మొల్ల రామాయణము/అయోధ్యా కాండము/భరద్వాజముని యాదరాతిథ్యము

భరద్వాజ ముని యాదరాతిథ్యము

మార్చు

ఉ. రాజ కులవతంసుఁ డగు రాముఁడు తమ్ముఁడుఁ దాను నా భర
ద్వాజ మహా మునీంద్రు పదవారిజముల్‌ గని మ్రొక్క, నాతఁడం
భోజ హితాన్వయాబ్ధి పరిపూర్ణ సుధాకరుఁడైన రామునిం
బూజ లొనర్చి కందఫల మూలములం బరితృప్తుఁ జేసినన్‌. 34
వ. సంతసించుచు నా రాత్రి యచ్చట నివసించి మఱుసటి దిన మర్కోదయమ్మున. 35
ఆ. ముదముతోడఁ దమ్ము ముని భరద్వాజుండు
భక్తి ననుప, రామభద్రుఁ డంతఁ
జనియె భ్రాతృ దార సహితుఁడై సన్ముని
కూటమునకుఁ జిత్రకూటమునకు. 36