రసికజనమనోభిరామము/పంచమాశ్వాసము
శ్రీరస్తు
ఓం నమః కామేశ్వర్యై
రసికజనమనోభిరామము
పంచమాశ్వాసము
| 1 |
వ. | అవధరింపుము వాణీమనోహరుండు నారదున కి ట్లని చెప్పం దొడంగె నట్లు సఖీజన | 2 |
చ. | తడయక ఱెక్క లార్చి విదితంబుగఁ దోఁక విదిర్చి లీలమై | 3 |
ఉ. | ఇంతిరొ యింత వింతవగ పేటికి నేఁటికిఁ జూడు ధారుణీ | 4 |
క. | అమ్మా నీసోయగ మపు, డమ్మానిసిఱేఁడు చూచి యరు దందెఁ గదా | 5 |
తే. | గాలి దూలి దూలి గ్రాలి సోలి విరాలిఁ, దేలి వ్రాలి యోలి బాళి మాలి | 6 |
సీ. | మరువక రామనామము జపియించుము, వలుదగుబ్బలసాంకవం బలందు | |
| సారెకు రాహుగ్రహారాధన మొనర్పు, తలఁపుము నీలకంధరుని మదిని | |
తే. | మబల పికకీరహిమకరానంగభృంగ, పవనచక్రాంగచంద్రకిప్రముఖదుష్ట | 7 |
చ. | తలిరుజిరావజీరుబలుదాడికి నోడి కడంక డక్కి పే | 8 |
క. | అని యనుఁగుఁజిలుక వలికిన, మనమున నొకకొంతవంత మాని వధూటీ | 9 |
తే. | చక్కెరలు నుక్కెడలు గ్రుక్కి మిక్కుటంపు, మక్కువలఁ జొక్కి చక్క ని న్బెక్కుగతుల | 10 |
క. | మకరాంకునకు న్రతికిని, బ్రకటంబుగ నలఁతిముద్దుపలుకులచేఁ గౌ | 11 |
ఉ. | మారుని గేరుచారుసుకుమారుని నామహిభృత్కుమారునిన్ | 12 |
తే. | మంతనంబున నావలవంతతెఱఁగు, విన్నపము సేయు మమ్మగమిన్నతోడ | 13 |
సీ. | ఆరాజదర్శనం బబ్బక యుండిన, నయనోత్పలంబు లేక్రియఁ జెలంగు | |
తే. | నహహ విహగకులోత్తమ యట్టు లగుట, జాగు చేయక వేవేగఁ జని యశేష | 14 |
ఆ. | అనుడుఁ గీరరాజ మట్ల చేసెదనమ్మ, చెలులఁ గూడి నీవు వలను మీఱ | 15 |
తే. | కొమ్మ నీమేని దొకమంచిసొమ్ముఁ దిగిచి, యానవాలుగ మెడఁ గట్టు మనిన నలరి | 16 |
చ. | వెర విరవార నజ్జలదవేణిని వీడ్కొని వేడ్క మీఱ నం | 17 |
తే. | కాంచి మెల్లన యయ్యనోకహముమీఁద, వ్రాలి యాక్రిందఁ బటకుటీరంబు చూచి | 18 |
క. | వసుధాసుధాశనప్రభుఁ డసమశరామేయసాయకాకుంచితహృ | 19 |
ఉ. | హా కలహంసయాన విరహానలవేదన కోర్వఁజాల న | 20 |
క. | లలనా మరువిరిబరిగో, లల నాడెందంబు గడుఁ గలంగెడు నివ్వే | 21 |
మ. | తళుకుంబంగరుబొమ్మచందమున నందం బారఁ గన్పట్టి యా | 22 |
వ. | అని మఱియు ని ట్లనియె. | 23 |
ఉ. | హె చ్చగునిచ్చవేఁట కిపు డేటికి వచ్చితి వచ్చి యెచ్చుగా | 24 |
క. | దాన మదిఁ బొదల సంగడి, చానలతోఁ గలసి మెలసి చనువెడ నయయో | 25 |
సీ. | గొబ్బిగుబ్బలు చూచి యుబ్బుచుండితిఁ గాని, నిబ్బరంబుగఁ జెంత నిలువనైతి | |
