భీమేశ్వరపురాణము/షష్ఠాశ్వాసము
శ్రీరస్తు
శ్రీ రామాయనమః
శ్రీమహా గణాధిపతయేనమః
శ్రీ మాణిక్యాంబాసమేత శ్రీ భీమేశ్వరస్వామినేనమః
శ్రీ భీమేశ్వరపురాణము
షష్ఠాశ్వాసము
| శ్రీమహిత దక్షవాటీ | 1 |
వ. | అక్కథకుండు శౌనకాది మహామునుల కిట్లని చెప్పందొడంగె. | 2 |
సీ. | వినుఁడు సద్యోముక్తివిభవైకకారణం, బామ్నాయవిద్యారహస్యపథము | |
గీ. | పశుపతికి నిట్టులని విన్నపంబు చేసె, దేవదేవ! జగన్నాథ దివిజవంద్య! | 3 |
వ. | సద్యోముక్తిదం బెయ్యది? పుణ్యస్థానం బెయ్యది? యానతిం డనుటయు జగద్ధితార్థంబుగా నా వృషభధ్వజుండు భవాని నభినందించి యిట్లని యానతిచ్చె. | 4 |
క. | సద్యోముక్తికరంబును, సద్యస్సౌఖ్యప్రదంబు సద్యోదురిత | 5 |
సీ. | దర్శనమాత్ర నేదైవతగ్రామణి, జనులకు భోగమోక్షము లొసంగు | |
గీ. | విశ్వపతి భీమనాథనామేశ్వరుండు, శివుఁ డతండు వసించు నేక్షేత్రసీమ | |
వ. | తొల్లి కృతయుగంబున నమ్మహాస్థానంబున సంశ్రితవ్రతులును ద్రికాలవిహితాచరితస్నానులును భస్మోద్ధూళితసర్వాంగులును రుద్రాక్షమాలికాభరణులును జటా | |
| వల్కలధారులను శంభులింగార్చపరాయణులును నగుమహామునులు పెద్దకాలంబు ఘోరతపంబుఁ జేసిన నత్తపోధనుల యుత్తమతపంబునకుఁ జిత్తంబునఁ బ్రసాదంబు వహించి మంకణసంకల్పకల్పవృక్షం బగునయ్యహికంకణుండు ప్రత్యక్షంబైన నద్దక్షవాటికాధ్యక్షుని సాక్షాత్కారంబు వీక్షించి పరమర్షులు హర్షోత్కర్షంబునొంది యందంద దండప్రణామంబు లాచరించి హస్తారవిందంబులు మొగిడ్చి యిట్లనిరి. | 7 |
గీ. | ఓసదాశివ! యోదేవ! యోమహాత్మ! | 8 |
క. | సద్యోభోగశ్రీయును, సద్యఃకైవల్యవిభవసౌలభ్యంబు | 9 |
చ. | అనఁగఁ బ్రహృష్టచిత్తుఁడయి యర్ధశశాంకకిరీటుఁ డప్పు డి | 10 |
గీ. | ఎల్లకాలంబు నుండెద నిచట నేను, మొదలి మామామయారామపదమునందు | 11 |
సీ. | అగ్రజుండైనను నంత్యజుండైనను, బూఁబోఁడియైనను బురుషుఁడైనఁ | |
తే. | గీటకంబైన బకమైనఁ గ్రిమియునైనఁ, బాదపంబైనఁ దృణమైనఁ బ్రాణరహిత | 12 |
ఉ. | ప్రాణవియోగవేళ నరపక్షిమృగాళికి దక్షవాటికా | 13 |
తే. | తూర్పుదిశకును లవణపాథోధి సీమ, దక్షిణమునకు వృధ్ధగౌతమియె సీమ | 14 |
వ. | ఈ క్రమంబున సీమావిభాగంబు లేర్పడిన భీమమండలంబు భుక్తిముక్తిప్రదంబు. వహ్నిసంయోగంబున శుష్కకాష్ఠంబులు హరణంబైనచందంబున దర్శనమా | |
