శ్రీరస్తు.

అవిఘ్నమస్తు.

MESMERISM

మనోశక్తి.

ఇయ్యది

తెనాలితాలూకా మోదుకూరు వాస్తవ్యులగు

మహారాజశ్రీ మొగసాటి రఘుపతిరాజుగారి పుత్రుండును

మెస్మరిస్టును అగు

వేణుగోపాల మూర్తి రాజు వలన

రచియింపబడి ప్రకటింపబడినది.

మొదటికూర్పు 1000 కాపీలు.

గుంటూరు వాణీముద్రాక్షరశాలయందు

కే. వి. కృష్ణారావుచే

ముద్రింపబడియె.

1919.

All Rights reserved

వెల రు. 1 - 0 --0.

M. V. MOORTHI RAJU,

Mesmerist.

మొగసాటి వేణుగోపాలమూర్తిరాజు,

గ్రంథకర్త.

అవిఘ్నమస్తు.

ఉ!! శ్రీయుతసత్ప్రవర్తనముచే ననయంబును పెంపుజెందుచున్
      న్యాయమెముఖ్యమంచును ధనాఢ్యులు బీదలు నెల్ల వారలున్ !
      కాయముకష్టమంచు మదిగాంచక సంతసమందపాటులన్ !
      జేయుచు నిత్యమున్‌గడుపు చిన్ని పురంబగు మోదుకూరునన్ !!

సీ!! సకలజనులకు మొగసాటివారన్నను వసుధసంతసము నొప్పారుచుండి!
     వాసిగాంచినసుధీ వంశాబ్ధికెల్లను పూర్ణహిమాంశునిం బోలుమూతిన్!
     రాట్కవి జనియించి రాజధానులయందు పలుమారు సభల మెప్పులనుజెంది!
     శాశ్వతకీతిన్ నిస్సంశయంబుగగొన్న మహనీయునకు వెంకమాంబవలన!
     ప్రధమసుతుండయి పలువురచే లౌకికమునందు సంస్కృతాంధ్రములయందు!
     గౌరవంబునుజెంది మేర లేనట్టి దయారసంబునుజూపి యశముగాంచి !
     నట్టి రఘుపతిరాజు కర్ధాంగలక్ష్మి ! యైన పద్మాంబ గర్భమందైకసుతుఁడ !
     భవ్య నాముఁడ వేణుగోపాలమూతిన్ ! రాజటంచును ప్రజలు నెల్లరును బిలువ !!

చ!! చదివితికొంచమాంధ్రమును సంతసమొప్పగ నాంగ్లభాషయున్!
      ముదమున నేర్పనెంచినను ముఖ్యముగాగల పాఠశాలలన్!
      వదలక యోర్పుజేసి యతిబాల్యమునందునె వీడి శ్రద్ధతో!
      చదువగజేసినందులకు సాగిలిమ్రొక్కెద తల్లిదండ్రికిన్ !!

ఉ!! ఎకసుతుండనౌకతన నింతనిచెప్పగరాని ప్రేముడిన్!
      నాకడజూపినన్ చదువునష్టముగల్గునటంచు సాధ్యమౌ !
      దాకను గుప్తమందిడి ముదంబుగ నాంగ్లము నేర్చుచుండగా!
      జోకొనరించుమెస్మరిజ చోద్యములన్ పలుజేయ నేర్చితిన్!!

ఉ!! లేనటువంటివానిని బలేయని యచ్చెరువొంద నేకముల్!
      గానుపడంగ జేయుచును కష్టతరంబగునట్టి రోగముల్ !
      మానగజేయు మెస్మరిజమం దభివృద్ధినిజేయ ప్రీతితో !
      పూనికజేసితోడ్పడెను పుణ్యుడుముఖ్యుడుమిత్రులందరన్!!

ఉ!! అట్టిపరోపకారి సుగుణాఢ్యుడు మేలగుకమ్మవారిలో!
      బుట్టెను కొత్తవంశమున పూర్ణసుధాంశుడనంగ ప్రేమతో!
      బెట్టిరి సీతరామయను పేరును పండిత శ్రేష్ఠులెల్లరున్!
      పుట్టినజాలునిప్పగిది పుత్రుడె యొక్కడు తల్లిదండ్రికిన్!!

మ!! అనయంబద్భుతకార్యముల్ పలువు రత్యానందమున్ జెందగా!
      మనసొప్పారగజేసి యెల్లరను సామాన్యంబుగా మిత్రులే!
      యన నన్నెందరొ యాదరించునటు లత్యాసక్తితో నేర్చి మిం !
      చిన పేరున్గనినాడ మెస్మరికు ఫీట్చిత్రంబులన్ జూపుటన్!!

మ!! మనదేశంబున నెల్లవారలచె సన్మానంబునుం జెంది గొ
       ప్పనుగాంచెన్ మును, కాని ప్రస్తుతము రవ్వంతైన నెవ్వానికిన్!
       మనమందించుకయైన దీనియెడ సన్మానంబె లేకుండె గా!
       వున నీమెస్మరిజంబునేర్చి మరలన్ పూర్వస్థితిన్ జెందుడీ!!

తే. గీ. సకలదేశంబులందు విస్తారమైన!
         యశము నలుదిశలకు బంపినట్టి దేశ !
         మిపుడదేమొకొ యెవరికి నించుకైన !
         దెలియకుండెడి హీనమౌ స్థితిని జెందె !!

తే. గీ. మున్ను పలువురచేకీతిన్ గన్నయట్లు!
        మరలప్రతివారు దానిసంపాదనముకు!
        భక్తితోడుత నీమనోశక్తియనెడు!
        మెస్మరిజ గ్రంథమునుజూచి మేలుగనుడి !!



__________

పీఠిక


ప్రస్తుతకాలంబున మన హిందూదేశమునందు మెస్మరిజమను మహాశక్తి నానాటికి క్షీణించుచున్నది. విదేశీయుల మహోన్నతదశను గురించి చదివినప్పుడుగాని వినినప్పుడుగాని మనదేశముగూడ నట్టి గొప్పదశ నెప్పుడు పొందునాయని మిక్కిలి విచారపడవలసి వచ్చుచున్నది. ఇంతియేగాక మనదేశీయులలో నెవ్వరైన నీమెస్మరిజ మభ్యసించిన వారుండిన నితరులను నేర్చుకొనుటకై ప్రోత్సాహము చేయుటకు బదులుగా తామొక్కరే గౌరవమును బొందవలెనని యెంచి తమలో తాము దాచియుంచుకొనుచున్నారు. మరియు కొంతమంది బుద్ధిమంతులు గ్రంధములు వ్రాయ పలువురకు వానియందు నమ్మకములేని హేతువుచే దేశమందెల్లయెడల నల్లుకొనకుండగ యొకరికొక రధైర్యమును వెల్లడించుచున్నారు. తత్కారణమున ప్రతివారికిని మెస్మరిజమునందు మిక్కిలి నమ్మకమును గలుగ జేయుటకై తెలుగుభాషయందు మనోశక్తి యను యీ మెస్మరిజపు గ్రంథమును నాప్రియమిత్రులగు కొత్త సీతారామయ్య మొదలగువారలు మిక్కిలి పట్టుదలతో నాయుద్యమమునకు తోడ్పడిన కారణంబున స్వానుభవముచే రచియించి ముద్రింపించడమైనది.

ఇట్లు

యం. వి. మూర్తిరాజు,

మెస్మరిస్టు.


మనోశక్తి


ఈ భూలోకంబున మనుష్యులైపుట్టిన వారందరును పొందదగిన కార్యములలో ముఖ్యమైనది జ్ఞానము. ఏపనిజేయుటకైనను జ్ఞానమే ముఖ్యాధారమై యున్నది. ఇట్టి జ్ఞానవంతులకు లోకమునందు చేయరాని కార్యము లేదు. మనస్సును నిగ్రహించి మహానుభావులైనవారు ప్రతివారికిని గావలసిన కార్యములను సాధించియిచ్చుటకు శక్తులగుదురు. మనస్సును తనయిష్టమువచ్చినట్లు చొరనీక వశముజేసికొని పరిశుద్ధజ్ఞానమును పొందినవారు పూర్వము మనదేశమునం దనేకులు గలరు. ఇప్పటికిని యమెరికాదేశమునందు మనస్సుచే చేయదగిన యద్భుతకార్యముల నెన్నింటినోచేసి మిక్కిలివన్నె కెక్కి యున్నతదశనొంది ప్రకాశించుచున్నారు. పిల్లవానిని నిరాధారముగ గాలిలో నిలుచుండబెట్టుటయును, సమాధులం బ్రవేశించి రెండుమూడునెలలకు పిమ్మట ప్రాణముతో వెలికివచ్చుటయును, ఒకేకాలమున ననేకచోటులయందు గానుపించుటయును, యాకాశమున పెక్కద్భుతకార్యములను జూపించుటయును, తాను జెప్పున దితరులొప్పుకొనునట్లు జేయుటయును మనుజులను తదితరమృగములను నిద్రపోవునట్లు జేయుటయును, మరల నిద్రనుండి లేపుటయును, తానేచెడ్డకార్యమును జేసిన నితరులకు మంచిగానుండునట్లు జూపుటయును, చాల దూరముననున్న వా రేమిచేయుచున్నది జెప్పుటయును, తా నితరులకు వికృతాకారముగ గనుపించి భయకంపితులను జేయుటయును, తన శరీరమును మేలిమిబంగారు వన్నెవలె భ్రమింపజేయగల శక్తిని జూపించుటయును, వస్తువులయొక్క రుచులను భేదముగ జేసి చూపించుటయును, యింక మనసుచే నూహింపరాని కార్యములను జేసి జనులనందర నాశ్చర్యము గావించుటయును యీమనోశక్తియనెడు మెస్మరిజమువల్ల నే జరుగుచున్న వనుట వేరుగ జెప్ప నవసరము లేదు.

ఇట్టి మహత్తుగల్గినట్టి మనోశక్తిని పొందినయెడ దేహమును వ్యాధిబారి బడనీయకుండుటయేగాక నితరులకుగూడ సంకటములు గలుగకుండ చేయగలవాడగును. కాబట్టి అట్టి వానిని జూచిన ప్రతివారును మిక్కిలి భక్తితో గౌరవించుచుందురు. లోకమునకంతయు ప్రాణమిత్రుడై యుండును. వానియందే దేవతాస్వభావము గలదని యందరును భ్రమింతురు. పూర్వకాలంబున యోగము, తపము, మంత్రము మొదలైన వన్నియును నేర్చుకొనవలెనన్న సంసారసుఖములనువదలి వేయ వలెనని యొకవాడుకయై యున్నది. కాని ప్రస్తుతప్రపంచమున నాటినాటికి మరికొన్ని సులభ మార్గములను కనిపెట్టి యుండుటచేసన్యాసాశ్రమమునుబొందవలసినయవసరము లేనట్లగు పడుచున్నది. ఈమనోశక్తిని సంపాదించుటకు పూర్వమువలె ననేకవత్సరము లనావశ్యకము ఇట్టియభ్యాసమును జేయుటకై ప్రతిదినమును సుమారొక యరగంటకాలము చాలును. ప్రతిదినము తప్పకఒకయరగంటకాలము సాధనము (practice) చే యుచుండిన మూడులేకనాలుగుమాసములకు సిద్ధినిపొందుట నిర్వివాదాంశము. పిమ్మటయీ మనోశక్తిచే మనమనేకకార్యములనుచేయవచ్చును యిట్లు చేయుకార్యములు మిక్కిలివింతగా గనుపించును. అందునుబట్టి ఆయాభాగములకు ప్రత్యేకపేర్లను బెట్టియున్నారు. అవన్నియును మనోశక్తివల్లనే జరుగుచున్నవి. ఈమనోశక్తిని బాగుగ సంపాదించినవారికి ప్రపంచమునందేదియును సాధ్యముగాకపోదు. గణితశాస్త్రము, ఖగోళశాస్త్రము మొదలగునవికూడను మనోశక్తిచే సాధింపబడు చున్నవిగాని మరొకదానిచేతగాదు. మనశాస్త్రజ్ఞులు గ్రహణమెప్పుడుగల్లునదియును చెప్పుచుండుట లేదా? యిట్లు చెప్పిన దానికెన్నడైన భంగము కలుగుచున్న దా? లేదు. లేదు.

కంటిరా, యిదంతయును మనోశక్తివల్లనే గలుగుచున్నది. ఈమనోశక్తియనునది నీకగుపడుచున్నదా? లేని యెడల దీనిమహిమ నీకెట్లు తెలియుచున్నది? మనస్సునందుండివచ్చెడిశక్తి ప్రపంచమునం దెవ్వరి కనులకును గానుపించకేయున్నను, దానివలనజరుగుపనులు మాత్రము మన కెల్లరకున గానుపించును. ఎట్లనగా, చుండూరినుండి రాజమండ్రి కేదేని సమాచారము బంపవలసినయెడల చుండూరువద్దనున్న వాడు టెలిగ్రాఫ్‌యాఫీసులో నున్న యొక కడ్డీని వత్తుచుండును. ఆవత్తినప్పుడుగల్గు శబ్దము రాజమండ్రివద్ద వినబడుచుండును గాని మధ్యనున్న వారికెవ్వరికిని వినబడకయే బోవుచుండును. ఈతీగెలవల్ల నేమిజరుగుచున్నదియును తెలియక మనము చుండూరునుండి పంపినవార్త రాజమండ్రికిచేరుచున్నది. కంటిరా! యీవిద్యుత్ ప్రవాహము కంటికి గోచరముగాక వార్తల నెంతటి విచిత్రముగ నైదారు నిమిషములలో తీసికొనిపోవుచున్న దో! యీవిద్యుత్ ప్రవాహము తీగెద్వారా బోవుచున్నట్లెవరికైన గాన్పించుచున్నదా ? లేదు. లేదు.

అట్లే మనోశక్తి యనునదెవ్వరికిని కానుపించకపోయినను దానివలనజరుగు పనులనుమాత్రము జూడగలుగుచున్నాము. వేయేల? ప్రస్తుతకాలంబున వాయువాతన్‌లు (Wireless Telegrams) పంపుచుండుటలేదా? చెన్నపురిలోచెప్పిన సమాచారము లండనునగరములో మధ్య నేమియును గానుపించకుండగ చేరుచుండుటలేదా? యిన్నియేల, దృఢచిత్తముతో నాగుదవని యనినయెడల పోవుచున్నటువంటి పాము, చీమ, కుక్క, నక్క, మొదలయినవి యాగుచుండుట మనము పలుమారు చూచుచునే యున్నాముకదా? ఇట్లు పోవుచున్నటువంటి జంతువులనుజూచి మనస్సులో దృఢముగా యాగుదువనిన తప్పక నాగుచుండుట యెంతటి వింతయైన సంగతియైయున్నదో చదువరులే గ్రహింతురుగాక. మనోశక్తి నుపయోగించినప్పుప మనకును పామునకును మధ్యనేమియును గానుపించుట లేదుగదా? కంటిరా మనోశక్తియనున దెవ్వరికిని గానుపించకయే మనవద్దనుండిపోయి పాము నాపగలుగు చున్నది! ఇట్లే వాయు వార్తలు (Wireless Telegrams) గూడను మధ్య నెవ్వరికిని గానుపించకే చేరవలసిన స్థలమునుజేరి తనశక్తిని యొకవిధముగా జూప గలుగుచున్నది. బాగుగ మెస్మరిజమును నేర్చినవాడు తనమనోశక్తి వలన మిరపకాయను తీపిగా చేయుచుండుట మనమెల్లరమును చూచుచునే యున్నాముగదా! ఇది యంతయును చిత్తశక్తి (will Force) వల్లనే జరుగుచున్నది. సాధారణముగ నుత్సవ సమయములయందు మనలోని కొందరగ్నియందు దూకు చుండగ చూచుచున్నాము గదా! అట్లు నిప్పులోనికి దూకు మనుజునకు కాళ్ళుకాలకుండునా యని ప్రశ్నించిన, కాలకుండనే యున్నవని చెప్పుటకు సందియ మించుకయు లేదు. ఎందువల్ల ననిన నిప్పులోనికి దూకు సమయమునందు కాళ్ళు కాలవని దృఢచిత్తముతో దూకుచున్నాడు. గాన వాడిచ్చట మనోశక్తి నుపయోగించినాడు. తత్కారణమున వానికి నిప్పులవలస బాధ కొంచమైనను గలిగియుండ లేదు.

