యోగాసనములు/ఉపోధ్ఘాతము

ఓం

శ్రీ గురుభ్యోనమః

ఉపోద్ఘాతము

ఈ భరత భూమి పరమ పవిత్రమైనది. ఇందు వేదములు ఉద్బవించినవి. శాస్త్రములు ప్రభవిల్లినవి. ప్రపంచము నందలి సర్వ జ్ఞానము సనాతన భారతి యందు మూర్తీ భవించినది. ప్రపంచనమునకు సున్నను ప్రసాదించి గణిత శాస్త్ర పురోభి వృద్ధికి దోహదజు చేసినది భారతీయ మహర్షులు.భూగోళ మందలి ఎక్కువ భాగములోని ప్రజలు కండ్లు పూర్తిగా తెరువని కాలము నాడే ఇచ్చట ఎన్నో శాస్త్రములు, కళలు వెల్లి విరిసినవి. తన చుట్టూ నున్న వాఅతావరణమును విపులంగా తెలిసి కొనుటతో పాటు తనను గూర్చి ఎక్కువగా తెలిసి కొనినాడు సనాతన భారతీయ మహార్షి. తన యొక్క భౌతిక శరీరము,దానిని అనుసరించి యున్న సూక్ష్మ కారణ శరీరముల గురించి చాల వివరముగా తెలిసి కొన్నాడు. నక్షత్ర శాస్త్రము, కాంతి వేగమును, కాంతి సంవత్సరములను గూర్చి వివరముగా గ్రహించినారు భరత ఋషులు, భరత భూమి రత్న గర్భ కూడ. దీని యందలి రత్న రాసులపై విదేశీయులకు కన్ను పడింది. కొంత కాలమునకు దేశమందలి రాజ్యములు ఏలు రాజులలో ఐకమత్యము సన్నగిల్లుట తెలుసుకొని పర దేశీయులు దండెత్తి ఒకొక్క రాజును జయించి వారి రజ్యములను స్థాపించిరి. కొంత కాలమునకు దేశ మంతయు పర రాజుల పాలన లోనికి పోయినది. విదేశీయులు రత్న రాసులను తరలించు కొని పోయిరి. వారితో పాటు జ్ఞాన భాండాగారములైన విలువైన గ్రంధములను కూడ తరలించు కొని పోయిరి. గొప్ప గ్రంధములను పారశీక, గ్రీకు, చీని భాషలలోనికి అనువదించు కొనిరి. మనకు కూడ స్వదేశీయ నాగకత యందు అభిమానము సన్నగిల్లినది. కూటికి కొరకు విదేశీయులకు తొత్తులై బానిసలుగా బ్రతుకుటయందే అభిరుచి వృద్ధి యైనది. రామాయణ కాలము నాటి కన్నా పూర్వమున వెలిసిన వేదముల యందు ఖగోళ శాస్త్రము చర్చింపబడి యుండగా నేటి వైజ్నానికులు నక్షత్ర శాస్త్రమున మారే యితర శాస్త్రముల యందు భారతీయ ప్రతిభ గురించి ముచ్చటించరు. గ్రీకులు, రోమనులు, పారశీకులు, చైనీయులు ఆయా శాస్త్రమున కృషి చేసినట్లు చెప్పచున్నారే కాని భారతీయుల సంగతి ముచ్చటింపరు. వేదములకు కాలమును నిర్ణయించలేనిది. అట్టితరి వేదవ్యాసుని కాల నిర్ణయము చేసి వేదములు రెండు వేల సంవత్సరముల నాటివని నిర్ణయించు చున్నారు. ఇదంతా మన బానిస ప్రవర్తనను అలుసుగా తీసుకొని చేయుచున్న అన్యాయము, అవమానము. స్వాతంత్య్రము పొందినా రక్తములో ఎనిమిది వందల సంవత్సరముల నుండి అనుబ్ హవించిన బానిస ప్రవృత్తి ప్రవేశించి నందున మనకు కలుగు తున్న హానిని, ప్రపంచములో మనకు జరుగు చున్న అన్యామనును నివర్తించుటకు నేటికయినా మన ప్రభుత్వము పూనుకొన లేదు. వేదములను ఐదు వేల సంవాత్సరములకు పూర్వమున కృష్టద్వైపాయనుడను వ్వాస మహరషి సంకలనము చేసినారు. అంతకు ముందే అన్నడో నిర్ణయించ లేని కాలముననే వేదములుద్బవించినవి. వేదములను, మరి కొన్ని శాస్త్రములను సనాతన ఋషులు సమాధి స్తితి నుండి విని వాటిని కంఠస్తము చేసి కొంత కాలమునకు గ్రంధ రూపమున సంకలనము చేసినారు. ఓ భారతీయుడా నీ పూర్వులు చాల విజ్ఞాన వంతులు, శక్తి సంపన్నులు, అని తెలియ చేసినచో బానిస సంకెళ్ళను త్రెంచుకొని స్వతంత్రము, స్వేశ్చలను కోరుదురని విదేశీయులు అభిప్రాయపడి మన గొప్ప తెలుసుకొననీయని విద్యను మనకు గరపినారు. భావ స్వాతంత్ర్యమును కూడ మరచిన మనను వారికి అనుకూలమైన బానిసలుగా తయారు చేసి, కొందరిని ఎన్నుకొని వారికి బిరుదులను ప్రసాదించినారు. కాలము పస్రిపక్యమైనది. ఎన్నో ఇడుముల నడుమ ఎందస్రెందక్వ్రో ల్త్యాగధనులు తమ శరీరములను విదేశీ రక్కసుల తుపాకి గుండ్లకు బలి యెసగి ఎట్టకేలకు స్వాతంత్ర్యమును సముపార్జించినారు.