| త్రంబునం బాపౌఘంబును నదిభస్మీభావంబునుంబొందింపంజాలును. ప్రాణవియోగ కాలంబున జంతుకోటికిం గాలకంధరుండు తారకబ్రహ్మవిద్యారహస్యార్థం బుపదేశించును. కానిమాత్రంబైన ధనంబును బిడికెఁడు ధాన్యం బైన నిచ్చుదాతకు ననంతఫలంబు చెందు. శ్రద్ధాసమన్వితంబుగా శివయోగికిం బెట్టిన భోజనంబును నిచ్చిన వస్త్రంబును భవబంధవిధ్వంసనంబులు. జపహోమదానతపోధ్యానసమాధియోగంబులు గలుగు పుణ్యులకుం గొలఁది లేదు. హిమవత్పర్వతంబునఁ గోటివర్షంబులు తపంబుచేసినఫలంబు ఘటికార్ధోపవాసమాత్రంబునను, వారణాసియందుఁ గోటిబ్రాహ్మణులకు భోజనంబుపెట్టినఫలంబు భిక్షునకు నొక్కభిక్ష యిడినమాత్రంబునను, గురుక్షేత్రంబున సూర్యగ్రహణకాలంబునం దులాపురుషదానంబు చేసినఫలంబు నొక్కభూసురాతి కథితి కభ్యాగతికి శివయోగులకుఁ బెట్టినభోజనమాత్రంబునను, దక్షవాటికాపుణ్యక్షేత్రంబున సంభవించు. | 15 |
తే. | భీమలింగంబు త్రిభువనస్వామి యెపుడు, సన్నిధానంబుఁ గైకొనియున్నకతనఁ | 16 |
తే. | ఘనత శివగంగయును రుద్రగంగ యనఁగఁ, గూపములు రెండు దక్షవాటీపురమున | 17 |
ఆ. | అని వరంబు లిచ్చి యంతర్హితుం డయ్యె, నిందుమౌళి ఋషుల కెట్టయెదుట | 18 |
సీ. | పంచాక్షరీమంత్రపారాయణంబులు, పఠియించుచును స్పష్టఫణితితోడ | |
తే. | మెఱుఁగు మేఱచినపగిదిని మెఱయ దీప్తి, నద్భుతంబును బొందిరి యపుడు వారు | 19 |
వ. | అనంతరం బమ్మునీశ్వరులు నియమశ్రద్ధాతాత్పర్యంబు లొప్ప సప్తర్షిసమానీతయగు గోదావరిఁ గనుంగొని పరమానందంబున. | 20 |
శ్లో. | దేవి! శంభోర్జటాజూటనివాసిని! శివప్రియే! | 21 |
శ్లో. | ఏకేనైనస్వరూపేణ, భీమనాథస్యసన్నిధౌ | 22 |
క. | అని సంస్తుతించి యందఱు, మునిగణములు మంకణముని మునుకొని వికచ | 23 |
వ. | అఘమర్షణస్నానమాడిరి. | 24 |
తే. | అఖిలకాలంబు నొకప్రవాహంబుతోడ, భీమలింగంబు సేవించి బెరసి ప్రేమ | 25 |
తే. | భీమలింగంబుమ్రోల గాంభీర్యసలిల, పూరమగుచుండు నేకాలమును సమృద్ధి | 26 |
ఉ. | ఏట మునింగి లేచి పరమేశ్వరుమందిరసౌధవాటికా | 27 |
చ. | కొడుకులు నీవు నేఁ బ్రమథకోటి విరించి సరోజలోచనుం | 28 |
క. | సప్తాశ్వసంప్రతిష్ఠుని, సప్తమునీశ్వరప్రధానసంస్థితు నంత | 29 |
వ. | భీమనాథమహాస్థానంబు సర్వకామార్థసాధకంబు; సంవత్సరంబును గొలువ ముక్తిప్రదాయకంబు. సూర్యుండు మేషరాశియందుఁ జిత్రానక్షత్రంబున వసియించి యుండు చైత్రమాసంబున సప్తగోదావరంబునఁ బ్రాతస్స్నానంబుఁ జేసి యథాశక్తి విఫ్రులకుఁ దగినదానంబు లొసఁగి, భీమనాథుండ నగునాకు నమస్కారాభిషేకపూజానైవేద్యంబు లాచరించి నరుండు సక్తభోజి యయ్యును నట్లె భానుఁడు వృషభరాశియందు విశాఖానక్షత్రంబు నాశ్రయించియుండు వైశాఖమాసంబునను, బ్రభాకరుండు మిథునంబునందు జ్యేష్ఠానక్షత్రంబునందు నిలిచియుండు జ్యేష్ఠమాసంబునను, రవి కర్కాటకంబున భగదైవతంబైన నక్షత్రంబున నాషాఢమాసంబునఁ గూడియుండఁగను, శ్రావణమాసంబున శ్రవణనక్షత్రంబున సింహరాశియందు మార్తాండుఁడు నిలిచియుండఁగను, భాద్రపదమాసంబునఁ బూర్వాభాద్రానక్షత్రమునఁ గన్యారాశియందు భానుం