మొల్ల రామాయణము/సుందరకాండము/సీత తన చూడామణి నానవాలుగా హనుమంతునకు నిచ్చుట

సీత తన చూడామణి నానవాలుగ హనుమంతునకు నిచ్చుట

మార్చు

క. నా నాథు క్షేమ మంతయు
ధీనిధి! నీచేత వింటిఁ దెలియఁగ, నైనన్‌
నీ నిజ రూపము చూడక
నే నా రత్నంబు నమ్మి నీ కీయఁ జుమీ! 105
వ. అనుటయు నా హనుమంతుండు, 106