యెంకి పాటలు/మాట కోటలు
మాట కోటలు
ఆట పాటలలోనె మరచినావా, రాజ!
మాటకోటల లోనె మసలు మన్నావా?
వరస దీపాలుంచి
సరసనే నిన్నుంచి
ఆకాంతి నీ కళ్ళ
గని మొక్కుకొను నన్నె ఆట...
నెలవంక పలవలో
నీరూపె గీతురా
తలవంచి సెలయేట
ఆ రూపె సూతురా ఆట...
కలలోన నీవునా
కంటి కవు పడకున్న
మెలకువయ్యేదాక
కలవరించేను నన్ను (గిలగిలాడే నన్ను) ఆట...
కందుటెరుగని మనసు
గాయమై పాయెరా
నీకె చేటని కంట
నీరు రానీనురా ఆట...