డుండఁగను, నాశ్వయుజమాసమున నశ్వినీనక్షత్రంబునందుఁ దులారాశియందుఁ జిత్రభానుండు నిలిచియుండఁగను, గార్తికమాసంబునఁ గృత్తికానక్షత్రంబున వృశ్చికరాశిని సూర్యుం డుండఁగను, మార్గశీర్షమాసంబున ధనూరాశియందు మృగశిరానక్షత్రంబున నభోమణియుండఁగను, బుష్యమాసంబునఁ బుష్యనక్షత్రంబున మకరరాశియందు లోకబాంధవుఁ డుండఁగను, మాఘమాసంబున మఘానక్షతంబునఁ గుంభరాశి | |
| యందు మిహిరుం డుండఁగను, ఫాల్గునమాసంబున నుత్తరానక్షత్రంబున మీనరాశినిం దినకరుం డుండఁగను, బూర్వోక్తప్రకారంబున శైవవ్రతాచారంబులు నడపిన మనుజుండు, పాతకంబులవలన విముక్తుండగును; వెండియు యజ్ఞతీర్థం బను తటాకంబు సకలతీర్థరాజంబు. | 30 |
సీ. | మేషరాశిస్థుఁడై మిహిరుఁ డుండగఁ బర్వ, తిథి స్నాతు డగుచుఁ దత్తీర్థమందుఁ | |
తే. | దప్ప కాషాఢసితచతుర్దశిని సింహ, కన్యలను సూర్యసంగమకాలమునను | 31 |
తే. | భానుమంతుండు తులమీఁదఁ బవ్వళింప, యజ్ఞకుండతటాకంబునందుఁ గ్రుంకి | 32 |
క. | ఆదిత్యుఁడు వృశ్చికమునఁ, బాదం బిడినట్టివేళఁ బావనతిథి సూ | 33 |
తే. | ఇనుఁడు కోదండరాశియం దెక్కియుండ, రుద్రనక్షత్రమునను మర్త్యుండు నియతి | 34 |
తే. | మకరరాశిస్థుఁడై భానుమంతుఁ డుండఁ | 35 |
క. | మాఘమునఁ గుంభరాశి ని, దాఘద్యుతి యుండ సప్తతాపపవాహి | 36 |
తే. | ఫాల్గునంబున నుత్తరాఫల్గునినిని, మీనరాశిని సూర్యుండు మెలఁగుచుండ | 37 |
మ. | ప్రతివేళం దగ మర్త్యుఁ డీక్రియం జరింపంబాడి యంగీకృత | 38 |
క. | కనకం బణుమాత్రంబై, నను దక్షారామనగర నైకటికమహా | 39 |
తే. | వర్తనం బెల్ల శంభుసేవావ్రతంబు, మాలలెల్లఁ బంచాక్షరీమంత్రరాశి | 40 |
వ. | దక్షారామమాహాత్మ్యం బవాఙ్మానసగోచరంబు. భీమనాథ మహాదేవ దివ్యశ్రీపాదపద్మసేవావ్రతంబువలన నెట్టి పాపకర్ముండును భోగమోక్షపదవీసామ్రాజ్యపట్టాభిషేకమహాదివ్యపదవి నొందు. సర్వశాస్త్రసిద్ధాంతమతాంతరంబులకు సమ్మతంబైన యిమ్మహాస్థానం బేకవటీభూతంబు సద్యోముక్తిప్రదంబు సద్యఃపరిజ్ఞానసదనంబు సద్యఃకళాసమృద్ధిప్రదంబై యుండునని దయార్ద్రమానసుండై వృషభధ్వజుం డాదేవి నుద్దేశించి పార్వతీ నీవడిగినయర్థంబు సర్వంబు సమర్థించితి. చిత్తంబున నవధాసంబు సేయుమనినం పతికిఁ గరంబులు మొగిడిచి మ్రొక్కి భవాని హర్షోత్కర్షంబు నొందె. నీరహస్యం బేనును గురుముఖంబున నెఱిఁగి ప్రసంగవశంబునం బ్రహ్మవేదులగు మీకు నుపదేశించితి. | 41 |
శా. | సద్యోముక్తిప్రదంబు దక్షనగరీస్థానంబు విశ్వేశ్వరుం | 42 |
వ. | మఱియు భీమలింగమాహాత్మ్యంబు భవకలుషనాశనంబు బ్రహ్మవిష్ణుపురందరాదులకుఁ గల్పకోటిశతంబులనైన వచియింపనలవిగాదు. అయినను నా నేర్చువిధంబున నింక వర్ణించెద. | 43 |
