రాజా బహద్దరు వేంకట రామారెడ్డి జీవితచరిత్ర/అనుబంధము




అనుబంధము


ఖాళీ పుట

శ్రీయుత కొత్వాలు

వేంకట రామారెడ్డిగారి ప్రశంస

ఈ విభుడు నిజాము ధరీ
శ్రీ వల్లభ కార్యక రణ దీక్షాదక్షణం
డై వెలయు సదరు కొత్వా
లీ వేంకట రామ రెడ్డి నేలెను గాతన్! . .......1


గీ. వాద నిర్ణయమున సమవర్తి యగుచు
గ్రూరజనుల పాలికి దండధారీ యగుచు
బబలె ధర్మరాజన నిజాంప్రభువు ధర్మ
రాజ్యమందు వేంకటరామ రాడ్వరుండు. ....2


సీ. ఆత్మీయ రాజ్య మంత్రాలోచ నౌచిత
ప్రభు మనోల్లసితమై పరిఢవిల్ల
నిజశాసన మలంఘనీయమై రాష్ట్రీయ
జనుల సన్మార్గ వర్తనుల జేయ
నాత్మీయ రాజకీయంగ రక్షార్థ భట
నియుక్తి ఖలుల దౌష్ట్యము నడంప
నిజ పరామర్సైక నియతిహూణ ప్రభు
సంతతికై న విస్మయము గూర్ప,

గీ. రాజసభల ప్రధాన గౌరవ పడంబు
నందిన నిజాము ప్రభువు రాజ్యమున సదరు
గోతువాలు ఘన పదవిగొని వెలసితి
రాజమాన్య వేంకట రామరాడ్వ రేణ్య. 3


చ. అనయము జార చోర కిత వాదులుగూర్చు సపర్యల గ్రహీం
స నిఖిల రిక్త తిన్ గవిసి వర్తిలుగాఢతిమోగ్రశక్తి భా
గ్యనగరిఁ దృగతృతాప రవికాంతికిభీతిలి నేటి కట్టి దు
ర్జనకృత సంగతి! దొరగి శాంతిలె వేంకట రామ రాడ్వరా. 4.


- చ. సకల రిపుక్షతీంద్రులకు సాశ్వ సదంబయి క్షత్ర ధర్మ వృ
త్తికి సనుగుణ్యమే తగు త్వదీయ నియోజిత పౌర దుర్గ ర
క్షకభట శాసన క్రమముగాంచిగుహుం డిటులే స్వకీయ రై

విక భటుల విధించెనా : పమందటుగా యుండినన్
ప్రకృతము స్వాస్థ్యమై యెట'ల రాజిలు వేంకట రామ రాడ్యరా. 5


సీ. భవదీయ దృఢ భుజ ప్రకటితోద్యత్స్రతాప రుచులక్యము నకు బరిధిగాగ ద్వద్యశశ్చంద్రికా పటలము దశహరిద్యావ్వతమునకు లే నవ్వుగాగ
భవదీయ ధైర్య గౌరవ మల మేనుశైలంబున కాలవాలంబుగాగ
డ్వత్కృపా గింజీర భావంబులు ప్రయోం బురాశికి యమళ పాములు గాగ


1. బబలి తఖల రిపుక్షి విడ్బాహుచటుల
తటనటద్బూరిజయసటీ : టుడవగుచు
జగతి బ్రఖ్యాత మైన నిజాము ప్రభువు
రాజ్యమందు వేంకట రామ రాడ్వరేణ్య 6


మ. భవదీయోన్నత బాహు యుగ్మనివసత్సాగ్భార కీర్తి ప్రతాప
విభూతి గ్రహణాను రక్తినిశిరాట్పద్మాప, దైనంది నో

ద్భవ పంచత్వ కృత త్రిలోక జనసేవాకార్య దేవేంద్ర వై
భవ శ్రీ వేంకటరామ రాడ్వర శుభ ప్రారంభ నిత్యోత్స వా. 7


సీ. సంస్థాన విభులై ప్రజారక్షణక్షాత్రవృత్తి శోభించి రే రెడ్డిగారు
బహు దాన విధుల విద్వాంసుల భూషించికృతులంది యుండి రే రెడ్డిగారు
ధన సమృద్ధి గుబేరతములై మహిబరోపకృతుల బాపించి రే రెడ్డి గారు
గైర్వాణ వైకృతాంగ్ల తురుష్క విద్యాపరీక్షల దేజి రే రెడ్డిగారు


గీ. అట్టి రెడ్డికులము మాన నార్హమైన
బ్రథితివహియించె మరియు శ్రీరాముకతన
ద్యుమణి సంతతి బలె భవన్మూలమున ధ
రాతలమున వేంకటరామ రాడ్వరేణ్య 8 -


—విద్వాన్ రామరాజు శ్యామరాజు గారలు

సోదరకవులు


శ్రీమతాం రాజబహద్దర్ వేంకట రామారెడ్డి, ఓ. బి. ఇ.

మహోదయానాం జన్మదినోత్సవ

ప్రశంసాపద్యాని


స్త్రీ విద్యామృత వల్లరీ కుసుమి లౌదిగ్వ్యాప్త 'సౌగంధికా
నిర్యత్సుష్పరస ప్రహృష్ట మధుపోద్గీతి ప్రపంచాన్వితా
యచ్ఛశ్యద్య ఫలాని స్వర్ణరుచి రాగ్యాసించకౌ సర్వతః
శ్రీ రాజాబహదూరు వేంక టవిభో? కారుణ్యా వాస్రోతసా.


కర్పూరత్కవిసూక్తి గుంభిత మహాకావ్యాత్మ చాత్రకః
ప్రఖ్యాతాంధ్ర వియత్త లప్రకటిత స్ఫార ప్రభాభాసురః
ఫుందీవర దృగ్భి సాకలయ తే శ్రీ వేంకటరామ రాట్
భదాణ్యంబక రే ప్రమోదయ సదా సర్వాంధ్రవిద్యాలయే.


కుందామాద సుకౌముదీ విలసితం దిక్కా మినీ భూషణం
వందారూదఁగు కల్చశాఖ సుమనో రాజద్యశో రాజతు
బృదారాధిప వంది తాంఘ్రీ సరసీజాతో మురారిః కృపా
మందానందిత భక్త బృందవిభవః పాయాత్ అభీష్టాన్ దదత్

.


ఏకోససప్త త్యతిధార్మిక స్యజన్మోత్సవోయం కురు తేసుమోదం
అముంసపొయాత్ భగవాన్ వితన్వణ ఆయుళ్ళభాగ్యం
                             శరదాం శతంసః.

సి. హెచ్. రంగాచార్యులు.

శ్రీ రాజాబహద్దర్ వేంకట రామా రెడ్డి, ఓ. బి. ఇ. గారికి
               సమర్పించిన -

             ప్రశంసా పద్యము


సీ. మా పాఠశాలకు నేపొర మిక్కిలియశమును, జేకూర్చి యలరఁ జేయు
మా యభివృద్ధియే మహనీయ మైనట్టితన యభివృద్దిగఁ దలఁచుచుండు
మహిళామణుల సంస్థ మహీ నున్న తిగాంచబలు విధంబుల సాయ పడుచునుండు
కలిమి యెంతయిననుఁ గడు బీదలకు దానధర్మంబు సేయు టే తగవునెంచు
గీ. మిగుల విఖ్యాతి కెక్కిన మేటి యితడు రాజబహదూరు వేంకట రామరెడ్డి
మనియ గావుత నిచ్చలు మాధవుండు దనకు సైదోడుగానుండ ధరణిలోన,
వం. జయ. ( విద్యార్థిని

రాజా వేంకట రామారెడ్డి బహద్దరు ఓ. బి. ఇ. గారికి రెడ్డి వసతిగృహ విద్యార్థులు సమర్పించిన అభినందన పత్రము


పూజ్యమహాశయా !


నమస్కారములు. హృదయపూర్వక నమస్కారములు. దాదాపు అర్ధ శతాబ్దమువరకు అసమాన ప్రతిభతో రక్షక పోలీసుల శాఖయందలి వివిధ పదవులను, ముఖ్యముగా 14 సంవత్సరములనుండి క్లిష్ట బాధ్యతలు గల నగరపు కోత్వాలి పదవిని మహా ఘనత వహించిన ప్రభునత్త మునకు ఆమోదకరముగను, ప్రజలకు అనురంజక ముగను నిర్వహిఁచి ఉపకార వేతసము (వజీఫా) పొందిన మీకు, మీ కృపావి శేషమున ఆర్జించు విజ్ఞానమునకును, పొందుచున్న వికాసఘు నకును, యావజ్జీవము కృతజ్ఞతా బద్ధులమగు మేయి, ఈ సందర్భమున అభినందన పత్రమును సమర్పించు గౌరవము గలుగ జేసుకొను చున్నాము.

దేశ సేవాపరాయణా,


మాతృ దేశమగు నీ రాష్ట్రమునకు మీరు చేసిన సేవ యపారము. మీ తోడ్పాటుపొందని సదుద్యమము లేదు. మీ చేయూతబడయని విద్యాసంస్థ లేదు. మీ సహాయ సానుభూతుల సందని సంస్థానము లేదు. బ్రిటిషు ప్రభుత్వము మిమ్ముల ఓ. బి. ఇ. బిరుదముచే సత్కరించెను. మన ప్రభువు గారికి మీ యెడలగల విశ్వాసాతిశయమునకు, మీ నామము సలంకరించుచున్న రాజాబహదరు బిరుద మేగాక, ఒక ప్రక్క మీకు నుపకార వేతన మొసంగుచు, వేరొక ప్రక్క సగఫ్ ఖాసు ముబారకు నందు ఉన్నత పదవి ననుగ్రహించి, శాసన సభయందును, పురపాలక సభయందును, అనాథాలయము నందును, తదితర యుపసంఘముల యందును, మిమ్మ తమ ప్రతినిధిగా నియోగించుటయే ప్రబల నిదర్శనము .


సర్వకులోద్ధారకా,


మీరు రెడ్డి సోదరులకు నిరుమానముగు సహాయము చేసితిరనుటకంటె, రెడ్డి కులోద్దరణ మే మీ జీవితాదర్శమన దగును. ఒక నాడు ప్రభువులై, ప్రభుభక్తి పరాయణులై , వీరులై, వీరజవ పోషకులై కవులై, కవిజనాశ్రయలై చరిత్రకు వన్నె దెచ్చి, మాతృ దేశమును తేజోవంతముగన, విజ్ఞాన వంతము గను జేసి యలరిన రెడ్డి కులజులు, కొండొక నాటికి, స్వతంత్రాభిలాషచే కాబోలు, గ్రామవాస మేర్పరచుకొని అజ్ఞానాంధకార నిమగ్నులై, సంఘీభావ దూరలై, దుర్దశ బెందియుండుటను మొట్ట మొదట పరికించిన వారు మీరే. వారి పునరుద్దరణము నకు సంకల్పించిన వారు మీరే. కార్యారంభ మొనర్చిన వారును మీరే- నేను వారియందు వ్యక్త మగుచున్న ప్రబోధ 1. వికాసములు మీ ప్రయత్న ఫలితములే. రెడ్డి వసతిగృహము, రెడ్డి గ్రంథాలయము, దేశము:నకును, సంఘమునకును, కాంతి వంతమగు భవిష్యత్తును సమకూర్చగలవు.


పితృతుల్యా !


