యెంకి పాటలు/ఒకటి రెండు మాటలు

ఒకటి రెండు మాటలు

శ్లో. యదిసంతి గుణాశ్శ్లాఘ్యాః వికసంత్యేవతే స్వయమ్,
నహి కస్తూరికామోదః కపటే న నివార్యతే.__

అని యొకానొక మహాకవి చెప్పినట్టులు, మృదుమదురరసార్ద్రములయి, సహజకోమలములను భావనామాత్రసంవేద్యములును నైన కవికుమారుల కవితా కల్ప ప్రసూనములందలి పరిమళలహరులు స్వయముగఁ దమంతతామే సమస్త దిగంతములను సయితము వ్యాపించి, విశ్వవ్యాప్తములును విబుధజనశ్లాఘ్యము లును నై విలసిల్లుచుండగా, నందలి గుణవిశేషములను సహృదయులసన్నిధి నెఱుకపఱచుటకై నావంటి పరిమిత ప్రజ్ఞుని పరిచయవాక్యము లంత నవసర ములు కావని తలంచుచున్నాను. ఏలయందురా ? - మందారప్రసూనములలోని మకరందమాధుర్యమునుగ్రోలి సొక్కుటకు మిళిందకుమారునికి ఎవ్వరు పరిచయ మును గలిగించిరి ? మలయచందనమందలి శైత్యసౌరభ్యముల కుబ్బి తబ్బిబ్బై వానిని లోకమునందెల్లయెడల నింపదివిరిన దక్షిణానిలాంకూరమున కేసుధీవరుని పరిచయవాక్యములు ఉద్దీపనమును గలిగించినవి ? అట్లే ప్రస్తుతము ప్రకటిత ములై భావుకలోకము సన్నిధిని ఆర్పింపఁబోవుచున్న యీ వెంకిపాటలనెడి ప్రేమపూతములగు కవితాకల్ప ప్రసూనముల వినయమునందుగూడ నని మనవి. అయినను ప్రస్తుత మాంధ్రలోకమునందు తక్కిన యన్ని యలవాటులతోఁ బాటు, ఎంతటి తేనెవాకలనూరించు సరసకావ్యమునకైనను ఏవో ఒకటి రెండు మాటలు పీఠికాకృతిని గ్రుచ్చవలసియుండుట యాచారమైపోవుటచేత, నందు లకు విధేయులమై ఒకటి రెండు మాటలను యిచ్చట మనవిచేయ సాహసించితి మేగాని ప్రజ్ఞాపారమ్యమునుబట్టిమాత్రము కాదు.