తే. | భువనములమూఁటియందును బొబ్బవిడుచు, నంతదాఁకనె యితరతీర్థాదులెల్ల | 44 |
సీ. | దక్షుండు పొట్టేలితల ధరించినయప్డు, భారతి ముక్కు గోల్పడినయపుడు | |
తే. | ప్రాణభయమున ముక్తిసంభ్రమము మెఱయ | 45 |
సీ. | దుగ్ధాబ్ధిమంథనోద్భూతహాలాహల, జ్వలనమేచకకంఠ శరణు శరణు | |
తే. | శరణు ఖేచరదేవతాసార్వభౌమ, శరణు త్రైలోక్యసతతరక్షాధురీణ | 46 |
క. | హర! సర్గస్థితినాశన, కర! సంసారాబ్ధితరణఘనతరచరణాం | 47 |
క. | అపరాధశతము లోఁగొను, మపరిమితకృపావిధేయ యార్తశరణ్యా | 48 |
తే. | సుప్రకాశుండవగు మునిశ్వప్రకాశ, శర్వ! సర్వేశ! త్రిపురభంజన! గిరీశ! | 49 |
ఉ. | సన్నిధిచేసి వారలకు శాక్కరకేతుఁడు సుప్రసన్నుఁడై | 50 |
క. | ఈ దక్షారామమునకు, మేదినిఁగల తీర్థకోటి మిగులకయుండున్ | 51 |
తే. | దక్షుఁ గీర్తించి యాచంద్రతారకంబు, దక్షవాటిక సకలతీర్థంబులందు | 52 |
సీ. | యజ్ఞకుండంబునయందుఁ దీర్థంబాడుఁ, బాయ కెవ్వండు నా భక్తుఁ డతఁడు | |
తే. | తెరువునడిచెడువారికి నిరవు చేసి, ధాన్యములు నెయ్యి నూనె వస్త్రములు లవణ | 53 |
క. | మాటలు వేయియు నేటికిఁ, జాటించెన్ శివుఁడు వేడ్క జగములలో ము | 54 |
తే. | బ్రహ్మవిద్వాంసులకుఁ బాశుపతియతులకుఁ, బెట్టు ధనధాన్యవస్త్రాన్నభిక్ష మెవ్వఁ | 55 |
తే. | చప్పరంబొండె గుడియొండె జవికయొండెఁ | 56 |
వ. | తొల్లి జలంధరగంధగజపుండరీకాంధకాసురాదు లగుమహాదెత్యులు భువనత్రయం బాక్రమించిన శక్రుండు భయభ్రాంతుండై దేవగణదేవమునిసిద్ధసాధ్యవిద్యాధరోరగగరుడగంధర్వకిన్నరకింపురుషాదులం గూర్చుకొని బ్రహ్మకు విన్నవించిన విరించియు వారిం దోడ్కొని పాలమున్నీటిలో ఫణిరాజతల్పంబుపైఁ బవ్వళించిన పాంచజన్యధరునకు విన్నపంబు చేసి సంస్తుతించినఁ గైటభారి హాటకగర్భుని విన్నపం బవధరించి చింతాభరంబున నొక్కింతదడ వూరకుండి పుండరీకాసనుం జూచి యిట్లనియె. | 57 |
తే. | వీరభద్రుండు చక్రంబు విఱిచి దక్ష | 58 |
ఉ. | కోపము చిచ్చునం బడిన కూరిమితల్లి ఋణంబు దీఱ ను | 59 |
తే. | తెగువ దక్షునికంఠంబు ద్రెవ్వనేసి, వ్రేల్చెఁ దల వధ్వరాగ్నిని వీరభద్రుఁ | 60 |
వ. | అప్పు డవ్వీరభద్రుని తేజోవిశేషంబును గనుఁగొనఁ గన్నులు మిఱుమిట్లు గొన వెఱచఱచి యెలుంగు డించి తొలంగితి నాఁటనుండియు. | 61 |
శా. | పట్టంగైదువులేక విన్న నయి నా బాహార్గళుల్ చూడుఁడా | 62 |
వ. | అని పలికి నలినసంభవేంద్రాదు లగునిర్జరులం గూడి సరోరుహాక్షుండు దక్షారామంబునకు వచ్చి శివగంగాకూపంబునఁ ద్రిషవణస్నానంబు చేసి భస్మోద్ధూతగాత్రుండును, ద్రిపుండ్రాంకితమస్తకుండును, రుద్రాక్షమాలికాధరుండును, జటావల్కలసంయుతుండునునై నిత్యంబును సహస్రపద్మంబులఁ బూజఁ గావించుచు భీమనాథేశ్వరేశ్వరు సేవించుచుండె నంతఁ గొంతకాలంబునకు. | 63 |