వసతి గృహవాసులమగు మాయెడ తాము జూపు నాదరణము మరుపబడునది కాదు. గ్రామములందు విద్యాసౌకర్యములు లేక , నగరము లందలి సంస్థల నుపయో గించుకొను శక్తి సామర్థ్యములు లేక, ఉన్నతవిద్యా దూరులగుచున్న విద్యార్థుల ఉపయోగార్ధము మీరు సవీనముగ ననలంబించిన వసతిగృహ పద్ధతివలన గ్రామవాసుల యందు ఉన్నత విద్యావ్యాప్తికై యొక యుత్త మమార్గ మేర్చడినది. నిరాధా కులమగు మా విద్యాభివృద్ధికి మీరు జేసిన సహాయ మపారము, చేయవలపి నదికూడ యపార మేయని మా మనవి. బాలికల వసతి గృహముసకు సొంత భవనము నిర్మింపబడ వలసియున్నది. స్త్రీల వివ్యాభివృద్ధికై ప్రచండ ప్రయత్నము జరుగవలసి యున్న ది. మీ రారంభించిన సుస్థలు చిరస్థాయిగా నుంచుటకు మూల ధనము సేకరించ వలసియున్నది, కార్య శూరులగు. తానా మహదాశయములను సాధించి, మికీర్తి ని యజరామర మొన రించెదరుగాక. మీ జీవితము తోడిసోదరులకు ఆదర్శప్రాయ మె పరగుగాక.

పరోపకార పారీణా !


ఈశ్వరుడు మీకు చిరాయువొసంగి, మీ సత్సంకల్ప ముల సిద్ధింప జేయుగాక, మీయందు మహోదారుడగు ప్రభువునకు గల విశ్వాస మచంచలమగుగాక, దేశీయుల భక్తి, ప్రేమలుమీయెడ దృఢతరము లగుగాక. రెడ్డి సోదరులు మీ నాయకత్వము క్రింద క్రమాభివృద్ధిని జెందుదుకు గాక. తథాస్తు.

భావ సం! ఆషాఢ శు|| విదియ
(8 షహరేవరు 1343)
రెడ్డి గ్రంథాలయ భవనము ,
సుల్తానుబజారు
హైదరాబాదు-దక్కన్

ఇట్లు విన్న వించు విధేయులు,
  రెడ్డివసతిగృహ విద్యార్థులు ( భూత, వర్తమాన )


0

శ్రీ యుత కొత్వాలు
వేంకట రామా రెడ్డి గారు

అక్షయ నామ సం! ఆషాఢ బ. 8.
గోలకొండ పత్రికా సంపాదకీయము


సోమవారము నాటి రాత్రి రెడ్డి విద్యాలయములో జరిగిన సన్మాన సభాకార్య క్రమమును వేరుచో ప్రకటించి యున్నారము. ఈ సభ అనేక విషయములందు చాల ముఖ్య మైనది. హైదరాబాదులో హిందూ ముసల్మానులచే సమానముగా గౌరవింపబడిన శ్రీ కొత్వాలుగారిని రెడ్డి విద్యాలయ విద్యార్థులు గౌరవించుట చాల సంతో షావహ విషయము. ఈ సభ 3 నెలల క్రిందట జరిగియుండ వలసినది. కాని హాస్లు విద్యార్థి సంఘపు కార్యదర్శిగారి యుపన్యాసము వలన ప్లేగు కొంత కాలము, సెలవులు కొంతకాలము, ఆటంకములు కలిగించిన వని తెలిసినది.


శ్రీకొత్యాలు గారి జీవితము బాలుర కందరికిని (నాయకు గారు నుడివిన రీతి) నాదర్శప్రాయముగా నుండదగినది. వీరు ప్రారంభమున పోలీసు శాఖలోనే యొక చిన్న యుద్యోగములో


చేరి, క్రమ క్రమముగా నగర రక్షకాధికారమందు శ్రీ నిజాము ప్రభువుగారి చేతను, మన్నించబడి రాష్ట్రమందలి సర్వజనులచేతను గౌరవింపబడిన వారైరి. హైద్రాబాదు రాష్ట్రమండలి యాంధ్రులలో వీరొక్కరే యున్నతోద్యోగమందుండిన వారు. బ్రిటిషు ఇండియాలోని యాంధ్రులు కూడ యనేకులు వీరి పేరు వినిన వారు కలరు.


వీరిని హైద్రాదు హిందూ, ముసల్మానులందరును గౌరవించుచుండినను ముఖ్యముగా వీరిని రెడ్లు గౌరవించుటలో రెడ్డి సంఘమువారు తమ్ము గౌరపించుకొనిరి. ఇంతటి గొప్ప యధి కారము, ఇచ్చటకు, నింతవకె కెన్నడును, నేరెడ్డియును వహించి యుండ లేదు.


శ్రీ కోత్వాలు గారి 'నామము రెడ్డి విద్యాలయముండు నంత కాలము స్మరణీయముగా నుఁడునసటలో సందేహము లేదు. ప్రతిచిన్న విషయమందును వారు శ్రద్ధవహించుట, ప్రతి విద్యార్థిని విచారించుకొనుట, వారిని నెరిగిన వారికే తెలియును. వీరు రెడ్డి సంఘమునకు చేసిన సేవ యపొరము.మోటకు లందు తిరుగు మహారాజులు మొదలుకొని యెండలో మడక దున్ను మోటు కాపు వరకును, వీరి నీరాష్ట్రమున నెరు గనివారు లేరు.

రెడ్డి విద్యాలయముతో నుండు వీటి సంబంధమునుబట్టి వీరు కేవల స్వజాతి పక్ష పాతులని వీరి నెరుగనివారే చెప్పవలయును- ప్రతి శాఖాభివృద్ధి మొత్తము సంఘమున కభివృద్ధి కరమగునదియే. వీరు రెడ్డి సోదరులకు నితర శాఖల వారి నంద రనొకే దృష్టితో చూడ వలయునని నిరంతరము బోధించు చుందురు. హాస్టలు నిబంధనలందును నిట్టి సూచన లేకలవు.


రెడ్డి విద్యార్థులు వీరిని సన్మానించినందులకు వారి చర్యను మేముభినందించు చున్నాము. శ్రీ వేంకట రామారెడ్డి గారి కృషివలననే రెడ్డి విద్యాలయము' దిన దినాభివృద్ధికి వచ్చు చున్నది. కొత్వాలు గారు తమ యుపన్యాసములో సెలవిచ్చి నట్టు శ్రీ దోమకొండ రాజు గారు, శ్రీ పింగిలి వెంకట రామా రెడ్డి గారు, ఇతర, మహారాజులు మున్నగువాగు ద్రవ్యసహా యము చేయకుండిన రెడ్డి విద్యాలయపు మాట మరచి పోపల సియే యుండును. అయినను శ్రీకొత్వాలు గారు దానికి జనరల్ సెక్రటరీగారగుటచే, ప్రతిదినము శ్రద్ధవహించిన వారగుటచే, నేటి కాలమున హాస్టలునుండి బి, ఏ., యఫ్. ఏ. మున్నగు నుత్తమ తరగతులలో విద్యార్థులు కృతార్థులగు చున్నారు సుమారు 10 సంవత్సరఘులకు పూర్వము 10 - 15 రెడ్డి విద్యార్థులే హైద్రాబాదులో నితరుల నాశ్రయించి కష్ట పడుచుండిరి. నేడు 130 కన్న నెక్కుడు విద్యార్థులు రెడ్డి హాస్టలులో నుండుట రాష్ట్రీయు లెల్లకును బ్రశంసింప వలసిన విషయమే.


ఇట్లు సంఘాభివృద్ధికి పాటుపడు శ్రీ వేంకట రామా రెడ్డి కొత్వాలుగారికి సర్వేశ్వరుడు నిత్యైశ్వర్యముసు, ఆయు రారోగ్యాభివృద్ధిని ప్రసాదించుగాత. రా జా బహద్దరు వేంకట రామా రెడ్డి గారు


ప్రజోత్పత్తి నామ సం. పుష్య బ.4 . గోలకొండ పత్రికా సంపాదకీయము

ఒక వారము దినముల క్రిందట శ్రీయుత రాజాబహ ద్దరు వేంకట రామా రెడ్డి ఓ. బి. ఇ. గారి యద్యోగ కాల పరిమితి మరియొక సంవత్సరము హెచ్చింపబడె నని వినుటకు ప్రత్యాంధ్రుడే కాక నిజాం రాష్ట్రమంచుంకు సమస్త జనులును ముఖ్యముగా, నగరవాసులును చాల సంతసించు చున్నారు. సమకాలిక పత్రికయగు బులెటిన్ పత్రిక మొన్నటి సంపాద కీయమందు చేసిన మన కొత్యాలు గారి ప్రశంసతో మేము సంపూర్ణముగా నేకీభవించు చున్నామ'. ఇతర స్థలములందెచ్చట జూచినను హిందూ ముసల్మానుల కలహములు జరుగు చుండుట మనము ప్రతిదినము నినుటకు విషాదము చెందుచున్నాము. తోడి సంస్థానమగు కాశ్మీర రాజ్యమందు సుమారు 3- 4 మాసములుగా ఘోరదురంతములు జరుగుచున్నవి. కాని మన హైద్రాబాదు నగరమందు అట్టి భయము మన కేమియు లేదు. కారణ మేమన శ్రీయుతులగు కొత్వాలు గారు హిందూ ముసల్మానుల నుభయులను సంతుష్టి చేసి యుభయులకు ప్రీతిపాత్రు లైయున్నారు. కొన్ని మాసముల క్రిందట సగరములో హిందూ ముసల్మానులకు తగపులు జరుగునని యబద్దపు వదంతులు బయలు దేరి యందఱను కలత పెట్టెను. కాని మన కొత్వాలుగారి యుత్కృష్ఠములగు పోలీసు ఏర్పాటుచే నీ భయము లన్నియు నబద్ధములయ్యెను.


సుమారు 20 సంవత్సరముల ముదుక తనములో మన కొత్వాలు గారు శరీరదార్థ్యత కలవారే కాక ఇతరాధికారుల వలెకాక రేయింబవళ్ళును శ్రమించువారు. వీరు కేవలము కచ్చేరీ యందే కాక యితరకాలము "లందును ప్రాతః కాలము నుండి మధ్య రాత్రమువరకు ప్రజల సేవ యందే తమ కాలమును వినియోగించు చున్నారు. ఇట్లు పరిశ్రమచేయు నున్నతోద్యో గినింకొక నిని బహుశ మన రాష్ట్రమందు కానమనిన వింత కాదు.


మన కొత్వాలుగారికన్న 'గొప్పయుద్యోగు లెందరో కలరు. వారికిని ననేకమారులు ఉద్యోగ కాల పరిమితి హెచ్చిం పబడు చుండును. కాని యీ యుద్యోగమునకుండు ప్రాముఖ్య మితరోద్యో గమునకు లేదు. ఇంతియ కాక వీరియందుండు సర్వ జనానురాగము ఇతరులందు లేదు. ఈ కారణముచేత వీరియు ద్యోగ విషయమున నింత యభిమానము అందరును చూపించు చున్నారు.


