యెంకి పాటలు/దీపం
దీపం
ఆరిపేయవె దీపమూ!
యెలుగులో నీమీద - నిలపలేనే మనసు!
ఆరిపేయవె దీపమూ ...
జిమ్ముమంటా తోట
సీకటైపోవాలి,
సీకట్లొ సూడాలి
నీ కళ్ళ తళతళలు!
ఆరిపేయవె దీపమూ!......
తళుకుతో నీరూపు
తలుసుకొని తలుసుకొని
సీకట్లొ నా కళ్లు
సిల్లులడ సూడాలి!
ఆరిపేయవె దీపమూ!......
సూపులే ఆపేసి
రూపు వూసే మరిసి
వొక రెరుగ కింకొకరు
వొరిగి నిదరోదాము!
ఆరిపేయవె దీపమూ!......