క. | ఈభంగి వేయుదమ్ముల, నాభుజగాభరణు నెప్పు డర్చన సేయన్ | 64 |
తే. | తొంబనూరును దొంబదితొమ్మిదియును | 65 |
చ. | కటకకలాపసంఘటితకమ్రమణిద్యుతిపాటవంబునం | 66 |
క. | కైటభవిరోధిభక్తిర, సాటోపం బెసఁగ వనరుహాలోకన ము | 67 |
మ. | నిడువాలుం గుడికన్ను పాదములపై నేమంబుతోఁ బెట్ట న | 68 |
తే. | భీమనాథుఁడు త్రిభువనస్వామి యిచ్చె, నస్త్రకులదైవమననొప్పు నాయుధంబు | 69 |
వ. | ఇవ్విధంబుస శ్రీభీమనాధ మహాదేవునివలనం జగద్విజయం బగుచక్రాయుధంబు వడసి కోటిసహస్రమార్తాండమండలతేజఃప్రభాప్రభావభాసమానం బైన యారథాంగంబున మున్ను చెప్పంబడ్డ విబుధవిరోధుల ఖండించి యింద్రాదిప్రముఖనిఖలబర్హిర్ముఖవ్రాతంబునకుఁ జేతఃప్రమోదం బాపాదించె నిది యమ్మహాదేవుని మహిమంబు. | 70 |
క. | శివగంగాజలముల నా, ప్లవనం బొనరించినట్టి పరమాత్ములు త | 71 |
తే. | మదనవిధ్వంసితిరిచుట్టుమాలెయందు, దక్షిణపుదిక్కునందు మాధవునిఁ గాంచి | 72 |
తే. | అష్టమీభానువాసరంబందు నొండె, నొండెనేని చతుర్దశి నిండుభక్తి | 73 |
క. | తాండవభవువీక్షణమున, ఖండేందుశిఖావతంసు కట్టెదురుగఁ దా | 74 |
సీ. | భూర్భువస్వర్లోకములు మూఁడు భేదించి, బ్రహ్మాండభాండకర్పరము దాఁకఁ | |
| నిరవకాశంబుగా నిత్యసన్నిహితంబు, నుడులింగమూర్తితో నుబ్బియుబ్బి | |
తే. | భయమునుం బొంది దేవతల్ ప్రస్తుతించి, యయ్య నీరూప మింతింత యనఁగ రాదు | 75 |
వ. | అనినం గరుణాసామ్రాజ్యపట్టాభిషిక్తుం డగు నాజగజట్టివేల్పు బ్రహ్మాండగోళంబునకు మిక్కుటంబుగాఁ బెరిఁగిన దేహంబు బొట్టి చేసి తీరుచుట్టుమాలికలోన గౌరీ, జనార్దన, రుద్ర, కేశవ, వినాయక, దుర్గాతాండవేశ్వర, నృత్యభైరవులను దేవతాసప్తకంబు పరివేష్టింప, సకలలోకానందకరపరదారగమనపాపహరేశ్వరులు నైఋతిభాగంబున నధివసింప, నంతర్గర్భగృహంబులోపల మాణిక్యాదేవిసహితుండై సలిలనిధివృద్ధగంగాకౌంతేయసరిత్తుల్యభాగాహేలానదీసప్తగోదావరమాతృకాపరివృతమండలంబున మధ్యమలోకభాగధేయంబును, విబుధగంధర్వపతాకావేదియుఁ, బరిసరోద్యానవాటికాసరసకాసారకఠోరకుహళీపాళికాకుసుమధూళీమధూళికాసౌరభాసారసంవాసిత దశదిశాముఖంబును, మఖకుండితటాకసముద్ధండపుండరీకషండమకరందబిందుగండూషావ్యగ్రసముసముదగ్రమధుపమండవాహంకారఝంకారకోలాహల కరంబితమకరధ్వజభుజాదండమండలీకృత కుసుమకోదండశింజనీఠంకారంబును, నాఖండలాదిదిక్పాలకభరితకలితగోపురప్రాంగణంబును, బాదుకాఖడ్గఘుటికారసరసాయనిమూలికాంజనాకర్షణాదృశ్యాది విద్యాసిద్ధిక్షేత్రంబును, నత్ర్యాత్రేయాగస్త్యహరితాంబరీషాసితభార్గవ పరాశర పారాశర్య మాండవ్య మార్కండేయ మౌద్గల్య మంకణ శౌనక శాండిల్య మందపాల వత్స వసిష్ఠ వాధూలసవాలఖిల్య కౌండిన్య కాశ్యపకణ్య గాలవ గాధి గార్గ్య ప్రముఖ వాలఖిల్యాద్యష్టాశీతిసహస్రసంయమసమాకీర్ణంబును, గర్ణికారాంబికాకరకమలపుటఘటితకనత్కనకమణిమయడమరుఢమఢమధ్వానపర్జన్యసముజ్జృంభిత గుహశిఖండితాండవంబును మార్కండేశ్వరకుండలాముఖసంవేద్యాంతర్వేదిచాళుక్య భీమేశ్వరప్రధాననానావిధశాఖోపశాఖాతీర్థసంబాధసంభరితంబును నై యఖిలభువనభవనాభిరామంబైన దక్షారామంబును గైలాసమేరుమందరంబులకంటెను, గాంచీ చిదంబర కాళహస్తి కాశి శ్రీశైలాది మహాస్థానంబులకంటెను, సేతు కేదారంబులకంటెను, నతిశయంబుగాఁ జేసి నాక్షేత్రంబునుమరగి గరళకూటకృపీటభవజ్వాలానష్టంభంబు సంస్తంభించి, త్రిపురదైతేయమదవతిగండభాగమకరికాపత్రభంగంబులు దొలంగించి భీమలింగంబు సర్వమంగళాదేవియుం దానును లోకరక్షణార్థంబుగా నధిష్ఠించియుండును. | 76 |
తే. | దేవదర్శనమాత్ర సంధిల్లు భుక్తి, కొందఱకు దక్షవాటికాక్షోణియందు | 77 |
తే. | గీతవాదిత్రనృత్యంబు కేవలంబు, శంభునకు సార్వకాలంబు సంభ్రమింప | 78 |
శా. | ఆవంశంబున సానికూఁతులయి దివ్యస్త్రీలు దుగ్ధాబ్ధిమ | 79 |
వ. | మఱియు మహనీయ దేవగంధర్వాస్సరవేశ్యాజాతిసంజాతకాంతాచికురతిమిరాంగసుమంగళ విభావరీలలాటశశికళావిలాసద్వితీయభ్రూలతాలాసికాలాస్యలలితరంగభూమియు, నయనశంబరానుబంధనవకందర్పపతాకయు, నధరబంధూకకుసుమయు, వికాసవిభ్రమశరద్వేళాకంబుకమనీయకంఠయు, బిబ్బోకసరిదంబుధరవేణియుఁ, బృథులతాచక్రవాకయుఁ, గరపల్లవస్ఫురణపర్యాయవల్లీమతల్లీపన్నగపరిషత్తునుం బోలెఁ బ్రకటితవిలాసమన్మథలీలయుంబోలె, రతిసుఖసంపత్సంపాదనలంపటకుముదినియుంబోలె, రాజానుకూలదర్శన కేశభరంబునఁ గృష్ణవదన, వచోమనోహరవశంబున మంజుఘోష, మధ్యంబున మండోదరి, యూరుయుగళంబున రంభ, కనకభూషణధారణంబున రుక్మిణి, సురతకళాకౌశలంబున దక్షిణ, తనువున భద్ర, పుష్పాస్త్రద్వితీయజన్మభూమి కారుణ్యవతి, తారుణ్యవతి, కాంతిమతి, కమనీయవతి, వినయవతి, విభ్రమవతి, విజ్ఞానవతి, వితీర్ణవతి, త్రపావతి, భూషణవతి, భూషణమరీచిజాలాకారవిగ్రహ యగుట విద్యుద్దండంబువలనను బ్రసవపరిమళహారిణి యగుటం బారిజాతకోరకంబులవలనను, నిశ్వాసామోదకారిణి యగుట | |
| అది గావున నుత్తమనాయికా నాయక గర్భజనిత లైన యాసానులు సానురాగంబున నీశానుని, భీమేశ్వరుని ఘుసృణముకుళితాపాంగంబులు కుంచితాకుంచితభూతంబులు విస్మయోత్పాదనతావకంబులు, ప్రసన్నంబులు, ప్రేమరసపూర్ణత్రపావృతారంభంబులు, నవలలితంబులు, పులకావళికారణంబులు, భావజగర్భితంబులు, విస్మృతనిమేషంబులు నైన వీక్షణంబులఁ దదీయలావణ్యపూరం బాస్వాదించువిధంబు నభిలషించుట దెల్పుచందంబున హృదయంబు నాకర్షించుచాడ్పునఁ జాఘరవ్యజనవీటికాకరండపాదుకాముకురదీపికాసంగీతనాట్యాద్యుపచారసేవావిశేషంబులఁ బ్రతిసంధ్యంబును బాల్యంకికాసేవాబహిర్విజయాది భోగావసరసమయంబున సేవించుచుండుదురు. | 80 |
