రతిరహస్యము/ప్రథమాశ్వాసము

దరులకు దైవతంబు సుఖధాముఁడు చిత్తభవుండు వామసం
చరణుఁడు శ్రీకరుండు గుణసాగరు మల్లయఁ బ్రోచుఁ గావుతన్.


శ్లో.

పరిజనపదే భృంగశ్రేణీ, పికాః పటునన్దినో
హిమకరసితచ్ఛత్రం, మత్తద్వీపో మలయానిలః౹
కృశతనుధనుర్వల్లీలీలాకటాక్షశరావళీ
మనసిజమహావీరస్యోచ్చైర్జయంతి జగజ్జితః॥


చ.

పరిజనకోటి తుమ్మెదలు, పాటకవర్ణము గోకిలాళి, చం
దురుఁ డుసితాతపత్త్రము, వధూతనుమధ్యము విల్లపాంగముల్
శరములు, గంధసింధురము చల్లనివాయువుఁ గాఁగ లోకము
ల్బరఁ గొని గెల్చు మన్మథుఁడు భైరవమల్లయ కిచ్చు కోరికల్.


సీ.

వాత్యాయనుని కళావల్లభుఁ గీర్తించి
                 ఘోణికాపుత్త్రుఁ బ్రవీణుఁ గొల్చి
కూచమారుని రసకోవిదుఁ బ్రార్థించి
                 నందీశు విద్యాదినాథుఁ దలఁచి
మన్మథరసికసన్మాన్యుని గొనియాడి
                 శాస్త్రజ్ఞుశివకియ్యు సన్నుతించి
వైశ్యదత్తుని రతివరమూర్తిఁ బొడఁగాంచి
                 భవ్యు కాంచీనాథుఁ బ్రస్తుతించి


ఆ.

మునిసనత్కుమారు ధనదుతనూభవు
నశ్వినుల జయంతు ననుసరించి
రావిపాటితిప్పరాజాదిముఖ్య శృం
గారకవుల నెల్ల గారవించి.


అని యిష్టదేవతాప్రా
ర్థనముఁ గళాశాస్త్ర సుకవి రాజశ్రేణిన్
వినుతియును జేసి నా నె
మ్మనమునఁ ద్రిపురాంబ నిల్పి మహితప్రౌఢిన్.

సీ.

శ్రీవత్సగోత్రప్రసిద్ధసంభూతి నా
                 పస్తంబసూత్రప్రశస్తఘనుఁడ
గురుదయానిధియైన కూచనమంత్రికి
                 నంగనామణి ముత్తమాంబికకును
దనయుండ సత్కవీంద్రసుమాన్యచరితుండ
                 శివకృపాసుజ్ఞానశేఖరుండ
నారూఢవిద్యాచలానందయోగీంద్ర
                 శిష్టప్రచారవిశిష్టఘనుఁడ


గీ.

నెఱ్ఱయామాత్యుఁడను సత్కవీంద్రహితుఁడఁ
గలితవాక్ప్రౌఢిఁ గొక్కోకకవివరుండఁ
జతురమతితోడ రతికళాశాస్త్ర మిదియు
దెనుఁగు గావింతు రసికులు వినుతిఁజేయ.


వ.

అని తలపోయుచున్న యవసరంబున—


సీ.

తనకీర్తికామిని దశదిశాభామినీ
                 స్మితకపోలములకు మెఱుఁగుఁబెట్ట
తనభవ్యమూర్తి కాంతామదాలస నవ
                 వీక్షణద్యుతులకు విందొనర్ప
తనవైభవంబు బాంధవకవిగాయక
                 మానసాంతరముల మఱుఁగుఁజేయ
తననీతిగరిమయు ఘనతరాంకుశము దు
                 ర్మంత్రికుంజరముల మదము లణప


గీ.

చండలాంబ మహాలక్ష్మి సత్కృపాప్ర
సాదసాధితవైభవసాంద్రయశుఁడు
మంత్రిమాత్రుఁడె భైరవమంత్రిసుతుఁడు
మంత్రనిధి కుంటముక్కల మల్లమంత్రి.

క.

ఒకనాఁడు రతిరహస్య
ప్రకటకళాశాస్త్రసుకవిబంధురతరుణీ
నికరములు గొల్వ విద్య
ప్రకటితుఁడై నన్నుఁ బిలువ బనిపియు ననియెన్.


క.

నవఘంటాసుత్రాముఁడ
వవధానకవీశ్వరుండ వగుదీవు మదిన్
దివికై రచియింపఁ బూనిన
కవితామణిభూషణంబు గావలె నాకున్.


క.

జల్లులు పదపూరణములు
బొల్లులు నసమర్థములును బునరుక్తములున్
జెల్లని వళిప్రాసంబులు
నల్లికలును జొరవు సుపథమగు నీ కృతికిన్.


వ.

అని గౌరవంబున న్గనకాభరణకర్పూరతాంబూలం బొసం
గినం గైకొని నిజనివాసంబునకుం జని యొక్కశుభముహూర్తంబునఁ
గావ్యంబుఁ జెప్ప నుద్యోగించి తత్కథాసూత్రంబునకుఁ బాత్రంబైన
కృతీశ్వరు నభివర్ణించెద—


సీ.

మునిపరాశరగోత్రముఖ్యజుఁ డగు గుంటు
                 పలి పెరుమళిరాజు భాగ్యమూర్తి
యారాజవర్యును కాత్మజుండై యొప్పు
                 గురుధైర్యనగరాజు కొమ్మరాజు
కొమ్మయమంత్రికిఁ గూర్మినందనుఁ డయ్యె
                 మనుమయామాత్యుఁ డమాత్యమౌళి
యామనుమయ్యకు నవతరించిరి మెండు
                 కొండూరు చిట్టిన కోవిదుండు


గీ.

పొసఁగ నోబళమంత్రి తత్పుత్త్రుఁ డయ్యె
దెలఁగయామాత్యుఁ డష్టదిగ్గీపకీర్తి

యట్టి తెలఁగయ్యకును బుట్టె నసమయశుఁడు
భైరవామాత్యుఁ డరిమంత్రిభంజనుండు.


గీ.

ఘనులు నాచనసోమన కాళహస్తి
మంత్రిగోపన సింగనామాత్యవరులు
తమ్ములుగ రూపకీర్తిప్రతాపములను
బ్రబలె నిల కుంటముక్కల భైరవుండు.


ఆ.

అట్టి భైరమంత్రి కనుకూలభోగ్యసౌ
భాగ్యగరిమ వెలయు పత్ని యయ్యె
నక్కమాంబ తనయు లనఘుల నలువురఁ
గనియె గుణసముద్రు లనుచుఁ బొగడ.


క.

వారెవ్వ రనిన గంగన
ధీరుఁడు పెదమల్లనయును దీప్తయశశ్శ్రీ
ధారుఁడు మల్లామాత్యుఁడు
భైరవుఁడు ననంగ నఖిలభాగ్యోన్నతులై.


వ.

వారల కగ్రజుండు—


సీ.

మాధవ మాధవో మాధవులకు సాటి
                 సౌందర్యవిక్రమసంపదలను
గోపాల గోపాల గోపాలురకు నెన
                 భోగసాహసకళాభూషణముల
గాంగేయ గాంగేయ గాంగేయులకుఁ బ్రతి
                 వర్ణప్రతాపపావననిరూఢి
కుంభజ కుంభజ కుంభజులకు సాటి
                 రణతపస్సామర్థ్యరాజసముల


గీ.

నితరజనముల సరిపోల్ప నెట్లు వచ్చు
భాగ్యసౌభాగ్యవైభవప్రాభవములఁ
గుటిలరిపుమంత్రిహృద్భేది గుంటముక్క
గంగయామాత్యునకును దానకర్ణునకును.

వ.

అతని సహోదరుండు—


సీ.

హరిపదధ్యానతత్పరుఁడు చండలమహా
                 లక్ష్మీప్రసాదైకలబ్ధవరుఁడు
రహి గజపతిమహారాయ లిచ్చిన సమం
                 చితమహాపాత్రప్రసిద్ధయశుఁడు
నాజమాఖానరాయనిచేత నొడయుఁడై
                 వినుకొండ దుర్గ మేలిన ఘనుండు
కృతి వన నిక్షేప పృథు తటా కాలయ
                 తనయాది సప్తసంతానపరుఁడు


గీ.

మునిపరాశరగోత్రసంజనితుఁ డార్య
సేవ్యతిరువేంగళాచార్యశిష్యుఁడు నగు
మంత్రి పెరుమాళ్ళకొమ్మయ మనుమయోబ
మంత్రి తెలఁగయ్య భైరవమల్లమంత్రి.


గీ.

సన్నుతావాస జగదంబ చండలాంబ
తనకు నిలవేల్పుగా భూమిఁ దనరినాఁడు
గజపతియు నశ్వపతియును గారవింప
మహిని విలసిల్లె భైరవమల్లమంత్రి.

షష్ఠ్యంతములు

క.

ఇటువంటి మంత్రినిధికిని
బటుతరవిద్యావిశేషపాండిత్యునకున్
కటక కలుబరిగ ఢిల్లీ
కటకస్తవనీయసుగుణగణనిత్యునకున్.


క.

కాంతామోహననవరతి
కాంతునకును బాహుసత్త్వగర్వితరిపువి
క్రాంతున కరిసామజమా
వంతునకును సుకవిగహనవాసంతునకున్.

క.

ధీరునకు రతిరహస్యవి
హారునకుం బంచదశసమంచద్దివ్యా
కారునకును సుగుణగణా
ధారునకును మంత్రిమకుటతటఘటితునకున్.


క.

తిరుమలతిరువెంగళగురు
పరమకృపాలబ్ధవిభవభాగ్యాత్మునకున్
హరిచరణకమలమధుకర
వరమతికిని జటులగంధవారణకృతికిన్.


క.

శ్రీచండలాంబవరకరు
ణాచరితున కతులమాననానావిభవ
ప్రాచుర్యశేముషీమహి
మాచారున కతిమనోహరాకారునకున్.


క.

లక్కాంబానందనునకు
భక్కుండ వరకరుణాదిభవ్యమనీషా
ప్రక్కంఠకహరునకు బల
దిక్కరతీంద్రునకు మల్లధీమంతునకున్.


క.

సల్లలితవాగ్విలాసో
త్ఫుల్లరతీప్రభవనవ్యభూషణభాహా
హల్లీస కుంటముక్కల
మల్లామాత్యునకు గురుసమానసుమతికిన్.


వ.

అభ్యుదయపరంపరాభివృద్ధిగా నాయొనర్పంబూనిన కొక్కోకం
బను గళాశాస్త్రంబునకుఁ గథాక్రమం బెట్టిదనిన—


శ్లో.

కొక్కోకనామ్నా కవినా కృతో౽యం
శ్రీవైన్యదత్తస్య కుతూహలేన
విలోక్యతాం కామకలాసుధీరాః
ప్రదీపకల్పో పచసాం విగుంభః॥

క.

శ్రీవైన్యదత్తకౌతుక
భావితకొక్కోకసత్ప్రబంధనగుంభా
ప్రావీణ్యాధిపకల్పక
ళావాక్యము లెఱుఁగుఁడీ తలంపున రసికుల్.


తా.

వైన్యదత్తునిచేత చెప్పంబడిన కొక్కోకమను శాస్త్రమందలి కళా
వాక్యములను రసికులైనవారు తెలిసికొందురుగాక.


శ్లో.

భూయోభూయో మునువరగవీరర్థదుగ్ధాని దుగ్ధ్వా
నిర్మర్థ్యర్థం ప్రణిహితధియా సోయమాదాయ సారః౹
స్వాదుః పథ్యో లలితరమణీయయౌవనాభోగభోగ్యో
ముఖ్యో దేవైరపి బహుమతస్సేవ్యతాం పండితేంద్రాః॥


చ.

యతివరవాక్యధేనువుల నప్పటికప్పటి కర్థదుగ్ధముల్
బితికి మథించి పద్యరుచి భీరుమనోహరభోగభాగ్యముల్
శతముఖుఁ డాదిగా సురలు సన్నుతిఁ జేయఁగ నొప్పు సార ము
న్నతముగఁ జేసినాఁడ కవినాథులు చేకొనుఁ డాత్మవీథులన్.


తా.

ధేనువుల పాలు పితికి మథించి వెన్న నెత్తినట్టులనే దేవేంద్రుడు మొదలగు దేవతలచే స్తుతింపతగిన స్త్రీభోగసౌఖ్యకరములైన వైన్యదత్తుని వాక్యార్థములను గ్రహించి యీకవిచే ప్రకాశింపజేయదగిన యీశాస్త్రమును కవివరు లంగీకరింతురుగాక.

ఈ శాస్త్రమునకు ఫలము

శ్లో.

అసాధ్యాయాః సుఖం సిద్ధిః సిద్ధాయాశ్చామరంజనమ్
రక్తాయాశ్చ రతిస్సమ్యక్ కామశాస్త్రప్రయోజనమ్॥


ఆ.

తన కసాధ్యమైన తరుణి సాధించుట
దొరకెనేని తన్ను మఱపుఁగొనుట
మేలుగలుగు సతుల మెలపంగ నేర్చుట
కామశాస్త్రమునకు గలుగుఫలము.


తా.

తనకు సాధ్యముకాని స్త్రీనయినా సాధ్యురాలయ్యేటట్టు చేసుకొని
యనుభవించుట యీశాస్త్రమునకు ఫలమని తెలియదగినది.

శ్లో.

సంసారే పటలాన్తతోయతరలే సారం యదేకం పరం
యస్యాయం చ సమగ్ర ఏవ విషయగ్రామప్రపంచో మతః౹
తత్సౌఖ్యం పరతత్త్వవేదనమహానందోపమం మన్దధీః
కో వా విన్దతి సూక్ష్మమన్మథకళావైచిత్ర్యమూఢో జనః॥


చ.

భవముఘటాంతతోయచలభావము దీనికి సార మొక్కటే
వివిదసుఖప్రపంచమతివిభ్రమ మందులసౌఖ్య మాత్మలోఁ
దవిలినచర్మనిర్మితము దాని నెఱుంగఁడు మందబుద్ధి హృ
ద్భవరతిచిత్రభోగములు భాగ్యవిహీనుల కెట్లు చొప్పడున్.


తా.

మనిష్యదేహము నొందుటకు ఫలము రతిసుఖక్రియాదులు. కావున
తదనుగుణములగు హావభావములను బొందుటయె మిక్కిలి జాణతనము. అది హావ
భావావిలాసవిభ్రమాది గుణహీనులైన మందబుద్ధిగల నిర్భాగ్యులకు సిద్ధింపనేరదు.


శ్లో.

జాతిస్వభావగుణదేశజధర్మచేష్టా
                        భావేంగితు వికలో రతితంత్రమూఢః౹
లబ్ధ్వాపి హి స్ఖలతియౌవనమంగనానాం
                        కిం నారికేళఫలమాప్య కపిః కరోతి॥


ఉ.

ఇంతుల జాతిచేష్టితగుణేంగితదేశజనానుధర్మవి
శ్రాంతు లెఱుంగలేని యతిజాత్యున కంగన యబ్బెనేని వి
భ్రాంతి వహించుఁగాని రతిపాక మెఱుంగఁడు రాజనిష్కటా
భ్యంతరనారికేళఫల మబ్బిన వానరుఁ డేమి చేసెడిన్.


తా.

స్త్రీలయొక్క జాయి, క్రియ, గుణము, హృదయము, సత్వము
యెఱుంగని మూఢునకు నంగన దొరికినయెడల టెంకాయ దొరికిన కోతిరీతిగా
లాలనాదిక్రియ లెఱుంగక విభ్రాంతి చెందును.


శ్లో.

యద్వాత్స్యాయనసూత్రసంగ్రబహిర్భూతం కిమప్యాగమే
దృష్టం వాచ్యమిదం మయామునిగిరాం శ్రద్ధా హిసాధారణీ౹
భావవ్యంజితమన్యభంగికథితం తత్రాపి చేదస్తి తత్
మన్దానాముపయుజ్యతే తదపి హి స్పష్టాభిధేయాకృతిః॥

గీ.

ఇతరరతిశాస్త్రములను వర్లించి పూర్వ
మునుల వాక్యంబులను వాత్యయనునిసూత్ర
పక్కి నెఱిఁగి దీని రచింపఁ బరగినాఁడ
రతివిలాస మెఱుంగని పతులకొఱకు.


తా.

రతిపాక మెఱుంగలేని మందబుద్ధిగల నరులకొఱకు వాత్స్యాయన
సూత్రములనుండియు నితరశాస్త్రములనుండియు మునీశ్వరులవాక్యములనుండియు
నీపుస్తకము నాచే రచింపబడినది.


శ్లో.

పద్మినీం, తదను చిత్రిణీం, తతః శంఖినీం, తదను హస్తినీం, విదుః౹
ఉత్తమా ప్రథమాభాషితా, తతో హీయతే యువతిరుత్తరోత్తరమ్॥


క.

మును జెప్పినదియె యుత్తమ
వెనుకటిదే హీనగాఁగ వివరింతురు ప
ద్మిని, చిత్రిణి, శంఖిని, హ
స్తినులను నోర్తోర్తుకంటె స్త్రీజాతులకున్.


తా.

పద్మిని, చిత్రిణి, శంఖిని, హస్తిని యను యీజాతులలో వరుసగా
తొలుత చెప్పినదానికంటె నొకటికొకటి అధమమని తెలియదగినది.

పద్మినీజాతిస్త్రీలక్షణము

శ్లో.

కమలముకుళమృద్వీ ఫుల్లరాజీవగంధః
                        సురతపయసి యస్యాః సౌరభం దివ్యమంగే౹
చకితమృగదృశాభే ప్రాంతరక్తే చ నేత్రే
                        స్తనయుగళమనర్ఘ్యం శ్రీఫలశ్రీవిడంబి॥


శ్లో.

తిలకుసుమసమానాం బిభ్రతీ నాసికాం చ
                        ద్విజగురుసురపూజాం శ్రద్ధధానా సదైవః౹
కువలయదళకాంతిః కాపి చాంపేయగౌరీ
                        వికచకమలకోశాకార కామాతప్రతా॥


శ్లో.

వ్రజతి మృదు సలీలం రాజహంసీవ తన్వీ
                        త్రివళివళితమధ్యా హంసవాణీ సువేషా౹

మృదు శుచి లఘు భుంక్తే మానినీగాఢలజ్జా
                        ధవళకుసుమవాసోవల్లభా పద్మినీ స్యాత్॥


సీ.

తామరమొగ్గ చందమున మెత్తని మేను
                 జలజగంధము రతిజలముఁ దనరు
మాలూరఫలముల మఱపించు పాలిండ్లు
                 కొలికుల కింపైన కలికిచూపు
తిలపుష్పముల వన్నెఁ దిలకించు నాసిక
                 గురువిప్రపూజనాపర సునియమ
చంపకకువలయఛాయయుఁ గల మేను
                 నబ్జపత్రముఁ బోలు నతనుగృహము


గీ.

హంసగమనంబు కడు సన్నమైన నడుము
మంజుబాషిణి, శుచి, లఘుమధురభోజి
వెల్లచీరెలయందును వేడ్క లెస్స
మానవతి పద్మినీభామ మధురసీమ.


తా.

తామరపువ్వువలె నుండు మెత్తనిశరీరమును, తామరపువ్వువాసనగల
రతిజలమును, మారేడుపండ్లవంటి కుచములును, సొగసగు చూపును, నువ్వుపువ్వు
వంటి ముక్కును, గురుబ్రాహ్మణపూజయం దాసక్తియు, సంపంగివంటిన్నీ కలు
వపువ్వులవంటిన్నీ దేహచ్ఛాయగలదియు, తామరరేకువంటి భగము గలదియు,
హంసగమనమును, సన్నమైననడుమును, మంచిమాటలును, శుచియై కొద్దిపాటిరుచి
గలభోజనమును, తెల్లచీరలయందు ప్రీతిన్నీ గలస్త్రీ పద్మినిజాతిస్త్రీగా నెఱుం
గునది.


సీ.

రాజీవగంధియే రాకేందుబింబాస్య
                 నీలోత్పలశామ నిర్మలాంగి
సద్గుణచారిత్ర సత్యవ్రతాచార
                 తరుణి కురంగాబ్జ ధవళనేత్ర
పాటలాధర రక్తపల్లవమృదుపాణి
                 గానవిద్యాలోల దానవిభవ

కీరభాషిణి మణిహారవిభూషిత
                 మదమదావళయాన మధురభోజి


గీ.

నీరు జలజంబువాసన మారుకేళి
నాలుగవజామునకుఁ దేలు గేళినొరులఁ
జిత్తగింపదు పాంచాలుఁ జెందఁగోరు
విమలవస్త్రంబు పద్మిని వేడ్కఁగట్టు.


తా.

తామరపువ్వువంటి వాసనగలదేహమును, పూర్ణచంద్రునివంటి ముఖ
మును, నల్లకలువలవంటి దేహకాంతియు, నిర్మలమయిన అవయవములును, మంచి
గుణమును, సత్యము చెప్పుటయు, లేడికండ్లును, తెల్లని నేత్రములును, తెలుపు
మించి యెఱుపువర్ణముగల అధరమును, లేతచిగుళ్ళవంటి అరచేతులును, లయజ్ఞాన
సంగీతప్రసక్తియు, యొప్పిదమయిన యీవియు, చిలుకపలుకులవంటి పలుకులును,
రత్నమయభూషణాలంకారములును, మదపుటేనుగువంటి నడకయు, తియ్యని
పదార్థములయందిష్టమును, తామరవాసనగల రతిజలమును, నాలుగవజామున
రతిసల్పుటయు, రతియందు పాంచాలునిగాక నితరులను సమ్మతింపకయుండు
టయు, తెల్లనివస్త్రములు గట్టుటయు పద్మిని జాతిస్త్రీగా తెలియందగినది.


ఉ.

మేలపుఁజూపు మిక్కిలి రమించును గొంకక ప్రేమతోడుతన్
గీలుకొను న్గనుంగవ మొగిడ్చు నవస్థలసారెసారెకు
న్నాలయమౌను గూటములయందున వేడుకచే స్తుతించుఁ బాం
చాలునిఁ గూడు పద్మినియు జాములు నాల్గిట మోహనాకృతిన్.


తా.

సొగసగుచూపును, ప్రేమతో వెనుదీయక రమించుటయు, రతిపారవశ్యము
చేత కన్నులుమూయుటయు, నాల్గవజామున పాంచాలుడను పురుషునితో రతియందు
సారెసారెకు నవస్థల పొంది మెచ్చుకొనునట్టిది పద్మినిజాతిస్త్రీగా తెలియదగినది.


ఉ.

తెల్లనిచీరెల న్విరులఁ దియ్యదనంబును మెచ్చు, వెంట్రుకల్
నల్లన, మోవియెఱ్ఱన, కనత్కనకద్యుతిమేలు, కన్నులు
త్ఫుల్లసరోజరుచులు, మృదుధ్వనికంఠము, పాణిపద్మము
ల్పల్లవకాంతు లాననము పద్మము, పద్మినిజాతి కిమ్మహిన్.

తా.

తెల్లనిచీరలను పువ్వులను తియ్యదనంబును మెచ్చుటయు, నల్లనివెంట్రు
కలును, ఎఱ్ఱనిమోవియు, బంగారమువంటిదేహమును, తామరరేకులవంటి కన్ను
లును, మృదుమధురధ్వనిగలకంఠమును, తామరమొగ్గలవంటి అరచేతులును,
తామరపువ్వువంటి మొగమును గలస్త్రీ పద్మినిజాతిగా నెఱుంగునది.

చిత్రిణీజాతిస్త్రీలక్షణము

శ్లో.

సుగతిరనతిదీర్ఘా నాతిఖర్వా కృశాంగీ
                        స్తనజఘనవిశాలా కాకజంఘోన్నతోష్ఠీ౹
మధుసురభిరతాంబుః కంబుకంఠీ చకోర
                        స్వరవచనవిభాగా నృత్యగీతాదివిజ్ఞా॥


శ్లో.

మదనసదనమస్యా నర్తులోచ్ఛూనమంత
                        ర్మృదు మదనజలాఢ్యం లోమభిర్నాతిసాంద్రైః౹
ప్రకృతిచపలదృష్టిర్బాహ్యసంభోగరక్తా
                        రసయతి మధురాల్పం చిత్రిణీ చిత్రరక్తా॥


సీ.

నడుముసన్నము మంచినడక కోపపుఁజూపు
                 చనుదోయి పిఱుదులుఁ జాలఘనము
లెగుపిక్క లోష్ఠ మొక్కించుక యధికంబు
                 తేనియకంపు రతిద్రవంబు
మూఁడురేఖలు కంఠమునఁ జకోరపుఁబల్కు
                 నృత్తగీతాదుల నేర్పు పెద్ద
పొడవు వట్రువ జలపూరంబు మెత్తని
                 యల్పరోమముల పంచాస్త్రుగృహము


గీ.

బాల్యసంభోగరతియుఁ జాపలపుఁ జూపు
పులుసునిష్టంబు మధ్యంబు భోజనంబు
వన్నెచీరలఁ గట్టు భావంబు మృదువు
చిత్రిణీభామ వరనేత్ర చిత్రసీమ.


తా.

సన్నమైననడుమును, మంచినడకయు, కోపపుదృష్టిన్నీ, గొప్పవైన
చనులును పిరుదులును, ఉన్నతమైన పిక్కలును, కొంచెము పెద్దదైన పెదవియు,

తేనెవాసనగల రతిజలమును, మూడురేఖలుగల కంఠమును, వెన్నెలపులుగుపలు
కులును, ఆటపాటలయం దాసక్తియు నేర్పునూ, పొడవై వట్రువయై మిక్కిలి
రతిజలముగలదై మృదువై కొద్దిరోమములుగలదైన యోనియు, ఆలింగచుంబనా
దలుయం దాసక్తియు, చపలదృష్టియు, పులుసుయందిష్టమును, తగుపాటిభోజన
మును, వన్నెచీరలగట్టుటయు, మెత్తనిమనస్సునూగలస్త్రీ చిత్రిజాతిగా తెలియ
దగినది.


సీ.

కలికిచూపులఁ జూచుఁ, గమ్మపూతలఁ బూయుఁ
                 బెక్కువన్నెలఁ బెట్టఁ బ్రియమువడును
గుటిలాలకంబులు కోపమెన్నడులేదు
                 చవుసీతిగతిఁ గూడుఁ జతురరతులఁ
ద్రిమ్మటకోర్చును దెకతెక మోహించుఁ
                 దమకమెన్నకనవ్వుఁ దగులదెచట
వలపుఁ దెలియనీక వలచుఁ దేనియకంపు
                 నాటపాటలఁ గోరు నల్పభోజి


గీ.

వింతరతులకుఁ బైకొను వెల్లగాదు
ప్రౌఢరతికేళి మనసిచ్చి పల్లవించు
చిత్రిణియనంగఁ దంగేటిచెట్టుజున్ను
రూపవరు లైనవిటులకు రూఢి మెఱయ.


