ్యెను. అది ఇతర కార్కూనులకు కన్నుకుట్టెను. యాద్గీరు లోని అరబ్బులు పహిరా జవానులుగా నుండిరి, కార్కసుల ప్రే రేపణముచే ఆయరబ్బు లొకనాటి రాత్రి దివిటీలతో తుపాకీ కాల్పులతో భయంకర కోలాహము చేయుచు ధనికు

డైన కార్కూను ఇంటిని దోచినారు. పోలీసు కచ్చేరి సమీప ముననే యున్నది. వారి కండ్ల యెదుట యీదివిటీ దోపిడి జరుగుచున్నది. వేంకట రామా రెడ్డిగారు 5 -6 మంది జవానులను తీసికొని తుపాకుల బారు చేసి ఒక సందులో కూర్చున్నారు. అరబ్బులు కాల్చుచుండిన సీసముగుండ్లు తమవద్ద కూడ చిట్లి పడుచున్నవి. దోపిడి అయిన తర్వాత అదేమార్గమున వత్తురుకదా అప్పుడు వారిపై తుపాకులు కాల్చి పట్టు కుందమని సంకల్పించిరి. కాని వారు దోచుకొని నెమ్మదిగా ఇంకొక మార్గములో వెళ్ళినారు. తుదకు యెన్నియో దినములు శ్రమించి వారినొకరిగా నొకరిని పట్టుకొవి నానా అవస్థలు పడి వారినుండి అపహృత ద్రవ్యమును చాలమట్టుకు లాగికొని వారికి శిక్షల నిప్పించిరి.

యాధ్గీరులో నుండు కాలములో వరదారావు వద్ద వేంకట రామా రెడ్డి గారు న్యాయశాస్త్ర మభ్యసించి పరీక్షలో కూర్చున్నారు. కాని ఉత్తీర్ణులు కాలేదు. అంతటితో నిరుత్సాహ పడలేదు. మరల మరుసంవత్సరము వకీలు పరీక్షలో కూర్చున్నారు. కాని మరల అపజయమే కలిగినది.

వీరు యాధ్గీరులో అమీనుగా నుండు కాలములో అచ్చటి హిందూ ముసల్మానులలో మత కలహములు చెల రేగెను. యాద్గీరులో కలరా (గత్తర) జాడ్యము వ్యాపించి చాలమంది


చనిపోయిరి. హిందువులలో పెక్కురు నాటికిని నేటికిని కలరా యనునది మారికా లేక మహామారియను నొక క్షుద్రదేవరకు యొక్క కృత్యమని, జాడ్యమునకు చికిత్సలు చేయుటకు మారుగా. “మా రెమ్మ"ను శాంతిపరచుటకై "దేవర” చేయుదురు. “మా రెమ్మ'ను తృప్తి పరచుటకై కొన్ని దున్నపోతులను, . గొర్రెలను బలియిత్తురు. హిందువులు యాద్గీరులో కొన్ని కట్టబొమ్మలు చేసి మారెమ్మ పూజలుచేసిరి. అది అచ్చటి తురకలకు గిట్టక వారిలో కొందరు ఆ బొమ్మలను పగుల గొట్టిరి. హిందువు లుద్రిక్తులైరి. కలహము ప్రారంభ మయ్యేనూ. అది 1298 ఫసలీ నాటిమాట. రెడ్డి గారు వెంటనే తమ చాతుర్యము నంతయు నుపయోగించి యుభయ మతముల వారిలో నుండు వైషమ్యములను బోవునట్లుగా వారిలో ఐకమత్యము కలిగించి సమాధాన పరచిరి. ఆనాటి యాపద్ధతి రెడ్డిగారిలో నీ 50 సంవత్సరముల యుద్యోగకాల మందంతటకు వర్తించుచు వచ్చినందువల్లనే వారెందెందు ఉద్యోగము చేసిరో ఆ ప్రాంతములం దంతటను హిందూ ముసల్మానుల కొట్లాటలు జరుగక శాంతిపద్దతు లేర్పడుచు వచ్చినవి. యాద్గీరు హిందూ ముసల్మానుల మతకలహములను గూర్చి అప్పటి జిల్లా తాలూగ్దారు 1298 ఫసలీలో ఈ ప్రకారముగా నిజాం రాష్ట్ర జిల్లా పోలీసు ప్రధాన శాఖకు వ్రాసిరి:---


“యాద్గీరు తాలూకా అమీను అయిన వేంకట రామారెడ్డిగారు చాల ఉత్తములను చతురు లును, చురుకుతనము కలవారును నై యున్నారు. ఉర్దూ, ఫార్చీ, తెలుగు భాషలలో పూర్తి పాండిత్యము కలవారు. అవసర పూర్తిగా మరాటీ, ఇంగ్లీషును వ్రాయను చదువను నేర్చినారు. యూగ్లీషులో హిందూముసల్మానులలో మతకలహ ములు చెల నేర్చి యుండెను. రాత్రిం బగళ్ళు ప్రయత్నము చేసి మంచి నేర్పుతో ఆకలహములను వీరు అణచి వేయుటయే కాక ఉభయ వర్గములలో సమాధానములు కుది రి0చిరి. లేకున్న ఉభయ వర్గములలో ఎల్లప్పటికిని తగవులు పెరుగుచు ఎన్నడో ఒక గొప్ప పోరాటము జరుగుచుండెడిది. ఒకరి నొకరు చావగొట్టుకొను చుండెడివారు. అట్టి పోరాటమును అణచి వేయుటలో జిల్లా అధికారులకు చాల కష్టములు సంభ వించుచుండెడివి."


వేంకట రామారెడ్డి గారు యాద్గీరులో 1300 ఫసలి షహరేవ ర్ నెల తుదివర కుండిరి. తాలూక్దారు యొక్క మెచ్చు కొనుటనుజూచన రెడ్డి గారిక మొహరిక్ చేతులలో లేరనియు, న్యాయ శాస్త్రములో గూడ ప్రవీణు లైననియు, స్వతంత్రము గాను సమర్థతతోను తమ ఉద్యోగ ధర్మమును నిర్వహించుటకు మొదలు పెట్టినారనియు విశదమగు చున్నది. యాద్గీరునుండి వీరు కల్వకుర్తి తాలూకాకు అనగా లింగుసూగూరు జిల్లా నుండి షుహబూబునగరము జిల్లాకు మార్చబడినారు.