రసికజనమనోభిరామము/ప్రథమాశ్వాసము
శ్రీరస్తు
ఓం నమః కామేశ్వర్యై
రసికజనమనోభిరామము
పీఠిక
| 1 |
సీ. | చిన్నారిజాబిల్లి సేసక్రొవ్వెదపువ్వు, మెట్టరాచబిడారు పుట్టినిల్లు | |
తే. | గాఁగ జగములు గడితంపుఁగని రంపు, పెంపు రాణింప నెపుడుఁ బాలింపుచుండు | 2 |
చ. | పొలుపుగ గొల్లక్రొందలిరుఁబోఁడులకుల్కుమిటారిగుబ్బిగు | 3 |
మ. | దివిషద్రాజముఖీలలామఫలకోత్కీర్ణస్ఫురత్కుంకుమ | 4 |
మ. | నలుమోము ల్దన కబ్బి యుండుటకు నానందంబుతో నోలిమైఁ | |
| తులవెంట న్వలిగబ్బిగుబ్బచనుబంతు ల్వట్టి క్రీడాకళా | 5 |
సీ. | అమరశిరఃకిరీటాంచలమణివిభా, నీరాజితాంఘ్రి యేసారసాక్షి | |
తే. | యమ్మహావాణి పికవాణి యజునిరాణి, సైకతశ్రోణి మదచంచరీకవేణి | 6 |
మ. | ప్రమథాధీశశిరోగ్రభాగవిలసత్ప్రాలేయరుక్ఖండముం | 7 |
మ. | చిరభక్తిప్రతిభావిభాసితుఁడ నై చింతింతు నశ్రాంతముం | 8 |
సీ. | గురుతరకౌండిన్యగోత్రవిఖ్యాతుండు, బయ్యనామాత్యుఁ డేప్రభునితాత | |
తే. | మతులమతి రాజమాంబ యేయధిపుజనని, యతిపతివ్రత లక్ష్మి యేచతురురాణి | 9 |
మ. | తన రాక న్నుతి సేతు సేతుహిమవత్సంగాప్తశైలాంతరా | 10 |
చ. | మనమునఁ బ్రస్తుతింతు బుధమాన్యుల ధన్యుల జగ్గనార్య సిం | |
| జనవినుతాన్నదానగుణసంతతభవ్యుల మతిపితృవ్యులన్. | 11 |
మ. | కవిచూడామణుల న్మహాఘనుల వేడ్కం గొల్తు వల్మీకసం | 12 |
సీ. | బహుముఖవక్త యై పరఁగుకుండలినాథు, నఖిలకళాధాముఁ డైనసోముఁ | |
తే. | సతతలోకేశ్వరప్రపూజితనితాంత, రాజమానప్రభావుని రంగనాథు | 13 |
తే. | భంగమున దాఁగి పంకంబుపాల లోఁగి, సరసులకుఁ గాక యెఱుకలు సడల నెఱసు | 14 |
సీ. | అన్యపదాదాపహరణప్రవీణులు, సమధికసుశ్లోకవిముఖమతులు | |
తే. | ధూర్తకవిరాజుల కొకింతఁ దొలఁగవలయు, నఖిలదిగ్దేశనృపసభాఖ్యాతపూత | 15 |
సీ. | బహుపురాణములు ప్రబంధము ల్లక్షణ, శాస్త్రము ల్వివిధకోశములు నాట | |
తే. | మంచితేనియ జనులు వేమఱు కడంక, నరసి వడపోసి యునిచిన నందులోన | 16 |
సీ. | వళులయొప్పిదమున వఱలునాశయమృదు, పదవిభ్రమంబుల బాగు మీఱి | |
| మహితచమత్క్రియామధురవాగ్రచనల, శుభలక్షణారూఢి సొం పెసంగి | |
తే. | ప్రబలుమత్కావ్యకన్యకారత్న మఖిల, రసికజనసంతతమనోభిరామ మగుచు | 17 |
వ. | అని నిఖిలదేవతాప్రణతియు గురుచరణస్మరణంబును బితృపితృవ్యస్తోత్రంబును బురా | 18 |
సీ. | పరిపరిపీలుకర్బురపురక్షణనుఁ డ, గ్రగశాపటికజుహురాణవప్త | |
తే. | భద్రఖింఛోళుఁ డాశ్రితశూద్రధరుఁడు, నిగమరథ్యామృగుఁడు పీఠనిగమకులుఁడు | 19 |