తా.

సొగసుగా జూచుటయు, వాసనద్రవ్యములబూయుటయు, వన్నెచీ
రెలగట్టి సంతోషించుటయు,చుట్టుకొనియున్న ముంగురులును, కోపములేక
యుండుటయు, ఎనుబదినాలుగు బంధనములతో రమించుటయు, చతురరతుల
యందు శ్రమకోర్చుటయు, ఆసతో వలచుటయు, మోహముగణింపక నవ్వుటయు,
రతియందు వెనుదీయకయుండుటయు, మోహములయలుపరుపక మోహించు
టయు, తేనెవాసనగల రతిజలమును, ఆటపాటలయందాసక్తియు, మితమయిన
భోజనమును, చిత్రబంధములయందు మించియుండుటయు, చతురతయందిచ్చ
గించి సంతోషించుటయు, చూపరులగు విటులకు తంగేటిజున్నువలె నుండుటయు
గలస్త్రీని చిత్రిణీజాతిస్త్రీగా తెలియదగినది.

చ.

కడుఁదెగఁజాపుగాళ్ళు విటుఁ గైకొని యెత్తుఁ బిఱుందుకూటమిన్
దడఁబడు క్రిందుమీదువడిఁ దాకుఁ దొడ ల్నిరికించు సారెకున్
ముడివడి తానె పైకొనును ముచ్చటల న్బడి తిట్టుఁ దొల్తజా
మడుగునఁ గూచిమారుని రహస్యము గోరును చిత్రిణి న్గనన్.


తా.

మిక్కిలి కాళ్ళుజాపుటయు, రతివేళయందు పిఱుందు లెత్తుటయు
తత్తరపాటున పైనప్రక్కనబడుటయు, తొడలు బిగబట్టుటయు, మాటిమాటికి
తాను పైకొనుటయు, రతిసంభ్రమముచే తిట్టుటయు,తొలిజామున కూచిమారు
నిరతిగోరెడి స్త్రీ చిత్రిణిగా నెఱుంగవలయును.


ఉ.

అన్నువయైనకౌను కుటిలాలకపంక్తులు చెన్నుమీఱఁగా
వన్నెలఁబెట్టు పచ్చమరువంబును బూయఁగనేర్చు నెయ్యెడన్
గన్నుల నార్చుఁ గూటమిని గాకకు నోర్వదు నేర్పుసేతలన్
దిన్ననిమాటలాడుఁ గడుద్రిమ్మరు చిత్రిణిచిత్త మీక్రియన్.


తా

కొద్దయైననడుమును, పంక్తులుతీర్చి చుట్టుకొనియున్న ముంగురులును,
సొగసుగా నలంకరించుకొనుటయు, సుగంధమునలందుటయు, ఎప్పుడునూ రెప్ప
లార్చడమును, చండరతి కోర్చకయుండుటయు, చిత్రరతులయందు ప్రీతియు,
మంచిమాటలాడుటయు, మిక్కిలిత్రిప్పటగలస్త్రీ చిత్రిణిజాతిగా నెరుంగవలెను.

శంఖినీజాతిస్త్రీలక్షణము

శ్లో.

తనురతనురపి స్యాదీర్ఘదేహంఘ్రిమధ్యా
                        హ్యరుణకుసుమవాసః కాంక్షిణీ కోపశీలా౹
అనిభృతశిరమంగే దీర్ఘనిమ్నం వహంతీ
                        స్మరగృహమతిలోమక్షారగంధి స్మరాంబు॥


శ్లో.

సృజతి బహునఖాంకం సంప్రయోగే లఘీయః
                        స్మరసలిలపృషత్కా కించిదుత్తప్తగాత్రీ౹
న లఘు న బహు భోక్త్రీ ప్రాయశః పిత్తలా స్యాత్
                        పిశునమలినచిత్తా శంఖినీ రాసభోక్తిః॥


సీ.

వలమును బొడవునై బలసిన దేహంబు
                 నడుగులు నిడుద లత్యంతకుపిత

పలురక్తవస్త్రపుష్పంబుల నాసించు
                 నంటిన నధర మందంద నదరు
మదనగేహమున రోమములు దట్టంబులు
                 రతిజీవనంబు కారంబు వలచు
సంయోగమునఁ గామజల మల్పబిందువుల్
                 జిలుగు నఖక్షతములు ఘటించు


గీ.

నధికమును గొంచెమును గానియట్టికుడుపు
వెచ్చనగుమేను కొండెంబు వినుచునుండు
గార్దభస్వర పైత్యంబు గలదు మిగుల
శంఖినీభామ కుటిలవాచాలసీమ.


తా.

నిడుపై బలసియున్నదేహమును, పొడవైనకాళ్ళును, మిక్కిలికోప
మును, ఎఱ్ఱనివస్త్రములను పువ్వులను గోరుటయు, ముట్టినంతనే పెదవి యదరుటయు,
భగమందు దట్టమైనరోమములును, కటువువాసనగల రతిజలమును, రతికాలమం దల్ప
మైన మదనజలము పడుటయు, నఖక్షతములు చేయుటయు, మితభోజనమును, కాక
శరీరమును, కొండెముల వినుటయు, గార్దభస్వరమును, పైత్యగుణమును, వంకర
మాటలకు పుట్టినిల్లును అయినస్త్రీని శంఖినిజాతిస్త్రీగా తెలియదగినది.


సీ.

అన్నువయగునడు మందమౌనధరంబు
                 కొండెంబునకుఁ జొక్కుఁ గోపగుణము
కొంచెపుఁజూపును గుడుపుదొడ్డనరాదు
                 మృదుభాషణంబులు మేనునునుపు
నున్నతస్తనభార ముత్పలదళనేత్ర
                 కాఠిన్యపదపద్మ కంబుకంఠి
లాలితభ్రూయుగ నీలాళికచభార
                 మదనకేళికిని సమ్ముదితచిత్త


గీ.

ప్రియరసంబగుగారంబుఁ బెంపుతావి
వలపు పుట్టిన వెఱ్ఱియై వరుని నమ్ము

నీలవర్ణంపుఁ జీరెలు లీలఁ గట్టు
శంఖినీభామ రతి సల్పు సరవితోడ.


తా.

సన్నమైననడుమును, అందమైనపెదవియు, కొండెములు వినుటయు,
కోపమును, క్రీగంటిచూపును, పరిపాటియైనభోజనమును, మృదువైనశరీరము
మాటలును, గొప్పవైనకుచములును, కలువరేకులవంటికన్నులును, కఠినములైన
పాదములును, శంఖమువంటి మెడయు, సుందరమైనకనుబొమలును, నల్లనికురులును,
రతికేళియందు తేరినమనస్సును, కారమునం దిష్టమును, వలపుపుట్టినవరునిపై వెఱ్ఱి
నమ్మకమును, నల్లచీరెలయం దిష్టమును, క్రమముతప్పక రతి సల్పుటయు శంఖినీ
స్త్రీయొక్కలక్షణములు.


ఉ.

కొంకక కూడు నంగమును గోప్యము సేయదు వింతమాటకు
న్జంకెనఁ జూపుఁ గౌఁగిటను జాలఁగనుండును నాథుసేతకు
న్శంకిల కుబ్బు మీఁదరతి సల్పును భద్రశశాంకుతోడఁ దా
నుంకువఁ జూపు శంఖిని ప్రియోక్తుల మూఁడవజామునందునన్.


తా.

శంకలేక కలియుటయు, శరీరము దాచకయుండుటయు, వింతమాట
లకు భ్రమతో చూచుటయు, ఆలింగనమం దెక్కువగా నుండుటయు, భర్తయొన
ర్చెడిపనులకు విచారింపక సంతోషించుటయు, మూడవజామునందు భద్రశశాంకు
డను పురుషునిపై ప్రేమతో ప్రియభాషణములతో పురుషాయితబంధములతో
రతిసల్పుటయు శంఖినీజాతిస్త్రీయని గుర్తించునది.


చ.

నడుము కృశంబు కొండ లన నొప్పుకుచంబులు నీలముల్కురు
ల్నిడుదలు కన్ను లామెఱుఁగునిక్కలు గాఁదగునంతభోజనం
బడరఁ బ్రియంబుఁ గోపము రయంబునఁ జూపును గొండెమైన నే
ర్పడవిను రక్తపుష్పపటరాగను శంఖినిగా నెఱుంగుమా.


తా.

సన్ననినడుమును, గొప్పవైనచనులును, నల్లనై నిడుదలైనవెంట్రుక
లును, మెఱపుగొల్చెడి కండ్లును, తగుపాటిభోజనమును, ప్రియమును కోపమును
వెంటనే చూపుటయు, కొండెములు నేర్పుగా వినుటయు, యెఱ్ఱనిచీరెలను పువ్వు
లను కోరునట్టిది శంఖినీజాతిస్త్రీయని తెలియందగినది.

హస్తినీజాతిస్త్రీలక్షణము

శ్లో.

అలలితగరురుచ్చైః స్థూలవక్రాంగుళీకం
                        వహతి చరణయుగ్మం కంధరాం హ్రస్వపీనాం౹
కపిలకచకలాప క్రూరచేష్టాతిపీనా
                        ద్విరదమదవిగంధిః స్వాంగకే౽నంగకేచ॥


శ్లో.

ద్విగుణకటుకషాయప్రాయభుగ్వీతలజ్జా
                        లలదతివిపులోష్ఠి దుఃఖసాధ్యాప్రయోగే౹
బహిరపి బహురోమాత్యంతమంతర్విశాలం
                        వహతి జఘనరంధ్రం హస్తినీ గద్గదోక్తిః॥


సీ.

నడువనేరదు వంకపొడవును గలవ్రేళ్ళు
                 గలపాదయుగళంబు గళము కుఱుచ
కపిలవర్ణం బైనకబరీభరము క్రూర
                 చేష్టలు వల మైనచిఱుతయొడలు
కరిమదగంధంబు స్మరగేహతనువులు
                 కటుకషాయము లధికంబుఁ గుడుచు
విపులోష్ఠకఠిన దుర్విటులకుఁ గడఁగూర్చు
                 గద్గదస్వరముఁ జక్కనిమనంబు


గీ.

మీఁదిరోమంబు లల్పంబు మిగులలోఁతు
వెడఁద మదనుండు చరియించు వీడఁబుట్టు
గాఢసంయోగమునఁ గాని కరుఁగ దల్ల
హస్తినీభామ యుగ్రతరాంతసీమ.


తా.

మంచిది గానినడకయు, వంకరయు పొడవైనవ్రేళ్ళుగల పాదములును,
కుఱచయగు మెడయు, కొంచెము పసుపువర్ణముగల వెంట్రుకలును, చెడుపనులును,
చక్కనికుఱుచయగు శరీరమును, యేనుగుమదమువాసనగల భగ దేహములును,
కారము ఉప్పుతో అధికమైనభోజనమును, పెద్దపెదవియు, కఠినులయినవిటకాండ్ర
యందు ప్రీతియు, తొట్రుపాటుగల కంఠధ్వనియు, మంచిమనస్సును, అల్పరో
మములతో మిక్కిలిలోతును విశాలమునుగల భగమున్నూ, కఠినరతులచేత తృప్తి
నొందుటయు, కోపగుణమును గలస్త్రీ హస్తినిజాతిస్త్రీగా నెఱుంగుడు.

సీ.

కనకకుంభస్తని కక్షద్వయము గబ్బు
                 మాత్రంబు గలదౌను మనసు లేఁత
నిటలభాగము మిఱ్ఱు నెఱివెండ్రుకలు గావు
                 కటి యూరువును వ్రేఁగు గలిగియుండుఁ
గౌనుకుక్షియు దొడ్డ కాయంబు చిక్కన
                 పలుకులు మృదురీతి పట్టుఁబడవు
గమనింపనేరదు కన్నులు వెడఁదలు
                 కంఠంబు లెస్సది కపటి కాదు


గీ.

బిరుదరతికేళిఁ బ్రియునితో బ్రియము గలదు
మదనజలమును దగుఁ గరిమదము తావి
తొగరుచీరెలు గట్టును బిగువు సెడదు
ముగుద హస్తిని మన్మథు మొదటిశరము.


తా.

బంగారుకుండలవంటి కుచములును, గబ్బుకంపుగల చంకలును, మృదు
వగుమనస్సును, మిట్టనొసలును, తేనెవర్ణముగల వెంట్రుకలును, గొప్పనైనపిఱు
దలు తొడలున్నూ, పెద్దదైన నడుమును కడుపున్నూ, గట్టిదేహమును, కఠినమైన
మాటలును, మంచినడకలేమియు, పెద్దకన్నులును, మంచికంఠమును, వంచనత్వ
ములేనిదియు, బిరుదుతో క్రీడించు ప్రియునియందు ప్రీతియు, యేనుగుమదమువాస
నగల రతిజలమును, యెఱ్ఱనిచీరలు కట్టుటయు, పటుత్వము తప్పక యుండుటయు
గలస్త్రీని హస్తినిజాతిగా తెలియునది.


ఉ.

అంగము దాచు మోహము రహస్యము సేయును గూటమందు సా
రంగమురీతిఁ గొల్పు విటరాజును సొంపుగఁ జూచు దత్తు కా
లింగన మీయఁగోరుచుఁ జలించును రెండవజాములోన దాఁ
సంగమ మిచ్చు మెచ్చును నిజంబుగ హస్తినికాంత యుక్తులన్.


తా.

శరీరము దాచుటయు, వలపు తెల్లముజేయక యుండుటయు, యేనుగువలె
రతియందు ప్రవర్తించుటయు, విటుని అందముగా చూచుటయు, దత్తుడనేనాయ
కునికి ఆలింగ మీయ నిష్టపడుచు చలించుటయు, రెండవజామునందు రతిసుఖ మి
చ్చుటయు, ప్రియునియుక్తులను మెచ్చటయు, ఈగుణంబులుగలస్త్రీ హస్తినిజాతి
స్త్రీగా తెలియదగినది.

చ.

తొడలును జన్నులోష్ఠములు దొడ్డలు కన్నులు కాళ్ళు చేతులు
న్వెడదలు బాహుజంఘములు వెండ్రుకలు న్గుఱుచౌ లలాటము
న్బొడవు నొడల్వెడల్పు, కడుపు న్గుడుపున్బడుపున్ ఘనంబు, దా
జిడిముడిపాటును న్దొగరుచీరెలు హస్తిని కట్టు నెంతయున్.


తా.

గొప్పవైనతొడలు చన్నులు పెదవియు, విశాలములయిన కన్నులు
కాళ్ళు చేతులును, కొద్దిభుజములు పిక్కలు కురులునూ, నిడివియైన నొసలును,
వెడల్పుశరీరమును, అధికమైనకడుపు భోజనము పడకయు, కోపమును, తొగరు
చీరెయందుప్రీతిన్నీ గలస్త్రీని హస్తినిజాతిస్త్రీగా నెఱుంగునది.

పద్మినిగాక తక్కిన మూఁడుజాతులకు ప్రియమైన తిథులు

శ్లో.

నయనయుగశరర్తుర్బ్రధ్నదిఙ్నాగసంఖ్యా
                        స్తిథయ ఇహ రతే స్యుః ప్రీతయే చిత్రిణీనాం౹
గృహతిథిభువనాఖ్యాద్వాపయుక్తాః కరిణ్యా
                        స్తదితరతిథయః స్యుః శంఖినీనా చతస్రః॥


గీ.

విదియ పంచమి షష్ఠి చవితి దశమియు
నష్టమిని ద్వాదశిని గవయంగఁ జిత్రి
ణికిఁ బ్రియంబు మఱియు హస్తినికిఁ బ్రియంబు
తదియ పున్నమి నవమి సప్తములఁ గవయ.


తా.

విదియ పంచమి షష్టి చవితి దశమి అష్టమి ద్వాదశి ఈతిథుల
యందు చిత్రిణినిన్నీ తదియ పున్నమి నవమి సప్తమి తిథులయందు హస్తినితోను
రమింపవలెను.


గీ.

శశిని బాడ్యమి హరిదివసముల భూత
తిథిని శంఖిని రమియింపఁ దివురమేలు
కాన వల్లభు లెఱిఁగి యీక్రమముఁ దెలిసి
సంగమం బొనరించెడి జాడఁ గనుఁడు.


తా.

పర్వము పాడ్యమి ఏకాదశి త్రయోదశి చతుర్దశి ఈతిథులు శంఖి
నికి ప్రియములుగాన ఈక్రమము దెలిసి వారితో సంగమమొనరించెడి విధమును
దెలియుడు.

పద్మిని మొదలగు జాతులకు ప్రియమగు జాములు

శ్లో

వ్రజతి రతిసుఖార్తం చిత్రిణీమగ్రయామే
                        భజతిదినరజన్యర్హస్తినీం చ ద్వితీయే౹
గమయతి చ తృతీయే శంఖినీమార్ద్రభావం
                        రమయతి రమణీయాం పద్మినీం తుర్యయామే॥


చ.

ముదము దలిర్పఁ జిత్రిణియు ముందటిజామునఁ గూడఁ జాలస
మ్మద మొనరించు హస్తిని క్రమంబున రెండవజామునందు నిం
పొదవు, తృతీయయామమున నొప్పగు శంఖిని కూడఁ బద్మినీ
ముదితకు నంత్యయామమున మోహము వుట్టు నహర్నిశంబులన్.


తా.

తొలిజామున చిత్రిణిని, రెండవజామున హస్తినిని, మూడవజామున
శంఖినిని, నాలుగవజామున పద్మినిని క్రమముగా ఈజాములయందు, పగలు
రాత్రులయందు రమించిన ఆయాకాంతలు సుఖింతురు.

పద్మిని మొదలగు జాతులకు ప్రియమగు బంధములు

శ్లో.

పంకజాసనలయేన పద్మినీం వేణదారితపదేన శంఖినీం౹
స్కంధపాదయుగళేన హస్తినీం నాగరేణ రమయన్తి చిత్రిణీం॥


నాగబంధమునను నట్టాడుఁ జిత్రిణి
స్కంధపాదయుగము సరవిహస్తి
వేణుదారణమున వేడ్క శంఖిని పద్మి
పంకజాసనమునఁ బల్లవించు.


తా.

నాగరాఖ్యబంధముచేత చిత్రిణిని, స్కంధపాదయుగబంధముచేత
హస్తినిని, వేణువిదారితబంధమున శంఖినిని, పంకజాసనబంధముచే పద్మినిని
రమింపగా సంతసింతురు.


వ.

ఈ నాలుగుబంధములకును లక్షణములు ద్వితీయాశ్వాసంబున
చవుశీతిబంధములలోఁ విపులముగాఁ జెప్పంబడియె.

పద్మినిఁ దప్ప మిగిలినజాతులను బురుషులు మంత్రౌషధములచే వశులను జేసుకొను లక్షణములు

శ్లో.

మోచాకందరసేన జాతిఫలకం కుర్యాద్వశాం చిత్రిణీం
                        పక్షౌ మాక్షికసం యుతౌ చ కరిణీం పారవతభ్రామరౌ౹

శంఖిన్యా వశకృంచ గంధతగరీమూలాన్వితం శ్రీఫలం
                        తాంబూలేన సహ ప్రదత్తమచిరాన్మంత్రౌరమీభిః క్రమాత్॥


వ.

“ఓం పచ పచ విహంగమ విహంగమ కామదేవాయస్వాహా”
అనేన మంత్రేణ కదళీకందరసం జాతీఫలం తాంబూలేన సహ
దద్యాత్తదా చిత్రిణీ వశ్యాభవేత్॥
“ఓం ఛేంది ఛేంది వశ్యంకరి వశ్యంకరి వశ్యంకరి కామాదేవాయ స్వాహా”
అనేన మంత్రేణ పారావతభ్రమరస్య పక్షౌ మధుయుక్తౌ తాంబూలేన
దేయౌ తదా హస్తినీ వశ్యాభవేత్॥
“ఓం హర హర పచకామదేవాయ స్వాహా”
అనేన మంత్రేణ గన్థతగరస్య మూలం బిల్వసహితం దేయం తదా
శంఖినీ వశ్యా భవేత్॥


సీ.

అరటిదుంపరసంబునందు జాజిఫలంబుఁ
                 దివిచి విడెమ్ము చిత్రిణికి నిడుఁడు
భ్రమరపారావతపక్షభస్ము తేనె
                 నునిచి విడెమ్ము శంఖినికి నిడుఁడు
మాలూరఫలరసమర్దితగంధంబు
                 కరమునఁ గూర్చియుఁ గరిణి కిడుఁడు
వశ్యులుగా న్విటవల్లభు లీమంత్ర
                 మంత్రములఁ బ్రణవాదిగా నలవరించి


గీ.

తవిలి కదళికామదైవాయ కలరవ
కారుదైవతాయ క్రమబిల్వ
కామదైవతాయ గరిమస్వాహా యని
వేఱువేఱు మంత్రివిధులఁ దెలిసి.


తా.

అరటిగడ్డరసములో జాజికాయను భావనచేసి తాంబూలముతో
చిత్రిణికి, తుమ్మెదరెక్కలు పావురపురెక్కలు భస్మముచేసి తేనెలోఁ గలిపి
తాంబూలముతో శంఖినికి, బిల్వపండ్లరసముతో శ్రీగంధమునూరి చేతితో హస్తి
నికిని వరుసగా "ఓం అనటికామదేవాయ స్వాహా। ఓం విహంగమకామదేవాయ
స్వాహా। ఓం శ్రీఫలకామదేవాయస్వాహా।" అను నీ మంత్రంబుల నుచ్చరించుచు
నామందులను యిచ్చి చిత్రిణ్యదికాంతలను వశవర్తులుగా జేసికొందురు.

ఉత్తమజాతిత్వాత్ పద్మిన్యాం నియమావేతా ననుక్తావాచారాత్.


క.

ఉత్తమగుణజాతియు స
ద్వృత్తులు గల పద్మినికిని వెడమందులు మం
త్రోత్తమములు లేకుండుట
నిత్తరి రతిచంద్రకళల కిర వెఱిఁగింతున్.


తా.

శ్రేష్ఠమైనగుణము, జాతి, నడవడి గలపద్మినికాంతకు మంత్రౌష
ధంబులు లేవు గాన కళాస్థానములను జెప్పుచున్నాడను.

ఇతి శ్రీకొక్కోకకృతే రతిరహస్యే జాత్యాధికారో నామ ప్రథమః పరిచ్ఛేదః

చంద్రకళాధికారః

ద్వితీయః పరిచ్ఛేదః

స్త్రీకళాస్థానములు

శ్లో.

అంగుష్టే, పద-గుల్ఫ-జానుజఘనే, నాథౌ చ, వక్షః స్తనే
                        కక్షౌ-కంఠ-కపోల-దన్తవసనే, నేత్రాలినే మూర్థ ని।
శుక్లాశుక్లవిభాగతో మృగదృమశామంగేష్వనంగసతీ
                        రూర్థ్వాధోగమనేన వామపదతః పక్షద్వయే లక్షయేత్॥


మ.

పెనువ్రేలన్ బద గుల్ఫ జాను కటి నాభీభాగ బాహాంతర
స్తన కక్షమ్ములఁ గర్ణగండరదనాసావత్సఫాలోత్తమాం
గనిరూపంబుల నెక్కుడిగ్గుఁ గలయంగా శుక్లకృష్ణంబుల
న్దినము న్మన్మథుఁ డంగనాజనముల న్దేలించు వామాదియై.


తా.

బొటనవ్రేలు కాలిమడమపిక్క తొడ పిఱుదు బొడ్డు భుజము
చన్ను చంక చెవి పల్లు చెక్కిలి ముక్కు ఱొమ్ము ముఖము తల యీస్తానముల
యందు కళ తరుణీమణులకు శుక్లపక్షమున నెడమదిక్కుగా నెక్కి కృష్ణపక్ష
మందు కుడిదిక్కుగా దిగును.

స్త్రీపురుషకళాస్థానములు

శ్లో.

మస్తకే వక్షసే తథా కరయోః స్తనయోరపి
ఊర్వోర్నాభౌ స్మరగృహే ఫాలకుక్షికటిత్రికే॥


శ్లో.

బాహుమూలే గళే చైవ నితంబే భుజయోస్తధా
వనితానాముక్తరీత్యా కృష్ణే౽ధో గచ్ఛతి క్రమాత్॥


శ్లో.

ఆరభ్యః శుక్లప్రథమాం మూర్ధానమధిరోహతి
ప్రత్యేకముక్తస్థానేషు సబిందూన్ సవిసర్గకాన్॥

(ఇతి రతిరత్నప్రదీపిక)

సీ.

అంగుష్ఠముఖమున నరికాలియందున
                 మడమను మోకాలిముడుసునందు
మరునింట నాభియం దురమునఁ జంటను
                 గక్షభాగంబునఁ గంఠమునను
జెక్కున నధరానఁ జెలువార రెప్పను
                 నుదుట శిరంబున మదనుఁ డెలమి
శుక్లపక్షమునందు సుదతుల కెల్లను
                 పాడ్యమి మొదలుగాఁ బరఁగనెక్కి


గీ.

వామభాగంబునందుండి వలపటికిని
బోవు బహుళంబులందును బురుషులకును
వామభాగంబునకు డిగ్గు వరుసతోడ
వెలఁదులకుఁ బతులకుఁ గల ల్వీడు నిట్లు.

స్త్రీలకు తిథులు — కళాస్థానములు

తా.

బొటనవ్రేలికొన, అరికాలు, మడమ, మోకాలిచిప్ప, భగము,
బొడ్డు, ఱొమ్ము, చన్ను, చంక, కంఠము, చెక్కిలి, అధరము, కనురెప్పలు,
ముఖము, తల, యీస్థానములయందు కళ స్త్రీలకు శుక్లపక్ష పాడ్యమాదిగా
నెడమదిక్కున కెక్కి కుడిదిక్కుగా దిగును. పురుషులకు కృష్ణపక్షపాడ్యమి
మొదలు కుడిదిక్కుగా నెక్కి ఎడమదిక్కునుండి దిగును.


శ్లో.

ప్రథమాయాం సితేం౽గుష్ఠే నిజాంగుష్ఠేన మర్దయేత్।
ద్వితీయాయాం తు చరణే తం స్వపాదేన పీడయేత్॥


శ్లో.

తృతీయాయాం తథా గుల్ఫే స్వగుల్ఫేన చ తాడయేత్।
చతుర్థ్యాం జానునీ తస్యామర్దయేన్నిజజానునా॥


శ్లో.

కుర్యాత్కరికరక్రీడాం పంచమ్యాం స్మరమందిరే।
నాభిం చ తలహస్తేన షష్ఠ్యాం సంతాడయెన్మృదు॥


శ్లో.

ముష్టిహస్తేన సప్తమ్యాం వక్షస్తాడనమాచరేత్।
అష్టమ్యాం స్తనయోస్తాం చ సలిలం మర్దయేధృవా॥


శ్లో.