శ్రీయుత రాజాబహద్దరుగారు కేవలము కొత్వాలీ పనినే కాక మునిసిపాలిటీ యందును. శాసన సభయందును ముఖ్యముగా పాల్గొనుచున్నారు. ఇట్టి సర్వజన ప్రియులగు కోత్వాలు గారిని, వారి యుద్యోగ పరిమితి హెచ్చైన సందర్భము న మేమభినందించుచున్నాము. రాజూ వేంకట రామారెడ్డి

బహద్దరు గారు

శ్రీ భావనామ సం. జ్యేష్ఠ బ.9

గోలకొండ పత్రికా సంపాదకీయము


మొన్న ఆదినారమునాడు రాజాగారు తమ కొత్వాలు పదవిని వదలుకొని ఉపకార వేతనము పొందిరి. వీరు మొత్తముపై 60 సంవత్సరములు ప్రభుత్వోద్యోగమందుండిరి. వీరి విషయమై కేవలము నగరమందేకాక , కేవలము నిజాం రాష్ట్రమందేశాక, మొత్తము హిఁదూస్థానములో : సహితము అనేకులు యెరియున్నారు. అయినను వీనిని గురించి యెన్నమా రులు వ్రాసినను కొదువయే కనబడు చుండును. వీరి చరిత్ర చాల గంభీర మైనట్టిది. వీరి గుణములు సర్వజన ప్రియములు. వీరి అభివృద్ధి అద్వితీయము. వీరి వంశము రాజవంశముతో చాల సన్నిహిత సంబంధము కలది. వీరు వనపర్తి రాజులగు ప్రథమ రామేశ్వరరావుగారి బంధువర్గములో చేరిన వారు. ఆ రామేశ్వర రావు గారి చరిత్ర ప్రత్యేక గ్రంథ మేయగును. (ప్రస్తుతము మనకు సంబంధించిన దేమన ఆ రామేశ్వర రావు గారి మేనల్లుకు విలియం వహబు అను వారు. వీరు రెడ్డె. రామేశ్వర రావు గారు ఆ కాలముననే చాల గొప్పసంఘసంస్కారులు. ఇంగ్లీషువిద్య, ఇంగ్లీషు అచారములం దాయనకు ప్రీతి యెక్కు వ. ఆందుచేతనే మేనల్లుని కింగ్లీషు పేరు పెట్టెను. ఆ విలియం వహబుగారి మేనల్లుడే మన రాజాబహద్దరు వేంకట రామా రెడ్డి గారు. ఆ విలియం వహబుగారు పోలీసులో మొహ తెమీముగా నుండి చనిపోయిరి. వారు చని పోవునప్పుడు మన రాజా గారు వారి పోషణలోనుండిరి. తల్లి దండ్రులు చిన్నప్పుడే గతించిరి. అప్పుడు వీరి వయస్సు నుమారు 15 సంవత్సరములు. అప్పుడే వీరికి అమీను పదవి దొరికెను. అట్టి మామూలి యమీను పదవి నుండి ఇంత గొప్ప కొత్వాలీ పదవికి వచ్చుటలో వారికి సహాయు లెవ్వరును లేరు. సిఫారసులు లేవు. కాలేజీ డిగ్రీలు లేవు. ఇంగ్లాండు పోయివచ్చిన వారు కారు. బ్రిటిషిండియా తరిబీయతు పొందిరాలేదు. వీరి సిఫారసంతయు వీరి ఆఖండ పరిశ్రమ, విశ్వాస పాత్ర మైన నౌకిరి వీరి సద్గుణములును, నై యున్నవి.


మొదటినుండియు వీరు పోలీసులోనే జీవితము గడపి నారు. జిల్లా పోలీసులో పనిచేసినప్పుడు అనేక జిల్లాలలో - వరంగల్ , అత్రాపుబల్దా, కరీంనరరు, ఔరంగాబాదు, మాహ బూబునగరు, రాయచూరు, గుల్బర్గా మున్నగు తావులలో పనిచేసినారు. మాతృభాష తెలుగు. కాని కన్నడము, మరాటీ భావలనుకూడ నేల్చినారు. ఉర్దూలో మాతృభాషలో కన్న నెక్కున ధోరణికలదు. ఫార్బీ బాగుగా చదివినారు. ముసలి తనములో వేల్సు యువరాజంకొక సంవత్సరమునకు రానుండగా ఇంగ్లీషు మొదలు పెట్టి నారు ఆ భాషలో నిప్పుడు బాగుగా పరిచయము కలదు. ఈ భాషల పరిచయము వారి పోలీసు యుద్యోగము నకు చాల పనికి వచ్చినది. పోలీసుల వద్దకు నానా భాషలవారు వచ్చు చుందురు, ఇప్పుడ నేకోద్యోగులకు జనుల భాష తెలియనందున వారు జనుల, కష్టసుఖ ములను గుర్తించలేరు. వారి మనస్సుల, వారి యిష్టములను వారి యాశ యముల గుర్తు పట్టలేరు. వీరట్లుగాక యెంతటి బీద వాడైనను వానితో వాని భాషయందే మాట్లాడి వానికి న్యాయముచేసి పంపుచుండెడివారు.


పో లీసు 'పీరే భీతి దాయకము. వారి డ్రైస్సు చూచినంతనే యింకకొంత భీతి హేచ్చును. వారి గర్జనలు ప్రాణములు తీయును- అట్టిశాఖ కధ్యక్షులైన వారెట్లుందురో యూహించుడు.పైకి చూచుటకు నేరస్థులను తర్జనభర్జనములచే బెదరింతురు. కానివారి హృదయము మాత్రము పోలీసు శాఖకు పనికి రానిది. వీరు పైకి చూచుట కెంత భయంకర ముగా మాట్లాడిసను మనసార నెవ్వరిని ( క్రూరులను, హంతకులను తప్ప) సష్టపెట్టలేదు. గోత్వాలు పదవి కత్తి పై సాము వంటిది. "క్షుర స్యధారానిసితం దురత్యయా" అనునది వేదాంత సంబంధ మైన దైనను నీపదవికి వర్తించునదే, అందు హైదరాబాదు కోత్వాలు పదవియనిన అది ప్రత్యేకత గలదే యనవలెను. పూర్వము కొత్వాలుగా నుండిన వారి పద్ధతులు వేరు. ఆకాలము వేరు, కాని యీ కాలము దినదినము నాజూకు అగుచున్నది. వీరు కొత్వాలు పదవికి వచ్చిన కాలములో నేను శీతాచల పర్యంతము సంచలనము కలిగించు చున్న అసహాయోద్యమ ఖిలాఫతు ప్రచారము మిన్ను ముట్టు చుండెను. హైదరాబాదులో కూడ సంచలము కలిగెను. కానియేమాత్రమును గడబిడలు కాకుం డునట్లుగా నాయద్యమ ములను వశపరచుకొనెను. ఆయుద్యమముల యనంతర మింకొక విపరీతోద్యమము హిందూ స్థానమంతటను జర్మను విషవాయువువలె వ్యాపించుకొనెను. ఏనగరమున జూచి సను హిందూముసల్మానుల కలహములే. బ్రిటిషిండియా రాజకీయ వాతావరణ మేరీతిగా నుండునో ఆరీతిగా నించుమించు సంస్థానములో గూడ నుండును. మన రాష్ట్రము లో గూడ నా గాలివీచెను. జిల్లాలలో అనేక చోట్ల గుల్బర్గా, సూర్యా పేట, నాందేడు మున్నగు ననేక ప్రదేశములలో హిందూ ముసల్మాను కలహములు జరిగెను. కాని హైదరాబాదు నగరములో నేటివరకు ఒక్క కలహమైనను జరుగ లేదు. ఇది సామాన్యవిష యమా ? దీనికి కారకులు రాజూ వేంకట గామా రెడ్డిగారు తప్ప యితరు లెవ్వరునుగారు. కలహ వాయువులు వీచు కాలములో వారుసుఖముగా నిద్రించువారు కారు. రాత్రింబవళ్లును అదే చింతతో నుండువారు. అందరిని సంతృప్తి పరచువారు. కలహ కారక లుండిన వారిని గుర్తించి వారికి భీతిగొల్పువారు.


బ్రిటిషిండియాలో వైస్రాయీలకే కాక వేలుయువ రాజుకు సహితము ఇబ్బందులు కలిగించు ప్రయత్నములు జరిగెను. కాని మన నగరములో మాత్రము వారికి విజయవంతముగా సర్వసుఖముగా సంపూర్తి గౌరవ పురస్సరముగా మర్యాదలు జరిగెను. వారు నగరమునకు వచ్చుటకు ఆరునెలలకు పూర్వము రాజాగారు. వైస్రాయి సేగా నొకటి స్థాపించి పోలీసు జవానులను హెచ్చుచేసి ఖుఫ్యాలను హెచ్చు చేసి నగరము లోనికి వచ్చు ప్రతి మనుష్యుని పరిక్షింప చేసి ఎన్నెన్నియో కట్టుదిట్టములు చేసి ప్రతి చిన్న విషయమును గూడ తామే విచా రించు కొనువారు.


వీరింత గ్పొపపదవిపై - అందు పోలిసుపదవిలో - నుండినను రాజులకు, నవాబులకు వీరి దర్శనము ఎంత సులభమో అంతకన్న హెచ్చుగా గొంగటి వాండ్లకు, గోచిబట్టల వాండ్లకు, అంత్యజులకు, బీదలకు. సర్వులకు లభించు చుండెడిది. గొంగడిలో నేమి ఆకర్షణయున్నదో కాని దానిని

కప్పుకొని వచ్చిన వానిని వీరు చాలశ్రద్ధగా యోపికతో విచారించి వారికష్టములు విచారించుట కై వెంటనే ఆజ్ఞలనిచ్చు వారు.


వీరు కచ్చేరీ చేసిన అది కచ్చేరీవలె నుండదు. ఒక పటేలు గారి చావడివలె నుండెడిది- బీద వారందరు దరఖాస్తులు వీరికే యిత్తురు గాని యితరుల కియ్యరు. వారిని పిలిచి వారి దరఖా స్తులు చదివి వారిని విచారించి వారు చెప్పుకొను కథలనంతయు నోపికతో విని యథా యోగ్యముగా విచారణ చేపెడివారు. కొన్ని సందర్భములలో పోలీసులకు సంబంధించని షికాయ తులుకూడ వీరివద్దకు తెత్తురు. అని న్యాయమనితోచిన ఉభ యపక్షముల వారిని పిలిపించి రాజీ చేయించి తీర్పు చేసెడివారు. ఇట్లు చేయుటచే వేలకొలది మందికి ద్రవ్యనష్టము, క్లేశము, ఇతర యిబ్బందులు అన్నియు మిగిలి పోయినవి.


వీరు పేరునకు 10 గంటలనుండి 4 గంటలవరకు కచేరీ నౌకరి చేయువారు. కాని నిజముగా చూచిన రాత్రి 12 గంటల నుండి తెల్లవార 4 గంటలవరకు తప్ప తక్కిన 12 గంటలకాలము వీరు సర్కారీ నౌకరి చేసినట్లే. సగము రాత్రి వరకు నగరములో జరుగు నేరములు ఎప్పటి కప్పుడు టెలి ఫోను ద్వారా ప్రతి నాకానుండి వీరికి తెలుపుచుండెడి వారు. ప్రతివారికి వీరు టెలిఫాను ద్వారానే హుకుము లిచ్చుచుండిరి. రాత్రి కాలములో 10 నుండి 12 వరకు కూడ జనులు తమకు విపత్తుకలిగిన పోలీసు సహాయ మవసరమైన స్వయముగా పోయి వీరితో చెప్పు కొనెడివారు. పేరుకు పోలీసు పహిరా యింటి పైనున్నది. కాని యెవ్వరు కొత్వాలీ దేవిడీలో పోయినసు, “ఎవరు, ఎక్కడ, ఎందుకు". అని విచారించువారే 'లేరు. ఇదియే నిజమైన రక్షక భటుపై పెద్దల కుండ వలసిన ముఖ్య లక్షణము.


