భీమేశ్వరపురాణము/చతుర్థాశ్వాసము
శ్రీరామాయనమః
శ్రీమహా గణాధిపతయేనమః
శ్రీ మాణిక్యాంబాసమేత శ్రీ భీమేశ్వరస్వామినేనమః
శ్రీ భీమేశ్వరపురాణము
చతుర్థాశ్వాసము
| శ్రీధామ యశేషదిశా | 1 |
వ. | అక్కథకుండు శౌనకాది మహామునుల కిట్లనియె. | 2 |
గీ. | బాదరాయణునకుఁ గుంభభవుఁడు చెప్పి | 3 |
వ. | మీర లడిగినయర్థంబుఁ బర్యాయక్రమంబున వినిపించెద. | 4 |
తే. | పోయె వారణాశికి బాదరాయణుండు, శిష్యులును దాను గైవల్యసిద్ధిఁ గోరి | 5 |
క. | యాత్రాజిగీషఁ బుణ్య, క్షేత్రంబులమీఁదఁ దీర్ఘసేవాపరులై | 6 |
ఉ. | కాశీకి నేగుదెంచి మణికర్ణికయందుఁ బ్రయాగయందు నా | 7 |
క. | కేవలతాయకరంబును, భావలతావాటిమలయపవనాగమమై | 8 |
వ. | అని కాశీనగరంబునందుఁ గైవల్యాపేక్షఁ బెద్దగాలం బుండ నిశ్చయించి సాత్యవతేయు వెదకి యెచ్చటం గానక. | 9 |
శా. | కాశీస్థాననివాసులన్ యతులభిక్షావృత్తులం గాంచి పా | 10 |
వ. | అని సత్యవతేయుండు చేసిన యపరాధంబు తేటపడం జెప్పిన. | 11 |
తే. | కూడు పెట్టక యెన్నాళ్లు కుతిలపఱచి, గాసిసేయుట యిది తప్పు గాదె తనకు | 12 |
క. | ద్వైపాయనముని వెడలం, ద్రోపించిన కోపగాఁడు ధూర్జటి యీకా | 13 |
వ. | కృష్ణద్వైపాయనుతోడిద లోకంబు గాక యనుచు నమ్మునిలోకంబు కాశికానగరంబు వెలువడి శాఖోపశాఖల నతని చొప్పుపట్టికొని దక్షారామంబు ప్రవేశించి. | 14 |
తే. | తీర్థయాత్రాక్రమంబులు తెలియలేక, నారదుండు నానాపురాణజ్ఞుఁ డగుట | 15 |
మత్తకోకిలము. | నీ వెఱుంగనితీర్థముల్ ధరణీతలంబున లేవు స | 16 |
వ. | అని యడిగిన నారదుం డిట్లనియె. | 17 |
తే. | అఖిలతీర్థోత్తమోత్తమం బనఘులార, పావనం బైనసప్తగోదావరంబు | 18 |
తే. | సప్తగోదావరంబు నిర్ఝరమనంగ భీమనాథేశ్వరస్వామి వేలుపనఁగ | 19 |
తే. | విమలమతి సప్తగోదావరమునఁ గ్రుంకి, సప్తసప్తిప్రతిష్ఠఁ బ్రసన్నుఁడైన | 20 |
వ. | సప్తగోదావరస్నానమంత్రద్వయశ్లోకములు. | 21 |
శ్లో. | సప్తగోదావరం తీర్థం సర్వతీర్థోత్తమోత్తమమ్ | 22 |
శ్లో. | నమస్తే భీమనాథాయ, సప్తగోదావరాంభసే | 23 |
ఉ. | ఆతతభక్తిభావమున నాదియుగంబున సప్తసంయము | |
| స్ఫీతిఁ బ్రతిష్ఠ చేసి యభిషేకజలార్థము తోడితెచ్చి ర | 24 |
మ. | తనతీరంబునఁ బాయకున్న దనపాథ:పూరముల్ గ్రోలినం | 25 |
క. | చూడుం డాస్వాదింపుం, డాడుఁడు భీమేశ్వరేశ్వరాకృతిఁ దటినీ | 26 |
సీ. | పాతాళశ్రీకాలభైరవస్వామికి, నందికి నభివాదనం బొనర్చి | |
తే. | మర్త్యుఁ డేకాదశేంద్రియమదవికార, సంభృతములై యనన్యైకసాధ్యములయి | 27 |
శా. | జ్ఞానాజ్ఞానకృతంబు లైన యఘముల్ సర్వంబు నొక్కెత్తున | 28 |