పూర్వము వాల్మీకులవారు తపస్సు చేయుచుండగా నాతనిమీద పుట్టలు, చెట్లు మొదలయినవి పుట్టినను యాతని కించుకయు దెలియకుండెను. యా మహాత్ముని మనశ్శక్తి నంతయును శ్రీమన్నారాయణుని యందుంచిన సమయమున చెదలు, చీమలు మొదలయినవి. కుట్టుచున్నను కొంచెమైన నొప్పిని బొందియుండలేదు. సాధారణముగా మనలో కొంత మందేదియో యొక విషయమును గురించి తమ మనోశక్తితో నాలోచించు చుండుట తటస్థించిన సమయమున నెవ్వరైన నట్టిసమయమున పిలిచినచో నైదారు కేకలవరకును పలుక కుండుట పలుమారు చూచియే యున్నాముగదా! వినుటకు చెపులున్నను మనస్సు వేరుగా పనిజేయుచున్న కారణమున వాడైదారు కేకలవరకును పలుకకుండుట తటస్థించినది. పూర్వము మన ఋషులలో శపించిరన్న యేమనియర్ధమో గనుగొంటిరా! మనోశక్తిచే నేదియో యొకవిధంబుగ దూషించుట యని యర్థము. అట్లు మనోశక్తిచే నేమాటయన్నను తప్పక జరిగినట్లు పురాణములయంద నేకము లగుపడు చున్నవి. కావున మనోశక్తి కన్న రెండవది యెక్కువలేదని పలువిధముల ప్రతిమానవునకును తెలియవచ్చు చున్నది. శకుంతల దుష్యంతుని వివాహము జేసికొన్న సంగతినంతయును కణ్వమహర్షి తన మనోశక్తివలన గ్రహించియుండ లేదా!

ఒకనిని యొకపాము గరచెననుకొనుడు. అప్పుడీ మనోశక్తిని సంపాదించినవాడుండుట తటస్థించిన యెడల పాముకాటుచే కరువబడినవానిని సులభముగా బ్రతికింప గలవాడగును. ఎట్లన, “పామువిషము నీదేహమునందు బ్రవేశించినను నిన్నేమియుచేయ జాలదు". అని నీలో నీవాకరచిన చోటును జూచుచు గట్టిగా చనిపోవడను నమ్మకముతో నుండుము. కొంతసేపటి కాపాముచే కరువబడినవాడు లేచి యెప్పటివాని వలెనే యుండును. చూచితిరా మనోశ క్తివలన పాము విషముగూడ నేమియు చేయలేకయున్నది. కాబట్టి మిక్కిలి పట్టుదలతో నేదియైన నమ్మిచేసినచో నది కొనసాగునని నేను దృఢముగా చెప్పగలను. నెపోలియన్ అను మహాశయుడు మనోశ క్తి యనెడి యీమెస్మరిజమును బాగుగగుర్తెఱిగి యుండినకారణంబుస పెక్కద్భుత కార్యములను జేసినట్లు తెలియ వచ్చుచున్నది. పర్సనల్ మాగ్నెటిజమనియును, హిప్నాటిజమనియును, టెలిపతియనియును మొదలగునవనేక విధములపేర్లను బెట్టియున్నారుగాని యివన్నియును విచారింప నొకటిగనే గానుపించుచున్నవి. యీమనోశక్తివల్ల నితరులను లోబరుచుకొని మన కేది గావలయునో యది చేయించుకొనగలవార మగుదుము. అట్లు వాడు పనిజేయునప్పుడు తనంతటతాను జేయుచున్నాననుకొనునుగాని మనకు స్వాధీనమై మన మనోశక్తికి లొంగి చేయుచున్నానని యొకనాడును తలంచడు. యీపర్సనల్ మాగ్నెటిజము తెలిసియున్నచో యెవ్వడును మనలను స్వాధీనము చేసికొనలేడని యనుకొన్నను యట్టివాడు మనసమీపమునకు వచ్చినతోడనే వశ్యులగుదుము.

ఇట్టి మహత్తుగలిగిన మనోశక్తియొక్క రహస్యమును గ్రహించినవానికి ప్రపంచమునందేదియును కష్టముగానుండదు. యిట్టి మహత్తు గల్గిన మనోశక్తి వలన మిక్కిలివిచిత్రములయిన పనులను పెక్కింటినిజేసి జనులనెల్లరను సంతోషానంద భరితులనుగా చేయగలము. ప్రపంచమునందు నిత్యమును సంతోషముగ కాలము గడుపువానికన్న మిక్కిలి గొప్పవారొండొరులెవ్వరు? నిక్కముగ భూలోకమునందట్టి మహాశయున కదియొక స్వర్గభోగముగాక మరెయ్యది?

రూపాయిని నడిపించుట.

మనకు వెనుకభాగమున నెవ్వరిని లేకుండునట్లు నియమించి మనకనులకు సుమారిరువది యంగుళములకు లోపుగ నొకరూపాయిని భూమిమీదగాని లేక నేదైన నొక చదునైన పుస్తకముమీదగాని పెట్టి కొంతసేపు రూపాయిని నీకనులలో చూచుచు పిమ్మట దృఢ చిత్తముతో కదలిరమ్మని మనసు నందనుకొనుచున్న యొక నిమిషకాలమునకు కదలివచ్చుచుండును. కంటిరా మన మనోశ క్తివలన రూపాయి చరచర కాళ్ళుగలదానివలె మిక్కిలి వేగముగ వచ్చుచుండును. నీకును రూపాయికిని మధ్య సుమారిరువది యంగుళముల దూరమున్నప్పటికిని మధ్య నేయాధారములేక యే పరుగెత్తుకొని వచ్చు టెంతటి యాశ్చర్యకరమైన విషయము.

ఇటువంటి శక్తిని సంపాదించుటకుగాను నీవు ప్రతిదినమును తెల్లవారుజామున సుమారు నాలుగున్నరగంటల కాలమున లేచి నిత్యకృత్యములను తీర్చుకొని వీలుగానుండిన ప్రవాహజలము నందుజలకమాడి సుమారయిదున్నరగంటలు లేక ఆరుగంటల సమయమునందు కృష్ణాజినముపై నుత్తరముఖముగ గూరుచుండి యిష్టదేవతా ప్రార్థనంబొనరించి పిమ్మట నీ కెదురుగా సుమారొక యడుగుదూరమున నొక యద్దమును నీచేతులతో పట్టి యుంచి యదివరకు నీకనుబొమలమధ్య నుంచుకొనిన చాదుబొట్టును యద్దమునందు ప్రతిఫలించుదానిలో బాగుగ చూచుచుండుము. అట్లు చూచునప్పుడు నీనల్లగ్రుడ్లు రెండును నీకనురెప్పలకు మధ్యనుంచునట్లు చూచుచుండవలెను. అట్లుంచినగాని నీవీదృష్టిని సంపాదించినవాడవు కావు. తత్కారణమున చూపువిషయమై తగు జాగ్రత్తను ప్రతిదిన మును తీసికొనుచుండనియెడల త్వరలో నీమనోశక్తిని సంపా దించుటకు సాధ్యపడదు. ఇట్లు సుమారిరువది లేక ముప్పది దినములు తప్పకుండగ సాధనము (practice) చేసినయెడ దృష్టిచూచుట కలవాటుపడగలవు. అలవాటు గలిగిన తోడనే నీమనోశక్తిని చాల సులభముగ నుపయోగించగలవాడ వగుదువు. కాన చిత్రంబుల నెన్నియో ప్రచురించి పలువురను నీ స్నేహితులనుగా మార్చుకొనగలవు.

ఇటువంటి శక్తిగలిగిన మనోశక్తిని యభ్యసించిన పిమ్మట, నీవునునీస్నేహితులును యొకదారిని నడచిపోవుచున్నారను కొనుడు. అప్పుడొక త్రాచుపాము గనుపడినదనుకొనుడు. స్నేహితులందరును పామునుజూచి భయమందుచున్నప్పుడు నీకీ మనోశక్తి లేకుండిన నీవుకూడ వారికన్న నెక్కువ భయమును జెంది పారిపోవుటకుగూడ ప్రయత్నము జేయుచుందువు. కాని నీకీమనోశక్తి గలిగియుండినకారణంబున భయమును జెందవలసిన యవసరము లేకపోవుటయేగాక నీస్నేహితులకు సహితము సంతోషమును గలుగజేయుదువు.

ఎట్లన, నీకు పాముకనుపించినతోడనే దానికి రెండుమూడుగజముల దూరమునకు బొమ్ము. అప్పుడా త్రాచుపాము నిన్నుజూచి పడగవిప్పి యాడుచుండును. అంత పామిట్లాడుచుండగ నీకనులను బాగుగ తెరచి అనగా నీనల్లగ్రుడ్లు కనురెప్పలకు మధ్య నిల్ఫి పాముయొక్క పడగమీద చూచుచు దృఢమనంబున “నీకు నడచుటకు శక్తిలేదు. పండుకొనుము". అని పలుకుము. అంత నీతో"నున్న స్నేహితులందరచ్చెరువంద నాపాము పడగవిప్పి బుసలుగొట్టుచు నొక్క పెట్టున నాడుచుండుటకు బదులు మెల్లగా పడగను మూసికొని భూమిపై బుసలుగొట్టుట మానివేసి పండుకొనును. ఇదిచూచుట కెల్లరకును వింతగనుండి నీయందేదో మహిమయున్నదని భ్రమించి ప్రతివారును నీకు స్నేహితులగుదురు ప్రపంచమున మనుజునకు గౌరవమునకన్న నెక్కువ ప్రీతికరమైనది రెండవది లేదని యెల్లరకును తెల్లంబేగదా! స్నేహితులకన్న నెక్కువగా మనకు తోడగువా రితరులు లేరనియును, మనమీ మనోశక్తిని సంపాదించిన ప్రాణస్నేహితులను పలువురను సంపాదింపగలమనియును, అట్టి ప్రాణస్నేహితు లుండుటంబట్టి మనకీప్రపంచమున నేయిక్కట్టులు గలుగవనియును ప్రతివారికిని విశదమేయైయున్నది. స్నేహితుడనగా సుఖముగానున్నప్పుడు మనయొద్దనుండి కష్టములు సంప్రాప్తించునప్పుడు మనచెంతకు రాకుండువాడుమాత్రము గాడు. కష్టసుఖములకు తోడగువాడే స్నేహితుడనబడును. విశేషంబుగ స్నేహితులతో కాలముగడుపుట సంభవించినవానిభాగ్య మేమని చెప్పవచ్చునో చదవరులే గ్రహింతురుగాక. నిత్యమును మంచిస్నేహితులతో కాలము గడపువానికి మనసునం దేకళంకమును లేక యుండును. తత్కారణమున వాడు శుక్లపక్షపు చంద్రుని మాడ్కి దినదినాభివృద్ధియై యంగబలమునందును, బుద్ధిబలము నందునుగూడ పెపొంది ప్రతివారికిని చూచుట కెల్లప్పుడును సంతోషస్వాంతుడై యుండున ట్లగుపడుటచే వానిని చూచువారు సయితము సంతోషముగా నుందురనుట వేరుగ చెప్ప వలయునా! వేయేల, మీగ్రామమునం దెప్పుడైన యొకడు చనిపోయినయెడల వాని బంధువులందరునుజేరి ఘొల్లుమని యేడ్చుచుండగ సామాన్యముగా దారినబోవు ప్రతివారికిని దుఃఖమువచ్చుచుండుట మనము పలుమారు చూచుచునే యున్నాముగద ? కారణంబేమన, యెట్టివారివద్దనుండిన మనకు గూడ నట్టి లక్షణంబులే యలవడుననుట లోకవిదితమై యున్నది. “ఆరునెలలుసహవాసముచేసిన వారు వీరగుదు”రను లోకవాడుక ప్రతిపిల్లవానికిని కూడ తెలిసియేయున్నది. తత్కారణమున సాధ్యమైనంతవరకు మనము సత్సహవాసము మాత్రము చేయుచు దుస్సహవాసమును విసర్జించు చుండవలెను. అట్లు సత్సహవాసమును జేయుచుండిన మనకుగూడ సద్గుణములే యలవడును. గాన మనమెల్లరచే గౌరవింపబడుదుము. ఆహా ! సత్సహవాసమన నెంతటి విలువగలది ! దీనికి మించినది వేరొండులేదని ప్రతివారికిని గోచరమగుచున్నది. ఇదంతయును మనోశక్తివల్లనే కలుగుచున్నది.

నీవు మీయింటికి సమీపముననున్న యొక చిన్నిమొక్కను జూచి ప్రతిదినమా చెట్టువద్ద కొంటరిగావెళ్ళి దానికెదురుగా సుమారైదారు నిమిషముల వరకు చూచుచు నీమనసుసందు రెండవతలంపు లేకుండగ నీక్రింది విధమున తలంచు చుండుము. “నీకు పెరుగుటకు శక్తి లేదు, భూమినుండిగాని గాలినుండిగాని నీవాహారమును తీసికొనలేవు”. ఇట్లు మూడు నాలుగు దినములు నీమనోశక్తిని మొక్కపై యుపయోగించిన చూచినవారంద రాశ్చర్యముజెంద చెట్టండియుండును. ఆహా ! యేమియాశ్చర్యము ! నీవాచెట్టును ముట్టుకొనకుండగనే చంపగలుగుచున్నా వే. నీ మనోశక్తియొక్క మహిమ యింతనివణిన్ంప నెవ్వరితరము! మరియు బంగారునకు సువాసనయబ్బిన నెట్లుండునో యట్టిమాదిరీమనోశక్తికి జ్యోతి (Light)యనుకాంతిగూడ సహాయపడినయట్లుండును. యీ జ్యోతినిజూచుటకై కొంతవరకుదుర్లభమేయని చెప్పవలసివచ్చినందుదులకు కొంచెము మనస్సంకటముగ నున్నది. అయినను మిక్కిలిపట్టుదలతో సాధనము (Practice) చేసినచో సిద్ధిని పొందుట నిశ్చయమేగాని దీనిని పొందుటకు కొంతయదృష్టముకూడ నుండవలెనని కొంతమంది నాతో చెప్పుచూవచ్చిరి కాని నాయభిప్రాయమందులకు భిన్నముగానున్నది. చదువరులారా! మీకుగూడ నాకుగలిగిన యభిప్రాయమే గలిగినయెడల త్వరలో జ్యోతిని జూడగలుగుదురని నేను మిక్కిలి గట్టిగానొక్కి వక్కాణింపగలను. నీవీజ్యోతిని చూడగలిగినతోడనే యింకను మిక్కిలి విచిత్రములైన పనులెన్నియో జేయగలవాడవగుదువు.