కేవలము కోత్వాలీ పదవి'యే కాక వీకు ప్రతి దినము సాయంకాలము తన యేలికలగు , ప్రభువుగారి దర్శనమున కేగి యొక్కొక్కమారు గంట రెండు గంటల వరకు వారికిని వే దించుటయో వారి ఆలను నిర్వహించుటయో చేయచుం డెడివారు. వీరియందు శ్రీ ప్రభువుగారి కుండునట్టి విశ్వాసము బహుశ రాష్ట్రములో నింకెవ్వరిపై నను లేదనవచ్చును.


కొత్వాలు వేంకట రామా రెడ్డి గారు కోత్వాలీ పని లోనే కాక యితర సంస్థల లోను చాల సాయపడువారు. శాసన సభ, సఫాయి, సర్బెఖాసు కమిటీ, కో ఆప రేటివ్ యూనియన్ మున్నగు ప్రభుత్వ శాఖలలోనే కాక అనేక ప్రజాసంస్థలగు విద్యాసంస్థలందును ముఖ్యులై తను యమాల్యాసుభవ జనితము లైన అభిప్రాయములతో తోడ్పడెడు వారు. మేము మొదలే వ్రాసినట్లుగా వీరి చరిత్ర నెంత వ్రాసినను పెరుగుచు నేయుండును. వీరు కోత్వాలు పదవి వదలు కొనినను వీరికి మరల యితరోద్యో గములను శ్రీ ప్రభువు గారు నిర్ణయించి నారని వినుచున్నాము. శ్రీ రాజాగారు ఇంత వృద్దు లైనను మంచి ఆరోగ్యములో నున్నారు. మంచి యువ గులకన్నను 'హెచ్చుగా కష్టి చుచున్నారు. వీరికి సర్వేశ్వరుడు సంపూర్ణారోగ్యమును, బహుదీర్ఘాయుష్యమును, ప్రభు ప్రజాసేవాశక్తి వి, వంశాభివృద్ధిని, నిత్య కళ్యాణమునిచ్చి వృద్ధిని సగుగాత యని ప్రార్థించుచున్నాము. రాజా బహద్దరు

వేంకట రామా రెడి గారు ఓ. బి. ఇ.

యువశ్రావణ శు. 13

గోలకొండ పత్రిక


మోటారుకార్లు భుయ్, భుయ్, అని ఘీంకారాలు చేస్తూ వస్తూయున్నవి. ముసల్మానులు, గుజరాతీలు, మార్వాడీలు, అంధ్రులు ఒక్కొరొక్క రేవచ్చి వసారాలోని కుర్చీల మీద కూర్చుంటున్నారు. ఎనిమిదింటికి పది నిముషములుస్నది. తెల్లటిలాగు, కోటు వేసుకొన్న ఒక నౌకరు వచ్చి కాగితాల చుట్టను, పౌన్ టెన్ కలాన్ని, సులోచనాల జోడును బల్లమీద పెట్టి వెళ్ళిపోయాడు. సరిగా ఎనిమిది గంటలు కొట్టే సరికి బంగాళా లోపలనుంచి ఒకరువచ్చి బల్లదగ్గవున్న కుర్చీలో కూర్చున్నారు. వీరు రావటంతో నే కుర్చీలమీద కూర్చున్న వారంతా లేచి, , మొగలాయి పద్ధతిని ముమ్మారు తలవంచి, సలాముచేసి తిరిగి కూర్చున్నారు. బంగ్లాలోపలనుంచి వచ్చిన • పెద్దకు సుమారు 10 సంవత్సరాల లోపు వయస్సు, పరిమా ణంలో పొట్టి, కాస్త స్థూలశరీరం, నలుపురంగు, కుచ్చు వ్రేలా డేయెర్రటి ఫెజ్ టోపి, తెల్లటి వదలులాగు, నీలపురంగు గుడ్డ మీద తెల్ల చారలు కఫ్సవున్న పొడుగైనషర్టు. వీరే హైద రాబాదు కొత్వాలుగా నుండిన రాజాబహద్దరు వేంకట రామా రెడ్డి ఓ. బి. ఇ. గారు. వీరి విగ్రహంలో ఆకర్షణీయమైన అంశమేమీ లేదుగాని వారి సులోచనాల అడుగున దాక్కొని యున్న ప్రకాశమైన నేత్రములు, దయాసంకలిత హృదయాన్ని సూచించే ఆ నిష్కల్మషపు ముఖవికాసం ధృఢ సంకల్పాన్ని ప్రకటించే ఆ చెక్కిళ్ళు చూపకులకు ప్రస్ఫుటముగా కనిపిస్తవి. వీరు పోలీసు ఉద్యోగీయు లైనప్పటికి భయంకర ఆకృతియేమి లేక కొంత ప్రేమ, దయాళుత్వమే అధికంగా వీరియందున్నవి. బల్ల దగ్గర వీరు కూర్చుండిన రెండు నిముషాలకు కొందరు గుమా స్తాలు వచ్చి సర్కారు కాగితాలను కట్టలకు కట్టలు వారిముందుంచి, ఒక్కొక్క దానిమీద నే వారిసంశకం పుచ్చుకొన్నారు. వ్రాలు చేయవలసిన కాగితాలు యెన్ని ఉన్నప్పటికీ, ప్రతి కాగి తాన్ని శ్రద్ధగా చూచి సంతకం చేసిరిగాని చదువకుండా సంగతి గ్రహించకుండా మాత్రము చేయలేదు. ఒక వేళ గుమాస్తాలు వేసుకొని వచ్చిన వుత్త రువులు తమకు తృప్తి కరంగా లేని యెడల వాటిని మారుస్తూవచ్చినారు. ఈ ప్రకారం ప్రొద్దున 8 గం టలనుండి సాయంకాలము 6 గంటలకు తమ ఆఫీనుపని పూర్తి చేసుకొన్న తర్వాత వీరి దర్శనార్థమై వచ్చిన వారు ఒక్కరో క్కరే వారి యొద్దకు వెళ్ళి. మాట్లాడవలసిన సంగతులు మాట లాడి పోతూవచ్చిరి. రహస్య విషయములు మాటలాడవలసిన వారుంటే అట్టివారిని లోపలికి తీసుకొనిపోయి యేకాంతంగా మాటలాడి పంపి వేసిరి. ఎంతమంది వచ్చినాసరే నిదానంగా, నెమ్మదిగా మాట్లాడి పంపి వేయుదురు గాని విసుగు జెందరు. తొందరపడరు. కోప్పడరు. చెప్పిన సంగతులే తిరిగి తిరిగి చెప్ప టం, కాలహరణం చేయటము మన వారి స్వభావమైన చెప్పే మాటలను ఓపికతో విందురు గాని కాలహరణ మయినది వెళ్ళిరండి అనే మాట వినబడదు. అధికంగా యెక్కువ సేపు మాటలాడ దలచిన వారుంటే రాత్రి ఎనిమిది గంటల ప్రాంతములో ప్రత్యేక దర్శన మిచ్చి మాట్లాడుతూ వుంటారు మోటర్ల మీద, గుర్రపుబండ్ల మీద తిరుణాలకు వచ్చినట్లు వచ్చే ప్రజ యావత్తు ఒక తరగతి వారు ఒక పనికై వచ్చిన వారు గారు. 'పెద్ద ఉద్యోగులు, లక్షాధికారులు మొదలు ఉద్యోగాలకు, శిఫార సులకు, రాజ్యవ్యవహార సంబంధమైన స.ప్రతింపులకు స్కూలు జీతాలకు, విరాళాలకు అది ఇది అని విడదీయటం ఎందుకు! అన్ని విధాల సహాయ్యానికి వచ్చే వారుగా ఉంటారు.


వేంకట రామారెడ్డి గారికి ఆంగ్లవిద్యా పరిచయం స్వల్పం సవనాగరిక సంప్రదాయం అభ్యాసం రాలేదు. పాశ్చాత్య దేశాలకుపోయి ఆధునిక పోలీసు పద్ధతులను పరిశీ లింపలేదు. రాజ్యాంగ శాస్త్రాన్ని పరికింప లేదు. ఈ లాటి శిక్షణ యేమీ లేకపోయినప్పటికి ముస్లిమురాష్ట్రాలికి ప్రధాన నగరమున్ను, అనేక జాతుల ప్రముఖులకు నివాసస్థానమున్ను అయిన హైదరాబాదు కొత్వాలు పని అనగా పోలీసు కమిష నకు పదవినే ఎట్లా నిర్వహించారు? నిజాం ప్రభువుయొక్క ప్రత్యేక విశ్వాసానికి, గౌర వానికి. యెట్లా పాత్రులయినారు? గొప్పసమర్థులు, రాజనీతిజ్ఞులు అనే ప్రతిష్టను ఎట్లాగడించారు? ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానము బట్టే వేంకట రామా రెడ్డి గారి పరిపాలనా డక్షత యొక్క రహస్యము గ్రాహ్యమగుతుంది. ఆధునిక విద్యావంతులలో మంచితనము, పరోపకారబుద్ది లేవని చెప్పునుగాని, వేకట రామా రెడ్డి గారికి ఆధునిక నాగరికత విశేషముగా అబ్బకపోవడం మీదనే వారిలో అధికముగా కనుపించే ప్రాచీనుల నిగర్వము, సేవానురాగము, ప్రజోపయోగ కార్యనిరతి, కల్మష రహితమైన వర్తనము, సర్వజన శ్రేయోభిలాష జయ పదమగు పాలనము ఆధారపడి యున్నదని నావిశ్వాసము. విద్యవల్ల లభింపని యోగ్యత, సామర్థ్యము, పరిపాలనా దక్షత అనుభవంవల్ల స్వయు శిక్షల వల్ల లభించినవి. కేవలము స్వశ క్తివల్ల ఉన్న తస్థితికి వచ్చిరి.'


