ఈ పాటను భీష్మ (1962) చిత్రంకోసం ఆరుద్ర రచించారు. పాడినవారు పి.బి.శ్రీనివాస్, పి.సుశీల. సంగీతం ఎస్.రాజేశ్వరరావు


మనసులోని కోరికా తెలుసు నీకు ప్రేమికా
మనసులోని కోరికా, తెలుసు ప్రేమ మాలికా

ప్రియుని పటము పాడుటా
వింత వింత వేడుకా
పడతి చేతి మహిమ వలన
పటము పాడె గీతికా

చెలియ నీదు ప్రేమయే
విలువలేని కానుకా
మనసు తీర హాయి, హాయి
మన సుధా కథానిక