దారినిబోవువారిని పిలువకుండగ రప్పించుట.

నీవు నీస్నేహితులతోగూడి యొక యరుగుమీద కూర్చుండిన సమయమున నొక బాటసారి ప్రక్క నున్న బజారున బోవుచుండగా జూచితివనుకొనుము. పిమ్మట నీస్నేహితులను జూచి యిదిగో చూడుడు యాబాటసారి పిలువకుండనే యిచ్చటకు రప్పించెదనని చెప్పి యాతని ముచ్చిలిగుంట మీద జూచుచున్న కొంతతడవునకు నీకొక జ్యోతి (కాంతి) కనుపించును. బాటసారియొక్క ముఖము గనుపించుచుండిన కనుబొమలమధ్య జూచుచుండిన పైన జెప్పబడిన జ్యోతికనుపించును. అప్పుడు నీమనోశక్తిప్రతాప మాతనిపై నుపయోగించుము. "రమ్ము, నీవుమా ద్దకురమ్ము” అని నీమనసునందనుకొనిన వెంటనే యాబాటసారి మీయందరివద్దకు వచ్చుట జూచి ప్రతివారును మిక్కిలి వింతనొందెదరు. కంటిరా మీ మనసున కెట్టిశక్తి గలిగియున్నదో! నీకు మనోశ క్తి బాగుగ పట్టుపడిన తోడనే నీస్నేహితులయెదుట కొన్నివింత (Wonderful) యగు కార్యములనుజేసి వారిని పలుమారు సంతోషపెట్టగలపు. నేనింకను కొన్ని మిక్కిలియాశ్చర్యములగు వింతపనుల నెట్లుచేయునదియును వ్రాయ నెంచితినిగాని, గ్రంథవిస్తరభీతిచేతను, మరియు కొంతమంది మిత్రులుకూడ నదియే భీతినిజూపిన కారణంబునను కొన్ని స్వల్పపనుల నుదహరించ కుండగమానితిని. అయిన నట్లు మానివేసినపనులను యీగ్రంథమునం నుదహరించినవానినిబట్టి చదువరులే లోపించినవానిని జేసికొందురని మానివేయుట సంభవమాయె. మరియు నీశక్తి వలన మరికొన్ని క్రొత్తవింత లెట్లు చేయునదియును బుద్ధికుశలతచే గనిపెట్టి యెల్లరకును తెల్లంబగునట్లు మెల్లన నీమెస్మరిజపు గ్రంథంబుల నుల్లంబులు రంజిల్లగ వెల్లడింపజేయుటకై కొల్లగ గ్రంథంబులనెల్ల యెడల శీఘ్రముగా నల్లుకొనగ జేయుచు మీవల్లనె యీలోకంబున కొల్లగొన్న ధాన్యమువలె ప్రజలెల్లరు నీశక్తినిసంపాదింప ప్రోత్సాహముజేయ బడుదురని నామనంబున గొప్పయాశయొకటి పొడముచున్నది. నేనిదివరకుదహరించినపనులను జేయగలవానికి మనోశక్తి కొంతయలవడినదని చెప్పవచ్చును.

ఈతచువ్వలను కలసికొనునట్లుచేయుట.

మనదేశంబున విస్తారముగ నెల్లయెడల నెదుగుచుండెడి యీతచెట్టునుండి రెండుపొడుగుపాటి చువ్వలనుతెచ్చి ఇద్దరు మనుజులను సమానయెత్తుగలవారిని యెదురెదురుగానిలుచుండబెట్టి యీతచువ్వల చివరభాగములను వారిద్దరి చేతులతో (చూపుడువ్రేలితోను బొటనవ్రేలితోను) పట్టుకొనునట్లుజేసి నడుముల కానించునట్లు జేయుము. ఇట్లుజేయునప్పుడు సుమారా యీతచువ్వలకు మధ్య నారేడంగుళములుండును. తరువాత నీదృష్టి నుపయోగించి యీతచువ్వలవంక జూచుచు "ఓ యీతచువ్వలార! మీరొండొంటితో త్వరగాకలిసికొనుడు. అట్లు కలిసికొనుటకై మీకొక విధమయిన శక్తినిచ్చుచున్నాను”, అని నీమనోశక్తినుపయోగించుము. ఇట్లనుకొనుచున్న నిమిష కాలములో యీతచువ్వలు మెల్ల మెల్లగా ప్రాణముగలవానివలె దగ్గిరకువంగి మధ్య ప్రదేశమున నొకదాని కొకటిదాకును ఆహా యెంతటి విపరీతము! యెవరినైన మెస్మరిజమునందు ప్రవేశపెట్టదలచినయెడల నీవిట్టి సులభమగు కార్యములను చేసిచూపించి నేర్చుకొనుటకైవారిని ప్రోత్సాహము చేయుచుండుము.

నిమ్మకాయలను పోట్లాడునట్లు జేయుట.

రెండునిమ్మపండ్లను తెచ్చి వాటిని మెత్తగా నలిపియుంచి యొకదానికొకటి సుమారైదంగుళముల దూరమునబెట్టి నీవు తూర్పుముఖముగా కాయలకు పదునైదంగుళముల దూరమున కూర్చుండి “ఓనిమ్మకాయలార! మీరిద్దరును గొఱ్ఱెపొట్టేళ్లవలె కొంచముసేపు పోట్లాడిన నిచ్చటనుండువాఱందరును మీయద్భుతకార్యంబునుజూడ కుతూహలపడుచున్నారు గాన త్వరగా పోట్లాడుడు” అని నీదృష్టి నుపయోగించుచు మనోదృఢముతో నీలోనీవనుకొనుము. యిట్లు సుమారు రెండునిమిషము లనుకొనిన వెంటనే చూచువారందరాశ్చర్య మొంద నిజమయిన గొఱ్ఱెపొట్టేళ్ళవలె నిమ్మకాయలు రెండును బహుపౌరుషముగ నీమనోశక్తి నుపయోగించినంత కాలము పోట్లాడుచునేయుండును. కంటిరామనోశక్తివలన నెంతటి యాశ్చర్యములగుకార్యములను జేయవచ్చునో? యిట్టి సులభ పనులను పెక్కింటిని యవలీలగ జేయవచ్చును. గాన మనోశక్తిని సంపాదించుటకయి ప్రతిదినమును సర్వేశ్వరుని ప్రార్థింపరాదా! అట్లు ప్రార్థించినచో నీకట్టిశక్తి నీయకుండుట కంత నిర్దయుడా ! కాదు, కాదు. కరుణారసపూరితుడై యెల్లరకును మిక్కిలి తోడగుచుండును. గనుక మనోశక్తి గావలయునన్న సకలలోకాధీశ్వరుడగు యీశ్వరుని నీహృదయకమలమునందు ధ్యానించుచు మనోశక్తినిపొందుటకు తగిన సదుపాయములతో నభ్యాసము (Practice) ను దిట్టంబుగజేయుచుండిన పట్టుబడకయుండుట వట్టిదియా! యిట్టి మనోశక్తిని నాకుమిత్రులయినవారలలో చాలమంది కొంచెము కొంచెముగా గలిగియుండిరి. నేనొకనాటిసమయమున మాగ్రామమగు మోదుకూరుపురమున కాగ్నేయభాగమునందున్న నీరారెడ్డి చెఱువు వద్దకు నాప్రాణమిత్రుడైన సంగముజాగలన్‌మూడి పురవాసి మ!రా!రా!శ్రీ. కొత్త సీతారామయ్యగారితో సాయంతనమున షికారుకుబోవుచుండగ చెఱువునకు సామీప్యమునకోతి యొకటియున్నదనియును దానిమెడయందొకగొలుసుకొక్కె.ముండుటచే యాకోతియెచ్చటనుండియో సర్కసునుండితప్పించుకొనివచ్చినదనియును దారినిబోవువారినెల్లరను కఱచి గుడ్డలను చింపివేసి పలుబాధల పెట్టుచున్నదనియును పాంధులుకొంత మంది మర్కటముచే ప్రాయశ్చిత్తమును జేయించుకున్న వారు సైతము మమ్ములనిద్దర నాదారిని బోవలదని మిక్కిలిబలవంతమును జేసియుండిరి గాని నేను మాత్ర మట్లువెళ్ళుటకు సంశయించి యుండలేదు. నా మిత్రునకు నేనీ మనోశక్తిని జంతువులమీదగూడ జూపగలనని తెలియకున్నందున కోతివలన నాకించుకయు హానిరాకుండ గాపాడవలెనని తుండుగుడ్డను తనచేతికి చుట్టుకొని కోతిని పట్టుకొనుటకు సిద్ధపడుచుండెనుగాని, మిత్రమా నీవు నాకొరకిట్లు సాహసింపవలసిన యవసరములేదని చెప్పుచుండగ నామర్కటము మమ్ముల నిద్దరను సమీపించి కఱచుటకు బహు తొందరపడు చుండెను. నామిత్రుడు మిక్కిలి ధైర్యవంతుడును స్నేహితుల యెడ ప్రాణమునైన యిచ్చివేయునటు వంటివాడును యగుటచే పరుగెత్తుకొనివచ్చు కోతిని పట్టుకొని కట్టివేయుటకు సిద్ధపడుచుండగ “గరిటెయుండగ చేయిగాల్చికొన " నెట్టివాడైన యొప్పు కొనునా? కాబట్టి నాకీమనోశక్తి గలిగియుండిన కారణంబున నాస్నేహితునకట్టి శ్రమనియ్యదలంచక నామనోశక్తిని విడిపించితిని. నాతోనున్న నామిత్రుడు మిక్కిలి యాశ్చర్యమును బొందునట్లుగా కోతి మామీదబడి మమ్ములను కష్టపెట్టుటకు బదులుగా నామనోశక్తివలన పిల్లివలె యేమియు జేయలేక మాయిద్దరను శరణుగోరవచ్చినదానివలె చిందులు, గంతులు, పండ్లుజూపి భయపెట్టుట, మొదలైన వానిని మాని మాపాదములయొద్దకువచ్చి గూరుచుండెను. నాప్రియమిత్రుడగు సీతారామయ్యగారికి వినోదములందు ప్రీతిగనుకను, నామనోశక్తి యొక్క మహిమను తెలియజూపినందునను నేనింకను కొంతసేపు నామనోశక్తి నుపయోగించియుంటిని. పిమ్మట మాకు సామీప్యముననున్న కందేపాటిదిబ్బను నామిత్రుడు చూడనెంచిన మేమిద్దర మచ్చటకుబోవుచుండగ పెంపుడుకుక్కవచ్చు నట్లుగ యకోతి మావెంబడి రాసాగెను. అంత నాప్రియమిత్రుడు భూతదయగలవాడగుటచే, మిత్రమా, యింక నీకోతిని వెళ్ళునట్లు జేయుడని నన్ను కోరగా మరల నామనోశక్తిని దానిపై యుపయోగించి వెళ్ళునట్లుచేసి నా మిత్రుని సంతోషానందభరితునిం గావించియుంటిని. తదనంతర మాకోతి వెళ్ళు చుండగమార్గమధ్యమునందొక బ్రాహ్మణుడు ఎదురుపడుట తటస్థించెను. ఇదివరకువలె కోతి పొంధులను గష్టపెట్టుటకు మరల మొదలిడునప్పటికి కాలవశమున బ్రాహ్మణు డెదురుపడిన కారణమున కోతి యావిప్రుని సమీపించి కుచుటకు నోరు దెఱచి మీదదుముకుటకు సిద్ధముగనుండు సమయమున పాప మాయన గుండెలుఝల్లుమని భయంకరముగ నొక వెఱ్ఱికేకను బిగ్గరగా వైచెను. నేనును సీతారామయ్యగారును దగ్గరనేయుండిన కారణమున మాకిద్దరకును వినబడి వెనుకకు తిరిగి చూచితిమి. అంత నామిత్రుడు బ్రాహ్మణునిజూచి జాలిగొన్నవాడై యాయనను కోతిబారినుండి తప్పింపుడని నన్ను కోరగా మరల నామిత్రుని యభీష్టము చొప్పుననే మనోశక్తిని యుపయోగించి బ్రాహ్మణునిబాధ శీఘ్రకాలములో తొలగించి యుంటిని.

కంటిరా! మన మనోశక్తివల్ల నెంతటి మహోపకార మొనర్చుచున్నామో ! అట్టి సమయమున నీమనోశక్తియనునది లేకుండిన మాగతి యేమిగావలయునో; బాటసారియగు బ్రాహ్మణునిగతి యేమిగావలయునో; చదువరులే గ్రహింతురు గాక. .

