మైసూరు పులి టిపూ సుల్తాన్/మైసూరు పులి టిపూ సుల్తాన్

మైసూర్‌ పులి టిపూ సుల్తాన్‌

                              మైసూరు పులి
                             టిపూ సుల్తాన్‌


భారతదేశ రాజకీయ చరిత్రలో పద్దెనిమిదవ శతాబ్దపు ఉత్తరార్థ భాగం ఎంతో కీలకమైన సమయం. బెంగాల్‌ నవాబు సిరాజుద్దౌలాను పరాజితుడ్ని చేసి, బెంగాల్‌ దివానిని హస్తగతం చేసు కున్న ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులు, దక్షిణాదిని ఆక్రమించు కోవానికి యుకులు, కుయుకులు పనుflతునాflరు. ఈ సామ్రాజ్యవాద శక్తుల రాజ్యవిస్తరణ కాంక్షను అర్థం చేసుకోని స్వదేశీపాలకులు పరస్పరం కలహించుకుంటున్నారు. ఈసమయంలో నేనున్నా...నేనున్నాఅంటూ భారత రాజకీయ చిత్రపటం మీద ఉదాయించాడొక భానుడు. ఆ మొనగాడే, ప్రముఖ చరిత్రకారుడు జేమ్స్‌ మిల్‌ (James Mill) చే THE GREATEST PRICE OF THE EAST గా కీర్తించబడిన, దాక్షిణ భారత దేశచరిత్రలో మధ్యాహ్న మార్తాండుడిగా వెలుగొందిన, మైసూరు పులి గా ఖ్యాతిగాంచిన టిపూ సుల్తాన్‌.

11

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకుల పెత్తనాన్ని సవాల్‌ చేసి, ఈ గడ్డ మీద నిలదొక్కుకుంటున్న బ్రిీటిషర్లను తొడగోట్టి సవాల్‌ చేసిన టిపూ సుల్తాన్‌ 1750 నవంబర్‌ 10వ తేదీన కర్ణాటక రాష్ట్రంలోని కోలార్‌ జిల్లా దేవనహళ్ళి గ్రామంలో జన్మించారు. అసమాన ధైర్యసాహసాలతో దాకి∆ణ భారత దేశపు నెపోలియన్‌గా ఖ్యాతిగాంచిన, అరివీర భయంకరుడు. మైసూరు పాలకుడు హైదార్‌ అలీ, శ్రీమతి ఫాతిమా ఫక్రున్నీసాలు టిపూ తల్లిదండ్రులు. ఆర్కాట్ కుచెందిన ప్రముఖ సూఫి తత్వవేత్త మస్తాన్ నెలియా అనుగ్రహం వలన తమకు కలిగాడని భావించిన తల్లితండ్రులు, ఆయనను స్మరించుకుంటూ టిపూ అని ముద్దుగా పిలుచుకున్నారు.టిపూ తాతయ్య పేరు ఫతే ముహమ్మద్‌. ఆయన జ్ఞాపకార్థం,అయన మీద ఉన్నగౌరవం కొద్ది టిపూకు ఫతే అలీ అని పేరు పెట్టారు.

విద్యాగంధం లేని హైదర్‌, తన బిడ్డ మాత్రం పండితుడు, యుద్ద విద్యలలో ప్రవీణుడు కావాలని సంకల్పించి, టిపూకు మంచి విద్యాబుద్దులు చెప్పించారు. తండ్రి ప్రత్యే క పర్య వేక్షణలో యుద్ధ కళను టిపూ ఔపోసన పట్టారు. ఆనాటి ప్రముఖ యోధులలో అగ్రగామిగా గుర్తింపు పొందారు. చిన్నతనం నుండి తండ్రి నాయకత్వంలో సాగిన పలు యుద్ధాలలో పాల్గొన్నారు. ఏ ఆంశానికి సంబంధించినదైనా, ఎటువంటి విశిష్ట,సాంకేతిక సమాచారమైనా అధ్యయనం చేసిన ఆకళింపు చేసుకోవటం నూతనత్వాన్ని అను నిత్యం ఆహ్వానించటం టిపూ ప్రత్యేకత. భారతీయ, పాశ్చాత్య తత్వవేత్తల,రాజనీతిజ్ఞుల గ్రంథాలను సేకరించి అధ్యయనం చేశారు. ఈ విధంగా సేకరించిన అపూర్వగ్రంథాల అధ్యాయనం ద్వారా సంపాదించుకున్న పరిజ్ఞానం, సాంఫిుక, ఆర్థ్దిక,రాజకీయ పరిణామాల మీద టిపూ సాధికారికంగా చేసినటువంటి విశ్లేషణలు, ఫ్రెంచ్‌,ఆంగ్లేయాధికారులను ఆశ్చర్యచకితులను చేసేవి. జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాల గురించి టిపూ వ్యకం చేసన అభిప్రాయాలు, దౌత్యవ్యూహాలను, బ్రిీటిష్‌ అధికారి డావ్‌టన్‌(Drbrypm) లాింటి ప్రముఖుడు ప్రత్యేకంగా ప్రశంసించక తప్పలేదు, 12 8 మైసూర్‌ పులి టిపూ సుల్తాన్‌

                     పదిహేనేళ్ళకే యుద్ధ వీరుడు

పదిహేను సంవత్సరాల వయస్సు వచ్చేసరికి రాజ్యపాలన వ్యవహారాలలో, తండ్రితోపాటుగా యుద్ధాలలో పాల్గొన గలిగిన స్థాయినీ, సామర్థ్యాన్నీసంపాదించుకున్న టిపూ 1763లో జరిగిన మలబార్‌ పోరాటంలో తొలిసారిగా పాల్గొన్నారు. 1769-72 వరకు మరాఠాలతో సాగిన యుద్ధాలలో పాల్గొని, అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించారు.తండ్రికి తగిన తనయుడు అన్పించుకున్నారు. ప్రథమ మైసూరు యద్ధంలో బ్రిీటిషర్ల కూటమి నుండి నిజాం నవాబును దూరం చేసేందుకు సాగిన ప్రయత్నాలలో భాగంగా ఎంతో చాకచక్యంగా దౌత్యం నడిపి 17 సంవత్సరాల టిపూ విజయం సాధించారు. ఆనాడు టిపూ ప్రదర్శించిన రాజనీతికి ముగ్ధుడైన నిజాం, టిపూను ఫతే అలీ ఖాన్‌ బిరుదుతో సత్కరించి గౌరవించారు.

తండ్రిలాగే యుద్ధ కళలో ప్రావీణ్యత సంపాదించిన టిపూ పురాతన సంప్రదాయ యుద్ధరీతులను అనుసరిస్తూ, పాశ్చాత్య యుద్ధ వ్యూహాలకు అనుగుణంగా సైన్యాన్ని ఆధునీకరించి మంచి తర్పీదు ఇప్పించారు. సరికొత్త ఆయుధాలను యుదావ్యూహాలను రూపొందించి విజయాలకు రాచబాట వేసారు. 1780లో కల్నల్‌ హంబర్‌ స్టోన్‌ని తరిమి క్టొిన చారిత్రక సంఘటనలో ప్రముఖ పాత్ర వహించారు.ఈ ఓటమిని దృష్టిలో పెట్టుకొని, ప్రఖ్యాత ఆంగ్ల సేనానులు జనర్‌ లారెన్స్‌, రాబర్ట్‌ క్లివ్‌ సైన్యాల కంటె బలమెన సెన్యాలను కలిగి ఉన్న తమకు మొదటిసారిగా భారతీయ సైన్యాలను ఎదాుర్కొనలేక పారిపోవాల్సిన పరిస్థితి దాపురించిందని, ప్రస్తుతం టిపూ సైన్యాల ఎదుట నిలువలేక వెన్ను చూపాల్సిన దుస్థితి కలిగిందని, ఆంగ్లేయ సైనికాధికారి జనరల్‌ గ్రంట్ పేర్కొన్నాడు. ('An English army much superior to one which under a Lawrence or Clive, five and twenty years ago, made Hindoostan, nay some of powers of Europe tremble at the bare fact of its victories, now for the first time were retreating in the face of an Indian army.' -TIPU SULTAN

HIS VISION AND MISSION, By Prof. B. Sheik Ali, Published in Radiance Views Weekly 1-7 August 1999, Page .14)

13 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

                                     రాజ్యాభిషేకం

మైసూరును దక్షిణాదిలో బలిష్టమైన రాజ్యంగా రూపొందించాలని కలలుగన్న హైదార్‌ అలీ శతృవుల దాడుల నుండి రాజ్యాన్ని కాపాడుకునేందుకు, తన జీవితంలోని అత్యధిక కాలం రణభూమిలోనే గడిపారు. శత్రువుతో కలబడుతూనే 1782 నవంబరు6న, రణరంగంలో తుదిస్వాస వదిలారు. ఈ విషాద వార్త టిపూకి అందేసరికి ఆయనమలబార్‌ తీరాన కల్నల్‌ హంబర్‌ స్టోన్‌ను తరిమి తరిమి కొడుతున్నారు. తండ్రి కన్నుమూసిన వార్త విన్న టిపూ సత్వరమే శ్రీరంగపట్నం చేరుకుని, తన 31వ ఏట 1782 డిసెంబర్‌ మాసంలో మైసూరు రాజ్యలక్ష్మిని చేబ్టారు. చిన్న వయస్సులోనే సొఎర్యపత్రా పాలతో ప్రజలను ఆకట్టుకున్న టిపూ, మైసూర్‌ సుల్తాన్‌ అయ్యారు.టిపూ రాజ్యధికారంచేపటడ మైతే సులభంగా జరిగింది కాని, దక్షిణ బారతదశంలో మైసూర్‌ బలమెన స్వతంత్ర రాజ్యంగా రూపొందాటం ఇష్టంలేని నిజాం, మరాఠా పాలకుల నుండి తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. మైసూరు రాజ్యలక్ష్మిని కాపాడుకోవటం కోసం, టిపూ డేగ కళ్ళ తో రాజ్యంలోని ప్రతి పాంత్రాన్ని కడు జాగ్రతగా రక్షిచుకోవాల్సి వచ్చింది.

టిపూ తండ్రి హైదార్‌ అలీ

              ఫొటో

14 9 మైసూర్‌ పులి ిపూ సుల్తాన్‌

ప్రజల అండదాండలు ఉన్నట్టయితే ఎటువంటిబలమైన శతృవునైనా అతి తేలిగ్గా ఎదుర్కోవచ్చని ఆయన భావించారు. ప్రభువుకు ప్రజల శక్తి ఎంత అవసరమో గ్రహించిన ఆయన ఆ దిశగా తన రాజకీయ-పరిపాలనా విధానాలను రూపొందించుకున్నారు. ఆ కారణంగా, ప్రజల సంక్షేమంలో రాజ్యక్షేమం, రాజు సంక్షేమం దాగుందాన్న సత్యాన్నిఅర్థం చేసుకున్న టిపూ సుల్తాన్‌ తన రాజ్యాభిషేకం రోజుననే ప్రజల నుద్దేశించి మ్లాడుతూ, మిమ్ముల్ని వ్యతిరేకించినట్టయితే నేను నా స్వర్గాన్ని, నా జీవితాన్ని, నాసంతోషాన్ని కోల్పోవచ్చు. నా ప్రజల సంతోషంలోనే నా సంతోషం వారి సంక్షేమంలోనే నా సంక్షేమం ఇమిడి ఉంది. నాకిష్టమైందల్లా మంచిదని నేను భావించను. నా ప్రజలకుఏది ఇష్టమో దానిని నా మంచిదిగా భావిస్తానని ఆయన ప్రకటిచారు. (‘May I be deprived of heaven, of life, off spring if I oppose you. In the happiness, in their welfare my welfare; whatever pleases myself I shall consider not good, but whatever pleases my subjects I shall consider as good..’ - AURUNGZEB AND TIPU SULTAN, Evolution of their Religious Polices, by Dr.B.N. Pande, IOS, New Delhi, 1996, Page. 21)

                            జనరంజక రాజ్యపాలన

ఒకవైపు టిపూను దెబ్బతీయడనికి అదను కోసం ఎదురు చూస్తున్న స్వదేశీ శత్రువులు, మరొకవైపు పరాజయాల పరంపరతో రగిలిపోతున్న విదేశీ శత్రువులతో మైసూరు రాజ్యం చుట్టుముట్టబడి ఉండటంతో, శ్వాస పీల్చుకోవానికి కూడతీతీరిక లేనప్పికీ, ప్రజారంజకమైన పాలనను అందిస్తూ, ప్రజల ఆర్థిక వ్యవహారాలలో టిపూ చూపిన శ్రద్ధను గమనించిన ఆంగ్లేయాధికారి గ్రాంట్, ఆయన చర్యలను ప్రశంసిస్తూ టిపూ తన రాజ్యం యొక్క ఆర్థిక వ్యవహారాలను నిర్వహించిన తీరు అందరికి ఆదార్శంగా నిలచిపోతుందని, ('...How Tipu organised the economic resources of the kingdom set an example...') అనటం విశేషం. ప్రతిభావంతంగా ఆయన ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దటం వలన రాజ్యంలో ప్రజలు సుఖ-శాంతులతో జీవనం సాగించగలిగారు.

ప్రజల జీవితాలను సుఖమయం చేసేందుకు టిపూ వినూత్న విధానాలను అనుసరించారు. పాశ్చాత్య సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని రంగాలకు వర్తింపచేసారు. అన్ని ప్రభుత్వ విభాగాలలో ప్రజలకు సంబంధించిన అన్నిరంగాలలో పలు విప్లవాత్మక మార్పులు చేసారు. స్వదేశంలోనే కాకుండ, విదేశాలలో కూడ పరిశ్రమలను స్థాపించి 15 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

అభివృద్ధిపర్చారు. పలు ప్రాంతాలనుండి చేతి వృత్తి కళాకారులను, నిపుణులను మెసూరు రాజ్యానికి రప్పించి తన ప్రజలకు, శ్రామికులకు ప్రత్యేక శిక∆ణ ఇప్పించారు.అన్నివర్గాల ప్రజల అభివృద్ది కోసం పలు నూతన పథకాలను ఆవిష్కరించి ఆ పథకాలు సమర్ధవంతంగా అమలు జరిగేలా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. నూతన తరహా సహకార బ్యాంకులను ఏర్పాటు చేసారు. సంపన్న వర్గాల పెత్తనం తగ్గించేందుకు ఎక్కువ మొత్తాలను బ్యాంకులలో వాటాలుగా పొదుపు చేసినవారికి లాభాలలో వాటాను తగ్గించారు. పేద వర్గాలను పొదుపు వైపునకు ఆకర్షించేందుకు తక్కువ మొత్తాలను లాభాలుగా ప్రకటించారు. ప్రజలలో పొదుపును, మదుపును ప్రోత్సహించారు.

వర్తక-వాణిజ్య రంగాన్ని తీర్చిదిద్దారు. తూనికలు-కొలతల వ్యవస్థను ఆధునీకరించారు. ప్రజలు మోసాలకు గురికాకుండ తగిన కట్టుదిట్టమైన చర్యలను తీసుకున్నారు. వరక, వాణిజ్య పారిశ్రామిక రంగాలలో ప్రబుత్వ పాత్రను అధికం చేసారు.వర్తక-వాణిజ్య రంగాలలో ప్రభుత్వ పాత్రను అధికం చేసేందుకు టిపూ సుల్తాన్‌ ఆనాడే ప్రబుత్వంద్వారా వ్యాపారాన్ని నిర్వహింప చేశారు. ఈ మేరకు ప్రబుత్వ వ్యాపార సంస్థను (State Trading Corporation) ఏర్పాటు చేశారు.

టిపూ విదేశీ వ్యాపారం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. స్వదేశ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయ డాన్ని ప్రోత్సహించటమే కాకుండ, ఎగుమతులను సులభతరం చేసేందాుకు ఆయన నౌకా వ్యాపారం కోసం నౌకా స్థావరాన్నినిర్మించారు. ఈ విధగా వ్యాపారాభివృద్ధి లలక్ష్యగా వ్యాపార నౌకల నిర్మాణం చేపట్టిన ప్రదమ పాలకునిగా ఖ్యాతిగాంచారు.

(Tipu was the first ruler to build merchant navy - Prof.Shaik Ali in his essay Tipu's Development projects and Administrative Machinery, published in Radiance 1-7,Aug 1999, page 28)

1793 లో వంద నౌకల నిర్మాణానికి సంకల్పించారు. ఈ మేరకు నిర్మాణమైన రెండు నౌకలకు 'KHIZRI' మరియు ' HYAS ' అని ఆయన స్యయంగా నామకరణం చేశారు. ఈ నౌకల నిర్మాణానికి అవసరమైన ముడిపదార్దాలను svaదేశంలోసమకూర్చుకుంటూ, సాంకేతిక పరిజ్ఞానాన్నివిదేశాల నుండి స్వీకరించారు. ఈ నౌకలనిర్మాణాలకు ప్రసిద్దిగాంచిన వివిధ దేశాలలోని ఆయా వ్యవస్థల సమాచారం తెప్పించుకుని అధ్యయనం చేసి ప్రతి వ్యవస్థలోని ప్రగతిశీల అంశాన్ని గ్రహించి దానిని స్వదేశీ 16 10 మైసూర్‌ పులి టిపూ సుల్తాన్‌

వ్యవస్థకు అన్వయించారు. సముద్ర తీరం సరిహద్దులుగా గల ప్రాంతాల నుండి నావికాదాళం ఏర్పాటుతో రాజ్య రక్షణకు నడుంకట్టాలని టిపూ ఆలోచించారు. ఈ దిశగా కూడ ఆయన తగిన చర్యలు చేప్టారు. యుద్దరంగంలో కూడ నౌకలను వినియోగించేందుకు అవసరమైన శికణ కోసం ఆయన ప్రత్యే కంగా కళాశాలను ఏర్పాటు చేశారు. 1793లో ప్రసిద్ద వ్యాపార కేంద్రమైన భట్కల్ వద్ద ఆయన Naval College ప్రారంభించారు. ఎగుమతుల- దిగుమతుల వ్యాపారా నికి ఆయన ఎంతటి ప్రాముఖ్యతనిచ్చారో, అంతే ప్రాముఖ్యత రాజ్యరలక్షణకు ఇచ్చారు. యుద్ధ్దరంగంలో నావికాదాళం నిర్వహించే ప్రత్యేక ప్రాధాన్యత దృష్త్యా యుద్ధ నౌకల నిర్మాణం, సైన్యానికి శిక్షణ కోసం ఆయన పటిష్టమై ఏర్పాట్లు చేశారు. (Eminent Muslim Freedom Fighters, G. Allana,Low Price Publications, Delhi, 1993, Page. 75)

                వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత

టిపూ వ్యవసాయ రంగాన్ని ఎంతగానో ప్రోత్సహించారు. నీిటి పారుదల సౌకర్యం కల్పించేందుకు అధిక శ్రద్ధ చూపించారు. పన్ను విధింపు పద్దతిలో మార్పులు చేశారు. పన్ను అనేది భూమి విస్తీర్ణం మీద ఆధారపడి కాకుండ, ఉత్పత్తి మీద ఆధారపడి నిర్ణయించారు. అంతే కాదు వర్షం నీిటి ఆధార భూములు, నీిటి పారుదాల ఆధారిత భూములకు వేర్వేరుగా విభజించారు. పంట సిరులు అందించే రైతుకు భూమి మీద హక్కు కల్పించారు. జాగీర్దారి జులుంకు చరమగీతం పాడారు. బంజరు భూములను మాగాణులుగా మార్చే రైతులు, మూడు సంవత్సరాల పాటు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదని పన్ను రాయితీలు కల్పించారు. పన్నుల వసూలుకు మధ్య దాళారీలను తొలగించి ప్రభుత్వ ఉద్యోగులను నియమించారు. వ్యవసాయ పనిముట్ల కొనుగోలు కోసం రైతులకు రుణ స్ధకర్యం కల్పించారు. నీిటి పారుదల కోసం పలు చర్య లు చేపట్టారు. నాడు కావేరి నది మీద ఎక్కడయితే నీిపారుదలకు ప్రాజెక్టుట్టాలని టిపూ ఉద్దేశించారో, అక్కడే ఈనాడు కృష్ణరాయసాగర్‌ నిర్మాణం కావటం విశేషం.

టిపూ జనరంజక పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో జీవించారు. ఈ విషయాన్నిప్రముఖ చరిత్రకారుడు జేమ్స్‌ మిల్‌ తన History of British India భారతదేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలందరి కంటే టిపూ రాజ్యంలోని ప్రజలు సంతోషంగా ఉన్నారు. పంటలు బాగా పండాయి అని పేర్కొన్నాడు. టిపూ సుల్తాన్‌ 17 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

అంటే ప్రత్యేక అభిమానం అంటూ ఏమీ లేని ఈ ఆంగ్లేయ చరిత్రకారుడు అంతటితో సరిపెట్టుకోలేదు. ఆ కాలంలో ఆంగ్లేయుల, వారి వత్తాసుదారుల పాలన క్రింద ఉన్న కర్నాటక, ఔద్‌ రాజ్యాలు అత్యంత వేగంగా ఎడరులుగా మారనున్నాయంటూ, కూడ పేర్కొనటం విశేషం.