హైద్రాబాదు సంప్రదాయం విశేషంగా ముస్లిం నాగరికతకు సంబంధించివున్నది. అయినా రాజ్యాంగంలో హిం దువులున్ను ప్రాముఖ్యస్థానాలను' వహిస్తువున్నారు. బ్రిటిషు ప్రదేశంలో కంటే హైదాబాదులో హిందు ముస్లిం సఖ్యత అధికంగా ఉన్నదని ప్రతీతి. ఎంతవున్నా, అప్పుడప్పుడు విషమ పరిస్థితులు యేర్పడక పోవటం లేదు. ఇటువంటి విషమ పరిస్థితులు యేర్పడిన పు డెల్ల మన కొత్వాలుసాహెబ్ గారు చూపుతువచ్చిన వివేకము, దూరదృష్టి, కార్యదక్షత ప్రజయొక్క, ప్రభుత్వము యొక్క ప్రశంశ పాత్రమయినవి. వీరు కమిషనరుగా వుండినంత కాలం హిందూ ముస్లింకలహాలు లేక శాంతంగా గడచిపోయింది. రెడ్డి గారు మతరీత్యా హిందువు లున్ను, జాతీయులుగా ఆంధ్రులున్ను, అయినప్పటికి హిందూ ముస్లిం సఖ్య భావాన్ని, వీరు పోషించినంతగా మరెవరున్ను పోషింప లేదు. స్వజాతీయుల విశ్వాసాన్ని, ప్రేమను యెంత గడించిరో అంతగా ముస్లింజాతీయుల విశ్వాసాన్ని, ప్రేమను గూడ గడించినారు. దీనికి వీరి నిష్కల్మష హృదయం. నిష్కాపట్య స్వభావం, ప్రజాభిమానం కారణంగా యెంచ వచ్చును. వివాదగ్రస్తములగు ముస్లిం వ్యవహారాలను సహా వేంకలరామా రెడ్డి గారి పరిష్కారం' పై ప్రభుత్వం వారు నిర్ణ యించటాన్ని బట్టి యీ ఆంధ్రుని న్యాయబుద్ధి యందు ప్రభు త్వం వారికిన్ని, ముస్లిం మహాజనులకున్ను యెంత పూజ్య భావం గలదో విశదం కాగలదు. పరిపాలనా దక్షతకు ఆంగ్ల విద్యగాని, విదేశీయ శిక్షణ గాని అవసరం లేదనే సంగతికి వేంకటరామా రెడ్డిగారి చరితమే మనకు నిదర్శనంగా ఉంది. వీరిలో మనకు గ్రాహ్యము కానియేదో మంచితనము, గొప్పశక్తి లేని యెడల, హైదరాబాదు శాసనసభయందు, మునిసిపల్ కార్పొ షన్ లో సభ్యతను వహించి, ఆయా పదవుల నెల్ల తెలివి తేటలతోను, శక్తి సామర్థ్యము లతోను, ప్రజానుకూలము గాను నిర్వహించుటయే సంభవించి యుండదు. దీనజన సేవాను రాగమే లేనియడల కుష్టుల, వృదుల, అనాధ బాల బాలికల శరణాల యముల నిర్వాహక భారాన్ని వహించి వాటి ఉన్నతికై శ్రమచేయటమే పొసగి యుండదు. ఒక వైపున ప్లేగు, ఇంకోవై పున ఇన్ ప్లు యన్ జా బయలు దేరి ప్రజను నాశనం చేస్తూవున్న సమయంలో తమప్రా ణాల కై నా లెక్క చేయక వీధి వీధి తిరిగి బీదల ఔషధ పానాదుల సమర్చి అత్యుత్సాహంతో ప్రజాసేవకు దిగివుండరు - యింకా రెవిన్యూ, జ్యుడిషల్ మ్యుసిఫల్ యుద్యోగీయుల, ట్రయినింగు స్కూలు విద్యార్థుల ప్లీడరీపరీక్షకులగా వుండి ప్రసిద్ధినిగాంచి యుంఉరు. యిట్లన్ని మార్గాల ప్రభు త్వాన్ని, ప్రజను, దేశాన్ని సేవిస్తూవచ్చిన రెడ్డిగారిని కొత్వా లు స్థానంనుండి నిర్గమింపజేసేదానికై యెందరెంత ప్రయత్నించి నప్పటికి నైజాం ప్రభువు వీరి యుద్యోగ కాలాన్ని హెచ్చిస్తూ వచ్చిన సంగతి ఒక్క టే చాలు, వీరి యోగ్యతను న్యాయళీలాన్ని ప్రజాసేవను నిర్ణయించే దానికి, చివరకు వేంకట రామా రెడ్డి గారు పింఛను పుచ్చుకొని తమయుద్యోగంనుంచి మరల వలసివచ్చిపడు ప్రజలు దీనిని ఒక నష్టంగా తలచి బహుదుఃఖించిరి. ఈసందర్భం లో పోలీసువారు, ఆయాసంస్థలలో నిర్వాహకులు, పౌరులు, తమ విచారాన్ని ఒక ప్రక్క; రెడ్డిగారి పై గల ప్రేమను అభిమానాన్ని పూజ్య భావాన్ని తెలుపుతూ యింకోప్రక్క; సమర్చించిన అసంఖ్యాకము లగు పత్రములే నిదర్శనములు. ప్రజలు ప్రకటించిన సద్భా వంకంటె నైజాంప్రభువిట్టి ప్రజాభిమాని యగు నుద్యోగీని వదలుకొనుట కిష్టం లేక తమ సొంత ఎస్టేటు ఐన సరఫ్ ఖాస్ ఉద్యోగిగా నియమించి ప్రకటించిన గౌరభావం మహత్తరమైన విషయం మరువ తగనిది. నైజాము ప్రభువునకును వేంకటరామా రెడ్డిగారి కిని గల సన్నిహిత సంబంధాన్ని బట్టి యీ గౌరవభావం సహజంగానే ఉన్నది.


హైదరాబాదు రాష్ట్రంలోని ఒక కోటి 44 లక్షల ప్రజ లోను 70 లక్షలమంది ఆంధ్రులు, విశ్వవిద్యాలయ పండితులు లాయరులు, డాక్టర్లు, వర్తకులు, ధనవంతులు, ఎందరోవున్నా రు కానివీరు అందరిలోను ఆంగ్ల విద్యాపరిచయం లేనట్టి, ఆధునిక నాగరికత అబ్బనట్టి, పట్టి సామాన్య వ్యక్తి గా తమజీవితాన్ని ప్రారంభించినట్టి,కొత్వాలు, వేంక ట్రామా రెడ్డి గారివలె అంతగా ప్రజయొక్క, ప్రభుత్వం యొక్క, నిజాం ప్రభువుయొక్క గౌరవానికి అనుగ్రహానికి పాత్రమై అపారమైన తమ పలుకుబడికి ప్రజోప యోగ కార్యాలకై వినియోగించి వారు మిక్కిలి తక్కువ. ఈ గౌరవాన్ని పుట్టించింది ఉద్యోగమా? కాదు. విద్యా! కా దు. భాగ్యమా? కాదు. వేంక ట్రామా రెడ్డి గారియందు సహ జంగా వున్న శక్తి సామర్ధ్యాలు. సమదృషి, న్యాయశీలము, సేవాభిలాష ప్రబల కారణాలని నా నమ్మకము. నిజాం రాష్ట్ర ములోని 70 లక్షల అంద్రులలోను ప్రజలకు సహాయం చేసే వారు, యిచ్చయున్న వారు, చేస్తూ యున్న వారు మన మేకట రామా రెడ్డి గారే. వీరి స్వభావం చేతనైన ఉపకారం చేయటం కాని తీయ్యని మాటలు చెప్పి పంపడం కాదు. ఉద్యోగీయులమని ప్రజకు దూరంగా వుండటం కాదు. వారితో కలిసి వారికష్ట సుఖాలను గ్రహించి వారికి తోడ్పదుతూ ఉండడమే వీరి ఆశయము, హైదరాదులో ఆధ్రులకు గౌరవ ప్రతిష్ఠ లేమఁయినా కలిగి ట్లయితే అవి కొత్వాలు వేంక ట్రామా రెడ్డి గారి యొక్క డాక్టరు గోవింద రాజులు నాయుడు గారి యొక్క పేర్లను ఆశ్ర యించియున్నవి.


మొత్తాన హైద్రాబాదు రాష్టీయాంధ్రులలో ప్రత్యే క వ్యక్తిత్వము, జాత్యభిమానం, స్వయం సహాయ కృషి అంటూ వొకటివుంటే, అది రెడ్లలో మాత్రమున్నది. వీరిలో విద్య యున్నది. ద్రవ్యమున్నది. నాయకత్వమున్న ది. పరోపకార పారీణురాండ్రగు గద్వాల, వనపర్తిరాణులున్నా రు, అన్నిటికంటికంటే ప్రధాన మైన రాజ' ఒహద్దగు వేంకట రామా రెడ్డిగారున్నారు. హైదరాబాదులో సుమారు 70కు లక్షల రూప్యములను వెచ్చించి, 150 మంది విద్యార్థుల నివాస, భోజనాదులకు వసతి భవనాలు నిర్మింపబడిన వంటే 250 మంది బాలికల విద్యాభివృద్ధికై ప్రశస్తమైన ఒక బాలి కోన్నత పాఠశాల స్టాపితమై జయప్రదంగా నిర్వహింపబడుతూ ఉన్నదంటే కవులు, గాయకులు', పండితులు సన్మా నింప బడుతున్నారంటే – ఈలాటి ప్రజోపయోగ కార్యాలలో వేంకట రామా రెడ్డిగారు ప్రకటించే అభిమానము, చూపే శ్రద్ధ, చేసేశ్రమ ముఖ్య కారణాలుగా కనిపిస్తున్న వి. వీరు సహాయముచేయని సంస్థ లేదు, ఆదరింపని పండితుకు లేరు, దాతృత్వము చూపని ఆశ్రితుడు లేడు. డెబ్బది లక్షల ప్రజకు మిత్రులు, నాయకులు, ఉద్గారకులు ప్రజ యొక్క ప్రభుత్వము యొక్క అనురాగానికి పాత్రులు మన రాజాబహద్దరు వేంకట రామారెడ్డి గారు.



అవుటుపల్లి నారాయణ రావు

ఆ ఖిలభారత పద్మశాలీయు మహాసభ

వస్త్ర ప్రదర్శన ప్రారంభోపన్యాసము

8 ఆ బాన్ 1338 ఫసలీ నాడు మ. రా. రాజశ్రీ రాజబహద్దరు కొత్వాలు వేంకట రామా రెడ్డిగారు ప్రదర్శన మును తెరచుచు ఉర్దూ భాషలో నీ క్రిందియుపన్యాసము నొసంగిరి.

స్నేహితులారా !

అఖిలభారత పద్మశాలీయ మహాసభ సందర్భమున వస్త్రప్రదర్శన ప్రారంభోత్సవ మొనరించుట నాకొరకు మిగుల ముదావహ విషయము. కర్షకవృతి కి జెందిన వాడనగు నాకు జానపద పరిశ్రమయగు న స్త్రనిర్మాణముతోగల గాఢ సంబం ధమును మీరు దృష్టి ముం దుంచుకొని ఈయుత్కృష్టాత్సవము నందు పాల్గొనుటకవకాశ మొసంగినందులకు నే నెంతయు హృదయ పూర్వకముగ మెచ్చుకొనుచున్నాను.


జానపద జీవితమున కర్షక వృత్తికిని వస్త్ర పరిశ్రమకును కుడి యెడమ కరములకు గలసామాన్య సంబంధము కలదు. ఐశ్వర్య వృత్తి యం దీ రెండును కలసి మెలసి పనిచేయుచుం అలా డును. మరియుకృషి, విభజనయందును, క్రమాగత సంఖ్యను బట్టియు భారత సామ్రాజ్యమున కర్షకుల తర్వాత పద్మశాలీ యులే దేశసంరక్షణకు కారణభూతులు. ఈ విషయము గాంచుచు యీసమయమున మీ మద్యనుండుట వలన నాకు మరింత యుత్సాహము జనించుచున్నది.


ఈ సమయమున నేజేయ సంతోషదాయక కర్తవ్యము ప్రదర్శన ప్రారంభమే. అయినను; ముగ కొన్ని భావముల వ్యక్తి పచుట అనుచితము కాదు.


ఆధునిక యుగయంత్రాభి వృద్ధి మూలమున హస్త వస్త్ర పరిశ్రమ గతి గోషి యైగదని విశ్వసించు వారల హ్రస్వదృష్టిని నేను మెచ్చుకొనను. భారతము సందు పల్లెపదములును కర్షక నృత్తి యు ఉన్నంత వరకు కిరవసస పరిశ్రమ మిగిలియుండు నని నా నిగూఢ విశ్వాసము. ఉపయోగించువారి అభిగుచిని.బట్టి హెచ్చు తచ్చులు కలుగవచ్చును. కాలమునుపెట్టి వ్యవసాయమున కరువు, దుష్కాలమునున్నటు" సత్కాలము ఫలించు టత్యవసరములు.