నవమ్యాం బాహుమూలే తు నఖరేఖాం సమాచరేత్।
దశమ్యాం కంఠదేశే తు తత్రాపి నఖరైర్లిఖేత్॥

శ్లో.

ఏకాదశ్యాం కపోలే తు బహుశశ్చుంబనం చరేత్।
ద్వాదశ్యాం దంతవసనే దన్తోష్ఠేన నిపీడయేత్॥


శ్లో.

త్రయోదశ్యాం తు నయనే మృదుచుంబనమాచరేత్।
చతుర్దశ్యాం ఫాలదేశే తత్ర చుంబనతాడనే॥


శ్లో.

పంచదశ్యాం తు శిరసి కచగ్రహణమాచరేత్।
పుసాం దక్షిణపార్శ్వే తు వనితైవం సమాచరేత్॥


శ్లో.

కృష్ణే౽వరోహక్రమతః కృత్యాన్యేతాని చాచరేత్।
ఏవమాచరితే కాన్తాః ప్రహృస్యన్తి ద్రవన్తి చ॥

(ఇతి రతిరత్నప్రదీపిక)

సీ.

అమవసఁ బాడ్యమి నంగుష్ఠమున నుండు
                 విదియఁ బాదంబుల వెలసియుండుఁ
దదియ గుల్భమునందుఁ దగుఁ జవితి తొడను
                 బంచమిఁ గటియందుఁ బరఁగియుండు
షష్ఠి నాభి నెసంగు సప్తమి నురమున
                 నష్టమిఁ గుచముల నమరియుండు
నవమి వక్షమునందు నయముగ దశమిని
                 గంఠమూలంబునఁ గలిగియుండు


ఆ.

బదునొకంటఁ జెక్కులఁ బదిరెంట నధరంబు
పదియుమూఁటఁ గనులఁ బదియునాల్గు
దినములందు నుదుటఁ దివిరి పున్నమినాఁడు
తలకు నెక్కు డిగ్గుఁ గల లటండ్రు.


తా.

అమవస పాడ్యమి తిథులయందు బొటనవ్రేలియందును, విదియను కాళ్ళ
యందును, తదియను మడమయందును, చవితి తొడను, పంచమి పిఱుదులయందును,
షష్టి బొడ్డునందును, సప్తమి ఱొమ్మునను, అష్టమిని చన్నులయందును, నవమి
చంకలయందును, దశమి మెడయందును, ఏకాదశి చెక్కులయందును, ద్వాదశి
పెదవియందును, త్రయోదశి కనులయందును, చతుర్దశి నుదిటియందును, పున్నమ
తలయందును, కళ యెక్కుచూ దిగుచూ ఉండును.

స్త్రీలను రమించి ద్రవింపఁజేయు బంధవిశేషములు

శ్లో.

కే గృహ్ణన్తి కచాన్ లలాటనయనే చుంబన్తి, దన్తచ్ఛదం
దన్తోష్ఠేన నిపీడయన్తి, బహుశశ్చుంబన్తి గండస్థలీం।
కక్షాకంఠతటం లిఖన్తి నఖరై, ర్గృహ్ణంతి గాఢం స్తనౌ
ముష్ట్యా వక్షసి తాడయన్తి దదతే నాభౌ చపేటాం శనైః॥


శ్లో.

కుర్వన్తి స్మరమందిరే కరికరక్రీడాం స్త్రియో జానునీ
గుల్పాంగుష్టపదాని చ ప్రతిముహుర్నిఘ్నన్తి తైరాత్మనః।
ఇత్యేనం కలయన్తి యే శశికలామాలింగ్య మజ్జన్తి తే
శీతాంశూపలపుత్రికాం శశికరసృష్టామిప ప్రేయసీం॥


సీ.

అలకలు గబళించి యలికనేత్రంబులు
                 చుంబించి వాతెరఁ జొనిపి పేర్చి
చెక్కిలి ముద్దాడి గ్రక్కునఁ గంఠ క
                 క్షములపై నఖపురేఖలు ఘటించి
బిగియఁ జన్నులఁ బట్టి పిడికిట నడిఱొమ్ము
                 దాఁటించి నాభిఁజపేట మునిచి
స్మరగేహమున దంతికరలీలఁ బచరించి
                 జానుగుల్భాంగుష్ఠచరణతలము


గీ.

నంటి తనవాసిచే దాని నంటు కొలిపి
కలియనేర్చిన రతికేళిఁ గరఁగు కాంత
చంద్రకిరణంబు సోఁకిన చంద్రకాంత
రత్నమును బోలి యానందఁరసము నొందు.


తా.

ముంగురులను చేత దువ్వి నొసలు కన్నులు చుంబించి పెదవి గరచి
చెక్కిలి ముద్దుపెట్టుకొని మెడ చంకలయందు నఖక్షతములుంచి కుచముల బట్టి
పిడికిలిచేత ఱొమ్మును లంఘించి బొడ్డును తట్టి భగమందు యేనుగుతొండమువలెనే
చెయ్యి చేర్తి మడమ బొటనవ్రేలు అరకాలును ముట్టి తననేర్పుచే స్త్రీని మరులు
కొలిపి రమించిన యెడల చంద్రకిరణములు సోకిన చంద్రకాంతమువలెనే కరగి
యానందరసమునం దోలలాడును.

పద్మినికి ముఖ్యకళాస్థానములు

క.

కటి నాభి యూరుతలమును
బటుతరముగఁ గళలనెలవు పద్మిని కరయన్
గటియూరువుఁ గనుఁగొన్నను
విటపతి పాంచాలుఁ డింతి వేడుకఁ గోరున్.


తా.

పద్మినికి పిఱుదు నాభి తొడలు కళాస్థానములు. ఆ కళాస్థానము
లను గనుగొని పాంచాలుడనే పురుషు డాస్త్రీని రమింపగోరును.

చిత్రిణికి ముఖ్యకళాస్థానములు

ఫాలము నలకలుఁ గన్నులు
లాలితగతిఁ జిత్రిణికి విలాసస్థలము
ల్వాలిక నునుమెఱుఁగులఁ గని
పోలఁగ భద్రకుఁడు యువతిఁ బొందఁగఁగోరున్.


తా.

నొసలు ముంగురులు కన్నులు చిత్రిణికి కళాస్థానములు. వాటినుంద
రమును జూచి భద్రకుడనే పురుషు డాస్త్రీని పొందగోరును.

శంఖినికి ముఖ్యకళాస్థానములు

క.

అధరము పిక్కలుఁ జెక్కులు
సుదతులలో శంఖినికి జూడఁగ నొప్పౌ
నధరము సొబగుఁ గనుంగొని
మదవతిఁ బొందంగఁ గూచిమారుఁడు గోరున్.


తా.

పెదవి పిక్కలు చెక్కిళ్ళు శంఖినికి కళాస్థానములు. వీటియందమును
గాంచి కూచిమారుడనే పురుషుడు యాస్త్రీని పొందగోరును.

హస్తినికి ముఖ్యకళాస్థానములు

క.

వక్షోజ బాహుమూలము
లీక్షితహస్తికినిఁ గళల కిరవగు ఠావు
ల్వక్షోజముఁ గనుగొని య
బ్జాక్షిని దత్తకుఁడు పొంద నాత్మ దలంచున్.

తా.

కుచములు చంకలు హస్తినికి కళాస్థానములు. వీటిని దత్తకుడనే
పురుషు డాస్త్రీని రమింపదలఁచును.

మన్మథబాణములకు స్థానములు

శ్లో.

ఏకారౌకారయుక్తా హరిహరజహరాః పంచబాణస్స్మరస్య
ఖ్యాతా లక్ష్యాణ్యమీషాం హృదయకుచదృశో మూర్ధగుహ్యే క్రమేణ
మర్మస్వేతేషు భూయో నిజనయనధనుః ప్రేరితైస్తైః పతద్భిః
స్యన్దన్తే సుందరీణాంజ్వలదనలని భైర్బిన్దవః కామవారామ్॥


శా.

ఏకారంబు నొకారమున్ హరిరథాధీశాత్రినేత్రాఖ్యబీ
జాకారంబులు చిత్తసంభవుని పంచాస్త్రంబు లీబాణముల్
స్త్రీకిన్ హృత్కుచ దృష్టి మస్త తనుభూసీమంబుల న్విస్ఫులిం
గాకల్పంబుగఁ జూచిన న్మదనతోయం బుబ్బు నత్యుష్ణమై.


తా.

మన్మథబాణములైన ఏం, ఓం, హ్రీం, క్లీం, క్లాం, అను యీ బీజా
క్షరములు నుచ్చరించుచు స్త్రీయొక్క ఱొమ్ము చన్నులు దృష్టి శిరస్సు రోమ
ములను రెప్పలార్పక చూచినయెడల నుష్ణమైన రతిజలము ద్రవించును.

షోడశకళాస్థానములు

శ్లో.

సంక్షేపాదితి నందికేశ్వరమతాత్తత్త్వం కిమప్యుద్ధృతం
ఘోణీపుత్త్రకభాషితో౽యమధునా సక్షిప్యతే విస్తరః।
మూర్దోరస్థలవామదక్షిణకరే వక్షోరుహోరుద్వయే
నాభీగుహ్యలలాటజాఠరకటీ పృష్ఠేషు తిష్ఠత్యసౌ॥


శ్లో.

కక్షాశ్రోణిభుజేషు చ ప్రతిపదం ప్రారభ్యకృష్ణామథ
శ్వేతాయాః ప్రభృతి క్రమేణ మదనో మూర్ధావమారోహతి।
అంగేష్వేషు మృగీదృశాం మనసిజప్రస్తావనాపండితా
మాత్రాఃషోడశ చిన్తయన్తి బహలజ్యోతిఃస్ఫులింగాకృతీః॥


సీ.

తల యురస్స్థలి వామదక్షిణకరములు
                 వలిచన్ను లూరులావర్తనాభి
ఫాల జఠర నితంబస్థలంబులు వీపు
                 చంకలు యోనియుఁ జరణతలము

లాదిగాఁ గల పదియాఱు తానకములఁ
                 బ్రతిదినంబునుఁ బంచబాణుఁ డుండు
కావున స్త్రీల యంగంబుల శుక్లప
                 క్షంబుల నెక్కుఁ గృష్ణముల దిగును


గీ.

విటులు తలములు పదియాఱు విస్ఫులింగ
భావములుగాఁగఁ జూచి యప్పట్లు దలఁచి
పొందనేర్చిన మోహంబుఁ బొడముచుండు
తరుణి వలపించు మందులఁ దలఁపనేల.


తా.

తల, ఱొమ్ము, చేతులు, కుచములు, తొడలు, బొడ్డు, నొసలు,
కడుపు, పిఱుదు, వీపు, చంకలు, భగము, కాళ్ళు మొదలగు పదియారుతావులందు
వరుసగా దినదినమును మన్మథుడుండును. కాన నా యంగముల శుక్లపక్షమం
దెక్కుచు కృష్ణపక్షమందు దిగుచుండును. కావున పురుషులు యీ తావులను
దెలిసి స్త్రీలను రమించినయెడల స్త్రీలకు వలపు పుట్టును. కావున స్త్రీలకు వలపు
పుట్టు మందులకొఱకు ప్రయత్నింప ననవసరము.


వ.

ఇట్లు నందికేశ్వరు మతానుసారంబుఁ జెప్పి ఘోణికాప్రోక్తంబగు షోడశ
కళాస్థానమాత్రస్వరూపాక్షరభావంబు వివరించితిని. ఇంక దినభోగక్రమం
బు వివరించెద.

పాడ్యమియొక్క వివరము

శ్లో.

కంఠే సంశ్లిష్యగాఢం శిరసి విదధశ్చుంబమోష్ఠౌ రదాగ్రై
రాపీడ్యాచుంబ్యగండౌ విరచితపులకాఃపృష్ఠతః పార్శ్వయోశ్చ।
దత్త్వా సూక్ష్మంనఖాంకం మృదుకరజముఖై రంజయన్తోనితంబ
ప్రాగ్భారం మన్దసీత్కాఃప్రతిపది యువతీం నాగరాద్రావయన్తి॥


చ.

పతిప్రతిపత్తునందుఁ బ్రియభామినికంఠముఁ గౌఁగలించి మ
స్తతలము ముట్టి వాతెర రదంబుల నొత్తి కపోలపాళి చుం
బితముగఁ జేసి పార్శ్యములు పృష్ఠము శ్రోణితలంబు గోళ్ళు నం
చితపులకాంకము ల్వొడమ సీత్కృతి నంటినఁ బల్లవింపదే.

తా.

పాడ్యమియందు పురుషుడు యిష్టురాలియొక్క మెడను గౌగలించి,
తల ముట్టి పెదవి గరచి చెక్కిళ్ళు ముద్దాడి పక్కలు వీపు పిఱుదులయందు గగు
ర్పొడుచునట్టుల నఖక్షతములు చేసి సీత్కారముతో నంటిన ద్రవించును.

విదియ సవిస్తరము

శ్లో.

స్తనమిలనసుఖార్తో గండపాలీం విచుంబన్
నయనకుచయుగం చాకృష్య పార్శ్వం నఖాగ్రైః।
అధరమనలిహన్ దోర్మూలచంచన్నఖాగ్రః
కతఘనపరిరంభో ద్రావయేదహ్ని యుగ్మే॥


చ.

కుచముల బట్టి మోవి చవిఁ గ్రోలి కపోలతలంబుఁ గన్నులన్
రుచిఁగొని యొత్తి కౌఁగిట నిరుద్ధముగా బిగియించి కక్షస
ద్రచితనఖాంకురంబులను రంజనఁ జేసి ద్వితీయఁ బల్లవుల్
విచికిలగంధిఁ బొందుచు ద్రవింపఁగఁ జేయుదు రింపు పుట్టఁగన్.


తా.

విదియయందు విటులు చన్నులను బట్టి అధరము చుంబించి చెక్కిళ్ళను
గన్నులను ముద్దాడి గాఢాలింగన మొనర్చి చంకలయందు నఖక్షతము లుంచి సంతో
షించునట్లు స్త్రీలను రమించి ద్రవింపజేయుదురు.

తదియయొక్క విశేషము

శ్లో.

తృతీయాయాంశ్లిష్యన్నిబిడతనుమాపాద్యపులకం
ముహుర్బాహ్వోర్మూలే మృదులిఖితపార్శ్వః కరరుహైః।
భుజాపీడం కంఠే దశనవశనాస్వాదతరలః
స్తనోపాన్తారబ్ధచ్ఛురితమబలాం విహ్వలయతి॥


చ.

తదియను వల్లభు ల్సతులఁ దత్తర మందఁగఁ గౌఁగలించి స
మ్మదమునఁ గక్షపార్శ్వములు మార్దవ మొంద నఖాంకరాంకుము
ల్పొదవుచు మోవి యాని గళము న్గబళించి కుచాంతరంబునన్
మొదలిటిగోరునన్ ఛురితము న్ఘటియింప ద్రవింతు రింపుగన్.


తా.

తదియయందు విటులు స్త్రీలను తొట్రుపాటు నొందక కౌగలించి,
ప్రక్కలయందును చంకలయందును నఖక్షతము లొనర్చుచు, అధరపానము చేసి
మెడను బట్టి, చన్నులచివర మొదటివ్రేలిగోరుచే ఛురితమనే నఖక్షతమును చేయగా
ప్రీతిచే ద్రవించును.

చవితియొక్క సామ్యము

శ్లో.

చతుర్థ్యామాలింగ్య స్ఫుటమలఘుసంపీడిచకుచా
దశన్తోబింబోష్ఠం నఖలిఖితవామోరుఫలకాః।
దదన్తో దోర్మూలే ఛురితమసకృన్నీరజదృశః
శరీరే క్రీడన్తి స్మరరసనదీనిర్భరజలైః॥


చ.

చవితిని వల్లభుండు రతిచంద్రనిభాననఁ గౌగలించి చ
న్గవ బిగఁబట్టి మోవిఁ జిరుకాటుల నిల్పి తదీయమంజుళో
రువున నఖక్షతంబులు నిరుద్ధముఁ జేయుచు బాహుమూలము
న్దవులఁగఁ బెద్దవ్రేలు ఛురితం బొనరింప ద్రవించు నెంతయున్.


తా.

చవితియందు విటుడు రతికాలమందు స్త్రీని ఆలింగనము చేసి, చన్ను
లు పట్టి పెదవియందు చిన్నిగంటుల నుంచి యెడమతొడయందు దట్టముగా నఖక్షత
ములు జేయుచు, చంకలయందు పెనువ్రేలిచే నూనునట్టు ఛురితమనే నఖక్షత
మొనరించిన ద్రవించును.

పంచమి షష్ఠియొక్క సందర్భము

శ్లో.

పంచమ్యాం చికురానదక్షిణకరేణాకృష్యదష్ట్వా౽ధరం
దత్త్వాచూచుకయోః సఖేలపులకం చుంచేత్కుచౌ భావతః।
షష్ఠ్యాం గూఢవిగూఢగాత్రమధరం దష్ట్వా౽ధి నాభీతలే
ప్రారబ్ధచ్ఛురితో లిఖేత్కరరుహైరుర్వోస్తటీరున్మదః॥


క.

కురు లెడమచేత నివురుచు
గురుకుచములకొనలు పుణికి గుబ్బలనెలవు
ల్పరికించుచు నధరముఁ జవి
పురిగొని పంచమిని సతులఁ బొందఁగవలయున్.


తా.

పంచమియందు పురుషులు యెడమచేత ముంగురులు దువ్వుచు చను
గొనలను నలుపుచు, చన్నులను బట్టి, మోవి యాని స్త్రీని రమించి ద్రవింపజేయవలెను.


ఆ.

బిగియఁ గౌఁగలించి బింబాధరం బాని
నాభియందు ఛురితనఖము నిడుచు
తొడలు గోర నొత్తి తొయ్యలిఁ గలిసిన
షష్టియందు మదనజలముఁ జిలుకు.

తా.

షష్ఠియందు పురుషులు గాఢాలింగనము గావించి, యధరపానమును
జేసి, బొడ్డునందు ఛురితమను నఖక్షతమును జేయుచు, తొడలయందు గోళ్ళతో
నొత్తి రమించినచో స్త్రీ ద్రవించును.

సప్తమి విషయము

శ్లో.

మృదితమదనవాసో దస్తవాసో విహానః
                        కరజకలితకంఠోపా స్తనక్షః కపోలః।
కృతఘనపరిరంభః సంభృతానంగరంగో
                        గమయతి మృదుభావం భామినీమహ్నిభానోః॥


చ.

అతనుగృహంబు ముట్టి యధరామృత మాని గళంబున న్నఖ
క్షతములు నించి వక్షమున గండతలంబున గోరు లొత్తుచున్
గృతపరిరంభులై మదనకేళిఁ బ్రవీణతఁ జూపి వల్లభుల్
సతులఁ గరంగఁజేయుదురు సప్తమి మన్మథవారి యుబ్బఁగన్.


తా.

సప్తమియందు విటులు యోని నంటి, మోవి యాని, మెడయందును
ఱొమ్మునను చన్నులను చెక్కిళ్ళను నఖక్షతములు జేయుచు, కౌగలించి రతియందు
సామర్థ్యమును జూపి స్త్రీలకు వలపు పుట్టించి మదనజల ముబ్బునట్లొనర్తురు.

అష్టమి నవమియొక్క నిర్ణయము

శ్లో.

అష్టమ్యాం పరిరంభ్య కంఠమసకృన్నాభిం నఖైరంచయన్।
దష్టౌషః పులకం దదత్కుచరిటీం చుంబేద్విమృదోచ్చకైః॥


శ్లో.

నాభీమూలవిలోలపాణిరధరం దృష్ట్వా స్తనౌ పీడయన్।
మృద్నియాద్ మదనాలయం చ విలిఖన్ పార్శ్వం నవమ్యాం నఖైః॥


ఆ.

గళముఁ గౌఁగిలించి కరరుహంబుల నాభిఁ
జఱచి పెదవిఁ గఱచి చన్నుదోయి
ముద్దుఁ బెట్టుకొనుచు ముదితలఁ బల్లవు
లష్టమిని రమింతు రిష్టగతుల.


తా.

అష్టమియందు విటులు మెడను గౌగలించి, గోళ్ళతో బొడ్డు నిమిరి,
అధరామృత మాని, చనులు ముద్దుపెట్టుకొనుచు స్త్రీల నిష్టరీతి ననుభవింతురు.

క.

నవమిని నధరామృతమును
జవిఁగొని చనులంటి నాభిఁ జప్పట లిడుచున్
గవిసి నఖంబుల నెలవులు
నివురుచు దృఢరతుల సలిపి నెగడఁగవలయున్.


తా.

నవమియందు పురుషులు మోవి యాని, చన్నులను ముట్టి, నాభిని దట్టుచు
నఖక్షతస్థానములందు దడవుచు, కఠినరతు లొనర్చినచో స్త్రీలు ద్రవింతురు.

దశమి నిదానము

శ్లో.

లలాటమాచుంబ్య నఖైర్లిఖన్తః శిరోధరాం భ్రామితవామహస్తాః।
కటిస్తనోరస్స్థలపృష్ఠమధ్యే స్మరం దశమ్యాం ప్రతిబోధయన్తీ॥


ఆ.

అళికచుంబనంబు లలరించి నఖములఁ
గంఠ మొత్తి వామకరమునందు
నురము పిఱుఁదు వీపు గురుకుచయుగళంబుఁ
దడవ దశమిసతికి ద్రవము పుట్టు.


తా.

దశమియందు పురుషులు నుదురును ముద్దు పెట్టుకొని నఖములతో కంఠ
ము నొత్తి ఱొమ్ము పిఱుదులు వీపు కుచములు యెడమచేత దడవగా స్త్రీకి ద్రవము
పుట్టును.

ఏకాదశియొక్క నిశ్చయము

శ్లో.

ఏకాదశ్యాం కరజకలితగ్రీవమాలింగ్య గాఢం
పాయం పాయం దశనవసనం కించిదాలీలలోలమ్।
ఘాతం ఘాతం హృది సహసితం మన్మథాగారముద్రా
భంగక్రీడాతరలితకరాః కామినీ ద్రావయన్తీ॥


మ.

విటుఁ డేకాదశిఁ గాంతకంఠము నఖావిష్టంబుగాఁ జేసి కౌఁ
గిటఁ గీలించి రదచ్ఛదామృతము గాంక్షీభూతుఁడై క్రోలి సం
ఘటితోరుస్థలవక్షుఁడై నగవుతోఁ గందర్పసందేశల
పటహస్తాంగుళుఁ డైన నీరు వెడలు న్బంచాస్త్రుగేహంబునన్.


తా.

ఏకాదశియందు విటుఁడు మెడయందు నఖక్షతము లుంచి కౌగలించి
యధరామృత మాని ఱొమ్మున ఱొమ్ము గ్రుమ్ముచు, హసించుచు యోనియందు
వ్రేళ్ళను ద్రిప్పుచు స్త్రీని రమించినచో ద్రవించును.

ద్వాదశి త్రయోదశియొక్క వినియోగము

శ్లో.

ద్వాదశ్యాం పరిరభ్య గాఢమసకృచ్చుంబన్కపోలే దృశో
రున్మేషం విరధీత సీత్కృతిజుషో వ్యాదష్టదన్తచ్ఛదః।
చుంబన్గండతటీం మనోభవతిధౌ మృద్నన్ ససీత్కం కుచౌ
కాన్తాం ద్రావయతి ద్రుతం కరరుహైర్భిన్దన్ శనైః కందరాం॥


క.

 పారణను జెలిని గౌఁగిటఁ
జేరిచి కెమ్మోవిఁ గఱచి చెక్కులపై దాఁ
గోరిడి గళరవ మిచ్చిన
మారుని మదజలముఁ జూపు మనసు న్దనియున్.


తా.

ద్వాదశియందు స్త్రీని కౌగలించి పెదవి కరచి కంఠధ్వని పుట్టున
టుల చెక్కుపై నఖక్షతము లుంచినచో ద్రవించును.


ఆ.

గుబ్బ లరియఁబట్టి గోరుల మెడ యొత్తి
గళరవంబు చెలఁగ గండతలము
చుంబనంబుఁ జేయుచును ద్రయోదశియందు
పల్లవుండు గదియఁ బడఁతి చొక్కు.


తా.

త్రయోదశియందు విటుడు కుచములు పట్టి కంఠమునందు నఖక్షతము
లుంచి గళరవంబులు పుట్టునట్లు దవడలను ముద్దాడి రమింపగా స్త్రీ చొక్కి
ద్రవించును.

చతుర్దశి పున్నమ యవమసల సవిస్తరము

శ్లో.

కన్దర్పారితిధౌ నిచుంబితదృశో దోర్మూలచంచన్నఖాః
కామాగారనివేశితద్వకరాః క్రీడన్తి కాన్తాతనౌ।
దర్శే పూర్ణతిధౌ చ నర్తితనఖాః స్కంధస్థలీరంగకతో౽
నంగాగారచుచూలికాంచితకరాః కుర్యుః స్త్రియం విహ్వలాం॥


ఆ.

నయనయుగము చుంబనము చేసి చెక్కుల
గోరు లొత్తి మదనగృహమునందు
కరికరంబునటులఁ గరములు వెసఁ ద్రిప్పి
పొందవలెఁ జతుర్దశిం దరుణిని.

తా.

చతుర్దశియందు విటులు కన్నులు ముద్దుగొని దవడలయందు నఖక్షత
ము లుంచి భగమునందు ఏనుగుతొండమువలె హస్తమును ద్రిప్పి స్త్రీని రమించిన
ద్రవించును.


క.

పున్నమ నమవస నఖముల
వన్నియయంగముల మెలపి వలపులు గదియన్
జన్నులు కరములఁ బుణుకుచుఁ
జెన్నుగ రమియింపఁ జెలులు చిక్కుదు రాత్మన్.


తా.

పున్నమ నవమలయందు పురుషులు స్త్రీలయొక్క శరీరములందు
నఖక్షతము లుంచి వలపు గలుగునట్లు చేతులతో చన్నులను పుణుకుచు లెస్సగా
రమించిన ద్రవింతురు.


వ.

ఇది నందికేశ్వర ఘోణికాపుత్ర మతానుసారంబు లిఁక వాత్యాయన
సూత్రప్రకారంబు వివరించెద.

ఇతి శ్రీకొక్కోకకృతే రతిరహస్యే
చంద్రకళాధికారో నామ
ద్వితీయః పరిచ్ఛేదః

సురతభేదే జాత్యధికారః

తృతీయః పరిచ్ఛేదః

భగదండప్రమాణరతుల లక్షణములు

శ్లో.

ఆరోహపరిణాహాభ్యాం షణ్నవద్వాదశాంగుళైః।
గుహ్యైశ్శశో వృషో౽శ్వో నా హరిణ్యశ్వేభికాః స్త్రియః॥


శ్లో.

హరిణీశశయోర్యోగే వడవావృషయోస్తథా।
హస్తినీహయయోశ్చైవ మతం సమరతం త్రయమ్॥


శ్లో.