తే. | ద్వాదశక్షేత్రశివలింగదర్శనమున, నెట్టిసుకృతంబు సిద్ధించు నట్టిసుకృత | 29 |
తే. | ద్వాదశక్షేత్రతీర్థయాత్రాభివృద్ధి, నిర్జితేంద్రియులై సేయనేర్చిరేని | 30 |
ఉ. | దక్షిణకాశికాతుహినధామకిరీటునిదిక్కు సీమగా | 31 |
సీ. | వలవ దగ్నిష్టోమవాజపేయాదుల, ధూమపానముఁ జేసి దుఃఖపడఁగఁ | |
తే. | దూరమున నుండి తలఁచిన దురితహరుని, జేరి కొలిచిన సకలార్థసిద్ధికరుని | 32 |
సీ. | నేఁ గొమ్ముటేనుఁగు నే విహగంబను, నే స్తబ్ధరోమంబ నేను గొఱియ | |
తే. | నేను మానిసి మున్నంచు నేకతమున, నొండొరులతోడు తను జెప్పుకొండు రుబుసుఁ | 33 |
తే. | అఖిలతీర్థప్రదేశంబు లడవు లిండ్లు, యజ్ఞవాటిక వల్లకా డనువిభేద | 34 |
శా. | సాక్షాద్దక్షిణకాశికానగరి దక్షస్థాన మవ్వీటిలో | 35 |
శా. | శ్రీభీమేశ్వరపాదపీఠవిలుఠచ్ఛ్రీసప్తగోదావర | 36 |
వ. | అని నారదుండు చెప్పిన విని తపోధనులు భీమనాథుమాహాత్మ్యంబునకు దక్షారామప్రభావంబునకు సప్తగోదావరమహిమంబునకు విస్మయంబందియు దర్శించియు నమస్కరించియు ధన్యులైన యాత్మారాము లమ్మహారామంబునఁ జరియించువారును నగుచు సత్యవతీసుతుం గాంచి దక్షారామాయణుండైన బాదరాయణువలన నప్పుణ్యస్థానంబున మఱియుం గల యశేషవిశేషంబు లెఱింగి. | 37 |
చ. | అటఁ జని యొక్కచోటఁ గమలాననబంధము పూని వాహినీ | 38 |
వ. | తదనంతరంబ యతనితో సల్లాపంబుల నపనయించి తీర్థమాహాత్మ్యం బడిగిన నతం డిట్లనియె. | 39 |
అగస్త్యుఁడు తీర్థమాహాత్మ్యంబుఁ జెప్పుట
సీ. | జహ్నుకన్యాతీరసన్నివేశమునకు, దక్షిణాంభోరాశితటముసాటి | |
| కటకరక్షకుఁ డైన కాలభైరవునకుఁ, బ్రకటపాతాళభైరవుఁడుసాటి | |
తే. | మోక్షవిభవంబునకు సాటి మోక్షలక్ష్మి | 40 |
తే. | తరమె వర్ణింప సప్తగోదావరంబు | 41 |
వ. | అని కుంభసంభవుండు చెప్పిన విని యమ్మహాత్ము వీడ్కొని నగరప్రదక్షిణపూర్వకంబుగా భీమేశ్వరు దర్శించి కృతార్థులై యొక్కరమ్యస్థలంబున నమ్మహామునులు గూర్చుండిరి యనంతరంబ. | 42 |
ఉ. | ఆమునిమండలంబునకు నంజలి బంధముతోఁ బ్రదక్షిణ | 43 |
సీ. | పరమపుణ్యుఁడ నైతి భాగ్యవంతుఁడ నైతి, ధన్యుండ నైతి నాతపసు పండెఁ | |
తే. | భీమనాథమాహాత్మ్యంబు పెంపువినఁగ, వేడ్క యగుచుండు నాకు నీవేళయందుఁ | 44 |
వ. | అనిన విని యందఱు వసిష్ఠమహామునిం బ్రార్థించిన సకలమునిజనానుమతంబునఁ గుంభసంభవుని నియోగంబున నప్పుడు మైత్రావరుణుండు మంకణున కిట్లనియె. | 45 |
క. | భీమ మగుగరళకూటము, భూమియు గగనమును దిశలఁ బొడచూపినచో | 46 |
క్షీరసాగర మథనకము ప్రారంభము
