మైసూరు పులి టిపూ సుల్తాన్/పరిచయ వాక్యం

మైసూర్‌ పులిటిపూ సుల్తాన్‌

యం.డి. సౌజన్య ప్రముఖ రచయిత, కవి తెనాలి.

పరిచయ వాక్యం విజేతలదే చరిత్ర. పరాజితుల చరిత్ర చాలావరకు ప్రాచుర్యానికి నోచుకోదు. విజయం సాధించిన వర్గాలు ఆనాి అన్ని రంగాలను శాసిస్తాయి. అందువలన సహజంగా విజేతల చరిత్ర అక్షరబద్ధమవుతుంది. పరాజితుల ఆనవాళ్ళు కన్పించకుండ పోతాయి. ఈ పరిణామాలలో విజేతలు పరదేశీయులు, పరాజితులు స్వదేశీయులు అయినట్లయితే, తమ పాలనకు స్థానిక జనసముదాయాల అనుకూలతను సాధించేందుకు పరాజితుల చరిత్రలు ఘోరంగా వక్రీకరించబడతాయి. పాలకవర్గాల లక్ష్యాలకు అనుకూలంగా చిత్రించబడతాయి. చివరకు ఆ వక్రీకరించిన - చిత్రీకరించిన చరిత్రే భవిష్యత్తు తరాలకు చరిత్రగా మారుతుంది. ఆ చరిత్రను భావితరాలు నమ్మాల్సిన పరిసితులు ఎదురవుతాయి. ఈ అవకాశాలను రాజ్యకాంక్షాపరులైన వ్యక్తులు-శక్తులు ఆ తరువాత కాలంలో చాలా తెలివిగా ఉపయోగించుకుంటాయి.

మన దేశంలోని చరిత్ర పలు వక్రీకరణలకు-చిత్రీకరణలకు గురయ్యింది. బ్రిీటిషర్లు మన గడ్డమీద అడుగుప్ర్ట్టి స్వదేశీ పాలకులను పరాజితులనుచేసి అధికారాన్నిచేజిక్కిం చుకుని, ఆరంభించిన పాలనకు స్వదేశీయుల ఆమోద ముద్ర పొందేందుకు పరాజితులైన స్వదేశీ పాలకుల గడచిన కాలంనాటి పాలన అత్యంత క్రూరమైనదిగా పేర్కొంటూ, ఆపాలకులను నిరంకుశులుగానూ, కడు దుష్టులుగాను చిత్రిస్తూ గ్రంథాలు రచించారు. ఈ కార్యక్రమాన్నిఅధికార స్థాయిలో భారీ ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సమర్దవంతంగా నిర్వహించేందుకు ప్రముఖ ఆంగ్ల రచయితలను, ఆంగ్లేయాధికారులను,మిషనరీలను ప్రత్యే కంగా నియమించారు, అవసరానికి మించిన ధనసంపదలను నిర్దేశిత లక్ష్యాల కోసం అందజేసి చరిత్రను తిరగరాయించారు. ప్రముఖ ఆంగ్ల రచయిత JS Grewal తన గ్రంథం Muslims Rule in India : The Assement of British Historians, (Oxford University Press, 1970) లో ఈవిషయాన్ని ప్రస్తావిస్తూ '..British administrators, scholors, historians and missionaries all become seriously involved in making the people believe that Brit-

5

23 21 9 ish rule was better than medieval Muslim rule.'అన్నాడు.