మృగీవృషం చ వడవాహయముచ్చతరం ద్వయం।
వీచద్వయం చ వడవాశశకం హస్తినీవృషమ్॥


సీ.

పురుషులు శశ వృష తురగజాతులు వీరి
                 శాఖలు దీర్ఘవిశాలములును
నారు తొమ్మిది ద్వాదశాంగుళపరిమాణ
                 మయ్యెను మఱియు నతయ్యతివలకును
హరిణియుఁ దురగియు హస్తిని యననొప్పు
                 నీప్రమాణమె మరునింటిలోఁతు
హరిణియుఁ గుందేలు నశ్విని వృషభంబు
                 హస్తికి ఘోటక మమరుపొందు


ఆ.

జాతిజాతి కూడ సమరతి యయ్యెడి
నుచ్చమయ్యె మృగియ నుక్షమంబు
నశ్వినియు హయమ్ము నత్యుచ్చమయ్యెను
హరిణి హయము శశము హస్తినియును.


తా.

శశము, వృషభము, తురగము, యని పురుషజాతులు మూడు. ఈ
జాతులయొక్క శిశ్నములప్రమాణము వరుసగా, ఆరు, తొమ్మిది, పదిరెండు,

అంగుళము లుండును. హరిణి, తురగి, హస్తిని, యని స్త్రీజాతులు మూఁడు.
ఈ జాతుల భగములు లోతు క్రమముగా, ఆరు, తొమ్మిది, పదిరెండు, అంగుళ
ముల ప్రమాణ ముండును. శశము హరిణియు, వృషభము అశ్వినియు, తురగము
హస్తినియు, కూడినచో సమరతి యగును. వృషభము హరిణియు, అశ్విని హయ
మును గూడిన నుచ్చరత మగును. హయము హరిణియు, శశము హస్తియు గూడిన
నత్యుచ్చరత మగును.


శ్లో.

అత్యుచ్చమతినీచం చ మృగశ్వం హస్తినీశశమ్।
ఇతి ప్రమాణభేదేన నవధా రతమూచిరే॥


ఆ.

నీచరతము లశ్వినీశశకంబులు
హస్తినీశశంబు లధికనీచ
రతులు హరిణియును దురగములు కరిణియు
శశకములు విరుద్ధజాతు లయ్యె.


తా.

శశము నశ్వమును శశము హస్తినియు గూడిన నీచరతి యగును. అశ్వము
హరిణియు, శశము కరిణియు గూడిన అతినీచరత మగును.


శ్లో.

ఉత్తమాని సమాన్యాహుర్మధ్యముచ్చరతం ద్వయమ్।
నీచద్వయం తథా౽త్యుచ్చమతినీచం మహాధమమ్॥


క.

సమరతి యుత్తమ మగు మ
ధ్యమ ముచ్చరతద్వయంబు నత్యుచ్చము నీ
చము నతినీచం బధమము
క్రమమున నిది యెఱిఁగి పొందఁ గావలయు విటుల్.


తా.

ఉత్తమము, మధ్యమము, అధమము, అని రతి త్రివిధము. ఆరతుల
యందు సమరతి యుత్తమమనియు, ఉచ్చరతిద్వయమును, అత్యుచ్చరతిద్వయ
మును మధ్యమమనియు, నీచరతములు, అతినీచరతములు అధమమనియు జెప్పం
బడియె గాన వీని నెఱింగి విటులు స్త్రీలను రమింపవలెను.

అతృప్తిస్త్రీబాధలక్షణము

శ్లో.

కండూతేరప్రతీకారాదన్తర్లింగావిమర్దనాత్।
న ద్రవన్తి న తృప్యన్తి యోషితో నీచమోహనే॥

శ్లో.

ఉచ్చేపి మృదుగుహ్యాన్తఃసంపీడాసవ్యథో హృది।
న ద్రవన్తి న తృప్యన్తి మనస్తన్త్రో హి మన్మథః॥


ఉ.

దూల జనించు నీచరతిఁ దొయ్యలికిన్ రతితృప్తి లోక లోఁ
జాలఁగ నొప్పి పుట్టు నెడజాలక యుచ్చరతంబునందు నా
కాలమునందు హృద్వశుఁడు కాముఁడు గావునఁ జిత్తతృప్తినిం
బాలఁ జేయ కెక్కుడుగఁ బారిన బాధ జనింపకుండునే.


తా.

పడతికి నీచరతిచేత తృప్తిలేక యోనియందు దురద పుట్టును. ఉచ్చర
తముచేత లోపలిభాగము చాలక భగములోపల నొప్పి పుట్టును. రతికాలమందు
బ్రియుడు తృప్తిపొందింపలేనిచో స్త్రీలకు యెక్కువబాధ కలుగును.


శ్లో.

రక్తజాః కృమయః సూక్ష్మామృదుమధ్యోగ్రశక్తయః।
స్మరసద్మని కండూతిం కండూవ్యపన యాదతః॥


శ్లో.

చణ్డధ్వజాభిఘాతేన కండూవ్యపన యాదతః।
క్షరణాచ్చసుఖం తాసాం విసృష్టేః స్యన్దనాత్మనః॥


శ్లో.

ప్రారంభాత్ప్రభృతి స్యదః క్లేదాత్మా సుఖలేశదః।
అంతే తు నరవత్తాసాం విసృష్టేర్మూర్ఛనాసుఖమ్॥


వ.

మఱియు నిదియుం గాక నీచరతిచేత సూక్ష్మజంతువులు రక్తంబులో జన్మించి
మదనమందిరమున దూల జనింపఁజేయును. ధ్వజదండాఘాతంబున శమించి
ద్రవంబుఁ గల్పించు, నాద్రవం బంతర్ద్రవం బనియి బహిర్ద్రవం బనియు ద్వివి
ధంబు. బహిర్ద్రవం బెడతెగక వెలుపలికి వెడలుచుండు నదియు సుఖంబునకు
దూరంబు. మొదలనుండియు నధికద్రవంబు సుఖంబు నీయదు. కావున గ్రమ
క్రమంబున న్బొడము నంతర్ద్రవంబు సుఖకారణంబును మోహకారణంబును
నగు. అంతర్ద్రవంబు కామినికిఁ బరవశత్వకారణంబు. అది యెట్లన్న వివ
రించెద.

పరవశత్వలక్షణము

శ్లో.

క్షణం రటన్తీ నృత్యన్తీ రుదతీ చాతివిహ్వలా।
నిస్సహత్వం తదా యాతి ముకుళీకృతలోచనా॥


క.

 కొసరుంబలుకులు వలుకుచు
విసువక తహతహ నటించు విహ్వల యగుచున్

రస మొలుక న్గనుమూయుచు
నసురై పరవశత నొందు రంగన రతులన్.


తా.

స్త్రీలకు రతికాలమందు కొసరికొసరి మాట్లాడుచు శ్రమనొందక తొట్రు
పాటుచేత కలతపడుచు శృంగార ముప్పొంగునట్లు నేత్రములు ముకుళింపజేయుచు
బడలికచేత రతియందు మైమరచును.


శ్లో.

స్త్రీపుంసయోర్విసృష్టిశ్చ లఘుమధ్యచిరోదయా।
నవధా రతమేవం స్యాత్ కాలతోపి ప్రమాణవత్॥


శ్లో.

మందమధ్యమచండాః స్యుర్వేగతోప్యుభయే తథా।
వేగః కాముకతా జ్ఞేయస్తేనాపి నవధా రతమ్॥


శ్లో.

వీర్యం బహక్షతాఘాతసహత్వం రతిలోలతా।
చండవేగస్య చిహ్నాని మందవేగే విపర్యయః॥


శ్లో.

ఏతేషాం మధ్యవేగే తు మధ్యమత్వం సమున్నయేత్।
ప్రమాణకాలభావైః స్యురిత్యేనం సప్తవింశతిః॥


శ్లో.

రతాని తత్ర సామ్యే స్యుః త్రిభిః సురతముత్తమమ్।
సర్వవైషమ్యతస్తు స్యాదధమం పశుచేష్టితమ్॥


శ్లో.

శేషే తు మధ్యమత్వం స్తాదేకత్రాపి జుగుప్సితమ్।
అత్యుచ్చ మతినీచం చ సంక్షేపాదితి భాషితమ్॥


శ్లో.

ఉక్తం మృగ్యాదిభేదానామిదానీం చిహ్నముచ్చతే।
స్వభావగుణభేదేన వాత్స్యాయనమతోదితమ్॥


వ.

ఇంకఁ గాలప్రమాణాదుల ననుసరించి లఘు, మధ్య, మచిరములని రతి త్రివి
ధంబై స్త్రీపురుషులకాముకత్వమున మంద, మధ్యమ, చండవేగముల ననుస
రించి నవవిధంబు లగు. రతియం దుండెడి యుత్సాహమున నఖక్షతదంతక్షతతా
డనంబులచేత వీర్యమును స్తంభింపఁజేసి వేగములను మార్చుకొనుట కాలభావప్ర
మాణములనుబట్టి గుర్తెఱుంగవలయు. అందు స్త్రీపురుషలింగంబులు సమంబగు
త్రివిధంబులు సమరతంబు లగు. అన్యంబులు విపరీతములై యుచ్చనీచరతంబు
లనంబడు. జాతిప్రమాణకాలవేగాదు లెఱుంగక చేయు రతులు పశుచేష్టితంబు
లనంబడు. ఈయధమరతంబులు జుగుప్సామూలంబు లగుటచే నత్యుచ్చరతుల
నియు నతినీచరతులనియు సంక్షేపముగా వాడఁబడుచున్నవి. ఇంక వాత్యా

యనమతానుసారంబుగ షణ్ణవద్వాదశప్రమాణంబులు గల మృగాదిస్త్రీలక్షణము
లెఱింగించెద—

హరిణీజాతి స్త్రీలక్షణము

శ్లో.

సమమూర్థా కుంచితఘనకేశీ తుచ్ఛోదరీ నితంబాఢ్యా।
అల్పవివరనాసాపుటవికచరుచితపక్ష్మలాక్షీ చ॥


శ్లో.

అరుణాధరకరచరణా కోమలతరసరణభుజలతికా చ।
ఆయతకర్ణకపోలగ్రీవా౽ నతిమాంసలోరుజఘనా చ॥


శ్లో.

సమగుల్ఫా మదగజగతిరీర్ష్యాకులితోన్నతప్తనీ తన్వీ।
తరలమనాస్సుకుమారా లఘుకోపా సురతలంపటా లఘుభుక్॥


శ్లో.

కుసుమసురభిరతిసలిలా సరళాం గుళిరలసమధురోక్తిః।
నిమ్నషడంగుళగుహ్యా ఋజుతనురనురాగిణీ హరిణీ॥


సీ.

వట్రువతల నీలవక్రకేశంబులు
                 కలదు లేదను కౌను వలదవిఱుఁదు
ముకు గోళ్ళు లఘువులు వికచాబ్జములు కన్ను
                 లరుణము ల్కరచరణాధరములు
చేతులు మెత్తన చెవి ముక్కు మెడయును
                 నిడుదలు జఘనంబు తొడలు నునుపు
సమగుల్ఫములు గుబ్బచన్నులు గజయాన
                 వలఁతిరూపంబు చంచలపుమనసు


గీ.

కోప మల్పంబు కొంచెపుఁ గుడుపు రతికిఁ
బ్రేమ గల దబ్జగంధంబు కామజలము
నలసమధురోక్తి సరళంబు లంగుళములు
హరిణిగుహ్యంబులోఁతు షడంగుళములు.


తా.

గుండ్రమైనతలయు నల్లనై చుట్టుకొనియుండు వెంట్రుకలును చిన్న
ముక్కు గోళ్ళును సన్ననినడుమును గొప్పపిఱుఁదులును తామరపువ్వువంటి కన్ను
లును ఎఱ్ఱనైనచేతులు పాదములు అధరము, మెత్తనిచేతులు నిడుపగు చెవులు

చెక్కులు మెడయు, నునుపగు పిఱుదులు తొడలును సమములైన మడమలు బటు
వగు చనులును దంతిగమనమును మంచిరూపమును చంచలమైనమనస్సు కొంచెమగు
కోపము భోజనమును రతియందు ప్రీతియు తామరవాసనగల రతిజలమును తిన్నని
తేటమాటలును చక్కని వ్రేళ్ళును ఆరుఅంగుళముల లోతుగల భగమును యీలక్ష
ణములు గలస్త్రీ హరిణీజాతిస్త్రీగా తెలియందగినది.

అశ్వినిజాతి స్త్రీలక్షణము

శ్లో.

నిమ్నసమున్నతమూర్ధా స్థూలసరళసాంద్రశిరసిజప్రచయా।
ఉత్పలదళచలనయనా స్థూలాయతకర్ణయుగళవదనా॥


శ్లో.

స్థూలరదనరాజి రాయతదంతచ్ఛదపీనకఠినకుచకలశా।
సులలితమాంసలబాహుః తుచ్ఛోదరీ కమలమృదుపాణిః॥


శ్లో.

విస్తృతహృదయకపాటా గద్గదమధురోక్తిర్ష్యయోద్విగ్నా।
నిన్నుసువర్తులనాభిర్వక్త్రరుచిరజఘనసమలఘూరుశ్చ॥


శ్లో.

విపులకటిర్నతమధ్యా ఖేలాలసగమనరక్తసమచరణా।
చపలహృదయ కోమలతనుర్నిద్రాహారప్రియా ప్రియప్రవణా॥


శ్లో.

ప్రథమచరమధాత్వధికా పీతపలలగంధిసురతాంబుః।
క్షరణమదనరణగుణినీ పహతి చ వడవా నవాంగుళమ్ గుహ్యమ్॥


సీ.

పొడవగు తలకేశములు శిరంబును బెద్ద
                 యుత్పలనేత్రబాహువులు మృదువు
వలుదలు గళకర్ణవదనదంతంబులు
                 బిగిచన్ను లొక్కింత పెద్దపెదవి
గద్గదస్వర సన్నకౌను వెడఁదఱొమ్ము
                 కొలఁదిలోఁతగు నాభి కుపితచిత్త
సమమూరుయుగళంబు సమహస్తపదములు
                 వట్రువజఘనంబు వలఁతినడక


ఆ.

నీచ చపలహృదయ నిద్రాశనాధిక
పసపువన్నె మాంసరసముకంపు

ప్రీతిజలము శ్లేష్మవాతధాతువుమేను
హయకు లోఁతు తొమ్మిదంగుళములు.


తా.

గొప్ప తలవెండ్రుకలును, పెద్దతలయు, వలువలవంటినేత్రములు,
మృదువగు భుజములు, సుందరములైన మెడ చెవి ముఖము దంతములును,
కఠినమైన చనులును, కొంచెము పెద్దపెదవియు, డగ్గుత్తికయు, సన్ననినడుమును,
విశాలమైన ఱొమ్మును, కొంచమై లోతైన బొడ్డును, కోపహృదయమును, సమాన
మైన తొడలు కాళ్ళు పాదములును, గుండ్రమైన పిఱుందును, మంచినడకయు,
అల్పమై చపలమగు మనస్సును, అధికనిద్ర భోజనమును, సువర్ణకాంతిగల శరీ
రమును, మాంసమువాసనగల రతిజలమును, శ్లేష్మవాతధాతువుగల శరీరమును,
తొమ్మిది అంగుళములు లోతుగల భగమును గలస్త్రీని అశ్వినిజాతిస్త్రీగా
తెలియందగినది.

ద్వాదశహస్తినీలక్షణము

శ్లో.

పృథుభిరలికగండశ్రోత్రనాసాపుటైర్యా
                        కరచరణభుజోరుద్వంద్వకైర్హ్రస్వపీనైః।
దరవినమితఖర్వస్థూలయా గ్రీవయా చ
                        ప్రకటరదశిఖాభిః కున్తలైః స్థూలనీలైః॥


శ్లో.

అనవరతరతార్తిః కుంభిగంభీరకంఠ
                        స్వరశబలశరీరా స్ఫారలంబాధరోష్ఠీ।
విపులమదనతోయా కోపనా పింగళాక్షీ
                        కరిమదమదనాంబుః ప్రాయశో గూఢపాపా॥


శ్లో.

అతిబహుదరదోషా హస్తినీ దండసాధ్యా।
వహతి చ రవిసంఖ్యైరంగుళైర్గుహ్యదేశమ్॥


సీ.

చెక్కులు పిఱుఁదును ముక్కు పెదవిపెద్ద
                 ప్రియము నిద్దుర బహుపింగళాక్షి
కుఱుచయు వలమునై యొరఁగినమెడ చాల
                 నిడుపైన పండ్లును నొడలుదళము

సతతరిరంసాఢ్య సామజస్వర సీత
                 లాంగి లోలాత్మ బింబాధరోష్ఠి
కరిమదమదనాంబుకణజాలవారుణీ
                 మదలోల జుంజురుపొదలు కురులు


ఆ.

కఠినరతులఁ గాని కరుఁగది మదిలోనఁ
బొగడఁదగినమేను మిగులఁ గుఱుచ
మరునిగృహములోఁతుఁ బఱికించి చూచిన
హస్తినికిని ద్వాదశాంగుళములు.


తా.

గొప్పవైనదవడలు పిఱుందులు ముక్కును, పెద్దపెదవియు, నిద్రయం
దాసక్తియు, కపిలవర్ణముగల కండ్లును, కొంచమై మనోహరమై వంకరయైన
మెడయు, నిడుపగు పండ్లును, మందమైనశరీరమును, ఎప్పుడు రతిప్రియమును,
యేనుగుస్వరమును, శీతలదేహమును, చంచలహృదయమును, వ్రేలాడుచున్న
క్రిందిపెదవియు, యేనుగుమదము వాసనగల రతిజలమును, మద్యపానప్రియమును,
విరియబోసుకున్న వెంట్రుకలును, కఠినరతులకుగాని కరుగని మనస్సును, పొగడ
దగిన శరీరమును, పొట్టితనమును, పదిరెండుఅంగుళములలోతుగల భగమును గల
స్త్రీని ద్వాదశహస్తినిగా తెలియందగినది.

శశజాతిపురుషలక్షణము

శ్లో.

ఆత్రామస్ఫారనేత్రా లఘుసమదశనా వర్తులాస్యాః సువేషాః
మృద్వారక్తం వహస్తః కరమతిలలితం శ్లిష్టశాఖం సువాచః।
వృత్తవ్యాలోలలీలాః సుమృదుశిరజా నాతిదీర్ఘాం వహన్తో
గ్రీవాం జానూరుహస్తే జఘనచరణయోర్బిభ్రతః కార్శ్యముచ్చైః॥


శ్లో.

అల్పాహారాల్పదర్పా లఘుసురతరతాః శౌచభాజో ధనాఢ్యాః।
మానోదీర్ణాః శశాః స్యుః సురభిరతజలాః కాంతిమంతః సహర్షాః॥


చ.

కనుగవకెంపు వట్రువమొగంబు శరీరము సుందరంబు వ
ర్తనము నిరూఢి యల్పనమదంతము లింపగువాక్కు మానమం
డనుఁడు కటోరుజానుచరణంబులు హీనము లన్నమించుకౌ
ధనపతి స్వల్పభోగి శుచి తామరకంపు శశంపుజాతికిన్.

తా.

ఎఱ్ఱనికండ్లును, గుండ్రమైన మొగమును సుందరమైన దేహమును
స్థిరమైన వ్యాపారము కొంచెమై సమమైనపండ్లును ప్రియమైనవాక్కును మానమే
భూషణముగా గలవాడును చిన్నవియైన తొడలు చేతలు మోకాళ్ళు పాదములును
కొద్దిభోజనమును ధనము గలిగియుండుటయు కించిదనుభవమును పరిశుభ్రతయు
తామరవాసనగల రతిజలమును గలపురుషుని శశజాతిగా నెఱుంగునది.

వృషజాతిపురుషలక్షణము

శ్లో.

స్ఫారాభ్యున్నతమస్తకాః పృథుతరే వక్త్రాలికే బిభ్రతః
స్థూలగ్రీవ సుమాంసల శ్రుతిభృతః కూర్మోదరాః పీవరాః।
దీర్ఘప్రోన్నతకక్షలంబితభుజా ఆరక్తహస్తోదరా
రక్తాంతఃస్థిరపక్ష్మలాంబుజదళచ్ఛాయేక్షణాః సాత్వికాః॥


శ్లో.

ఖేలత్సింహపదక్రమా మృదుగిరః పీడాపహాస్త్యాగినో
నిద్రాసక్తిభృతస్త్రపావిరహితా దీప్తాగ్నయః శ్లేష్మలాః।
మధ్యాన్తే సుఖినో౽తిమజ్జనపుషః సక్షారమేదోధికాః
సర్వస్త్రీసుభగా నవాంగుళమితం లింగం వృషా బిభ్రతి॥


సీ.

అతివిశాలోన్నతమగు మస్తకము మెడ
                 వలము వక్త్రాళికంబులు ఘనములు
చెవులు చక్కన నిడుచేతులు కూర్మోద
                 రము కరాంగుళుల నఖములు కెంపు
నరుణాంతనేత్రము లలసాననము మంజు
                 భాషలు త్యాగి యాపదల కోర్చు
నాఁకలి పెద్ద నిద్రాసక్తుఁ డతిసత్త్వ
                 శాలి శ్లేష్మకుఁడు లజ్జారహితుఁడు


గీ.

ప్రౌఢవయసున సుఖి రుధిరంబుఁ గలుగు
మేను కారంబు వలపగు మానినులకు
వలవఁదగువాఁడు తొమ్మిదంగుళులదండ
మతఁడు వృషజాతిపురుషుఁ డత్యంతభోగి.

తా.

మిక్కిలి విశాలము పొడవునైన శిరస్సును మంచిమెడయు గొప్పముఖ
ము నొసలును చక్కనిచెవులు నిడుపైనచేతులు తాబేలుకడుపును ఎఱ్ఱనిఅర
చేతులు గోళ్ళును కనుగొనలయందు ఎఱుపును మందమైన నడకయు రుచికరము
లగు మాటలును దానగుణమును శ్రమకోర్చుటయు మిక్కిలి ఆకలినిద్రలును అధిక
బలమును శ్లేష్మదేహమును సిగ్గులేమిని యవ్వనమందు సుఖియు కారపువాసనగల
శరీరమును స్త్రీలు కోరదగినవాడును మిక్కిలిభోగియు తొమ్మిదంగుళముల
దండముగల పురుషుడు వృషభజాతిగా దెలియందగినది.

తురగజాతిపురుషలక్షణము

శ్లో.

వక్త్రశ్రోత్రశిరోధరాధరరదైరత్యంతదీర్ఘైః కృశై
ర్యేస్యుః పీవరకక్షమాంసలభుజాః స్థూలర్జుసాంద్రైః కచైః।
ప్రౌఢేర్ష్యాః కుటిలాంగజానుసునఖా దీర్ఘాంగుళిశ్రేణయో
దీర్ఘస్ఫారవిలోలలోచనభృతః పౌఢాశ్చ నిద్రాలనసాః॥


శ్లో.

గంభీరాం మధురాం గిరం ద్రుతిగతిం పీనోరుకౌ బిభ్రతో
దీప్తాగ్నిప్రమదారతాః శుచిగిరో రేతోస్థిధాతూజ్జ్వలాః।
తృష్ణార్తా నవనీతశీతబహలక్షారస్మరాంబుద్రవా
లింగైర్ద్వాదశకాంగుళైర్నిగదితా అశ్వాః సమోరఃస్థలాః॥


సీ.

శిరమును బెదవియుఁ జెవులును మొగమును
                 గడుపును బండ్లు దీర్ఘములు సన్న
ములు నాభకరకక్షములు సమభుజములు
                 పొందైన కచభరంబును గలాఁడు
కోపి వక్రములైన చూపులుఁ బిక్కలు
                 నిడువాలుఁగన్నులు నిడుపుగోళ్ళు
గంభీరమధురవాక్యములుఁ దిన్నని నడ
                 లాఁకలి పెద్ద నిద్రాలసుండు


ఆ.

ప్రౌఢ సత్యవాది బహుభోగనిరతుండు
మెఱపుమేను మిగులఁ దృష్ణ గలదు
చలువ గలుగు నొడలుఁ జపలచిత్తుఁడు ద్వాద
శాంగుళధ్వజుండు హయనరుండు.

తా.

నిడుపగు తల పెదవి చెవులు ముఖము కడుపు పండ్లునూ, మెడ
చేతులు చంకలు సన్నమును, సమానములగు భుజములును, ఒప్పగువెంట్రుకలును,
కోపగుణమును, వంకరచూపులు పిక్కలును, సోగకనులును, నిడుపైనగోళ్ళును,
గంభీరమై రుచికరములగుమాటలును, మంచినడకయు, మిక్కిలి ఆకలి నిద్ర భోజ
నమును, ప్రౌఢత్వమును, సత్యవచనాసక్తుడును, భోగములయం దాసక్తియు,
కాంతిగలశరీరమును, అత్యాశయు, శీతలశరీరమును, చంచలహృదయమును, పది
రెండు అంగుళముల ప్రమాణముగల దండమును గలుగు పురుషుడు తురగజాతిగా
నెఱుంగునది.


శ్లో.

ఉక్తోపస్థప్రమాణస్య వ్యభిచారేపి లక్షయేత్।
శశమృగ్యాదిజాతిత్వముత్తమాధమభేదతః॥


శ్లో.

ఉక్తోచ్యమానసక్తవ్యలక్షణాని చ యాన్యతః।
తత్సంకరేపి బాహుళ్యాల్లక్షం నిర్ధారయేద్బుధః॥


వ.

పైనఁ జెప్పఁబడిన భగదండప్రమాణముల ననుసరించి శశ వృష తురగజాతులను
నుత్తమాధమమధ్యమాధమములని వాడఁబడుచున్నవి. స్త్రీజాతులును నదేవిధంబని
తెలియందగినది. వీనివలన సంకరంబులు కలిగినఁ బరికించి ప్రధానలక్షణం బొక్క
టిఁబట్టి జాతి నిశ్చయించునది. ఇంక వయోలక్షణములు వివరించెద.

ఇతి శ్రీకొక్కోకకృతే రతిరహస్యే
సురతభేదేజాత్యధికారో నామ
తృతీయః పరిచ్ఛేదః

సామాన్యధర్మాధికారః

చతుర్ధః పరిచ్ఛేదః

వయోస్వభావలక్షణము

శ్లో.

బాలా స్యాత్షోడశాబ్దాత్తదుపరి తరుణీ త్రింశతిర్యావర్దూర్థ్వం
ప్రౌఢా స్యాత్పంచపంచాశదవధిపరతో వృద్ధతామేతి నారీ।
దీర్ఘా కృష్ణా చ తన్వీ చిరవిరహవతీ నిమ్న కక్షా శ్లథాః స్యుః
స్థూలా గౌరీ చ ఖర్వా సతతరతిపరా వ్యూఢకక్షా ఘనాః స్యుః॥


శ్లో.