వ. | అనిన విని మంకణుండు పంకజాసనసంభవునితో మునీంద్రా దక్షవాటికాధీశ్వరుండు కాలకూటంబు నెబ్భంగి నుపసంహరించె నక్కథాక్రమంబు పరిపాటిందేటపడ నా కెఱింగింపవే యనుటయు నతం డిట్లని చెప్పం దొణంగెఁ దొల్లి జలం | |
| ధరాంధకమహిషాసురబిడాలాక్షధూమ్రాక్షగంధసింధురాసురవిద్యున్మాలితారకబలిబాణపౌలోమనివాతకవచకాలకేయాదు లగురాక్షసులును బాకశాసనపావకపరేతరాజపలలాశిప్రాచేతపవననపౌలస్త్యపశుపతిప్రధాను లగువేల్పులునుం దమలోన దాయాదసంబంధంబునం బొడమినవైరానుబంధంబునం బరస్పరవిజిగీషులై రోషంబున నెదురువేలంబులు పెట్టి కట్టుపకాసులై ప్రతిఘటించి బెట్టయి నెట్టుకొని యున్న సమయంబున. | 47 |
సీ. | దివ్యాయుధము లైదు ధృతిచేతనంబులై, శత్రుసంహారంబు సంస్తుతింపఁ | |
తే. | బన్నగాధీశభోగతల్పంబుమీఁదఁ, దత్ఫణారత్నదీప్తి మై తళుకుఁ జూపఁ | 48 |
వ. | ఇట్లు చనుదెంచి. | 49 |
తే. | ఒంటి నేతెంచి మంతనంబుండి నిలిచి, చక్రధరుతోడ హితకార్యచర్చ చేసి | 50 |
వ. | తదనంతరం బాశ్రీమన్నారాయణుండును. | 51 |
క. | ఓవెఱ్ఱులార యేటికి, నీవెడఁగు విచారములు సహింపఁగ రాదా | 52 |
తే. | కుడిచి కూర్చుండి మీ రేల కొఱఁతయైన, కుమ్ములాడెద రో యన్నదమ్ములార | 53 |
ఉ. | భద్రము మీకుఁ గావలె నపారముగా సురదైత్యులార | 54 |
వ. | అది గావున సుధాపానంబున జరామరణంబు లుజ్జగించి సుఖం బనుభవింపుఁడు క్షీరసముద్రమథనంబునం గాని సుధారసంబు సంభవింపదు గావున. | 55 |
శా. | క్షీరాంభోధి మథింపఁ గావలయు నక్షీణప్రతాపప్రభా | 56 |
గీ. | అనిన శౌరిపల్కు విని సమ్మతించి యా, దేవతలును బూర్వదేవతలును | 57 |
శా. | బాహాస్తంభచతుష్టయంబున మురప్రధ్వంసి లంఘించి యు | 58 |
సీ. | కపటకచ్ఛపమైన కైటభాంతకువీఁపు, కొమరు మీఱిన చుట్టకుదురుగాఁగ | |
తే. | బలిపురోగములగు దైత్యపరివృఢులును, దివిజనాయకుఁ డాదిగా దేవతలును | 60 |
వ. | ఇవ్విధంబున సురాసురప్యూహంబు లుత్సాహంబులు మదంబులు ముదంబులు శౌర్యంబులు ధైర్యంబులు క్రౌర్యంబులు వీర్యంబులు హంకారంబులు హుంకారంబు లుల్లాసంబులు ప్రహాసంబులు బలంబులు చలంబులు జవంబులు రవంబులు నదల్పులు విదల్పులు వీకులు తాఁకులు జూఁకలు కూఁకలు మూఁకలు వీఁకలు తెగింపులు నగింపులు నింపులు సొంపులు పెంపులు గుంపులు పరువులు మురువులు గెఱయ మెఱయ బాహానష్టంభసంరంభవిజృంభణంబునఁ దరతరంబు తరువందరువఁ దరిత్రాడు పాఁపఱేనియొడలి మలకలుపురులు విడి తరులువడి దిర్దిరందిరుగు మందరగిరి కందరాఘాతంబులం గలగుండువడి కరిమకరితిమింగలమత్స్యకచ్ఛపఢులీకుళిరంబులు సవ్యాపసవ్యయాతాయాతపరిభ్రమణంబులచేత విచేశనావస్థఁ బరిభ్రమించి యంతర్మగ్నంబులయిన పక్షక్షోణీధరంబులు ఱెక్కలు ముణుఁచుకొని మ్రంగి యణంగి తరంబుల నొదుగ దుగ్ధార్ణవంబు ఘూర్ణమానం బయ్యె నప్పుడు భుజంగపుంగవవదన నాసానిష్ఠ్యూతనిష్ఠురవిషనిశ్శ్వాసపవనధారాసంధుక్షుణంబున నభిస్యంధజ్వలనంబు ప్రజ్వలించెనో యన భుగభుగధ్వనితోడం గూడి సుడిగొన నెగయుక్రొంబొగల వెంబడి విస్ఫులింగంబు లాస్ఫాటించి దిక్కులంజూఱ పుచ్చంజిచ్చు పెచ్చుపెరిఁగి కోమలతమతమాలపల్లవంబుల యుల్లాసంబు నుల్లాసంబాడు నల్లనినాలుకలు విషం బుమియుచుంగమియుచు భృంగసంకాశంబును నీలజీమూతసన్నిభంబును గల్పాంతసమయవహ్నికల్పంబును గాలమృత్యుప్రతిమంబును యుగాంతాగ్నివర్ణనంబును నై చటచ్ఛటాశబ్దంబులతో నసహ్యవిషజిహ్వకలాపంబులు బ్రహాంతకర్పరంబు నప్పళింప నిప్పులు చెదరి | |
| చదలు దరికొల్పు నుల్కాపాతంబులుం బోలె దిక్కులం జురజుర స్రుక్కి లావెక్క సప్తపాతాళభువనచక్రవాకంబు పురపురం బొక్కవెక్కసంబయి కోలాహలాభీలంబయి హాలాహలం బుద్భవించిన. | 60 |
సీ. | పంకజప్రభవుఁ డబ్రహణ్య మొనరించెఁ, దాలసన్నిభభుజాస్తంభ మెత్తి | |
తే. | బెటిలె బ్రహాండభాండంబు చిటిలె దిక్కు | 61 |
వ. | అప్పుడు మిసిమంతుఁడునుంగాక పయోధిప్రాంతంబున దక్షవాటంబున హాటకసింహాసనాసీనుండయిన లలాటలోచను భవబంధమోచను సోమశేఖరుని శరణంబు సొచ్చి హరివిరించిపురందరాది బృందారకు లిట్లనిరి. | 62 |
చ. | అభయము పార్వతీశ యభయంబు మహేశ శశాంకశేఖరా | 63 |
తే. | అని భయభ్రాంతు లగుచు శక్రాదిసురలు, బలిపురోగము లగుదైత్యపరివృఢులును | 64 |
శివుఁడు హాలాహలము మ్రింగుట
మ. | పటుహుంకార మహాట్టహాసకలనం బాతాళభూస్వర్గసం | 65 |
క. | కటకమగువిషము విషధర, కటకం బగుకేలఁ బూని కౌతూహలియై | 66 |
క. | అపుడు హిమాచలకన్యక, యుపగూహన మాచరించు నొఱపునఁ జుట్టెం | 67 |
ఉ. | చుట్టిబిగించిపట్టి పురసూదన యీ గరళాగ్నిఁ గంధరా | |
| పట్టుననున్నలోకముల భస్మము సేయు వెలార్చితేని వె | 68 |
వ. | అనుటయు. | 69 |
శా. | శంభుం డంబికపల్కుఁ గైకొని జగత్సంరక్షణార్థంబు సం | 70 |
వ. | అప్పుడు మహాదేవుని దేవత లి ట్లని స్తుతియించిరి. | 71 |
దేవత లీశ్వరుని స్తుతించుట
సీ. | సచరాచరం బైన జగము రక్షించితి, హాలాహలానలం బారగించి | |
తే. | యఖిలదిక్పాలకులును నీయాజ్ఞవారు, నీదునిశ్వాసపవనంబు నిగమరాశి | 72 |
తే. | దేవదేవ మహాదేవ దివిజవంద్య, సర్వలోకైకరక్షణచతుర శర్వ | 73 |
మ. | బహిరంతస్థ్సితలోకరక్షణకళాపారీణ శైలాత్మజన్ | 74 |
తే. | సంహరించితి భువనశోషకము విషము, నభయ మిచ్చితి రక్షించి తఖిలజగము | 75 |