('...there were good crops in Tipus regime and his subjects were happier than all others in India... the best cultivated and its population the most flourishing in India. while under English and their dependencies, the population of the Carnatic and Oudh, hasting to the state of deserts, were the most wretched upon the face of the earth ' - TIPU SULTAN : HIS VISION AND MISSION, By Prof. B. Sheik Ali, Published in Radiance Views Weekly 1-7 August 1999, Page. 13 ) టిపూ వ్యవసాయ రంగం, ఆ రంగానికి అనుబంధంగా ఉన్నరంగాలకు అత్యధిక ప్రాధాన్యత నిచ్చి తగిన చర్యలను పటిష్టంగా అమలు పర్చినందున మైసూరు రాజ్యం పలు యుద్ధాలను ఎదాుర్కొన్నప్పికి పాడి పంటలతో కళకళలాడింది. మైసూరు రాజ్యమంతా పచ్చదనం పూర్తిగా పర్చుకుంది.

అపరిచిత ప్రాంతంలో ఓ ప్రయాణికుడు ప్రయాణిస్తున్నప్పుడు, పచ్చని పొలాలు, శ్రమజీవులు, నూతనంగా నిర్మాణమైన నగరాలు, అభివృద్ధి చెందుతున్న వర్తక- వ్యాపారాలు, పెరుగుతున్న పట్టణాల సంఖ్య ఎక్కడైతే కన్పిస్తాయో, ఎక్కడైతే ప్రతిదీ సంతోషదాయకంగా దార్శనమిస్తుందో, ఆ ప్రాంతం ప్రజల అభిమతాలకు అనుగుణమైన ప్రభుత్వ పాలన క్రింద ఉందాని నిర్ధారించుకోవచ్చు. అటువంటిరాజ్యం టిపూ రాజ్యం.అంటూ ప్రఖ్యాత అంగ్లేయ చరిత్రకారుడు Edward Moore 1794 అభిప్రాయపడ్డాడరు. ఈ అభిప్రాయం అతని రాతల్లో ఈవిధంగా ఉంది‘ ..When a person traveling through strange country finds it well cultivated populous with industrious inhabitants, cities newly founded, commerce extending,towns increasing and every thing flourishing so as to indicate happiness, he will naturally conclude it to be under form of Government congenial to the minds of people. This is a picture of Tipus’s country, and our conclusion respecting its Government. ( BN Pandy Page.16.)

టిపూ ఆంగ్లేయులను ఈ గడ్డ నుండి తరిమి వేయాలని సంకల్పించి పోరాడు తుండగా, ఆంగ్ల చరిత్రకారులు ఆయన పాలన-పద్దతుల గురించి చేసిన వ్యాఖ్యానాలు,అభిప్రాయలు గమనిస్తే టిపూ పాలన ఎంత జనరంజకంగా ఉందో, రాజ్యం మరెంత పచ్చగా ఉందో, ప్రజలు ఎంతటి సుఖశాంతులతో గడిపారో మనకు అర్థం అవుతుంది. 18 11 మైసూర్‌ పులి టిపూ సుల్తాన్‌

             పారిశ్రామిక రంగంలో అగ్రగామి

ప్రజల సంక్షేమంలో తన సంతోషం ఉందని నమ్మిన ప్రభువు కావటంతో ప్రజల ప్రగతికి అవసరమైన ఆన్ని రంగాల మీదా ఆయన దాృష్టి సారించారు. ఆయా రంగాలలో అభివృద్ధిని సాధించేందుకు, ఆయా రంగాలలో నూతన పోకడలను,పరిజ్ఞానాన్ని ప్రవేశ పెట్టేందుకు టిపూ ఎంతగానో శ్రమించారు.

టిపూ వర్తక వాణిజ్యాభివృద్ధితో పాటు విదేశాలలో కర్మాగారాలను స్థాపిం చేందుకు కృషి సల్పారు. ఈ విషయ మై చక్క ని దౌత్యం నడిపి విదేశీ నేతలను అంగీకరింపచేశారు. ఆ దేశాల సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వదేశానికి రాబట్టటంలో ఆయన విజయం సాధించారు.

ఈ మేరకు స్వదేశంలో పరిశ్రమల స్థాపనకు పలుచర్యలు తీసుకున్నారు. ఔత్సాహికులకు ఆయన ప్రోత్సాహకాలు ప్రకటిచారు. పారిశ్రామిక రంగం పట్ల, పారిశ్రామిక ఉత్పత్తుల పట్ల ప్రత్యేక ఆసక్తి చూపారు. ఈ రంగం అభివృద్ధికి ఆయన నిపుణులైన విదేశీ కార్మికులను రప్పించి ప్రజలకు శిక్షణ ఇప్పించారు. శ్రీరంగపట్నం,చిత్రదుర్గ, బెంగళారు, బెద్నూర్‌లలో కర్మాగారాలను ఏర్పాటు చేయించారు. ఈకర్మాగారాలలో యుద్ధ సామగ్రితోపాటుగా, గృహోపకరణాలు, కత్తులు, వాచీలు లాింటివి కూడ తయారు చేయించారు.

ఉత్పత్తిదారుడు, వినియోగదారుని మధ్య దళారులను వీలయినంతగా తొలగించ ప్రయత్నించారు. ఈ చర్యల వలన అటు ఉత్పత్తిదారులు, చేతి వృత్తుల కళాకారులు,కార్మికులకు ఇటు వినియోగదారులకు ఎంతో మేలు జరిగింది. ఆ కారణంగా అటువ్యవసాయరంగం, ఇటు పారిశ్రామిక రంగం బాగా అభివృద్ధిచెందాయి.

ఏది చేసనా, ఏది చేయించినా ఆన్నివిషయాలు తన దృష్టిని దాిటిపోనివ్వకుండా చూసుకోవటం ఆయన ప్రత్యేకత కావటంతో ప్రతిరంగం సమర్ధవంతంగా రూపొందింది. టిపూ ప్రారిశామ్రిక రంగం పట్ల చూపిన ప్రత్యేక ఆసక్తిని గమనించిన ఆంగ్లేయాధికారి P. Fernandes “... no other sovereign in Indian history had given such impetus to industrial production.”అని అన్నాడు. ( TIPU SULTAN THE GREAT : Glimpses of His Work and Personality , essay By Mufthi Shamshuddin Ahemed, published RADIANCE Views Weekly, 1-7 Aug.1999, Page. 35)

19

టిపూ రాజముద్ర

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

            ఆధునిక సూత్రాల కనుగుణంగా పాలన

(పాక్‌ - పశ్చిమ దేశాల సామాజిక, సాంకేతిక పరిజ్ఞానాన్నిసంతరించుకున్న టిపూ సంప్రదాయక ప్రభుత్వపాలనకు భిన్నంగా, ప్రజలకు ఉత్తమ సేవలను అందచేసేఆధునిక పద్ధతులను ప్రవేశ పెట్టిన తొలిస్వదేశీ పాలకుడిగా ఖ్యాతి గడించారు. ప్రభుత్వ యంత్రాగాన్నిపలు మార్పులకు గురిచేసారు. ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ప్రబుత్వం పనిచేయాలని వాంఛించిన టిపూ, పాలకుడిగా నిరంతరం ప్రజల శ్రేయస్సును ఆకాంక్షిస్తూ ఆ దిశగా పనిచేసారు. ఈ విధానాల వల్లనే టిపూను ప్రజలు అమితంగా ప్రేమించారు.టిపూ ఎదాుర్కొన్న కష్టకాలంలో ఆయనకు తోడు నిలిచారు.

1792లో జరిగిన మైసూరు యుద్ధలో యుద్ధ నష్ట పరిహారం కింద మూడున్నర

కోట్ల రూపాయలను ప్రత్యర్థులకు టిపూ చెల్లించాల్సి వచ్చింది. ఆ సమయాన ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉంది. మంత్రుల సలహా మేరకు టిపూ ప్రజల సహకారాన్ని అర్థించగా,ప్రజలు అమితోత్సాహంతో ముందుకు వచ్చిన తమ వాటాగా మూడున్నర కోట్ల స్థానంలో పది కోట్ల రూపాయలను సమకూర్చారు. ఈ అనుకూల ప్రతిస్పందన బట్టి ప్రజలు  టిపూను ఎంతగా ప్రేమించారన్న విషయంతోపాటు ప్రజలు ఎంతి ఉన్నత ప్రమాణాలతో జీవితాలను గడిపారో గ్రహించవచ్చు.

టిపూపాలన ఆశ్చర్యంగా అత్యంత ఆధునిక సూత్రాలకు అనుగుణంగా సాగిందంటూ ప్రముఖ ఆంగ్లేయ చరిత్రకారుడు పి. ఫెర్నాండజ్‌ తన గ్రంధం 'Storm over Srirangapatnam' లో బహువిధాల ప్రశంసించాడు. ఆయన సంక్షేమ రాజ్యం బలమెన కేద్ర ప్రబుత్వం, పలు ప్రాంతాల సమంవయ సమర్ధపాలన, చక్కని న్యాయపాలనా

12 మైసూర్‌ పులి టిపూ సుల్తాన్‌

వ్యవస్థ ఏర్పాటు, దోపిడికి కారణమైన మధ్యావర్తుల ప్రమేయంలేని క్రియాశీలక పాలనా వ్యవస్థను రూపొందించారని ఆ ఆంగ్లేయుడు పేర్కొన్నాడు.

( “The administration of Mysore kingdom under Tipu Sulthan was surprisingly based on modern principles... Tipu Sultan’s welfare state was based on some fundamental principles - viz. A strong Central Government, a coordinated provincial administration, dynamic and good civil amenities, principled legal system and elimination of intermediary (exploiting) channels... “ TIPU SULTAN THE GREAT: Glimpses of His Work and Personality, By Mufthi Shamshuddin Ahemed, Published in Radiance Views Weekly 1-7 August 1999, Page. 35)

ప్రభుత్వాధికారులను ప్రజలకు చేరువ చేయటం, ప్రజలను కూడ ప్రభుత్వ కార్యకలాపాలలో భాగస్వాములను చేసేందుకు టిపూ ప్రత్యేకమై పద్దతులను అనుసరించారు. ప్రతి నూతన సంవత్సరం తొలి రోజున అధికారులు తమ తమ ప్రధాన కార్యాలయాలు గల ప్రాంతాలలో ప్రత్యే క కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు.బహిరంగ సభలను నిర్వహించాలని, ఆ సభలలో బాధ్యులైన అధికారులందరు పాల్గొనాలని ఆజ్ఞలు జారీ చేశారు. ఈ సందర్భంగా తమతమ పరిధిలలో గల ప్రజలను ఆహ్వానించి నూతన సంవత్సర శుభాకాంక∆లు చెప్పాలని, ఆ విధంగా వచ్చిన ప్రజల గౌరవార్థం సుగంధ ద్రావ్యాలు, తమలపాకులు ఇచ్చి పంపాలన్నారు. ఈ సభలలో ప్రజల అవసరాల గురించి, వ్యవసాయ రంగంలో ప్రభుత్వ తోడ్పాటు తదితర అంశాల గురించి ప్రజలతో చర్చించాలని, ఈ మేరకు నివేదికలు తయారు చేసి తనకు పంపాలని టిపూ ఆదేశించారు.

టిపూ సుల్తాన్‌ ఆధునిక భావాలకు అనుగుణంగా ఆనాడే వ్యవహరించారనడానికి

క్రమం తప్పకుండ ఆయన సాగించిన జనాభా లెక్కల సేకరణను ఉదాహరణగా తీసుకోవచ్చు. ఆయనకు ముందు ఎవ్వరూ ఆలోచించని జనాభా లెక్కల సేకరణను టిపూ జరిపించారు. పట్టణాలు, పల్లెలలో జనాభా లెక్కలతో పాటుగా ఆయా ప్రజలు కలిగియన్న ఆస్తిపాస్థులను కూడ నమోదు చేయించారు.

                      రాజరిక వ్యవస్థలో ప్రజాసాfiమ్య ప్రేమికుడు

ప్రజాస్వామిక వ్యవస్థ కానప్పటికి ప్రజలకు, ప్రజాభిప్రాయానికి టిపూ అధిక ప్రాధాన్యతనిచ్చారు. ప్రపంచంలోని పలు వ్యవస్థలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నఆయన ప్రజల మాటకు అత్యంత విలువనిచ్చారు. ఫ్రాన్సులో ప్రజాస్వామ్యం అస్పష్టంగా ఉన్న 21 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

దశలో మైసూరు రాజ్యంలోని ప్రజలందరికి సమానత్వం, సమానహక్కులను ప్రసాదించారు. ప్రజా ప్రభుత్వానికి ఆయన పునాదులు వేశారు. ప్రభుత్వంలో ప్రజలకుభాగస్వామ్యం కల్పించారు. ఈ మేరకు ప్రజల ప్రతినిధులతో కూడిన కమిటీలను నిర్మించారు. గ్రామాలలో, పట్టణాలలో ఈ కమిటీలలోని వ్యక్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని పాలనా పరమై న నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వినూత్నవిధానాలు అప్పటి ఆలోచనలకు-విధానాల స్థాయికి సరిపడలేదు. ఆంగ్లేయ చరిత్ర కారుడు M. Wikes తన History of Mysore గ్రంధంలో టిపూ ప్రజాస్వామిక ధృక్పధంఆచరణ గురించి ఈ క్రింది విధంగా అభివర్ణించాడు. ‘Democracy which was in vogue in France at that time was not alien to Tipu. He had granted equality and equity to all. Tipu sultan laidthe foundation of public Government in his reign. He made his subjects participate in administration by constituting a representative committee of the people. But the frame of mind and nature at that time could not accept this development.’ ( Tipu Sultan : Champion of Justice and Tolerance by G.Hasnan Kaif Publihed in Radiance Views Weekly 1-7 Aug.1999, Page. 24)

చరిత్రను లోతుగా అధ్యాయనం చేసిన టిపూ, ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు అత్యధిక ప్రాధాన్యత నిచ్చారు. బ్రిీటిషర్ల బానిసత్వంణం నుండి 1783లో అమెరికా బయట పడినప్పుడు 108 ఫిరంగులను పేల్చి సంతోషం వ్యక్తం చేసారు. స్వేచ్ఛను కాంకి∆స్తున్న ప్రభువుగా, ప్రజలను బానిసల్లా భావించరాదాన్నవిధానాన్ని టిపూ అనుసరించారు.రాజ్య వ్యవస్థకు, నైతికతకు, ప్రజలకు నష్టం-కష్టం కల్గించనంత వరకు ఎవరి స్చేచ్ఛా-అవాతంత్య్రాలను హరించరాదాన్నది ఆయన అభిమతం. ప్రబువులు ప్రజలను తమ బానిసలుగానో, సేవకులుగానో భావించటం, వంగి వంగి అభివాదాలు చేయ టం ఏమాత్రం తగదని టిపూ తన అధికారులను హెచ్చరించారు.అధికారులు, ప్రజలు దార్బారుకు వచ్చినప్పుడు వంగి వంగి సలాములు చెప్పే పద్ధతిని ఆయన కూడదన్నారు. ప్రబువు కాళ్ళ వద్ద నిల్చోవడం, చేయి పట్టుకు ని ముద్దుపె పట్టుకోవటం లాింటి పద్ధతులు వలదాన్నారు. ఈ తీరు అహంకారానికి ప్రతీకగా భావించిన టిపూ అస్సలాము అలైకుం అంటూ సాదాసీదాగా పలకరిస్తే చాలంటూ ఫర్మానా జారీ చేశారు. మసీదుకు కాని,మరో బహిరంగ ప్రదేశాలకు గాని ప్రభువు వెళ్ళునప్పుడు ఆయన రాకపోకల కోసం మార్గాన్నినిరాటంకం చేసి ప్రజలను ఇబ్బంది పెట్టటం సరికాదాన్నారు. ప్రజలను అవసల అవస్థల

22 మైసూర్‌ పులి టిపూ సుల్తాన్‌

పాలు చేయకుండేందుకు అవసరమగు నిర్మాణాలను, ఏర్పాట్లను ఆయన ప్రత్యే క శ్రదతోచేయించారు. టిపూ స్వయంగా జాకోబియన్‌ క్లబ్‌ అను సంస్థ్ధను ప్రారంభించి, ఆ సంస్థ్ధ ప్రారంభోత్సవం సందర్భంగా ఒక మొక్క నాటారు. ఆ మొక్కకుస్వేచ్ఛావృక్షం (Tree of Liberty) అని నామకరణం చేయటమే కాకుండ తనను తాను మైసూరు రాజ్యపౌరుడు గా (TIPU CITIZEN OF YSORE)పిలుచుకున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు ఆయన కూడ ప్రజలకు, ప్రజాభిప్రాయానికి, ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేశారు. ఒక రాజరిక వ్యవస్థ్ధకు చెందిన పాలకుడు ఈ విధాంగా ప్రజాస్వామ్య భావాన్ని ప్రకటించటం అరుదైన విషయం. ఈ ప్రకటన టిపూలోని ఆధు నిక ప్రజాస్వామ్య భావన ఎంత బలంగా ఉండేదో వెల్లడి చేస్తుంది. టిపూ కేవలం ప్రజాస్వామిక భావనలతో సరిపెట్టుకోవటమే కాకుండ ఆ భావనలను, ఆనాటి వాతావరణంలో, అందుకు తగ్గట్టుగా ఆచరణలో పెట్టి అద్వితీయుడన్పించారు.

                     రాళ్ళెత్తిన కూలీలదే చరిత్ర

ప్రజల శ్రమకు తగిన ప్రతిఫలం సక్రమంగా అందాజేయాలని ఆదేశాలు జారీ చేసారు. టిపూకు అత్యంత ప్రీతిపాత్రమైన, ప్రఖ్యాత వేసవి విడిది గృహం దర్యా దౌలత్‌ నిర్మాణ సమయంలో ప్రజలచేత శ్రమదానం చేయించుకోవాలని అధికారులుసలహా ఇచ్చారు. ఈ సలహా పట్ల తీవ్రంగా స్పందిస్తూ, ఫారో ప్రభువులు తమ వద్దనున్న బానిసల చేత పిరమిడ్స్‌ను నిర్మించారు....స్రీల, పురుషుల మీద కురిసిన కొరడా దెబ్బలతో


దార్యా దౌలత్‌

23 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

చైనా గోడ ఆద్యంతమూ రక్తంతో తడిసిపోయింది... మానవుల కన్నీళ్ళు, రక్తంతో మన ప్రాసాదాలు, రోడ్లు, డ్యామ్‌ల పునాదులు వేసినట్టయితే అటువంటి నిర్మాణాలు ప్రభువులకు ఎటువంటి కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టవు, అని టిపూ వ్యాఖ్యానించారు. (‘....The Pharaohs built the pyramids with the labour of their slaves...The entire route of the Great wall of Chaina is littered with the blood and bones of men and women forced to work under the whip and lash of slavesdriver ..so...there can no glory or achievement if the foundations of our places,roads, dams are mingled with tears and blood of humanity..’ - ARUNGZEB AND TIPU SULTAN, Evaluation of their Religious Polices, by Dr.B.N.Pande, IOS,New Delhi, 1996, Page. 21)

ఈ మేరకు నిర్మాణాల విషయంలో చాలా అధునికవున అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. తూర్పు నుండి పశ్చిమం వరకు ఉన్న ఏ దేశంలోనైనా నిర్మాణమై యున్నఅత్యంత గొప్ప కళాత్మక కట్టడల గురించి పరిశీలిస్తున్నప్పుడు, ఆ నిర్మాణాలకు ఆదేశం ఇచ్చిన ప్రభువులను కాదు మనం గుర్తుకు తెచ్చుకోవాల్సింది, ఆ నిర్మాణాలకు రూపు కల్పించిన ప్రజల శ్రమను, ఆ ప్రజలు పడన పాట్లను, ఈ నిర్మాణాల సమయంలో మృత్యువాత పడిన శ్రామికుల త్యాగాలను మనం గుర్తుకు తెచ్చుకోవాలి' అని పేర్కొంటూ రాళ్ళెత్తిన కూలీలకు ఆయన తన మనస్సులో పెద్ట పీట వేశారు. ( ‘....To my mind every great work of art and architecture be in countries to the west or to the east of India, is a monument not so much to the memory of those who ordered them to be built but to the agony and toil, blood and tears of those unfortunates who were driven out to death in the efforts to built it...’ - AURUNGZEB AND TIPU SULTAN,Evolution of their Religious Polices, by Dr.B.N.Pande, Page. 21)

ఈ మేరకు కూలివాని చెమట అతని శరీరం నుండి ఎండిపోక ముందే అతని కూలిని చెల్లిచాల్సింది గా ఆదేశించిన మహమ్మద్‌ ప్రవక్త ప్రవచనం ప్రకారంగా దార్యా దౌలత్‌ నిర్మాణంలో పాల్గొన్న శ్రమజీవులకు ఆయన ప్రతిఫలం చెల్లింపచేశారు.