సంకీర్ణచిహ్నేన చ మధ్యమా స్యాదయం చ తాసాం విదితఃస్వభావః।
బాలా ఘనా బాహ్యరతోపచర్యా ప్రౌఢా శ్లథాభ్యస్తరమోహనేచ్ఛుః॥


శ్లే.

ఉక్తా గుణపతాకాయామనస్థాను క్రియా చ యా
తామపి న్యాయసంవిత్తిసిద్ధత్వాదాద్రియామహే॥


క.

పదియారు బాలకును ము
ప్పదియగు నేండ్లెవ్వనికిని బ్రౌఢకునైదున్
బదియేడులు నటుమీఁదటఁ
దుదియేడులు లోలకయ్యెఁ దోడ్తోవరుసన్.


తా.

ఒకటిమొదలు పదియారువత్సరములవరకు బాలయనియు, పదియారు
మొదలు ముప్పదివత్సరములవరకు యౌవనియనియు, ముప్పదిమొదలు ఏబదివత్స
రములవరకు ప్రౌఢయనియు, నేబదిపైవత్సరముల యీడుగలవనితను లోలయ
నియు తెలియందగినది.


సీ.

నిడుదసన్నపునల్లయొడలును సంయోగ
                 రహితయు శ్లథయను రమణికయ్యె
వలము గుజ్జును బాండువర్ణంబు సంతత
                 రతమును ఘనయను నతివకొనరు

దళసరి నాటపాఁటలయందునయ రతి
                 పాటవంబునఁ బ్రౌఢభామ దనరు
సంతతరతిఘనకాంత బాలికయును
                 భామయుఁ దద్భోగభాగ్యకరము


గీ.

ప్రౌఢశ్లథయును బ్రీతులభ్యంతరతికి
బాల ఘనయును బ్రీతులు బాహ్యరతికి
నీవిధంబులఁ గలిసి రమించు తెఱఁగు
గుణపతాకాదులందుఁ బేర్కొనెను గనుఁడు.


తా.

నిడివియై సన్నమై నల్లనైనశరీరమును సురతరాహిత్యమును గలది శ్లథ
యనియు, బలుపును పొట్టియు పాండువర్ణమును నిరంతరరతిసుఖమును గలది ఘన
యనియు, దళసరియైనశరీరమును నాటపాటలయందు సమర్థతయు రతిచాతుర్య
మును గలది ప్రౌఢ యనియు, ఎల్లప్పుడు రతిసుఖమును శుభకరమును గలది బాల య
నియు దెలియందగినది. వీరిలో ప్రౌఢయు శ్లథయు అంతద్రతులయం దిచ్చగల
వారినిగాను, బాలయు ఘనయు బాహ్యరతులయం దిచ్చగలవారినిగాను, తెలిసికొని
రమింపవలెనని గుణపతాకాదులయందు దెల్పెను గాన తెలుసుకొనవలయును.

బాలలక్షణము

ఉ.

నేరనినేర్పు కౌఁగిలికి నిండనిచన్నులు సిగ్గుబాటున
న్జేరకచేరు దేహమును జిత్తడియైన మనోజహర్మ్యము
న్బీరములేనిపొందికలు ప్రీతివిలాసపుముద్దుమాటలున్
గోరకకోరు చుంబనము కొంచెపుఁజూపులు ముగ్ధభామకున్.


తా.

తెలియని చాతుర్యమును, ఆలింగనమునకు దగియుండని కుచములును
లజ్జచే పొందియు పొందకయుండు శరీరమును, తేమగల యోనియు, బిగిలేని కూట
ములును, ప్రేమతో గూడిన శృంగారపుపలుకులును, కోరియు కోరని ముద్దులును,
కొంచెమగు జూపులును గలస్త్రీ బాలయని తెలియదగినది.

యౌవనస్త్రీలక్షణము

చ.

నెఱిగలగుబ్బచన్నులును నేర్పులు గుల్కెడి వాలుచూపులున్
దరిఁగొనుమారుకేళియును దట్టపుగర్వము భూషణంబులు

న్వెరవకచేయు సేతలును వీడనికౌఁగిలి మోహకోపము
న్దుఱఁగలిఁజేయు లేఁజెమట తోరపుమాటలు యౌవనాంగికిన్.


తా.

బటువగు కుచములును, శృంగారంబులగు క్రేగంటిచూపులును, యొర
పగు రతియు, అతిగర్వమును, అలంకారమును, భయములేక చేయుకార్యములును,
దట్టమగు కౌగిలియు, వలపుగలకోపము ప్రకాశింపఁజేయుటయు, చిరుచెమట
యు లాలనపుపలుకులును గలస్త్రీని యౌవనస్త్రీగా దెలియదగినది.

ప్రౌఢస్త్రీలక్షణము

చ.

కులుకుమెఱుంగుచూపులును గొండెపుసేఁతలు తియ్యమాటలు
న్జిలిబిలిపాటలు న్గలికిచిత్తము మన్మథబంధభేదము
న్దలకొనుచుంబనంబులును దాటవపేటవభూషణవ్రజం
బలుగలుగల్గి పైకొనుచు నాసల దేల్తురు ప్రౌఢభామినుల్.


తా.

శృంగారమైనకాంతిగలచూపులును, కొండెములు చెప్పుటయు, మధుర
వాక్యములును, ముద్దుపాటలును, చంచలహృదయమును, బంధభేదములతో గూడిన
చుంబనాదులును, కంఠహారభూషణచయంబు జిక్కువడ అలుకతో పైకొని
యాసతో రమించెడి స్త్రీ ప్రౌఢయని తెలియందగినది.

లోలస్త్రీలక్షణము

చ.

సురతపుఁజొక్కులు న్వెనుక సుద్దులు సారెకు వీడెమందుట
ల్మరుపురివాడువారుటయు మందవిహారము చుంబనంబులు
న్విరివిడియైనమేను కళవీడనికూటమి చాలనవ్వులు
న్దెరలనినిద్రమోము కడుదిట్టతనంబును లోలభామకున్.


తా.

రతిచొక్కులును, గతించినమాటలును, మాటిమాటికి తాంబూలము
నమలుటయు, యోని వాడుబారుటయు, మెల్లగా రతి యొనర్చుటయు, ముద్దులును,
డస్సినశరీరమును, కళజారనిరతియు, మిక్కిలినగవును, నిద్రతో గూడిన మొగ
మును, మిక్కిలిధైర్యమును గల స్త్రీని లోలయని తెలియందగినది.

వయోబలమాసలక్షణము

క.

హేమంతంబున యౌవన
కామిని, వర్షావసంతకాలములందున్
గామించుఁబ్రౌఢ, బాలకు
నేమాసంబైన బలము నిచ్చును వరుసన్.


తా.

యౌవనస్త్రీ మార్గశిర పుష్యమాసములందును, ప్రౌఢస్త్రీ శ్రావణ భాద్రపద చైత్ర వైశాఖమాసములందును, బాలస్త్రీ అన్నిమాసములయందును,
వయోబలమును రతిబలమును చేష్టాసత్వములును గలిగియుండును. లోలస్త్రీ రతికి
అనర్హంబును రజోహీనంబును గాన చెప్పంబడదు.

బాలాద్యుపచారలక్షణము

శ్లో.

బాలా తాంబూలమాలాఫలరససురసాహారసమ్మానహార్యా,
ముగ్ధా౽లంకారహారప్రముకవితరణైః రజ్యతే, యోవనస్థా।
సద్బావారబ్ధగాఢోద్భటరతసుఖితా, మధ్యమా రాగలుబ్ధా,
వృద్ధా౽౽లాపైః ప్రహృష్టా భవతి గతనయా గౌరవేణాతిదూరం॥


చ.

ఫలరసవీటికాకుసుమభక్ష్యవిశేషములందు బాలికన్
గలితవినూత్నరత్నమయకాంచనహారములందు యౌవనిన్
లలితగుణానుకూలరతిలక్షణలీలలఁ బ్రౌఢ నిష్టభా
షల నలయించి లోల నెఱజాణలు గూడుదు రింపు వుట్టగన్.


తా.

పుష్పఫలరసతాంబూలదులచే బాలను, కనకరత్నమయభూషణ
వస్త్రాలంకారములచే యౌవనిని, మనోవిలాసానుకూలరతులచే ప్రౌఢను, ప్రియం
బగు పల్కులచే లోలను, సంతోషపెట్టి జాణలగు పురుషులు రమింతురు.


వ.

మఱియు శ్లేష్మాదిధాతువుల వర్తిల్లు స్త్రీలలక్షణంబులు వర్ణించెద.

శ్లేష్మ పిత్త వాతప్రకృతుల లక్షణములు

శ్లో.

గూఢాస్థిగ్రంథిగుల్ఫా మృదుమధురవచాః శ్లేష్మలా పద్మమృద్వీ
స్యక్తాస్థిగ్రన్థిగుల్ఫా యువతిరశిశిరైరంగకైః పిత్తలా స్యాత్।

శ్లో.

రూక్షాశీతోష్ణగాత్రీ వదతి బహుతరం వాతలా శ్లేష్మలాపి
ప్యాదుష్ణా నవ్యసూతా శిశిరరతనుర్గర్భిణీ పిత్తలాపి॥


శ్లో.

అచిరలఘుచిరోచ్చైః కాలభావావసానాః
                        ప్రమదదహనగాఢద్వారగుహ్యాత్క్రమేణ।
సతతశిశిరకాలోపేతహేమంతవర్షా
                        మధుషు నిధువనేచ్ఛా సంప్రయోగే ప్రదిష్టా॥


శ్లో.

యత్ప్రకృతీనాం లక్షణమభిహితమధికంచ గుణపతాకాయాం।
తచ్చాప్యనుభవసిద్ధం స్ఫుటతరమభిధీయతే కిమపి॥


శ్లో.

స్నిగ్ధనఖనయనదశనా నిరనుశయా మానినీ స్థిరస్నేహా।
సుస్పర్శశిశిరమాంసలవరాంగవివరాంగనా శ్యామా॥


శ్లో.

భవతి విలాసప్రకృతిః పిత్తప్రకృతిస్తు మధ్యమా జ్ఞేయా।
సా భవతి గౌరవర్ణా పీనకుచా రక్తనఖనయనా॥


శ్లో.

కటుగంధిప్రస్వేదా క్షణం చ కుపితా క్షణం ప్రసన్నా చ।
శిశిరరతా౽౽తపవిముఖీసోష్మా ప్రశిథిలవరాంగీ చ॥


శ్లో.

మేధావినీ సుకుశలా వహతి రతే నిశ్చితం మృదుతామ్।
పవనప్రకృతిః పరుషా భ్రమణరతా స్యాద్బహుప్రలాపా చ॥


శ్లో.

దరదగ్ధద్రుమధూసరవర్ణీ బహుభోజనా చ కఠినాంగీ।
స్ఫుటితాగ్రరూక్షకేశీ కఠినతరా శ్యామనఖనయనా॥


శ్లో.

గోజిహ్వాభస్పర్శకఠోరవరాంగా౽ధమా నారీ।
సంకీర్ణలక్షణేన చ సంకీర్ణప్రకృతిరేవ విజ్ఞేయా॥


ఉ.

కన్నులు గోళ్ళు పండ్లు నతికాంతులు మానవతీలలామ య
భ్యున్నతసఖ్య కోపము బ్రియోక్తులఁ దేరక తానెతేరి పై
మన్ననఁజేయు శైత్యమును మాంసలము న్స్మరమందిరంబు మై
వన్నియ శ్యామ ముత్తమము వైపగు శ్లేష్మశరీరి కిమ్మహిన్.


తా.

ప్రకాశములగు కన్నులు గోళ్ళు పండ్లును, అభిమానమును, మిక్కిలి
స్నేహమును, ప్రియునిమాటలచేత కోపము విడువక తనకై తానే విడిచిపెట్టి
కోపములేనిదానివలె తిరిగి విటుని గొప్పచేయుటయు, చల్లనై బలిసియున్న

యోనియు, శ్యామవర్ణముగల శరీరమును గణుతియు గలస్త్రీని శ్లేష్మప్రకృతిగా
నెఱుంగదగును.


సీ.

గౌరవర్ణంబును గఠినస్తనంబులు
                 గోళ్ళును గనుగొలుకులును గెంపు
నుష్ణగుహ్యస్వేద మొగిమేనువాసన
                 కోపప్రసాదము ల్కొంతకొంత
యెండకుఁగాదు మైయెంతయు మెత్తన
                 శిశిరమన్మథకేళిఁ జిత్తగించు
నభిమానవతి మధురాలాపరాజస
                 మధికంబు పక్వబింబాధరోష్ఠి


గీ.

మతియు నేర్పును గలుగు సీమంతినులకుఁ
బ్రియము మృదువర్తనలయందుఁ బ్రేమగలదు
పైత్యదేహంబుఁ గలిగిన పడఁతిజాడ
మధ్యమయటండ్రు నందీశుమతమునందు.


తా.

తెల్లనికాంతియు, గట్టిచన్నులును, ఎఱ్ఱనిగోళ్ళు కనుగొలకులును,
వెచ్చని మదజలమును, వాసనగలశరీరమును, కొంచెము కోపమును, కొంచెము
దయయును, మృదువయి యెండకోర్చనిశరీరమును, శిశిరఋతువునందు రతి గోరు
టయు, అభిమానమును, తియ్యనిమాటలును, మిక్కిలిరాజసగుణమును, దొండ
పండువంటి క్రిందిపెదవియు, బుద్ధిచాతుర్యమును, స్త్రీలచే ప్రేమింపబడునదియు,
తిన్ననినడవడికయుగల స్త్రీ పైత్యదేహి యని నందికేశ్వరమతమునందు బేర్కొనబ
డెను.


ఉ.

నల్లనిచాయ క్రూరవచనంబులుఁ ద్రిమ్మటకత్తె భుక్తియున్
మొల్లము కర్కశాంగి కుచము ల్పలువంకలు కేళివాక్యము
ల్కొల్లలు గోవుజిహ్వ సరిగుల్కెడుగుహ్యము వాడికన్నులున్
గోళ్ళునుగెంపు వాతమయకోమలికి న్వనితాధమాత్మకున్.


తా.

నల్లనికాంతియు, కఠినమైన మాటలును, త్రిప్పటయును, అధికభోజ
నమును, కఠినమైన అంగముగలదియు ఎక్కువవంపుగల చన్నులును, ఎక్కువ రతి

ప్రీతిమాటలును, ఆవునాలికవలె యుండుభగమును, క్రూరదృష్టియు, ఎఱ్ఱనిగోళ్ళు
నుగలస్త్రీ వాతదేహి యని తెలియందగినది.


క.

సంకీర్ణలక్షణంబులు
సంకీర్ణప్రకృతిఁ దెలసి జాణలు మఱియున్
పంకజనేత్రలఁ గవయుదు
రింకిట సత్త్వములజాడ లే నెఱిగింతున్.


తా.

జాణలగు విటులు సంకరములగు లక్షణముల స్వభావములను యె
ఱింగి అనుభవింతురు. ఇఁక పదివిధంబులగు సత్త్వములజాడ లెరింగించెద.

దేవ నర నాగ యక్షసత్త్వముల లక్షణములు

శ్లో.

సురభిశుచిశరీరా సుప్రసన్నాననా చ
                        ప్రచురధనజనాఢ్యా భామినీ దేవసత్త్వా।
వ్యపగతగురులజ్జోద్యానపానార్ణవాద్రౌ
                        స్పృహయతి రతిసిద్ధ్యై రోషణా యక్షసత్త్వా॥


శ్లో.

భవతి సరళచిత్తా దక్షిణాతిథ్యరక్తా
                        స్ఫుటమిహ నరసత్త్వా ఖిద్యతే నోపవాసైః।
శ్వసితి బహుతరం యా జృంభతే భ్రాన్తిశీలా
                        స్వసితి సతతమేవ వ్యాకులా నాగసత్త్వా॥


సుగంధి.

సురభిశుచిశరీరము న్విశుద్ధవక్త్రకాంతియున్
గురుజనైకమైత్రి గల్గు కొమ్మ దేవసత్త్వయౌ
సరళహృదయము న్వ్రతోపచారమానసంబులున్
బరఁగు మనుజసత్త్వహర్షభావమానసంబులన్.


తా.

పరిమళమును పరిశుద్ధమైనశరీరమును, నిర్మలమైన కాంతిగల ముఖ
మును, అత్తమామలయందు ప్రీతిగలస్త్రీ దేవసత్త్వయనియు; మంచిమనస్సును

వ్రతశుశ్రూషలయందు ప్రీతిన్నీ, సంతోషముతోగూడిన మనస్సుగలస్త్రీ
మనుజసత్త్వయని నెఱుంగుడు.


ధృవకోకిల.

వెడఁదయూర్పులు నావలింతలుఁ బిమ్మటంబడు చిత్తమున్
గడిఁదినిద్రయు భ్రాంతియున్గల కాంతయు స్ఫణిసత్త్వ యె
ప్పుడును గోపము పానమున్ రతి బుద్ధిహీనవివేకమున్
జెడినలజ్జయు యక్షసత్త్వకు సిద్ధముల్ పరికింపఁగన్.


తా.

దీర్ఘనిశ్వాసములు, ఆవులింతలును, తొందరతో గూడియున్న హృద
యమును, అతినిద్రయు, మోహమునుగలస్త్రీ నాగసత్త్వయనియు, ఎప్పుడును కోప
స్వభావమును, మద్యపానమును, రతిప్రీతియు, అల్పమగుబుద్ధియు, సిగ్గులేమియు
గలస్త్రీ యక్షసత్త్వయనియు తెలియందగినది.

గంధర్వసత్త్వలక్షణము

శ్లో.

అపేతరోషోజ్జ్వలదీప్తవేషాం స్రగ్గన్ధధూపాదిషు బద్ధరాగామ్।
సంగీతలీలాకుశలాం కళాజ్ఞాం గన్ధర్వసత్త్వాం యువతీం వదన్తి॥


మత్తకోకిల.

గర్వము న్గలహంబు నొల్లదు కాంతిగల్గిన దేహము
న్సర్వవిద్యలు నృత్యవాద్యవిశారదత్వము సౌరభా
ఖర్వధూపములందుఁ బ్రీతియు గల్గియొప్పెడుకాంత గం
ధర్వసత్త్వ యగు న్విటుల్ రతిసత్త్వము న్బరికించినన్.


తా.

కోపమును తగవును లేకయుండుటయు, సౌందర్యమైన దేహమును
సకలవిద్యలును నాట్యవాద్యములయందు అనురక్తియు, సువాసనగల ధూపముల
యందాసక్తియు గలస్త్రీని గంధర్వసత్త్వయని రతిభావము దెలిసిన విటులు
పల్కుదురు.

పిశాచ వానర వాయస గార్దభ కూర్మసత్త్వముల లక్షణములు

శ్లో.

మానోజ్భితా౽తిబహుభుక్ప్రకటోష్ణగాత్రీ
                        భుంక్తే చ మద్యవలలాది పిశాచసత్త్వా।
దృష్టిం ముహుర్భ్రమయతి ప్రబలాశనార్తి
                        రుద్వేగమేతి విపులం కిల కాకసత్త్వా॥


శ్లో.

ఉద్భ్రాన్తదృక్కరజదన్తరణప్రసక్తా
                        స్సాద్వానరప్రకృతిరస్థిరచిత్తవృత్తిః।
యా దృష్టవిప్రియవచోరచనా చ నారీ
                        రక్తా విటప్రహరణే ఖరసాత్త్వికా సా॥


శ్లో.

జాతిరవస్థా ప్రకృతిః సత్త్వం యాన్యుక్లాని జ్ఞేయమమీషు।
ప్రాధాన్యం ప్రకృతేః కించైనాం సంక్షేపేణ నిబోధ గిరం సః॥


మానిని.

మానవిహీనము నుష్ణశరీరము మద్యపలానుభవప్రియమున్
మానినికొప్పు పిశాచసత్త్వకు మానుగవాయససత్త్వకుఁ దో
డైన పలాశయము న్జలదృష్టియు నాత్మభవంబగు చంచలతన్
వానరసత్త్వకు దంతనఖక్షతవాదనదృక్చలనాదికమున్.


తా.

అభిమానములేమియు, ఉష్ణమగుదేహమును, మద్యమాంసములయందు
ప్రీతియు గలస్త్రీ పిశాచసత్త్వయనియు; మాంసభక్షణమును, చంచలపుచూపును,
చపలహృదయమును గలస్త్రీ వాయససత్త్వయనియు; దంతక్షతములును, నఖక్షతము
లును, వాదనయు, చపలదృష్టియు గలస్త్రీ వానరసత్త్వయనియు తెలియందగినది.


కవిరాజ.

విటు గదియించుట విప్రియభాషల వేగమ గార్దభసత్త్వకు నౌ
కటికచయుగ్మము దీర్ఘశరీరము క్రౌర్యపుదృష్టి యుదగ్రపులం
పటమును గూర్మపుసత్త్వకుఁ జొప్పడు ప్రాజ్ఞు లెఱుంగుఁడుజాతియుఁ బ
ర్యటనము సత్త్వము ప్రాకృతభావము యార్యమతం బిది చిత్తములన్.

తా.

అప్రియవాక్యములచేత మగనిని లొంగదీయుటయు, త్వరితమును
గలస్త్రీని గార్దభసత్త్వయనియు; గొప్పవైన పిఱుదులు కుచములు శరీరమును, క్రూ
రపుచూపును, విషయాసక్తియు గలస్త్రీ కూర్మసత్త్వయనియు నెఱింగి ప్రాజ్ఞులగు
వారు తమచిత్తములయందు యార్యమతంబగు నీసత్త్వములను జాతులను నెఱింగి
రమించటు శ్రేయస్కరమని వాత్యాయనుని నిర్ణయము.

సంసారమునకుఁ దగిన స్త్రీలు

శ్లో.

శ్యామా కఫప్రకృతికా వడవా మృగీవా
                        గన్ధర్వయక్షనరనిర్జరసాత్త్వికా వా।
బాలా౽ ధవాభినవయౌవనభూషితాంగీ
                        సా భామినీ భవభుజాం పరమం రహస్యమ్॥


శ్లో.

జాతౌ చసత్త్వే వయసి ప్రమాణే ప్రధానమాహుః ప్రకృతింవధూనామ్।
తథైన తాసాముపచారమూచుః కర్ణీసుతాద్యాః కృతినో విధేయమ్॥


సీ.

చామనచాయల జలరుహాక్షులు నవాం
                 గుళషడంగుళగుహ్యబిలము లమరు
తరుణులు యక్షనిర్జరనరగంధర్వ
                 సత్త్వలు బాలు జవ్వనియును
శ్లేష్మకప్రకృతులు చెలువుగఁ గలిగిన
                 యంగన లత్యుత్తమాంగన లిల
సంసారసుఖసారసారరసజ్ఞులు
                 పాటింతు రెపుడు గోప్యంబుగాను


గీ.

జాతిసత్త్వప్రమాణలక్షణమురీతి
వయసుఁ బ్రకృతియుఁ బరికించి వారివారి
గుణము కర్ణీసుతాదుల గణన లెఱిఁగి
పొందనేర్చిన సౌఖ్యంబు పొదలకున్నె.


తా.

తొమ్మిదంగుళములభగము గలిగి చామనచాయగల తురగజాతిస్త్రీయై
నను, ఆరుఅంగుళములభగముగల హరిణీజాతిస్త్రీయైనను, యక్ష దేవ మనుజ గం
ధర్వ సత్త్వస్త్రీలలో బాలగాని యౌవనిగాని యైనను, శ్లేష్మప్రకృతిగల స్త్రీలను,

ఉత్తమస్త్రీలని సంసారసౌఖ్యమును గోరు పురుషులు వరింతురు. కావున కర్ణీసు
తాదులచే చెప్పబడిన జాతి సత్త్వప్రమాణ వయస్సు ప్రకృతి మొదలైన లక్ష
ణంబుల దెలిసి అనుభవించినయెడల సౌఖ్యము కలుగును.

స్త్రీల నుపేక్షించుటవలనఁ గలుగు దోషములు

శ్లో.

స్వాతన్త్ర్యం పితృమందిరె నివసతిర్యాత్రోత్సవే సంగతి
ర్గోష్ఠీ పూరుషసన్నిధవపనియమో వాసో విదేశే తథా।
సంసర్గః సహ పుంశ్చలీభీరసకృద్వృత్తేర్నిజాయా క్షతిః
పత్యుర్వార్ధకమీర్షితం ప్రవసనం నాశస్య హేతుః స్త్రియాః॥


శ్లో.

దారిద్ర్యాదసహిష్ణుతామలినకార్పణ్యకాలా౽జ్ఞతా
పారుష్యాదతినిష్ఠురాత్ప్రణయినో భూషానిషేధాదపి।
మిథ్యాదోషవిశంకనాదతిశయోద్యోగాద్వియోగాత్తథా
కార్కశ్యాద్వపుషో వ్రజన్తి నియతం వైరాగ్యముచ్చైః స్త్రియః॥


సీ.

అత్తమామలుఁ దల్లి యన్నలు మఱుఁదులు
                 గలుగ కింటికిఁ దానె కర్తయైనఁ
బుట్టినింటనె యున్నఁ బొరుగిల్లుఁ ద్రొక్కిన
                 తీర్థోత్సవములకుఁ దిరుగుచున్న
పరదేశమున నున్నఁ బరపురుషులగోష్ఠి
                 ప్రియముఁ బుట్టిన నాజ్ఞ బెట్టకున్న
జారకాంతలతోడ సంగతిఁ జేసిన
                 కులధర్మ మెంతయుఁ గుటిలమైన


గీ.

మగఁడు ముసలైన మిక్కిలి మలినుఁ డైన
దూర మరిగిన దీనుఁడై చేరకున్న
కఠినరతుఁడైన నేప్రొద్దుఁ గలహియైన
సతులు పరదార లగుదు రేజాతియందు.


తా.

అత్తమామ తల్లి అన్నలు మఱదులు లేక యింటికి తానే యజమాను
రాలైనను, పుట్టినింటనే యున్నను, పొరుగింటికి పోవుచున్నను, తీర్థయాత్రలకు
తిరుగుచున్నను, యితరచోటనున్న పరపురుషునివిషయము పలుకనిచ్చగించినను,

ఆజ్ఞ పెట్టువారు లేకున్నను, కులటలతో సహవాసము చేసినను, తనకులాచారము
విడిచినను, మగడు ముసలివాడైనను లేక రూపవంతుడు కానప్పటికిని లే దూర
మందున్నను లేక ధైర్యములేనివాడై కలియకయున్నను లేక గాఢరతి చేయు
వాడైనను లేక నిరతము జగడమాడు గుణముగలవాడైనను సకలజాతులయందును
స్త్రీ వ్యభిచరించును.


క.

శివ మాడినఁ గలు ద్రావిన
ధవునకు దారిద్ర్యమైన దర్పకుకేళిన్
సవరింపకున్న కామిని
వివరింపఁగఁ జెడదె యెన్నవిధముల నైనన్.