క. | ధరణియు గగనము దిక్కులు, దరికొని మండెడు విషాగ్నిఁ దత్క్షణమాత్రం | 76 |
ఉ. | ఆయతసత్కృపామహిమ హాలహలాగ్నిభయంబు నీమహో | 77 |
క. | లోకత్రయైకసంర, క్షాకల్పన మాచరింప సదృశులు వేల్పుల్ | 78 |
తే. | మమ్ము రక్షించి తని యేల మాటిమాటి, కభినుతింపంగ దక్షవాటాధినాథ | 79 |
సీ. | శ్రీభీమనాయకా శివ మమ్ము రక్షింపు, విశ్వైకనాథ దేవియును నీవు | |
తే. | వేడ్క రక్షింపు దేవ దేవియును నీవు, ప్రతిభ రక్షింపు గిరిశ యంబయును నీవు | 80 |
క. | శరణము భజింతు మభవుని, శరణము భజియింతు మర్ధచంద్రాభరణున్ | 81 |
తే. | సిరియు వాణియు మొదలైన సురపురంధ్రు, లఱ్ఱుగడుపును జల్లఁగా నఖిలషించి | 82 |
సీ. | విశ్వంబు సృజియించువిధి మహేంద్రుఁడు గొను, వివిధాధ్వరముల హవిర్విభాగ | |
తే. | నవనిధానములును యక్షనాథుఁ డేలు, నాసదాశివుఁ డీశానుఁడై తనర్చు | 83 |
సీ. | వరుణుఁ డెవ్వనియాజ్ఞ వారాశిఁ బాలించు, గాలి యెవ్వనియాజ్ఞ గంప మొందు | |
తే. | నట్టి భీమేశు వేదవేదాంతవేద్యు, సర్పకేయూరు దేవతాసార్వభౌము | 84 |
వ. | దేవదేవ మహాదేవ సదాశివ యాశ యీశాన తత్పురుష యఘోర సద్యోజాత వామదేవాఖ్యాన పంచవదన మూర్తివిశేష ప్రకృతిప్రధానకారణ! మీకు సాష్టాంగనమస్కారంబు. | 85 |
క. | నీమహిమార్ణవమునకును, సీమాంతము గలదె రాజశేఖర దక్షా | 86 |
వ. | అని యనేక ప్రకారంబుల బృందారకదైత్యులు తన్నుఁ బ్రస్తుతింపఁ గాలకూటంబు హరించిన పంచాననుం డగుభీమేశ్వరుండు హరివిరించిపురందరాదుల నాలోకించి యిట్లనియె. | 87 |
శివునియాజ్ఞను సురాసురులు విఘ్నేశుని బూజించి
పాల్కడలి తరియించి చంద్రాదులఁ బడయుట
తే. | మనము విఘ్నేశు సేవింప మఱచినార, మతని సేవింపకున్న నేలా ఫలించు | 88 |
మ. | అని యంభోధితటోపకంఠమున దక్షారామమధ్యంబునన్ | 89 |
సీ. | జలకమార్చె బలారి సప్తగోదావర, సలిలధారాహేమకలశసమితి | |
తే. | ధూమకేతుండు మహిసాక్షిధూప మిచ్చెఁ, బూన్చె యక్షాధిపతి మణిభూషణముల | 90 |
వ. | అనంతరం బామోదకాపూపపాయసఘృతమధుక్షీరశర్కరాసూపజంబూకపిత్థచూతఖర్జూరకదళీనారికేళఫలపుండ్రేక్షుసమన్వితంబుగా మహోపహారంబుల గల్పించి వేల్పులుఁ బ్రావేల్పులును ననల్పభావనావిశేషంబుల నశేషవిధంబుల మూషకవాహనునకుఁ బ్రదక్షిణంబులు ప్రణామంబులుం జేసి వలగొని క్రమ్మఱ పయోనిధిమథనంబునకుఁ బ్రారంభించిన. | 91 |
తే. | మందరాచలమంథానమథ్యమాన, దుగ్ధపాథోధిలో సముద్భూతమయ్యె | 92 |
వ. | వెండియుఁ దరువందరువఁ గల్పతరువును సప్సరస్సతులును గౌస్తుభమాణిక్యంబును నుచ్చైశ్రవం బనుహయంబును నైరావతం బనుధవళగజంబును నాదిగా సకలకామదంబులు సర్వమంగళాస్పదంబులు నిఖిలభువనమోహనంబులు నైన పదార్థంబు లుద్భవించెఁ దదనంతరంబ. | 93 |
