ముకుందవిలాసము

కాణాదం పెద్దన సోమయాజి






సంపాదకుడు :

డా. ఆర్. శ్రీహరి, ఎం.ఏ; పి హెచ్ డి.

రీడర్ : తెలుగుశాఖ

హైదరాబాదు విశ్వవిద్యాలయం




ప్రచురణ :

తెలుగు విజ్ఞానపీఠం

"కళాభవనం", సైఫాబాదు, హైదరాబాదు - 500 004.

MUKUNDA VILASAMU - Telugu classic by Kanadam Peddana

Somayaji of 18th Century A. D.

Edited by Dr. R. SRI HARI, M.A;Ph.D. Reader, Dept of Telugu,

University of Hyderabad, Hyderabad, Andhra Pradesh.

తెలుగు విజ్ఞాన పీఠం

హైదరాబాదు - 500004.


ప్రచురణ : 368


ప్రథమముద్రణ 1985


ప్రతులు 2000

వెల రూ. 10-00


ప్రతులకు :

తెలుగు విజ్ఞాన పీఠం

కళాభవనం, సైఫాబాదు,

హైదరాబాదు - 500 004.


ముద్రణ:

చార్ మినార్ ఆర్ట్ ప్రింటర్స్,

సికిందరాబాదు -500003.

భూమిక

జాతి సాంస్కృతిక జీవనానికి లలితకళలు దర్పణం వంటివి. అటువంటి లలితకళలలో సాహిత్యం ప్రధానమైనది. సాహిత్యం రసప్రదాయిని, సౌందర్యదర్శిని కావడంతోపాటు సామాజిక ప్రయోజనకారి కావడమే ఇందుకు కారణం. వర్తమానం భూతభవిషత్తులకు వారది. కనుక గతకాలం సాధించిన సత్ఫలితాలను పదిలపరిచి, వాటిని మరింత సుసంపన్నంచేసి భావితరాలకు అందజేసే బాధ్యత నెరవేర్చాలి.

ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఈ బాధ్యతను నిర్వర్తించడంలో ప్రాచీన కావ్యాలను పదిమందికి అందుబాటుచేసే నిమిత్తం వాటిని ముద్రించే, పునర్ముద్రించే పథకం చేపట్టింది. వింద్వాంసులచేత చక్కగా అధ్యయనం చేయించి, కవి, కావ్యాలగూర్చి విపులమైన పీఠికలు రాయించి, అట్టి ముద్రణలో పొందుపరుస్తూ వచ్చింది. అదే విధంగా సంకలనాలు, ఆసక్తికరమైన అధ్యయనాలు కూడా ప్రకటిస్తూ వచ్చింది .

ఒక సాహిత్య రంగంలోనేగాక, తెలుగువారి సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పే ఇతర రంగాలలోకూడా జరుగుతూఉన్న కృషిని మరింత ముమ్మరం చేసి, ఏకీకృతంచేసి ఉదాత్త స్థాయికి కొనితెచ్చే సదుద్దేశంతో మాన్యశ్రీ నందమూరి తారక రామారావుగారి నేతృత్వంలోని రాష్ట్రప్రభుత్వం ఇటీవల తెలుగు విజ్ఞానపీఠం నెలకొల్పింది. తెలుగు సంస్కృతికి సంబంధించిన వివిధ రంగాలలో కృషిచేస్తూఉన్న భిన్న ప్రభుత్వ పోషిత సంస్థలను ప్రస్తుత రూపాలలో ఉపసంహరించి, అవి చేస్తూ వచ్చిన కృషినీ, లక్ష్యించిన ధ్యేయాలనూ విస్తృతంగా, పటిష్ఠంగా కొనసాగించవలసిన బాధ్యత తెలుగు విజ్ఞాన పీఠానికి అప్పగించారు. ఈ పరిణామ కాలంలో, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఇదివరకే ప్రారంభించిన ప్రచురణలను తెలుగు విజ్ఞానపీఠం స్వీకరించి ప్రకటిస్తున్నది. ప్రస్తుత గ్రంథం ఆ కోవలోనిదే.

“ముకుంద విలాసము” అనే ఈ ప్రబంధం పద్దెనిమిదో శతాబ్ది ఉత్తరార్ధానికి చెందిన పండితకవి కాణాదం పెద్దన సోమయాజి విరచితం. అష్ట మహిషులలో ఒకరైన భద్రాదేవితో శ్రీకృష్ణునికి వివాహం జరగడం దీనిలోని ప్రధానేతివృత్తం. తన ప్రతిభా వ్యుత్పత్తులను జోడించి ఈ ప్రబంధాన్ని రసమందరంగా బంధకవితా బంధురంగా తీర్చిదిద్దాడు పెద్దన.

హైదరాబాదు విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో రీడరుగా పనిచేస్తున్న డాక్టర్ రవ్వా శ్రీహరిగారు ఈ గ్రంథాన్ని సంపాదించి, సమగ్రమైన పీఠికను రూపొందించారు.

ఈ ప్రచురణ పాఠకుల ఆదరణకు నోచుకోగలదని మా విశ్వాసం.

తేది. 4-11-1985,

హైదరాబాదు.

తూమాటి దొణప్ప

ప్రత్యేకాధికారి

పుట:ముకుందవిలాసము.pdf/5 పుట:ముకుందవిలాసము.pdf/6 పుట:ముకుందవిలాసము.pdf/7