ఇదియునుగాక మరియొకపర్యాయము నా మిత్రులగు మ! రా! శ్రీ! కొత్తసీతారామయ్యగారును, జంపాల నారాయణమూతిన్‌గారును, దేవభక్తుని రామయ్యగారును నాతో తెనాలిపురమున యొకనాటిరాత్రి యొంటిగంట సమయమున యొక మిత్రుని గదికి బోవుచుండగ మార్గమధ్యము నందు పది పండ్రెడు కుక్కలు నలువైపులనుజేరి పెద్దగందరగోళమునుజేయ మొదలిడినప్పుడు నామిత్రులు నన్నుజూచి మిత్రమా యీకుక్కల నన్నిటిని యఱవకుండునట్లు జేయుడని నన్ను కోరిరి. నేనుగూడ నందులకంగీకరించి నామిత్రుల కాశ్చర్యమును గలుగజేయనెంచి కుక్కల నఱవకుండగజేసి వానినన్ని టిని నావద్దకు రప్పించియుంటిని. వేయేల, మనోశక్తిని సంపాదించిన వానికి ప్రతివారును స్నేహితులగుదురనుట వేరుగ జెప్పవలెనా? మరియు రెండు సంవత్సరములక్రిందట ననగా నే నీమనోశక్తిని సంపాదించుటకు మొదలిడినప్పుడు తాడేపల్లిగూడెమునకు రాత్రి రెండుగంటలప్పుడు కటికిచీకటిలో పడవదిగి రైల్వేస్టేషనువద్దకు రావలసివచ్చెను. అప్పుడాకాశమంతయును మేఘములచే నావరింపబడి సన్నగా వర్షముగురియుట కారంభించెను. అట్టిసమయమున పడవనుదిగినపిమ్మట నా కెవ్వరును తోడులేకుండుటగూడ తటస్థించెను. నేను పదునైదు వత్సరముల బాలుడనగుటచే నట్టిసమయమున రైల్వేస్టేషనునకు యొంటరిగా వచ్చుటకు భయముజెంది పోవుటకెంత మాత్రమును సాహసింపనెతి. కాని యప్పుడు తాడేపల్లిగూడెము రైల్వేస్టేషనుసకు తెనాలిబోవునట్టి రైలుబండి యొకటి రాత్రి మూడుగంటలకాలమున వచ్చుచుండుటచే యొంటరిగానైనను బోవనుద్యుక్తుడ నైతిని. అక్క టా, మరియొకబాలుడైనచో నట్టిసమయమున జరిగినవిపత్తునకు గుండెబ్రద్దలై ప్రాణంబులను గోల్పోవకయుండుట తటస్థించునా ! అహో, ఆజరిగినవిషయమును మరల జ్ఞప్తికి తెచ్చుకున్నప్పుడు గుండెలు ఝల్లుమనుచున్నవి. మాటలు తడబడుచున్నవి. కళాహీనము గలుగుచున్నది. చేతులు కాళ్ళు గజగజ వణకుచున్నవి. అదిద్దియో వింటిరా? బయలుదేరినపిమ్మట నైదారంగలు వేసినతోడనే యాకాశమంతయు నల్లనిమేఘములచే గప్పబడి నందున నేను నడచుచున్న ది రోడ్డుగనే యున్నప్పటికిని రోడ్డు న కిరుప్రక్కల వటవృక్షములు గలిగియుండుటచే కన్ను లెంత దెరచినను నాకించుకయు గానుపించ కుండెను. కాని దైవానుగ్రహమువలన మధ్యమధ్య మెఱపులు మెఱయుచుండుటచే మెఱసినపుడెల్ల బాటనుజూచుచు రెండేసి యంగలిడుచుంటిని. ఇట్లు పది యంగలిడునప్పటికి నాకేదియో యొకశబ్ద మేడ్చినట్లుగ వినబడెను. బెదరినవానికి గుదిరినవన్నియు పిశాచములేయన్నట్లు యీశబ్దమును నేనిదివరకెన్నడును వినియుండని కారణంబునను, యేదోయొక భయంకరముగ వినుపించిన కారణంబునను, మార్గమునందు బాలుడనగు నేనొంటరిగ ప్రయాణముచేయుచుండిన కారణంబునను, గాఢాంధకారముగ నుండి వషన్ ముగూడ కురియుచుండిన కారణంబునను, పిడుగుబడినవానిమాడ్కి కదలక మెదలక నిశ్చేష్టుడనై కొంచెముసేపచ్చట నిలిచియుంటిని. కాని బండివెళ్ళునను తొందరచే రైల్వేస్టేషనునకు బోవలసినవాడనైతిని. అదేమియోగాని బయలు దేరునప్పటికి రోడ్డు రెండువైపులకును, చీలియుండెను. కాని పగలెప్పుడును నేనీదారిని బాగుగ గుతిన్ంచియుండని కారణమునను, రోడ్డు చీలక యొకటిగనేయున్నట్లు మనస్సునకుతో చినందునను మిక్కిలి యాశ్చర్యమును బొంది యెటుబోవుటకును దోచక కొంతతడ వచ్చటనే కాలము వృధా బుచ్చితిని. “వరదను గొట్టుకొని పోవువానికి తెప్ప యొకటిదొరకి”నట్లు నాకట్టికాలమున నేను సాధనముజేయుచున్న మనోశక్తి జ్ఞప్తికివచ్చెను. సర్వేశ్వరునికృపచే నామనోశక్తి నట్టిసమయమున నుపయోగించిన కొంత తడవు నకు రైలురోడ్డుమీదికెట్టులో జేరియుంటిని. అచటనుండి రైల్వేస్టేషను జేరులోపల నొకవంతెన దాటవలసి యుండెను. సుమారావంతెన యేడెనిమిది గజముల వెడల్పుండుటచే దూకుట దులన్‌భమని యిప్పుడు తెలియుచున్నది. నేనావంతెనవద్దకువచ్చి చూచునప్పటికెంత వెడల్పుండినదియును గనుపించకుండెనుగాని మెఱపుకాంతిచే యొకసారిమాత్రము హటాత్తుగ మూడునాలుగు గజములున్నట్లు గనుపించెను. పిమ్మట వంతెనవడ్డున నిలుచుండి సర్వేశ్వరునిపై భారముంచి మనోశక్తి నుపయోగించి యొక్కగంతువైచితిని. కంటిరా! వంతెన యెంత వెడల్పుండినను యొక్కగంతుతో నావలకి జేరవలయునని మనోశక్తి నుపయోగించిన కారణమున యవలీలగనంతటి యత్భుతకార్యమును గావించియుంటిని. కావున మనసునం దేదియైన దృఢముగాదలంచిన నదితప్పకజరుగునని ప్రతివారును తలంచవలసియున్నది.

చదువరులారా! మీరుగూడ నీమనోశక్తిని సంపాదించి లో'కిములో పెక్కుఘన కార్యములొనర్తురని మిక్కిలి నమ్మి యున్నాను. మీరుప్రతిదినమును రెండునిమిషములకాలము మనోశ క్తిని సంపాదింప వ్యయపెట్టలేరా! ఈ రెండునిమిషముల కాలమును ప్రతివారును వృధాబుచ్చుచుండుట లేద? యిట్లు వృధాబుచ్చుటకన్న నీమనోశ క్తిని సంపాదించుటకు ప్రయత్నింపరాదా! గ్రామమున కొక్కరైననుండిన మనదేశమంతటి మహోన్నతదశ నొందియుండును. గాన సోదరులారా యికనైన మీరెల్లరు నీశక్తిని సంపాదించు విషయములో పాటుపడవలసి యున్నది.

ఆంగ్లభాషాసేవకై (1918-19) తెనాలిపురమున నుండుట తటస్థించినప్పుడు నేను నివసించుగదివద్ద స్కూలునందున్న సమయములందు దక్క తదితర సమయములయందు సుమారిరువదిమందికి తక్కువ విద్యార్థులుండెడివారు కారు. వారెల్లప్పుడేదో యొక వింతయగుపనిని జేసి చూపించుడని కోరుచుండెడివారు. ప్రపంచమున స్నేహితులకన్న నెక్కువగా తోడగువారితరులు లేనికారణంబున వారికెన్నడు నెగ్గొనరించి యుండలేదు. ఇట్లు ముఖ్యులగు స్నేహితులలో మ!!రా!! శ్రీ!! కొత్త సీతారామయ్యగారును, జంపాల నారాయణమూతిన్ గారును నాకు విశేషముగ పరిచయము గలిగి యుండిన కారణంబునను నాయందు మిక్కిలి స్నేహభావము గలవారైనందునను మెస్మరిజ మనేక పర్యాయములు జేయుమనికోరిన నాకది శ్రమగా నుండుననుతలంపుతో నన్నెన్నడును విశేషించి వింతకార్యములను జూపుడని కోరుచుండెడివారుకారు. .అయినను వారి స్వభావముసకు నేనమిత సంతోషస్వాంతుడనైవారు కోరకుండగనె పెక్కుయాశ్చర్యపు పనులనుజేసి యుత్సాహమును గలుగ జేయుచుంటిని.. ఏమి; యీలోకంబున స్నేహితులను సంతోషపెట్టుటకన్న నెక్కువైనది రెండవది గలదా! లేదు, లేదు. గాన చదవరులారా, మీస్నేహితులను సంతోషబెట్టుచు మీరుగూడ సంతోషకరముగ కాలముగడుప ప్రయత్నింపరాద? యిటువంటి సంతోషమును బొందు టకు మనోశక్తియే యని పలుమారు వక్కాణించి యుంటినిగదా.

సామాన్యముగ విద్యార్థులేదైన నొకపాఠమప్పగింపవలసివచ్చినయెడల కొంతమంది పుస్తకములను దీసికొని యీపాఠమువచ్చువరకును చదువుట మానివేయనని దృఢముగా తమ మనస్సునందను కొనెదరు. విద్యార్థి తన మనోశక్తి నుపయోగించిన కారణమున రెండుమూడు పర్యాయములు చదువునప్పటికే బాగుగ వచ్చియుండును. మీలో కొంతమంది యొక పాఠమును పలుమారు జదివియు నప్పగించలేనివారుగ నుందురు. మరికొందరాపాఠమునే యొకమారుజదివి యప్పజెప్పగల వారుగ నుందురు. ఇదికూడను మనోశక్తిమీదనే యాధారము గొనియున్నది.

పుస్తకమును చేతబూని ప్రతివిషయమును శుభ్రముగా మరచి చదువవలసినపాఠమును చక్కగా బహుజాగ్రత్తతో నొక్కమారుచదివినయెడ పాఠమప్పగించగలశక్తిగల వాడగును. ఇచ్చట తనమనోశ క్తి నుపయోగించినకారణమున పాఠము నొక్కసారికే చదివి మరల చెప్పగలుగుచున్నాడు. మరల నాపాఠమునే చదువబోవువాడు మరియొకడు తనతాత సంగతియును, మామసంగతియును లేక మరియొకసంగతి నెద్దియో దలచుచు, పాఠమునుజదువ మొదలిడిన పదిదినములకైన వచ్చుట దులన్‌భముగానుండును. గాన మనోశక్తి యొక్క మహాత్మ్యమును త్వరలోగ్రహింప ప్రయత్నింతురని నేను మిమ్ములనందరను కోరుచున్నాను.

పుల్లలను నడిపించుట .

ఏదైన నొక నునుపగుపుల్లనుదెచ్చి దానిచివరలయందు నీచేతులతో పట్టుకొని నీదగ్గరనున్నవానితో రెండేసియంగుళముల పొడవుగలిగినటువంటి రెండుతిన్నని పుల్లలనుదెప్పించి వానిని మధ్యకువంచుమని జెప్పి పిమ్మట కుడిచేతివైపున నొకటియును, యెడమచేతివైపున నొకటియును నీవుపట్టుకున్న పుల్లమీద బెట్టించి భూమికి తగిలితగులనట్లు బెట్టియుంచుము. తరువాత నీదృష్టిని రెండుపుల్లలపై యుపయోగించి మనోశక్తితో (రెండునుకలసికొందురుగాక) యని తలంచుచున్న కొంతసేపటి కారెండును కాళ్లుగలవాటివలెవచ్చి గలసికొనుటచూచి ప్రతివారు మిక్కిలి యాశ్చర్యమును బొందెదరు.

విత్తనములేక చెట్టునుబుట్టించుట.

సాధారణముగ మేడలయందు బెట్టించు చెట్లతొట్లలో నొకదానిని సంపాదించి దానియందేమియును కల్తీలేని యిసుకను బోయించి యొకచోటబెట్టించుము. పిమ్మట నీవాతొట్టిని జూచుచు "యిందుండి యొక విచిత్రమైన చెట్టు బుట్టును". అని సుమారొక వారముదినములు నీమనోశక్తి నుపయోగించుము. ఆహా యేమి యాశ్చర్యము, తొట్టిలోని మట్టియందు చిట్టిగింజనైన బెట్టకుండగ దిట్టమగుపట్టుదలతో గట్టిగ నీమనోశక్తిని చెట్టుబుట్టుగాకయనుచు తొట్టినేమిముట్టకుండగ చొరబెట్టినచుట్టువారు చెట్టుజూచి పట్టరానిసంతసంబుపడక యుండుటవట్టిదియా! ఇదియంతయును మనోశక్తివల్లనే గలుగు చున్నదనుట వేరుగ జెప్పవలెనా! ఏవిధమైన విత్తనమునుగాని వేయకయే మట్టిబోసిన కొట్టియందు చెట్టునుబుట్టించుట నీమనోశక్తివలనగాక మరిదేనిచేత బుట్టుచున్నది? ఇదెంతటి విపరీతము! ఇట్టిశక్తిని నీయందుగలిగియున్నప్పుడు మనోశక్తియందేమియు లేదని చెప్పుచుండెడివారెంతటి తెలివితక్కువవారని చెప్పవచ్చునో చదువరులే గ్రహింతురుగాక .

మిరపకాయను తీపిగా చేయుట.

మిరపకాయ నొకదానిని తెప్పించి నీవుదానివంకజూచుచు “నీయందుకారములేదు తీపిమాత్రమున్నది” అని నీమనోశక్తినుపయోగింపుచూ యిట్లు కొంతసేపు చూచిన పిమ్మట నీస్నేహితులకందర కామిరపకాయను కొంచెము కొంచెముగా పంచిపెట్టి దానిరుచి యెట్లున్నదని యడుగుము. పంచదారవలె తియ్యగా నున్నదని ప్రతివారును బల్కుదురు. నోటిలో వేసికొనిన నోరంతయును మంట బుట్టించి గంతులు వేయించు మిరపకాయను నీమనోశక్తివల్ల పంచదారవలె తీపిని గలుగచేయుచున్నా వే ! యెంతటి యాశ్చర్యము ! ఇంతకన్న వేరుగ సాక్ష్యము గావలెనా ? నీ మనోశక్తి కింతటి సామథ్ర్యముగలదని తెలిసిన ప్రతిమానవుడును దీనిని సంపాదించుటకు ప్రయత్నింప కూరకుండడని నేను మిక్కిలి దృఢముగ జెష్పగలను.

చేతిరుమాలును పాముగా చేయుట.

చదువరులారా ! మీచేతిరుమాలను గుండ్రముగా చుట్టి పామువలె కొంచెము మెలికలు మెలికలుగా బెట్టి దానిపై మరియొక చేతిరుమాలనుగప్పి తూర్పుముఖముగా గూరుచుం డి నీవెనుకభాగంబున నెవ్వరిని లేకుండగా నియమించి నీచేతి రుమాలతో కప్పబడియుండినది పాముగాని మరియొకటిగాదని నీమనోశక్తి నంతయు నుపయోగించుము. చూచువారందరాశ్చర్య మంద నది పామై మెల్లగా కదలుట కారంభించును. అంత నావినోదమును చూడవచ్చినవారలలో నొకనిని పైన కప్పినటువంటి నీచేతిరుమాలను తీయుమనికోరుము. ప్రతివారును తీయుటకు భయమును జెందుచుందురు. గాన నీవట్టిసమయమున దానిని హటాత్తుగా తీసివేయుము. ఏమి యీ యాశ్చర్యము! ఇంతకుముందు నీచేతిరుమాలనుగదా పామువలె చుట్టి నీరుమాలున కడుగుభాగమున నుంచినది? ఇంతలోనె నీవుచుట్టిపెట్టిన రుమాల పట్టుకొనుటకు శక్యముగాక "వట్టిగొ డ్డున కఱపు లెక్కువ" యన్నట్లు దిట్టముగ బుసలుకొట్టుచు చుట్టుపట్టుల నొకనినైన చుట్టియుండనివ్వకుండ పడగనెత్తి బహు పౌరుషముగ నాలుకను జాపుచు కఱచిచంపుదానివలె మిక్కిలి భయంకరముగ గనుపించును. ఆహా! యేమి నీమనోశక్తి యొక్క సొమథ్యము! ఇదిచూచిన వారందరు నీయొద్ద భగవదాంశములున్నవని భ్రమించి నిన్ను మిక్కిలి గౌరవమును జేయుదురు

విభూతిగడ్డను పటిక బెల్లముగా మార్చుట.