క. | తరతరమ దరువఁదరువం, దరియం దుదయంబు నొందె ధన్వంతరి సా | 94 |
సీ. | సంపూర్ణపూర్ణిమాచంద్రబింబంబుతోఁ, బుట్టెఁ దెల్లనితమ్మిపువ్వుమొగ్గ | |
తే. | అందుమణికర్ణికాగ్రసింహాసనమున, లక్ష్మి యుదయించి హస్తపల్లవమునందుఁ | 95 |
దేవాసురు లమృతమునకై పోరుటయు శ్రీమన్నారాయణుండు దేవారుల వంచించుట
ఉ. | ఱంతులు మీఱి మిక్కిలిగ ఱాఁగతనంబున దొమ్మి చేసి దు | 96 |
వ. | అప్పుడు. | 97 |
క. | నారాయణుండు మాయా, నారీరూపమునఁ గపటనాటకలీలా | 98 |
చ. | అమృతముఁ గోలుపోయి విబుధారులు గంధగజాసురాంధక | 99 |
నారదోక్తి నసురు లీశ్వరుని బూజించి వరంబులు వడసి లోకముల బాధించుట
శా. | రక్షోనాయకులార నిర్జరవరవ్రాతంబుచేతన్ సుధా | 100 |
క. | అని నారదుండు పల్కిన, విని యందఱు భీమనాథు విశ్వేశ్వరునిన్ | 101 |
మ. | త్రిపురావాసులతోఁ గూడి కడిమిన్ దేవాహితుల్ లోకముల్ | 102 |
సీ. | అరుణోదయంబున నాకాశవాహినీ, హేమాంబుజంబుల నిందుధరుని | |
తే. | బరమసంధ్యాగమంబునఁ బటహశంఖ, ఝల్లరీమడ్డుడమరుఝర్ఝరులమ్రోఁత | 103 |
శా. | పంచబ్రహ్మషడంగమంత్రములనుం బ్రాసాదపంచాక్షరిం | 104 |
వ. | ఇవ్విధంబున నిష్టార్థప్రదుం డైనయమ్మహాదేవు శ్రీభీమనాథు సేవించి యద్దేవుని ప్రసాదంబున ననశ్వరంబును నత్యూర్జితంబును నసాధారణంబును నగునైశ్వర్యంబునుం బొంది. | 105 |
తే. | అపుడు గర్వించి నిర్జించి రఖలజనుల, నిర్జరుల బాధ పెట్టిరి నిరపరాధ | 106 |
బ్రహ్మవిష్ణ్వాదులు శివునికడ కేగి మొఱవెట్టుట
సీ. | <poemవజ్రహస్తునిచేతి వజ్రాయుధము జాగ్ర, దుద్దీప్తి పాడరి మొద్దువోయె
నతితీక్ష్ణతరమైన యాశుశుక్షణి తేజ, మింగాలతేజమై యింకిపోయెఁ జండభీషణమైన జముగదాదండంబు, బిఱుసంతయును బాసి బెండుపడియెఁ బాథోధివల్లభు పాశవల్లిమతల్లి, దర్పంబు దిగద్రావి త్రాడుపడియె></poem> | |
తే. | గాలి దూలెను ధనపతిఘనత యణఁగె, గ్రహములకు నిగ్రహము పుట్టెఁ గాలవశత | 107 |
వ. | అప్పుడు హరి విరించులు పురందరాదులతోడ నక్తంచరులచేతఁ బంచకరపాట్లు వడి యంతఃకరణంబులఁ జింతించి రాయంచనుం గాంచనవర్ణగరుదంచలం బగుపులుఁగుఱేని నెక్కి దక్షిణజలధిపంచ దక్షారామంబున నధివసించిన మంచుఁగొండయల్లునిఁ బంచబాణవిరోధిని డాయంజనుదెంచి పంచాక్షరీపంచబ్రహ్మమంత్రంబు మంత్రోచ్చారణపూర్వకంబుగా సాష్టాంగదండప్రణామంబు లాచరించి ప్రపంచరక్షణార్థంబుగా నిట్లని స్తుతియించిరి. | 108 |
సీ. | అవధారు దేవ దక్షారామవల్లభ, సప్తగోదావరోత్సంగనిలయ | |