                          ప్రజా సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ 

ప్రజల సంక్షెమం, భధ్రత పట్ల ఆయన చాలా శ్రద్ధ వహించారు. ప్రజలకు నష్టం కలిగించే శక్తుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించారు. సహజంగా ప్రభువులకు ప్రభువులు శత్రువులవుతారు. టిపూ ఈ విషయంలో భిన్నత్వం ప్రదార్శించారు. ఆయన తన వ్యక్తిగత శత్రువుల కంటే తన ప్రజలకు ఇబ్బందులు కలగచేస్తూ శత్రువులుగా 24 మైసూర్‌ పులి టిపూ సుల్తాన్‌

ప్రవర్తించిన వారి పట్ల నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించారు. సరిహద్దు ప్రాంతాలలో గల తన ప్రజలను ఇబ్బందుల పాల్జేసిన శక్తులను తన శతృవులుగా ప్రకటిచారు, ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ప్రజలకు ఎవరు శత్రువులో వారు తనకూ శత్రువులని అన్నారు. ఈ మేరకు టిపూ ప్రకటిచిన అధికారిక ప్రవర్తన నియామావళి ఆయన ఉన్నత ఉద్దేశాలను వివరిస్తుంది. నా ప్రజలతో ఎవరు కలహిస్తారో, వారు నాతో యుద్ధం ప్రకటిచినట్టు, అనిటిపూ తన శత్రువులను, సంఘ వ్యతిరేక శక్తులను చాలా తీవ్రంగాహెచ్చరించారు.

     (“ To quarrel with our subjects is to go to war with ourselves.

They are our shield and our buckler; and it is they who furnish us with all things. Reserve the hostile strength of our empire exclusively for its foreign enemies. - AURUNGZEB AND TIPU SULTAN, Evolution of their Religious Polices, BN Pandey, Page. 22) సమాజంలోని బలహీన వర్గాల పట్ల అయన ప్రత్యేక శ్రద్దను కనపర్చారు. పిల్లలు, మహిళలు, వృద్ధుల సంక్షేమం కోసం నిర్దుష్ట చర్యలుతీసుకున్నారు.అనాధలు,ఆడపిల్లలను ఆలయాలలో దేవదాసీలుగా స్వీకరించటం, విదేశాలకు సేవకులుగా విక్రయించటం తగదాన్నారు. ఆనాధాలైన బాలికల క్రయవిక్రయాలు శిక్షార్హమైన తీవ్రనేరాలుగా ప్రకటించారు. అనాధలుస్వయం పోషకులయ్యేందుకు తగిన శిక్షణ, ఆరువాత ఉపాధి అవకాశాలు కల్పించారు. శిల్షణ పూర్తయ్యేంత వరకు మాత్రం ప్రభుత్వం పోషణ బాధ్యాతను స్వీకరిస్తుందని, ఈ మేరకు టిపూ చర్యలు చేపట్టారు.

వికలాంగులకు, అంధులకు ఆత్మస్థయిర్యం కలుగ చేసేందుకు పలురకాల సహయక చర్యలు అమలుచేశారు. ఈ అభాగ్యులు తమ స్వంత కాళ్ళమీద తామునిలబడేందుకు అవసరమగు అన్ని చర్య లను తీసుకోవాలని ఆయన అధికారులకు ఆజ్ఞలుజారీ చేయ టం మాత్రమే కాకుండ, ఆయా బలహీన వర్గాలకు చెందిన పదకాల అమలును కూడ ఆయన స్వయంగా పర్యవేక్షించారు. యుద్ధ రంగంలో చనిపోయిన సైనికుల కుటుంబాల పట్ల ఆయన శ్రద్ధ చూపారు. భర్తలను కోల్పోయిన భార్యలు, వారి పిల్లల పోషణ పట్ల ప్రత్యేక బాధ్యత వహించారు.యుద్ధం వలన వ్యకిగత జీవితాలకు జరిగిన నష్టాల భర్తీకి ఆయన చర్య లు తీసుకున్నారు.

యుద్ధం కారణంగా అన్యాయంగా ఎవ్వరికీ ఎటువంటి నష్టం కలుగరాదాని ఆయన ఆదేశాలు జారీ చేశారు. రాజ్యసేవలో ప్యూన్‌ స్థాయి చిన్న ఉద్యోగులు మరణిస్తేఆ ఉద్యోగి వారసునికి

25 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

ఆ ఉద్యోగం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ ఉద్యోగికి వారసులు లేనట్టయితే ఆకుటుంబానికి తగిన పొలం ఇవ్వాలని, ఆ కుటుంబంలో ఆ పొలం చేసుకునే వారులేనట్టయితే, సదారు పొలాన్ని కౌలుకు చేయించుకుని అవసరాలు గడుపుకునే విధంగా ఏర్పాటు చేయమని ఆయన తన అధికారులకు స్పష్టంగా ఆదేశాలిచ్చారు. మహిళలు, వృద్ధులు, పిల్లలు శతృవర్గానికి చెందిన వారైనప్పటికి టిపూ వారికి ఎటువంటి నష్టం కలిగించలేదు. పరాజిత రాజ్యాల ప్రజలను దోచుకోవటం హీనమైన చర్యగా ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సైనికాధికారులకు చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 1783, 1785, 1787 లో టిపూ జారీ చేసిన ఆజ్ఞలలో, పరాజితప్రాంతాన్నిదోచుకోవడం ద్వారా విజేత సంపన్నంకావచ్చును కాని ఆ ఆచర్య సంపూర్ణ సెన్యాన్ని అగౌరవానికి గురిచేస్తుంది. యుద్ధం యుద్ధబూమికి మాత్రమే పరిమితం కావాలి.యుద్ధాన్ని ఆయాయక సామాన్య పౌరుల మీదకు తీసుకెళ్ళవద్ధు. పరాజిత ప్రాంతాల మహిళలను ఆదారించండి. ఆయా మతాలను గౌరవించండి. వృద్ధులకు, పిల్లలకు రక్షణ కల్పించండి, అని పేర్కొన్నారు. (‘ Looting a conquered enemy enriches a few. But impoverishes that nation and dishonours the entire army. Wars must be confined to battlefields. Do not carry them to innocent civilians. Honour their women, respect their religion, and protect their children and infirm ..’ - Aurangzeb and Tipu Sultan : B N Pandey, Page . 22)

పూర్వీకుల సాంప్రదాయలను గౌరవిస్తూనే అనేక ప్రజోపయాగకర సంస్కరణలకు టిపూ అంకురార్పణ చేశారు. సంస్కరణల అమలు విషయంలో వ్యక్తిగత కష్ట నష్టాలను ప్రజల వ్యతిరేకతను కూడ ఆయన ఖాతరు చేయలేదు. ఖురాన్‌ గ్రంథంలోని ప్రవచనాల ప్రకారంగా వ్యభిచారం, బానిసత్వం, బహు భతృత్వం, మధ్యపానాన్నినిషేధించారు. మలబారు మహిళలు నడుం పైభాగాన ఎటువంటిఆఛ్చాదన లేకుండ అర్ధనగ్నంగాతిరగటం గమనించి మహిళలంతా రవికలు ధరించాలని ఆజ్ఞలు జారీ చేశారు. ఈఆదేశాలను ధిక్కరించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించారు. కాళిమాత పేరుతో సాగుతున్న నరబలిని నిషేధించారు. ఫకీర్లు - సన్యాసులు మాదక ద్రవ్యాలను తీసుకోవటం తీవ్రమైన నేరంగా పరిగణించారు. పొగాకు సేవనం ఆనారోగ్యకరమని నిషేధించారు. ప్రతి వ్యక్తి పొదుపును అలవర్చుకోవాలని. అనవసర దుబారాను తగ్గించాలని, వ్యక్తి తనసంపాదానలో ఒక శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని విలాసాలకు ఖర్చు చేయరాదని ఖచ్చితమైన ఆజ్ఞలు జారీచేసారు. 26 మైసూర్‌ పులి టిపూ సుల్తాన్‌

                అంతర్జాతీయ వ్యవహారదక్షుడు

టిపూ 17 సంవత్సరాల పాటు సాగించిన పరిపాలనలో అత్యధిక సమయం తన రాజ్యాన్ని కబళించాలనుకుంటున్న బ్రిీటిషర్లను, నిజాం నవాబు, మరాఠాలను ఎదుర్కొంటూ గడిపినప్పటికీ, స్వదేశీ వ్యవహారాలను చక్కదిద్ధుకుంటూనే, అంతర్జాతీయ వ్యవహారాలను కూడ దక్షతతో నిర్వహించి చరిత్రకారుల ప్రశంసలను అందుకున్నారు.మాతృభూమి నుండి ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులను తరిమి కొట్టేందుకు పొరుగున ఉన్న నిజాం నవాబు, మరాఠా నాయకులు ఏకమై ఐక్య సంఘటనగా ఏర్పడేందుకు తనతో కలసి రావాల్సిందిగా కోరారు. బలమైన శక్తిగా ఎదుగుతున్న మైసూరు రాజ్య ప్రాభవ వైభవాన్ని సహించలేని స్వదేశీపాలకులు, ఆయనకు తోడ్పటు ఇవ్వకపోవటంతో విదేశీయుల వైపు దాష్టిసారించారు. శత్రువు శత్రువు, మిత్రుడు, అనే రాజకీయ సూత్రీకరణను అనుసరిస్తూ, తొలుత ఫ్రెంచ్‌వారిని, ఆ తరువాత టర్కీ, అఫ్గనిస్తాన్‌; ఇరాన్‌, దేశాధినేతల స్నేహహస్తం కోరారు. టిపూ వ్యవహార దక్ష్తత వలన ఈ దేశాధి నేతల నుండి అనుకూల స్పందన లభించింది. ఆనాడు అంతర్జాతీయ రంగాన బ్రిీటిషర్ల ప్రభ బాగా వెలిగిపోతున్నందున,కీలకమైన చివరి దశలో టిపూకు సహాయం లభించలేదు. ఫ్రెంచి వారు చాలాకాలం టిపూతో స్నేహం నెరపినప్పటికీ, ఎడు సంవత్సరాల తరువాత ఫ్రాన్స్‌- ఇంగ్లాండ్‌ మధ్యన కుదిరిన శాంతి ఒప్పందాన్ని సాకుగా తీసుకుని ఫ్రెంచి సైన్యాధితులు ఆత్యంత కీలక సమయంలో టిపూకు సహాయం చేయ నిరాకరించారు. బ్రిీషర్లను తరిమి క్టొాలన్న ఏకైక లక్ష్యంతో టిపూ నిరంతరర సాగించిన ప్రయత్యాల ఫలితంగా ఆయన సహాయానికి తరలి వసున్నట్టుగా ఒక దశలో నెపోలియన్‌ తెలిపారు. ఈ మేరకు టిపూకు నెపోలియన్‌ లేఖకూడ రాసాడు. ( "....You have been already informed of my arrival on borders of the sea, with an invincible army, full of the desire of delivering you from the iron yoke of England.." - TIPU SULTAN : HIS VISION AND MISSION, By Prof. B. Sheik Ali, Page. 14) ఆని టిపూకు రాసిన లేఖలో నెపోలియన్‌ పేర్కొన్నాడు. మాతృభూమిని కబళించాలనుకుంటున్న బ్రిీటిషర్లకు వ్యతిరేకంగా పోరాటం చేయడనికి ఇతర దేశాల స్నేహస్తం కాంక్షించినట్టుగానే, దేశీయ వర్తక, వాణిజ్యాలు,ఎగుమతులు, దిగుమతులు, స్వదేశీ పరిశ్రమలు, ఆధునిక ఆయుధాల తయారికి 27 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

అవసరమగు సాంకేతిక పరిజ్ఞానాన్ని బయట నుండి సంపాదించేందుకు, మిత్ర రాజ్యాలతో వాణిజ్య సంబంధాలను పటిష్ట పర్చేదుకు, టిపూ ఎంతో బుద్ధి కుశలతతో వ్యవహరించి విజయం సాధించారు. కచ్‌, మస్క్‌, పెరూ, ఒర్మాజ్‌, జిద్దా, బసరా, ఎడెన్‌ రాజ్యాలలో వర్తక-వాణిజ్య కేంద్రాలను ఏర్పాటు చేయటమేకాక, చైనా, ప్రాన్స్‌, టర్కీ, ఇరాన్‌ లాింటి దేశాలతో మంచి సంబంధాలు నెలకొల్పారు.

' స్వదేశీ ' ఉద్యామకారుడు

టిపూ శతాబ్దం క్రితమే స్వదేశీ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు జాతీయోద్యమంలో భాగంగా మన దేశంలో ప్రారంభమైన స్వదేశీ ఉద్యమం కంటె ముందుగా టిపూ ఆ ఆలోచనను తన గడ్డ మీదకు తీసుకవచ్చారని చెప్పవచ్చు.ఆయన విదేశీ వర్తకాన్ని ఏమేరకు ప్రోత్సహించినా బ్రిీటిషర్ల వస్తువుల వాడకాన్ని మాత్రం అంగీకరించలేదు. వలస పాలకుల వస్తులన్నిటినీ టిపూ తన రాజ్యంలో నిషేధించారు.ప్రభుత్వ పరంగా ఇంగ్లాండు నుండి ఎటువంటి వస్తువును రానివ్వలేదు. ఇంగ్లాండు వర్తకుల నుండి ఎటువింటి వస్తువులను కొనరాదంటూ, ప్రభుత్వ వ్యాపార ప్రతినిధులకు ప్రత్యేక ఆదేశాలను జారీచేశారు. ఆ కారణంగా ఇంగ్లాండు దిగుమతులను కాదన్నారు. టిపూ తన వ్యక్తిగత వస్తువులలో ఇంగ్లాండు వస్తువులను నిషేధించారు. ఈ విషయమై ఆయన తన వారికి నిర్ధుష్టమైన ఆదేశాలిచ్చారు. ఆయన భారతీయ దుస్తులను మాత్రమేధరించారు. మద్రాసునుండి కంపెనీ వ్యాపారులు విక్రయిస్తున్న ఉప్పును కొనుగోలు చేయవద్దని ప్రత్యేక ఆజ్ఞలు జారీచేశారు. ఇంగ్లాండు వర్తకుల మీద ఆయన ఆంక్షలు విధించారు. సామాన్య ప్రజల వలె వారు వ్యవహరించ వీలు లేకుండ చేశారు. పరిమితులు విధించారు. అవసరమైతే వారి ఆస్థిపాస్తులను జప్తు చేయడనికి కూడ ఆయన సిద్ధాపడ్డారు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ వ్యాపారం దాfiరా మన దేశంలో ప్రవేశించి, స్వదేశీ రాజ్యాలను దిగమింగుతూ క్రమంగా విస్తరిస్తున్న వైనం వలన రానున్న ప్రమాదాన్ని పసిగట్టిన టిపూ ఈ వ్యాపారుల మీద ప్రత్యేక ఆంక్షలను విధించారు. బ్రిీష్‌ వర్తకుల సరుకులను కొనుగోలు చేయకుంటే, గత్యంతరంలేని పరిస్థితులలో కంపెనీ పాలకులు ఈ దేశం వదాలి వెడతారంటూ ఆయన భావించారు. ఈ విషయాన్నిముస్లి షంషుద్దీన్‌ అహమ్మద్‌ రేడియన్స్‌ వారపత్రికలో ( 1-7 ఆగస్టు,1999) రాసిన ఆంగ్ల వ్యాసంలో ఈ క్రింది విధంగా పేర్కొన్నారు. 28 మైసూర్‌ పులి టిపూ సుల్తాన్‌ ‘ He was the first Indian leader (Years before Gandhiji) who believed in non-cooperation with foreigners. He wrote to his officers in Calcutta not to purchase goods from English traders, thus they would automatically be compelled to leave the country.’


                                      సాహిత్యాభిలాషి

తండ్రి హైదర్‌ ఆలీ శ్రద్ధవలన టిపూ విద్యాధికుడు కావటమే కాకుండ, సాహిత్యాభిలాషిగా కూడ పేర్గాంచారు. పండితులను గౌరవించటం, సాహిత్య సభలను నిర్వహించటం, గ్రంథాలను రాయించటం పట్ల టిపూ ఎంతో ఆసక్తి చూపారు.కవి,పండితులకు ఆర్థిక వెసులుబాటు కల్పించారు. ప్రత్యేకాంశాలలో పేరొందిన పండిత ప్రముఖులను ఆహ్వానించి 45 ఉపయుక్త గ్రంథాలను రాయించారు. టిపూ స్వయంగా రచయిత. ఆయన కూడ ఉర్దూ భాషలో గ్రంథాలు రాశారు. 1793లో ' Fauji Akhbar ' అను ఉర్దూ వారపత్రికను ఆయన ప్రారంభించారు. ఈ పత్రిక ప్రచురణ నిమిత్తం ఆయన అరబిక్‌ టైపుతో ప్టింగ్ ప్రెస్‌ను కూడ ఏర్పాటు చేయించారు. ఆనాడు ఫారశీ దార్బారు భాష ఆయనప్పికి సామాన్య ప్రజల భాషగా ప్రాచుర్యం పొందిన ఉర్దూ భాషలో ఆయన పత్రికను తీసుకరావటం విశేషం.పౌజీ అక్బార్‌ను ఆయన జీవిత చరమాంకం వరకు నడిపారు. ఈ పత్రిక టిపూ సెన్యానికి

టిపూ స్వదాస్తూరి

29 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

సంబంధించిన సమాచారం మాత్రమే అందించేది కావటంతో సామాన్య ప్రజల వరకు అది చేరలేదు. టిపూకు అరబ్బి, పర్షియన్‌, కన్నడ, ఉర్దూ, ఇంగ్లీషు, ఫ్రెంచి భాషలు బాగా తెలుసు. ఆయనకు హస్తసాముద్రికం, జ్యోతిశ్శాస్త్రంలో మంచి ప్రవేశం ఉంది. నిరంతరం యుద్ధాలలో మునిగితేలుతున్న సుశిక్షితుడైన పోరాటయోధుడు అయినప్పికి ఆయన సంగీతంలో కూడ మంచి ప్రతిభ చూపారు. ఆయన స్వయంగా పలు పాటలు రాసి వాటికి బాణీలు కూడ కట్టారని, అటువంటి ఓ పాటను యుద్ధ సమయాలలో సైనికులను ఉత్తేజితులను చేసేందుకు ఆ పాటను మార్చింగ్ సాంగ్ గా వాడేవారని,ప్రముఖ రచయిత మొహమ్మద్‌ షౌకత్‌ మీర్జా తన గ్రంథం ' బసేరా ' లో ఉటంకించారు.ఆయన స్వయంగా ఆలిమ్‌, ఫాజిల్‌ మాత్రమే కాకుండ ఖురాన్‌ గ్రంథాన్ని చాలా క్షుణ్ణంగా అధ్య యనం చేశారు. నిత్య జీవితంలోని సమస్యలకు ఖురాన్‌ గ్రంథం నుండి ప్రవచనాలను అతి సునాయసంగా ఉల్లేఖిస్తూ, పరిష్కార మార్గాలు సూచించే వారు. టిపూకు అక్షరం అంటే మహాప్రీతి.ఆయన వివాహ సమయంలో వివాహ కానుకగా ఏది కావాలో కోరుకోమని తండ్రి హెదార్‌ అలీ అనగా, తనకొక గ్రంథాలయం కట్టివ్వమని తండ్రిని కోరారు. ఆ కోరికతో మహానందపడన హెదర్‌ అలీ గ్రంథాలయాన్ని నిర్మించి ఇవ్వటమే కాకుండ, దేశ విదేశాల నుండి పలు భాషలలో గల అనేక గ్రంథాలను తెప్పించి టిపూకు కానుకగా ఇచ్చారు. టిపూ గ్రంథాలయం విలువైన 2 వేల పుస్తకాలతోనిండి ఉండేది. ఆయన గ్రంథాలయంలో మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబు స్వదాస్తూరితో రాసిన ఖురాన్‌ కూడ ఉంది. ఈ గ్రంథాలను ఓ పద్దతి ప్రకారం జాగ్రత్త పర్చేవారు. టిపూ ఓ గ్రంథం తీసుకుని దానిని చదవడం పూర్తి చేశాక, ఆ గ్రంథం మీదా ప్రత్యేక ముద్రను వేయటం అధికారుల రివాజు. 1799లో శ్రీరంగ పట్నాన్ని దోచుకువన్నబ్రిీటిషర్ల కూటమి సాగించిన విద్వంసానికి ఈ గ్రంథాలయం కూడ గురి కావటంతో అందులోని అపూర్వ గ్రంథాలు కనుమరుగైపోయాయి. టిపూ నిరంతరం రాజకీయాలు, పోరాటాలు, యుద్ధాలలో మునిగి తేలుతూ కూడ ప్రతిరోజు ఏదో ఒక పుస్తకాన్ని కొంతసేపన్నాచదవనిదే విశ్రమించేవారు కారు. ఈ రకంగా ఆయన దేశ విదేశాల నుండి గ్రంథాలను తెప్పించుకుని అధ్యాయనంచేసినందున అధునిక భావనలను,సాంకేతిక విజ్ఞానాన్ని బాగా సంతరించుకున్నారు. ఈపరిజ్ఞానాన్ని మైసూరు రాజ్య పటిష్టతకు, మైసూరు రాజ్య ప్రజల సంక్షేమానికి టిపూ వినియోగించారు. 30 మైసూర్‌ పులిటిపూ సుల్తాన్‌