తే. | అట్లు సాక్షాత్కరించి మహాత్ముఁ డైన, పిఠాపురీకుక్కుటేశ్వరాభిఖ్యసాంబ | 20 |
సీ. | ప్రతిభమై రుక్మిణీపరిణయంబును సింహ, శైలమాహాత్మ్యంబు నీల పెండ్లి | |
తే. | నట్టిప్రోడవు నీ విపు • డలఘుమతివి, రహి నొనర్పఁగఁ బూనిన రసికజనమ | 21 |
క. | నరవరు లిడుమణిభూషా, కరితురగాందోళికాదిఘనవిభవము ల | 22 |
వ. | అని యాన తిచ్చి యప్పరమేశ్వరుం డంతర్హితుం డగుటయు నేను నమందానందకం | |
| దళితహృదయారవిందుండ నై యమ్మహాదేవునకు నిమ్మహాప్రబంధంబుఁ గృతి సేయ | 23 |
సీ. | నిఖిలవిద్యాభ్యాసనిపుణుఁడు మత్సహో, దరుఁ డగుజగ్గసత్కవితనయులు | |
తే. | రావునీలాద్రిమాధవరాయనృపతి, చేతఁ గవిసార్వభౌమవిఖ్యాతబిరుద | 24 |
షష్ఠ్యంతములు
క. | శ్రీదునకు సకలముదిత, శ్రీదునకు నితాంతభృంగిరిటపటునటనా | 25 |
క. | భర్గునకు దళితపురభట, వరునకుఁ బ్రకీలితాపవర్గునకు లస | 26 |
క. | శంభునకు జితగజాసుర, దంభునకు సమస్తబుధవితానావనసం | 27 |
క. | భీమునకు రజతభూధర, ధామునకు సుధాంశుకోటిధామునకు మహో | 28 |
క. | శర్వునకు సతతముదితసు, పర్వునకు సమస్తభువనపావనలీలా | 29 |
క. | స్థాణునకు సతతపరిచిత, బాణునకు సరోరుహాక్షబాణునకు జగ | 30 |
క. | భవునకు నిరుపమశుభవై, భవునకు సంఘటితసకలభవున కురుప్రా | 31 |
క. | రంగజ్జటాగ్రవిలస, ద్గంగాప్రాలేయఘృణికి ఘనవితరణి కు | 32 |
ఆ. | అర్పణముగ నమ్మహాదేవుకృప నే న, నూనలీలఁ గూర్పఁ బూనినట్టి | 33 |
కథాప్రారంభము
క. | మును నారదమునివరునకు, మునుకొని పుణ్యేతిహాసములు నలువ దగన్ | 34 |
శా. | చంచత్కాంచనసౌధభాగలసితశ్యామాశుభాంగప్రభా | 35 |
సీ. | ప్రాకారములడంబు పరిఘలచెలువంబు, వనములపెంపు జవ్వనులసొంపు | |
తే. | కత్తలానులయేపు మేల్కట్లకోపు, మదురుగోడలమెఱపు వాల్మగలయొజఱపు | 36 |
మ. | పరిఘాంతర్విలసద్భుజంగయువతుల్ ప్రాకారశృంగాగ్రవి | 37 |
శా. | తుండాగ్రంబులు చాఁచి యప్పురి మహోత్తుంగద్విపేంద్రంబు లు | 38 |
తే. | అగము లుర్వీధరారాతి యాపనులకుఁ, దలఁ యప్పట్టణమునకు వలసి వచ్చి | 39 |
చ. | తలఁపఁగ దక్షిణోత్తరపదంబుల కుద్ధతి నేగి యాఱునా | 40 |
చ. | అనిలుఁడు లేడి నెక్కు జవ మారఁగ నప్పురిమేల్గుఱాలతోఁ | |
| చినచెలు వాయె నిప్పలుకు సిద్ధము గా దని యాడినం బ్రకం | 41 |
తే. | నాలుగును వేయి వక్త్రంబు లోలిఁ గలిగి, శ్రుతులు భాష్యంబు నడపుట ప్రతిభ యనుచు | 42 |
సీ. | బుధవత్సలులు కళాపూర్ణులు పరచక్ర, హరణులు కువలయాహ్లాదకరులు | |