వెంకిపాటలు ఈ ఇరువదవ శతాబ్దిని మన యీ ఆంధ్ర వాఙ్మయకల్పశాఖికను ప్రసవించిన సర్వాంగపరిపూర్ణ పరిణతీవిలసితంబులగు దివ్య ప్రసూన రాజములు గాని, ఫూపబెడంగుల పచరించు పసరు మొగ్గలు కావు. బ్రహానంద సహోదర మనియు, నవాఙ్మానసగోచరమనియును, నిర్వచించు రసస్వరూపమును - పండితులకు సైతము రూపింపశక్యముగాని రసస్వరూపమును-భావనాశక్తిగల ప్రతివారికిని గోచరమగునట్లు మూ ర్తీభవింపజేసిన అమృతఘటికలుగాని అన్యములు కావు. దివ్యతాపూర్ణములగు భావనాసీమలందు ప్రయత్న విశేనమున ప్రోదిసేయఁబడిన ప్రాభవసంపనల చెన్నలరారు పువ్పురాజములు కాని, అంతంతమాత్రపు ఆరవిరులెన్నటికినిఁ గావు. ఆంధ్ర సరస్వతీపాదపీఠికయందు-భక్తిభరితమగు నభినివేశముతో-ప్రేమపూతములగు భావనలతో-సహజము అత్తింపులు చందములు-ముద్దుముచ్చటలతోఁ దీర్చికూర్చి సమర్పించిన దివ్వమహీహసమన్వితములగు కంఠహారముల కూర్పులు"గాని, ఏదో పదాడంబ రమతో ఆcదతుకులతో "నేర్పరుపబడినవిమాత్రము కావు. ఇంతయేల శీప్రియ పాఠకులు ఈ పూజా కుసుమములలో "సేయొకి దానిని జిత్తగించినను ఈ నా మాటలు అతిశయోక్తులు ఎంతమాత్రమును కావని యెఱుంగగిల్లు టయేగాక అనంతములు ననుభవైక వేద్యములు నగు రసశామణీయకతలను, అమంద మకి రంద లలితములై దివ్యసౌరభ సురభితములై చిత్ర విచిత్ర వృత్త విలాస భౌసురమలై యొప్ప కవితావిలాసములను చిత్తగించి ఆనందింప గలగుదురనుట నిక్క-ము. మన ఆంధ్రసారస్వతోద్యానవాటికిలయం దింతవరకు చాలవరకును ప్రౌడ ప్రబంధరీతులతోను జటిలపదబంధములతోను ఘనములగు వృత్తబంధురతల తోను విలసిల్లి రసమహితములై యొప్ప ఉన్నతవృక్షరాజము లేస్నెన్నియో వివిధ రూపములతోఁ బ్రోదిసేయబడిన వనుటయు, అయ్యని యన్నియును యధాశక్తి సౌరభపూర్ణములగు కుసుమఫలాదికమును ప్రసవించుచునే యున్న వనుటయునుకూడ సత్యేతరము కాదు. కాని (పండితపామరసాధారణముగా జనసామాన్యము ఆస్వాదించి తనిసి తమంత తాము గానముచేసి ధన్యతం "గాంచుట కనువగురీతిని -- లాలిత్య సౌకుమార్య సౌందర్య సౌరభ్యములను పెదజల్లు మంజరులుగల పూవుఁబొదలంతగా ప్రోదిసేయబడి యుండలేదు, అట్టి లోపమును తీర్చుటకై ఆధునికి యుగమునందలి కవితోద్యానపాలకు లగు కవికుమారులు పెక్కురు నడుములుగట్టి రాత్రిందివములు పరిశ్రమచేసి ఆఫూఁ బొదలను దిద్దితీర్చి-అపూర్వములగు నందములలో నలంకరించి–ఏమాత్రముకూడ వన్నెయంను వాసియును కొeeవడనీయకుండ విలసిల్లజేసి సార్వజనీనతి S6 గూర్చుచున్నాయ. వీరి యీ యుద్యమము బుద్ధమును సమృద్ధమునై గార గల సూచనలు గన్పించుట మిగుల ప్రశంస్య ము.