నీవొక విభూతిగడ్డను చేతితే తీసికొని నీచుట్టునుండు వారలకెల్లరకును చూపించి యిదేమిటని యడుగుము. ప్రతివారును విభూతిగడ్డని చెప్పుదురు. పిమ్మట, సోదరులారా, మీరందరిప్పుడు పరీక్షించినటువంటి విభూతిగడ్డను పటికిబెల్ల, పు గడ్డవలె నామనోశక్తివల్ల జేయబోవుచున్నానని యెల్లరకును జెప్పి నీవు విభూతిగడ్డవంక జూచుచు దృఢమనస్సుతో “నాచేతియందున్నది పటికిబెల్లపుగడ్డగాని విభూతిగడ్డకాదు” అని నీమనోశక్తి నుపయోగింపుము. అంత నెల్లరకును వింతయగునట్టు నీచేతీయందున్నది పటికిబెల్లపుగడ్డయై యుండును. పిమ్మట దానిని పగులగొట్టి సభికులకందరకును బెట్టినయెడ తియ్యగా పటికిబెల్లమువలె నున్నదని చెప్పుదురు. ఏమి, మన మేదియనుకొన్న యదియగుచున్నదే, ఇంతకన్న గొప్పవిషయమెద్ది ! కాన చదువరులారా, ఈ మనోశక్తికై తప్పక మీరెల్లరును బహు శ్రద్ధతో పాటుపడవలయునని నేను మిక్కిలి ప్రోత్సాహము చేయుటకు సాహసించుచున్నాను.

DEVELOPMENT OF BODY.

శరీరమును బెంచుట.

నీవు ప్రతిదినమును సూర్యోదయమునకు పూర్వములేచి నిత్యకృత్యములను దీర్చుకొని పిమ్మట స్నానమాచరించి మీగృహమునందు పరిశుభ్రమగు గదిని జూచి దానియందు సాంబ్రాణి మొదలగు సువాసనవచ్చు పొడిని నిప్పుమీదజల్లి గదినంతయును పొగయానదించునట్లు జేయుము. పిమ్మట నత్తరు పన్నీరు మొదలగునవి సువాసనవచ్చునట్లు కొంచెము కొంచెముగా గదిలో చిలకరించుము. దొరకినచో సువాసనగల పుష్పములనుగూడ గదియందు వెదజల్లుము. తదనంతర మే కాకివై గదిలోనికి ప్రవేశించి తలుపులుమాత్రముమూసి కిటికీలను తెఱచియుంచి కిటికీలగుండ నెవ్వరిని తొంగిచూడకుం డునట్లుజేసి యుత్తరముఖముగా గాని లేక తూర్పుముఖముగా గాని తిరిగి నిలుచుండి గాలిని మెల్లగా (ధ్వని లేకుండునట్లుగ) ముక్కు రంధ్రములద్వారా బీల్చుచు మనసునం దిట్లనుకొనవలెను. “నేనుపీల్చు గాలియదుండు మంచిశక్తిని గ్రహించు చున్నాను. నాకన్న బలవంతుడీ ప్రపంచము నందెవ్వడునులేడు నేనే మిక్కిలి యందముగలవాడను, నాశరీరము మేలిమిబంగారువన్నెను మించియున్నది. నాకన్న బుద్ధిబలమునందును సుప్రసిద్ధు డితరుడు లేడు. ప్రపంచమునం దెటువంటి కష్టతరమైన పనియైనను నావల్ల కొనసాగబడును. నాశరీరమును నా యిష్టమువచ్చినట్లు పెంచగలను. లేక మిక్కిలి చిన్న దానినిగా జేయగలను అదిగో నాకుడిచేయి యూపిరితిత్తివలె పెరుగుచున్నది” అని దృఢచిత్తము దలచుచుండుము. ఇటు నీచేయిని యూపిరితిత్తివలె నిమిషకాలమున పెంచగలిగినప్పుడు నీశరీరమంతయును నీకు స్వాధీనమగును. పిమ్మట పైనజెప్పిన చొప్పున గాలిబీల్చుచు నీమనస్సునందీ క్రిందివిధమున దలచుచుండుము. “నాశరీరమంతయు ----


నుబ్బుచున్నది. ఇట్లు నాయిష్టమువచ్చిన దాక నుబ్బుడు" అని యనినతోడనే యుబ్బుటకారంభించును. అట్టిసమయము........ భిముఖముగ నొకయద్దమును బెట్టి నీవెట్లుబ్బు చున్నావో దానియుందు చూచుకొనుచుండిన నీకే భయంకరముగ గానపించును. తత్కారణమున నీవీసాధనమును జేయసాహసింపవు గావున యద్దమునందు నీవు చూడకొనకుండగ తలుపులన్నియును వేసి నీకు ప్రియమిత్రులగువారినిమాత్రము తలుపుసం దులనుండి చూచుచుండనిమ్ము. వారుగూడను నిన్నుజూచి మిక్కిలి భయమును జెందుదురు.

కాని వారినట్టి సమయమున మాట్లాడవద్దని యదివరకే చెప్పియుండవలెను. ఇట్లు నీమనోశక్తి నీవిధముగ నుపయోగించి నీదేహము నేవిధముగ జూపింపవలెనని యనుకొనిన నావిధమైన రంగుగా జూపించగలుదువు. ఇంతటిశక్తి నీకు గలిగినయెడల నీస్నేహితుల కెట్టి మాదిరి గనుపించ నెంచిన నట్టిమాదిరి గనుపించగలవు. గాన నితరులను యందు భ్రమింపజేయగలుదువు. అందుచే ప్రతివారును నీయందిష్టముగా నుందురు. లోకహితుడవని పేరును సంపాదింపగలుగుదువు. తత్కారణమున నీవేమాటన్నను ప్రతివారదియొక గొప్పవిలువగానెంచి నమ్ముచుందురు. నీముక్కురంధ్రములగుండ గాలినిపీల్చి యూపిరితిత్తులం దెంతసేపు నిలుపగలవో యంతసేపుమాత్రముంచి పిమ్మట నెమ్మదిగా ముక్కురంధ్రముగుండనే వదలివేయుచుండుము. గాలిని వదలివేయునప్పుడు నీమనసునం దిట్లనుకొనుము. "నేనిప్పుడు వదులునటువంటిగాలి నాదేహమునందుండు చెడ్డశక్తినంతయును తీసుకొని పోపుచున్నది. మంచిశక్తినిమాత్ర ముంచుచున్నది. నాశరీరమునందుగల యవయవములన్నిటిని నాకు స్వాధీనము జేసిపోవుచున్నది". ఈవిధంబుగ ప్రతిదినమీ యభ్యాసము చేయునపుడెల్ల నిశ్చలచిత్తము తలుచుచున్న యెడల నీదేహమంతయు మంచిశక్తితో నిండి ప్రతి యవయవమును నీకు లొంగి చెప్పిన విధమున పని జేయుచుండును. ఇంట గెలిచి రచ్చగెలువుడనిజెప్పిన సామతప్రకారము మొదట నీ దేహావయవములను లోబరుచుకొన్నగదా, యితరుల దేహావయవములను లోబరచుకొనునది ? గాన నీవీయభ్యాసమును పూతిన్‌గజేయ నేర్చినతోడనే ప్రతివారిని నీవు వశముజేసికొన గలుగుదువు. ప్రతివారును నీకు వశ్యులైన నీకీలోకమున కష్టమెద్దియునుండదని కరతలామలక మేగద ?

ఇట్టియభ్యాసమువల్లనే గాలియందుగూడ నిరాధారముగ లేవగలవు. దానిని గురించి ముందు వ్రాయబోపు గ్రంథమునందు సులభమార్గములను కొన్నింటిని గనిపెట్టి ప్రచురింపబూనియుంటిని. గాన యట్టిగ్రంథమును వ్రాయటకు నాకు సావకాశమిచ్చెదరిని తలంచుచున్నా ను.

సోదరులారా ! నేనురచించిన విషయము లన్నియును నిశ్చయముగ జరుగునవియేగాని లేనిపోని బూటకములుగావని మీలో ప్రతివారును సిద్ధినిబొందినపిమ్మటనయినను తలంపక మానరు. నేనీగ్రంథమునందు జూపిన సాధనములలో కొన్ని మిక్కిలి సులభముగా నగును, మరికొన్ని కొంచెము ప్రయాసతో నగును. బూటకపు మాటల నోటికివచ్చిన నెల్లను మాటలేగదాయని ఆలాటీవారిలాభం బేపాటియు నెంచకుండగ చేటుదెచ్చు గ్రంథంబులు కోటివ్రాసి ప్రతిచోటుల మాటికి ప్రచురింపుచుండ పాటుజేసి గోన్నధనము మాటలతో గాజేయుట పాటియేను యనుచు నట్టి బూటకపుగ్రంధంబులు గొనినవా రెల్లప్పుడును ఘోషమిడుచుండుట ప్రతివారికిని సర్వసామాన్యముగ దెలిసియే యున్నది. ఇట్టి గ్రంథములవ్రాయ నందుదహరించిన వానిని జేసిచూడ నొక్కటియును గాక మిక్కిలి విసుగునుజెంది, అహో యీ గ్రంథములందు రచించినవానియం దొక్కటియును గావని ప్రతి మెస్మరిజగ్రంధమునందును మిక్కిలి యగౌరవమును జూపుచున్నారు. మరియు చదువరులు గ్రంథమునందు రచించినవానిమాడ్కి, సరిగా ప్రవతిన్ంపక వ్యతిరేకముగ ప్రవతిన్ంచిన కారణమునను చెప్పినట్లు జరుగుటకూడ లేకయున్నది. అహో, యీవిషయము మన హిందూదేశీయులకెల్లరకు నవమానకరమైనవిషయమై యున్నది. గాన బూటకములను కొన్నింటిని జేర్చి ధనార్జననిమిత్తమై పెక్కండ్రకు సమ్మకములేకుండగ జేయుచు దేశమునకు క్షీణదశను దెచ్చుగ్రంధములను వ్రాయకుండగ నూరకుండిన మేలుగా గానుపించు చున్నది.

నీమాటను ప్రతివారంగీకరించునట్లు జేయుట.

నీవేదైన నొకమాటను లోకులందరిచే యొప్పుకొనునట్లు జేయనెంచినయెడల వారిముఖములను జూచుచు “నేను జెప్పబోవునదంతయును మీరంగీకరింతురుగాక" అని దృఢముగా ననుకొనినపిమ్మట నీవు చెప్పదలచినది చెప్పుము. అప్పుడు నీవేదిచెప్పిన నది యందరంగీకరింతును. చూచితివా ! నీమనోశక్తివలన ప్రతివారి నెట్లులోబరుచుకొనగలుగుచున్నావో !

పిల్లవానిని నిద్రపుచ్చుట.

నీవొకపిల్లవానిని రప్పించి సౌఖ్యముగా పండుకొనునట్లు వీలుగలుగజేయుము. తరువాత కుఱ్ఱవాని కనుబొమల మ ధ్య జూచుచు “నీకు గాఢమైన నిద్రవచ్చుగాక" అని నీమనోశక్తితో ననుము. ఇట్లనిన నిమిషకాలములోనె యాబాలుడు నిద్రబోవుట జూచి ప్రతివారును నీమనోశక్తికి మెచ్చుకొందురు. అట్టి సమయమున మనమెన్ని కేకలువేసినను నిద్రబోపుచున్న కుఱ్ఱవాడు పలుకడు. మరల నిద్రబోవుచున్న బాలునివంక జూచుచు యిదిగో సోదరులారా, యీపిల్లవానిని మీరెన్ని కేకలు వేసినను పలుకకుండెనుగదా, నేను పిలుపకుండనే లేపెదననిచెప్పి మరల నీమనోశ క్తితో- "నిద్రనుండి లేచెదపుగాక" అని నీలోనీవను కొనుము. అచ్చటనున్న వారందరాశ్చర్యమంద కుఱ్ఱవాడు నిద్రనుండి చప్పున మేల్కొనును. అప్పుడు నీవాకుఱ్ఱవానికండ్లను శుభ్రమైననీటిలో నొక తెల్లని గుడ్డనుముంచి తుడువుము. పిదప వాడెప్పటివలెనే తెలివిగల్గి యాడుకొనుటకు మొదలిడును. చూచువారు మిక్కిలి యాశ్చర్య మొందెదరు.

ఇట్టి మనోశక్తిని సంపాదించుటకై ప్రతిదినమును రెండు నిమిషములు యభ్యాసముచేయుట చాలును. ఇట్లు పది దినములైన తరువాత నీకు కొంతవరకైనను వచ్చినదా లేదాయని నీలో నీవే ప్రశ్నించుకొని పరీక్షను జేసికొనుము.

నీవొకచోట యొంటరిగ గూరుచుండి నీచుట్టుపట్ల నేదైనయొక చీమనుగాని లేక మరియొక పురుగునుగాని, పోవుచుండగజూచి నీదృష్టిని సరిగా దానియందు నిల్చి “నీకు వెశ్ళుటకు శక్తిలేదు నిలుపుము" అని నీమనసునందనుకొనినతోడనే కదలమెదలక కాళ్ళులేనిదానివలె నిలుచుండును. ఇట్లు ని లుచుండినయెడ నీకు కొంచెము శక్తిగలిగినట్లును లేనియెడల యింకను రెండుమూడుదినంబు లభ్యాసము (practice) చేయవలసియున్నదని యెరింగి మిక్కిలి పట్టుదలతో జేయుచుండుము. అంత నీకీమనోశక్తిబాగుగ పట్టుబడును. చీమ, దోమ మొదలగునవి నీమనోశక్రివలన యాగుచుండినతోడనే నీకు మిక్కిలి సంతోషముగల్గి పట్టుదలతో యభ్యసించుట కలవాటు పడుదువు. తత్కారణమున పెద్దశక్తిగలుగువరకును సాధనము చేయగలవాడవగుదువు. అట్టిమహాశక్తిని సంపాదించినపుడు నీకీలోకంబున గలుగు సుఖమింతని జెప్పనెవ్వరితరము.

స్నేహితుని పిలువకుండ రప్పించుట.

నీవొక స్నేహితునితో మాటలాడ నుత్సహించుచున్నావనుకొనుము. దైవవశాత్తు వాడు నీకు సమీపమందు లేడనుకొనుము. వానితో నీవట్టిసమయమున మాటలాడనెంచినయెడల నీవాతానికి పంపనెంచిన సమాచారమును మనిషి ద్వారాగాని, పోస్టుద్వారాగాని, తంతిమూలముగాగాని పంపవలయునేగాని మరియొకవిధములేదని ప్రతివారును చెప్పుదురు. కాని మనోశక్తి కలిగియుండిన యెడల నీవాతని కేవిధమైన యుత్తరము గాని తంతినిగాని, పంపకయే రప్పింపగలుగుదువు. ఎట్లన, నేకాంతముగ నేదియోయొకస్థలమునకువెళ్ళి నీస్నేహితు డేవైపుననున్నాడనితో చునో యాముఖముగ గూర్చుండి కనులనుమూసికొని యాతని యాకారమును నీమనసునందు చూచుచు "మిత్రమా నీతో" కొన్నిమాటలు మాటలాడవలసి యున్నదిగాన నాయందు దయయుంచి తప్పుక బయలుదేరి రమ్ము" అని నీమనసునందు మిక్కిలి నమ్మకముగా దలంచు చుండుము. ఇట్లు సుమారు రెండుమూడురోజులు ప్రతిదినమును ప్రాతఃకాలమున పదినిమిషములు నీమనోశక్తి నాతనిపై నుపయోగించుము. తదనంతరము నీమిత్రుడు నిన్నుజూచి మాటలాడుటకై మీగ్రామమునకు తప్పక వచ్చును. ఇదియే కొన్నిదినములు మిక్కిలి పట్టుదలతో యభ్యాసము జేయవలెను. ఇట్టి మనోశక్తిని మీగ్రామమునందున్న స్నేహితునిమీద నుపయోగించిన కొన్ని ఘంటలకాలములోనే వాడు నీవద్దకు వచ్చును.