తే. | దక్షవాటీపురీచతుర్ద్వారములను, భీమమండలికాపుణ్యభూమియందు | 81 |
వ. | ప్రార్థించి శ్రీ భీమేశ్వరమహాదేవునివలన నాత్మప్రతిష్ఠితశంభులింగంబులకును వరం బడిగిన నవ్విరూపాక్షుండు వారుకోరినట్ల భుక్తిముక్తిప్రదానసామర్థ్యంబులు, స్వలింగంబులకుఁ గలుగ ననుగ్రహించె. | 82 |
తే. | సప్తసింధువునకు భీమశంకరునకు, నడుమ నింద్రేశ్వరము పాపనాశనంబు | 83 |
క. | భీమయదేవుని దక్షిణ, భూమీభాగమున యజ్ఞపురుషేశ్వరది | 84 |
ఆ. | అగ్నికుండ మనఁగ నచ్చోట నున్నది, ధాత్రిభుక్తిముక్తిధాతునీవి | 85 |
తే. | కృత్తికాతారకంబులఁ గీలుకొన్న, దినమునం దగ్నికుండికాతీర్థ మాడి | 86 |
సీ. | అగ్నీశ్వరునిమ్రోల నగ్నికుండికకూప, తటదేశమున నుండు దక్షకుండి | |
తే. | నసితపక్షాష్టమీతిథియందు నొండె, మఱి చతుర్దశియం దొండె మహితబుద్ధిఁ | 87 |
వ. | ఆయుత్తరంబున వీరభద్రప్రతిష్ఠితంబు చెంగట నిఋతిలింగంబు భీమనాథేశ్వరునికిఁ బడమట వరుణప్రతిష్టితం బగు వరుణలింగంబు వరుణకుండంబునఁ దీర్థంబాడి వరుణనక్షత్రంబున వరుణేశ్వరదేవుని దర్శించిననరుండు భవబంధనంబులం | |
| బాయును; భీమేశ్వరు వాయువ్యదిగ్భాగంబున వాయుప్రతిష్ఠితం బగు వాయులింగం బుండు వాయుకుండంబున దీర్థంబాడి వాయులింగంబును సందర్శించిన నరుండు మోక్షలక్ష్మిం గూడు; సోమేశ్వరలింగంబు సోమప్రతిష్ఠితంబు, సోమనక్షత్రంబున సోమకుండంబునఁ దీర్థంబాడి సోమేశ్వరదేవుని దర్శించిన నరుండు భుక్తిముక్తిసంసిద్ధిం బొందు. | 88 |
తే. | బాదరాయణుఁ డత్యంతపరమనిష్ఠ, సప్తసింధుసమీపదేశంబునందుఁ | 89 |
క. | పంచాక్షరమంత్రమును జ, పించుచు సత్యవతిసుతుఁడు పెద్దయుఁగాలం | 90 |
వ. | ఒక్కనాఁ డమ్మహాదేవుండు త్రిగుణమూర్తులగు బ్రహ్మవిష్ణుమహేశానులచే సముపాస్యుం డగుచు బాదరాయణునకుఁ బ్రత్యక్షం బగుటయు. | 91 |
మ. | కురిసెం బువ్వులవాన మత్తమధులిట్కోలాహలాన్వీతమై | 92 |
క. | ఆడిరి యచ్చరలేమలు, పాడిరి గంధర్వపతులు పరమమునీంద్రుల్ | 93 |
క. | కొందఱు తాండవమాడిరి, కొందఱు పరిహాసకేలి గొఱలిరి మఱియుం | 94 |
వ. | వ్యాసర్షి కనుగ్రహం బొసఁగి యప్పరమేశ్వరుండు కూడినయశేషమునులను సర్వయోగీశ్వరులను సకలదేవతల నుద్దేశించి యిట్లని యానతిచ్చె. | 95 |
క. | ఈ యున్నవారలందఱు, నాయానతి వినుఁడు నెమ్మనంబులలోనం | 96 |
తే. | అర్కుఁ డెబ్భంగి నభమున కాభరణము, భువనముల కెల్ల నాభంగి భూషణంబు | 97 |
క. | త్రిభువనములయందును మా, కభిమతములు పెక్కులైన నారామము లం | 98 |