ఈవిధముగాఁ బ్రస్తుత కాలమున మన యాంధ్రసారస్వతోద్యానపు సార్వ జనీనశోభాభివృద్ధికై పాటుపడుచున్న తరుణకవికుమారకులలో శ్రీయుతులగు నండూరి వేంకటసుబ్బారావు పంతులు (బి.ఏ.) “గారును నొక్కరు. వీరు తక్కిన కవి ప్రపంచమువలెగాక తమ శుశ్రూషాంజలులను భిన్నమార్గముల నాంధ్ర వాగ్గేవిసన్నిధి నలంకరించుచున్నారు. సుబ్బారావుగారు ఆంధ్రజాతికి సహజమలై - శ్రావ్యములై - సాంప్టనింపగల మృదుమధుర గేయములలో ఆందునను నేడు వాడుకలో - వ్యవహారములోనున్న - జీవద్భామలో వేంక్షి నాయుడుబావలు దాంపత్య పూతిమలును భావోన్నతములును ముగ్ద ముగ్దములును అగు ప్రణయగాథలను గానము సేయుచున్నారు, నిజముగా పెంకి నాయుడుబావ లనే నాయకు లున్నారో, లేక వారు కవి పోల కల్పితులో చెప్పజాలకున్నను-వెంకి పాటలను వినునప్పడు మాత్రము, శ్రోతలు-తన్మయతనుజెంది తమతమ భౌవనావీదులలో-రసమయమూర్తలగు వెంకి నాయుడుబావలను తప్పక గాంచిగల్గుదురు. ఒక్క కాంచుట మాత్ర పేునా ?- కాంచి-తా మనుభవించిన ఆ యానందమును—మరల నా గీతముల తోనే-అనువాదరూపమున వెల్లడింపని సహృదయ శిరోమణి యుండుటయు హడ గానము వెంకి పాటల యందింతటి మహత్త్వము గలుగుటకు తజ్జనకు లగు వేంకటసుబ్బారావు పంతులుగారి రసానుభవవ్యగ్ర మగు హృదయ పరిణామ పేశలతయును, లోకజ్ఞతయును ముఖ్యములగు కారణములని నాకు గల నమ్మకము. తత్త్వాన్వేమణముఁ జేసినచో మనవాజ్మయమునందలి గేయవిభాగముకూడ నిదివఱకే చక్కెగ దిద్ది తీర్చబడినది. మహాకవిశిరోమణు లనందగిన క్షేత్రయ్య కవి, రామదాసును, వరదరాజు తాడంకివారు, ఏగంటివారు మున్నగు గేయ కవులు-తీపర్ o గాసదృూరలుగల వాగ్దారలతో -ప్రేమ భ క్లి-తత్వముల నమృతంపువాహినుల బ్రవహింపఁజేసి ధన్యతం "గాంచియే యున్నారు. అమృతంప రసవాహినులఁబారించి వారు ప్రోదివేసిన ప్రణయవల్లికలు నాంధ్ర హృదయసీమల నల్లిబిల్లిగ నల్లుకొని వూచి ఫలించి తత్సౌరభములచే నిప్పటికిని మన కుల్లాసము గల్పించి శాశ్వతత్వము నందించుచునే యున్నవి, కాని వారు ప్రోదిసేసిన ప్రణయవల్లికాప్రసూనములు సన వెంకినాయుడుబావల ప్రణయ వల్లికలవలె విశుద్ద ప్రేమభరితము లై నట్టివి గాక భక్తితత్త్వాద్యన్యాన్యతర జాతు లతో సమ్మిశ్రణమును గాంచినట్టివి. మతయు వారు సేకరించిన ప్రనూసరాజ ముల సౌరభములు అద్వితీయమగు దార్శనికి విభవముగల యే కొలదిమంది ప్రజ్ఞా 'నిధులకోగాని తక్కిన సాధారణజనమునకు పూర్ణముగా నాస్వాదింప వీలుపడ నట్టివి. ప్రస్తుతము మన వేంకటసుబ్బారావుగారు సేకరించిన వెంకి నాయుడు బావల ప్రణయపూతములగు నీపాటలన్ననో పండితపామర సాధారణముగా-సెల్లవారికిని-యేమాత్రపు భావనాశక్తియున్నను, ఆందికొనుటకు ఆనందించి తనిసి తనియింపజేయుటకును వీలైనట్టివి. నిక్కమగు ప్రేమయును, దాంపత్య భావమును, ధర్మపరతయును యొట్టి యాదర్శములను గలిగియుండునో యను విషయమును, ఈ పాటలంత తేటతెల్లవబ"గా-సాధారణ జనమున కంతటికిని తెల్పగల గేయము లివితప్ప మనలో నితరములు లేవనుట సత్యదూరము కాదు. సుబ్బారావు పంతులుగారు గానము చేసిన యీ పాటలలో భావము కంటెను మున్ముందుగ భాషయును, భాషకంటెనును మున్ముందుగ భావమును, నహ మహమికతో బర్వులెత్తుచుండును. వీయొక్క స్థలమున నైనను వీని గమనము నందు యేమాత్రమైనను కుంటుపడిన దేమోయని యెంతగ. వెదకినను మచ్చునకై నను నాకు అట్టిది యిందు కొనవచ్చుటలేదు. వీరు యీ గేయములందు కూర్చిన పదములుగాని, పదార్థ ములుగాని కొందఅు కొందeు కవితలలోవలె ప్రయత్న విశేమమున నేర్చి తెచ్చి కూర్చిన వెంతమాత్రమునుగాక ప్రతినిత్యమును మన కన్నులయెదుట-క్షణక్షణమును గోచరించుచున్నవే యగుట యెన్నదగిన ప్రధానమగు విశేవము. ఇట్లయ్యను, వాని నీ కవికుమారుడు గేయరూపమున గూర్చి సహృదయలోకి ము సన్నిధిని ప్రదర్శించినప్పడు మాత్రము-యెట్టివారి కైనను “ఔరౌరా?-యని యనిపించునంతటి మహోజ్జ్వలత వీనియందు విల సిల్లి-తత్వభౌవమున శ్రోతల హృదయసీమలు ఒక్క-మాటుగా మిరుమిట్టు గొనుటయును కలుగుచున్నది. భావనాధనులగు ఘనుల కవితలయం దింతటి sక్తిసామర్థ్యము లున్నవి గనుకి నే మన పూర్వికులు శ్లో, తపన పదవిన్యాసా8 వార్థవిభూతయః, తధాపి సవ్యం భవతి కావ్యం గ్రథన కౌశలాత్ -