ప్రతివారిని స్నేహితునిగా జేసికొనుట.

ఇట్లు నీకు మనోశక్తి బాగుగ సంప్రాప్తించిన తోడనే “నాకు ప్రతివారును స్నేహితులు. విరోధి యొక్కడును లేడు" అని ప్రతిదినమును నిద్రలేవగనే యనుకొనుచుండుము. నిత్య మీవిధముగ తప్పకుండగ దలంచుచుండిన లోకమునందు నిన్నుజూచినవారందరును ప్రాణమిత్రులగుదురు. ప్రతివారికిని నీయందు ప్రేమ బొడముచుండును. కొన్ని సమయములయందు నీయొక్క గొప్పనుజూచి యోర్వలేనివారుసైతము నిన్ను జూచినతోడనే వశ్యులగుదురు. కంటిరా! యిదంతయును మనోశక్తివల్లనే గలుగుచున్నది. ఇట్టి మనోశక్తివలన కొన్నికొన్ని జబ్బులనుగూడ పోగొట్టగలవాడ వగుదువు.

తలనొప్పిని పోగొట్టుట.

నీవు నీస్నేహితులతో కలసియున్నప్పుడు వారిలో నొకరికి తలనొప్పి వచ్చినదనుకొనుము. అప్పుడు వాని తలనొప్పిని పోగొట్టి వానిని సంతోషముజెందునట్లు చేయగలుగుదువు. నీ స్నేహితుడు తలనొప్పిచే బాధపడు చుండగ యాతనిని బాధనుండి నీమనోశక్తివల్ల తొలగించి సంతోషమును గలుగజేయుటకన్న నీ కెక్కువ ప్రీతికరమైనదెద్ది? ఇట్లనేకమారులు నాస్నేహితులు బాధపడుచుండగ నేను పలుమారు సులభముగా బాగుజేసియుంటిని. ఒకనాటిసమయమున నాకు మిత్రుడగు కొసరాజు లక్ష్మయ్య తలనొప్పిచే బాధపడుచున్న సమయమున నేనాతని గదికి వెళ్ళుట తటస్థమాయెను. అందువల్ల నేనాతని తలభారమును సులభముగా దీసి వేసి సంతోష పెట్టగలిగియుంటిని. నేను తెనాలిపురమున నున్నప్పుడు చాలమందికి బాగుజేసియుంటిని గాని వారినందర నిచ్చటుదహరించు టనవసరముగా నెంచి వ్రాయుట మానినాడను. తలనొప్పిచే బాధపడుచున్నవానిని నీకెదురుగా గూరుచుండబెట్టి యాతని కనుబొమలమధ్య జూచుచు "నీతలనొప్పి తగ్గిపోవును,” అనిదృఢముగా మనసునందు తలంచుచు ముఖముపై చల్లగానూదుచు తగ్గినదాయని మధ్యమధ్య నడుగుచుండుము. ఇట్లుజేసిన సుమారైదారు నిమిషములకంతయు తలనొప్పిపోయి మిక్కిలి సంతోషముగానుండును. ఇట్లే పార్శ్వపునొప్పులను పోగొట్టవలసివచ్చినయెడ కణతలను జూచుచు పైవిధముగ నీమనోశక్తి నుపయోగించుము.

బెల్లమును పేడగా జేయుట.

నీవొకనితో బెల్లము నందరుజూచుచుండగనే దెప్పించి నీచేతనుంచుకొని దానియందు నీమనోశక్తి నుపయోగించుము. “ఓ బెల్లమా నీయందు తీపిలేదు. నిన్నెవరైన నోటిలోవేసికొన్న పేడవలె నుందువుగాక” అని నీలోనీవు కొంతసేపు తలంచి, పిమ్మట నీవద్దనున్న వారికి కొంచెముకొంచెముగా బెట్టుము. ఆహో, యిదేమి యాశ్చర్యము. బెల్లమును నోటిలో వేసికొనగా పేడవలెనున్న దని యందరాశ్చర్యమొందెదరు. ఆహా! బెల్లమును పేడగను పేడను బెల్లముగను మార్చుటెంతవిపరీతము ! పూర్వము భీమకవిని బ్రాహ్మణులు భోజనపంక్తికి రానివ్వని కారణంబున గోపమునుజెంది, అప్పాలెల్లను కప్పలుగావలే ననియును, అన్నమెల్ల సున్నముగావలెననియును, అయ్య లెల్ల కొయ్యలుగావలెననియును పలికినమాత్రమున ప్రతిదియు నట్లే మారెనని చెప్పు వాడుక పిన్న పెద్ద లందరకును దెలిసిన విషయమై యున్నది. ఈమాటలు విన్నప్పుడు కొందరజ్ఞానులు సర్వాబద్ధమనియును, వేడుకార్థమై దీని నెవ్వరో గల్పించిరనియును బల్కుచుందురు గాని యట్టిమూర్ఖులు నీవీ బెల్లమును పేడగమార్చుట చూచినప్పుడైన నిజమని తలంపరా? “కఠినచిత్తమెపుడు కరగింపగారాదు” అనిచెప్పినప్రకారము కొంతమందిమూడు లప్పటికిని నీవేదో గారడీచేయుచున్నావని నమ్మకుండుటగూడ నొకానొక సమయమున తటస్థించును. అట్లు నమ్మనివానిని యతనిచేతనే బెల్లమును తెప్పించి యాతనిచేతనే యుంచుకొమ్మనిచెప్పి నీమనోశక్తి నాబెల్లముపై పైనుదహరించిన విధమున నుపయోగించుము. తదనంతరము నీకాబెల్లము పేడగా మారినదని తోచినప్పుడు తినుమని చెప్పుము. అహో యతనియవస్థనేమని చెప్పుదును. నోరంతయును మురిగిన పేడవలె కంపుగొట్టుచు బహు యసహ్యకరముగనుండును. కాన యాతనికిట్లు పైనవచించిన మాడ్కి ప్రాయశ్చిత్తమునుజేసి పంపినయెడల వానికి నమ్మకము గల్గును. ఇట్లు నేననేకపర్యాయములు పెక్కు మూర్ఖులకు ప్రాయశ్చిత్తములు జేసియుంటిని. కాని వారిపేరిచ్చట యుదహరించుట భావ్యము గాదని మానివేసితిని. ఇటువంటి వినోదములను పెక్కింటిని నేను తెనాలిపురమునందున్నప్పుడు నామిత్రులకందరకును పలుమారు చూపించుచుంటిని.

చేతిలోని చీట్లపేకముక్కను చేతిలోనె మార్చుట.

చీట్లపేక నొకదానినిదెప్పించి బాగుగ గలిపించి చూడవచ్చినవారిలో నొకనిని ముక్కను దీసికొనుమని చెప్పి యందరకును చూపింపుమనుము. నీవుగూడను చూడుము. పిమ్మట సోదరులారా, యీముక్కను మీరును నేనునుగూడ చూచియేయున్నాముగదా. దీనిని బహుజాగ్రత్తగ మీలో నొకని

యొద్ద దాచియుంచుమని యడుగుము. తరువాత నీలో నీవు మనసునం దీక్రిందివిధముగ ననుకొనుము. "ఇప్పుడాతనియొద్ద దాచియుంచినది కళావరు జాకియేయని పలువురుజూచియున్నను చూచినముక్క మాత్రముగాక మరొకటి కావలెనని దృఢముగ దలంచుచుండుము. ఆహా, యేమి నీమనోశక్తి యొక్క ప్రభావము ! ప్రతివారికిని కనులను కప్పుచున్నదే ! ఈ వింతను జూచిన యెట్టిమానవుడైనను మనోశక్తిని నమ్మకుండునా ? అప్పటికిని నమ్మకుండిన నేను పైనవ్రాసిన ప్రాయశ్చిత్తమును జేసి బంపుచుండుము. అప్పటికి గానివానికి నమ్మకముబుట్టదు.

దీపము నార్చుట, కాంతి తగ్గించుట.

మన గృహములయందు సామాన్యముగ నుపయోగించు దీపము నొకదానిని మనకెదురుగా మనకొక రుడుగున్నర దూరమునబెట్టించి దానివంక సరియైన దృష్టితో చూచుచు నీమనసునందిట్లను కొనుము. “నీకిక వెలుగుటకు శక్తిలేదు, వత్తిద్వారా నూనె యెక్కదు” అని నీవనుకొనినతోడనే దీపము కళాహీనమై యారిపోవుటకు సిద్ధముగ నుండును. ఇంకను నీమనోశక్తి నుపయోగించిన బొత్తిగా నారిపోవును. అట్లారిపోవుటకు ముందు నీమనోశక్తిని మరల దీపముపై కాంతిగా వెలుగుటకై యుపయోగించుము. తరువాత దీపమెప్పటివలే వెలుగుట కారంభించును.

నిద్రను బోగొట్టుట

మీగ్రామమునం దెవ్వనికైన నిద్రాదేవతబట్టి బాధించుచుండిన పాపమాతని కెన్నివిధములో నష్టములు గలుగుచుండును కాన నీవట్టివానియందు దయగలవాడవై నిద్రాదేవతబారినుండి తప్పింప ప్రయత్నింపుము. అట్లు పరపీడలను పోగొట్టుచుండిన నీకు మిక్కిలి శ్రేయస్కరము. కాన నీవతని యెదురుగా రెండడుగుల దూరమునందు గూర్చుండబెట్టము. పిమ్మట వాని కనుబొమల మధ్యజూచుచు (నీదృష్టి నుపయోగించుచు) మనోశక్తితో “నీకునిద్రాదేవతబాధతొలగిపోవును. రేపటి నుండి మావలెనే చురుకుగానుందువు. నీకీదేవత బాధవదలుటకొరకే నాకడకు తీసికొని రాబడినావు” అని యనిన వెంటనే యాతనికా నిద్రబాధ కొంత తొలగిపోవును. ఇట్లే మరునాడుకూడను నీమనోశక్తి నాతనిపై పైనుదహరించిన విధమున నుపయోగించినయెడల నాతని నిద్రబాధ తొలగిపోవును. ఇట్టి మేలులను ప్రపంచమునందు నీవనయము జేయుచుండుటకు ప్రయత్నింపుము. అందులకై సర్వేశ్వరుడు నీకింకను గొంతశక్తినీయ నుత్సాహమును జెందుచుండును.

ఇసుకను పురుగులుగా మార్చుట.

నీవు కొంత యిసుకను దెప్పించి దానిని ప్రతివారికిని జూపింపుము. చూచినవారందరదిచూచి యిసుకని బల్కుదురు. తదనంతరము నీవా యిసుకను జూచుచు “నీకు నీటిమీద తేలగలశక్తిని నేనిచ్చుచున్నాను. నీటిమీద తేలి పురుగులాడి నట్లుగ నాడుడు” అని నీమనోశక్తి నుపయోగించి పిమ్మటా యిసుకను చెఱువునందు గాని లేక భావియందుగాని జల్లుము. పురుగులవలె ననేకచిత్రములుగ భావియం దమితముగజేరి చూచుట కసహ్యకరముగ భావినీటియందు గందరగోళమును జేయుచుండును. ఇదిచూచి ప్రతివారు మిక్కిలి వింతనొందు చుందురు. అట్టి సమయమున నీమనోశక్తిని భావియందుచూచుచు పురుగు లెక్కువయగున ట్లుపయోగించుము. చూచువారింకను మిక్కిలి యాశ్చర్యమొంద పురుగు లెక్కువగుచుండును. ఇట్టివినోదములుజేయుచు నీవేగ్రామమునకుగాని పట్టణమునకుగాని వెళ్లిన సచ్చటనే చాలమంది స్నేహితులను సంపాదింప గల్గుదువు. ఇటువంటి వింతకార్యములను నా స్నేహితుల కెల్లరకును పలుమారు చూపియుంటిని.

బెణుకులను పోగొట్టుట.

నీస్నేహితులకెవరికైన చేయియో లేక మెడయో బెణికినదని వచ్చినవెంటనే యతనిని నిలుచుండ బెట్టిగాని లేక కూరుచుండబెట్టిగాని యాబెణికిన స్థలమును జూచుచు “నీకు బెణికిన స్థలమునందు బాధతగ్గిపోవును. చెదిరిననరము మరల యధాస్థానమునకు వచ్చుచున్నది” అని నీమనమునందు దృఢముగ నీచిత్తశక్తి చే తలంచిన పిమ్మట నీస్నేహితుని బాధ సులభముగ పోవును.

నామిత్రుడగు వెంపటి సూర్యనారాయణ వామనేత్రము భయంకరంబుగ నెఱ్ఱబారి నిమిషకాలమైనను పుస్తకమును చదువనియ్యకుండెను. అట్టి సనుయమున నేనాయన బాధనుజూచి నామనోశక్తిని సుమారు మూడునాలుగు నిమిషము లుపయోగించితిని. మరునాటికాయన నేత్రము యెఱుపు, వాపు, బాధ మొదలయిన వేమియు లేక శుభ్రముగా నుండి నందున సంతోషముగ నాయన నాగదికివచ్చి యాతని సంతోషమును నాయెడజూపి నన్ను మెస్మరిజమును నేర్చుకొను విధానములడిగి తెలిసికొని యాయనగూడ యభ్యాసము జేయ మొదలిడెను.

తెనాలిపురమునం దాంగ్లభాషాభ్యాసము చేయుచున్నప్పుడు నాతో నిత్యమును సుమారిరువది మందికి తక్కువయుండెడివారు కారు. వీరిలో నందరును సామాన్యముగ మెస్మరిజముచేయ నభ్యాసము ప్రతిదినమును నాతో ప్రోత్సాహమును జేయబడుచుండిరి. నేను జేయు వింతలను ప్రతిదినమును జూచుటకై వీరందరును స్కూలు విడచినతోడనే నాగదివద్ద హాజరుగా నుండెడివారు. ఇట్లుండ నొకనాటి సమయమున నీమిత్రబృందములో నొకడగు చల్లా గోపాలరావుగారితో నెవరో యొక విద్యార్థి మెస్మరిజమనిన నెంతమాత్రమును నమ్మకములేదని పలుమారాతనితో పలుకుచున్నాడనియును తత్కారణమున నాతనికెద్దియో నిదర్శనము ప్రత్యక్షముగ జూపించవలెననియును నన్నుకోరగా నేదియోనొకటిజేయ మొదలిడుచుండ నచ్చటనున్న మరికొందరు మిత్రులతని నేడ్చునట్లు జేయుడని కోరగా నతనికి జేసినచో నతని కేమియును దెలియదని యాతనిసోదరుడేడ్చునట్లు జేసియుంటిని. పిమ్మట మరికొన్ని వినోదములనుజేసి యాతనికి మెస్మరిజమునందు మిక్కిలి నమ్మకమును గలుగ జేసియుంటిని.