ఈ మేరకు భారతదేశంలోగల అధిక సంఖ్యలోగల ముస్లిమేతరుల సమ్మతిసాధించేందుకు సాగిన చరిత్ర వక్రీకరణ - చిత్రీకరణలకు ముస్లిం పాలకులు ప్రదానంగా బలయ్యారు. ఆ విధగా దుష్ప్రచారానికి గురన స్వదేశీ పాలకులలో మైసూరు పాలకుడుటిపూ సుల్తాన్‌ ఒకరు. భరత గడ్డనుండి బ్రిీటిషు పాలకులను తరిమివేయడం కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టి, ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులను ముప్పుతిప్పలు పెట్టిన టిపూను ప్రధాన శతృవుగా భావించిన ఆంగ్లేయులు ఆయనను దుర్మార్గుడిగా చిత్రించారు. ఆయన చరిత్రను వక్రీకరించారు. ఆ మేరకు దుష్ట ప్రచారం చేశారు. ఆ ప్రచారాన్ని భుజాలమీద మోస్తూ ఈనాటికి కొన్నిమతోన్మాద రాజకీయ శక్తు లు ప్రచారానికి పూనుకుని పనిచేస్తున్నాయి. 1999లో టిపూ సుల్తాన్‌ ద్విశతవార్షికోత్సవాలను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం జరపదలపెట్టిన సందర్భంగాటిపూను మతోన్మాదిగా, హిందాూ ద్వేషిగా చిత్రిస్తూ సంఘపరివారం ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది.

అటువంటి కుట్రపూరిత ప్రచారాలను వమ్ముచేయాలంటే వాస్తవాలు బహిర్గతం కావాలి. పదిమందికి తెలియాలి. ఆ దిశగా చరిత్రకారులు కృషి సాగించాలి. మన దేశంలోని విభిన్న జన సముదాయాలు తమ పూర్వీకుల త్యాగాలను తెలుసుకోవాలి. ఆవిధాంగా కలిగిన ఎరుకవల్ల ఆయా సామాజిక సముదాయాల మధ్య సదావగాహన ఏర్పడుతుంది. ఆ సదవగాహన నుండి సద్భావన అంకురిసుంది. ఆ సద్భావన ఫలితంగా సమాజంలో సామరస్యం పటిష్టమౌతుంది. ఆ వాతావరణంలో ప్రజాస్వామ్య-లౌకిక వ్యవస్తలు పరిఢవిల్లుతాయి. ఈ లక్ష్యంతో భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో ముస్లింల భాగస్వామ్యాన్ని వివరిస్తూ తెలుగు పాఠకుల కోసం చరిత్ర రచన సాగిస్తున్న సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ మైసూరు పులి:టిపూ సుల్తాన్‌ అను మరో గ్రంథాన్ని రాశారు. ఈపుస్తకం పేజీల లెక్కన చూస్తే చిన్నదే అయినా, పుస్తకంలోని అంశాన్నిబేరీజు వేస్తే చాలా బరువైనది కనుక ఈ పుస్తకాన్ని పిట్ట కొంచెం కూత ఘనం అనక తప్పదు.

మాతృభూమి నుండి బ్రిీటిషర్ల తరిమివేతకు పోరుబాటను ఎన్నుకున్నటిపూ సుల్తాన్‌, జాతీయ భావనలతో స్వదేశీ పాలకుల ఐక్య సంఘటన నిర్మించేందుకు ఏ విధాంగా ప్రయత్నించాడో ఈ పుస్తకంలో రచయిత వివరించారు. ఓయుద్ధ తంత్రనిపుణుడిగా, అసమాన పోరాట యోధుడిగా మాత్రము కాకుండ జనరంజక పాలకుడిగా,సాహిత్య వేత్తగా, రచయితగా, పత్రికా సంపాదకుడిగా, పుస్తక ప్రేమికుడిగా, సంస్కర్తగా,లౌకిక ప్రభువుగా, అంతర్జాతీయ వ్యవహార దాక్షుడిగా, రాజనీతి కోవిదుడిగా, మనసున్న మహారాజుగా, వర్తక- వాణిజ్యరంగాలలో నూతన దృక్పధాల ఆవిష్కర్తగా, స్వదేశీ మైసూర్‌ పులి టిపూ సుల్తాన్‌

విదేశీ పరిజ్ఞానాన్ని మేళవించి కొంగ్రొత్త విధానాల రూపశిల్పిగా, పరమత సహనంగల రాజుగా, పర్యావరణ పరిరక్షకుడిగా,న్యాయవ్యవస్థలో సరికొత్త శిక్షల విధానాన్నిప్రవేశ పిట్టిన సుల్తానుగా, రైతాంగం మిత్రుడిగా, నావికాదాళ వ్యవసకు వినూత్న హంగులు చేర్చిన దార్శినికుడిగా, యుద్ధ క్షిపణులు తయారి-వినియోగంలో ప్రథముడిగా, అన్నిటికి మించి మాతృభూమి రక్షణ కోసం వైరి వర్గాలను చెండాడుతూ యుద్ధరంగంలో కన్నుమూసిన ప్రపదమ స్వదేశీ యోధు డిగా టిపూ సుల్తాన్‌ వ్యకిత్వంలోని విభిన్న కోణాలను ఈ గ్రంథాం ఆవిష్కరించింది.

ఈ ఉన్నత-ఉత్తమ లక్షణాలన్నీటిపూ సుల్తాన్‌లో నిబిడీకృతమైయున్నాయన్న విషయాన్ని ధావీకరించేందుకు ప్రముఖ ఆంగ్లేయ రచయితలు స్వయంగా రాసిన పలుగ్రంథాల నుండి ఆధారాలను రచయిత సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ చూపారు. ఈ గ్రంథంలో పేర్కొన్న ప్రతి ప్రాధాన్యతగల అంశాన్ని నిరూపించేందుకు బ్రిీటిషు అధికారులు, స్వయంగా టిపూతో యుద్ధరంగంలో తలపడన అంగ్లేయ సైనికాధికారులు ఉటంకించిన వాక్యాలను రచయిత ఈ గ్రంథంలో పొందుపర్చుతూ, తాను రాసిన విషయాలకు బలం చేకూర్చారు. టిపూను పరాజితుడ్ని చేయ డానికి కంకణం కట్టుకున్న ఈస్ట్‌ ఇండియా కంపెనీ అధికారులు టిపూ విశిష్ట వ్యక్తిత్వం, ఆయన విధానాల మీదా చేసిన ప్రశంసనీయ వ్యాఖ్యలను ఆయన చక్కగా వినియోగించుకున్నారు. టిపూ సుల్తాన్‌ మీద ప్రచారంలో ఉన్న అతి ప్రధాన ఆరోపణలను ప్రస్తావిస్తూ, టిపూ చర్యలను మతోన్మాద స్వార్థపరశక్తులు ఏవిధంగా వక్రీకరించింది ఈ గ్రంథం తగినన్ని రుజువులతో స్పష్టపరిచింది. లౌకిక ప్రబుè వుగా ఖ్యాతి గడించిన టిపూను అపఖ్యాతి పాల్జేయడానికి, మూడు వేల బ్రాహ్మణుల ఆత్మహత్యకు ఆయన కారణమయ్యాడని కలకత్తా విశ్వవిద్యాలయం సంస్కృత విభాగాధిపతి డకర్‌ హరిప్రసాదా శాస్త్రి దురుద్దేశ్య పూర్వకంగా చేసిన అసత్య ఆరోపణలను వివరించి, ఆ ఆరోపణలను ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్‌ బి.యన్‌.పాండే ఏ విధగా బలమెన ఆధారాలతో శ్రీశాస్త్రి రాసిన ఆరోపణలను తిప్పికొిట్టిన తీరుతెన్నులను రచయిత విస్పష్టంగా పేర్కొన్నారు. జన జీవనంలో సభ్యత - నైతిక విలువల పరిరక్షణకు టిపూ చూపిన ఆసక్తి అందుకుగాను ఆయన చేపన సంస్కరణలు, ఆసంస్కరణల అమలుకు ఆయన తీసుకున్న చర్యలను కూడ వక్రీకరిస్తూ,టిపూ సుల్తానను పచ్చి మతోన్మాదిగా, క్రూరునిగా, నిరంకుశుడిగా దాశ్యీకరించేందుకు కొందరు విదేశీ-స్వదేశీ చరిత్రకారులు ఉద్దేశ్యపూరితంగా చేసిన ప్రయత్నాలను ఈ గ్రంధంలో విడమర్చి వివరిస్తూ, తగిన ఆధారాలతో ఆ ఆరోపణలను రచయిత తిప్పిగొట్టారు. టిపూను జనరంజక పాలకునిగా పేర్కొంటూ, ఆయనలోని సుగుణాలను 7 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