భారత దేశముయొక్క పురాతన మైనట్టియు ముఖ్యమై నట్టియునగు వస్త్ర పరిశ్రమ సజీవముగ నుండటకై పద్మశాలీ యులు ధైర్యముతో, తెలివితో, కృషితో సర్వప్రయత్నముల సలుపుట అత్యవసరము. తర్వాత దేశీయుల మెప్పుదల మరియు ప్రభుత్వ సహాయము పై వారు నమ్మక ముంచవలెను.  మన పరిశ్రమల వలన నిస్సంశయముగ ప్రతి దేశ మున గౌరవము కలుగగలదు. అనుభవిద్దమగు నొక దృష్టాం తరమును బట్టి అది తెల్లము కాగలదు. పట్టుబట్టలకై పరాకు నొందిన ఫ్రాన్సు దేశమున నామిత్రుడొకడు సంగారెడ్డి యందు నేయబడిన సామాన్యమైన పట్టుబట్టను పట్టును పరికించుట యందు ప్రత్యే నైఫుణ్యముగల ప్రాన్సుయువిదలకు చూపిం చెను. ఆయువిదలు యావసనమసు చూచిపొగడిరి- దానిస్వల్ప వెల పై ఆశ్చర్యపడి. ప్యారిసునండట్టి బట్ట దొరకిన, బాగుం డెడిదనికోరిరి, అందమగు ప్యారిసు పట్టుకంటే పల్లెలయందు తయారై మోటుగ నగుపడుచుండెడి వస్త్రము నెందులకై మెచ్చుకొనరని వారి స్నేహితుడు విచారించ వారలు భారత దేశ హస్త జనిత పర్పటాంబరము యొక్క మోటు దనము నందేసహజ సౌందర్యమున్నదో పరాసునందలి యంత్రనిర్మిత వస్త్రము నందు కనబడవని వారు జవాబిచ్చిరి. ఈమెప్పుదల అసహజమనియో, పాశ్చాత్య వైపరీత్య మనియో మీరు తలంపుడు. కాని దాని వలన మన చేతి పట్టు ఐరోపా ఖండము నందును వ్యయమగునని తేటపడినది. పరాసు దేశ చక్రవర్తి యగు లూయి మహాశయుడు నాందేడు వస్తువుల నుపయోగిం చుచుండె నను విషయము నూతనమైన వార్త కాదు. అది అనాదీయ మైనది. హస్త వస్త్ర పరిశ్రమను గురించి మన దేశమునకు ఉత్తమ మార్గదర్శకులయొక్కయు, మంచి విద్య యొక్కయు, ఉత్కృష్ట కౌశలము యొక్కయు, మరియు ఆతిముఖ్యమైన కట్టుదిట్ట ములుగల విక్రయస్థానముల అవసరమున్నది


వ్యక్తి ప్రయత్నమును, సమిష్టి కృషియు సహకార సంఘమునకు తోడ్పడునటుల ప్రభుత్వ పోషకత్వమువలనను నా యా పర్యవసానములు గోచరము కాగలవు. వారి పశీ కరణము వస్త్ర పరిశ్రమ యొక్క భావిజమును ధృఢపరచును

. హస్త వస్త్ర పరిశ్రమాభివృద్ధి కై గత వత్సరములందు ప్రభుత్వ మొనరించిన సహాయ మెంతయు ప్రశంసనీ యాంశము. వస్త్ర నిపుణులు మరియు రంగు వేయుట యందు కుశ లుల యొక్క సహాయమున, వస్త్ర పరిశ్రమకు సంబంధించిన విద్యను వ్యాపింపజేయుటకై అతి వ్యయముతో చేసిన యేర్చాటులు, ప్రచురము జేయు ప్రదర్శకుల నియామకము, ఉత్తమ విధమగు పరికరముల ఆచారమునకై చేయుచున్న ప్రబోధము ప్రభుత్వముయొక్క పారిశ్రామిక సంస్థ యొక్క అమూల్యసేవలు. మరియు పద్మశాలీయుల కుదారముగ నప్పులనిచ్చుట, సహకార సంఘముల సహాయమున పద్మశాలీల స్థితిని బాగుపరచు ప్రయత్నములు ప్రభుత్వము యొక్క యుద్దేశము, ఔదార్యమును వ్యక్త పరచుచున్నవి. పద్మశాలీయుల స్థితిని తొలగించుటకై వాని యవసరము ముఖ్యము.

మన దేశపు పరిశ్రమలు మన కెట్టి యవసరములను దీర్చునో అమెరికా మరియు యూరపు యాత్రికులకు దీర్చుకొస్నను వారు వాని సంగ్రహము చే యు ట వలన మనకొక విషయము గోచరించగలదు. ఏవస్త్రములను మనము “షేర్వానీ"లనుగా జేసికొనుచున్నామో అవి వారియింటి యందగింపునకే ఉత్త మపద్తిని ఉపయోగపడుచున్నవి. మన చీరలు వారికి మంచి పరదాలపని చేయుచున్నవి. ఉత్తమ విక్రయపద్దతి నవలంబించిన యూరపు మరియు అమెరికా ఖండముల ప్రతి పట్టణమును లక్షల విలువగల వస్తు సముదాయమును కొనగలదు. కాని మన పద్మశాలీయుని స్థితయో, అతడు పది దినములు పనిచేయును, పది దిసములు వస్త్రవిక యమునకై వ్యయపరచును. ఈ దినములలో వాని కుక్షింభరము మార్గము మాయమైపోవును. అతడు భిక్షకుని జీవితము నవలంబించును. కాని అతని దుర్దశ కౌషధము మనకడనే కలదు.

భాగ్యనగరమున పద్మశాలీయ మహాసభ యాజమాన్యమున న్నీ ప్రదర్శన స్థాపన మెంతయు శుభముగ పరిణమించ గలదు.

భాగ్యనగరమునందు ధనవంతుల సహాయమునను, జన్మభూమి పైగల ప్రేమ మూలమునను భాగ్యనగరమున నొక గొప్ప కళను ప్రోత్సహించి పర దేమునకు స్వదేశవస్తు విక్ర యమునకై సంస్థలు స్థాపించి వస్త్ర పరిశ్రమ సౌభాగ్యమును పెంపొందింప జేసి ఐశ్వర్యమును పొంగి పొరలునటుల జేయుయా దర్శముతో పశ్మశాలీయ మహాసభ యాజమాన్యమున ప్రదర్శస స్థానమెంతయు శుభప్రదముగ పరిణమించగలదు.


బీదతనము చేటను తగినంత ధనము లేనందునను మీ జూతికి జెందిన వారలు స్వవృత్తి యగు వస్త్ర పరిశ్రమను వదలి సామాన్యులు కూలినాలియందు మగ్నులై యుండుట దీనికి కారణము. పూర్వ కాలమున ప్రతిపల్లె మందును పద్మశాలీయు లుండెడివారు. ఆక్కడ పండిన ప్రత్తిని కర్షకుల కడ నుండి స్వీక రించుకొని బట్టల నేసి బీద సాదలకును, మధ్య మస్థితియందున్న వారలకును పిక్రయించు చుండిరి. కాని యీకాలమున చిన్న తసపు పెండ్లిండ్ల వలన బీదతనము చేతను కలిగిన దుర్బలము మూలమున మీ బరువైన దళసర మయిన బట్టలు మోయుటకై నను తగనివారైపోయిరి. అందముగ సగుపడు ఆధునిక వస్త్రముల నుపయోగించు నుత్సాహముకలవారై పోయినారు. పూర్వకాలమున విలువ గల పటన్ మరియు గద్వాల చీరలు గట్టిగనుండి తరతరముల వరకు వారసత్వమున వచ్చు చుండెడివి. అవ్యసరమును బట్టి విక్రయింప దలచినచో పరిశుద్ధ మైస జరీయుస్నందున సగముకంటె నెక్కువ వెల లభించుచుం డెను. పటన్ సందు జరీతయారుచేయు వారలు ముఖ్యముగ మునల్మానులే యుండిరి. ఆ జరీ 'యేండ్లకొలదిగ వాడుకొనినను దాని మెరుపు, అందములో భేదము కలగకుండెడిది. అందువలన ప్రతి సంవత్సరమును బరోడా మహా రాజుల కడకును, పూనా, దమిష్కు మొదలగు దేశముకును లక్షల విలువగల వస్తుచయము పంపబడుచుండెను. ఇప్పుడు లక్షల వస్తువులు పోకున్నను వేల విలువగల వస్తువులయినను పోవుట అసంభవమైనది. దీనికి కారణ మేమన కాలానుసరణముగ మీజాతీయులు వస్త్రపరి శ్రమయందు మార్పులు జేయలేదు. ఇప్పటికిని పూర్వాచార పరాయణుగనే యున్నాడు. అందువలన నూతనశకపు యువతులును, యువకులును మీవస్తువును కొనుటకై వెనదీయు చుందురు. మీరు నూతన విధ వస్త్రమును తయాశచేయుట యేకాక అక్కడ వాని క్రయమునకై అడతీ దుకాణములను విచారించి తెరువ వలసి యుండును. ఈ కాలమున వస్తువుల యొక్క గట్టి దనమును విలువ విచారించువారలు లేరు. చాల కాలము వరకు పై మెరుగుగల వస్తువులను జనసామాన్యము మెచ్చుకొను చుండెను. ప్రస్తుతము ఆలేరులో వస్త్ర పరిశ్రమకయి తెరువబడిన కర్మాగారము నందు తయారుచేయబడిన వస్తువుల కెక్కువ క్రయమున్న దనియు, ప్రజలు మెచ్చుకొనుచు న్నారనియు తోచుచున్నది. నిజాంరాష్ట్రమందు మాజాతివారు జమీందారులుగను, కృషీవలులుగను, గ్రామోద్యో గులుగనుగలకు. స్వయం కృషి వలన వ్యవసాయ సాయమున ప్రతివిథమగు ధాన్యము పండించి జంతువులకు - పక్షులకు వేయేల ప్రతిజీవ వస్తువుల కాహారమి డుటయే వారి కర్త ఎ్యము. వారివలన ఫలింపబడిన ప్రత్తి వలననే మీజాతి వారు మానవులకు మాసము కాపాడు కొనుటకు వస్త్రముల నిచ్చుచున్నారు. మొత్తముపై వీరి సంబంధములు నమ్మిళితములు..


మీజాతి వారి ఆర్థిక స్థితి నానాటికి హేయమగుచున్నది. దీని వలననే జాతివృత్తి నిర్వహణము దుర్భర మగుచున్నది. వీరిని యీ బాగనుండి తప్పించుటకు ధనికులు వీరికి ధనసహా యము కావించి తిరిగి ప్రాచీన వృత్తికా గౌరవము కలిగించు టత్యవసరమ'. దీనికై యైక్యత, సంఘీ భానము, సహకారము కలిగియుఁడ వలయును దీనితో విదేశములందు తయారగు యంత్రముల సాయము బడయు నంతవరకు వీరికి మోక్షము లేదు.


ఇంతమాత్రముననే మీజాతీ యందలి విద్యావంతులు ప్రభుత్వ శాఖ సేవయందు చేరవలదని గాని, లేక లాభదాయకమగు మరొక వృతి, యవలంబింప గూడదని గాని నా యభిప్రాయముగాదు. మీప్రాచీన జాతీయవృత్తినే తగురీతిగా అభివృద్ధి పరచి మీరు లాభము గడించటయే నేను కోరినది. నూతన విధమగు చర్కాలు, ప లక ములు పయోగించి చక్కని అంద మైన వస్త్రమువలన లాభముగడించుటయే నేను కోరుచున్నదిప్రదర్శన ప్రారంభోత్సవము దేశమందలి ప్రతి బుద్ధి మంతునికొక యమూల్యమైన విద్యా, క్రియ పాఠముగరిపి తీరును. ఈ ప్రదర్శనము వివిద తరగతులలో జయమందుటకు ప్రతి వారు శక్తి కొలది ,ప్రయత్నము చేయవలసి యుండును. యీ జాతీయ సేవయందు పాల్గొనువారు నిజముగా ధన్యులన వచ్చును.