విభూతియొక్క గొప్పశక్తి.

సాధారణముగ భూతవైద్యులందరును విభూతిని వాడుచుండుట ప్రతివారును చూచుచునే యున్నారు. మన ముపయోగించునటువంటిశక్తి విభూతిలో త్వరగా ప్రవేశించి రోగియొక్క దేహమును తాకినవెంటనే యామంచిశక్తి యందులో ప్రవేశించి యాతని చెడుశక్తిని వెళ్లగొట్టును. మరియు విభూతిని కనుబొమలకుమధ్య బెట్టుచు మరికొంత భాగమును లోపలకుగూడ పంపుచుండుట పలుమారు చూచుచున్నాము. దీనికి కారణం బేమియన ముఖమునందు శక్తిని త్వరలో గ్రహించు నరములున్న వని మనపూర్వీకులు గ్రహించియుండుటచే విభూతి నచ్చట బొట్టుగానుపయోగించిన మనమావిభూ తియందు ప్రవేశింపజేసిన శక్తి ముఖనరములద్వారా దేహమునందు ప్రవేశించి రోగిని త్వరలో స్వస్థతగావించుచున్న ది. మరియు నోటిలో వేసికొని తినిన యెడల గర్భమునందాహారముతోగలసి రక్తముగామారి దేహమునందెల్లభాగములకును మనముపయోగించిన శక్తి ప్రవేశించి రోగమును కుదుర్చుచున్నది. భూతవైద్యులు విభూతినితీసికొని మంత్రించి యిచ్చుదురు. ఆవిభూతిని మంత్రించునప్పుడు దానియందర్థమిది : “భూతపిశాచములచేగాని జడిసినందువలనగాని ప్రవేశించిన చెడుశక్తి నీయందుండి తొలగిపోవుగాక. నేటినుండి నీవారోగ్యముగా నుందువుగాక" అని భూతవైద్యునియొక్క మనోశక్తి నుపయోగించి యిచ్చును. ఇట్లే నాశక్తిని విభూతియందు ప్రవేశింపజేసి పలువురను నిద్రబారినుండియ , సోమరితనమునుండియు, తలనొప్పినుండియు తొలంగించి యుంటిని,

దూరముననున్న వా రేమిచేయునదియును జెప్పుట.

నీవు ప్రతిదినమును నిద్రనుండి లేచినతోడనే తూర్పుముఖముగా గూరుచుండి నీమనసునం దేమియు తలంచకుండ (Thoughtless) గా కొంచెము సేపనగా సుమారు రెండు నిమిషములకాల ముండుము. ప్రతిదినమిట్లు వాడుకచేయుచున్న సుమారొక నెలదినంబులకు నీమనసునకొక శక్తి గలుగును. ఈ యభ్యాసమును చేయుటకు మొదట నీకు మిక్కిలి స్నేహము గలవానిని సమీపమున నున్న గదిలోనికిబంపి యెద్దియో నొకచేతిలోవస్తువు నొకదానిని పెట్టుకొనుమని చెప్పుము. తదనంతరము నిశ్చలచిత్తముతో నీవు కొంచెము సేపూరకుండి నీమిత్రుడావస్తువు నేచేతిలో బెట్టుకొనెనని ప్రశ్నించుకొనుము. తక్షణమే నీమనస్సునకొక చేయి తోచును. పిమ్మట నీస్నేహితునిబిలిచి మిత్రమా! నీవు ఫలానిచేతిలో నావస్తువును బెట్టుకున్నావని చెప్పుము. ఇట్లు నీవు చెప్పినయెడ నీస్నేహితు డత్యద్భుతముగా నిన్ను మెచ్చుకొనును. కొన్ని సమయముల యందు తప్పిపోవుటయుగూడ సంభవించును. కాని దినసాధనమువల్ల కొన్ని నాళ్ళకు సరిగా జెప్పగలుగుదువు. ఈవిధముగా నెక్కువశక్తిని సంపాదిచిన పిమ్మట దూరముననున్న బంధు మిత్రులయొక్క క్షేమసమాచారములను, వారు తత్కాలమునజేయు పనులనుసైతము జెప్పగలవు. ఇట్లు విశేషించి మనోశక్తిని సంపాదించిన కాణముననే భూతభవిష్యద్వతన్‌మానము మనఋషులెల్లరును చెప్పగలిగియున్నారు. కంటిరా ! యీవాడుక నశించినకారణమున మనదేశమునందిప్పుడట్టిశక్తిని గల్గినవారరుదుగానుండుట తటస్థించినది. వేయేల, యికనైన విశేషించి యిటువంటి గొప్పశక్తిని సంపాదించుటకు ప్రయత్నింతురని మిక్కిలి నమ్మియున్నాను. ఇట్టివాడుకనుజేయు ప్రతిమానవుడును దేవునిసృష్టియందు జన్మించిన ప్రాణికోటు లన్నిటియందును జాలిగలవాడై "అహింసాపరమోధర్మ" అను పెద్దల వాక్యము ననుసరించి ప్రవతిన్ంచుచుండవలయును. సాధ్యమైనంతవరకీ ప్రపంచమున నెట్టి ప్రాణికిని కష్టమును గలుగజేయకుండ నిజముగా నీవేదినమునను జీవహింస చేయు చుండుటలేదని నీ మనస్సాక్షిగా నమ్ముచుండిన చాలును. నీమనసునం దేకళంకమును లేకుండగ కాలమును గడుపుచుం డిన నిశ్చయముగా నీవొకవిధమైన ధైర్యముగల్గి చూచుట కెల్లరకును మిక్కిలి సంతోషముగా నగుపడుచుందువు. ఇంతకన్న నీకెక్కుడుభాగ్య మెయ్యది ? నీస్నేహితులలో నెవరికైన కొంచెము జబ్బుగానుండినగాని లేదా యేదైన కష్టములందు చిక్కియుండినగాని యాతడు దూరముననున్నను నీమనస్సెంతయు కలవరపడుచు నేమియు దోచకుండుట పలుమారు మనమందరమును చూచుచునేయున్నాము. కంటిరా! మన మనోశక్తికై పాటుపడకుండనున్నప్పుడే దూరముననున్న మన స్నేహితునకెద్దియో కష్టము సంప్రాప్తించిన దైనమహిమచే యాతనికి కష్టకాలము సంప్రాప్తమాయెనని మన కేదియో యొకవిధంబుగ తెలియుచున్నప్పుడు మనోశక్తికై విశేషముగా పాటుపడ సంపాదించిన పిమ్మట యోగక్షేమములను కనుగొనలేక యుండెదమనిచెప్ప నెవ్వరైన సాహసింపగలగా?

సామాన్యముగ మనము భోజము చేయుచున్నప్పుడుగాని లేక కాఫీ మొదలగునవి త్రాగునప్పుడుగాని, మసలో నెల్లరకును పలుమారు కొరమారుచుండుట చూచుచునే యున్నాము. అట్టిసమయమున బంధుమిత్రులలో నెవ్వరో కొంతమంది మనలనుగురించి యనుకొనుచున్నారని మనపెద్దలందరును జెప్పుచుండుట పలుమారు వినియున్నాము. ఇదియును విచారింప వాస్తవముగ మనోశక్తివల్లనే గలుగుచున్నది. ఈ విషయమునుగురించి యనేకపర్యాయములు నేనును నామిత్రులును గలసి పరీక్షించియుంటిమి. ఇందుకెన్నడును మాకు పొరపాటు వచ్చియుండలేదు. గాన చదువరులారా! మీరీ విషయమునుగురించి బాగుగ విమర్శించి చూచిన మీకుగూడ నట్లేగానుపించినపుడైనయనుకొనక మానరనితలంచుచున్నాను.

ఈ మనోశ క్తిని సంపాదించుటకు ప్రతిదినమును సూర్యోదయమునకు పూర్వమేలేచి నిత్యకృత్యములనుసల్పి పిమ్మట స్నానమాచరించవలెను. ప్రవహించుచున్న కృష్ణ, గోదావరి, గంగ, సింధునదులలోగాని, వాటి యుపనదులలోగాని లేక నట్టి యుపనదులనుండి త్రవ్వబడిన కాలువలలోగాని లేక నెటువంటి పారుడునీటియందుగాని స్నానముచేయుట మిక్కిలి శ్రేయస్కరము. పారుడునీటియందొక శక్తియున్నది. మన పూర్వీకులు జ్ఞానాధిక్యము గలవారు గనుకనే యెల్లనదులను మిక్కిలి పూజనీయముగానెంచి యేటేట నదీదేవతలకు మ్రొక్కునట్లేర్పాటు జేసియుండిరి. కాని యేబావికిని మ్రొక్కునట్లేర్పాటుజేసియుండలేదని హిందూజాతికంతకును విశదమైయున్నది. కాన నదీజలమునందు జలకమాడుట చాలమంచిదని నాయభిప్రాయము. కదలికలేక చెడువస్తువు లెల్లను క్రుళ్ళి వేలకొలది పురుగులు నీటియందంతయును మనకనులకు గానరానంత చిన్నవిగా నావరించి చూచుటకుమాత్రము బాగుగ నున్నను కదలికలేని నీటియందు జలకమాడుట మంచిదిగాదని ప్రపంచజ్ఞానముగలవారందరకును తెలియును. అహో, కొన్నికొన్ని గ్రామములకు కాల్వల వసతులుగాని లేక రెండవ పక్షమున బావులవసతులుగాని లేని హేతువుచే చెఱువుల యందునీటిని వాడుకొనువారి సౌఖ్యమేమనిచెప్పవచ్చునో చదువరులే గ్రహింతురుగాక. పానయోగ్యమగు నీటిని దెచ్చుకొనుటకై ప్రత్యేకముగ, నొక చెఱువుండినవారి విషయమై చెప్పవలసిన దంతగా లేదుగాని త్రాగుటకు తెచ్చుకొను తటాకమునందే బట్టలనుతుకుటయు, స్నానముచేయుటయు , పశువుల కడుగుటయు, వలలువేసి చేపలను బట్టుకొనుటయు మొదలగు దురాచారములు గలిగిన గ్రామారోగ్యమునుగురించి చెప్పునప్పుడు తిన్నయన్నమంతయును వెలికివచ్చుటకు ప్రయత్నించుచుండునుగదా ! కాన చదువరులారా ! మీగ్రామమునటువంటి యలవాటు లుండినచో వాటిని లేకుండజేయ ప్రయత్నింపుడు. లేక యటువంటి చెఱువులకు ప్రక్కలనే భావులను త్రవ్వించి యందుండి యూరుచుండెడి జలమును పానయోగ్యముగ నుపయోగించిన మరికొంతవరకు బాగుండును. మీగ్రామమునందు నీమాటవినరని నీకు భయముండినచో మనోశక్తిని సంపాదించి వారికందరకును నీవుజెప్పు హితోపదేశములను సరిగా నుండి వినునట్లు జేయుము. తద్వారా నీవనేకమందికి మేలొనర్చిన వాడవగుదువు.

స్నానములు మొదలైనవిజేయు ముఱికి చెఱువులయందు నీటిని త్రాగుటకుగూడ నుపయోగించెడు గ్రామముల యందు నివసించువారెల్లరును సామాన్యముగ నెద్దియో నొక రోగముచే నిరంతరము బాధపడుచుండుట నిశ్చయము. ఇటువంటి గ్రామములను పెక్కింటిని నేనుచూచియున్నాను. నేను చెప్పినట్లుగనే సామాన్యముగ ప్రతివారును యెద్దియో నొక రోగముచే బాధపడుచుండుటయు గలదు. చదువరులా రా ! మనోశక్తిని సంపాదించుటకు వాడుకచేయునపుడు శతవిధముల పారుడునీటియందు జలకమాడుట శ్రేష్ఠము. రెండవపక్షమున కూపజలముగూడ తగినవసతులున్న యొకవిధమున మంచిదనియే నాయభిప్రాయము. ఇట్లు నీవు స్నానమాచరించునపుడు జలమునందుండు మంచిశక్తి నీలో ప్రవేశించుచున్నదనియును, తత్కారణమున నీశరీరమంతయు పదారువన్నె బంగారువలె మెఱయుననియును దలంచుచు నీకెన్నడును దేహవ్యాధి గలుగదనియును మిక్కిలి దృఢముగనమ్ముచు సాధనము చేయుచుండుము. స్నానముజేయునపుడు ప్రతియవయవమును శుభ్రముగా తోముకొనుచు సుమారొక యరగంట కాలమువరకు జలకమాడుట ముగింపవలెను. ప్రతిదినమిట్లు చేయుచుండిన శరీరమంతయు బంగారుచొక్కాను తొడిగికొన్నట్లు తళతళమెఱయుచు బుద్దిబలము పెంపొంది యంగబలము నందు మిక్కిలి వృద్ధినిబొందినవాడవై చూచువారల కెల్లరకును కన్నులపండువుగ నుండునట్లు గాన్పించుచుందువు. ప్రతిదినమును పైనవచించిన విధమున స్నానమాచరించుచు మనోశక్తికై యభ్యాసము చేయవలెను. అట్లుచేసినవాడు త్వరలో యీశక్తిని పడయుదురని నేను నొక్కి వక్కాణింపగలను. దొంగలు నీవెంటబడి కొట్టవచ్చినప్పుడు నీకడ్డమువచ్చిన పెద్ద కాలువలను సయితము దూకగలుగుచున్నావు. కారణమెద్ది యన దొంగలు వెంటపరుగిడివచ్చునప్పుడు నీవు పారిపోపు చుండగనే కాలువడ్డుపడినను దూకగలవను ధైర్యముచే యవలీలగ దూకుచున్నావు. కాబట్టి యిచ్చట నీమనోశక్తిని యు పయోగించియుంటివి. అందువలన దూకగలిగియున్నావు.

నేనొకనాటి సమయమున నాప్రాణమిత్రుడగు కొత్త సీతారామయ్యగారితో జాగర్లమూడిగ్రామమువరకు సాయంతనమున మాటలాడుచు వెళ్ళి మరల సూర్యాస్తమయమగు సమయమున బయలుదేరి కరీమ్ సాహేబు అనువాని గుఱ్ఱపు బండిలోనెక్కి వచ్చుచుండగ మార్గమునందొక త్రాచుపాము కాలవశమున బండివాని కంటబడెను. పిమ్మట వాడు భీతినిజెంది బండినాపి నాకాకృష్ణసర్పమును జూపించెను. ఇట్లుండ మరికొంతమంది ప్రయాణీకులు గుమిగూడి పాము పడగవిప్పి యాడుచుండుటచూచి మిక్కిలి భయమును జెందుచుండిరి. అట్టిసమయమున నేనుబండినుండి దిగి చల్లగా పామును సమీపించితిని. అచ్చటనున్న వారందరు నన్ను బోవలదని యఱచు చుండిరి. వారిట్లఱచుచున్న సమయమున నాశక్తి నాపాముపై యుపయోగించితిని. అచ్చటనున్న వారందరును వింతజెందునట్లుగ పామాడక పడగనుమూసికొని చల్లగా భూమిపై పరుండెను. పిమ్మట నేను పామును సమీపించి కొంచెముసేపు దువ్వి యాడించియుంటిని. చూడవచ్చినవారిలో నొకడు నావెనుక భాగముగవచ్చి దుడ్డుకఱ్ఱతో నొక్కదెబ్బను చచ్చునట్లుగ బాది యంగలకుదురునకు సమీపముననున్న కాల్వలో బడవైచెను. ఇట్లే నేననేక పర్యాయములు పాములనాడించి జనులందర కాశ్చర్యమును పలుమారు గావించియుంటిని. చదువరులారా ! మీరుగూడ మనోశక్తియను మెస్మరిజమును నేర్చుకొని జనులకు మేలుజేయుటకై పాటుపడుచుండుడు. ఈమనోశక్తికై మీరుత్సాహముతో యభ్యాసము జేసినచో తేళ్ళు మొదలగువానిచే గలుగు బాధలను సుమారైదారునిమిషములలో నివతిన్ జేయగలవారగుదురు.

