యెంకి పాటలు/అణకువ
అణకువ
ఎంతెంత దూరాన
ఎందరిలొ నేనున్న--
సూటిగా నా వెనుక చూసి నా యెంకి
చురికి నే తనవైపు తిరుగవలసినదే !
* * *
ఏటవల నేబోయి
యిల్లుచేరని రేయి---
ఏటదీపము పళ్ళ నిడినదా యెంకి
వెలుగులో నే నచట మొలవ వలసినదే !
* * *
కథనడుమ మాగా జోడు
నిదుర దోగిననాడు---
కథకొస తళుకుగోరి కల గనెన యెంకి
కలనునే జొరి కథలు తెలుపవలసినదే !
*