ముద్దబంతి పూవులో

ఈ పాట ఆచార్య ఆత్రేయ రచన:

ప|| ముద్దబంతి పూవులో మూగ కళ్ళ ఊసులు

ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే || ముద్దబంతి ||


చ|| పూలదండలో దారం దాగుందని తెలుసును

పాలగుండెలో ఏది దాగుందో తెలుసునా? ఆ....... | పూల |

నవ్వినా, ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి

ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా? || ముద్దబంతి ||


చ|| మనసు మూగదేకాని బాసుండది దానికి

చెవులుండే మనకుకే ఇనిపిస్తుందా ఇది

ఎదమీద ఎదపెట్టి సొదలన్నీ యినుకో

యినుకునీ బతుకునూ ఇంపుగా దిద్దుకో || ముద్దబంతి ||


చ|| ముక్కోటి దేవుళ్ళు మురిసి సూస్తుంటారు

ముందు జనమ బంధాలు ముడివేసి పెడతారు

కన్నోళ్ళ కన్నీళ్ళు కడుపుతీపి దీవెనలు

మూగమనసు బాసలూ (2) మీకిద్దరికీ జోతలు || ముద్దబంతి ||