రాయిని మిక్కిలి సుందరముగల పిట్టను జేయుట.

నీచేతిరుమాలును తీసికొని నీచేతులతో విదలించుము. పిమ్మట యొకరాయిని భూమిపైపెట్టి దానిపై నీచేతిరుమాలును కప్పుము. తరువాత నీమనోశక్తిని రాయిపై యీక్రిందివిధమున నుపయోగించుము. “నేనీరాయిని పిట్టవలెజేసి ప్రతివారికిని చూపించగలను. ఈరాయి నిశ్చయముగా పిట్టయగును. చూచుటకు మిక్కిలి ముద్దును గలిగించుచుండును. విశేషదూర మెగిరిపోలేదు" అని నీమనోశక్తి పావుగంటసే పుప్రయోగించిన రాయిబోయి పిట్టగానుండి బహువింతగా యరచుచు కొంచెము కొంచెముగా యెగురుచుండుట కలవాటు జేయునట్లు నటించును. పట్టుకొనినచో ప్రాణములు బోవునను భీతిచొప్పున దాని నెవ్వరంటుకొనుటకైన సాహసింపరు. ఇట్టి విచిత్రములగు పనుల నెన్నింటినో జేసి నామిత్రులను పలుమారు సంతో'షపెట్టియుంటిని.

ముఖ్యాంశములు.

ఇంతటిమహిమగలిగిన మనోశక్తిని సంపాదించుటకు వాడుకచేయుచున్నంతకాలము సంసార సుఖములను గోరినయె డల సంప్రాప్తించుట చాల యాలస్యమగును. అదియునుగాక మెస్మరిజమునం దాసక్తియును తగ్గిపోవును. ఇందుకతన దీనిని యభ్యాసము చేయుచున్నంతకాలమైనను సుఖమును గోరకుండుటయే యుత్తమము. అభ్యాసముచేయుచున్న దినములలో విశేషించి యితరులతో మాటలాడుట తగ్గించవలెను. “ముఖ్యమైన విషయములను గురించి మాటలాడుచుండుము. సాధ్యమైనంతవరకు యొంటరిగ ప్రయాణము జేయుచుండుము. అట్లు వీలులేనిచో ప్రాణమిత్రులతో మాత్రము షికారునకు వెళ్ళుచుండుము. మీగ్రామమునకుగాని పట్టణమునకు గాని నీకేదిక్కు నకు వెళ్ళుటకిష్టముండునో యాదిక్కునకే షికారునకు వెళ్ళుచుండుము. ఒంటరిగాబోవుచున్నపుడు మెల్లగా గాలినిపీల్చి నిలుపగలిగినంతసేపు నిల్పి మెల్లగా బయటకు విడిచిపెట్టుము. నడచునప్పుడు వేయగలిగినంత యంగ వేయుచుండుము. నడచునప్పు డెన్నడును సంగీతము పాడకుము'. నడుమునువంచి నడువకుము." పైన జెప్పినవిధమున కొంతదవ్వునడచి నిర్జనప్రదేశమున గాలికెదురుగా కూర్చుండుము. గాలి కదలకయుండినయెడల నాగ్నేయమూలముఖము గూరుచుండుము. అట్లుగూరుచుండినపుడు నీరొమ్మును బాగుగ ముందరికి విరిచి పిమ్మట మెల్లగా గాలిని లోనికి పీల్చుము. నీవాపగలిగినంతసేపుంచి మెల్లగా వదలివేయుచు నిశ్చలమనస్సుగలవాడవై సుమారిరువదియారుపర్యాయములు ప్రతిదినమును జేయుచుండుము. ఇట్లు మండలదినము లాచరించిన నీ మనంబున కొక యుత్సాహమును, ధైర్యమును బొడముచుం డును. మండలాంతమున పరిశుభ్రమగు యద్దము నొకదానిని దెప్పించి నీప్రతిబింబమందుజూచుచు “ఆహా ! యేమి నారూపలావణ్యము? నాకన్న యందముగ నుండువారలెవరు? నా భాగ్యమేమని చెప్పవచ్చును” అని నీలోనీవొక గదిలోనికి ప్రవేశించి యనుకొనుచుండుము. ఇట్లు పదునైదుదినము లభ్యాసము చేసిన తదనంతరము నీ దేహబలమునందును రూపలావణ్యమునందును తారతమ్యత నీకే తెలియునుగాక.

రూపాయిని చరచర ప్రాకివచ్చునట్లు చేయగలుగుదునా లేదా యని ప్రశ్నించుకొన్నప్పుడు నీవద్దనుండు పెన్సలు నొక దానిని నున్నని స్తలమునందుబెట్టి దానికెదురుగా సుమారిరువది యంగుళముల దూరమున గూరుచుండి కదలిరమ్మని నీమనోశక్తి నుపయోగించుము. అప్పుడు పెన్సిలు చక్రము దొర్లినట్లు దొర్లుచు నీసామీప్యమునకు వచ్చును. అట్లు రానిచో నీవింకను కొన్నాళ్ళు సాధనము (practice) చేయవలసి యుండును. మరల కొన్నాళ్ళు సాధనముచేసిన పిమ్మట తప్పక కదలివచ్చును. ఇటువంటి యభ్యాసమును చేయువారు ముప్పదియైదు సంవత్సరములకు లోపువారైనచో త్వరలో శక్తిని సంపాదింపగలవారగుదురు. ఏవస్తువునైన కదలివచ్చునట్లు జేయదలచిన యెడల నావస్తువుయొక్క బరువంతయు ( Centre of gravity ) నేస్తలము నందుండునో యాచుక్కవంక నీదృష్టిని నిల్పి కదలిరమ్మని మనోశక్తి యుపయోగించుము. నీమనోశక్తి నెంతటిశక్తితో (Force) ప్రయోగింతువో యంతటిత్వరలో గంతులువైచుచు నడచుచుండును. ప్ర తివారద్భుతపడుదురు. ఇటువంటి చిత్రపుపనులను జూచినవారందరును నీకు మిత్రులగుదురు. నీవు రూపాయి నెట్లు నడిపించితివని నిన్నెవరయిన యడిగినయెడ నేమియునుదాచక యెల్లయును తెల్లంబుగజెప్పి యతనినిసైతము మనోశక్తిని సంపాదింప ప్రోత్సాహమును జేయుము. ఇట్లు నన్నడిగినవారి నందరను మెస్మరిజమను యీమనోశక్తిని సుపాదించుటకు పలుమారు ప్రోత్సాహమును జేసియుంటిని. తత్కారణమున నాకు మిత్రులగువారందరును సాధారణముగ మెస్మరిజము నభ్యాసము చేయుచుండినవారైరి.

రూపాయిని గంతులువేయించు విధము

రూపాయియొక్క మధ్యభాగమున జూచుచు “గంతులువేయుచు కదలిరమ్ము" అని నీమెస్మరిజ ముపయోగించుము. అప్పుడు రూపాయి గంతులువైచుచు నీవద్దకు పరుగెత్తుకొని వచ్చును. లేక రూపాయిని జరిగివచ్చునట్లు జేయవలెనన్న యంచును చూచుచు "కదలిరమ్ము" అని మనోశక్తితో యనుకొన్నమాత్రమున జరిగిజరిగి నీయొద్దకు నెమ్మది నెమ్మదిగా వచ్చుచుండుట ప్రతివారునుచూచి మిక్కిలి యాశ్చర్య మొందెదరు. అట్లు రూపాయిని నడపించుచున్న సమయమునందు దీపకాంతిగాని మరెట్టికాంతిగాని నీకంటికి తగిలినయెడ నీశక్తి త్వరలో ప్రవేశించి రూపాయి కదలజేయలేదు గావున నీకంటి కెవ్విధమైన కాంతిగాని తగులకుండునట్లు జేసికొని రూపాయిని నడపించుటకై ప్రయత్నము జేయుచుండుము. అట్లు జేయుచుండిన నీవు ప్రతిపర్యాయమును నడిపించగలవాడవగుదువు.

చదువరులారా! మీలోనెవ్వరైన బజారున బోవుచున్నప్పుడు కుక్కలరచుచు గందరగోళమును జేయుచున్న యెడల మీమనోశక్తి యనునది వానినన్నిటి నఱవకుండగ జేయగలదు. ఎట్లన అఱచుచున్న కుక్కలనుచూచి “ఓకుక్కలారా, మీకఱచుటకు శక్తిలేదు, నోరుమూసికొని యూరకొనుడు” అని నీశక్తి నుపయోగించిన తక్షణమే వానగురిసి చల్లారినట్లు నిశ్శబ్దముగా నుండును.

చేతిని వంచలేకుండ జేయుట.

ఒకనినిబిలిచి యాతనిచేయిని చాచుమనిచెప్పి పిమ్మట నీదృష్టిని ప్రయోగించుచు మనోదృఢముతో “నీచేయిని వంచజాలపు, నీచేయియందు రక్తము ప్రవహించుచుండుట లేదు. నరములు బలహీనముగ నున్నవి. నీవు చేయిని వంచగలవని నేననినదాక నీకు వంచుటకు శక్తిలేదు” అని యనుకొనుచు చల్లగా చేయిపై యూదుచుండుము. అయిదారు నిమిషము లిట్లుజేసిన తరువాత చేయినివంచమని యడుగుము. పిమ్మట వాడట్లుచేయుట కశక్తుడగును. అదంతయును నీమనోశక్తివలననే జరుగుచున్నది.

ఎవరైన నిద్రబోపుచున్న సమయమున నిద్రనుండి మేల్కొన జేయవలెనన్న యాతని కనుబొమలమధ్య నీదృష్టి ను పయోగించుచు “లెమ్ము పెద్దమ్మవారు నిన్ను విడచిపోవుచున్నది. నీకిక నిద్రరాదు మేలుకొనుము" అని నీమనోశక్తి నుపయోగించుచు మెల్లగానూదుము. అంతట నిద్రబోపువాడు కొట్టిపిలిచినవానివలె చప్పున మేల్కొనును.

కోడిపుంజును నిద్రబుచ్చుట.

కోడిపుంజు నొకదానిని దెచ్చి దానిమెడనువంచి రెక్కలసందునబెట్టి కొంచముసేపు పట్టుకొని “నీకు నిద్రవచ్చుగాక” అని దృఢముగా తలంచుచు దానివీపుమీద నీనోటితో చల్లగా యూదుము. ఇట్లుజేసిన యైదారునిమిషములకా కోడిపుంజు నిలుచుండియే నిదురపోవుచుండును.

తేలుబాధ మాన్పుట.

ఎవరినైనను తేలుకుట్టినయెడల కుట్టినచోటున నీదృష్టిని నిలిపి నీమనోశక్తి నీక్రిందివిధమున నుపయోగించుము "తేలువిషము నిన్నేమియు చేయజాలదు. ఒకవేళ నరములద్వారా బాధ పైకెక్కినను తప్పక దిగును" అని నీమనసునందనుకొనుచు బాధగలచోటున చల్లగా సూదుచు చేతితో చుఱచుచుండుము. ఈవిధముగ పెక్కు విధములగు బాధలను కడు సులభముగ నీమనోశక్తివలన కుదర్పగలుగుదువు.

స్నేహమును గలుపుట.

మీగ్రామమునం దిద్దరు బలవంతు లొకరికొకరికి సరి పడక విరోధముగా నుండిరనుకొనుము. వారిద్ద రేకీభవించినగాని మీగ్రామమునందు నెమ్మదిగలుగదనుకొనుము అట్టి సమయమున నీవేకాంతస్తలమునకుబోయి వారిద్దరిని మనసు నందు తలంచుచు “మీరిద్దరొకరినొకరిని ప్రేమించుకొనుచుందురుగాక. నేటినుండియు నామనోశక్తి ప్రభావముచే మీకిద్దర కమితమిత్రత్వము గలుగును” అని ప్రతిదినమును సుమారొక వారమువరకు నీమనోశక్తి నుపయోగించిన వారిద్దరును మిత్రులగుదురు. అందువల్ల మీగ్రామవాసుల కెంతయు మహోపకార మొనర్చినవాడి వగుదువు గాన చదువరులారా! సమస్త ప్రాణికోటులయందును మనుజుడే యుత్తముడని పరిగణింపబడినందులకు నెద్దియైన నొకపెద్దమహిమను పిన్న పెద్దలందరు బుద్ధికుశలతగలవారై సంపాదింపకుండిన మానవజాతికంతకును మిక్కిలి యవమానకరమైన విషయమైయున్నది. ప్రపంచమునందు ప్రతివారికిని మిక్కిలి సహాయపడునది మనోశక్తి దక్క రెండవదిగాదని చదువరులకెల్లరకును తెలియవచ్చుచున్నది. మనపూర్వీకులెల్లరును యిటువంటి మనోశక్తి ప్రభావముచే మిక్కిలి యద్భుతకార్యములను పెక్కింటిని జేసియున్నారు. అట్టి మహానుభావులగువారిరి రక్తమునుండి జననమంది మిక్కిలి యాదరింపబడిన మనోశక్తిని సంపాదించుటకు ప్రయత్నింపకుండ సోమరులవలె కాలమును వృధాబుచ్చు నీచుల నితరదేశస్థు లెట్లు గౌరవింతురు? వారివల్ల గౌరవమును పొందుటట్లుంచి తమదేశమునందు జనించువారి నెల్లరను సోమరిపోతులను జేయుచున్నారే? ఎంతటి ఘోరపాపము! గాన సోదరులారా! యికనైన మీకుమారులను బంధుమిత్రులగు పిన్న వయసువారినెల్లరను మనోశక్తిని సంపాదింప ప్రోత్సాహము జేయుచుందురని నేను మిక్కిలి గట్టిగా నమ్మియున్నాను. ఈమనోశక్తిని సంపాదించుటకు పిన్న వయస్సుగానుండినయెడల పట్టుబడుట మిక్కిలి సులభముగా నుండును. కాన బాలురగు వారి నెల్లరను విశేషించి ప్రోత్సాహము జేయుచుందురనియును, మనదేశమంతయు నిట్టి మహత్తుగలిగిన మనోశక్తియెల్లయెడల నల్లుకొని మనదేశీయులనెల్లర నున్నతదశకు మెల్లగ దీసికొనివచ్చి చల్లగ విడిపించునని నాయుల్లమునుం డెల్లపుడును వెల్లువగా సంతోషం బెల్లయెడలకు నల్లుకొనుచున్నది.


సమాప్తము.

This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.

"https://te.wikisource.org/w/index.php?title=మనోశక్తి&oldid=353985" నుండి వెలికితీశారు