తే. | నహహ పని మించె నబల యిట్లఱ దలంచె, మరుఁడు పగ గాంచె వేముఱు మదిఁ గలంచె | 26 |
సీ. | శైవాలధమ్మిల్లచక్రవాకస్తని, కలహంసగామిని పులినజఘన | |
తే. | యగుచు సొగ సూనుదివిజకన్యావిలాస, సరసి నోలాడ కింక దుస్తరతరాబ్జ | 27 |
మ. | సవనాదిక్రియల న్సుధాంధులను మెచ్చం జేసి ధన్యాత్ము లై | 28 |
ఉ. | భూమిని భామినీమణుల భూరినిలాసరసైకమాన్యలన్ | 29 |
క. | తమిఁ గన్నులార నాఱని, ప్రమదంబున నింక నొక్కపఱి గన్గొనుభా | 30 |
ఆ. | అని తలంచుచున్న యా రాచతలమిన్న, పలుకు లాలకించి యెలమిఁ గాంచి | 31 |
క. | కులుకుచుఁ జక్కెరతేనియ, చిలికెడు నిద్దంపుముద్దుజిలిబిలిపలుకుల్ | 32 |
చ. | కటకట రాజచంద్ర యిది కర్జమె నిర్జరకన్యకామణిన్ | |
| దటుకున ఘోరమారనిశీతప్రదరంబులపాలు చేసి యి | 33 |
తే. | అధిప నీమోహనాకృతి యద్భుతముగఁ, గాంచినప్పటినుండియుఁ బంచశరని | 34 |
సీ. | భృంగ మంగనకు బల్సింగ మై పొడకటై, గాలి బాలిక కుగ్రకీలి యయ్యెఁ | |
తే. | నేమి చెప్పుదు నీకు రాజేంద్రచంద్ర, చంద్రవదనను నిపుడు నిస్తంద్రభావ | 35 |
ఉ. | చెప్పెడి దేమి దేవరకుఁ జేడియచందము పాన్పుక్రొవ్విరుల్ | 36 |
ఉ. | పూనదు మేన మానికపుభూషణము ల్చెలు లెన్ని చెప్పినన్ | 37 |
తే. | కమ్మవిల్కానిచేతిపూఁగొమ్మ ముద్దు, గుమ్మ రతనంపుబసిఁడికీల్బొమ్మ వలపు | 38 |
ఉ. | అంగము మేల్కడాని నఖంరాంకురముల్ తెలిక్రొత్తముత్తెముల్ | 39 |
క. | అండజయానచనుంగవ, యండ న్వసియించుభాగ్య మబ్బిన సుమకో | 40 |
క. | అని చిలుక పలుకుటయు న, జ్జనవరుఁ డ ఱ్ఱెత్తి చూచి శాఖాగ్రమునం | 41 |
తే. | రమ్ము రాచిల్క విరహవారాశిలోన, మునుఁగు నా కొకతెప్ప వై మొనసి నిలిచి | 43 |
క. | భళిభళీ శుకవికిరమణీ, పలు కిప్పుడ తర్కితోపపన్నం బగుమే | 44 |
ఆ. | అనుచుఁ జేరఁ బిలిచి నెన రొప్ప ముంజేత, నునిచి మేను నిమిరి మొనసి ముద్దు | 45 |
శా. | ఏమేమీ రమణీశిరోమణి భళా యిట్లాడి ని న్నంపెనా | 46 |
చ. | అతితరమారఘోరవిశిఖాగ్నిశిఖాపరితాపభీతి న | 47 |
మ. | మకరాంకుం డతిసాహసుండు శశిదుర్మార్గప్రచారుండు త | 48 |
ఉ. | నిక్కము గాఁగ నాపలుకు నెమ్మది నమ్ము దిటంబు చేసి యో | 49 |
తే. | కోమలికి నీవు తద్దయుఁ గూర్చుననుఁగ, వగుట మరునకు నెఱబంట వగుట నిన్నుఁ | 50 |