తా.

శివమాడినను, కల్లు త్రాగినను, మగడు దరిద్రుడైనను, భర్త రతి చేయక
యున్నప్పటికిని స్త్రీ చెడుట కెన్నిరీతులు గలవో అన్నివిధములను చెడును.

విరక్తిస్త్రీ లక్షణము

శ్లో.

నైనం పశ్యతి నాస్య నన్దతి సుహృన్మిత్రో ప్రతీపస్థితి
ర్యోగే పీదతి హృష్యతీవ విరహే మార్ష్యాననం చుంబితా।
నాస్మాదిచ్ఛతి మానమీర్ష్యతి వచః ప్రత్యుత్తరం నార్పయే
త్స్పర్శాదుద్విజతే స్వపిత్యుపగతా శయ్యాం విరక్తా సతీ॥


ఉ.

చూడదు నాథు నెచ్చెలిని జూపొనరింపదు పిల్చిరేని మా
టాడదు పాయమందుఁ దను నంటకపాసిన సంతసిల్లుఁ దాఁ
గూడినఁ గంటకించు ననుకూలము లేక విరక్తికాంత మో
మోడదు చుంబనంబునకు నోర్వదు నిద్దురవోవుఁ బాన్పునన్.


తా.

మగనిని చూడకయుండుటయు, స్నేహితురాలిని చూడకపోవు
టయు, పిలిచిన పలుకకపోవుటయు, వయస్సునందు తన్నంటకయున్నచో సంతో
షించుటయు, రతియం దనుకూలతలేక కోపగించుటయు, మాట్లాడకయుండుటయు
ముద్దుబెట్టుకొనిన సహించకపోవుటయు, పాన్పునందు నిద్రించుటయు గలస్త్రీని
విరక్తికాంతగా దెలియందగినది.


శ్లో.

ఉక్తం గుణపతకాయామనురాంగేంగితం చ యత్।
అజాతజాతభోగానాం తత్సాధారణముచ్యతే॥

వ.

ఇఁక చెప్పంబడు వలపులక్షణములు ప్రియుని సంభోగ మనుభవించినవారల
యందును, అనుభవింపనివారలయందును, గాననగునని గుణపతాకమను శాస్త్ర
మునందు చెప్పంబడియుండెను.

స్త్రీలవలపు నెఱింగెడి లక్షణము

శ్లో.

ఓష్ఠాగ్రం స్ఫురతక్షణే విచలతః కూపోదరే మత్స్యవ
ద్ధమ్మిల్లః కుసుమాంచితో విగలితః ప్రాప్నోతి బన్ధం పునః।
ప్రచ్ఛిన్నౌ వ్రజతః స్తనౌ ప్రకటతాం శ్రోణీతటం దృశ్యతే
నీవీ చ స్ఖలతి స్థితాపి సుదృఢం కామేంగితం యోషితామ్॥


చ.

పెదవిఁ గదల్చుఁ గన్నుగవ పింపిసలారఁ బిరుందుఁ జూచు ప
య్యెద విదళించుఁ జన్నులు బయల్పడఁ గొప్పుననున్న క్రొవ్విరు
ల్చెదరినఁ బల్మరుందురుముఁ జెక్కునఁ జెమ్మట నించుఁ జీరెక
ట్టదరినఁ జక్కఁగట్టుఁ జపలాక్షి మనోహరమూర్తి జూచినన్.


తా.

ఇష్టమగువిటుని జూచినస్త్రీ పెదవి గదలించును, ఉత్సాహముతో
పిఱుందులు చూచును, చన్నులు కనుపించునటుల పైటచెంగు విదళించును, కొప్పున
నున్న పూవులు చెదరినట్లు మాటిమాటికి ముడుచుకొనును, దవడలయందు చెమట
పట్టును, చీరెకట్టు మాటిమాటికి బిగించును, ఇవియన్నియు తాను వలచినపురుషుని
యెదుటనే స్త్రీ కనపరుచునని దెలియందగినది.


శ్లో.

సౌభాగ్యరూపపరిహాసగుణానురాగ
                        సంకీర్త నేన దయితస్య చ లబ్థసౌఖ్యమ్।
సంబన్ధిమిత్రముఖదర్శనదత్తదూర
                        తోషం పరోక్షమపి కామగుణేంగితం స్యాత్॥


చ.

పెనిమిటి భాగ్యరూపగుణబృందము లేనరులైన ముందటన్
వినుతులఁ జేయ సౌఖ్య మొదవించును నాథునియొద్దిమిత్రులన్
గనుఁగొని సంతసిల్లుఁ గలకంఠి గుణంబుల జూడఁబట్టి యొ
య్యనఁ దెలియంగవచ్చు మదనాంకురభావము భామ కుండుటల్.


తా.

తనముం దెవ్వరైనను దనవిటునియొక్క యైశ్వర్యమును సౌందర్య
మును గుణములను స్తుతింపగా తృప్తిపొందును. విటునియొక్క స్నేహితులను జూచి
సంతోషించును. ఈమొదలగు గుణములచేత స్త్రీకి వలపు యుండెనని తెలియ
వచ్చును.

స్త్రీలసమయరతివిశేషము

శ్లో.

అధ్వక్లాన్తతనుర్నవజ్వరవతీ నృత్యశ్లధాంగీ తథా
                        మాసైకప్రసవా దతాతి సురతే షణ్మాసగర్భా సుఖం।
విఖ్యాతా విరహయ్య సంగమవిధౌ క్రుద్ధప్రసన్నే ఋతు
                        స్నానే నూతనసంగమే మధుమదే రాగాస్పదంయోషితః॥


సీ.

కలు ద్రావి యరచొక్కుఁ గవసినఁ గమలాక్షి
                 దూరంబు నడచిన తోయజాక్షి
యొకనాఁటిజ్వరము మైనొదవిన యంగన
                 నాట్యమాడి యలయు నాట్యగంధి
నాల్నాళ్ళు గడచిన నారీశిరోమణి
                 గర్భమై యార్నెల ల్గలుగు కాంతఁ
గోపంబు మగని పైఁగొన్న లతాతన్వి
                 విరహాంతమునఁ గూడు విద్రుమోష్ఠి


గీ.

బిడ్డఁ గన్నట్టి నెలనాళ్ళ భీరుమధ్య
మొదలఁ బొలివోకయుండిన ముద్దరాలిఁ
గలిసినప్పటి సౌఖ్యంబు కొలఁదిఁ జెప్ప
నించువిల్తుఁడు నింద్రుఁడు నెఱుఁగలేరు.


తా.

మధుపానము జేసి స్మరణదప్పియున్న మగువతోనైనను, దూరము నడచి
వచ్చిన తొయ్యలితోనైనను, ఒకరోజు జ్వరము వచ్చినయువిదతోనైనను, నృత్య
ము జేసి బడలియున్ననాతితోనైనను, ఆరునెలలు గర్భమైనకాంతతోనయినను,
మగనిమీద కోపించినమగువనైనను, విరహముతో కలియువెలందినయినను, ప్రస
వించి నెలదినములైన పడంతినైనను, ప్రథమరజస్వలయైన కన్యనైనను కూడిన
యెడల నట్టిసౌఖ్యము మన్మథుడుగాని యింద్రుడుగాని యనుభవించియుండరు.


శ్లో.

ప్రథమమదనయుద్ధే యోషితః స్వల్పభావాః
                        కథమపి చిరకాలతృప్తియోగం లభన్తే।
ధృతగురుతరభావాః క్షిప్రకలా ద్వితీయే
                        భవతి తు విపరీతః పూరుషేషు క్రమో౽యమ్॥

శ్లో.

ప్రాయోంగనానాం పుర ఏవ తృప్తేర్భావావసానం పురుషాలభన్తే।
ఇదం తు విజ్ఞాయ తథోపచార్యా యథా ద్రవన్త్యగ్రత ఏవనార్యః॥


శ్లో.

అభ్యర్థితా బాహ్యరతేన భూయో యా దేశకాలప్రకృతీః ప్రతీక్ష్య।
శ్లథాస్తరుణ్యః ప్రబలానురాగా ద్రవన్తి తృప్యన్తి చ శీఘ్రమేవ॥


శ్లో.

కల్లోలినీకాననకన్దరాద్రౌ దుఃఖాశ్రయే వార్పితచిత్తవృత్తిః।
మృదుత్క్రమారంభమభిన్నధైర్యః శ్లథోపి దీర్ఘం రమతే రతేషు॥


శ్లో.

శాఖామృగమతిచపలం క్షితిరుహశాఖాగతిం విచిన్తయతః।
ధ్వజముఖపర్యన్తగతం ఫలబీజం పురుషస్య జాతు నో గలతి॥


చ.

మగువకుఁ దృప్తిలేదు ప్రథమంబున రెండవమాఱుఁ గూడినన్
మిగులసుఖంబు వేగిరమె మించు దలిర్పగ నిట్టిచందముల్
మగనికి వీఁడుబాటు ప్రథమంబున శీఘ్రసుఖంబు నిచ్చు నిం
పుగ రమియించిన న్సుఖము పుట్టదు రెండవమాఱు గ్రక్కునన్.


తా.

స్త్రీలకు తొలిసంగమంబున దృప్తి గలుగదు రెండవమారు రతి చేసిన
మిక్కిలి సుఖము కలుగును. పురుషులకు తొలిసంగమమున శీఘ్రముగా సుఖము
నిచ్చును. ప్రీతిచేత రెండవసారి సంగమము చేసిన శీఘ్రముగా సుఖము పుట్టదు.


వ.

ఇట్లగుటం జేసి స్త్రీలకుఁ బ్రథమసురతంబునఁ దృప్తి గలుగునట్లు కాలకళా
సందర్భము లెఱింగి స్త్రీల నాలింగన మొనర్చి చుంబనాదిబాహ్యరతుల నలయించి
తత్తరమొందక పురుషులు పెనంగిన స్త్రీలకు ద్రవంబు కలిగి తృప్తిఁ బొందెదరు.
తదీయలక్షణం బెఱింగించెద—


ఉ.

కాననము ల్నగంబులును గహ్వరము ల్తటినీహ్రదంబు లం
భోనిధు లంబరంబు ద్రుమము ల్కడుదుఃఖముల న్మనంబునన్
బూనుచు వేగిరం పడక పొందుచు వీర్యము నిల్పి నంతటన్
మానినిఁ గూడినన్ సుఖము మానక పుట్టుఁ గ్రమక్రమంబుగన్.


తా.

అరణ్యము కొండ కొండబిలము తటాకము మడుగు సముద్రము ఆకా
శము వృక్షము వ్యసనము వీని మనస్సునం దుంచి త్వరపడక యింద్రియమును
నిల్పి స్త్రీని మెల్లగా రమించుచు గూడిన క్రమక్రమముగా సుఖము గలుగును.


వ.

మఱియుఁ గూరిమి యభ్యాసయోగంబును యభిమానజంబును సంప్రత్యయో
గంబును వైషయికంబును స్వభావసాత్మ్యకమనునవి యైదువిధంబు లయ్యె.
అవి యేవి యనిన—

అభ్యాసయోగలక్షణము

శ్లో.

అఖేటకే శిల్పవిధౌ చ నృత్యేప్యభ్యాసయోగాదుపచీయతేయా।
వీణాస్వనా ద్వైర్విషయైర్బుధాస్తామాభాసికీం ప్రీతి ముదహరన్తి॥


క.

వేఁటల శిల్పక్రీడలఁ
దోఁటల వీణాస్వనాదితూర్యంబులచే
మాటలఁ జదువులఁ గూర్ములు
నాటిన నభ్యాసయోగ నామం బయ్యెన్.


తా.

వేటలాడుటవలనను చిత్తరువుల వ్రాయుటవలనను వనవిహారముచేతను
వీణాదివాద్యవిశేషములచేతను మాటలమూలమునను, చదువులమూలమునను పుట్టిన
ప్రేమ అభ్యాసయోగమని తెలియదగినది.

అభిమానజ సంప్రత్య వైషయికంబుల విషయంబులు

శ్లో.

నాభ్యాసతో నో విషయాద్భవేద్యా సంకల్పమాత్రాదభి మానజా సా।
క్లీబస్య నార్యాశ్చ యథోపదిష్టైః స్త్రీపుంసయోః శ్లేషణ చుంబనాద్యేః॥


శ్లో.

సాదృశ్యతే౽న్యస్య భవేత్క్వచిద్యా తాం ప్రత్యయోత్థాం కథయన్తి ధీరాః।
ఉత్పద్యతే యా విషయైః ప్రధానైః ప్రీతం తు తాం వైషయికీం వదన్తి॥


క.

మానవికారంబున నభి
మానజమగు కూర్మి యొప్పు మసలక మఱియున్
మానినులకు నాలింగన
పానాధరచుంబనాది భావస్థితులన్.


తా.

ఆలింగనము అధరపానము చుంబనము మొదలగు వికారభావస్థితులచే
జనించినప్రీతి యభిమానజమని యెఱుంగదగును.


గీ.

వయసు గుణమును రూపంబు వల్లభులకుఁ
గాంతలకు నొక్కచందమై కానఁబడినఁ
బ్రభవ మొందినఁ గూర్మి సంప్రత్యయోగ
మనుచు నార్యులు చెప్పుదు రభిమతముగ.

తా.

స్త్రీపురుషులకు రూపవయోగుణాదులు సమానమైనటుల నిరువురకు
తోచుటవలన జనించిననెయ్యము సంప్రత్యయోగంబని తెలియంజనును.


క.

ఏయే ప్రయోజనంబుల
నాయకులకు వనితలకును నాటునుగూర్ముల్
పాయక వైషయికం బని
చేయుదు రభిధానమిది ప్రసిద్ధముగాఁగన్.


తా.

ఏయేసంబంధములయందు స్త్రీపురుషులిరువురకు యేకవస్తుప్రస్తు
తాదులచేనైనను పరసంగమదృష్టంబుచేనైనను సుషుప్తావస్థలం బొరయునపుడు
ఆకస్మికముగా జనించు చెలిమిని వైషయికంబని తెలియంజనును.

స్వభావసాత్మ్యకలక్షణము

శ్లో.

స్వభావసాత్మ్యం కథితం యదేతద్యో జాత్యవస్థాదికృతోవిశేషః।
యద్వక్షమాణం స్ఫుటదేశసాత్మ్యం తదాకలయ్య ప్రమదా ముపేయాత్॥


క.

జాతిప్రమాణగుణంబులు
ధాతువులును సమములైనఁ దరుణికిఁ బతికిన్
బ్రీతి జనించిన నది ప్ర
ఖ్యాతంబు స్వభావసాత్మ్యకం బన నొప్పున్.


తా.

జాతులును గుహ్యప్రమాణములును ధాతువులును గుణములును సమ
ములైనందున స్త్రీపురుషులకు గలిగిన మక్కువయే స్వభావాత్మ్యకమని యె
ఱుంగునది.

ఇతి శ్రీకొక్కోకకృతే రతిరహస్యే
సామాన్యధర్మాధికారో నామ
చతుర్ధః పరిచ్ఛేదః

దేశజ్ఞానాధికారః

పంచమః పరిచ్ఛేదః

దేశస్త్రీల రతివిశేషలక్షణములు

శ్లో.

శుచిప్రచారా నఖదన్తచుంబద్విషస్త్రియో మధ్యమదేశజాతాః।
తథావిధాశ్చిత్రరతానురక్తా అవన్తి బాహ్లీకభువో భవన్తి॥


శ్లో.

ఆశ్లేషలోలా నఖదన్తకృత్యైర్విరజ్యతే హృష్యతి చాతిఘాతైః।
ఆభీరజా చుంబనహార్యచిత్తా స్యాన్మాలవీ చాపి తథావిధైప॥


శ్లో.

ఇరావతీసిన్ధుశతద్రుతీరే విపాడ్యవితస్తాసరిదన్తరాలే।
యాశ్చన్ద్రభాగాతటజాశ్చ నార్యస్తా ఔ పరిష్టేన వినా నసాధ్యాః॥


సీ.

ఆచారవతులు మధ్యమదేశవనితలు
                 నఖదంతచుంబనోన్ముఖతఁ గనరు
బాహ్లికావంతి భూభవకామినులు చిత్ర
                 రతిఁ గోరుదురు ఘాతరతికిఁ జొరరు
నాభీరకాంతలు నాలింగనాది ఘా
                 తలఁగాని నఖదంతములకుఁ జొరరు
మాళవస్త్రీలు చుంబనములకే గాని
                 నఖదంతఘాతల సుఖము గనరు


గీ.

మఱియు భగచుంబనము లేక మరులుగొనరు
చన్ద్రభాగసరిత్ప్రదేశముల సతులు
వారి చందంబె యుగ నిరావతిశరద్రు
సింధుసరిదంతరంబుల చెలువలెల్ల.


తా.

మధ్యమదేశమం దుత్పన్నమగు స్త్రీ లాచారాదులు గలిగి నఖక్షత
దంతక్షత చుంబనముల కుద్యుక్తులు గారు. బాహ్లికావంతిదేశస్త్రీలు కఠినరతుల

ప్రవేసించనివారై చిత్రరతుల గోరుదురు. ఆభీరదేశస్త్రీలు గాఢాలింగనములకే
గాని నఖదంతక్షతములకు బ్రవేశింపరు. మాళవదేశస్త్రీలు చుంబనములకే గాని
నఖక్షత దంతక్షతసౌఖ్యముల గోరరు. చంద్రభాగ ఇరావతి సింధు శరద్రుయను
నదులు ప్రవహించు తీరములయందుగల స్త్రీలు భగచుంబనములులేక మోహి
తులు కారు.

గుర్జరదేశస్త్రీ లక్షణములు

శ్లో.

ఫుల్లాసిధమిల్లభరా కృశాంగీ పీనస్తనీ చారువిలోచనా చ।
ప్రియోక్తిరాభ్యన్తరబాహ్యభోగసక్తా విరక్తాపి చ గుర్జరీ స్యాత్॥


వ.

విరిసినవెంట్రుకలచే నొప్పునదియు, కృశించిన అవయవములు గలదియు, గొప్ప
వైన కుచములు గలదియు, అందమైన కండ్లు గలదియు, ప్రియవాక్యములు
మాట్లాడునదియు, అభ్యంతరబాహ్యభోగములయందు విరక్తిగలస్త్రీన గుర్జరీ
దేశస్త్రీగా తెలియందగినది.

లాటదేశస్త్రీలక్షణము

శ్లో.

మన్దాభిఘాతైర్నఖదంతకృత్యైర్భృశం ద్రవన్తీ పరిరంభలోలా।
ప్రచండవేగా సుకుమారగాత్రీ రతోత్సవే నృత్యతి లాటనారీ॥


క.

పరిరంభణమృదుతాడన
గురునఖరాహతులఁ గరఁగు కోమలి యయ్యున్
సురతమున నాట్యమాడును
సరభసగతి లాటవనిత చంచద్భంగిన్.


తా.

ఆలింగనముచేతను మెల్లగా కొట్టుటచేతను నఖక్షతములచేతను
ద్రవించునదియు రతియందు మనోజ్ఞముగా నాట్యము సేయునదియు లాటదేశ
వనితగా నెఱుంగతగినది.

ఆంధ్రదేశస్త్రీలక్షణము

శ్లో.

చారిత్రముద్రమతిలంఘయన్తీ భవత్యనాచారరతా రతార్తిః।
ప్రయుంజతీ వాడవకర్మనర్మాణ్యాన్ధ్రీ పురన్ధ్రీ ధృతసౌకుమార్యా॥


క.

తర మెఱుఁగక యాచారము
మెరమెరవౌ రతులఁ గోరు మే న్మెత్తన యాం

ధ్రరమణి విభునకు వీర్యముఁ
బురికొల్పును దదనుయోనిపుటములవలనన్.


తా.

కొద్దిగొప్పనెఱుంగనియాచారమును, శ్రేష్ఠమగు రతుల గోరుటయు,
మెత్తనిదేహమును, ద్రవముగల యోనిముఖముచేత పురుషునిదండమును బిగించి శక్తి
కలుగజేయునది ఆంధ్రదేశస్త్రీగా నెఱుంగునది.

కోసలదేశస్త్రీలక్షణము

శ్లో.

విమృద్యమానాః కృతకధ్వజేన ద్రవన్తిహృష్యన్తి ధృఢప్రహారైః।
స్త్రీరాజ్యజాః కోసలజాశ్నార్యః ప్రచండకండూతిభగా భవన్తి॥


ఆ.

దూలఁ గలిగియుండుఁ జాలగ మరునింటఁ
గాష్టలోహదండఘాత నైన
ద్రవము పుట్ట నురముఁ దాటింపవలెఁ జాల
కోసలాదిదేశకొమ్మలకును.


తా.

భగమందు మిక్కిలిదురదయు, కాష్ఠతుల్యశిశ్నముయొక్క తాడనము
వల్లగాని ద్రవము పుట్టకయుండుటయు, ఱొమ్మునందు బలమగు తాడనమువల్లగాని
సంతసింపనివారు కోసలదేశస్త్రీలనుగా దెలియఁదగినది.

మహారాష్ట్ర పాటలిపుత్రదేశములస్త్రీల లక్షణములు

శ్లో.

సాక్షేపసగ్రామ్యగిరో విలజ్జా రతే చతుఃషష్టికాళనురక్తాః।
నార్యో మహారాష్ట్రభవాస్తధైవ రహఃస్థితాః పాటలిపుత్రికాః స్యుః॥


క.

రతులఁ జతుష్షష్టికళా
న్విత లయ్యును సిగ్గు విడిచి విటులను గ్రామ్య
ప్రతికూలభాష లాడెడి
యతివలు పాటలికభూ మహారాష్ట్రభవల్.


తా.

రతులయందు జతుష్షష్టికళాదులం దెలిసినవారయ్యును లజ్జ విడిచి
విటులను నపభ్రమచే శుద్ధగ్రామ్యంబుగా హెచ్చరించువారు పాటలిపుత్ర మహా
రాష్ట్రదేశముల స్త్రీలనుగా తెలియందగినది.

చతుష్షష్టికళలు

చ.

తలకొని యోపరిష్టమును దంతనఖక్షతసంప్రవేశనం
బులును గళస్వనంబులును బూరుషలీలయుఁ జుంబనంబు గౌఁ

గిలియును గాఁగ నెన్మిదిటికి న్గలదొక్కటి కెన్మిదేసియై
యలవడుఁ జిత్తజాతకళ లర్వదినాలుగు లెక్క చూచినన్.


తా.

ఔపరిష్టము దంతక్షతము నఖక్షతము సంప్రవేశనము గళస్వనము
పురుషలీల చుంబనము కౌఁగిలి యీయెన్మిదియందు యొక్కొక్కదాని కెనిమిది
వంతున మన్మథకళ లరువదినాలుగు యాయె.

ద్రవిడస్త్రీ లక్షణము

శ్లో.

అన్తర్బహిర్బాహ్యరతేన భుయో విమృద్యమానాః త్క్రమశోద్రవన్త్యః।
ప్రభూతకందర్పజలా ద్రవిడ్యో రతిం లభన్తే ప్రథమే రతేపి॥


క.

వెలిరతియును లోరతియును
దలకొలుపు భగంబునందు దర్పకుజలముల్
చిలుకఁగ ద్రవిడాంగన విటుఁ
గలియఁగఁ బ్రథమమున సుఖముఁ గైకొని చొక్కున్.


తా.

విటుడు వెలిరతి లోరతి చేయగా భగమునందు ద్రవము పుట్టి తొలిసం
గమమునందే సుఖము పొందునది ద్రవిడదేశస్త్రీయని యెఱుంగవలయును.

వెలిరతి లోరతుల లక్షణము

క.

వెలుపలి లోపలి రతములు
గల వంగజునిల్లు దొల్తఁ గడువేడ్కఁ గరాం
గుళిరతము సలుప వెలిరతి
యలవడు లోరతియు లింగ మచటికిఁ జొనుపన్.


తా.

వెలిరతి లోరతి యని రెండువిధములు. పురుషుడు తనచేతివ్రేలితో
జేసినరతము వెలిరతమనియు, శిశ్నమును భగమందు ప్రవేశింపజేసి సేయురతము
లోరతియనియు దెలియందగినది.

వనవాసదేశస్త్రీ లక్షణము

శ్లో.

ప్రచ్ఛాదయన్త్యః స్వశరీరదోషం పరాంగదోషం బహుశోహసన్త్యః।
సర్వంసహా మధ్యమవేగభాజః స్త్రీయో రమన్తే వనవాసదేశ్యాః॥


క.

పరదోషంబుల వెదుకుచు
పరిహాసముఁ జేయు నాత్మభవదోషంబుల్

పరికింపదు వనదేశపు
సరసిజముఖి కఠినరతుల జడియక నిలుచున్.


తా.

ఎదుటివారిదోషము లెన్నుచు ఎగతాళి చేయుటయు, తనదోషములు
తెలుసుకొనకుండుటయు, కఠినరతులకుగాని కరుగనిదియు వనవాసదేశస్త్రీగా
దెలియందగినది.

వంగ గౌడ దేశస్త్రీల లక్షణము

శ్లో.

మృద్వంగయష్టిర్మధురాభిధానా సంశ్లేషచుమ్బోత్కలికాల్పవేగా।
కఠోరచేష్టా విరతా రతాజౌ గౌడీ చ వంగీ చ నితంబినీ స్యాత్॥


చ.

సురతసుఖంబునందుఁ దమిఁ జూపును మెత్తనిమేను గౌఁగిటన్
గఱఁగును జుంబనప్రియవికారవిదూరము మారుకేళి య
ల్పరయము వంగరాజ్యభవభామినికి న్వరగౌడకాంతకున్
సరసు లెఱింగి వీరలను సమ్మతిఁ బొందుదు రింపు పుట్టఁగన్.


తా.

రతియందు ప్రేమ చూపుటయు, మెత్తనిశరీరమును, ఆలింగనమందు
చొక్కుటయు, చుంబనమం దాశ లేకుండుటయు, కొంచెము వేగముగల రతమును గల
స్త్రీలు వంగ గౌళ దేశస్త్రీలని యెఱుంగుడు.

కామరూపజాతిస్త్రీ లక్షణము

శ్లో.

శిరీషమృద్వీ బహుళో ద్రవంతీ రతే విలీనా కరమాత్రసంగాత్।
అనంగరంగైకరసా ప్రియోక్తిః స్యాత్కామరూపప్రభవా పురంధ్రీః॥


క.

తను వతిమృదువగు రతికిన్
దనివి సనదు ముట్టినపుడు ద్రవ ముప్పతిలున్
మనసిజతంత్రరసైకవ
చనకామిని కామరూపజాతిఁ దలంపన్.


తా.

మెత్తనిశరీరమును, రతియందు తృప్తిలేకయుండుటయు, అంటగనే
మదనజల ముప్పొంగుటయు, రతివిషయమగు మాటాడుటయు గలస్త్రీ కామ
రూపజాతిస్త్రీగా తెలియవలెను.