విశ్వవిద్యాలయం ఏర్పాటు సంకల్పం ప్రజలను విద్యావంతులుని చేయటానికి టిపూ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. విద్యను నిర్బంధం చేసి, ఉచిత విద్యను ప్రవేశపెట్టారు. పలు విద్యాలయాలను ఏర్పాటుచేయించారు. బాగా చదువుకునే బిడ్డలకు ప్రోత్సాహకాలను ప్రకటించారు. చదువుపట్ల ప్రత్యే క దాృష్టిగల ఆయన విజ్ఞానార్జనకు ప్రయ త్నించే ప్రతివారిని చాలా గౌరవించారు.మైసూరు రాజ్య రాజధాని శ్రీరంగపట్నంలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని టిపూ సంకల్పించారు. ఆ విశ్వవిద్యాలయానికి JAMIAL UMUR అని నామకరణం చేయాలని ఉవ్వీళ్ళారారు. ఆ విస్వావిద్యాలయంలో భారతీయ విజ్ఞానంతో పాటుగా, పాశ్చాత్యవిజ్ఞానాణ్ణీ బోధించాలని, మానవీయ, సాంకేతిక విద్యాభ్యాసానికి అగ్రస్థానం కల్పించాలని ఆశించారు. ఆ మైసూరు సూర్యుడు ఆకస్మికంగా అస్తమించటంతో విస్వావిద్యాలయం ఏర్పాటు కలగానే మిగిలి పోయింది. ఆనాితీ తీపూ కలను నిజం చేస్తూ, ఆయన ఆశించిన రీతిలో కాకపోయినా ఆయన గౌరవార్థం ఆయన జన్మస్థానంలో ఆయన పేరిట విస్వావిద్యాలయం ఏర్పాటు చేయాలని కర్నాటక రాష్ట్ర ప్రభుత్వంతగు చర్యలను తీసుకొంటుంది. ఈ విషయాన్నిఆ రాష్ట్ర మైనారిటి సంక్షేమ శాఖామాత్యులు అబ్దుల్‌ జబ్బార్‌ ఖాన్‌ 2006 జనవరిలో ప్రకటించారు. అలీఘర్‌లో ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయంలా టిపూ జన్మించిన దేవనహళ్ళి ప్రాంతంలో ఆయన గౌరవార్థం ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రయత్నాలు సాగుతున్నాయని, ఈ మేరకు కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని మంత్రి తెలిపారు. (The Mali Gazette,16-21 Jan 2006 Page. 20)

                   మతాభిమాని తప్ప మత దురభిమాని కాదు

టిపూ సుల్తాన్‌ ఇస్లాం ధార్మానురక్తుడు. మంచి ముస్లిం. అనునిత్యం దైవనామ స్మరణతో, అయిదు పూట్ల నమాజులు అదా చేస్తూ, ఆయన రోజువారి జీవనం సాగింది.ఆయన స్వమతం పట్ల అభిమానం గల ప్రబువు తప్ప , మతదు రబిమానికాదు. మతపజక్షపాతిఅంతకంటే కాదు. ఆయన ప్రజలు ఏ మతస్థులైనా ఏ విషయంలో కూడ ఆయన వివక్షత చూపలేదు. భూమి శిస్తు, వృత్తి-వ్యాపారాలపై పన్నులు, శాసనాలు రాజ్య ప్రజలందరికి సమానం.బంధు ప్రీతికి దూరంగా సమర్దతకు , విశ్వాసానికి ఆయన పట్టంకట్టారు

31

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

             శ్రీరంగపట్నంలోని టిపూ సుల్తాన్‌ నిర్మించిన మస్జిద్‌-వి-ఆలా

ఒకసారి టిపూ వద్దకు ఎవరో వచ్చి, బ్రాహ్మణులు నమ్మదగ్గవారు కారని ఆరోపించాడు. ఈ ఆరోపణ వింటూనే ఆగ్రహించిన టిపూ ప్రతిస్పందిస్తూ, తన తండ్రి హైదార్‌ అలీతోపాటు తాను కూడ ఎంతగానో గౌరవించే శ్రీ పూర్ణయ్య (బ్రాహ్మణులు) సేవలను ఆయన ఉటంకించారు. ఎవరి పాప పుణ్యాలు వారివి మాత్రమే, ఎవరు నేరం చేస్తే వారికి మాత్రమే శిక్ష అంటూ, ఖురాన్‌ గ్రంథంలోని ప్రవచనాలను ఉటంకించారు. ఈ రకమై ఫిర్యాదులను భవిష్యత్తులో తన వద్దకు తీసుకొని రావద్దని,ఫిర్యాదులతో వచ్చిన పెద్ద మనుషులను ఆయన తీవ్రంగా హెచ్చరించారు. టిపూ రాజ్యంలోని పలు ప్రముఖ పదవులలో ముస్లింలు మాత్రమే కాదు అత్యధిక పదవులలో ముస్లిమేతరు లు ఉన్నారు. శ్రీ పూర్ణయ్య (ప్రదాన దివాన్‌), శ్రీకృష్ణారావు(ఆర్థిక శాఖ) శ్రీ శామయ్య (నిఘా విభాగం) శ్రీ అప్పాజీ, శ్రీనివాసరావు, శ్రీ మూల్‌చంద్‌,శ్రీ సుజన్‌రావ్‌(దౌత్య ప్రతినిధుా లు), శ్రీహరిసింగ్, శ్రీరామారావు, శ్రీ శ్రీపాల్‌ రావ్‌ (సెన్యం) తదితరులు ముఖ్యులు. టిపూ సైన్యంలోని పందొమ్మిది మంది సేనాధిపతులలో పదిమంది, పదమూడు మంది మంత్రులలో ఏడుగురు హిందువులని శ్రీ బి.యన్‌. పాండే తన గ్రంధంలో వెల్లడించారు. 32 మైసూర్‌ పులి టిపూ సుల్తాన్‌

ఇస్లాం విగ్రహారాధానకు వ్యతిరేకం అయినా, ఆయన మాత్రం తన రాజ్యంలో విగ్రహారాధనను సహంచటం మాత్రనమే కాకుండ ముస్లిమేతరుల ఆలయాలను, చర్చీలను,ఆయా సాంఫిుక జనసముదాయాల ప్రజలను ప్రోత్సహించారు. మైసూరు రాజ్యంలో గల పలు ఆలయాలకు ఆయన ప్రతి ఏటా గ్రాంటులను, ప్రత్యేక నిధులను సమర్పించారు. పూర్వం మైసూరు రాజులు పాిటించిన నియమాలను, ఒరవడిని ఆయన కొనసాగించారు. ఈ మేరకు ఆలయాలకు సంబంధించి 156 ఫర్మానాలు జారీచేశారు.ప్రముఖ శృంగేరి మఠం స్వామీజీతో పలు ధార్మిక, సామాజిక విషయాలను ప్రస్తావిస్తూ,కన్నడంలో టిపూ 30 లేఖలు వ్రాశారు. ప్రసిద్ధిచెందిన లక్ష్మీనాధస్వామి ఆలయం (కలాల), నారాయణస్వామి ఆలయం (మేల్కోట్), శ్రీ కంఠేశ్వర ఆలయం, నజుండేశ్వరి ఆలయం (నంజూగూడ్‌) తదితర ఆలయాలకు అవసరమగు వెండి, బంగారు పాత్రలు, ఆభరణాలు,

ప్రతి రో ప్రాతóకాలాన టిపూ సందర్శించే శ్రీరంగనాథ ఆలయం 33 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

ఖరీదైన దుస్తులను టిపూ అందాచేశారు. తండ్రి హెదర్‌ అలీచేత శంఖుస్థాపన చేయబడిన కాంజీవరం గోపురాలయం నిర్మాణాన్ని ఎంతో శ్రద్ధతో టిపూ పూర్తి చేయించారు. ఈఆలయ నిర్మాణానికి 10 వేల నాణాలను విరాళంగా అందచేశారు. అనంతరం అక్కడ జరిగిన రథోత్సవంలో టిపూ స్వయంగా పాల్గొన్నారు. ఆలయాల అజమాయిషికి టిపూ ప్రత్యేకంగా ఒక శాఖ ఏర్పాటు చేశారు. మఠాలకు సంబంధించిన ఆస్తుల మంచి చెడ్డలను ఆ శాఖాధికారులు పర్యవేక్షించేవారు.ఆలయాల పరిరక్షణకు కూడ పలు చర్యలు తీసుకున్నారు. ఆయన సైన్యం దిండిగల్‌ కోటమీద దాడి చేసినప్పుడు కోటలోని ఆలయానికి ఎటువంటి నష్టం వాటిల్లకుండ ఫిరంగిదళం దాడులు జరపాలని, తన సైనికులకు, సైనికాధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. టిపూ ప్రాసాదం సమీపాన ఒకవైపు మసీదు ఉంది. ఆ మసీదును ఆయన 1790 జూన్‌ మాసం 4 వ తేదిన కట్టించారు. ఆ ప్రాసాదానికి మరొకవైపున శ్రీరంగనాధస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం చాలా పురాతనమెనది. ఆ పరిసరాలలో మరికొన్నిఆలయాలున్నాయి. నమాజుకు రమ్మని మసీదునుండి వినపడే పిలుపుకు ఆయన ఎంతటి ప్రాధాన్యం యిచ్చేవారో శ్రీరంగనాధాస్వామి ఆలయం, ఇతర ఆలయాలనుండి వినవచ్చే జేగంటలకు టిపూ అంతే ప్రాముఖ్యత ఇచ్చారు. ప్రతిరోజు ఉదయం అల్పాహారం తీసుకునే ముందు శ్రీరంగనాధాస్వామి ఆలయాన్ని సందర్శించడం ఆయన అలవాటని, ఈ విషయంలో ఆయన మైసూరు ప్రబువుల ఈ సంప్రదాయాన్ని అనుసరించారని ప్రముఖ చరిత్రకారుడు శ్రీ బి.ఎన్‌. పాండే తన Aurangzeb and Tipu Sultan-Evaluation of their Religious Policies గ్రధంలోపృర్కొన్నారు. (..." Tipu Sultan, as was customary with the rulers of Mysore, daily visited the temple of Lord Ranganatha located inside the fort of Srirangapatnam, before taking his break fast." - Page 19)

బలవంత మతాంతీకరణలకు ముస్లిం రాజులు పాల్పడ్డారంటూ టిపూ మీద కూడ ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు ఓ పథకం ప్రకారంగా టిపూ అంటే ముస్లిమేతరులలో విద్వేషం కలిగించేందుకు ఆంగ్లేయ రచయితలు, ఆ తరువాతి కాలంలోకొందరు స్వదేశీ రచయితలు ప్రచారంలో పేట్టారు. ఈ వాదానలను పూర్వపక్షం చేస్తూ ప్రముఖ చరిత్రకారుడు ఆర్‌.సి.మజుందార్‌ తన An Advance History of India లో '..he was not fierce bigot...Though a pious Muslim, he did not attempt any wholesale conversion of his Hindu subjects...' అని వ్యాఖ్యానించాడు. 34 మైసూర్‌ పులి టిపూ సుల్తాన్‌

                     లౌకిక పభ్రువు

టిపూలౌకిక ప్రభువు. ఆయన చిన్నతనంలో, తండ్రి హైదర్‌ అలీ వద్దకు ఓ ముస్లిం ముల్లా ప్రముఖుడొకరు ఫిర్యాదు తెచ్చాడు. ప్రభువుకు తన ఫిర్యాదును విన్పిస్తూ, ఒక ముస్లిం రాజ్యంలో ముస్లిం ముల్లాలకు న్యాయం జరగటం లేదని నిందించాడు. ఆ ఆరోపణ వింటూనే, 'ఈ రాజ్యం ముస్లింలదని ఎవరన్నారు?' (Who told you that this was a Mussalman Government? ) అంటూ హైదార్‌ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విధంగా మత మనోభావాలకు అతీతంగా రాజ్య నిర్వహణ సాగించిన తండ్రి బిడడు కావడంతో టిపూ కూడ మతాతీతంగా వ్యవహరించారు. ప్రజల మత విశ్వాసాలలో కలుగజేసుకోవద్దని అధికారులకు కూడ స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. బహుళ మతాలు, జాతుల ప్రజలు సహజీవనం సాగిస్తున్న రాజ్యంలో అన్ని మతాలకు చెందిన ప్రజల పట్ల సమభావన చూపడం టిపూ ప్రత్యేకత. అందువలన ప్రతి ఒక్కరి మత సాంప్రదాయాలను ఆయన గౌరవించారు. నైతిక విలువలకు భంగకరం కానంతవరకు ఎవరి మత ఆచారం-సాంప్రదాయాలను ఆయన పట్టించుకోలేదు. . ఒకసారి టిపూ వద్దకు ఒక పౌజ్‌దారీ వచ్చాడు. ఆయన ఒక ధర్మ సందేశం గురించి వివరిస్తూ, ఒక ముస్లిమేతర యువకుడు ముస్లిం బాలికను వివాహం చేసుకున్నాడని, దీనివలన ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నదని పేర్కొన్నాడు. ఈ వివాహం విషయమై మరింత వివరణ ఇస్తూ, ఈ వివాహం షరియత్‌ ప్రకారం చెల్లదు,అందువలన నిందితులను శిక్షించేందుకు ఎటువంటి చర్య లు తీసుకోవాలో తెలుపమంటూ టిపూను అభ్యర్థించాడు.

(‘..a Hindu had married a Muslim lady causing tension in the locality. As such the marriage was not permitted in the Shariat, what action should be taken to punish the culprits ‘ - AURUNGZEB AND TIPU SULTAN, Evaluation of their Religious Polices, by Dr.B.N.Pande,Page. 19)

ఈ సమస్య విషయమై టిపూ స్పందిస్తూ, ప్రజల వ్యక్తిగత, మత సంబంధమైన విషయాలలో ఎటువింటి జోక్యం చేసుకున్నాసహించేది లేదని, శాంతి భద్రతలను కాపాడటం, ప్రజల ఆస్తులను రక్షించడం అధికారుల పూర్తి బాధ్య తగా గుర్తించుకోవాలని హెచ్చరించారు. ప్రజలకు సరైన న్యాయం ప్రసాదించేందుకు, అన్నిమతాల 35 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

ఆచార-సంప్రదాయాలను గౌరవించి, విచారణ సమయంలో ఆయా అంశాలను పరిగణలోకి తీసుకునేందుకు, ప్రధాన న్యాయస్థానాలలో అన్నిమతాలకు చెందిన న్యాయాధికారులను నియమించారు. ప్రజల ఫర్యాదులను, సమస్యలను వ్యకిగత చట్టాలను అనుసరించి విచారించమని, అధికారులను, న్యాయాధికారులను ఆదేశించారు.

ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులతో పోరాడుతున్నా క్రైస్తవ మతాచారుల పట్ల ఎంతో గౌరవం, ఆదరణ చూపారు. మసీదుా -మందిరం-చర్చీల మధ్యన టిపూ ఎటువంటి తేడ చూపించలేదు. చర్చీల వివాదాల సందర్భంగా నిష్పాక్షికంగా వ్యవహరిం చటమే కాకుండ, ఆయా చర్చీల, ఆ చర్చీల నిర్వహకుల రక్షణకు పలు ఏర్పాట్లు చేశారు.

1791-92లో మెసూరు రాజ్య భాగమైన షిమోగా మీద దాడి జరిపిన మహారాష్ట్ర సర్దారు రఘునాధారావు పట్వర్ధన్‌, సమీపంలో ఉన్న శృంగేరి పీఠానికి చెందిన మఠం మీదా కూడ దాడి చేశాడు. ఆ దాడిలో మఠాన్ని కొల్లగోట్టి, బ్రహ్మణులను చంపి,శారదాలయంలో ఉన్న నగానట్టాను, విలువెన వస్తువులను దోచుకున్నారు. ఆలయంలోని శారదామాత విగ్రహాన్ని కూడ పెకిలించి బయటకు విసిరివేశారు.

ఈ దాడిలో మరాఠా దండు సాగించిన క్రూరత్వాన్నితట్టుకోలేక జగద్గురు సచ్చిదానంద భారతి మహాస్వామి మఠం వీడి మరోచోట తలదాచుకుని టిపూకు ఓ లేఖ ద్వారా దుస్సంఘటన వివరాలను తెలిపారు. టిపూ సుల్తాన్‌ సహయాన్ని సహకారాన్నీ ఆయన ఆ లేఖలలో అర్థించారు. ఆ లేఖకు తక్షణమే స్పందిస్తూ, జరిగిన సంఘటనకు తన బాధను వ్యకం చేసూ పీరాధిపతి లేఖకు సమాధానం రాస్తూ 'అంతటి పవిత్ర స్తలం మీద అలాింటి అకృత్యానికి పాల్పడిన వాళ్ళు పాపపలితాన్ని అనుభవించక తప్పదాని ' టిపూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

టిపూ అంతటితో సరిపెట్టుకోలేదు. ఆలయ పునరుద్ధరణ, సంప్రోక్షణ తదితర కార్యక్రమాలకు అవసరమగు సహాయ-సహకారాలు అందించాల్సిందిగా, బేదనూరులో గల తన సర్దారుకు ఆదేశాలు జారీచేశారు. శారదా దేవి విగ్రహ పునóప్రతిష్ట జరిగాక జగద్గురు పంపిన శాలువా, ప్రసాదాన్నిఆయన స్వయంగా స్వీకరించారు. అనంతరం అమ్మవారికి కానుకలు, ప్రత్యేక వస్త్రాలను పంపారు.

ఈ సందర్భంగా జగద్గురుకు రాసిన లేఖలో, 'మీరు జగద్గురువులు. మీరు ప్రపంచమంతా సుభిక్షంగా ఉండాలని ప్రజలంతా సుఖ:శాంతులతో గడపాలని కోరుకుంటూ సదా జపతపాలలో నిమగ్నమై యుంటారు. మా ప్రజలంతా సుభిక్షంగా 36 మైసూర్‌ పులి టిపూ సుల్తాన్‌

ఉండలని భగవంతుడ్ని ప్రార్ధించండి. మీలాింటి మహనీయులు ఎక్కడ నివసిస్తారో ఆదేశంలో మంచి వర్షాలు కురుస్తాయి. మంచి పంటలు పండుతాయి.', అని జగద్గురు పట్ల తనకున్నగౌరవాన్ని టిపూ వ్యక్తం చేశారు. ( ‘ You are the Jagdguru, Your are always performing penance in order that whole world may prosper, and the people may be happy.Please pray God for increase of our prosperity. In whatever country holy persons like yourself my reside that country will flourish with good shows and crops ‘ - The Tigers of Mysore by Proxy Fernandez, page.212)

                         ఉద్దేశ్యపూర్వక వక్రీకరణలు

టిపూ సుల్తాన్‌ మత సామరస్యాన్నిఎంతగా పాిటించినా, ఈ గడ్డను ఆక్రమిం చుకున్న బ్రిీటిషర్లు, ముస్లిం వ్యతిరేకతను నింపుకున్న స్వదేశీ చరిత్రకారులు, టిపూను ముస్లిమేతర మతస్థుల పట్ల దారుణంగా వ్యవహరించిన మతోన్మాదిగా చిత్రించారు. ఆ మేరకు బహుళ ప్రచారం చేశారు. ఈ ప్రచారం చాలా కాలం వరకు సాగింది. ప్రజలు,ప్రముఖులు కూడ అసత్యాలను-అర్ధ సత్యాలను, వక్రీకరణలను సత్యాలుగా నమ్మటం జరిగింది. ఈ కారణంగా టటిపూ గురించి పలు దుర్భావనలు కొంతకాలం చోటు చేసుకున్నాయి.

ఈ అసత్యాలు ఎంతో కాలం నిలబడలేదు. అనంతర కాలంలో సాగిన పలు పరిశోధనలు, పరిశోధకుల కృషి వాస్తవాలను నిగ్గుతేల్చింది. నిజాయితీ నిబద్ధతగల పరిశోధకులు, వాస్తవిక చరిత్రను ప్రజల ముందుకు తెచ్చారు. ఆ కృషి వలన అసత్యప్రచారం, వక్రీరణల వెనుక గల వ్యక్తుల-వ్యవస్థల దురుద్దేశాలు బహిర్గతయ్యాయి. టిపూ బలవంత మత మార్పిడికి పాల్పడినందున మతాంతరీకరణ యిష్టంలేని మూడు వేలమంది బ్రాహ్మణులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆ ఆత్మహత్యల దాుస్సంఘటనలకు ిపూ కారణమని ప్రధానంగా ఆరోపణ వచ్చింది. (Three Thousand Brahmins committed sucide as Tipu wanted to convert them forcibly into the fold of Islam. -Aurungzeb and Tipu Sultan : BN Pande, Page. 14)

ఈ ఆరోపణలను కలకత్తా విస్వవిద్యాలయానికి చెందిన సంస్కృత విభాగం అధిపతి డా. హర ప్రసాద్‌ శాస్త్రి తాను రాసిన మెిట్రిక్యులేషన్‌ స్థాయి చరిత్ర పాఠ్యపుస్తకంలో 37 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

పేర్కొన్నారు. ఈ పుస్తకం ఆనాటి బెంగాల్‌, అస్సాం, ఉత్తర పదేశ్‌, మధ్య ప్రదేశ్‌, రాజస్థాన్‌, రాష్ట్రాలలోని ఉన్నత పాఠశాల విద్యార్థుల చరిత్ర పాఠ్య గ్రంథంగా చాలా కాలం చెలామణీ అయ్యింది.