తే. | అనిన శుకరాజ మతనిఁ గన్గొని నృపాల, వంత యిం తేల యిది యానవాలు గాఁగఁ | |
| జేడె దనబన్నసర మంపెఁ జూడు మనుచుఁ | 50 |
క. | బన్నసర మపుడు నరపతి, కన్నుల నద్దుకొని యెదను గదియింపుచు న | 51 |
ఉ. | సేమమె గోము మీఱురతిచేతినిగారపుపైఁడిబొమ్మ క | 52 |
ఉ. | అంబుజపత్రనేత్రహృదయంబుతెఱం గొకయింత నీకుఁ ద | 53 |
ఉ. | తాలిమి దూలి జాలి మదిఁ దార్కొన నక్కనకోపమాంగిపై | 54 |
ఉ. | ఊరక కోరిక న్మదమయూరకకీరకదంబబంభరీ | 55 |
ఉ. | అన్నులమిన్న ని న్నచటి కంపిన నిం పెనయంగ వచ్చి యా | 56 |
ఉ. | అక్కమలాయతాక్షి నను నక్కున నొక్కి కవుంగిలించుచోఁ | 57 |
తే. | కలికియురమున నెత్తావికలప మలఁది | |
| విరిసరంబులు దమి నించువేళఁ జాల | 58 |
ఉ. | సాంకవగంధసారఘనసారమృగీమదసారసౌరభా | 59 |
సీ. | కలకంఠిజఘనభాగం బంటి యుంటకుఁ, గాంచి యేపుణ్యంబు గాంచినదియొ | |
తే. | కంజముఖిమేటిసిబ్బెంపుగబ్బిగుబ్బ, గుబ్బలులదండ నుండ నేఘోరతపము | 60 |
చ. | పలుకులు వేయు నేల విను పైదలిపైఁ దలకొన్నకూర్మి నేఁ | 61 |
తే. | అనుచుఁ బలవింపఁ గీర మోయధిప యింక, నిచట జాగేల వేగ నయ్యింతి నిన్న | 62 |
వ. | అని మఱియు ని ట్లనియె. | 63 |
ఉ. | అమ్మదచంచరీక రుచి, రాలకజాలక దా నొకింత డెం | 64 |
వ. | అనిన నతం డట్ల కాక యని లేఖ లిఖియించి యీలేఖ యా లేఖవధూవతంసమ్మున కి | 65 |
క. | దిట్టతన మెలయ నప్పుడు, చెట్టుప లల్లార్చి యెగసి చెచ్చెర దిని న | 66 |
వ. | అయ్యవసరంబున. | 67 |
తే. | వంతఁ గలఁగుచుఁ దెఱగంటి వాలుగంటి, యల్లనృపుఁ దెత్తు నని పూని యరిగినట్టి | 68 |
సీ. | చెలులార ముద్దురాచిలుక రానెలప్రోలి, కేరీతి నురుగతిఁ జేరఁగలదు | |
తే. | మాటలాడిన విని రాజమన్మథుండు, కౌతుకం జార నిచ్చోటి కేకరణి వచ్చు | 69 |
ఉ. | అక్కట మిక్కుటంపుఁదమి నక్కరుణానిధి నాడు చెల్మికై | 70 |
ఆ. | కుసుమశరశరార్తిఁ గుందుచుఁ జిల్కను, రాయబార మనుప రాక మసలెఁ | 71 |
తే. | కోరి యేప్రొద్దు సానులకూటములను, దవిలి కలకంఠు లెడపక దరుల మెలఁగ | 72 |
తే. | అహహ దక్షిణనాయకుం డగుచు జనులఁ, జాల నలయించు పెద్ద గాఁబోలు నాతఁ | 73 |
వ. | అని చింతించుచున్నసమయంబునం జిలుక యాకలకంఠిమ్రోల లీలం గనుపట్టిన దా | 74 |
క. | అండజసత్కులమండన, నిండారుకుముదంబుతోడ నిక్కము చెపుమా | 75 |
ఉ. | అంగజుఁ గ్రుంగఁ జేయునెఱయందపుఁజందపురాచమిన్న నె | 76 |