తే. | వినుఁడు సత్యంబు సత్యంబు వెండిసత్య, మాత్మలోన విచారించి యానతిత్తు | 99 |
గీ. | వాఁడిగోర్గొండిఁ గన్నులు దోఁడియైన, నడుగు లడిదంబుచేతఁ జక్కడచియైన | 100 |
క. | తిష్ఠన్మాత్రునకైన వ, సిష్టప్రతిమానుఁడైన శిష్ఠునకైనన్ | 101 |
ఆ. | బ్రహ్మహత్యమద్యపానంబు గురుతల్ప, గమన మాదిగాఁగఁ గలుగునట్టి | 102 |
వ. | అని యి ట్లర్ధేందుమౌళి యానతిచ్చి యంతర్ధానంబు చేసెఁ దదనంతరం బాహరివిరించిబురందరాదులగు బృందారకులును సనకసనందనసనత్కుమారసనత్సుజాతు లగు బ్రహ్మయోగీశ్వరులును, మార్కండేయ మందపాల మౌద్గల్యమాండవ్యమంకణాదు లగుమహామునులును, బాదరాయణు నభినందించుచు, నిజస్థానంబులకుం జనిరి. | 103 |
సీ. | సప్తగోదావరరస్నానంబు రామనా, థావలోకనము పిత్రార్చనంబు | |
తే. | సమయ మిది సర్వదేవతాసార్వభౌము, భుక్తిముక్తి ప్రదాయకు భువనభర్త | 104 |
మ. | పరదారేశ్వరకుంభసంభవవిభుల్ ప్రాగ్దిగ్విభాగంబులన్ | 105 |
సీ. | దక్షవాటీమహాస్థానంబులో లేని, యమరు లేస్థానంబునందు లేరు | |
తే. | దక్షవాటిక సకలతీర్థముల కిరవు, దక్షవాటిక సకలవిద్యలకు గరిడి | 106 |
వ. | ఇట్టిమహామహిమంబుగల దక్షారామంబుస నభివసింపుదము, భీమమండలంబు దర్శింపుదము, సప్తగోదావరమ్మున నాడుదము, వృద్ధగంగాజలంబులఁ దేలుదము, తుల్యభాగాతోయంబుల మునుఁగుదము, కణ్వనాహిని నవగాహింతము, కౌంతేయంబున నోలలాడుదము, లవణపయోనిధి గంగాసంగమంబుల నభిషేకింతము, రండని హర్షోత్కర్షంబున రోమహర్షణతనయుండు సూత్యాహసంభవుండు నిఖిలపురాణవ్యాఖ్యానవైఖరీసమేతుం డైన సూతుండు పల్కిన విని నెమిశారణ్యపుణ్య | |
| క్షేత్రంబున ద్వాదశవార్షికపరిమితం బైన సత్రయాగంబునఁ గూడినశౌనకాది మహామునులు, యజ్ఞావసానసమయంబున శ్రీమన్మహాదేవుని సందర్శింపం జనిరి. ఇది పంచాశత్ఖండమండితంబును, సనత్కుమారసంహితాది బహుసంహితాసంధానంబును నైన స్కాందపురాణంబునందు గోదావరీఖండంబునందుఁ జెప్పంబడిన భీమఖండంబు, భీమేశ్వరమాహాత్మ్యంబును, భీమేశ్వరపురాణం బనంబరఁగు నిమ్మహాప్రబంధంబు వ్రాసిన, బఠించిన, వినినఁ, బుస్తకం బర్చన చేసిన, నారాధించిన, శ్రీభీమనాథేశ్వరుం డాయురారోగ్యైశ్వర్యంబులు, శాశ్వతమోక్షపదంబును గృప సేయు. | 107 |
ఉ. | వైభవపాకశాసన! సుపర్వమహీధర ధైర్యవర్తి! గే | 108 |
క. | రామాంబానందన! సం, గ్రామజితధనంజయా! పరాక్రమరామా | 109 |
భుజంగప్రయాతము. | ప్రధూత్కార్యసామంతరక్షాధురీణా | 110 |
గద్య. | ఇది శ్రీమత్కమలనాభపౌత్ర మారయామాత్యపుత్ర సుకవిజనవిధేయ సకలవిద్యాసనాథ శ్రీనాథనామధేయప్రణీతం బైనశ్రీభీమేశ్వరపురాణం బనుమహాప్రబంధంబునందుఁ సర్వంబును షష్ఠాశ్వాసము. | |
శ్రీమాణిక్యాంబాసమేత శ్రీభీమేశ్వరార్పణమస్తు.
శ్రీరామార్పణమస్తు.