ఈ విషయం చాలకాలం తర్వాత ప్రఖ్యాత చరిత్ర పరిశోధకుడు, ఆ తరువాతి కాలంలో పార్లమెంటు సభ్యులు, రాజస్థాన్‌ గవర్నర్‌గా పనిచేసిన డా|| బి.యన్‌. పాండే దృష్టికి (1928-29) వచ్చింది. ఆయన Religious of Tipu Sultan అను విషయం మీద ఆనాడు పరిశోధన చేసుnnaaరు. టిపూ లౌకిక ప్రబువుగా నిరూపించే పలు దాష్టాంతాలు, ఫర్మానాలు, మఠాలకు, మఠాధికారులకు, జగద్గురువులకు,పీఠాధిపతులకు రాసిన వందలాది లేఖలను అధ్యయనం చేసిన ఆయనకు ఈ విషయం ఆశ్చర్యకరం అన్పించింది. మతాలు, మత విశ్వాసాలు, మతస్తుల పట్ల సమాన గౌరవాన్ని ప్రదర్శించిన టిపూ మీద వచ్చిన ఇటువింటి ఆరోపణలను శ్రీ పాండే నమ్మలేక పోయారు.

ఈ విషయం గురించి వాస్తవం తెలుసుకోవాలని ఆయనలో ఉత్సుకత కలిగింది. ఆ సమాచారానికి ఆధారాలేవో తెలుపమని, డా|| హర ప్రసాద్‌ శాస్త్రికి పలు లేఖ రాసారు. శ్రీ శాస్త్రి నుండి ఎటువంటి సమాధానం రాలేదు. శ్రీ పాండే పట్టువదలని విక్రమార్కునిలా ఉత్తరాలు రాయసాగారు. చివరకు తన లేఖకు సమాధానం రాకున్నట్లయితే, డా|| హర ప్రసాద్‌ శాస్త్రి ఆరోపణలు, ఆ తదుపరి చర్య లను మేధోపరమై న వంచనగా పరిగణంచాల్సి వస్తుందని శ్రీ శాస్రిని ఆయన హెచ్చరించారు. ఆ హెచ్చరికతో,ఆ సంఘటన వివరాలు మైసూరు గెజిట్లో ఉన్నాయంటూ, ఒక్క చిన్నమాట రాసిన లేఖను పంపి డా|| శాస్త్రి సరిపెట్టదలచుకున్నారు.

డాకర్‌ శాస్త్రి పంపిన ఆ వివరాల మేరకు, శ్రీ బి.యన్‌. పాండే మైసూరు గెజిట్ లో ఈ సంఘటన కోసం అంవేషించారు. ఈ విషయమై, మైసూరు చరిత్ర మీద నిష్ణాతులైన ప్రోఫెసర్‌ శ్రీకాంతయ్య, శ్రీ బ్రిజేంద్రానాధ్‌ సీల్‌లను ఆయన సంప్రదించారు. మైసూరు రాజ్య చరిత్ర మీద మంచి పరిజ్ఞానం కలిగిన ప్రముఖ చరిత్రకారుడు శ్రీ కాంతయ్య ఈవిషయమై శ్రీ పాండేకు లేఖ రాస్తూ, మైసూరు రాజ్యచరిత్ర అధ్యయనశీలిగా మూడు వేల మంది బ్రాహ్మణుల ఆత్మహత్య సంఘ టన తన దృష్టికి రాలేదని, అటువంటి సంఘటన మైసూరు గజిట్లో ఎక్కడ తాను చూడలేదని, అది ఎక్కడలేదాన్ని తాను ఘంటా పధంగా చెప్పగలను, అని రాశారు. ('. the episode of the suicide of 3000 Brahmins is nowhere in the Mysore gazette and as a student of history of Mysore was quite certain 38 మైసూర్ పులి టిపూ సుల్తాన్

that no such incident had taken place...' - Aurungzeb and Tipu Sultan :BN Pande, Page 14) ఫ్రొఫెసర్‌ శ్రీకాంతయ్య అంతటితో ఊరుకోలేదు, డా|| బియన్‌ పాండే ఆసక్తిని బట్టి టిపూ లౌకిక ప్రబువుగా రుజువు చేయు పలు పత్రాలను, ముఖ్యమెన డాక్యుమెంటుల కాపీలను ఆయనకు పంపారు. ఈ పత్రాలను పరిశీలించి టిపూ మీద దురుద్దేశ్య పూర్వకంగా సాగిన ఆరోపణల మీద శ్రీ శాస్త్రి పాత్ర గురించి డా|| పాండే ఓ నిర్ధారణకు వచ్చారు. ఈ సంఘటనకు సంబంధించిన నిజానిజాలను తెలుపమంటూ, శ్రీ కాంతయ్య స్పందనను, ఇతర పత్రాలను మరోసారి శ్రీ శాస్త్రి దృష్టికి తెస్తూ, ఆయన పాఠ్యగ్రంధంలో ఉటంకించిన సంఘటనకు తగిన ఆధారాలు చూపాలని కోరుతూ ఉత్తరం రాశారు.ఈ మేరకు ఎన్ని ఉత్తరాలు రాసినా డా|| శాస్త్రి నుండి ఎటువింటి ప్రత్యుత్తరం రాకపోవటంతో శ్రీ శాస్త్రి రాసిన మూడు వేల బ్రహ్మణుల ఆత్మహత్య సంఘటన వాస్తవం కాదని, అది డా|| శాస్త్రి అభూతకల్పన అని శ్రీ పాండే భావించారు.ఈ విషయం మీద మరింత పరిశోధన జరిపి, టిపూ మీద ఇటువంటి అసత్య ఆరోపణలను ఉదేశ్య పూర్వకంగానే కలకత్తా విశ్వవిద్యాలయం సంస్కృత విభాగం అధిపతి డా|| హర ప్రసాద్‌ శాస్త్రి రాసారని శ్రీ పాండే నిర్ధారించుకున్నారు. అనంతరం ఈ పూర్తి వ్యవహారానికి సంబంధించిన పత్రాలను కలకత్తా విశ్వ విద్యాలయం వైస్ శ్రీ పాండే పంపారు. టిపూ మీద డాక్టర్‌ శాస్త్రి ఉద్దేశ్యపూర్యకంగా చేసిన అసత్య ఆరోణలను, ఆయన దృష్టికి తీసుక వచ్చారు. ఆ పత్రాలను పరిశీలించిన విశ్వవిద్యాలయం అధికారుల సిఫారస్సు మేరకు శ్రీ శాస్త్రి గ్రంథాన్నివిశ్వవిద్యాలయం సూచించిన పాఠ్య గ్రంథాల జాబితా నుండి తొలగిస్తూ, కలకత్తా విశ్వ విద్యాలయం వైస్‌ఛాన్సలర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం మేరకు శ్రీ శాస్త్రి పాఠ్య గ్రంథాన్ని తొలగించారు. ఈ తొలిగింపు జరిగే సరికే పలు సంవత్సరాలు గడిచిపోవటంతో టిపూ మీద చేసిన అభాండాలు, అసత్య ఆరోపణలు అక్షరసత్యాలుగా బహుళ ప్రచారం పొందాయి. ఆ తరు వాత కూర్గు మలబారు హిందూ జనసమూహాల పట్ల చాలా దారుణంగా, అత్యంత క్రూరంగా టిపూ సుల్తాన్‌ వ్యవహరించారని ఆయనకు వ్యతిరేకంగా మరొక ఆరోపణ ప్రచారంలోకి వచ్చింది. ఈ ఆరోపణలలోని నిజానిజాల నిగ్గు తేల్చుతూ, టిపూ కఠినంగా వ్యవహరించింది వాస్తవమైనా, ఆ వ్యవహార సరళికి రాజకీయాలు మాత్రమే కారణమని, ఆయన కరిన వెఖరికి ఆయన మతం, మత విశ్వాసాలు ఏమాత్రం కారణం కాదని శ్రీ బి.యన్‌. పాండే లాింటి పలువురు పరిశోధకులు తేల్చి చెప్పారు. 39 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

మతం పట్ల విశాల లౌకిక దృక్పధం గల టిపూ, రాజాజ్ఞలను ఉల్లంఫిుంచిన వారు ఎంతటి వారైనా, వారే మతానికి చెందిన వారైనా కఠినంగా వ్యవహరించారు. స్త్రీలు రవికలను తప్పక ధరించాలని జారీ చేసిన ఆజ్ఞలను ఖాతరు చేయక పోవటమే కాక, బ్రిీటిషర్లతో చేతులు కలిపినందున, మంగళూరు క్రెసవులు ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులకు తొత్తులుగా మారి, మైసూరు రాజ్యానికి వ్యతిరేకంగా వ్యవహరించటం వల్ల టిపూ ఆగ్రహనికి గురయ్యారు. బహుభరృత్వాన్ని నిషేధిసూ, టిపూ జారీ చేసన ఆజ్ఞలను కూర్గు ప్రజలు ఉల్లంఫిుచారు. ఆచార సంప్రదాయాలలో సంస్కరణలకు సంబంధించి ఆయన జారీ చేసి ఆజ్ఞలను ఉల్లంఫిుచటమే కాకుండ, ఏకంగా టిపూ రాజ్యాధికారానికి ఎసరు పెట్టేందుకు శత్రువుతో కుమ్మక్కయ్యారు.

ఆకారణంగా ఆగ్రహించిన టిపూ కూర్గులను శిక్షించటంలో ఏ మాత్రం జాలి చూపలేదు. ఈ చర్యలన్నీ రాజకీయ కారణాల వలన చోటు చేసుకున్నవి తప్ప, మత మనోభావాల నేపధ్యం ఏమాత్రం లేదని, ప్రముఖ చరిత్రకారులు Dr Nigam (Tipu ki jeevan), Dr.Visweraiah (Bondage and Freedom) Mr.Rambha shya, Sundar తదితరులు తగిన ఆధారాలతో వివరించారు.

ఆ కాలపు పాలకుల పోకడలకు తగ్గట్టు శత్రువర్గాల పట్ల టిపూ ఎంత క్రౌర్యం చూపినా, మతం విషయంలో, ముఖ్యంగా హిందాువుల విషయంలో టిపూ క్రూరుడు కాదు. కెనరాలో క్రెసవుల మీద, మలబారులో నాయర్ల మీద అతడు విరుచుకుపడంది తనకు ఎదురు తిరిగారన్న రాజకీయ కక్షతో మాతమ్రే తప్ప మత ద్వేషంతో కాదు. నాయర్ల మీద అతడి ఆగ్రహంలోనూ వారి బహుబతృత్వం ఆచారం మీదా, మహిళలు అనాచ్ఛాదితంగా తిరగడంపైనా వ్యతిరేకతే ఎక్కువగా కన్పిస్తుంది. మొత్తంగా హిందూ మతం మీద విద్వేషంతో కత్తి ఎత్తి, పరిపాలనలో ముస్లింల పట్ల పక్షపాతం చూపి హిందువులను దుర్వికహణకు గురిచేసి, అన్ని విధాలుగా అణగదొక్కి బలవంతపు మత మార్పిడులను సాగించాడన్న నేరాలను అతడికి ఆపాదించడం అన్యాయం. (ఇదీ చరిత్ర,యం.వి.ఆర్‌.శాస్త్రి, దుర్గా పబ్లికేషన్స్‌, హైదారాబాద్‌ 2005, పేజి. 201)

టిపూ ఆజ్ఞలను ఉల్లంఫిుంచిన ముస్లిం మోషిల్లాలను కూడ ఆయన కఠినంగా శిక్షించటమే కాక తిరుగుబాటును పూర్తిగా అణిచివేసారు. సౌవనూర్‌, కర్నూలు, కడప సంస్థ్ధానాలకు చెందిన నవాబులు టిపూకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నందున వారిని తన దారికి తీసుకువచ్చేందుకు చాలా నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించారు. ఈ విషయంలో టిపూ మాత్రమే కాదు ఏ పాలకుడైనా తాను శత్రువుగా భావించిన వారి పట్ల ఆనాడు క్రూరంగానే వ్యవహరించారు. అందుకు టిపూ అతీతుడేంకాదు. 40 మైసూర్ పులి టిపూ సుల్తాన్

ఆంగ్లేయ సైనికాధికారిMajor Dirom ఈవిషమై వ్యాఖ్యానిస్తూ'..his cruelities were in general inflicted only on those whom he considered as his enimies' Jఅని అభిప్రాయపడ్డాడు. (Quoted by RC Majundar in his An Advanced History of India, Page 708)

టిపూ సుల్తాన్‌ ప్రదర్శించిన నిష్పక్షపాత, మత సామరస్య పూర్వక వెఖరి మూలంగా ఆయన పలువురి ప్రశంసలను అందుకున్నారు. ప్రజల మన్నన పొందారు. టిపూ మత సామరస్య వైఖరిని కొనియాడుతూ, 1930 జనవరి 23 నాటి, యంగ్ ఇండియా లో మహాత్మాగాంధీ ఈ విధంగా పేర్కొన్నారు. 'విదేశీ చరిత్రకారులు ఫతే ఆలి టిపూ సుల్తాన్‌ను మత పిచ్చికలవాడిగ చిత్రించారు. తన రాజ్యంలో గల హిందువులను బలవంతంగా మత మార్పిడికి ప్రయత్నించాడని ఆరోపించారు. అతను అలాింటి వ్యక్తి కాదు. ఆయన మీద సాగిన పలు అసత్య ఆరోపణలకు భిన్నంగా, హిందూ ప్రజానీకంతో టిపూకు చాలా మంచి సంబంధాలు ఉండేవి' అని మహాత్మాగాంధీ పేర్కొన్నారు. ( "...Fathe Ali Tipu Sulthan of Mysore is represented by foreign historians as a fanatic, who opposed his Hindu subjects and converted them to Islam by force... But he was nothing of the kind. On other hand his relations with Hindu subjects were perfectly cordial.." Young India, Jan.23, 1930, Page. 31)

                        న్యాయవ్యస్థ పట్ల ప్రత్యేక దృష్టి

టిపూ న్యాయవ్యస్థ పట్ల ప్రత్యేక దృష్టి కలిగి ఉన్నారు. సమాజంలోని కొందరు వ్యక్తులు సాగించే కిరాతక చర్యలకు ఆ వ్యక్తిని మాత్రమే బాధ్యుడ్ని చేయాలి కాని, నేరం చేసన ఆ వ్యకికి చెందిన జనసముదాయానికి ఆ నేరాన్ని ఆపాదించడాన్ని నిందించడాన్ని టిపూ తీవ్రంగా పరిగణించారు. ఎవరు తప్పు చేస్తే వారిని మాత్రమే నిందించాలి, నేరం రుజువైతే తగిన విధాంగా శిక్షించాలి తప్ప, ఆ వ్యక్తికి సంబంధించిన యావత్తు సమాజాన్ని తప్పు పట్టడం అహేతుకం అన్నారు.

నేరస్తులకు శిక్షలు విధించటంలో వినూత్న మార్పులను ఆయన అమలు చేశారు.శిక్ష అనేది సమాజానికి ఉపయుక్తంగా ఉండాలని ఆయన భావించారు. ఈ మేరకు పలు చర్యలను తీసుకున్నారు. చిన్న, చిన్ననేరాలకు పాల్పడిన, సామాన్యులకు రైతులకు జైలు శిక్షలు జరిమానాలు విధించటాన్ని మాన్పించారు. నిందితుడు తప్పు చేశాడని రుజువెనట్టయితే గతంలోలా జరిమానా విధించడాన్ని తొలగించారు. జరిమానా సొమ్ముకు


41 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

బదులుగా విధించిన జరిమానా సొమ్ము మొత్తాన్నిబట్టి, గ్రామ పొలిమేరల్లో మొక్కలను నాటాలని, ఆ మొక్కలకు సక్రమంగా నీళ్ళు పోస్తూ, బాగా పెరిగేంత వరకు సంరక్షణ బాధ్యతలను నేరస్థుడు నిర్వహించాలని 1792లో ఆయన శాసనం చేసారు. ఈ బాధ్యా తలను సక్రమంగా నిర్వహిస్తున్నారో లేదో పర్య వేక్షించడానికి గ్రామాధికారులను నియమించారు. ఈ వినూత్న శాసనం, ఆ శాసనం అమలుకు ఆయన తీసుకున్న నిర్ధుష్ట చర్యల వలన ప్రజలు నష్టపోయేది ఏమీ లేక పోగా మైసూరు రాజ్యం హరితవనంగా మారింది. ఈ వినూత్నశిక్షణావిధానం వలన, మైసూరు రాజ్యంలో హరిత విప్లవం విలసిల్లిందని టిపూకు వ్యతిరేకంగా తృతీయ మైసూరు యుద్ధంలో పాల్గొన్న బ్రిటిష్‌ సైన్యాధికారి Edward Moore ప్రత్యేకంగా పేర్కొనటం గమనార్హం

                     రాకెట్టు టెక్నాలజీకి ఆధ్యుడు

ప్రజా జీవితాలను ప్రభావితం చేయగల అన్ని వ్యవస్థల అభివృద్ధికి టిపూ అమిత శ్రద్దచూపారు. ప్రపంచంలో ప్రతి పరిణామాన్నిఆయన ఆకళింపు చేసుకుంటూ, ఆయా మార్పులు-చేర్పులను తన రాజ్యంలోని ప్రజల మేలు కోసం వర్తింపచయ ప్రయ త్నించారు.ఈ మేరకు భారత దేశంలో రాకెట్ టెక్నాలజీని ఆభివృద్ధి పర్చి ఉపయాగించిన ప్రబువుగా టిపూ ప్రత్యే కతను గడంచారు. ఆంగ్లేయులతో సాగిన యుద్ధాలలో ఆయన యుద్ధ రాకెట్లను బాగా ఉపయోగించారు. ఈ యుద్ధ రాకెట్ల తయారికి స్వదేశీ పరిజ్ఞానానికి విదేశీ సాంకేతిక విలువలను జోడించి వినూత్న యుద్ధ రాకెట్లను ఆయన ఆవిష్కరింపచేశారు.ఈ కారణంగా ఆయన యుద్ధ రాకెట్ల ఆధ్యుడుగా ఖ్యాతిగడించారు. (Tipu Sulthan was the pioneer of the missile Technology in India. - The Milli Gazette,16-31, Jan. 2006 page. 9)

ఈ యుద్ధ రాకెట్టును భారతీయ యుద్ధ రాకెట్టు (India's War Rocket) గా పరిగణించారు. ఈ రాకెట్టు 2.4 కిలోమీటర్ల dooరంలో గల లక్ష్యానికి ఛేదించగలిగేది.ఈ రాకెట్ల తయారి, వినియోగం కోసం ఆయన ప్రత్యేకంగా 1200 నుండి 5 వేల మంది గల రాకెట్టు దళం ఏర్పాటు చేశారు. ఈ విషయాలను Prof. R.Narasimha తన వ్యాసం Tipus Contribution to Rocket Technology లో వివరించారు. టిపూ ఆవిష్కరించిన ఈ యుద్ధ రాకెట్ల విషయాన్ని మన రాష్ట్రపతి అబుల్‌ కలాం కూడ ప్రస్తావిస్తూ, ప్రపంచంలోని ప్రపథమ యుద్ధ రాకెట్టును టిపూ ఎలా వాడగలిగారు ? (How 42

                    మైసూర్ పులి టిపూ సుల్తాన్

Tipu Sulthan have led to the worlds first war Rocket?) అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.

                               బ్రిషర్లతో రాజీలేని పోరాటం

చిన్ననాటనే అసమాన ధైర్యసాహసాలతో, తండ్రికి తగిన తనయుడన్పించుకున్న టిపూ, చిన్న వయస్సులోనే పలు విజయాలను సాధించారు. మలబారు ఆక్రమణతో ప్రారంభమైన ఆ యుద్ధవీరుని విజయపరంపర అటు ఈస్ట్‌ ఇండియా కంపెనీతో ఇటు స్వదేశీపాలకులైన నిజాం, మరాఠాలతో పోరుచేస్తూ ముందుకు సాగింది. చివరి శ్వాస వరకు ఈస్ట్‌ ఇండియా పాలకులను మాతృదేశం నుండి తరిమి వేయ ానికి అవిశ్రాంతంగా పోరాడిన ఏకైక స్వదేశీ పాలకుడిగా టిపూ సుల్తాన్‌ చిరస్మరణీయమైన ఖ్యాతిగాంచారు. తండ్రి నుండి రాజ్యాధికారం పొందిన తరువాత టిపూ తన రాజ్యాన్ని ఉత్తరాన కృష్ణానదినుంచి, దాక్షిణాన దిండిగల్‌ వరకు అంటే సుమారు 400 మైళ్ళు పొడవున, పశ్చిమాన మలబారు నుంచి, తూర్పున తూర్పు కనుమల వరకు సుమారు 300 మైళ్ళు విస్తరించగలిగారు.