క. | చిలుకా యారాక్రొన్నన, విలుకానిం దేక నీవు నే వచ్చుటచే | 77 |
వ. | అనినం బక్షి యాసరోజాక్షి నీక్షించి యిట్లనియె. | 78 |
తే. | మానినీమణి నీయాజ్ఞ పూని యేను, సరభసంబుగఁ జని చని తెరువులోన | 79 |
సీ. | నిదురలేవడిఁ గెంపు నెఱయుకన్గవతోడఁ, బొడిపొడి యైనమైపూఁతతోడ | |
తే. | న్రాలి హా భువనైకవిభ్రమవిలాస, భాసమానాంగి ననుఁ గృపాపాటవమున | 80 |
ఉ. | ఓ చిగురాకుఁబోఁడి విను మొక్కపటావసధాంతరంబునన్ | 81 |
సీ. | హా ప్రభావప్రఫుల్లాంభోజలోచన, హా శరద్రాకాసుధాంశువదన | |
తే. | హా జగన్మాన్య గంధర్వరాజకన్య, యహహ మారున కిటుల న న్నప్పగించి | 82 |
తే. | ఏమి చెప్పుదు మఱియు నబ్భూమిజాని, యువిద నీచొక్కటపురూప మొక్కచిత్ర | 83 |
క. | ఏమే యోమేచకకచ, యేమే వామేక్షణామణీ హేమఘృణీ | 84 |
క. | పచ్చనివిలుదొర పైపైఁ, గ్రచ్చఱ విరిములుకు లేసి కాఱియ నిడుచో | 85 |
క. | నానా చూడవు మదకల, యానా యానలినశరునియాన సుమీ న | |
| న్నానన మెత్తి కనుఁగొని, సూనాస్త్రక్రియల నొఱపు చూపకయున్నన్. | 86 |
క. | అలుకా పలుకవు మరువిరి, చిలుకా రతిచేతిముద్దుఁజిలుకా యలుకా | 87 |
వ. | అని పలికి మఱియుం దత్తరంబున. | 88 |
చ. | చెక్కిలి ముద్దు వెట్టుకొనుఁ జేతఁ దురంబము దువ్వు నెమ్మదిం | 89 |
సీ. | కావిచక్కెరముద్దుమోవి యానఁగఁ బోయి, సారె కూరక నోరు చప్పరించుఁ | |
తే. | బ్రేమ మాటాడు మని పల్కరించఁ బోయి, మా ఱ్వలుకకున్న వెడవెడ మాటలాడుఁ | 90 |
క. | కొమ్మా యనుఁ బలుకవె విరి, కొమ్మా యను నీకు నింత కొఱకొఱ చెల్లెన్ | 91 |
తే. | అట్టివిరహార్తిఁ గుందుచున్నట్టిమనుజ, వల్లభుని గాంచి నీకెఱఁ గెల్లఁ దెలియ | 92 |
ఉ. | కోమలిమీఁద నాకుఁ గలకూరిమి దేవుఁ డెఱుంగుఁ జిల్క నీ | 93 |
వ. | అని పల్కి. | 94 |
తే. | కమ్మవిల్కానిఁ దెగడు నయ్యెమ్మెకాఁడు, కొమ్మ నామాట నీ వెద నమ్మ వనుచుఁ | 95 |
వ. | అనిన నచ్చాన చెచ్చెర నచ్చీటి విచ్చి పుచ్చుకొని నెచ్చెలి కిచ్చిన నది యిట్లని | 96 |
సీ. | శ్రీమత్సకలలోకసీమంతినీజనా, తీతనిరంతరద్యోతమాన | |
| గాంధర్వకులరాజకన్యాలలామకు, ఘనుఁడు ఋతుధ్వజావనివిభుండు | |
తే. | గడఁకఁ బొడకట్టి యప్పుడె జుడిఁగి పోవు, టాదిగఁ బ్రసూనవిశిఖజ్వరార్తిఁ జెంది | 97 |
ఉ. | ఏ మని తెల్పువాఁడ నొకయింతయు నక్కటికంబు లేక న | 98 |
క. | అని చదివిన విని వనితా, జనరత్నము సిబ్బితియును సంతసమును నె | 99 |