తే. | సన్నతాభాస్వరులు పంకజాతదళన, చతురు లతిశీతలప్రదర్శను లుదగ్ర | 43 |
తే. | తనకుఁ దొమ్మిదిపాఁతఱ ల్థనము గల ద, టంచు జక్కులఱేఁడు గర్వించుఁ గాని | 44 |
క. | అద్రులు తేజంబున నమ, రాద్రులు దానమునఁ గాంచనాదులు ధృతి సౌ | 45 |
సీ. | తమగానములకు 'సంతసిలి పున్నాగము, ల్ప్రస్ఫుటభోగలోలతఁ జెలంగ | |
తే. | దమమృదూక్తిసుధారసధారలకు న, శేషబుధపుంగవులు చెంతఁ జేరి నిలువఁ | 46 |
చ. | అపరిమితానురాగమున నప్పురిలోని బొజుంగుమిన్న లె | 47 |
సీ. | చామల కెందు నీ సరసత గలదె తొ, య్యలి యన వరియింపు నిలిచి చూడు | |
| బలుకొఱ్ఱ చూపక నిలు మింతె యనిన న, వ్వలఁ గంది కైసైగ మెలఁపఁదగునె | |
తే. | యనుచుఁ దముఁ జేరి నెఱజాణతనము వెలయఁ, బలుకు నెలకోడెప్రాయంపుఁబాంథజనుల | 48 |
సీ. | సరసిజంబులు సారెసారెకు నెనయించి, యంబుజంబులు ప్రియం బలరఁ జేర్చి | |
తే. | గరము మెఱయించి సుకవులకరణిఁ బెక్కు, చందముల నీటుఁ జూపుచు సరసులను బ్ర | 49 |
శా. | వీట న్మాటి కనంగసంగరకళావిక్లాంతకాంతామణీ | 50 |
చ. | పనివడి పంటపైరులకు బాళిమెయిం జనుచిల్కమూఁకలం | 51 |
క. | ఆనగరికి నధిపతి యై, యానగరిపుకరణి ఠీవి నలరుచు నుండన్ | 52 |
క. | ఆరాజమణికుమారుఁడు, మారుఁడు సౌందర్యమునఁ గుమారుఁడు కడిమిజ్న్ | 53 |
సీ. | కాశకాశాధిపాకాశధునీహార, నీహారకలశవార్నిధులఁ దెగడి | |
తే. | మీఱి తనకీర్తి జగముల మెఱయ నలరె, నిఖిలభూభరణోదగ్రనిజభుజాగ్ర | 54 |
సీ. | కమనీయకలధౌతకాంతుల నిరసించి, ద్విజరాజనిబిడదీధితుల నెంచి | |
తే. | తనసమంచితకీర్తిప్రతాపములు ది, గంతరంబుల వెలయ నుదగ్రలీల | 55 |
సీ. | కువలయంబున కార్తి గూర్పనియినుఁడు చ, క్రావళి నొంచక యలరురాజు | |
తే. | డౌర యితఁ డని బుధజను లభినుతింపఁ, వఱలెఁ దేజఃకళావైభవప్రభావ | 56 |
సీ. | చాంచల్య మబ్జలోచనలచూపులయంద, కుటిలత సతులముంగురులయంద | |
తే. | కాని మఱి యెందు నేనియుఁ గలుగకుండ, ధరణిఁ బాలించె నఖిలభూధవకులేంద్ర | 57 |
తే. | దరికిఁ జేరిన నరికోటి దరికిఁ జేరు, శరము పూనిన నహితాళి శరము పూనుఁ | 58 |
వ. | అట్లు సమగ్రలీలావైభవోదగ్రుం డగునమ్మహీపాలాగ్రగణ్యుం డమందానందకందళి | 59 |
సీ. | పగడంపుగుండ్రకంబములు మేలికడాని, దూలముల్ జాబిలిఱాలమెట్లు | |
తే. | యంపునేఁతలు పుష్యరాగంపుజాల, కములు రవికాంతమణివలీకములు రజత | |
| ఫలకములు గల్గి నాడెంపుఁబనులబల్హొ, రంగుల ననారతంబుఁ జెలంగి మఱియు. | 60 |
సీ. | జాలవల్లికలు పచ్చలగద్దెపీఁట హొం, బట్టుతివాసీలు వట్టివేళ్ల | |