బలపడుతున్న మైసూరు రాజ్యాధినేత టిపూ వైభవప్రాభవాలను చూసి అసూయా ద్వేషాలతో రగిలి పోతున్న నిజాం నవాబు, మరాఠాలు ఏకం కావటమే కాక టిపూకు

యుద్ధారంగాన టిపూ సైన్యాలు

43 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

వ్యతిరేకంగా ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులతో చేతులు కలిపారు.టిపూను ఎలాగైనా తుదమిట్టించాలని కుట్రలు పన్నారు. మెసూరు రాణి శ్రీమతి లక్ష్మమ్మ మరోవెపు కంపెనీపాలకులతో చేతులు కలిపి, టిపూను ఎలాగైనా పరాజయం పాల్జేసి మైసూరు రాజ్యాన్నిదక్కించుకోవాలన్న లక్ష్యంతో ఈస్ట్‌ ఇండియా కంపెనీ అధికారులకు ఆర్థికంగా సహాయం అందాజేస్తూ, టిపూను దెబ్బ తీయడానికి తగిన సమయం కోసం ఎదురు చూడసాగింది. ఈ ప్రతికూల వాతావరణంలో మైసూరు రాజ్యాన్ని కాపాడుకోవటమే కాకుండ, బ్రిీషర్ల రాజ్యవిస్తరణ కాంక్షకుస్వదేశీ సంస్థానాలు బలి కాకుండ ఉండేందుకు టిపూ శత విధాల ప్రయత్నించారు.

ప్రజలకు, స్వేచ్ఛకు నిజమైన శతృవులు ఆంగ్లేయులన్న వాస్తవాన్ని గ్రహించిన ఏకైక స్వదేశీ పాలకుడు టిపూ. ఆ వాస్తవాన్ని ముందుగా గ్రహించారు కనుకు ఆతరువాతబ్రిీటిషర్లతో పోరాడిన స్వాతంత్య్ర సమరయోధులకు ఆయన మార్గదార్శి ఆయ్యారు. (He was the only ruler who felt that the English are real enemies of people and freedom. He guided freedom fighters. - K.C. Menon, The Hindustan Times 16-11-1985)

బ్రిీటిషర్ల పట్ల అంతటి శతృత్వం వహించారు కాబట్టే, ఆయనంటే ఆంగ్లేయ చరిత్రకారులకు టిపూ అంటే ఆగ్రహం. కంపెనీ పాలకులు మాత్రమే కాకుండ ఇంగ్లాండులోని సామాన్య ప్రజలు టిపూ పేరు వినడానికి కూడ ఇష్టపడేవారు కారు. ఆ కాలంలో ఆంగ్లేయ మహిళలు ఏడుస్తున్నతమ బిడ్డలను సముదాయించడానికి టిపూ వచ్చి పట్టుకుపోతాడు అని భయ పట్టే వారని ప్రతీతి.

              స్వదేశీ ఉమ్మడి కూటమికి చివరికంటా ప్రయత్నం

బ్రిీటిషర్ల నుండి స్వదేశీ పాలకులకు పొంచియున్న పెను ప్రమాదాన్ని గ్రహించిన పాలకుడిగా, ఆయన ఎంతగా ఆంగ్లేయులను వ్యతిరేకించాడో, అంతగా స్వదేశీయుల ఉమ్మడి ప్రయోజనాల కోసం, స్వదేశీ పాలకుల సమాఖ్యను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. ఆయన ఏనాడూ బ్రిీషర్లుతో చేతులు కలిపి స్వదేశీ పాలకులకు వ్యతిరేకంగా వ్యవహరించలేదు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా స్వదేశీ పాలకులకు నచ్చజెప్పేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించారు. కుట్రలతో, కుయుక్తులతో అటు నిజాం,ఇటు మరాఠాలు టిపూ మీద కత్తులు దూస్తున్నా, ఆయన మాత్రం ఆ స్వదేశీ పాలకుల స్నేహాన్నికాంక్షించారు. స్వదేశీ పాలకులతో కలిసి విదేశీ శత్రువు మీద రణభేరిని 44 24 మైసూర్‌ పులిటిపూ సుల్తాన్‌

మ్రోగించానికి వ్యూహ రచన చేశారు. ఈ మేరకు స్వదేశీ పాలకులతో సంబంధాలను పటిష్టం చేసుకునేందుకు అటు నైజాం పాలకులతో, ఇటు మరాఠాలతో పలు మార్లు సంప్రదింపులు జరిపారు. నిజాం కుటుంబంతో వివాహ సంబంధాల ఏర్పాటుకు కూడ ఆయన ప్రతిపాదానలు పంపారు. తమ స్వంత ప్రయోజనాలు తప్ప, నిస్వార్థదృష్టిలేని స్వదేశీ పాలకులు టిపూ ప్రతిపాదానలను త్రోసిపుచ్చారు.

ఆరోజు టిపూ ప్రతిపాదనలను విని స్వదేశీపాలకుల సమాఖ్య ఏర్పాటుకు అంగీకరించి ఉంటే భారత దేశ చరిత్ర మరొరకంగా ఉండేది. ఈవిషయాన్ని టిపూను పరాజితుడ్ని చేసిన గవర్నర్‌ జనరల్‌ వెల్లసీ స్వయంగా ప్రకటించటం విశేషం. ఆనాడుడు టిపూ మాటను స్వార్థపరులైన స్వదేశీ పాలకులు వినలేదు కాని, విని విన్నట్టయితే ఈగడ్డమీద మాకు (బ్రిీషర్లకు) నిలువ నీడ కూడ ఉండేది కాదు , అని అన్నాడు. ఈవ్యతిరేక పరిస్థితులను టిపూ చాలా చాకచక్యంగా ఎదాుర్కొన్నారు. బహిర్గత-అంతర్గత శతృవులను దారుణంగా దెబ్బతీసి ఆధిక్యతను నిలుపుకున్నారు.

టిపూ అధికారం చేపట్టగానే సైనిక వ్యవస్థను ఆధునీకరించారు. ఆధునిక ఆయుధలను, ఆ ఆయుధాలను ఉపయోగించే పద్దతులను, ఆందుకు అనుగుణంగా సైనిక వ్యూహాలలో మార్పులను ప్రవేశ పెట్టారు. మైసూరు రాజ్యలక్ష్మి చుట్టూత చుక్కూర్చుని ఉన్న శతృ వుల మూలంగా ఏర్పడిన ప్రత్యే క పరిసితు ల వలన, ఆకస్మి కంగా శతృవులు దాడి చేస్తే వారికి సరైన రీతిలో బుద్ధి చెప్పేందుకు, ఏ క్షణాన్నైనా శతృవుమీద రణభేరి మ్రోగించేందుకు సైన్యాన్ని సర్వసిద్ధంగా ఉంచారు. ఈ మేరకు సైన్యాలను ఆయన ప్రత్యేక పర్యవేక్షణలోతీర్చి దిద్దారు. విదేశీ విజ్ఞానాన్ని సమకూర్చుకుని, ఆ విజ్ఞానానికి స్వదేశీ జ్ఞానాన్ని జోడించి ఆయుధాలను తయారు చేయించారు. ఆ ఆయుధాలఉపయోగించటంలో సైనికులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు.

టిపూ సెనిక పాటవాన్ని గమనించిన William Mc Taud టిపూ ఒక్కడే ఆనాడు సైన్యాన్ని చక్కని పథకం ప్రకారంగా శిక్షణ ఇచ్చి తీర్చి దిద్దిన పాలకిడని (Tipu was the only ruler who trained his army in a well planned manner). కొనియాడాడు. ఈ తరహాలోనే బ్రిీటిష్‌ సైన్యాధికారి Compbell వ్యాఖ్యానిస్తూ ఆసియా లోని మిగిలిన రాజ్యాలలోని సౖౖెనిక వ్యవస్థల కంటె టిపూ సైనిక వ్యవస్థ చాలా ఉన్నత మైనదని (Tipus milatary organisation was better than those of all other regimes in Asia) అన్నాడు. టిపూతో స్వయంగా పోరాడిన Lord Cornwallis మాట్లాడుతూ, టిపూ సైన్యం ప్రపంచంలోని అత్యుత్తమ సైన్యాలలో ఒకటని (Tipu's 45 సయ్యద్ నశీర్ అహమ్మద్ army was one of the best in the world) ప్రశంసించాడు. ఆఘమేఘాల మీదతరలి వచ్చే టిపూ అశ్వికదళం శక్తి సామర్థ్యాలు ఆంగ్లేయులను ఆశ్శర్యచకతుల్ని చేశాయి.శతృ సైన్యాల మీద మెరుపుదాడులు సాగించే అశ్వికుల ప్రావీణ్యాన్ని బహువిధాల ప్రశంసించారు. ఈ విషయమై ఆంగ్లేయాధికారి Alexander Dow ప్రస్తావిస్తూ, టిపూసుల్తాన్‌ అశ్విక దాళాలు కోట గోడలను కూడ అత్యంత సునాయాసంగా దాటటం చూస్తుంటే ఆయన అశ్వాలు రెక్కలు కలిగియున్నాయన్న భయం కలుగుతుందని ('.. we are alramed as if his horses had wings to fly over our walls..') అనిఅన్నాడు.

ఈ మేరకు టిపూ మిత్రులు మాత్రమే కాకుండ ఆయనతో నువ్వా ? నేనా ? అని తలపడిన ఆంగ్లేయాధికారులు, ఆయన అంటే గిట్టని పలువురు చరిత్రకారులుకూడ టిపూ శక్తి సామర్థ్యాలను కొనియాడక తప్పని పరిస్థితిని చూస్తే, యుద్ధతంత్ర నిపుణుడిగా టిపూ ఎంత శక్తివంతుడో అవగతమవుతుంది.

               మలుపులు తిప్పిన మైసూరు యుద్ధాలు

ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులతో, స్వార్థపరులైన స్వదేశీ పాలకులతో పలు పోరాటాలు చేసినా, బ్రిీటిష్‌ సైనిక కూటమితో టిపూ తండ్రి హైదర్‌, టిపూ చేసిన ప్రదాన పోరాలు మైసూరు యుద్ధాలు గా చరిత్రలో ప్రత్యేకతను సంతరించుకున్నాయి.ఈ యుద్ధాలలో మొదటి రెండుయుద్ధాలు టిపూ, హైదార్‌ అలీ కలసి చేయగా, చివరి రెండు టిపూ సాగించినవి. ఈ చారిత్రిక యుద్ధాలలో మెదటి రెండు యుద్ధాలు టిపూకు అనుకూలంగా పరిణమించగా, చివరి రెండు ప్రతికూలమయ్యాయి. టిపూ సుల్తాన్‌కు ప్రతికూలంగా సాగిన ఈ రెండు యుద్ధాలు మాత్రం భారతదేశం క్రమంగా బ్రిీటిషర్ల పెత్తనంలోకి జారీ పోడానికి బాటలు వేశాయి. ఈ పోరాటాలు టిపూ పాలిట శాపాలుగా మారటంతో బ్రిీటిషర్లు ఈ గడ్డ మీద స్థిరపడి, తమ పట్టును బిగించగలిగారు.

                   ప్రథమ మైసూరు యుద్ధ్దం (176-69)

ప్రథమ మైసూరు యుద్ధాంలో హైదర్‌ అలీ మార్గదర్శకత్వంలో బ్రిీటిషర్ల, వలస పాలకులకు మద్దతు పలికినస్వదేశీ శక్తులు నిజాం, మరాలకు బుద్ధి చెప్పేందుకు సాగించారు. ఈ పోరాటంలో టిపూ నేతృత్వంలోని సేనలు అప్రతిహతంగా ముందుకుసాగాయి. ఆ సమయంలో టిపూ వయస్సు 17 సంవత్సరాలు. 1769 మార్చి మాసంలో 46 మైసూర్‌ పులి టిపూ సుల్తాన్‌

దక్షి∆ణ భారత దేశంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీకి ప్రధాన కేంద్రామైన మద్రాసుకు 5 మైళ్ళ దూరం వరకు మైసూరు రాజ్య సేనలు వచ్చి చేరాయి. ఈ వ్యతిరేక పరిణామాలతో హడలెత్తిన ఆంగ్ల సేనలు, ఆంగ్లేయాధికారులు కకావికలయ్యారు.

ఈ యుద్ధంలో, 1763 నాటి బక్సర్‌ యుద్ధంలో మీర్‌ ఖాశిం, షా ఆలం, షుజావుద్దౌలా లాింటి స్వదేశీ పాలకుల సంయుక్త సేనల కూటమిని పరాజితులను చేసివిజేతగా కిరీటం ధరించిన ఆంగ్లేయాధికారి Sir Hector Munro హైదార్‌ అలీ, టిపూలపరాక్రమానికి విస్తుపోతూ బ్రతికుంటే బలుసాకు తిని జీవించవచ్చని కంజీవరంలోని చెరువులో ఆయుధాలను పారేసి బ్రతుకు జీవుడా అంటూ పారిపోయాడు. (TIPU SULTAN : HIS VISION AND MISSION, By Prof. B. Sheik Ali, Published in Radiance Views Weekly 1-7 August 1999, Page. 15)

ఈ పరిణామాల మూలంగా ఈస్ట్‌ ఇండియా కంపెనీ ప్రతిష్ట దిగజారి, కంపెనీ షేర్ల ధర 275 నుండి 222కు పడపోయింది.( Eminent Muslim Freedom Fighers,G.Allana, Page 58) ఇండియాలోని ప లు ప్రాంతాలను ఆక్ర మించుకుంటూ అపరిమితమైన సంపదను పోగేసుకుంటున్న ఈస్ట్‌ ఇండియా కంపెనీకి మద్రాసులో హైదార్‌ అలీ కల్పించిన పరాజయం అశనిపాతమైంది. ఈ పరాజయం లండన్‌ స్టాక్‌ మార్కెట్టులో సంక్షోభానికి కారణం కావటమే కాకుండ, మీరు ఊహించనలవి కాని కష్లాను తెచ్చిపెట్టారు. నాటి నుండి బయటపడటం ఎలాగో అర్థం కావటం లేదు అని కంపెనీCourt of Directors వాపోయారు. (" ..You have brought us into such a labyrinth of difficulties, that we do not see how we shall be extricated from them.",) మిమ్మల్ని వ్యాపారం కోసం పంపాం. హిందూస్థాన్‌లోని రాజ్యాల వ్యవహారాలలో పాల్గొనేందుకు కాదు, ( ...it is not for the Company to take the part of umpries of Indostan..) అని కంపెనీ అధికారులను హెచ్చరించారు. ఈమేరకు ఇంగ్లాండు నుండి కంపెనీ పాలకుల నుండి భారతదేశంలోని ఆ కంపెనీ అధికారులకు తీవ్ర హెచ్చరికలు జారీ అయ్యాయంటే ఇంగ్లాండు గుండెల్లో టిపూ,హైదార్‌ అలీ ఎంతటి భయోత్పాతం కలిగించారో అర్థం చేసుకోవచ్చు. (An Advanced History of India, by RC Majumdar and others, Macmillan, 1996 Page 675) ఈ విధంగా ఘోర పరాజయాన్ని చవిచూసిన ఆంగ్లేయులు మైసూరు రాజ్యాధి నేతల పరాక్రమానికి తలవొగ్గి 1769లో మద్రాసు సంధి చేసుకున్నారు. ఈ సంధి 47 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

ప్రకారంగా మైసూరు రాజ్యం మీద ఎవరైనా దాడులు జరిపితే కంపెనీ సేనలు మైసూరు రాజ్య సైన్యాలకు అండదండలు ఇచ్చేందుకు అంగీకరించాయి. ఈ సంధితో ప్రథమ మైసూరు యుద్ధం మైసూరు రాజ్యం పక్షాన విజయవంతంగా ముగిసింది.

                  రెండవ మైసూరు యుద్ధాం (1780-84)

1771లో మైసూరు రాజ్యం మీద మరాఠాలు దాడులు ప్రారంభించారు. ఆ దాడులను ఎదుర్కొంటున్న హైదార్‌ అలీకి మద్రాసు సంధి ఒడంబడిక ప్రకారం కంపెనీ సేనలు మైసూరు సేనలకు అండగా నిలవాలి. అందుకు భిన్నంగా కంపెనీ సేనలు మరాఠాల పక్షం వహిస్తూ ఒడంబడికకు భిన్నంగా ప్రవర్తించాయి. ఆ తరువాత మైసూరు రాజ్య పరిథిలో గల ఫ్రెంచి వారి స్థావరం మాహే ను ఆంగ్లసేనలు ఆక్రమించాయి. ఈ ఉల్లంఘన సహించని హైదార్‌ అలీ 1780 లై మాసంలో యుద్ధం ప్రకటించారు. ఈయుద్ధంలో తండ్రి హైదర్‌ అలీతో కలసి టిపూ ప్రదాన పాత్ర పోషించారు. ఈ సందర్బంగా ఆంగ్లేయాధికారులు Col.Ballie, Sir Eyre Coote, Col.Briath మైసూరు రాజ్యాధినేతల చేతుల్లో పరాభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. టిపూ ఆయన తండ్రి హైదర్‌ అలీల నేతృ త్వంలో క్రమంగా విస్తరిసూ,్ బలోపేతం అవుతున్న మైసూరు రాజ్య ప్రగతిని బూచిగా

చూపి నిజాం, బేరూరు రాజు, మాధావజీ సింధియాలతో హైదార్‌ అలీ ఏర్పాటు చేసిన స్వదేశీ పాలకుల కూటమిని కుిటిల నీతితో ఆంగ్లేయులు విచ్ఛినం చేశారు.

స్వదేశీ పాలకుల కూటమి విచ్ఛిన్నమైనప్పటికి, స్వదేశీ పాలకులు పరాయి వాళ్ళ పంచనచేరి శతృ త్వం ప్రకటించినప్పటికి హెదర్‌ అలీ, టిపూ సుల్తానలు పరాక్రమిస్తూ ఆంగ్లేయులను పరాజితులను చేయసాగారు. రెండవ మైసూరు యుద్ధం కీలక దశలో ఉండగా 1782 డిసెంబరు 7వ తేదీన హైదార్‌ అలీ యుద్ధ రంగంలో మరణించారు.

ఈ వార్త టిపూకి అందే సరికి ఆయన మలబారు తీరాన కల్నల్‌ హంబర్‌ స్టోన్‌ను తరిమి కొడుతున్నారు. తండ్రి కన్నుమూసిన వార్త విన్న టిపూ సత్వరమే శ్రీరంగపట్నం చేరుకుని, 1782 డిసెంబర్‌ మాసంలో మైసూరు రాజ్యలక్ష్మిని చేబ్టిన టిపూ, మైసూర్‌ సుల్తాన్‌ అయ్యారు.

తండ్రి హెదార్‌ అలీ అడుగుజాడలలో టిపూ కూడ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ముందుకు సాగారు. స్వదేశీ గడ్డ మీద విదేశీయుల పొడ కూడ సహించని టిపూ బ్రిీటిష్ శక్తులను తరిమికొట్టేందుకు ప్రతిన పూనాడని .E.Marsden అను ఆంగ్లేయ 48 మైసూర్‌ పులి టిపూ సుల్తాన్‌

చరిత్రకారుడు పేర్కొన్నాడు.(He hated the English and had openly vowedthat he would someday drive them out of India - History of India By E.Marsden, Macmillan, London, 1944 Page157).ఈయుద్ధంలో టిపూ Brigadiar Mathews ను 1783లో బంధించారు. ప్రథమ మైసూరు యుద్ధంలోలా రెండవ మైసూరు యుద్ధంలో కూడ చేదుా అనుభవాలను చవిచూసిన కంపెనీ అధికారులు టిపూతో సంధిచేసుకున్నారు. 1784 మార్చి మాసంలో ఇరుపక్షాల మధ్య మంగళారు సంధి (Treaty of Mangalore) కుదిరింది.

ఈ రెండు యుద్ధాలు మైసూరు పాలకులకు అనుకూలంగా సాగగా, కంపెనీ అధికారుల మెడలు వంచి తమ షరతులకు అనుగుణంగా ఒడంబడికలు రూపొందించి అధిపత్యం చాటుకుని టిపూ సుల్తాన్‌ తమది పై చేయిగా నిరూపించుకున్నారు.

            మూడవ మైసూరు యుద్ధం (1790-92)

తిరువాన్కూరు సంస్థానాధీశునితో టిపూకు వచ్చిన వివాదాం సాకుగా, ఒప్పం దాన్ని ఉల్లంఫిుంచి ఆంగ్లేయులు టిపూను రెచ్చగొట్టిన కారణంగా మూడవ మైసూరు యుద్ధం 1790 మే మాసంలో ఆరంభమైంది. (Lord Coronwallis forced Teepu by violating the treaty " to Produce war with that Prince " - History of Freedom Movement in India, Vol. 2, Tara Chand, Govt. Of India Publications, New Delhi 1992, Page. 226)

ఈ యుద్ధం రెండు సంవత్సరాలు సాగింది. ఆంగ్లేయాధికారి Major General Medows నేతృలో ఆరంభవుౖ ఈ యుద్ధం తొలి దాశలో టిపూ విజయ పరంపర సాగింది. పరాజితుడైన Major General Medows ఓ దశలో పరాభవాన్నిభరించలేక ఆత్మహత్యకు ఉపక్రమించాడు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ నిదులు కూడ చాలా కరిగిపోయాయి. ఈ దశలో యుధ రంగాన టిపూ అద్భుత నైపుణ్యం మరియు ఎత్తుగడలను అనుసరించారని, అందుకు దీటుగా తన అధికారులు వ్యవహరించలేక పోయారని భావించిన లార్డ్‌ కారన్‌వాలిస్‌ (Lord Caranwallis)స్వయంగా యుద్ధరంగప్రవేశం చేశాడు. 1791 జనవరిలో అతను బ్రిీటిష్‌ సైనిక కూటమి నాయకత్వబాధ్యాతలను చేపట్టాడు.

