యెంకి పాటలు/సత్తెకాలపు నాయెంకి
సత్తెకాలపు నాయెంకి
"నీ తోటె వుంటాను నాయుడు బావా!
నీమాటె యింటాను నాయుడు బావా!"
"సరుకు లేమికావాలె సంతన పిల్లా ?"
"నువ్వు
మరమమిడిసి మనసియ్యి నాయుడు బావా!"
"సక్కదనమున కేమిత్తు సంతనపిల్లా?"
"నువ్వు
సల్లగుండు పద్దాక నాయుడు బావా !"
"యేడనే నీ కాపురమో యెల్తురు పిల్లా"
"నీ
నీడలోన మేడ కడతా నాయుడు బావా!"
"నీతోటె వుంటాను నాయుడు బావా !
నీమాటె యింటాను నాయుడు బావా ! "