అని కవిసృష్టిని ఆనంద సరినూచకములగు శిరఃకంపనములతో గారవించి యున్నారు. ఇట్టి ప్రశంస్యతమములగు శక్తిసామర్థ్యముల నలపరచకొనిన కుమారుడు-మన యాంధ్ర వాజ్మయమునఁ బొడసూపటయును-నందునను మనమున్న నీ యిర్వదవ శతాబ్దిని-మన కన్నులయెదుట-మన కవితామతల్లినియీ విధములగు దివ్యప్రసూనముల నర్చించి మనల "నానందసాగరమున నోల లాడించుటయును చూడగల్లిన ననుబోటుల జీవితములు ధన్యములను, ధన్య తపములను-అని యనుటలో నావంతరమును సందియము లేదు. మొత్తముమిూద నింతవజకు నీకవి గానముచేసిన యీ ప్రణయపూతము లగు గేయములు ముప్పదియైదు వరకును గలవు. క్రమవికాసమును భావ పరిణతియునుగల ఈ కవితాప్రసూన గుచ్ఛములో[1] 826-8 సంఖ్యగల పాటలు-[అనఁగా మాయదారి తమ్ముడు, సాటేలా,పడవ-అను శీర్షికలుగల పాటలు] కేవలమును వెంకియొక్క-ప్రణయగాథలకు మాత్రమే సంబంధించినవి కావు. కాని అంతయోయింతయో వెంకి ప్రస్తావనకు అందును చోటు లేక పోలేదు. కనుకనే కాబోలు కవిగారు వానినికూడ నిందు పొందుపరచి యుందురు, కాని మనమా మూఁడు పాటలను పరిగణనమునం దుపేక్షించితి మేని [ఉపేక్షించుటకు మఱొక బలవత్తరమైన కారణముకూడ కలదు. దానిని ముందు నిరూపింతును.] ఈ పాటలకు మనము గుచ్ఛమన్నపేరును వాడుటకెట్టి యభ్యంతరమును లేదు. శ్రీ సుబ్బారావు పంతులు గారి రచన లగు నీ గేయములలో నేయొకదానిని పరీక్షించినను మూఁడు నాల్గు చరణములకన్న నా కృతియందు గ్రంథబాహుళ్యము ఎక్కువగా గోచరింపదు. కాని వానియందే దానియందలి భావసంపదను వివరింపవలసివచ్చినను సంపూర్తిగా వివరించుటకు నలువది పేజీలకుఁ దక్కువగ పట్టనేపట్టదు. ఇది భావుకులెఱింగిన యంశమే కదా?

సాధారణముగా నుపోద్ఘాత రచయిత లగువారికి-ప్రస్తుత మగుచున్న యంశమును సాకల్యముగ చర్చించి గుణదోషవిచారణ సేయవలసియుండుట మిగుల ముఖ్యమని నేనెఅుంగకపోలేదు. కాని అల్పావకాశముగల ఈ ప్రదేశమున నద్దానిని నిర్వహించుట దుశ్శక్యము. కావున మఱొకమాఱు దీర్ఘముగా విమర్శింప దలంపుగల నేనీవిషయము నింతతో ముగించుచు భావనాధనుడగు నీకవికుమారుని ప్రయత్నములు సఫలము లగునట్లును ఇట్టి వీరికి ఆయురారోగ్యైశ్వర్యాదివిభవముల నొసంగి, ఇతోధికముగ నాంధ్రవాగ్దేవికి సేవాంజలులనర్పింపజేయునట్లును అనుగ్రహించుటకై ఆ పరాత్పరుని వేలకొలది ప్రణామములచేత నిరంతరము నర్ధించుచున్నాను.

చెన్నపురి

క్రోధన భాద్రపద శుద్ధ సప్తమి: బుధవారము.
  1. ఆర్యసంప్రదాయము చొప్పున 82 మణులుగల హారము గుత్స మన బడును. గుత్సమనుమాటయే గుచ్ఛమన్న పేరుతో వ్యవహారమున నున్నదని నాతలంపు; కావుననే, నేను నిచ్చట హారభేదమును తెలుపు సందర్భమున గుత్సశబ్ధమునకు పర్యాయముగా గుచ్ఛమను పదమును వాడితిని.[పం.ఆ.శా]