వేదములకు వలెనే యోగ శాస్త్రము కూడా అతి ప్రాచీనమయినది. దాని కాలమున కూడ నిర్ణయింప వీలు లేనిది. వేదముల యందు, ఉపనిషత్తుల యందు, మహా భారత మందలి భగవద్గీత యందు, యోగ శాస్త్రము వివరముగా చర్చింప బడినది. పతంజలి మహర్షి యోగ దర్శనమిఉను సూత్రీకరించి యోగ సూత్రములను రచించెను. మరియు మత్యేంద్ర నాధుడు, గోరక్ష నాధుడు, స్వాత్మారామ యోగి, వీర బ్రహ్మేంద్ర స్వామి, వంటి యోగి పుంగము లెందరో ఈ యోగ విద్యను ప్రచారము లోనికి తీసుకొని వచ్చిరి.

విదేశ నాగరికతా వ్యామోహము చేత, దేశీయ శాస్త్రములు విద్యలయందు నిర్లక్ష్య భావము చేత మాటున పడి పోయెను. ఆధునిక కాలములో ఈ యోగ విద్య వలన మనసునకు శాంతితుష్టి, పుష్టి కలుగునని విదేశీయులు ఎగ ప్రాకుటవలన మన దేశములో మరల లూపిరి పోసినొని తెప్పరిల్లనది. ఇప్పటి కైనను మత్తును వీడి దేశీయ విద్యల ల్యందు శాస్త్రముల యందలి ఘనతను పర దేశీయులు పొగడకముందే సనాతన ఋషులు మనకు అందించిన జ్ఞానమును గ్రహించి ఇహ, పర లాభములను పొందగలరని ఆశించుతూ దార్శనిక గ్రంధ రచనకు పూనుకొని యుంటిని. పాఠక మహాశయులు సనాతన మహర్షుల చేత అందించబడి, ఈ గ్రంధమందు పొందు పరచ బడిన మంచినీ అనుభవించెదరనియు ఎచటనైనా పొరపాట్లు దొర్లిన అవి నా దగుట చేత దయతో తెలియ చేయగలరని సవినయముగా మనవి చేసుకొను చున్నాను.