ఉత్కళదేశస్త్రీ లక్షణము

శ్లో.

ఉత్కళీ బహుళరాగవిహ్వలా దన్తఘాతకరజక్షతప్రియా।
ఔపరిష్టకరతా విశేషతో హ్యంగవంగయువతిః కళింగజా॥


శ్లో.

వివిధనఖవికారైః ప్రౌఢపాణిప్రహారైర్జనితపరమమోదమౌపరిష్టప్రకారైః।
అవిరతరతయుద్ధాకాంక్షిణీం వీతలజ్జాం వదతి బహుళరాగాముత్కళీం మూలదేవః॥

చ.

పరుషనఖప్రహారములఁ బాణితలాంగుళఘట్టనంబులన్
జరణవిఘట్టనంబులను సంతతమన్మథతంత్రభంగులన్
స్మరగృహచుంబనంబులఁ బ్రమత్తమధూదకపానలీలలన్
గరఁగి సుఖించు నుత్కళపుఁ గామిని రాగవిహీనలజ్జయై.


తా.

కఠినములగు నఖక్షతములచేతను, హస్తతాడనములచేతను, రతిరీతుల
చేతను, భగచుంబనములచేతను, మద్యపానములచేతను, ప్రీతిలేనిసిగ్గుచేతను,
ద్రవించి సుఖించునది ఉత్కళదేశస్త్రీగా తెలియందగినది.


శ్లో.

ఇతి కిమపి యదూచే దేశసాత్మ్యం మునీంద్రో
                        యువతిరితరదేశ్యాప్యూహనీయా తథైవ।
అనుభవమనుసృత్య స్వం చ సాత్మ్యం భవేద్యద్
                        భవితి సహజసాత్మ్యం దేశసాత్మ్యద్బలీయః॥


శ్లో.

ఇతి కిమపి యదుక్తం యోషితాం దేశసాత్మ్యం
                        స్ఫుటమకథితదేశేప్యున్నయేత్తద్దిశా తత్।
సహజమపి చ సాత్మ్యం భావయేత్ స్వానుభూత్యా
                        బలవదుభయమధ్యే విద్ధి సంసిద్ధికం యత్॥


శ్లో.

ఇతి ప్రమాణం సమయం చ వేగం స్వభావదేశోద్భవసాత్మ్యభేదాత్।
స్వస్థామవస్థాం ప్రకృతిం ప్రతీక్య ప్రయుంజతే బాహ్యరతం రతం చ॥


శ్లో.

అదౌ రతం బాహ్యమిహ ప్రయోజ్యం తత్రాపి చాలింగన పూర్వమేతత్।
అజాతజాతస్మరకేళిభేధాద్ద్విధా పునర్ద్వాదశధా చ తత్ స్యాత్॥


వ.

ఇవ్విధంబున నీశాస్త్రంబునఁ జెప్పిన దేశస్త్రీల ననుభవించి తదీయాత్మల నిశ్చ
యం బెఱింగి తత్ప్రమాణస్వస్థానస్థాప్రకృతిదేశసాత్మ్యంబులఁ బరికించి కాము
కులు ఫలశుద్ధి విచారించి బాహ్యాభ్యంతరరతుల న్బరికించి ప్రథమంబున ద్రవో
ద్భవకారణంబగు బాహ్యరతి యొనర్పం జను అందులకు నాందియైన యాలింగన
భేదంబులు చెప్పంబడియె నందుల నజాతస్మర మనియు, జాతస్మర మనియు
నాలింగనము రెండువిధంబు లయ్యె. అజాతస్మరమునందు నాలుగును జాతస్మర
మందు పదిరెండును భేదంబులు గలవు. అందుఁ బ్రథమంబైన యజాతస్మర మను
నాలింగనమందు—

ఇతి శ్రీకొక్కోకకృతే రతిరహస్యే
దేశజ్ఞానాధికారో నామ
పంచమః పరిచ్ఛేదః

ఆలింగనాధికారః

షష్ఠః పరిచ్ఛేదః

స్పృష్టక లక్షణము

శ్లో.

యద్యోషితస్సమ్ముఖమాగతాయా అన్యాపదేశాద్వ్రజతో నరస్య।
గాత్రేణ గాత్రం ఘటతే రతజ్ఞా ఆలింగనం స్పృష్టకమేతదాహుః॥


క.

ఎదురై మానినిదేహం
బెదురై యొకవంకఁ బనికి నేగెడుపురుషుం
గదిసి తొలంగుట స్పృష్టక
మది యని చెప్పుదురు రసికు లానింగనమున్.


తా.

తనపనికై జనుపురుషుని మోహించినస్త్రీ వాని కెదురుగా వచ్చి
యొరసి తొలగుటయే స్పృష్టక మనంబడును.

విద్ధక లక్షణము

శ్లో.

యద్గృష్ణతీ కించన వంచితాక్షం స్థితోపవిష్టం పురుషం స్తనాభ్యామ్।
నితంబినీ విధ్యతి తాం చ గాఢం గృహ్ణాత్యసౌ విద్ధకముచ్యతేతత్॥


క.

ఒకవంకనున్నవిభు నో
ర్వకడగ్గరి కౌఁగిలించు వనితను వెనుది
య్యక కౌఁగిలింప నది వి
ద్ధక మను నాలింగనంబు దానై వెలసెన్.


తా.

ఒంటరిగా నొకచోటనుండు పురుషుని గాంచి మదనవేదన కోర్వక
దగ్గర జేరి యాతని కౌఁగిలించినవనితను యాపురుషుడు వెనుదియ్యక కౌఁగిలించి
మేభావ విద్ధకమనంబడును.

ఉద్ఘృష్టక నిపీడనముల లక్షణములు

శ్లో.

యాత్రోత్సవాదౌ తిమిరే ఘనే వా యద్గచ్ఛతోః స్వాచ్చిరమంగసంగః।
ఉద్ఘృష్టకం తత్పునరేవ కుడ్యే నిపీడనాత్పీడితసంజ్ఞకం స్యాత్॥


క.

యానోత్సవతిమిరంబుల
మేనులు సోఁకుటయుఁ బతికి మెలఁత కుద్ఘృష్టం
బై నెగడె గోడ నొత్తన్
గానదియె నిపీడనాఖ్య కౌఁగిలి యయ్యెన్.


తా.

తీర్థయాత్రలయందుగాని, దేవాదిమహోత్సవములయందుగాని, చీకటి
యందుగాని స్త్రీపురుషులకు మేనులు తగులుటయే ఉద్ఘృష్టక మనబడును. యాకా
లమునందే స్త్రీగాని పురుషుడుగాని గోడకు జేర్చి యొత్తబడునదియే నిపీడితమ
నంబడును.


శ్లో.

భావప్రబోధార్థమజాతరత్యోశ్చతుర్విధోక్తా పరిరంభలీలా।
సంజాతరత్యోస్త్వనురాగవృద్ధ్యైబుధ్యైరసావష్టవిధోపదిష్టా॥


వ.

భావప్రబోధకంబులయి పురుషులచే నాచరింపఁబడు సురతరహితము
లగు నజాతకాలింగనంబులు నాలుగును జెప్పితిని. ఇంక నుపభర్తలగు పురుషులచే
నాచరింపంబడు జాతిస్మరాలింగనము లెనిమిదియు నెట్లంటేని—

లతావేష్టిత లక్షణము

శ్లో.

ప్రియమనుకృతవల్లీభ్రమా వేష్టయంతీ
                        ద్రుమమివ సరళాంగీ మన్దసీత్కా తదీయమ్।
వదనముదితఖేలాక్రన్దమాచుంబనార్థం
                        సమయతి వినమన్తీ తల్లతావేష్టితం స్యాత్॥


చ.

ఎదురుగనున్న నాయకుఁ బ్రియేశ్వరి డగ్గరి యూరుయుగ్ము
న్బదములఁ జుట్టి వృక్షమునఁ బ్రాఁకినతీవెయుఁబోలెఁ గౌఁగిటన్
వదలక చిక్కనొక్కి తలవంచి గళధ్వను లుల్లసిల్లఁగా
నధరము గ్రోలుచున్న యది యాది లతాపరివేష్టితం బగున్.


తా.

ఎదురుగ నిలిచియున్నపురుషునియొద్దకు వెళ్ళి యతనితొడలను తనకాళ్ళ
చేత చుట్టుకొని చెట్టును అల్లుకొనియున్నతీగవలె అతని యాలింగన మొనర్చి తల వంచి
కంఠధ్వని పుట్టునట్టుల యాస్త్రీ అధరపానము చేయుటయే లతావేష్టిత మనంబడును.

వృక్షాధిరూఢ లక్షణము

శ్లో.

రమణచరణమేకేనాంఘ్రిణాత్క్రమ్య ఖిన్నం
                        శ్వసితమపరపాదేనాశ్రయన్తీ తడూరమ్।
నిజమథ భుజమేకం పృష్ఠతో౽స్యార్పయన్తీ
                        పునరపరభుజేవ ప్రార్థయన్తి తదంసమ్॥


శ్లో.

స్థితపతిమధికృత్య ప్రోక్తమాశ్లేషయుగ్మం
                        సపది చ కథనీయాః నుప్తసంశ్లేషభేదాః।
తరుమివ కమితారం చుమ్బనార్థాధిరోఢుం
                        యదభిలషతి నారీ తచ్చ వృక్షాధిరూఢమ్॥


చ.

పతిచరణంబుమీఁద నొకపాదము నిల్పి ద్వితీయపాదమున్
బతితొడఁ గీలుకొల్పి నిజబాహువు వీపునఁ బెట్టి క్రమ్మఱన్
బతిమెడఁ జుట్టి తాళగతబద్ధఘటంబును గ్రోలురీతిఁ ద
త్పతి యధరంబుఁ గ్రోలు సతిభావము వృక్షనిరూఢమై చనున్.


తా.

పురుషునిపాదముమీద నొకపాద ముంచి వేఱొకపాదముతో పతియొ
క్కతొడను పెనవైచి తనచేతిని పతివీపుమీదుగా పతిమెడను జుట్టిపట్టి తాటిచె
ట్టున గట్టియుండిన దుత్తలోనుండు కల్లును త్రాగురీతిగా పురుషుని యధరపానము
చేయుస్త్రీభావమే వృక్షాధిరూఢ మగును.

తిలతండుల లక్షణము

శ్లో.

అసకృదపి విగాఢాశ్లేషలీలాం వితన్వన్
                        జనితజఘనబాహువ్యత్యయం స్పర్ధయేవ।
మిథునమథ మిథోం౽గే లీయతే నిస్తరంగం
                        నిగదతి తిలపూర్వం తండులం తన్మునీన్ద్రః॥


క.

తరుణియుఁ బురుషుఁడుఁ బాన్పునఁ
గరచరణాంగములు బిగియఁ గౌఁగిలి యిడుచున్
బొరిపొరి వదలుచు బిగియుచుఁ
గరఁగుట తిలతండులంపుఁ గౌఁగిలి యయ్యెన్.


తా.

స్త్రీపురుషులు పానుపునందు బరుండి కాళ్ళుచేతులు దేహము గట్టిగా
నాలింగనము చేయుచు ఊగుచూ నొకరినొకరు బిగపడుచు నాలింగనమున ద్రవించు
చున్నభావము తిలతండుల మనబడును.

క్షీరనీర లక్షణము

శ్లో.

అభిముఖముపవిష్టా యోషిదంతే౽థ తల్పే
                        రచితరుచితగాఢాలింగనో వల్లభశ్చ।
ప్రసరదసమరాగావేశనశ్యద్విచారా
                        విశత ఇవ మిధోంగే క్షీరనీరః తదాహుః॥


ఉ.

పానుపునందు నిద్దరును బైకొని చిక్కనఁ గౌఁగిలించి యా
మేనులు రెండుగూడి యొకమేనుగ వల్లభుఁడు న్వధూటియున్
జానుగ మోహ ముప్పతిల సారెకుఁ జేరి భగద్వయంబు సం
స్థానము లంటియున్న తమిసంగతి క్షీరజలంబు నాఁబడున్.


తా.

స్త్రీపురుషులు పాన్పునందు యొకరిపైనొకరు పండుకొని గాఢాలిం
గన మొనర్చి రెండుశరీరము లొక్కటిగా నుండ వలపు లుప్పొంగునటుల భగద్వయ
స్థానముల ముట్టుభావమే క్షీరనీరం బనబడును.

ఊరూపగూఢ లక్షణము

శ్లో.

మనసిజతరళాయాః సంభృతానంగరంగో
                        యది పతిరబలాయాఃపీడయత్యూరుయుగ్మమ్।
దరదళితనిజోరుద్వన్ద్వసన్దంశయోగాత్
                        తదిహ మునిమతజ్ఞైరుక్తమూరూపగూఢమ్॥


క.

తనతొడల నడుమ నిడుకొని
వనితామణితొడలు బిగియ వల్లభుఁ డాలిం
గన మొనరించినఁ గోరిక
ననుపమ మూరూపగూఢమం చనఁబరఁగున్.


తా.

పురుషుడు తనతొడలనడుమ స్త్రీతొడల నుంచి బిగించి ప్రీతి రెట్టింప
నాలింగనము చేయుభావమే ఊరూపగూఢ మనంజనును.

జఘనోపశ్లేష లక్షణము

శ్లో.

జఘనకలితకాంతశ్రోణిరస్యోపరిష్టా
                        హ్రణతి యణహ నారీ ప్రస్తకేశోత్తరీయా।
కరజరదనకృత్యం చుమ్బనం వా విధిస్సు।
                        కథయతి జఘనోసశ్లేషమేతన్మునీన్ద్రః॥

ఉ.

కొప్పరవీడఁబెట్టచును గుబ్బలఁ బయ్యెద జార మోహమున్
గప్పఁగ నాథుగుహ్యమున గామిని దా జఘనంబుఁ గూర్చి పైఁ
దప్పకయుండఁ జుంబనము దంతనఖక్షతముల్ రచింపఁగా
నొప్పుగఁ జెప్పుచుంద్రు జఘనోపరిగూహన నామధేయమున్.


తా.

స్త్రీ చన్నులమీది పయ్యెద జారేటట్టుగా, సగము జారినకొప్పు చక్క
బెట్టుచుండ వలపు పుట్టునట్టు పురుషునిమర్మస్థానమందు తనజఘనము నుంచగా పురు
షుడు దంతలఖక్షతచుంబనములు చేయచు నాలింగన మొనర్చునది జఘనోపశ్లేష
మనంబడును.

కుచాశ్లేష లాలాటికముల లక్షణము

శ్లో.

ఉరసి కమితురుచ్చైరావిశన్తీవరాంగీ
                        స్తనభరముపధత్తే యత్స్తనాలింగనం తత్।
ముఖమభిముఖమక్ష్మోరక్షిణీ న్యస్య హన్యా
                        దలికమలికపట్టేనేతి లాలటికం స్యాత్॥


క.

పెనిమిటియురమునఁ గామిని
ఘనకుచములఁ గదియనొత్తి కరకరిలీలన్
జనువిచ్చి కొసరిపల్కుల
వినుతి కుచాశ్లేషణంబు విదితం బయ్యెన్.


తా.

స్త్రీ తనకుచములను పురుషునిఱొమ్మున గట్టిగా నదిమి చనువిచ్చి
కొసరికొసరి మాట్లాడుచు కౌగలించినదియే కుచాశ్లేష మనంబడును.


క.

నుదురును నుదురును వదనము
వదనము నేత్రములు నేత్రవారిరుహంబుల్
గదియించి కౌఁగిలించిన
నది లాలాటిక నిరూపణాఖ్యం బయ్యెన్.


తా.

స్త్రీపురుషు లిరువురును మొగములు ముక్కులు కన్నులు యొకటిగా
చేర్చి కౌఁగిలించినభావమే లాలాటిక మనంబడును.

ఇతి శ్రీకొక్కోకకృతే రతిరహస్యే
ఆలింగనాధికారో నామ
షష్ఠః పరిచ్ఛేదః

చుమ్బనాధికారః

సప్తమః పరిచ్ఛేదః

చుమ్బనస్థానములు

శ్లో.

నయనగళకపోలం దన్తవాసో ముఖాన్తః
                        స్తనయుగళలలాటం చుమ్బనస్థానమాహుః।
దధతి జఘననాభీమూలకక్షాసు చుమ్బ
                        వ్యతికరసుఖముచ్చైర్దేశసాత్మ్యేన లాటః॥


ఉ.

కన్నులు మోవి చన్నుగవ కంఠము చెక్కులు ముక్కు ఫాలమున్
మున్నుగఁ జుంబనంబునకు మూలము లయ్యెను గక్షయుగ్మమున్
గ్రొన్ననవిల్తునిల్లును ద్రికోణముఖంబును జుంబితంబులై
హొన్ను వహించు దేశహిత మొప్పఁగ లాటవధూటి యింపునన్.


తా.

నేత్రములు, అధరము, కుచములు, కంఠము, చెక్కులు, ముక్కు,
లలాటము, ఇవి చుంబనమునకు తావులు. మఱియి చంకలు, భగము, బొడ్డు యీ
తావులను చుంబింపగా లాటదేశపుస్త్రీలు సంతోషింతురు.

నిమిత స్ఫురితచుంబనముల లక్షణము

శ్లో.

నిమితకమిదనూహుర్యోజితా యద్బలేన
                        ప్రియముఖమభివక్త్రం న్యస్య తిష్ఠత్యుదాస్యా।
స్ఫురితమథ ముఖాన్తర్న్యస్తమోష్ఠం జిఘృక్షుః
                        స్ఫురదధరపుటాభ్యాం యన్న గృహ్ణాతి భర్తుః॥


ఆ.

తనకు సఖులు చెప్పఁ దరుణివక్త్రము దన
కభిముఖంబుఁ జేసి హత్తు గొలువ
నందుఁ దొలుత నధర మాసఁ దానానుట
నిమితకం బటంచు నెగడె భువిని.

తా.

తనయొక్కసఖులు చెప్పగానివి తనను బొందెడి పురుషునిముఖమునకు
సమముగా దనముఖము నుంచగా తొలుత పురుషు డాస్త్రీ అధరమును ఆశతో
చుంబించుటయే నిమితచుంబన మనబడును.


ఆ.

వనిత మీఁది పెదవి వరుఁడు చుంబించుచు
నధర మతివనోట నదుముటయును
నధరపానమాన నది సిగ్గువడియున్న
స్ఫురిత మనెడిపేరి చుంబనంబు.


తా.

పురుషుడు స్త్రీయొక్క పైపెదవిని చుంబించుచు తనక్రిందిపెదవిని
స్త్రీయొక్కనోటియం దదుమగా ఆస్త్రీ సిగ్గుచేత అధరపానము చేయకుండినయెడల
స్ఫురితచుంబనమని తెలియదగినది.

ఘట్టితచుంబన లక్షణము

శ్లో.

రమణరదనవాసః స్వాననే న్యస్తమోష్ఠ
                        ద్వితయమృదుగృహీతం యస్మనాక్ జిహ్వయాన్తః।
కరపిహితధవాక్షీ ఘట్టయేద్ ఘట్టితం స్యాత్
                        త్రితయమపి తదేతత్కన్యకాయాం ప్రయోజ్యమ్॥


ఆ.

అధిపుఁ డధరపాన మానుచో సిగ్గునఁ
గరముతోడ నతని కనులు మూసి
జిహ్వచేతఁ బెదవి చిట్టము లంటుట
కనుఁగొనంగ నదియె ఘట్టతంబు.


తా.

పురుషు డధరపానమును జేయుచుండగా సిగ్గుచేత యాస్త్రీ పురుషుని
యొక్క కన్నులను దనచేతులతో మూసి తననాలుకచేత యతనిపెదవుల నంటుటయే
ఘట్టితచుంబన మనబడును.

భ్రాంతి తిర్యగ పీడిత విఘటిత అధర ఉత్తరచుంబనముల లక్షణములు

శ్లో.

యువతిచిబుకదేశం వల్లభః పృష్టవర్తీ
                        భ్రమయతి ముఖమీషద్యత్కరాభ్యాం గృహీత్వా।
అధరమథ విలీఢస్తౌ మిథో భ్రాన్తమేతద్
                        ప్రజతి దయితపా చీభావతస్తిర్యగాఖ్యామ్॥


శ్లో.

ద్వయమిదమనపీడ్య గ్రాహతః పీడితాఖ్యం
                        విఘటితమథ జిహ్వాగ్రేణ కృష్ట్వాంగుళీభ్యామ్।

అరదమధరమస్యాః పీడయేత్ ప్రీతికృష్టం
                        దశతి కమితరి స్యాదుత్తరం తూత్తరోష్ఠమ్॥


సీ.

వెనుక నొయ్యన వచ్చి విభుఁడు హస్తంబులఁ
                 గామినీమణి చిబుకంబుఁ బట్టి
యానన మొకయింత యటు త్రిప్పి సరసుఁడై
                 యాను చుంబనము భ్రాంతాఖ్య మయ్యె
వనిత యడ్డము నిల్చి వరు నధరోష్ఠంబు
                 చుంబింప తిర్యగాఖ్యంబు చెలఁగె
పట్టి యీరెండు చుంబనములఁ బీడింపఁ
                 బీడితాఖ్యం బను పేరఁ బరఁగె


ఆ.

తరుణి మోవిచిగురు దనచేతివ్రేళ్ళకుఁ
జివరపట్టి తీసి జిహ్వఁ బరపి
చుంబనంబు సేయ సూరిజనంబులు
విఘటితాఖ్య మనిరి విశదముగను.


తా.

పురుషుడు స్త్రీకి వెనుకదిక్కుగా వచ్చి తనచేతితో దానిగడ్డమును
బట్టుకొని మొగము కొంచెము త్రిప్పి చుంబనము చేయునదియే భ్రాంతిచుంబన
మనబడును. స్త్రీ యాతనిచేతులలో యడ్డముగా నుండి పురుషునియొక్క క్రింది
పెదవి చుంబించినదియే చిర్యగచుంబన మనబడును. ముందు చెప్పబడిన భ్రాంతి,
తిర్యగ, చుంబనముల రెంటిచేతను స్త్రీపురుషులిరువురు చుంబించునదియే పీడిత
చుంబన మనంబడును. స్త్రీయొక్క మోవి తనచేతివ్రేళ్ళతో పట్టుకొని కొంచెము
ముందుకు లాగి నాలుకను జాపి చుంబించునదియే విఘటితచుంబన మనబడును.


ఆ.

పల్లు మోపకుండ భామినియధరంబు
జిహ్వచుంబనంబుఁ జేసెనేని
యధర మనఁగఁ బరఁగె నట్లె పై పెదవి దా
హత్తుకొలుప నుత్తరాఖ్య మయ్యె.


తా.

పురుషుడు స్త్రీయొక్క అధరమున పల్లు ఆనకుండా నాలుకతో చుంబ
నము చేయునదియే అధరచుంబన మనబడును. పైమాదిరిగనే పైపెదవిని చుంబించు
నదియే ఉత్తరచుంబన మనంబడును.

సంపుట అనువదనచుంబనముల లక్షణము

శ్లో.

యది పతిరబలాయాః శ్మశ్రుహీనో౽స్య సా వా
                        సుమృదురదనవాసఃసంపుటం సంపుటేన।
ప్రణయపరిగృహీతం చుమ్బనం సంపుటం స్యా
                        దనువదనమిదం తత్కేళి జిహ్వరణేవ॥


ఉ.

 మీసము పుట్టినట్టి నెఱమిండడు కామినియోష్ఠయుగ్మమున్
దీసి నిజోష్ఠయుగ్మమునఁ దీపులు వుట్టగఁ గూర్చి చుంబనో
ల్లాసముఁ జూపఁ గాంతయుఁ బదంపడి నాయకునందు నట్టు తాఁ
జేసిన సంపుటం బనుచుఁ జెప్పిరి చుంబనవేదు లీక్రియన్.


తా.

పురుషుడు స్త్రీయొక్క పెదవులు రెండును దీసి తనయొక్క పెదవుల
యందు రుచి కలుగున ట్లుంచి చుంబనము చేయ నుల్లాసము చూపగా యాస్త్రీ యా
పురుషునియం దట్లు చేసిన సంపుటచుంబనమని పెద్దలు వచించిరి.


క.

ఈలాగు చుంబనంబుల
కేళిన్ జిహ్వారణంబుఁ గీలించినచోఁ
బోలఁగ ననువదనం బని
సీలించిరి చుంబనంబుఁ జెప్పెడిపట్లన్.


తా.

ముందు చెప్పబడిన సంపుటచుంబనమువలెనె యొనరించుచు పరస్ప
రము నాలుకతో జగడమాడునదియె ననువదనచుంబన మగును.

అన్వితచుంబన లక్షణము

శ్లో.

మృదు సమమనపీడ్యాభ్యర్థితం చేతి శేషే
ష్వపి కధిపదేషు ప్రోక్తమన్వర్థమేతత్॥


ఆ.

సమము మృదువుగాఁగ సల్పెడి యాచుంబ
నంబు కంఠ గండ నయనముఖ్య
చుంబనములఁ గలికి చూపులుఁ బలుకులు
నడర నన్వితాఖ్య మయ్యెఁ గృతుల.


తా.

సమముగను మృదువుగను చేయుచుండెడి యాచుంబనమునందు మెడ
చెక్కులు నేత్రములు మొదలగు చుంబకస్థానములయందు చుంబనములును శృంగా
రపుచూపులును మాటలును ఒప్పునదియే అన్వితచుంబన మయ్యెను.

ప్రాతిబోధ ఛాయిక క్రాంతమచుంబనంబుల లక్షణము

శ్లో.

యదిసుచిరసమేతః ప్రేయసీమగ్రసుప్తాం
                        రహసి కృతకనిద్రాం చుంబతి ప్రాణనాథః।
కథితవిధమిదం స్యాచ్చుంబనం ప్రాతిబోధం
                        ద్వయమిదమపరం స్యాచ్చుంబనం ఛాయకాఖ్యమ్॥


శ్లో.

అభినవమనురాగం వ్యంజితుం దర్పణాదౌ
                        ప్రతికృతివిషయం వా చుంబనం పుంస్త్రియోః స్యాత్।
ప్రతికృతిశిశుచిత్రాశ్లేషణం చుంబనం వా
                        ద్వయమువహితభావం తచ్చ సంక్రాన్తమాహుః॥


క.

దూరగతుఁడైన పురుషుఁడు
చేరినచోఁ గపటనిద్రఁ జెందినవనితన్
గూరిమితోఁ జుంబించిన
నారయఁ బ్రతిబోధ మిదియె యాయిద్దఱికిన్.


తా.

స్త్రీగాని పురుషుడుగాని యిరువురియందొకరు కార్యార్థులై దూరము
పోయివచ్చినదినమున యింటియం దున్నవారు మేలుకొనియుండియే నిద్రపోవున ట్ల
భినయించుచున్న వారిని ప్రేమతో అధరమును చుంబిెచుటయే ప్రాతిబోధచుంబ
న మనంబడును.