వివరిస్తూనే, పాలక వర్గాల చర్యలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారి పట్ల ప్రభువులు ఏవిధాంగా ప్రవర్తిస్తారో అందాుకు భిన్నంగా టిపూ సుల్తాన్‌ ఏమాత్రం ప్రవర్తించలేదని, ఆనాటి ఇతర ప్రభువుల్లాగే ప్రభుత్వ వ్యతిరేకుల పట్ల టిపూ కూడ కఠినంగా, క్రూరంగా వ్యవహరించాడని పేర్కొన్నారు. ఈ విధాంగా టిపూలోని అన్ని పార్శ్యాలను దృశ్యీకరిస్తూ, తద్వారా చారిత్రక వ్యక్తుల వ్యక్తిత్వాలను ఆవిష్కరణలో నిష్పాక్షికత, సమతుల్యం పాిటించటం, రచయిత నిజాయితీ ఈ గ్రంథంలో కన్పిస్తుంది. ఈ గ్రంథంలో కేవలం టిపూ సుల్తాన్‌కు సంబంధించిన విలువైన సమాచారాన్ని అందించటం మాత్రమే కాకుండ,టిపూకు సంబంధించిన అపూర్వమైన ఫొటోలను, చిత్రాలను కూడ రచయిత ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, సేకరించి పొందుపర్చారు.టిపూ నిర్మించిన మస్జిద్‌-ఎ-ఆలా,టిపూ అనునిత్యం సందర్శించే శ్రీరంగనాధాస్వామిఆలయం ఫొటోలు, టిపూ స్వదస్తూరి, మూడవ మైసూరు యుద్దం నష్టపరిహారం కోసం తన బిడ్డలను పూచీకత్తుగా ఆంగ్లేయులకు అప్పగిస్తున్న చిత్రం, ఆయన ఆరుగురు కుమారుల చిత్రాలు, నాల్గవ మైసూరు యుద్ధంలో ప్రాముఖ్యత సంతరించుకున్న శ్రీరంగపట్నం కోటలోని వాటర్‌ గేటు, యుద్ధరంగంలో టిపూ నేల కూలిన స్థలం, ఆయన స్మారక స్థూపం, శిధిలమైన టిపూ ప్రాసాదాం, హైదార్‌ అలీ-ిపూ సుల్తాన్‌ల సమాదుల ఫొటోలు, చిత్రాలు ఈ గ్రంథం విలువను మరింతగా పెంచాయి. ముస్లింలకు వ్యతిరేకంగా మతోన్మాదా-రాజకీయ శక్తులు ఈనాడు సాగిస్తున్న దుష్ప్రచారం వలన మన దేశంలోని విభిన్న సాంఫిుక జనసముదాయాల మధ్య ఏర్పడు తున్న మానసిక అఘాతం గోద్రా-గుజరాత్‌ లాిం భయంకర సంఘటనలకు ప్రజలను పురికొల్పుతున్నందున, ఆనాడు మాతృభూమి విముక్తి కోసం ముస్లిం జనసముదాయాలు సాగించిన అసమాన పోరాటాలను, ఆ పోరాటాలలో పాల్గొన్న యోధులను, ఆ తరువాత మాతృదేశం అభివృద్ధి పథంలో మున్ముందుకు సాగిన కృషిలో భాగస్వాములైన ముస్లిం ప్రముఖుల కృషిని అందరికి ఎరుకపర్చాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ దిశగా కృషి జరిగి తగినంత సాహిత్యం సామాన్య ప్రజలకు అందాుబాటులోకి వచ్చినట్టయితే ఆయా సాంఫిుక జనసముదాయాల పట్ల పెంచిపోషించబడుతున్న అపోహలు- అపార్థాలు దూరమవుతాయి. ఆ మంచి వాతావరణంలో ఒక సామాజిక జన సముదాయం పట్ల మరొక జనసముదాయంలో గౌరవభావం అంకురించి సామరస్య-సహిష్ణుత భావనలు మరింతగా పపుష్టమవుతాయని ఆకాంక్షిస్తూ, ఆ దిశగా తెలుగులో చరిత్ర రచనలను అందిస్తున్న రచయిత అభినందనీయులు.

                                    ,,,

8 6