పై చెప్పిన విషయములు జయ మొందుటకు పరమేశ్వరుని ప్రార్థించుచు పదర్శనము ప్రారంభించుటకు గడంగుచున్నాను. మీసదుద్దేశ్యము, త్యాగ మీవిషయమున నాకు సాయపడునని విశ్వసించుచున్నాను.


నేతపరిశ్రమకు తగినంత ప్రోత్సాహము లేకుండుట వలననే దేశీయ పరిశ్రమలు నశించుచున్నవి. ఇప్పటి కైనను మన దేశమందు తయారగు వస్త్రములు పరిశ్రమ యొక్క యున్నత చిహ్నముగా గలవు. ఫ్రాన్సునందలి కొందరు స్త్రీలు సహితము మన సంగారెడ్డి పట్టు వస్త్రములను మిగుల ప్రేమించుచున్నటుల 'స్వానుభనము పై ఒక మిత్రుడు నాకు తెలియపరచెను. ఈ వస్త్రములను వారు తమ దేశపు వస్త్రములకు ప్రమాణ ములని నుడువ గలిగిరి. ఈ వస్త్రములను వారు మిక్కిలి యపేక్షతో యిచ్చటినుండి తెప్పించుకొనిరి, ఆ పేరునం దిప్పుడు భండారు ఆగయ్యగారి వస్త్రాలయములో తయారగు వస్త్రములు కొన్ని చాలా అందమైనవి గను ప్రశంసాపాత్రములు గాగలవు. మన దేశపు నేత వారు కాలానుసారము నూతన పరిస్థితులలో అవసరములను బట్టి పురాతన విధముగా యితరవస్తువుల వారివలె, స్థిరపరచు సమయమే తెంచినది. పరిశ్రమాభివృద్దికై వీరు నూతన సంస్కరణము లవలంబించు టత్యవసరము. పద్మశాలీయులు నేత పరిశ్రమ తప్ప మరొకటి యవలంబించ కూడదని దెలుపు నారలలో నేనొకడను గాను. అవసరములను పరిస్థితుల నుబట్టి యితర గౌరవనీయమగు వృత్తులను యవలంబించవచ్చును. పద్మశాలీయ సంఘమునకు జెందిన మామితృలగు శ్రీ హకిం నారాయణదాసు, హకీం జనార్ధనస్వామి గార్లు వైద్యవృత్తిని యవలంబించి యున్నారు. పరిశ్రమ వృత్తి గలవారి సుపుత్రులందరు నేత పరిశ్రమకు ప్రాముఖ్యత నొసంగుట వారి విద్యుక్త ధర్మమని మాత్రము 'దెలుపగలను. తచ్చు ఆదాయముగల వృత్తులను యీ వృత్తికన్న మంచిదని భావించి స్వీకరించుట తగదు. సభ్యులారా! మా రెడ్డిజాతికి పద్మశాలి జాతికి ధృఢ మైన సంబంధము గలదని సగర్వముగా తెలుపగలను. వీ రుభ యులు మానవ జీవి తా'వసరములు పవిత్రవంతమగు విధ్యుక్త థర్మములే నిర్వహించు చున్న వారు. 'రెడ్డిజాతి వ్యవసాయపు వృత్తి వలన మానవుల కేగాక జంతువులకు, పక్షులకు సహితము సంతోషము చేకూర్చు సామగ్రి కూర్చుచున్నది. ఇంచు మించుగా జీవ రానులన్నియు వీరికి కృతజ్ఞులు గా గలవు. పద్మశాలి జాతి మానవ సంఘమునకు శరీర సంరక్షణార్ధపు సేవ సలుపుచుస్నది. దేశీయులంద రీవృత్తి గల వారికి సాయ మొనర్చి ప్రశంసించుట ముఖ్యకర్త వ్యము, ఈ రెండు వృత్తుల వారుగాక వాణిజ్య వృత్తి గలవారు సహితము ముఖ్యలు ఏ విషయములందు గూడ వీరు వారికన్న తచ్చు కాజాలరు.


ఈ ప్రదర్శన ప్రారంభోన్చేవములో నొక మహాసభ యందు పాల్గొను యవకాశము కలిగించి నందులకు నేనెంతయో కృతజ్ఞుడను. ఆఖిల భారత పద్మశాలీయ సంఘపు యీ మహా సభ వ్యవహారములలో అధికార రీత్యా పాల్గొనుటకు నాకెంతయో యభిరుచిగలదు. ఈ అధికార ముతో వారి చిత్తుతీర్మాసము'ల గాంచితిని. మహాసభ సమావేశములు తమ సంఘము వారి అభివృద్ధి వారి నైతికాభివృద్ధి, సంస్కారము కయి ప్రయత్నించుటకు బూనుకొనుట చాలా ప్రశంసింపదగినది, అప్పు

డప్పుడు జరుగుచుండు అధికారుల నిందకు వీరు బూనుకొన కుండుట శ్రేయస్కరము, ఈ పద్ధతుల వలన వీరు అభివృద్ధి గాంచగలరని నేను పద్మశాలీయ సోదరులకు విశ్వాసము కలిగించగలను. దేశీయ పరిశ్రమల పోషకత్వము వహించిన ప్రభుత్వము వారీ సంఘము వారికి పూర్తిగా సాయపడి తీరెదరు.

వస్త్ర ప్రదర్శన శాలాధ్యక్షులగు

శ్రీ రాజాబహద్దరు వేంకట రామారెడ్డి కోత్వాలుగారి


ప్రశంస


సీ. మనమైన నీ రాజ్య కార్యసాధన ధీ ప్ర
          ధానత కీవున్న పదవిసాక్షి
లలితమా నీ నిజకుల సేవ కీ వొన
         రించిన రెడ్డి బోర్డింగు సాక్షి
ప్రతిలేని నీ ప్ర భుక్తి కి నీకును
        బాపించునట్టి తపస్పె సాక్షి
తరములే. గట్టి నీ పరమ పుణ్యమునకు
       హిత గుణుండైన నీ సుతుడె సాక్షి


గీ. అసదృశంబగు నీ దయారసమునకును
క్రమము లైనట్టి నీదు వాక్యములె సాక్షి
విబుధ వర్యుల పాలిటి వేల్పు గిడ్డి
ప్రథిత కోత్వాలు మేకట రామ రెడ్డి.


సీ. పంకజోదరు పొరపద్మ చింతనమన్న
     నిరుపమం బైన పెన్ని థియెమాకు
సంఘసంస్కార ప్రచార సభా దిన
    సంబన్న పెద్ద పర్వంబు మీకు


శ్రిత బుధ జన కోటి వితతరక్షణమన్న
        తప్పని నిత్యకృత్యమ్ము మీకు
ఆంధ్ర జాత్యభ్యుడ యాంచి తోద్యమమన్న
       భక్తి చే సలి పెకు వ్రతము మీకు


గీ. కుటిల జన పాటనము మీకు కులగుణంబె
సత్యధర్మంబులును మీరు సహజవృత్తి
విబుధ వర్యుల పాలిటి వేల్పు గిడ్డి
ప్రధిత కోత్వాలు వేంకట రామ రెడ్డి.


సీ. వేన వేల్ ప్రజలను విహితాత్ముల జేసి
        ప్రఖ్యాతి చెందిన ప్రభ శవంచు
బహుసంఘ సంస్కార బద్ధకంకణుఁడ వై
        నిలచిన సుజ్ఞాన నిధివటంచు •
యాంధ్రాభివృద్ధికై యాత్మనైన నొసంగు
        త్యాగంబుగల ధన్యతముఁడవనుచు
నిజ దేశ జనవృద్ధి నిర్వహణమున కై
       ప్రతిన బూనినయట్టి హితుఁడవంచు


గీ. భవ్యవస్త్ర ప్రదర్శన భవనము నకు
నాధిపత్యముబూని మే మాదరమున
సలుపు కార్యంబు దీర్చిన శాంతమూర్తి,
ప్రధిత కోత్వాలు వేంకట రామ రెడ్డి,


రాజా బహద్దరు వేంకట రామా రెడ్డి ఓ. బి. ఇ. గారికి


శ్రీవారి జన్మదినోత్సవ సందర్భమున

ప్రాతవిద్యార్థినీ సంఘము సమర్పించు

సన్మాన పత్రము


మమళయా!


నేను సుదినము. లోక కల్యాణార్ధమై మహాత్ము లుదయించుచుందురు. క్షణ భంగురములగు జీవితము లను కొందరు ఆదర్శ వంతముగఁ జేయుదురు. అట్టి యాదర్శ జీవుల పుట్టుం దినములు పుండుగలు. నేడు మాకు పండుగ. మీ పుత్రికలు జేసికొను పండుగ కాతిథ్యము స్వీకరించినందుకు వందనములు.

ఉదార చరితా!


విద్యాహీనమై, జడ మైయున్న స్త్రీలోక ముంజూచి కని కరించిన మహాయశో విభాసితులచే స్థాపింపఁ బడినట్టి, మా తృభాషా ద్వారా యున్న తవిద్యం గరఫుటయం దఖిలాంధ్ర దేశమునకు మార్దర్శినియై, ఏటేట నెందజనో యుత్తమ గృహిణులుగాఁ జేసి దేశమున కర్పించుచున్న; ఈ పాఠశాల కధ్యక్షత వహించి సర్వవిధముల విద్యను ప్రోత్స హించు మీ యుదారచరిత యంతయుం శ్లాఘ్యము.

కార్య దీక్షాదక్షా-


నానాటికి మీ యవ్యాజ దయవలెనే, వెలుగుచుస్న పాఠశాలా విద్యార్థినీ సంఖ్యచే స్థల సంకోచ మనుభవించుట తప్పని సరి యగుచుండగా, సజ్జనుల, బోత్సహించి పలుకుబడి నపయోగించి పాఠశాలకు దివ్యభవన నిర్మాణము నకై 25 వేల రూ. వెలగల భూదానముఁ జేయించి మరియంత ధనవ్యయమున దివ్యభవనముఁ గట్టింప దీక్ష వహించిన దక్షుడవు.


పరోప కార పొరీణా!


నేఁ డాంధ్రాపని యందు తలజూపు ప్రతి సత్కారము ప్రత్వ క్షమునో, పరోక్ష ముసనో, మీ చేయూత నొందకుండ నుండ లేదనిన అతిశయోక్తి కానేరదు. పఠనాలయములు, వసతి గృహములు, ప్రార్థనా మందిరము లన్నియు మా సహాయ ముపేక్షించునవియే! వెలితలేని. యివి విసువులేని యుపకారము.


పరిపాలనా ధురీణా !


సగర రక్షా ప్రధాన పదవిఁబోలు, ఉన్నతస్థాన మలంకరించి సమాచీన కార్యనిర్వహణముఁ జేసి ప్రభుత్వము నలరించి పూజనీయమగు రాజాబహద్దూర్, ఓ. బి. ఇ. బిరుదముల నంది యాంధ్రుల కపార కీర్తి గడించి పెట్టిన ప్రధానాంధడవు; నిను గన్న యాంధ్రావని వీర మాత, నీ సోదరాంధ్రులు ధన్యులు. మాన్యవ ర్యా!