శా. | ధాత్రీనాథశిఖామణిం గని యథార్థం బొప్ప మత్కార్యమున్ | 100 |
క. | శ్రీరమణికి గీరమణికి, నీరమణీయోక్తి యుక్తి నెఱపుచుఁ దచ్చే | 101 |
వ. | అని చిలుకం దిలకించి పలికి కలికి చెలికత్తియలుం దానును మనోవికాసంబున భా | 102 |
తే. | చక్రపరిపాలన మొనర్ప జగమువిందుఁ, దరలి వచ్చెను నీ వింక నరుగుమంచు | 103 |
తే. | చక్రరిపుఁ డగురాజశాసనమువలన, నెంచి మారుండు పాంథుల నేయఁ జాఁగెఁ | 104 |
సీ. | అసమానవాసనా లసమానమల్లికా, ప్రసవమంజరులపై ముసరి ముసరి | |
తే. | యుపరిసురతక్రియాక్లిన్నచపలలోచ, నాఘనస్తనభాగనిదాఘసలిల | 105 |
తే. | అతులగతుల నితాంతోపరతులఁ బతుల | |
| మతుల కామోద మొనఁగూర్చి నుతులు గన్న | 106 |
తే. | కలకలధ్వానములతో ఖగంబు లెగసి, చదలఁ జరియించెఁ దమకులస్వామి యైన | 107 |
చ. | గుసగుసలాడి పల్లవుల గొబ్బున వీడ్కొని యుత్తరీయముల్ | 108 |
సీ. | కమ్మవాతెఱపానకమ్ములు చవి చూపి, నిద్దంపుచెక్కులు ము ద్దొసంగి | |
తే. | మెల్లమెల్లనె చేతిసొ మ్మెల్ల లాగి, తెల్లవాఱినఁ దమదెస వెల్లి బెల్లి | 109 |
సీ. | కడఁకతో నిదుర మేల్కాంచి దిగ్గనఁ బాన్పు, దిగి కటిస్థలిఁ గోక బిగియఁ గట్టి | |
తే. | యందియలు మ్రోయ మట్టియ ల్గ్రందు సేయ, నిదురచొక్కుల నడుగులు గొదుకు పూన | 110 |
ఉ. | విక్కుచుఁ బోయి యాగడపు వెంపరతొత్తులయిండ్లు దూఱి బల్ | 111 |
క. | తూరుపు తెలతెలవాఱినఁ, దారలు గృహదీపములును దమి లంజియలం | 112 |
వ. | అంత. | 113 |
మ. | బిసినీకాంతవియోగసంజనితగర్భీభూతతాపజ్వరో | 114 |
సీ. | చక్రరక్షణకళాచాతుర్యశాలి దా, నినశబ్దవాచ్యుఁ డై యెసఁగు టరుదె | |
తే. | యనుచు ననచినవేడ్క బుధాళు లెల్లఁ, దను నుతించుచు సమయకృత్యములు దీర్ప | 115 |
తే. | మున్ను దా నపరాసక్తిఁ జన్న ఖిన్న, యగుచుఁ బద్మిని నెమ్మోము మొగిచె నంచుఁ | 116 |
క. | తమ్మికొలంకులపై జుం, జు మ్మని తుమ్మెదలు మెఱయుచొ ప్పలరె సరో | 117 |
క. | తమి యెల్లఁ దీర్చి తమప్రియ, తముఁ డగురా జస్తమింపఁ దఱిఁ గని వచ్చెం | 118 |
తే. | చక్రములు పొంగె దస్యుసంచయ మడంగెఁ, దమము చెంగె ద్విజప్రతానము చెలంగె | 119 |
తే. | అపుడు సురకామినులు సమయార్హవిధులు, దీర్చి మణిభూషణాంబరదివ్యగంధ | 120 |
తే. | తమరు దొలునాఁడు మెలఁగినతావు చేరి, యచట నభినవగానవిద్యావినోద | 121 |