టిపూ వ్యతిరేక శక్తులకు ఆశలు చూపెట్టి, భయం కల్గించి టిపూకు దూరం చేయటమేకాకుండ లార్డ్‌ కారన్‌వాలిస్‌ తనకు అనుకూలం చేసుకున్నాడు. ఈ వాతావరణంలో మరింత ఉత్సాహంతో టిపూను పరాజితుడ్ని చేయ సంకల్పించిన స్వదేశీ

49

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

యుద్ధ నష్టపరిహారంగా టిపూ తనయుల పూచీకత్తు

పాలకులు మెసూరు రాజ్యం మీద విరుచుకపడ్డారు. భారీగా బలగాలను సమకూర్చుకుని మే మాసం నాికి శ్రీరంగట్నానికి తొమ్మిది మైళ్ళ సమీపానికి చేరుకున్నారు. ఆ సమయంలో టిపూ పాండిచ్చేరిలో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన ఆఘమేఘాల మీద శ్రీరంగపట్నం కదిలారు. ఆ సమయంలో వర్షాలు ఆరంభంకావటంతో కారన్‌వాలిస్‌ తాత్కాలికంగా యుద్ధ రంగం నుండి తప్పుకున్నాడు. 1792 జనవరి నాటికి లార్డ్‌ కారన్‌వాలిస్‌ శ్రీరంగపట్నానికి తిరిగి చేరుకుని అన్ని వైపుల నుండి మైసూరు రాజ్య రాజధానిని చుట్టుముట్టాడు. కంపెనీ సేనలు రాత్రిపూట టిపూ బలగాల మీద విరుచుకుపడ్డాయి. మరోవైపున స్వదేశీ పాలకులు, పాలెగాళ్ళు ఏకమై టిపూను చుట్టుముట్టారు . భయానక యుద్ధం జరిగింది. ఈ ప్రతికూల పరిసితు లలో శ్రీరంగపట్నం కోటలోకి టిపూ నిష్క్రమించారు. శతృసైన్యాల కూటమితో కారన్‌వాలిస్‌ కావేరి నదిని దాిటి కోట సమీపానికి చేరుకున్నాడు. శ్రీరంగం కోటను పూర్తిగా దిగ్బంధనం చేశాడు.ఆపరిస్థితులు టిపూకు ప్రమాదకరంగా పరిణమించాయి. గత్యంతరం లేని యుద్ధ వాతావరణంలో శతృవు బలగాలు, శతృవుకు తోడుగా నిలచిన స్వదేశీపాలకుల అపార సైనిక బృందాలను గమనించిన టిపూ యుద్ధ పర్యవసానాన్ని ఊహించారు. అన్ని విధాలుగా పై చేయిలో ఉన్న శత్రుపక్షం పెచ్చరిల్లితే మెసూరు రాజ్యలక్ష్మి పరాయిపాలు కాగలదని ఆయన అంచనా వేశారు. ఈ సందర్బంగా ప్రజల సంక్షేమం నిమిత్తం ఆయన సంధికి సిద్ధపడ్డారు. ఆంగ్లేయాధికారులు, 50 27 మైసూర్‌ పులి టిపూ సుల్తాన్‌

వలసపాలకులకు తొత్తులుగా మారిన స్వదేశీ పాలకులు సంధి షరతులను నిర్దేశించారు.సంధి షరతులు కఠినంగా ఉన్నాకూడ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని టిపూ సంధికి అంగీకరించారు.

ఈ మేరకు శ్రీరంగపట్నం సంధి 1792 మార్చిలో కుదిరింది. ఈ సంధి ప్రకారంగా టిపూ తన రాజ్యంలోని సగం ప్రాంతాలను ఆంగ్లేయ కూటమికి అప్పగించాల్సి వచ్చింది. ఈ ప్రాంతాలను నిజాం, మరాఠా పాలకులు, ఈస్ట్‌ ఇండియా కంపెనీ పంచుకున్నారు.రాజ్యభాగాన్ని శతృకూటమికి సమర్పించటం మాత్రమే కాకుండ ముఫ్పై లక్షల పౌడ్ల నష్ట పరిహారం కూడ టిపూ చెల్లించాల్సి వచ్చింది.

(He has to pay a war Indeminty of 3 1/2 Croes of rupees, - Brief History of Andhra Pradesh, Ed. by Mohd. Abdul Waheed Khan, Govt. of AP, Hyderabd, 1972, Page 91)

ఈ భారీ మొత్తాన్ని పూర్తిగా చెల్లించే వరకు శత్రుకూటమి టిపూ బిడ్డలిరువుర్ని తమ వద్ద ఉంచాలని షరతు విధించింది. ఈ షరతు మేరకు తప్పనిసరి పరిస్థితులలో టిపూ తన బిడ్డలను ఆంగ్లేయాధికారుల వద్ద పూచీకత్తుగా ఉంచారు. సంధి షరతుల మేరకు మూడున్నర కోట్ల రూపాయలను ఆంగ్లేయులకు చెల్లించిన తరువాత గాని టిపూ తన బిడ్డలను బ్రిీటిషర్ల పంచ నుండి విముక్తం చేయలేకపోయారు. మాతృభూమిని విదేశీ శక్తుల నుండి విముక్తం చేయాలని అహర్నిశలు పోరాడుతున్న టిపూకు స్వదేశీ పాలకుల సహకారం లభించక పోవటేమే కాకుండ పరాయి పాలకుల, ఆ పాలకుల వత్తాసు దారుల పట్ల శత్రుత్వం వహించినందున తన బిడ్డలను కూడ పూచీకత్తు ఉంచాల్సిన పరిస్థితి రావటం విచారకరం.

ఈ యుద్ధ పరిణామాలు టిపూ మనస్సును తీవ్రంగా కలచివేశాయి. ఈ యుద్ధంలో బ్రిీటిషర్లకు విజయం లభించటంతో, భారత దేశంలో కంపెనీ పాలన నిలదొక్కుకోడానికి కారణమైంది. స్వదేశీ పాలకుల స్వాతంత్య్ర పరిరక్ష్నణపోరాట చరిత్రలో మూడవ మైసూరు యుద్ధ దురదృష్టకర సంఘటనగా నిలిచిపోయింది.

నిర్ణయాత్మక నాల్గవ మైసూరు యుద్ధం (1799) మూడవ మైసూరు యుద్ధ పరిణామాల మూలంగా టిపూ దెబ్బతిన్న పులిలా ఉన్నాడు కనుక, ఆయన నుండి ఎప్పుడైనా పెనుప్రమాదం పొంచి ఉందని భయపడిన విదేశీ పాలకులు, ఆ పాలకులకు మద్దతు పలుకుతున్న స్వదేశీ పాలకులు, పాలెగాళ్ళు దెబ్బతిని ఉన్న మెసూరు పులి టిపూను ఎలాగైన అంతం చేయాలని నిరయించుకున్నారు.

                                                   51

్ణ 51 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

టిపూ సజీవంగా ఉన్నంత కాలం రాజ్య విస్తరణకు ఆవకాశం ఉండదని కంపెనీ పాలకులు నిర్ణయించారు. ఆ నిర్ణయం మేరకు నాల్గవ మైసూరు యుధం కోసం ఏర్పాట్లు ఆరంభించారు.

ఈ వాతావరణం గ్రహించిన టిపూ తన ప్రయత్నాలలో తానూ ఉన్నారు.స్వదేశీ పాలకుల మద్ధతు లభించకపోవటంతో, బ్రిీటిషర్లను వ్యతిరేకించే బయిటి శక్తుల సహాయం కోసం ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన కాబూల్‌, కానిస్టాన్ట్‌నోపల్‌,అరేబియా, మారిషస్‌ తదితర రాజ్యాధినేతలకు కూడ లేఖలు రాశారు. బ్రిీటిషర్లను పాలద్రోలేందుకు సహకరించాల్సిందిగా కోరుతూ దౌత్యఅధికారులను పంపారు. టిపూ తండ్రి హైదరాలి హయాం నుండి మైసూరు రాజ్యానికి చిరకాల మిత్రులైన ఫ్రెంచ్‌ వారి సహాయాన్ని ఆయన కోరారు. ఆనాడు ఇంగ్లీషు వారికి, ఫ్రెంచ్‌ వారికి మధ్యనున్న విభేదాల వలన టిపూకు సహకరించేందుకు ప్రెంచ్‌ అధికారులు అంగీకరించారు. 1798 ఏప్రిల్‌ మాసంలో కొందారు ఫ్రెంచ్‌ అధికారులు మాంగళారుకు చేరుకున్నారు. టిపూ మైసూరు రాజ్య రక్షణకు సాగిస్తున్న ప్రయత్నాల గురించి తెలుసుకున్న బ్రిీటిష్‌ గవర్నర్‌ జనరల్‌ వెల్లస్లీ (Governor General Marquis Wellesly) మండిపడ్డాడు. పశ్చిమ తీరాన ఉన్న టిపూ బలగాలను తొలగించాల్సిందిగాను, రెండు కోట్ల పూచికత్తును చెల్లించి, మైసూరు రాజ దార్బారులో తమ ప్రతినిధిని అనుమతించా

ఇన్‌సెట్ లో యుద్ధభూమిలో బ్టిరిీషర్లతో పోరాడుతున్న మైసూరు పులి

52 28 మైసూర్‌ పులి టిపూ సుల్తాన్‌

ల్సిందిగా అల్టిమేటం పంపాడు. ఈ చర్యతో టిపూ ఆగ్రహిస్తూ వెల్లస్లీ బెదిరింపులను బేఖాతర్‌ అన్నారు. ఆవకాశం కోసం ఎదురు చూస్తున్న అంగ్లేయులు మైసూరు రాజ్యాన్ని కబళించేందుకు సన్నాహాలను ముమ్మరం చేశారు.

1798 ఏప్రిల్‌ 26న అంగ్లేయాధికారి ఆర్థర్‌ వెల్లస్లీ (Arthur Wellesly) మద్రాసు చేరుకుnnaaడు. టిపూ మీద యుద్ధాన్ని ప్రకటించాడు. టిపూను ఎదుర్కోడానికి అందుబాటులో ఉన్నఉత్తమ సైనిక పటాలాలను అతి తక్కువ కాలంలో (the finest army in the shortest period) రప్పించుకున్నాడు. తాయిలాల ఆశ చూపి ఆదరించి బెదిరించి నిజాం నవాబును పూర్తిగా తమ గుప్పెట్లోకి తెచ్చుకున్నాడు. పలు ప్రాంతాల మరాఠా ప్రభువులను మాలిమి చేసుకున్నాడు. భారీ ఎత్తున యుద్ధ సన్నాహాలను పూర్తి చేసుకుని ఆక్రమణకు ఉపక్రమించారు. టిపూ సుల్తాన్‌ రాజ్యం మీద అన్నివైపుల నుండి దాడులు జరపాలని కంపెనీ సైనికాధికారులకు, కంపెనీకి మద్దతునిస్తున్న స్వదేశీపాలకులు, పాలెగాళ్ళకు 1799 ఫిబ్రవరి 3వ తేదీన ఆదేశాలు జారీ చేశాడు.('..on 3rd February 1799, for the British arimes and those of the allies,immediately to invade the Sultan's dominions.' ) స్వంత బలగాలను సమకూర్చుకుని, టిపూను ఏకాకి చేసి స్వదేశీ పాలకులతో, మద్దతుదారులతో కలసి టిపూను పరాజితుడ్ని చేయడానికి పకడ్బందీగా పథాకాన్ని రూపొందించాడు.

ఈ మేరకు సమాచారాన్నిఅందుకున్న టిపూ తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. శ్రీరంగపట్నం కోటను బలిష్టం చేశారు. సొంతగడ్డ రక్షణ కోసం ప్రాణాలిచ్చే సైనికులను సమకూర్చుకున్నారు. దురద్రుష్టకర పరిస్తితులకు లొంగిపోకుండ విదేశీ శతృవుకు, ఆ శక్తికి వత్తాసు పలుకుతన్న స్వదేశీపాలకులకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. చివరి పోరుకు టిపూ సిద్ధమయ్యారు. శ్రీరంగపట్నం మీదకు తరలి వస్తున్నశతృబలగాలను పరిమిత ఒనరులతో, బలగాలతో ఎదుర్కొనేందుకు సన్నద్ధమయ్యారు. 1779 ఏప్రిల్‌లో శ్రీరంగపట్నానికి 45 మైళ్ళ దాూరంలో గల సెడ్బీర్ (Sedaser) అను ప్రాంతంలో, మే 4వ తేదిన శ్రీరంగపట్నానికి 35 మైళ్ళ దూరంలో ఉన్న మావెల్లీ (Malvelly) అను ప్రాంతం వద్ద ఆంగ్లేయాధికారులు Stuvart మరియు General Haris లతో టిపూ తలపడ్డారు. ఈ రెండు ప్రాంతాలలో విజయం ఆంగ్లేయకూటమికి దక్కింది. 53 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

మృత్యుంజయుడు టిపూ

టిపూ సుల్తాన్‌ గత్యతరం లేని పరిసితు లలో శ్రీరంగపట్నంకోటలోకి వెశ్ళారు. ఆ కోటను అన్ని వైపు ల నుండి ఆంగ్లేయాధికారుల బలగాలు,స్వదేశీ పాలకుల సెన్యాలు,పాలెగాళ్ళ బృందాలు చుట్టుముట్టాయి. ఈసారి శ్రీరంగపట్నంముట్టడి భారీ స్థాయిలో ప్రారంభమైంది. కర్నాటక వైపు నుండి జనరల్‌ హరిస్‌, కూర్గ్‌ నుండి జనరల్‌ స్టూవర్ట్‌,హైదారాబాదు నుండి లార్డ్‌ వెల్లస్లీ, దాక్షిణం వైపునుండి కల్నల్‌ రోడ్‌, కల్నల్ల్‌ బ్రౌన్‌ శ్రీరంగపట్నంలోని టిపూను చుట్టు ముట్టారు. నిజాం, మరాఠా పాలకులు, పాలెగాళ్ళు,వెల్లస్లీ కలలను నిజం చేయడానికి కంపెనీ సైన్యాలకు తోడుగా నిలిచారు. నిజాం సైన్యాలకు అర్థర్‌ వెల్లస్లీ స్యయంగా నాయకత్వం వహించాడు. చివరకు 1799 మే మాసం 4వ తేదిన, ఆంగ్లేయ కూటమికి టిపూకు మధ్యన భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది. ఆంగ్లేయ కూటమి అపార బలగాలు చీమల డండులా శ్రీరంగపట్నం మీద విరుచుకు పడు తున్నాయి. టిపూ బలగాలు శతృ సెనికులను కోట బురుజుల నుండి ఎదుర్కొంటున్నారు. టిపూ స్యయంగా పోరాటాన్ని పర్య వేక్షిస్తు న్నారు. సుల్తాన్‌ పట్ల విధేయులైన సైనిక యోధులు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. ఈ యోధు ధాటికి శ్రీరంగపట్నమ్ కోట సమీపానికి శతృవు చేరుకున్నాకోట లోనికి ప్రవేశించలేకున్నాడు.

టిపూ కోటలోకి శత్రు సైన్యం ప్రవేశించిన వాటర్‌ గేట్ 54 మైసూర్‌ పులి టి పూ సుల్తాన్‌

శతృవు తన కుయుక్తులకు శ్రీకారం చుట్టాడు. అధికార దాహంతో అక్రమంగా నైనా రాజ్యాధికారం చేప్టాలని ఉవ్విళ్ళారుతున్న అధికారమదాంధాులు ఆపాటికి ఆంగ్లేయులకు దాసోహం ఆనన్నారు. ఈ కుట్రలు, అంతర్గత శత్రువుల ఎత్తులను టిపూ గూఢచారి బలగాలు కనిపెట్టలేక పోయాయి. అత్యంత పకడ్బందీగా సాగిన కుట్ర వివరాలు టిపూకు తెలియలేదు. ఈ కుట్రకు మూలకారకుడు టిపూ దివాన్‌ మీర్‌ సాధిక. అతగాడు రాజ్యకాంక్షతో బ్రిీటిషర్లతో చేతు లు కలిపాడు. టిపూ రాజ్యంలోని మరికొందరు పాలెగాళ్ళు టిపూ మిత్రులుగా నటిస్తూ, బ్రిీటిషర్ల మేలుకోరసాగారు.

శ్రీరంగపట్నం కోట గోడలను విద్వంసం చేయడానికి ఆంగ్లేయ కూటమి శత విధాల ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో అంతర్గత శతృవు మీర్‌ సాధిక్‌ రంగంలోకి వచ్చాడు. ఆంగ్లేయాధికారులకు, కంపెనీ సైనికులకు కోట గోడలు బలహీనంగా ఉన్న ప్రాంతాన్నితెలియచేసూ, టిపూ ప్రాసాదానికి సమీపానున్నవాటర్‌గేటు ద్వారా కోటలోనికి ప్రవేశించటం సులువన్నరహస్యాన్ని శతృవుకు చేరవేశాడు. టిపూ ప్రాసాదానికి వాటర్‌ గేటు చాలా సమీపాన ఉంది. అక్కడ టిపూ సైనికులు ఎంతో జాగ్రత్తతో పహరాకాస్తున్నారు. ఆ సైనికులను అక్కడ నుండి తొలిగించి, ఆంగ్లేయ సైన్యాలను కోటలోకి

శ్రీరంగపట్నం ముఖద్వారం వద్ద టిపూ సుల్తాన్‌ మృతి చెందిన స్థలం
                                          55 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

తేలిగ్గా ప్రవేశింపచేసేందుకు మీర్‌ సాధిక్‌ కుట్ర పన్నాడు. అక్కడ పహరాకాస్తున్న సైనికులకు జీతాలు చెలిస్తు న్నారని అసత్యాలు చెప్పి , ఆ కీలక ప్రాంతం నుండి తప్పించాడు. ఆలోగా శత్రు సైనిక బలగాల ఫిరంగులు కోట గోడను మరింత బలహీనపర్చాయి. మీర్‌ సాధిక్‌ శతృసైనికులకు స్వాగతం పలుకుతూ కోటలోకి మార్గం చూపాడు.

మీర్‌ సాధిక్‌ స్వామి ద్రోహం వలన ఆంగ్లేయ సైన్యాలు ఎటువంటి ప్రతిఘటన లేకుండ వాటర్‌ గేటు గుండా కోటలోకి జొరబడ్డాయి. శతృ వు కోటలోకి ప్రవశించటంతో టిపూ సైన్యాలలో కలకలం ప్రారంభమైంది. ఆ అదను కోసం ఎదురు చూస్తున్న మీర్‌ సాధిక్‌ తన పని పూర్తయ్యిందన్న తృప్తితో కోట నుండి తప్పించుకొని రహస్య మార్గం ద్వారా బయటపడి ఆంగ్లేయ యజమానులను చేరేందుకు త్వరపడుతూ ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాడు.

బ్రిీటిష్‌ సెన్యం అన్ని వైపుల నుండి టిపూను చుట్టుముట్టింది. ఆ క్లిష్ట సమయంలో అందలం ఎక్కాలన్న దాురాశతో స్వామిద్రోహానికి పాల్పడిన మీర్‌ సాధిక్‌ కోట నుండి ఆంగ్లేయ శిబిరంలోకి జారుకుంటూ, టిపూ సుల్తాన్‌కు నమ్మినబంటు అయినటువింసైనికాధికారి శ్రీ కృష్ణారావు కంటబడ్డాడు. మీర్‌ సాదిఖ్‌ ప్రవర్తనను అనుమానించిన శ్రీ కృష్ణారావు అతనిని తన దగ్గరికి పిలిచారు. టిపూ సుల్తాన్‌ కోట బయటకు పంపుతున్న ఓ రహస్య సందేశం తన వద్దా ఉందని, దానిని శతృవు చేతికి చిక్కనివ్వకుండ బయటకు పంపాలని మీర్‌ సాధిఖ్‌కు నమ్మబలికారు. ఆ రహస్య సందేశం ఏమిటో తెలుసుకోదలచిన స్వామిద్రోహి తిన్నగా కృష్ణారావును సమీపించాడు. ఆ ప్రయత్నంలో కృష్ణారావుకు కత్తివేటు దూరానికి మీర్‌ సాధిఖ్‌ రాగానే ఒక్కదాటన పైకి ఎగిరిన కృష్ణారావు, సుల్తాన్‌ శత్రువు ముట్టడిలో చిక్కుబడిపోతే నువ్వెక్కడికిరా పోతున్నావు? ద్రోహీ' అంటూ తన కత్తిని సాధిఖ్‌ గుండెల్లో దించాడు. అంతటితో ఆ స్వామిద్రోహి మీర్‌ సాధిఖ్‌ బ్రతుకు అంతమైపోయింది.