గత ఎనిమిది సంవత్సరముల నుండి ఉన్నత విద్యాలాభమును యి పాఠశాలలోఁ బడసిన విధ్యార్తును లందరు ఒక చో జేరి తమ పాఠశాలకు తగు సహాయముఁ చేసి యద్దాన తా మిఁక ను బడయదగిన యుషకృతిఁ బడయు నుద్దేశముతో మా ప్రాతవిద్యా ర్థినీసంఘ మేర్పడినది. తమబోటి ధన్యజీవుల జన్మదినోత్సవము ప్రప్రథమముగా జేయంజాలు భాగ్యమును మా సంఘమున కొసగూర్చిన భగవంతున కభివందనములు. తమ జీవిత చరిత్రనుగూడ గ్రంథరూపమున వెలువరించి యాంధ్రుల కర్పించి ధన్యము గావలె నని ఈ సంఘము ద్దేశించి యున్నది. ఈ పవిత్రోద్దేశము నేర వేర్చ సర్వేశుని వేడుచున్నారము.


శ్రీ విద్యాభి మానీ !


పూర్వమువలెవే మందును మీ స్వర్ణహస్త ఛాయలో మా పాఠశాలాకన్య పోషితయై, దివ్యభ ననమున, తన సహజ కలకంఠమున మీ యశోగీతికలఁ బాడుగాత మనియు స్త్రీ విద్యాభి మానులును, దేశహితైక పరులును, ఉదార చరితులును అగు తమకు సుపూర్ణ పురు షాయుస్సు నొసంగి ఇట్టి జన్మదినోత్సవముల నెన్నింటినో చేయగల భాగ్యము మా కొసంగ భగవంతుని వేగుచున్నారము.

ప్రాతవిద్యార్థినీ సంఘము , 20-3-36

ఇట్లు విన్నవించు, (పాతవిద్యార్తినీ సంఘ సభ్యురాండ్రు.

మహా రాజ రాజశ్రీ


కొత్వాలు వేంకట రామా రెడ్డిగారి సన్నిధికి


విజ్ఞాపనము.


మ. కనక మ్మాధర రత్నకందరములన్ గంగాతటం బందుఁ జం
దనంపు గోనలఁ గ్రీకలం జెలఁగి యుం దారణ దమి? వక్షమం
దునఁ జెన్నారఁగఁ దాల్చు మాధవుఁడు సం తోషంబునక్ ( బ్రోఁచుతన్
ఘనుఁ గొత్వాల్విభు సద్గుణాకరుని వేం కట్రామ రెడ్డ్యగ్రణిన్ .


సీ. బల వైభవ ఖ్యాతి కలితులౌ రెడ్డి రాణ్మణుల కెల్లను
           శిరో మాల్యమగుచు
నధిక తేజశ్శక్తి నలరు సద్యో గీయ రత్నాళి
          నాయక రత్న మగుచు
సుర్వీశ వంద్యుఁజా యుస్మానలీ పాదుషాకు వజ్రపు
          కవచంబు నగుచు

-

ధనధాన్య సంపద దనరు నైజాము ప్రజాప్రతతికి
          దొలి నెల బాలుఁ డగుచు


గీ. భూరి విద్యాగుణోన్నత పుత్ర రత్న
భూ, తుఁడు నౌచుఁ నెవ్వండు పొలుచు నట్టి
ప్రదిత కొత్వాలు వేంకట రామ రెడ్డి
వరుని ధీ విభవోన్నతుల్ పలుక వశమె.


 సీ. అత్యన్నత పదంబు నధి వసించినఁ గాని పొలిపోని
          యాంధ్రత్వము ను దలంచి
గద్వాల మొదలుగాగల యాంధ్రసంస్థానములకు
          జేసిన సాయములఁ దలఁచి
విద్యగజచు రెడ్డి విద్యార్థు లలరెడు రాజిత
         శ్రీ సౌధ రాజిఁ దలచి
యాంధ్రభాషా నిలయాదుల పచియించు సారస్వ
         తోద్యమ సరణి దలఁచి


గీ. భవ్య కవితా విలాస సంపఁదలుబొదలు
టరసి నీ జేయునట్టి యాదరణఁ దలఁచి
యాత్మ నిన్ మెచ్చకుండెడి యాంధ్రుఁ డున్నె
ప్రథిత కొత్వాలు వేంకట రామ రెడ్డి,


ఉ. పుట్టితివాంధ్ర దేశమునఁ బఊర్యతఁ గంటివి విద్యలందుఁ జేఁ
బట్ట నిజాంప్రభుండుఁ జనవంద్య పదంబున మెట్టియుంటి వె

ప్పట్టున నాంధ్రు లాంధమన భాప మెలర్పఁగ సౌదరించు నీ
యట్టిగుణాఢ్యుడుండు నె,దయాకర వేంకటరామ ధీమణీ.


గీ. తనరుచు నొనర్చు నీ సుకృతంబులకును
దోడు గాఁ గవి యాశీస్సు లీడు లేని
వైభవోన్నతు లొనఁగూర్ప వఱలు మెపుడు
ప్రథిత కొత్వాలు వేంకట రామ రెడ్డి,



హైద్రాబాదు (దక్కన్) , తేది. 6 సెప్టెంబరు 1925

బాలమిత్రగుభ, గుంటూరు. , శ్రీరాముల సచ్చిదానంద శాస్త్రి, ________________

GEORGE R. 1. GEORGE THE FIFTH by the Grace of God of Great Britain, Ireland and the British Dominons beyond the Seas, King Defender of The Faith, Emperor of Irdia and Sovereign of the Most Excellent Order of the British Empice to our trusty and well beloved Raja Babadur Venkat Rama Reddy GREETING Whereas we have thought fit to nominate and appoint you to be an Officer of the Civil Division of our said Most Excellent Order of the British Empire. We do by these presents grant unto you the Dignity of an officer of our said order and hereby authorise you to have, hold, and enjoy the said Dignity and Rank of an officer of our aforesaid order together with all and singular privileges thereunto belong or appertaining.


Given at Our Court at Saint James's under Our Sign Manual and the Seal of our said order, this Fifteenth day of December 1930 in the Twenty first year of Our Reign.

By the Sovereign's Command S/d EDWARD T.


Grand Master. Grant of the dignity of an officer of the Civil Division of the Order of The British Empire to Raja Bahadur Venkat Rama Reddy.

రాజా బహద్దరు గారికి


ఓ, బి, ఇ. బికుదము ప్రసాదింపబడిన సందర్భములో పంపబడిన లేఖయొక్క అభి ప్రాయము


గేట్ బ్రిటన్, ఐర్లండ్, .బ్రిటిషు సామ్రాజ్యముల) యొక్క చక్రవర్తియు, ఇండియా చక్రవర్తి యు, అయిప అయిదవ జార్జి, మా ప్రియమైన విశ్వాసపాత్రుడైన రాజు బహద్దరు వేంకట రామా రెడ్డికి వ్రాయుట యేమనగా: –


మేము నిన్ను మాయొక్క , ఉత్తమమైన ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ ( ఓ. బి. ఇ. } యొక్క అధికారిగా నిర్ల యించుటకు నిశ్చయించినాము. కావున ఇందుమూలముగా మిమ్ములను పై వర్గములో చేర్చి గౌరవించుచు పైబిరుదమును దానికి సంబంధించిన గౌరవము వహించుటకు అధికార మిచ్చుచున్నాము.


మా ముద్రతో, మా సంశకముతో - ఈ 15 డిసెంబరు 1930 నాటి తేదీన మాయొక్క. 21 న పరిపాల నా సంవత్సర మున నియ్యబడినది.


చక్రవర్తి గారి ఆజ్ఞచే

సంతకము. ఎడ్యర్డు. టి. రాజా బహద్దరు గారికి


ప్రసాదింప బడిన


పతకముల యొక్కయు, బహుమానముల యొక్కయు


వివరణము


౧. చక్రవర్తిగారి రజితోత్సవ పతకము.

ఈపతకము -6 మే 1935 తేదినాడు ప్రసాదింప ఒడినది. ఆ తేదినాడు ఈ ప్రకారముగా ఆజ్ఞ అయినది.


" చక్రవర్తి గారి ఆజ్ఞ చే ఇందు వెంట పంపబడిన: పతకము రాజా జహద్దరు వేంకట రామా రెడ్డి ఓ. బి. ఇ. గారికి చక్రవర్తుల యొక్క రజతొత్సవజ్ఞాప కార్డముగా ధరించు కొనుటకు ప్రసాదింపబడిది."


2. లార్డు ఇర్విన్ వైస్రాయిగారు బహూకరించిన బంగారు గుండీలు

. హైద్రాబాదుకు పై వైస్రాయిగారు దయచేసినప్పుడు ప్రసాదించినారు.

3. వజ్రాల గు డీలు.

ఇవి బీరారుయువరాజు గారగు నవాబ్ ఆజుంజాబహద్దరుగారిచే వారు ఇంగ్లాండు నుండి తిరిగి


వచ్చి నప్పుడు రాజు బహద్దరు గారికి ప్రసాదింప బడినవి.


4. ఓ. బి. ఇ. బిరుదముతోకూడ ఒక గురుతుగల పతకము (Insignia) పంపబడినది.

5. రిపీటర్ జోబిగడియారము వెండిది. సుమారు 150 రూపాయల విలువగలది.


పూర్వము : కరీంనగరు తాలూక్దారుగా నుండిన పిస్టింజీ జీవాలజీగారు రాజాబహద్దరుగారికి ప్రసా దించిరి, పిస్టంజీ గారి యింటిలో 1902 లో దొంగ తనము జరిగినప్పుడు దొంగను పట్టుకొనినందులకు పై బహుమాన మియ్యబడెను.


6 . జిల్లా పోలీసు డైరెక్టరుగా అయిన హెంకి గారు రాజా బహద్దరుగారు సిర్సిల్లా, జగ్త్యాల మున్నగు తాలూకా లలో 1902 లో ఉత్తమమైన సేవ జేసినందులకు వెండి జోబీగడియార మిచ్చివారు.


7. ఒక బంగారు పతకము.


1918 -1919 సం||లో ప్రభుత్వము వారిచే ప్రసాదింపబడినది. ఆ పతకము పై ఇట్లు వ్రాయ బడినది.


“ నిజాం ప్రభుత్వమువారు వేంకట రామా రెడ్డిగారు 1918 - 1919 సం||లో ఇన్ ప్లూయంజా జ్వరాల ఆపత్తులో ప్రశంసనీయ మైన సేవ జేసినందులకు బహూకరించు చున్నారు.


8. వెండి క్యా లెండరు.

ఇది లార్డు వెలింగ్టన్ వైస్రాయిగారు హైదరా బాదు వచ్చినప్పుడు ప్రసాదించ యుండిరి.


9. ఫ్రీ మేసన్రీ సంఘము వారిచ్చిన పతకము ఒకటి,


10- చక్రవర్తి గారి రజతోత్సవ సందర్భములో నియ్యబడిన పతకము.


11. బంగారు గడియారము, బీరారు యువరాజుగారు ఇంగ్లాండు నుండి రెండవ మారు తిరిగి వచ్చినప్పుడు ప్రసాదించినారు.


12.. లార్డు రీడింగు నై సాయిగారు హైద్రాబాదు వచ్చి సప్పుడు ప్రసాదించిన వెండి సిగరెట్టు కేసు.


13.. 5వ ఎడ్వర్డు డ్బూక్ ఆఫ్ విండ్జర్, వేల్పు యువరాజు గారు హైదరాబాదుకు వచ్చి యుండి నప్పుడు ఒక వెండి సిగారు కేసును బహుమతిగా ఇచ్చినారు.



సమాపము