తే. | కష్టతరముగ రేయెల్లఁ గడపి మఱియుఁ, దత్తరింపుచు వేఁకువతఱిని లేచి | 122 |
మ. | స్మరియింతున్ స్మరమండలేశ రవిరాజత్ప్రాజ్యరాజ్యేందిరన్ | 123 |
చ. | వలకొని బోటికత్తె లిరువంకల డాసి భజింప నింపుగా | 124 |
చ. | అఱమఱ లేక నేఁ దఱిసి యాడ వసించినఁ జూచి నానతో | 125 |
చ. | పస యొసఁగం బొసంగునునుబంగరుబొమ్మతెఱంగునన్ దరిన్ | 126 |
క. | వలఁతితనం బెలయఁగ నా, చెలికానికి నుత్తరంబు చెప్పుచు ముద్దుల్ | 127 |
క. | తలవంచి పసిఁడిగద్దియ, కెలనన్ నాపలుకు లాలకింపఁగ ముంజే | 128 |
చ. | అగణితలీల ఱా ల్గరఁగునట్లుగఁ జె ట్లిగిరించునట్లుగా | 129 |
చ. | చెలిమి వెలందు లిమ్మునకుఁ జెచ్చెరఁ దోడ్కొనిపోవుచున్నచో | |
| సొలసి గిఱుక్కునం దిరిగి చూచునొయారియొయార మెన్నెదన్. | 130 |
క. | పొంగారువేడ్కఁ బూచిన, తంగెడుక్రియఁ జూడ నలరి తమి రేఁచినయా | 131 |
చ. | తొలకరిక్రొమ్మెఱుంగుక్రియఁ దోరపురత్నశలాకపోలికన్ | 132 |
సీ. | కులుకుసిబ్బెపుగబ్బిగుబ్బల వ్రేఁకున, గడగడ నసదులేఁగౌను వడఁకఁ | |
తే. | భావమున నన్ను విడనాడి పోవలేని, కూర్మి నందంద తిరిగి కన్గొనుచుఁ జనెడు | 133 |
తే. | అని తలఁచుచుండి యంత నయ్యవనిజాని, వేగుటయు లేచి సమయార్హవిధులు దీర్చి | 134 |
క. | కాంచె నుదంచన్మణిమయ, కాంచనపాంచాలికానికాయములఁ గడున్ | 135 |
క. | మఱియును. | 136 |
సీ. | శుకవాణి నభినవముకురబింబకపోల, నలికులవేణి నేణాంకముఖిని | |
తే. | నఖిలభువనైకమోహిని నబ్జకంఠి, నతులశృంగారవారాశి నన్నిలింప | 137 |
వ. | అట్లు గాంచి. | 138 |
క. | కొంచింపక వడిఁ బెన్నిధిఁ, గాంచినపేదయునుబోలె ఘనతరహర్షో | 139 |
తే. | వినుము తనుమధ్య మాటలు వేయు నేల, వెలయునీరూపలావణ్యవిభ్రమములు | 140 |
క. | అరవిందనయన విను మ, మ్మరుఁ డిఁక హింసింపకుండ మనుపుము కరుణం | 141 |
సీ. | కులుకుచు జిలిబిలిపలుకులఁ గపురంపుఁ, బలుకులు తులకింపఁ బలుకఁగదవె | |
తే. | యెద ననుం గదియించి యియ్యదనమదన, కదనలీలల నలరింపఁ గదవె కుంద | 142 |
చ. | సమదగజేంద్రకుంభవిలసత్కుచకుంభయుగంబు ఱొమ్మునం | 143 |
క. | అని దీనత దోఁపఁగఁ బ, ల్కిన విని తల వంచి యామృగీదృశ యపుడే | 144 |
క. | నరపాలక యీబాలిక, మరుపాలఁ గడుం గలంగి మరి నీపై ని | 145 |
ఆ. | అనిన సంతసిల్లి యవనిపుఁ డటు లేచి, యింతులార యిన్నగాంతికమున | 146 |
