మొల్ల రామాయణము/బాల కాండము/శ్రీరామ భరత లక్ష్మణ శత్రుఘ్నుల యవతారము

శ్రీరామ భరత లక్ష్మణ శత్రుఘ్నుల యవతారము

మార్చు

వ. ఇట్లు దుర్భరంబులైన గర్భంబులు దాల్చిన కౌసల్యాది కాంతా
త్రయమ్మును జైత్ర మాసమ్మున, శుక్ల పక్షమ్మున, నవమీ, భాను
వాసరమ్మునఁ, బునర్వసు నక్షత్రంబునఁ, గర్కటక లగ్నంబున
శ్రీరామభరత లక్ష్మణశత్రుఘ్నులం గాంచినం దదనంతరంబున
దశరథుండు రథోచిత కర్తవ్యంబులు జరపి, యప్పది దినంబులు
నరిష్టంబు లేక ప్రతి దిన ప్రవర్ధమాన మగుచున్న కుమార
చతుష్టయంబునకుఁ గాలోచితంబు లగు చౌలోపనయనాది కృత్యంబులు
గావించి, వెండియు విద్యా ప్రవీణు లగునట్టు లొనర్చి, గజాశ్వ
రథారోహణంబులు నేర్పి, ధనుర్వేద పారగులం గావించి,
పెంచుచున్న సమయమ్మున, 46