తే. | తమ్మపడిగలు మంచిగందంపుఁగోళ్ల, చిఱుతముక్కాలిపీఁట రాచిలుకపంజ | 61 |
తే. | రాజగురుబుధకనివసుధాజనులును, మిత్రజాహీనకేతువుల్ మెఱసి కొలువ | 62 |
సీ. | గొఱకయీఁటెలు మేటికఱకునారసములు, వంకకత్తులు పెడవంకవిండ్లు | |
తే. | వలుదసొరకాయదిప్పలు తులసిపేర్లు, గండ్రగొడ్డండ్లు చిక్కము ల్దండికోఱ | 63 |
సీ. | పులిగోళ్లు గజదంతములు పిల్లిగడ్డలు, చారపప్పు వెడందచామరములు | |
తే. | పనసపం డ్లీడపండ్లు కొమ్మనఁటిపండ్లు, కప్పురము దబ్బపండులు నిప్పపువు | 64 |
క. | విను జియ్య పొలముపట్టునఁ, గనుఁగొన నబ్రముగ నీపు కారుమెకము లా | 65 |
సీ. | కణుచు లీర్నాలుగుకాళ్లమెకంబులు, బెబ్బులుల్ తోఁడేళ్లు బొబ్బమెకము | |
తే. | లాది యగుదొడ్డమెకము లబ్బబ్బ యడవి, నెందుఁ జూచిన నెడ లేక యేపు మీఱి | 66 |
సీ. | కౌఁజులు పూరేళ్లు కన్నెలేళ్లు నెమళ్ళు, లావుక ల్దోరువా ల్లకుముకులును | |
తే. | లాదిగాఁ గలపులుఁగు లయారె బిట్టు, నెట్టుకొని కోనలోఁ గనుపట్టి యున్న | 67 |
క. | మృగయావిహారలంపటుఁ, డగుచు నపుడె చదరు డిగ్గి యతిరయమున న | 68 |
చ. | తడయక యూడిగంపునెలఁతల్ నృపు డగ్గఱి మానికెంపుబ | 69 |
సీ. | మురు వైనహురుమంజిముత్తియంపుసరంబు, లుదుటుగుబ్బలమీఁదఁ బొదివియాడఁ | |
తే. | గౌను నర్తింప నూర్పులు గందళింప, నలఁతిచెమ్మట నెమ్మేన నంకురింపఁ | 70 |
సీ. | గమగమవలచుచొక్కపుఁగమ్మకస్తురి, నలుగిడె నొకమదనాగయాన | |
తే. | జిలుఁగునిద్దంపుమడుఁగువల్వలు ధరింప, నిడియె నొక్కమనోజ్ఞరాకేందువదన | 71 |
తే. | నిలువుటద్దంబు ముంగల నిల్పి మేలి, కమ్మకస్తూరిరేక చొక్కముగ నొసలఁ | 72 |
క. | అగరుసితాభ్రజవాదీ, మృగమదచందనహిమాంబుమిళితం బై సొం | 73 |
క. | జిలిబిలివలిలేగాడుపు, లెలయఁగఁ బూసురటి విసరె నిమ్ముగ నొకశై | |
| వలకచ కరకంకణములు, ఘలుఘ ల్లని మెఱయ రాజకందర్పునకున్. | 74 |
సీ. | పులుఁగురాపచ్చబల్చిలుకతాళియ నొక్క, సుదతి పేరురమునఁ గుదురుపఱచె | |
తే. | బసిఁడికమ్మరుపట యొక్కకిసలయోష్ఠి, మొలను దవిలించి సరపిణిగొలుసు లొక్క | 75 |
తే. | హరువు మీఱెడిపసిఁడిపళ్లెరమునందు, రసరసాన్నము లిడి యొక్కరాజవదన | 76 |
క. | ఎంగిలి వార్వఁగ నీ ళ్లిడె, బంగరునెఱగిండితోడఁ బరువడి నొకసా | 77 |
తే. | తావికపురంపుబాగాలు తగటుఁబండు, టాకులును మేలివలిముత్తియంపుఁ గ్రొత్త | 78 |
క. | అంతట నానృపశేఖరుఁ, డంతఃపురి వెడలి వేడ్క లంతంత కెదన్ | 79 |
సీ. | భేరులు కాహళు ల్పిల్లగ్రోవులు పెద్ద, బూరలు తుడుములు భోరుకలుగ | |