క. | అనవుడు వా రజ్జననా, థునివెంబడి నంబుజాక్షిఁ దోడ్కొని సరగన్ | 147 |
సీ. | సకినెలపట్టెమంచము దోమతెర జర, తారుబాలీసు క్రొందరటుపఱపు | |
తే. | తమ్మపడిగము మంచిగందంపుఁగోర, తబుకు చిన్నారియడప మత్తరువుకుప్పె | 148 |
తే. | అందఱు ప్రవేశ మొంది రానందలీల, నపుడు నృపుఁడు నితాంతప్రహర్షభా | |
| మానమానసుఁ డై సొగసూని దాని, నెనయఁ గోరుచు నెపు డెప్పు డనుచు నుండె. | 149 |
వ. | అంత దినాంతం బగుటయు. | 150 |
సీ. | కలికికెన్నులఁ క్రొత్తకజ్జలం బెలయించి, తురుమున గొజ్జెంగవిరులు దుఱిమి | |
తే. | హారకేయూరకటకమంజీరకాంచి, కామణిగ్రైవతాటంకకంకణాద్య | 151 |
క. | ఎలనాగ నీవు గోరిన, చెలువుఁడు నీ కబ్బె నింక సిబ్బితిమై బె | 152 |
సీ. | చెలువుఁడు కేల్వట్టి సెజ్జకుఁ దార్చుచోఁ, బెనఁగి వెన్కకుఁ జక్కఁ జనెదు సుమ్ము | |
తే. | ప్రియుఁడు గాటంపువలపులఁ బెల్లు రేఁగి, యల్లనల్లన యిక్కువ లంటి తుంట | 153 |
ఉ. | అంటిమి గాని యోవికసితాంబుజపత్రవిశాలనేత్ర ము | 154 |
క. | అను ననుఁగుఁజెలులపలుకులు, విని యనిమిషరాజకన్య వ్రీడానమితా | 155 |
ఉ. | అమ్మకచెల్ల మీరు నను నారడిఁ బెట్టి జుడింగి పోవ ను | 156 |
చ. | కటకట మీర లిట్టిబలుకట్టడ లౌట యెఱుంగ నేర కి | |
| కుటిలత గానవచ్చె నిదిగో పెఱమాటలు వేయు నేటికిన్. | 157 |
క. | అని పలుకుచుఁ గేలీగృహ, మునకుం జొరకున్న చిన్నిముగుదలమిన్నం | 158 |
శా. | చాలా బేలవె మేలుమే లిపు డహా, బాగాయె లే గాఁపురం | 159 |
సీ. | చెయివట్టి పూసెజ్జఁ జేర్పఁ బోయెడు వెలం, దుక కరంబు విదల్చి త్రోచి వైచి | |
తే. | పూని యిర్వురు మువ్వురు పొదుగఁబట్టి, ముందఱికిఁ ద్రోయ గడితంపుమున్నఱికల | 160 |
క. | అల్లపుడు పెక్కులాగుల, నెల్లఱ బతిమాలుకొంటి వెడలనికూర్మిన్ | 161 |
క. | అగ్గలపువలపుసొలపుల, బెగ్గిలుచుండితివి మున్ను ప్రియనాథునితో | 162 |
క. | బిఱబిఱ విభుకడ కరుగక, కొఱకొఱ లాడెద వ దేమి గోరము మేల్మేల్ | 163 |
సీ. | చేరి కాళ్లఁ బెనంగు. గారాపుటనుఁగురా, యంచబోదలఁ బో నడంచె దేమి | |
తే. | వారిజాక్షిరొ యిటువంటివారె కారె, కోరి సారెకుఁ బువ్వులకోరిబల్వ | 164 |
చ. | అని యిటు లూరడించి చెలు లవ్విభుచెంతకు నింతి మిన్నఁ దో | 165 |
చ. | అపుడు నృపాలుఁ డమ్మధుకరాలకజాలకసోయగంబు గా | 166 |
ఉ. | ఇందునిభాస్య నాన నపు డీడిగిలం బడి పూలపాన్పునం | 167 |