ఈ విధాంగానే సరిగ్గా 50 సంవత్సరాల క్రితం 1757లో బెంగాలు సవాబు సిరాజుద్దౌలాకు ద్రోహం చేసిన మీర్‌ జాఫర్‌ లాగే, 1799లో మీర్‌ సాధిఖ్‌ స్వామి ద్రోహానికి పాల్పడి పరాయి పాలకులకు సహకరించడం చారిత్రక విషాదం. అనాడు మీర్‌ జాఫర్‌ స్వామి ద్రోహానికి పాల్పడినందున వలసపాలకులు ఈ గడ్డ మీదా స్థిరంగా కాలు మోపగలిగారు. ఈసారి మీర్‌ సాధిక్‌ అటువంటినీచానికి పాల్పడి కంపెనీ పాలకులు ఈ గడ్డ మీద గట్టిపునాదాులు నిర్మించుకునేందుకు సహయపడ్డాడు. 56 30

మైసూర్‌ పులి టిపూ సుల్తాన్‌

                    టిపూ జీవితంలో చివరి రోజు...

టిపూ సుల్తాన్‌ ఆయన తండ్రి హైదార్‌ అలీల చరిత్రను మొగల్‌ సామ్రాజ్యంలో సైనికాధికారిగా పనిచేసిన వ్యక్తి (Mr. M.M.D.L.T) రాసి, టిపూ కుమారుడు Prince Gholam Mohammed చే సవరింపడిన ప్రఖ్యాత గ్రంథం The History of Hyder Shah, alias Hyder Ali Khan Bahadur, and his son, Teppoo Sultan లో టిపూ యుద్ధ్దరంగంలో సాగించిన పోరాటాన్ని వివరించారు. ఆ వివరాలను Eminent Muslim Freedom Fighters పుస్తకంలో ఆ పుస్తక రచయిత G,Allana విస్తారంగా ఉటంకించారు.

1799 మే నాల్గవ తేది. ఆరోజున, అప్పటి వరకు కుట్రలు, కుయుక్తులు, ఎత్తులు, చిత్తులు, ఎత్తుగడలతో సాగుతున్న యుద్ధాన్ని అంతవరకు పర్యవేక్షించి, అప్పుడే అల్పాహారంస్వీకరించడానికి టిపూ తన ప్రాసాదానికి వచ్చారు. ఆయన కుటుంబీకులు అందించిన అల్పాహారం తినడం ప్రారంభించారు. ఆ సమయంలో ఆయన ప్రాసాదానికి సమీపాన గల వాటర్‌ గేటు వద్ద సైనికుల కలకలం వినవచ్చింది. ఆ కలకలం విని

టిిపూ భౌతిక కాయాన్నిగుర్తించిన బ్రిటిష్‌ సైన్యాధికారి జనరల్‌ హారిస్‌ 57 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

అల్పాహారాన్ని పూర్తి చేయకుండనే లేచి వచ్చి పరిస్థితిని వీక్షించారు. స్వామిద్రోహులు చేసిన నమ్మకద్రోహం, శతృవుల కోటలోకి ప్రవేశం తదితర అంశాలను తక∆ణమే గ్రహించారు దుర్భేధ్యమైన కోటలోకి శతృసైన్యాలు భారీ సంఖ్యలో జొరబడిన విషయం గమనించారు. పరిస్థితులు చేతులు దాిటిపోయాయి.

ఆ సమయంలో టిపూ ఆంతరంగికులు ఆయనను కోట నుండి తప్పించు కోవాల్సిందిగా కోరారు. ఆ సలహా ఆయనకు రుచించలేదు. ఆంగ్లేయుల మీద, వారి వత్తాసుదారుల మీద, తిరుగులేని పోరాటం సాగించాల్సిందేనని నిర్ణయించుకున్నారు.విజయమో లేక వీరస్వర్గమో తప్ప మరొక ఆలోచన ఆయన మదిలోకి రాలేదు. ఆప్తులు,మంత్రులు, అధికారులు ఎంతగా వలదని వారిస్తున్నాఆయన వినలేదు.

చివరకు 'నక్క లాగా రెండు వందల సంవత్సరాలు బ్రతికే కంటే సింహంలా రెండు రోజులు బ్రతికిన చాలు' అని అంటూ టిపూ యుద్ధభూమిలోకి ప్రవేశించారు.ఈ సందర్భంగా, ' అమర్యాదాకర బానిస బ్రతుకు బ్రతికేకంటే శిరస్సుల మీద రక్తధారలను కురిపిస్తున్న యుద్ధామేఘాల క్రింద మరణించటం ఎంతో మేలు కదా భగవంతుడా!' అని ఆయన వ్యాఖ్యానిస్తూ శత్రు సైనికులలో చొరబడ్డారు. ( ' Better a lion's life for two days than a Jackal's life for two hundred years...Ya Allah, it is better to die beneth the coulds of battle raining blood upon our heads than to live of shame and degradation ' - BN Pande : Page. 15)

కంపెనీ సైన్యం వరదలా కోటలోకి చొచ్చుకువస్తూ, కోటలోని ప్రతి అంగుళాన్ని ఆక్రమించుకుంటున్నా, ఆ సైన్యాన్ని నిలువరించఫడానికి సరిపడ బలగాలు తనవెంట లేకపోయినా స్థిర నిశ్చయంతో ముందుకు సాగుతున్న టిపూ ఏమాత్రం అధైర్యపడలేదు.అధైర్యపడటం ఆయన జీవితంలోనే ఎరుగని ఆ యోధుడు ఒక్క అడుగు కూడ వెనక్కు వేయలేదు. శత్రువుతో సంకుల సమరానికి సిద్ధమై శతృసైన్యాల మధ్యకు ఆయన దూసుకుపోయారు. శతృ సెన్యాలు, ఆంగ్లేయాధికారులు కనీసం టిపూను సమీపించడానికి భయపడేంతగా రణభూమి అంతా తానై కన్పిస్తూ, శతృసైన్యాలలో భయోత్పాతం కల్గిస్తున్నారు. శతృసైన్యాలను చెండాడుతూ రణరంగంలో దూసుకుపోతున్న టిపూకు రక∆ణ కరువైంది. సన్నిహితులు-సహచరులు లేరు. అంగరక్షకులు లేరు. ఆత్మీయులు పలువురు రాజ్య రక్షణలో హతులయ్యారు.

అయినా కూడ ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులతో అమీతుమీ తేల్చుకోవడనికి సిద్ధామైన టిపూ శతృసైనికులను తునుమాడుతుండగా, తుపాకి గుండొకటి దూసుకు 58 31

మైసూర్‌ పులి టిపూ సుల్తాన్‌

వచ్చి ఆయనను తాకింది. ఆ మరుక్షణమే మరొకటి తుపాకి గుండు ఆయన శరీరంలోకి జొరబడింది. టిపూ అశ్వం కూడ తుపాకి గుండ్ల తాకిడితో కూలబడింది. టిపూ గుర్రం మీద నుండి క్రిందకు జారిపోయారు. ప్రపంచ ప్రసిద్దమైన ఆయన తలపాగా సుల్తాన్‌ శిరస్సు నుండి తొలగిపోయింది. ఆ అపత్కర పరిస్థితులలో గాయపడిన సుల్తాన్‌ను రక్షించుకునేందుకు కనీస సహాయం కూడ అందించలేని దుస్థితి.

టిపూ శరీరంలో జొరబడిన తుపాకి గుండ్లు కల్గిస్తున భయంకర బాధను భరిస్తూ కూడ లేచి నిల్చోడానికి శత విధాల ప్రయత్నించి ఆయన విఫలమయ్యారు. ఒక వైపు శరీరంలో రక్తమంతా భూమిని తడిపేస్తున్నా నీరసం ఆవహిస్తున్నా క్రమంగా ప్రాణం పోతున్నా,తన చేతిలోని ఖడ్గాన్ని మాత్రం ఆయన వదాలలేదు టిపూ తలపాగా ఊడి పోవటంతో, సామాన్య సైనికుల మృతదేహాల మధ్యన పడిఉన్న ఆయన ఎవరో కూడ గమనించలేని గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఆ సమయంలో యుద్ధ వాతావరణం కొంత తగ్గు ముఖం పట్టింది. టిపూ సైనికుల నుండి ప్రతిఘటన కరువైంది. శతృసైనికులు భారీ సంఖ్యలో కోటలోకి జొరబడ్డారు. ఆ సైనికులకు చర్యలకు అడ్డులేకపోయింది. అందినంత దోచుకోసాగారు. కోటలో ప్రజలకు రక్షణ కరువు కావటంలో విధ్యంసం, దోపిడి యధేచ్ఛగా సాగుతుంది.

టిపూ బౌతిక కాయం వద్ద రోదిస్తున్న ఆంతరంగికులు

                         59 

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

టిపూ తుపాకి గుండు కలిగించిన తీవ్రమెన గాయం వలన రగిలిన బాధను పళ్ళ బిగువున భరిస్తూన్నారు. అసమయంలో ఆంగ్లేయ కూటమికి చెందిన ఓ సైనికుడి చూపు టిపూ నేలకొరిగిన ప్రాంతంలో ఆయన ఖడ్గం, ఆయన ధరించిన విశిష్టమైన బెల్టు మీదపొదిగిన బంగారం, వజ్రాల మీద పడింది. అత్యంత విలువైన ఆ బంగారం, వజ్రాలను వశపర్చుకోవచ్చన్న ఆశ అతనిలో కలిగింది. నేలకొరిగియున్నఆ ఖడ్గధారి టిపూ అని అతనికి తెలియదు. ఆ విషయం తెలిసి ఉంటే ఆ మైసూరు పులి సమీపానికి కూడ ఎవ్వరూ రాగలిగేవారు కారు. టిపూ నిస్త్రాణంగా ఓ పక్కకు ఒరిగి ఉన్నారు. అవకాశం చిక్కింది కదా అని, అ సైనికుడు టిపూ బెల్టు, ఖడ్గాన్ని ఊడబెరుక్కోడానికి సాహసించి టిపూను సమీపించాడు. శత్రు సైనికుడు సమీపిస్తున్నాడని గమనించిన టిపూ తన శరీరంలోని బలాన్నంతా కూడదీసుకొని తన బెల్టు, ఖడ్గాన్ని తస్కరించ చూసిన శత్రు సైనికుడ్నితన కరవాలానికి ఎర చేసారు.

మృతుడనుకున్న వ్యక్తి అకస్మాత్తుగా కత్తి దూయటం, క్షణాలలో ఆ సైనికుడి ప్రాణాలు తోడెయ్యడంతో ఆ ప్రాంతంలోని సెనికులు ఖంగుతిన్నారు. అంతలోనే తేరుకుని టిపూ మీద తుపాకి పేల్చాడు.టిపూ సుల్తాన్‌ గాయపడి కూడ విక్రమించటం చూసిన మిగతా సెనికులు ఆయన మీద విచక్షణా రహితంగా తుపాకి గుండ్ల వర్షం కురిపించారు.ఆ గుండ్ల వర్షంలో పోరాట యోధుడు టిపూ సుల్తాన్‌, 1799 మే మాసం 4వ తేదీ సాయంసమయాన కన్నుమూసారు.

టిపూ సుల్తాన్‌ మృతిచెందిన స్థలంలో నిర్మించిన స్మారక స్థూపం

                                  60 

మైసూర్‌ పులి టిపూ సుల్తాన్‌

యుద్దాభూమిలో అమరుడైన ప్రప్రథమ స్వదేశీ పాలకుడు

ఈ విధంగా బ్రిీటిషర్లతో కదన రంగాన ధైర్యసాహసాలతో పోరాడుతూ చివరి శ్వాస వదలినస్వదేశీ పాలకులలో టిపూ ప్రథముడని చరిత్ర ఆయనను కీర్తిచింది. (..."Tipu Sultan was the single brave hero of Indian Histroy who fighting the Britishers met his martydom in the battle field.." - Prof.Jaya Prakash) ఈ విషయాన్నిThe sword of Tipu రచయిత Bhagavan S. Gidwani వ్యక్తం చేస్తూ, ఈ విషయాన్నిఓ విదేశీ చరిత్ర పరిశోధక విద్యార్థి ద్వారా తెలుసుకుని తాను ఆశ్చర్యపోయానని, ఈ విషయం విన్న తరువాత టిపూ మీద తనకు ప్రత్యేక శ్రద్ధ ఏర్పడిందని, దాని ప్రతిఫలమే ప్రఖ్యాత చారిత్రక నవల The Sword of Tipu ఉనికిలోకి వచ్చిందని పేర్కొన్నారు.

టిిపూ సుల్తాన్‌ ప్రాణాలు వదలిన ఆరు గంటల వరకు ఆయన మరణించిన వార్త ఎవ్వరికీ తెలియరాలేదు. యుద్ధ రంగంలో ఆయన కన్పించకుండ పోవటంతో పలు ఊహాగానాలు సాగాయి. ఆయన అమరుడైన విషయంస్వజనులకు కూడ తెలియదు. శతృవు చక్రబంధం నుండి సుల్తాన్‌ చాకచక్యంగా తప్పించుకున్నారని

శ్రీరంగపట్నలోని టిపూ అంతóపురం శిథిలాలు

61

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

శ్రీరంగ పట్నానికి సమీపాన గల హైదర్‌ అలీ, టిపూ సుల్తాన్‌ సమాధి

సన్నిహితులు భావించ సాగారు. ఈ మేరకు పలు ఊహాగానాలు సాయం సమయం వరకు షికార్లు చేశాయి.

చివరకు చీకట్లు కమ్ముకుంటున్న వేళ బ్రిీటిష్‌ సైనిధికారి జనరల్‌ హరిస్‌, తన సాయుధ బలగాలను, టిపూ బంధువులు, సేవకులకు వెంటబెట్టుకొని మృత వీరుల గుట్టలలో టిపూ కోసం వెతు కులాట ప్రారంభించాడు. చివరకు విశ్వాసపాత్రులైన సెనికుల మృతదేహాల మధ్యన విగత జీవుడైన టిపూ కన్పించారు. అప్పటికీ ఇంకా అనుమానమే! టిపూ బ్రతికి ఉంటే, ఒక్కసారిగా లంఫిుస్తే అమ్మో! అనుకుంటూ భయం భయంగా కంపెనీ బలగాలు ఆయన బౌతిక్కాయాన్ని సమీపించేందుకు సాహసించలేకపోయాయి.టిపూబౌతిక కాయం చుట్టూ సాయుధు లైన సెనికులను నిల్చోపెట్టి ఏ కణాన్నైనా తుపాకులు


గర్జించేందుకు వీలుగా టిపూకు గురిపెట్టించి ఆయన దేహాన్ని సమీపంనుండి పరిశీలించి,

62

మైసూర్‌ పులి టిపూ సుల్తాన్‌

టిిపూ కుమారులు

ఫతె హైదర్‌

అబ్దుల్‌ ఖాలిద్‌

మోయిజుద్దీన్‌

సుల్తాన్‌ మొహియుద్దీన్‌

యాసీన్‌ సాహెబ్‌

సుభాన్‌ సాహెబ్‌

                                            63 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

అప్పుడు టిపూ మరణాన్ని జనరల్‌ హారిస్‌ ధృవపర్చుకున్నాడు. అప్పిటికే టిపూ ధరించే ప్రత్యేక తలపాగా, బెల్టు, ఖడ్డం మాయమయ్యాయి.

టిపూ మృతదేహాన్నిస్వయంగా పరిశీలించి టిపూ మరణించారని నిర్ధారణ చేసుకున్నాక, ఆ సమయంలో కలిగిన ఆనందాన్ని పట్టలేక ఈ నాటి నుండి ఇండియా మనది ("Now India is ours") అని ఆంగ్లేయ సైనికాధికారి జనరల్‌ హరిస్‌ ప్రకటించాడు. టిపూ సుల్తాన్‌ సజీవంగా ఉన్నంతవరకు భారతదేశాన్నిపూర్తిగా తమ గుప్పెట్లోకి తీసుకునేందుకు సాధ్యం కాదని,టిపూ ఉన్నంత వరకు తమ ఎత్తులు- కుయుక్తులు సాగవని గ్రహించిన బ్రిీటిషర్లు, టిపూ కన్నుమూసాక సంతోషం పట్టలేక పోయారు.

ఈ విజయం తరువాత ఓ ఆంగ్లేయాధికారి మాట్లాడుతూ, Defeat of Srirangapatnam would lay the Eastern empire under our feet అని వ్యాఖానించాడని ప్రముఖ చరిత్రకారుడు జి.యస్‌ సరశాయి తన History of Marathas లో ఉటంకించాడు. టిపూ మీద విజయం సాధించాక జరిగిన విందులో గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ వెల్లస్లీ మ్లాడుతూ "Friends today I am taking this glass of wine on the corpse of India..." అన్నాడు. ఆంగ్లేయాధికారి Thomas Minro మాట్లాడుతూ "We can eaily capture all of India but Tipu is the only hudrle." అన్నాడంటే టిపూ బ్రిీటిషర్ల దురాక్రమణను ఎంతగా ఎదుర్కొన్నాడో ఎంతగా అవరోధం అయ్యాడో, ఆంగ్లేయులను ముందుకు సాగనివ్వకుండ మరెంతగా నిలువరించాడో అవగతం అవుతుంది.

టిపూ ప్రజల మనస్సులలో ఎర్పరచు కున్న సుస్థిర స్థానాన్ని గమనించిన గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ వెలస్లీ బ్రిీటిష్‌ సైన్యాధికారులకు ఇచ్చిన విందులో మాట్లాడు తూ, మిత్రులారా మిమ్మల్నినన్నుఈ ప్రపంచం మర్చిపోవచ్చు. అయితే టిపూ స్మతులు మాత్రం కలకాలం నిలచిపోగలవు. (..."I fear my friends that Tipu's memor will live long after the world has ceased to remember you and me..") అని ఘనంగా నివాళులు అర్పించటం విశేషం.

టిపూ కన్నుమూసాడని నిర్థారించుకున్నాక బ్రిీటిష్‌ సైనిక కూటమికి పట్టపగ్గాలు లేకుండ పోయాయి. మైసూరు రాజ్య రాజధాని శ్రీరంగపట్నం మీద ఆంగ్లేయ కూటమికి చెందిన సైనిక బలగాలు విజృంభించాయి. ఈ విజృంభణ మూడు రోజుల పాటు

                                           64 

మైసూర్‌ పులి టిపూ సుల్తాన్‌

సాగింది. శ్రీరంగపట్నం ప్రజలను యధేచ్చగా దోచుకున్నాయి. టిపూ కుటుంబీకులతో సహా, సామాన్య ప్రజలను శారీరంగా, మానసికంగా హింసల పాల్జేసాయి. స్రీలు, వృద్ధులు,పిల్లలను బేదం లేకుండ బ్రిీటిషర్లు శ్రీరంగపట్నంవాసుల మీద అత్యాచారాలకు, అంతులేని దోపిడికి పాల్పడి, విలువైనది ప్రతీది దోచుకుని, తమను ముప్పు తిప్పలు ట్టి మట్టి కరిపించిన టిపూ సుల్తాన్‌ మీద భయంకరంగా కసి తీర్చుకున్నాయి. టిపూ సుల్తాన్‌ ప్రాసాదాన్ని పూర్తిగా దోచుకుని విధ్యంసం సాగించాయి.టిపూకు ప్రియమైన గ్రంథాలయాన్ని, ప్రబుత్వ రికార్డులను, టిపూ సుల్తాన్‌ శ్రీరంగపట్నాన్నిశ్మశానవాటికను చేసిగాని శతృ సైనికులు అక్కడ నుండి నిష్క్రమించలేదు. ఈ దోపిడిలో లభించిన అతి విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలతో పాటుగా గ్రంథాలు, ప్రభుత్వరికార్డులు, సనద్‌లు, టిపూ సుల్తాన్‌ కుటుంబానికి సంబంధించిన ప్రత్యేక వస్తువులు అన్నీ కూడ శ్రీరంగపట్నంనుండి కలకత్తా చేరి అటు నుండి ఇంగ్లాండుకు తరలి వెళ్ళాయి. ఈ అకృత్యాలను, కర్ణాటక ప్రభుత్వం మాజీ మంత్రి, చరిత్రకారుడు జనాబ్‌ మహమ్మద్‌ మొయినుద్దీన్‌ రాసిన శ్రీరంగపట్నం అఫ్‌టర్‌ డాన్‌ అను ఆంగ్ల గ్రంథంలో సవివరంగా పేర్కొన్నారు.

శత్రువు చేత కూడ ఘనమైన నివాళులు, ప్రశంసలు అందాుకున్న టిపూ సుల్తాన్‌ లాింటి స్వదేశీ పాలకులు భారతదేశ చరిత్రలో అరుదు. ఆ కారణంగా చివరి నెత్తురు బొట్టు నేలరాలే వరకు బ్రిీటిషర్లతో పోరాడి, చివరకు రణరంగంలో కన్నుమూసిన, భారతదశం గర్వించదగిన ముద్దుబిడ్డడు టిపూ సుల్తాన్‌ చరిత్రపు టలలో అరుదెన శాశ్వత స్థానం పొందారు.

65