తే. | బసిఁడిబెత్తులవా రిరుదెసలఁ గ్రమ్మి, జతన దేవ పరాకు హెచ్చరిక యనుచుఁ | 80 |
తే. | గడలు బాణా ల్పటాలు నగ్గలికఁ బూని, పరువడుల్ ద్రొక్కుకొనుచు నిబ్బరపుబీర | 81 |
తే. | వలలు బోనులు పెనుబల్లెములును ద్రుడ్లు, గండ్రగొడ్డండ్లు వాగురు ల్గడఁకఁ బూని | 82 |
సీ. | తెలిహురుమంజిముత్తియపుఁజౌకటులక్రొం, దళతళల్ చెక్కుటద్దములఁ బొదలఁ | |
తే. | నిమ్ముగా మేల్పసిండితాయెతులు మొల్ల, విరిసరు ల్దట్టముగఁ జుట్టి వ్రేసినట్టి | 83 |
సీ. | తీరుగాఁ గొనగోర దిద్దిన నిడుదక, స్తురిరేక నొసల మేల్సొగసు లీన | |
తే. | గప్పురము సాంకవము మంచిగంద మగరు, గస్తురియుఁ జాఁదుఁ బన్నీటఁ గలపి యిడిన | 84 |
సీ. | పసిఁడిపక్కెరజరబాజుమెత్తాముత్తి, యంపుజొంపములు చొక్కంపుఁగెంపు | |
తే. | గలితశుభలక్షణము లురుగతులు గడిఁది, తేజు నందంబు జవమును దిటము గలిగి | 85 |
చ. | వెలువడి యోలిఁ బ్రోలి నడువీథి జనంబులుఁ బౌరకామినుల్ | 86 |
చ. | జలధరవేణు లిందుమణిసౌధతలంబుల నిచ్చి మించుఁదీఁ | 87 |
ఉ. | అన్నులమిన్న యోర్తు వసుధాధిపనందనుఁ జూడఁ గోరి వా | |
| గ్రన్నన వచ్చె దానిఁ గని కామిను లందఱు నవ్వి రొక్కటన్. | 88 |
క. | పడఁతుక యొక్కతె యపు డా, యొడయనిఁబొడ గనఁగ వచ్చె నొడ్డాణము వే | 89 |
క. | వలఱేనిదెగడు నానృపు, చెలువము నలువారఁ జూచి చెలి యొక్కతె క్రొం | 90 |
క. | వనజాక్షి యొకతె కరముల, ననబంతులఁ ద్రిప్పుకొనుచు నరపుంగవుఁ గ | 91 |
సీ. | గురుతరవక్షోజకుంభసంభవగంధ, సిందూరరాగంబు చెన్ను మీఱఁ | |
తే. | మందయానవిలాసంబు సందడింప, నతనుపట్టంపుటేనుఁగో యనఁగ నొక్క | 92 |
చ. | కులుకుమిటారిగబ్బిచనుగుబ్బలవ్రేఁగునఁ గౌనుఁదీఁగ కం | 93 |
తే. | మీనలోచన యనుమాట మిథ్య గాక, యుండునట్టుగ నొక్కవేదండయాన | 94 |
తే. | అట్లు పురకామినీమణు లలమి చూడ, గాయకు ల్వాడ గణికాప్రకరము లాడ | 95 |
క. | వెడలు తదంతికమున నొక, యెడ నెల్లర నిలువ నాజ్ఞ యిడి డెందమునం | 96 |
మ. | చని యాభూపవరుండు గాంచె నెదురన్ జంబీరనింబామ్లికా | 97 |
సీ. | ప్రత్యగ్రఫలవలద్రాక్షాలతాకీర్ణ, తరుణామ్రశాఖాకదంబకంబు | |
| పాటీరభూమిరుట్కోటరాంతర్లగ్న, ఫణిఫణామణివిభాభాసురంబు | |
తే. | గంధవేదండమండల గండయుగళ, గళితదానాంబులహరికామిళితలలిత | 98 |
తే. | శల్యకదలిప్రియకశివాచమరకర్క్ష, కుంభరోహితనాగముల్ గొఱలు నందు | 99 |
సీ. | శక్రరంభాపారిజాతకైరావత, ఖ్యాత మై నాకలోకంబుకరణి | |
