మాతృభాషాభివందనం

మాతృభాషాభివందనం

మార్చు

1. సూరిజనలోక సంతోష శుభ్రవేష

        మహిత శబ్దార్ధ వేత్తల మజుఘోష 
        యురుభవాంధుల పాలిట యుదయపూష 
        అర్ధబంధుర  భాష  మా యాంధ్ర భాష !

2. అఖిల భాషల దివ్యమౌ నమల భాష

        అభినవామర భాష సంయమ విశేష 
         భాషలకునెల్ల సద్భూష పాప శోష 
         అర్ధబంధుర భాష మా యాంధ్రభాష !

3. మాన్య కర్మిష్టు లకునెల్ల మాతృభాష

         ధర్మ వీరులు పల్కెడు తల్లిభాష 
         దేశభాషల లెస్సయౌ దివ్య భాష 
         అట్టి మా యాంధ్ర భాషనే నభినుతింతు !

4. కలదానిలోన బీదలకీయ దలపోయు ధర్మ సంయుక్త వదాన్యులార!

         ఒరుల కష్టములకై యోర్వ లేమిని జూపు కరుణాభిరమ్య సంకల్పు లార !
         జ్ఞానప్రదీప్తి నాజ్ఞా నాంధమును బాపి దీనాంధులను బ్రోచు దివ్యు లార !
         జన్మ భూరక్షణ కై జన్మ మర్పింపంగ వెర పేరుంగని మహా వీరు లార !
          మాన ధనులార భాషాభి మానులార 
          తప్పులెరుగని యొప్పుల కుప్పలార   
          నాగరిక మోహ మగ్న  వినాశ  పరిస 
          రాంధ జన దీప తుల్యులౌ ఆర్యులార !