క. | మెల్లనె పూసెజ్జకు దివి, షల్లలనామణిని దిగిచి • జానుగ మృదధ | 168 |
క. | నాన యిటు లేమిటికి నలి, నానన కెమ్మోవి పంట నానఁగ నిడినన్ | 169 |
ఉ. | దండిగఁ దావిచెంగలువదండలు క్రొమ్ముడిఁ జుట్టనిమ్ము క | 170 |
చ. | పలుచనితేనియల్ చిలుకఁ బల్కవె కోకిలవాణి లేఁతన | 171 |
సీ. | పాలిండ్లు కెంగేలఁ బట్ట నిచ్చిన మేటి, కళుకుబంగరుగిండ్లు కాను కిత్తు | |
తే. | బూలపాన్సునఁ గొద లేని హాళి నతను, కేళి నోలాడఁ జేసిన లీలఁ గ్రాల | 172 |
క. | అని బుజ్జగించి పలుకుచు, జనపాలకమౌళి వేల్పుచానయెయారం | 173 |
సీ. | కపురంపువిడె మొసంగఁగఁ బోవునెపమునఁ గావినున్మోవిఁ బల్గం ట్లొనర్చి | |
| వలపుఁగస్తురిగంద మలఁదునెపంబునఁ, గులుకుసిబ్బెపుగబ్బిగుబ్బ లంటి | |
తే. | తరుముఁజెక్కులు చుంబించి వళులు నారుఁ, బొక్కిలియుఁ గేల గిలిగింత పొడమ ముట్టి | 174 |
సీ. | వితతదంతక్షతావృతసుధాధరయు స, మంచితనిశ్వాసమారుతయును | |
తే. | గళదనూనమృగీమదకర్దమయును, సదమలానందపరవశసంహననయు | 175 |
సీ. | చెలువంపుఁగనుబొమ, ల్సింగిణీవిండ్లుగాఁ, జుఱుకుఁజూపులు శరస్తోమములుగ | |
తే. | కటకనూపురకింకిణీకంకణప్ర, ణాదములు భూరికలకలనాదములుగ | 176 |
సీ. | వదలిననెఱికొప్పు వారివాహము గాఁగఁ, దనురుచు ల్మెఱుఁగుమొత్తములు గాఁగ | |
తే. | మేన జాల్కొనుచెమ్మట ల్వాన గాఁగఁ, గరఁగుమృగనాభిపంకంబు బురద గాఁగ | 177 |
తే. | అంత సురతాంతవేళ నయ్యింతి నంక, తలమునం దిడి గుబ్బలఁ గలప మలఁది | 178 |
క. | వలినాలికమ్మగాడ్పులు, వొలయఁగఁ బూసు టికేలఁ బూని విసరుచున్ | 179 |
వ. | అంత. | 180 |
సీ. | సారసకల్హారసదమలవాఃపూర, పూరితకాసారతీరములను | |
తే. | బ్రతిదినంబును హితరీతిఁ జతురశీతి, బంధబంధురరతికళాపారవశ్య | 181 |
సీ. | పువుఁబోఁడికటిచక్ర మవనిభాగము గాఁగఁ, గలికినెమ్మెయి కనకంబు గాఁగఁ | |
తే. | నెంచి నిజరాజ్యవైభవోద్వృత్తి యెల్ల, మఱచి నిస్తులమదనసామ్రాజ్యవైభ | 182 |
వ. | అని నారదమహామునీంద్రునకుఁ జతురాననుం డెఱింగించిన నతం డతని నవ్వలికథా | 183 |
శా. | వ్యాకీర్ణాభజటాటవీతటనితాంతాలంబితోద్యత్తమి | 184 |
క. | కాండనిధిశయ కాండా, కాండధరోద్దండదర్పఖండన వృషరా | 185 |
మాలిని. | కలితగుణకలాపా కాంచనాహార్యచాపా | 186 |
గద్యము. | ఇది శ్రీమత్కుక్కుటేశ్వరకరుణాకటాక్షనిరీక్షణసంలబ్ధసరసకవితాసామ్రా | |