తే. | సంతతానంతనాగేంద్రసహిత మగుచు, విలసితం బగునలరసాతలముపోల్కి | 100 |
తే. | భోగినీగాఢపరిరంభయోగమునఁ జె, లంగు నచ్చోటిమేటిభుజంగకోటి | 101 |
క. | పరఁగె న్వనకరికిరికా, సరశరభతరక్షుఖడ్గశశవృకహరివా | 102 |
వ. | ఇట్టివిచిత్రలీలావైభవంబులకుం దావకం బైనయక్కాననంబు ప్రవేశించి యానృపాల | 103 |
క. | తమకమున మేల్సఠాణిన్, దుమికించుచు బరుగు వైచి దోర్బలవిభవం | 104 |
తే. | భటులు నటులనె నిర్భరార్భటులు నిగుడ, లగుడశరభల్లఘనసర్వలాత్రిశూల | 105 |
తే. | పసిఁడిగొలుసులు జరతారుపట్టెలును, మేలిహొంబట్టుజూలును మెడల గొప్ప | 106 |
క. | మోరలు దివి కెత్తుచు భౌ, భౌరవములుఁ జెలంగె భషకము లపుడ | 107 |
తే. | అపుడు గొందఱు మృగయు లయ్యడవిఁ దూఱి, ఘోరముగ నెల్లకడలఁ గగ్గోలు గాఁగ | 108 |
శా. | సారంగంబులఁ జెండి సింగముల నిస్సారంబుగాఁ ద్రుంచి భూ | |
| దారవ్యాఘ్రతరక్షుఖడ్గశశగంధర్వంబుల న్గంధమా | 109 |
సీ. | పులులమొత్తంబుల బోనులఁ జొరఁ దోలి, గండ్రగొడ్డ౦డ్లచేఁ జెండి చెండి | |
తే. | యసినికాతాంబకంబుల నచ్ఛభల్ల, శల్యశంబరహర్యక్షశరభగవయ | 110 |
తే. | ఖడ్గముల ఖడ్గములఁ ద్రుంచి కడిమి నచ్చ, భల్లముల భల్లములఁ జంపి పెల్లు మీఱ | 111 |
సీ. | అదె కరి యిదె కిరి యదె హరి పోనీక, పొడు పొడుం డని బొబ్బ లిడెడువారు | |
తే. | కొండగొఱియల దుప్పుల గండకముల, ఖండఖండంబులుగఁ బేర్మి నండగొనఁగఁ | 112 |
సీ. | పసివట్టి తోఁకలు విసిరి తారుచుఁ జెవుల్, రికిరించుకొని దిశల్ రేసి చూచి | |
తే. | గఱచి గీపెట్టునెడల నక్కజపులావు, లెలయఁ జీకొన నీడిచి యేపు చూపి | 113 |
వ. | మఱియును. | 114 |
సీ. | కౌఁజుపౌఁజులఁ బోవఁగానీక వాసియే, రణములఁ బఱపి శీఘ్రంబ తునిమి | |
| నేల నెమళ్ళపై నేలాపుడేగల, విడిచి యేపునఁ బీఁచ మడఁపఁ జేసి | |
తే. | పసపుముద్దయుఁ బాలయుఁ బచ్చఱెక్క, పసిడికంటెయుఁ బరజయుఁ బసులపోలి | 115 |
తే. | అట్లు దమకంబుచే వేఁట లాడి మృగమ, దంబుఁ జామరములు గజదంతములును | 116 |
తే. | అంత నవ్వేఁట చాలించి యవనివిభుఁడు, సేన గొలువంగ నవ్వనిచెంత నొక్క | 117 |
క. | అని వనజాసనుఁ డెఱిఁగిం, చిన విని సురమౌని ముదితచిత్తుం డైయా | 118 |
మ. | పురుహూతాగ్ని పరేతరాట్పలభుగంభోధీశవాతార్థపాం | 119 |
క. | దృక్కర్ణకర్ణభూషణ, వాక్కాంతాకాంతముఖ్యవందిత మిహికా | 120 |
ఉత్సాహ. | పురవిభంగ ధరనిభాంగ భూశతాంగ శశివిభా | 121 |
గద్యము. | ఇది శ్రీమత్కుక్కుటేశ్వరకరుణాకటాక్షనిరీక్షణసంలబ్ధసరసకవితాసామ్రా | |