ఉ.

కాంతునిమీఁద మోహము ప్రకాశముఁ జేయఁదలంచి చందమః
కాంతశిలాదిదర్పణవికాసముల న్బొడసూపునీడలన్
జెంతలఁ జేరి చుంబనముఁ జేయుట ఛాయిక మయ్యె బాలురన్
దంతపుబొమ్మల న్సుఖరతంబులఁ జేయుట క్రాంతమం బగున్.


తా.

స్త్రీ పురుషునిమీదివలపును బయలుపరపదలంచి చంద్రకాంతశిలలు
అద్దములయందు కనబడుచుండు యాపురుషుని ప్రతిబింబమువద్దకు జని చుంబనము
చేయుటయే ఛాయికచుంబన మగును. బిడ్డలను బొమ్మలను వలపుచేత చుంబించు
టయే క్రాంతచుంబన మనబడును.

ఇతి శ్రీకొక్కోకకృతే రతిరహస్యే
చుమ్బనాధికారో నామ
సప్తమః పరిచ్ఛేదః

అధికాధికరణము

ఈ గ్రంథమున బద్మినిస్త్రీ పాంచాలుని, చిత్రిణిస్త్రీ కూచుమారుని, శంఖినిస్త్రీ భద్రుని, హస్తినిస్త్రీ దత్తుని, ప్రేమించునని తెల్పియుండునేగాని యాయా పురుషుల లక్షణములను దెలుపకయుండుట వలన నెల్లూరు శివరామకవిచే రచింపబడిన 'కామకళానిధి' నుండి భద్ర కూచిమార పాంచాల దత్తుల లక్షణము లిందు జేర్ప నీ యధికాధిరణ మేర్పడెను.

సీ.

దివ్యనాయకులు నదివ్యనాయకులును
                 నుభయనాయకులన నొప్పుమొదల
నలకూబరజయంతనలినబాణాదులు
                 దివ్యు లర్జునబలదేవముఖ్యు
లరయ వీర లదివ్యు లగుదురు విక్రమా
                 ర్కాదులు నుభయనాయకులు దలఁప
నీ త్రివిధంబుల నెనయు నాయకులకు
                 నాల్గుజాతులు ప్రధానంబు లవియు


ఆ.

భద్ర కూచిమార పాంచాల దత్తుల
నాఁగనొప్పు దేవనాథుఁడాది
భద్రజాతి, మాణిభద్రాదు లలకూచి
మారజాతి యగుచు సౌరుగంద్రు.


తా.

నలకూబరుఁడు, జయంతుడు, బాణుడు, మొదలగువారు దివ్యనాయ
కులనియు; అర్జునుడు, బలదేవుడు మొదలగువారు అదివ్యనాయకులనియు, విక్ర
మార్కుడు మొదలగువారు ఉభయనాయకులనియు ప్రసిద్ధి. ఈత్రివిధనాయకు
లును భద్రుడు, కూచిమారుడు, పాంచాలుడు, దత్తుడు అను జాతులపురుషులుగా
నెన్నబడిరి. దేవేంద్రుడు భద్రజాతియనియు, మాణిభద్రుడు కూచిమారజాతి
యనియు తెలియందగినది.

ఆ.

పంచబాణముఖులు పాంచాలజాతియౌ
చంద్రముఖులు దత్తజాతివారు
ఇంక నుభయులందు నెఱిఁగింతు బలభద్ర
ముఖులు భద్రజాతి ముఖ్యు లరయ.


తా.

మన్మథముఖులు పాంచాలజాతియు, చంద్రముఖులు దత్తజాతియనియు
తెలియదగినది. ఇంక వీరిలో బలభద్రుఁడు భద్రజాతియని తెలియవలెను.


ఆ.

కూచిమారజాతిఁ గొమరొందు భీముండు
రఘుకులేంద్రుఁడైన రామవిభుఁడు
ప్రౌఢయశుఁ డొకండె పాంచాలపురుషుండు
తపనతనయుఁ డాది దత్తజాతి.


తా.

భీముడు కూచిమారజాతియనియు, రాముడు పాంచాలజాతియనియు, సుగ్రీవుడు దత్తజాతియనియు తెలియందగినది.


ఆ.

ఇపుడు పలికినట్టి యీ పురుషులకెల్ల
లక్షణములఁ గన నలక్షితములు
నైన మనుజులందు నభిహితలక్షణం
బుల నెఱుంగవలయు ముదముతోడ.


తా.

పైన చెప్పంబడిన పురుషుల లక్షణములు తెలిసికొనజాలనివైనను మను
ష్యులయందు యుక్తమగులక్షణములను దెల్పెదను గాన నెఱుంగవలయును.

భద్రుని లక్షణము

సీ.

అతిబలసంపన్నుఁ డభిమాని పృథుకాయుఁ
                 డరుణనేత్రుఁడు క్రోధి యతులతేజుఁ
డతివిశాలంబగు నాస్యంబు వక్షంబు
                 గలవాఁడు వక్రోక్తి బలుకువాఁడు
ఆర్ద్రదేహుఁడు నీతిశాలి గభీరుండు
                 బవిరిగడ్డమువాఁడు బల్లిదుండు
సాహసాంకుఁడు దాత సత్యవాక్యరతుండు
                 మేరుధీరుఁడు రాగమేదురుండు

గీ.

వళులు గలవాఁడు పొడవగుపాండుమేన
రోమములు చాలగలవాఁడు రూఢిఁజెందు
భద్రపురుషుండనంగ విభ్రమముతోడ
విక్రమార్కుఁడు మొదలగు వీరవరులు.


తా.

ఎక్కువబలము అభిమానమును, విరివియైనదేహమును, ఇంచుకయెఱు
పగుకండ్లును, క్రోధత్వమును, ఎక్కువతేజస్సును విశాలముగల ముక్కును ఱొమ్మును
గలిగియుండుటయు, క్రూరమైనమాటలును, చెమటపట్టుదేహమును, నీతి గలిగి
యుండుటయు, గంభీరము గలిగియుండుటయు, గుండ్రమైనగడ్డమును, మిక్కిలి
బలమును సాహసమును గలిగియుండుటయు, దాతృత్వమును, నిజము మాట్లా
డుటయు, ఎక్కువధైర్యమును గాఢమైన అనురాగమును, కడుపుమీది ముడుతలు
ను, పొడవై తెలుపు మించిన పచ్చనిశరీరమున చాలవెంట్రుకలు గలిగియుండు
టయు గలవాడు భద్రుఁడని తెలియవలయును. విక్రమార్కుడు మొదలగువీరు
లీభద్రజాతివారని తెలియంజనును.

కూచిమారజాతి పురుషలక్షణము

సీ.

సమబలుఁ డతిఖర్వుఁ డమలనేత్రుఁడు కామి
                 ద్యూతపరుండు నిమ్నోదరుండు
అతినీలవర్ణుండు మతిశాలి తంత్రజ్ఞుఁ
                 డధికమత్సరి మూర్ఖుఁ డల్పరతుఁడు
మర్యాదలేమి సమ్మతముగానియతండు
                 పరనిందరతుఁడు నిష్కరుణుఁ డెపుడు
ఇంగితజ్ఞానవిహీనుండు మత్సర
                 గ్రస్తుండు కఠినవాక్భాషణుండు


ఆ.

సంతతంబు తనదు సంస్తుతికలరెడి
స్వార్థపరుఁడు పరహితార్థవైరి
నాస్తికుండు కోపి ప్రస్తువాక్యుండు
కూచిమారుఁ డనఁగఁ గొమరుజెందు.

తా.

సమానమగుబలమును, మిక్కిలిపొట్టిదనమును, తెల్లనికండ్లును, జూద
మాడుటయం దాసక్తియు, ఎత్తగుపొట్టయు, మిక్కిలినల్లనిరంగుగల దేహమును,
ఇచ్చవచ్చినట్లు జిత్తుల పన్నుటయు, ఎక్కువక్రోధమును, తెలిసితెలియనితన
మును, కొద్దిసంభోగమును, ఇతరులను సన్మానించుటయం దనిష్టమును, ఇతరులను
నిందించుటయు, కరుణలేకయుండుటయు, పొందినమేలు మరచుటయు, ఈర్ష్య
కలిగియుండుటయు, కఠోరమగుమాటలును, ఎల్లప్పుడు తన్ను స్తుతించుకొనుట
యందు ప్రీతియు, ఇతరులకు మేలుకలుగుకార్యములయం దిష్టములేక అపకారిగా
నుండుటయు, నాస్తికత్వమును, కోపమును, మిక్కిలిస్తుతించు స్వభావముగల మాట
లును గలవాడు కూచిమారుడని తెలియందగినది.

పాంచాలపురుషుని లక్షణము

సీ.

అతికరుణాశాలి యతిధర్మనిష్ఠుఁడు
                 ప్రియవాది మితభాషి ధీరహితుఁడు
నిండుచందురునవ్వు నెమ్మోముగలవాఁడు
                 వెడఁదకన్నులవాఁడు వినుతయశుఁడు
ఆజానుబాహుండు రాజలక్షణశాలి
                 మత్తమాతంగసమానయాయి
నిమ్మపండువితాన నెమ్మేనుగలవాఁడు
                 మంజుభాషయుతుఁడు మానధనము


ఆ.

కలుగువాఁడు మేను చులకనగలవాఁడు
సత్యకర్మరతుఁడు సత్యవాది
విక్రమించునెడను వీరాధివీరుండు
పూతచరితుఁ డార్యపూజితుండు.


గీ.

దేవతాగురుపూజలఁ దేలువాఁడు
ఏకపత్నీవ్రతుఁడు వివేకశాలి
దానమును నుబ్బు విద్యయుఁ దనరువాఁడు
పురుషవర్యుఁడు పాంచాలపురుషుఁ డగును.


తా.

ఎక్కువకరుణయు, ధర్మాచరణమునం దిష్టమును, ప్రియమై మితమైన
మాటలును, వెఱపరులకోర్కెను నెరవేర్చుటయు, పున్నమచందురు నెకసక్కె

మాడుమొగమును, విశాలమైనకన్నులును, వినుతింపదగిన కీర్తియు, దీర్ఘమైన
బాహువులును, రాజలక్షణములచే నొప్పుటయు, మదించినయేనుగువలె నడకయు,
నిమ్మపండువలె శరీరచ్ఛాయయు, మంచిమాటలును, మర్యాద కాపాడుకొనుటయు,
చులకనయగు శరీరమును, సత్కర్మలయందును సత్యవాక్పరిపాలనమునను ప్రియ
మును, ఎదుర్కొనునెడల వీరులలో నగ్రగణ్యత్వమును బొందుటయు, పరిశుద్ధ
మగు చరితము గలిగియుండుటయు, పెద్దలచే పూజింపబడుటయు, దేవగురుపూజల
నొనర్చుటయు, ఒక్కభార్యతో నుండుటయే వ్రతముగా గలిగియుండుటయు,
ధర్మమును, సంతోషమును, విద్యయు, కలిగియుండుటయు పాంచాలజాతి
పురుషుని లక్షణములని తెలియందగినది.

దత్తుని లక్షణము

సీ.

అలసుఁడు మత్సరి యతిశయధృతిమంతుఁ
                 డల్పబలుండు మిథ్యాగుణుండు
అతిదంభయుతుఁడు విహారశీలుఁడు కామి
                 కుటిలచిత్తుఁడు రక్తకుంతలుండు
అతికృశదేహుండు వితతాధరాంగుండు
                 కూచిగడ్డమువాఁడు కుత్సితుండు
చెక్కుల వెన్నునఁ జేతుల రోమముల్
                 మొలవనివాఁడు సమున్నతుండు


గీ.

మఱపుగలవాఁడు చింతల మలయువాఁడు
కర్కశాంగుఁడు దుర్నీతి గలుగువాఁడు
కృపణచిత్తుండు మందుండు విపులకేశి
దత్తుఁ డని పల్కఁబడియె సమ్మతముగాఁగ.


తా.

సోమరితనమును, మాత్సర్యమును గలిగియుండుటయు, కొద్దిబలమును,
గుణములేమియు, మిక్కిలికపటమును, వేడుకగా దిరుగుటయం దిష్టమును, కాముకత్వ
మును, కుటిలస్వభావమును, ఎఱ్ఱనివెంట్రుకలును, మిక్కిలి కృశించినదేహ
మును, పెద్దపెదవియు చిన్నగడ్డమును కుత్సితస్వభావమును, చెక్కులను వెన్ను
నను చేతులయందును రోమములు మొలవకయుండుటయు, సాధారణమైనయెత్తును,
మఱపుజెందుటయు, కోర్కెలతో తపించుటయు, కఠినమైన అవయవములును,
దుర్నీతితో ప్రవర్తించుటయు, కుత్సితమును, మూర్ఖత్వమును, విరివియైనవెంట్రు
కలును గలవాడు దత్తుడని తెలియందగినది.

అధికాధికరణము సంపూర్ణము

నఖచ్ఛేదాధికారః

అష్టమః పరిచ్ఛేదః

నఖక్షతస్థాన సమయలక్షణము

శ్లో.

కక్షాకరోరుజఘనస్తనపార్శ్వపృష్ఠహృత్కన్ధరాసు నఖరాః ఖరవేగయోః స్యుః।
ఆప్యన్యయోర్నవరతే విరతే చ మానే పుష్పే మదే ప్రవసనే విరహే ప్రయోజ్యాః॥


చ.

కరములు నూరుయుగ్మములు కక్షములు న్గటిపార్శ్వపృష్ఠకం
ధరహృదయస్తనద్వయవితానము తానఖరక్షతాళికిన్
విరహవిదేశయాన నవవిభ్రమకోప మతిప్రమత్తలన్
నరు లతిచండవేగమున నాటరు మార్దవ మాచరింపుచున్.


తా.

చేతులు, తొడలు, చంకలు, గజ్జలు, పక్కలు, పిఱుదులు, మెడ,
ఱొమ్ము, చన్నులు, యివి నఖక్షతము లొనరించుటకు స్థానములు. విరహిణి చాలదూ
రము నడచినస్త్రీ భ్రాంతిపొందినస్త్రీ కోపముజెందినస్త్రీ ముట్టయినస్త్రీ మద్య
పానాదులచే మత్తుగొనియున్నస్త్రీ వీరలను పురుషులు చండవేగమున నఖక్షతములు
చేయక మృదురీతిం జేయంజనును.

నఖక్షతగుణ లక్షణము

శ్లో.

సాత్మ్యేన వా రదవిధేరపి నిర్ణయో౽యం
                        ప్రత్యగ్రభూరిశిఖరా అతిచండయోః స్యుః।
వర్ధిష్ణుతామలినతామృదుతోజ్జ్వలత్వం
                        నీరేఖతా౽స్ఫుటితతేతి గుణా నఖానామ్॥


వ.

 స్త్రీపురుషులు దేశసాత్మ్యగుణానురాగంబులచే నిపుడెన్నంబడు కారణంబు
లకు స్థానంబుల నెఱింగి నఖదంతక్షతములు రచింతురు. అవి చండవేగ మంద

వేగములచే స్త్రీపురుషు లుపయోగించుటవలన దంతనఖంబులచే కలిగిన వ్రణములు
వర్ధిష్ణుత=వృద్ధిపొందుస్వభావము గలదియు, అమలినత=మాలిన్యము కానిదియు,
మృదుత=కఠినముగా నుపయోగింపనిదియు, ఉజ్జ్వలత=కాంతి గలదియు, నిరే
ఖత=గీఱ లేనిదియు, అస్ఫుటిత=స్పష్టముగా కనుపించనిదియు, అని యారు
విధంబుల వాడబడుచున్నవి.

నఖక్షతనామములు

క.

ఛురి తార్ధచంద్రమండల
శరశిఖిపద కుముదపత్త్ర శశకప్లుతముల్
వరుసగ నామము లయ్యెను
బరికింపఁగ నఖము లొత్తు ప ట్లెఱిఁగింతున్.


తా.

ఛురితము అర్ధచంద్రము మండలము మయూరపదకము శశకప్లుతము
కుముదపత్త్రము యని నఖక్షతవికారము లారయ్యె తల్లక్షణంబు లెఱింగించెద.

ఛురితనఖక్షత లక్షణము

శ్లో.

అవ్యక్తరేఖమణుకర్మ నఖైః సమస్తై
                        రోమాంచకృచ్చటచటాధ్వనియోజితాస్తమ్।
అంగుష్ఠజాగ్రనఖతాడనతో నఖానాం
                        గండస్తనాధరగమాచ్ఛురితం వదన్తి॥


ఉ.

అన్నినఖంబుల న్వ్రణము లంటఁగనియ్యక మీఁదమీఁదనే
సన్నముగా గగుర్పొడువఁ జప్పుడుగాఁగ రచించి వీఁకపు
న్జన్నులసందున న్నగవు చల్లెడుచెక్కులఁ బెద్దవ్రేలిపై
నున్ననఖంబున న్గదియనొక్కుటబో ఛురితంబు నాఁబడున్.


తా.

పైన చెప్పియున్న నఖక్షతస్థానములగు స్త్రీయంగములయందు పురు
షుడు తన అయిదుగోళ్ళచేతను అంటీఅంటనటుల పైపైననేే శరీరము జలదరించు
నటుల జేసి చనులసందునను చెక్కులసందునను తనపెద్దవ్రేలిగోరుతో నొక్కు
నదియే ఛురితమనబడును.

అర్ధచంద్ర మండలక మయూరపాద నఖక్షతముల లక్షణము

శ్లో.

వక్త్రోర్ధచన్ద్ర ఇతి యత్ స్తనకాన్ధరాంక
                        స్తౌ సంముఖౌ వదతి మండలకం మునీంద్రః।
స్థానం చ తస్య భగమూర్ధకకున్దరోరు
                        ద్విత్యందుశోపరిత ఏవ లిఖన్తి రేఖామ్॥


శ్లో.

అంగుష్ఠజం నఖమధో వినివేశ్య కృష్టైః
                        సర్వాంగుళీకరరుహైరుపరి స్తనస్యః।
యచ్చూచుకాభిముఖమేత్య భనన్తి రేఖా
                        స్తద్జ్ఞా మయూరపదకం తదుదాహరన్తి॥


సీ.

భగముమీఁదను గండభాగంబు తొడలను
                 చంద్రార్ధకంబుల స్థానము లగు
చంద్రార్ధకంబులు సంగతంబై రెండు
                 నభిముఖంబై కొనలదికెనేని
మండలకం బయ్యె మఱి తత్ప్రమాణంబు
                 నై యుండు రెండుమూఁడంగుళములు
పెనువ్రేలిగోటిని జనుగవక్రిందుగా
                 నూది తక్కినగోళ్ళు మీఁద నునిచి


గీ.

చంటికొనదాఁక రేఖపై సాఁగదివియ
కామశాస్త్రోక్తసరణిచేఁ గలుగు సురత
ముగ్గడింతురు దీని మయూరపాద
మనుచు నిది సేయుచుంద్రు బాహ్యాంతరముల.


తా.

పురుషుడు స్త్రీయొక్కభగముమీదను కంఠముమీదను తొడలమీ
దము తనగోరుతో అర్ధచంద్రాకృతిగా నొక్కునదియె అర్ధచంద్రము. పురుషుడు
స్త్రీయొక్క పైనజెప్పినస్థానములయందు రెండుగోళ్ళచేత నభిముఖముగా కొనలు
అతుకుకొనునటుల నొక్కునదియె మండలకమగును. పురుషుడు స్త్రీయొక్క
చంటిక్రిందభాగమున పెద్దవ్రేలిగోరు నుంచి మీదిభాగమున నాలుగువ్రేళ్ళగోళ్ళు
నుంచి చంటిమొనవరకు గీఱునదియె మయూరపాద మనంబడును.

శశకప్లుత కుముదపత్త్రనఖక్షతముల లక్షణము

శ్లో.

సర్వైః శశప్లుతమిదం కరజైః కుచాగ్రేహ్యన్వర్థముత్పలదళం స్తనగుహ్యపృష్ఠే।
రేఖా ఘనాస్త్రీచతురా జఘనేస్తనే వా స్మర్తుం ప్రవాసగమనే విధదుర్విదగ్ధాః॥


క.

అన్నినఖంబులు భామిని
చన్నులపై విటుఁడు నాట శశకప్లుతమై
యెన్నంబడు రమణీమణి
కిన్నియుఁ దముఁదలఁచుకొఱకు హేతువు లగుటన్.


తా.

పురుషుడు తన్ను తలంచుటకుగాను స్త్రీయొక్క చన్నులపై తన
యన్నిగోళ్ళచేతను నాటునటుల నొక్కుటయే శశకప్లుత మగును.


క.

వలిచన్నుల జఘనంబున
నడివీపున మూఁడునాల్గు నఖరేఖ లొగిన్
నిలుపుదురు కుముదపత్త్రం
బులక్రియఁ దముఁబాసిచనఁగ బూర్వస్మృతికై.


తా.

పురుషుడు స్త్రీయొక్క చన్నులు పిఱుదులు వీపు వీటియందు స్త్రీ
యెడబాసినపుడు తనను దలంచునిమిత్తము గోళ్ళతో కలువరేకులవలె మూడు
నాలుగు రేఖలుగా గీఱునదియె కుముదపత్త్రం బనంబడును.

ఇతి శ్రీకొక్కోకకృతే రతిరహస్యే
నఖచ్ఛేదాధికారో
నామాష్టమః పరిచ్ఛేదః

దంతచ్ఛేదాధికారః

నవమః పరిచ్ఛేదః

దంత నఖక్షతముల లక్షణము

శ్లో.

స్నిగ్ధిత్విషః శితనఖానతిదీర్ఘఖర్వా
                        రాగస్పృశ్యః సమఘనా దశనాః ప్రశస్తాః।
అన్తర్ముఖోత్తరరదచ్ఛదనేత్రవర్ణం
                        స్థనేషు చుంబనవిధిః కథితేషు యోజ్యః॥


చ.

ఘనములు గాక స్వల్పములు గాక వినిర్మలకాంతిఁ బోల్చి క్రో
న్మొనలను వాఁడి గల్గి పలుమొగ్గలు తెల్లన మోవి యెఱ్ఱనై
తనరు రదంబు లివ్విధపు దంతనఖక్షతము ల్ఘటింపుఁడీ
యనయము నుత్తరోష్ఠనయనాననము ల్దొలఁగించి యన్నిటన్.


తా.

గొప్పయు కొద్దియు గాక ప్రకాశముగాను కొనలయందు పదును
గలిగి పలుమొనలు లేక కొంచెము యెఱ్ఱనైయున్న దంతనఖములచేతను మీదిపెదవి
కన్నులు, ముఖము, వీటినిగాక మిగిలినస్థానములయందు దంతనఖక్షతము లొనర్ప
వచ్చును.

గూఢక, ఉచ్ఛూనక, ప్రవాళమణి దంతక్షతముల లక్షణము

శ్లో.

రాగైకలింగమధరే కిల గూఢకం స్యా
                        దుచ్ఛూనకం దశనవాససి వామగండే।
స్యాత్పీడనాత్తదధరోష్ఠవిశేషయోగా
                        త్తత్ర ప్రవాళమణిరభ్యసనేన సాధ్యః॥

ఉ.

అనుచు వాతెర న్గుఱుతు లంటఁ గలంచిన గూఢకం బగున్
మానుగ వామగండరదనచ్ఛదము ల్గదియంగఁ జేర్ప ను
చ్ఛూనమగు న్బ్రవాళమణి చొప్పడు దంతగళాధరోష్ఠసం
స్థానవిశేషయోగకృతసంభృతమౌ రదనక్షతం బగున్.


తా.

పురుషుడు స్త్రీయొక్క క్రిందిపెదవిని చుంబించుచు పంటిచే గురుతు
లంటునటుల నొక్కునది గూఢక మనబడును. పురుషుడు స్త్రీయొక్క యెడమ
చెక్కిలియందు పంటిచేత నొక్కునది ఉచ్ఛూనక మగును. పురుషుడు స్త్రీయొక్క
క్రిందిపెదవిని చెక్కులను పంటిచేత నొక్కునది ప్రవాళమణి యనంబడును.

బిందువు, బిందమాలదంతక్షతముల లక్షణములు

శ్లో.

మధ్యే౽ధరం తిలశ ఏవ విఖండనే స్యాద్
                        బిన్దూ రదద్వయకృతే సకలైః కృతేతు।
స్యాతాం శితాగ్రదశనైర్మణిబిన్దుమాలే
                        కక్షాలలాటగళవక్షణభూషణే తే॥


ఆ.

పెదవినడుమ నొక్క బిందువు నిల్పిన
బిందువంబు గాఁగ నంద మయ్యె
నళిక కక్ష గళము లందున రదములు
చాల మోప బిందుమాలి కయ్యె.


తా.

పురుషుడు స్త్రీయొక్క క్రిందిపెదవినడుమ నువ్వుగింజవలె రెండు
పండ్లచేత నొక్కునది బిందు వనంబడును. పురుషుడు స్త్రీయొక్క నుదురు, చంక,
గళము, వీటియందు అన్నిపండ్లచేతను నొక్కునది బిందుమాలయని తెలియందగినది.

ఖండాభ్రక, కోలచర్వితదంతక్షతముల లక్షణము

శ్లో.

ఖండాభ్రకం స్తనతటే దశనాగ్రలేఖ్యం
                        స్యాన్మండలాకృతియుతం విషమైశ్చ కూటైః।
తామ్రాన్తరా రదనరాజిరఖర్వసాన్ద్రా
                        స్యాత్కోమలచర్వితమియం స్తనపృష్ఠభూషా॥

క.

వాటపుగుబ్బలసందున
నాటిన ఖండాభ్రకంబు నామం బయ్యెన్
గాటముగఁ బండ్లు నాఁటిన
ధాటిగ నది కోలచర్వితం బనఁ బరఁగున్.


తా.

పురుషుడు స్త్రీయొక్క చన్నులసందున పండ్లచేత నొక్కునదిటయె ఖం
డాభ్రక మనంబడును. పురుషుడు స్త్రీయొక్క చంటివెనుకప్రక్కను దట్టముగా
పండ్లచేత నొక్కునది కోలచరిత్వ మనంబడును.


క.

జాతిస్వభావచేష్టిత
చాతుర్యగుణేంగితాదిసంపూర్ణకళా
న్వీత శుభమూర్తివైభవ
నీతిసురాచార్యవైరినృపహతశౌర్యా.

ఇతి శ్రీకొక్కోకకృతే రతిరహస్యే
దంతచ్ఛేదాధికారో నామ
నవమః పరిచ్ఛేదః

గద్యము
ఇది శ్రీమదష్టభాషాకవితాప్రవీణ నవఘంటాసుత్రాణ మాచనామాత్యపుత్త్ర
సుజనకవిమిత్త్ర సజ్జనవిధేయ యెఱ్ఱయనామధేయ
ప్రణీతంబైన కొక్కోకంబను గళాశాస్త్రంబునందుఁ
బ్రథమాశ్వాసము సంపూర్ణము