తే. | మొదల దేవారులను గాచి పిదప సురలఁ, గాచి పిమ్మట నసురులఁ గాచినాఁడ | 109 |
తే. | చటులతరకాలకూటాగ్ని సంజహర్ష, పాల్కడలి నట్టనడుమ సంప్రభవమైన | 110 |
క. | ప్రణవోత్తమాంగ ఫణిభూ, షణ గగనమణీందువహ్ని చక్షుస్త్రితయా | 111 |
ఉత్సాహము. | నీలకంఠ భక్తలోకనిధి భవాబ్ధితారణా | 112 |
సీ. | అర్కేందుహవ్యవాహనలోచనత్రయా, త్రిపురదైత్యులబాధ నపనయింపు | |
తే. | డమరుపట్టసపరశుఖడ్గత్రిశూల, చాపఖట్వాంగధర నీవె శరణు మాకు | 113 |
క. | ముక్తవిశుద్ధనిరంజన, ముక్తప్రియ నిత్య యష్టమూర్తి ప్రతాపో | 114 |
క. | దగ్ధస్మరాంగశంకర, ముగ్ధేందుకళాకలాప మూర్ధాయన సు | 115 |
క. | అద్వయ సత్య క్షరాక్షర, సద్వంద్య యనాదినిధనసర్వేశ్వర కృ | 116 |
క. | సర్వేశ్వర సర్వాత్మక, [1]శర్వ సదాశివ మహేశ శాశ్వతరుద్రా | 117 |
సీ. | ప్రణతార్తిహర దేవ పరమేశధక్షవా, టాధీశయభవ మా కభయ మిమ్ము[2] | |
తే. | సద్యరక్షింపువామదేవాద్యప్రోవు,జయజ యాఘోరతత్పురుష జయ మొసఁగు | 118 |
శా. | త్రైలోక్యంబు భుజాప్రతాపమున నిర్వక్రమంబుగా నేలుచున్ | 119 |
క. | లోకంబులు త్రిపురాసురు, లేకచ్ఛత్రంబుగా నేలఁగ నున్నా | 120 |
మ. | అభయం బిందుకళాకిరీట శివదాయామ్నాయచూడామణీ | 121 |
క. | కరుణింపు దక్షవాటీ, పురనాయక భీమలింగ భోగికులేంద్రా | 122 |
ఈశ్వరుఁడు త్రిపురాసురుల నిర్జించుట
వ. | అని యీప్రకారంబున బ్రహవిష్ణువులు పురందరపురోగము లగుబృందారకులతోడం గూడి యభినందించినం బరమానందంబునుం బొంది యబ్భువనగోప్తసప్తపాతాళభువనగర్భగోళంబునందుండి యావిర్భవంబునొందిన దివ్యస్వయంభూజ్యోతిర్లింగమూర్తి భీమేశ్వరుండు నిర్వికల్పంబును నిరస్తసమస్తోపాధికంబును నైన నిష్కళంకస్వరూపంబు విడిచి యారకూటపాటలంబై కుసుంభచ్ఛాయనగు జటాపటలంబును, బాండురపుండరీకముకుళడుండుభంబులను శంకనంకురింపం జేయంజాలు బ్రహ్మకపాలమాల్యంబును, జిఱునవ్వుజిగి మెఱుంగిడిన చెక్కుటద్దంబుల నీడ చూచు నిద్దంపునాగకుండలంబులును, గ్రొత్తయఱసంజకెంజాయ రంజిలు కాఱుమొగులుకైవడిఁ జిలుపచిలుపని నెత్తురుల జొత్తిల్లిన పచ్చియేనికతోలుపచ్చడంబును, గంఠోత్కంఠభువనభవనరక్షణదాక్షిణ్యలక్షణకస్తూరికాలేపననైపథ్యంబునుం బోని కాలకూటవిషమషీకంఠంబును, సాయాహ్నసమయసంఫుల్లమల్లికాకుసుమసముల్లాసంబు నుల్లసంబాడు తెల్లనిమేనును, మొఱకుఁదనంబున నేతెంచిన కఱకుచెఱకువిల్తుని జూఱఁబుచ్చినదై చిగురుఱేలన నుప్పతిల్లుచు మినుమినుకు మనునులివేఁడిచూపువలనఁ గోపాటోపావార్యహవ్యవాహనాడంబరం బగులలాటలోచనజ్వలనంబు ప్రజ్వలించి నికటజటాటవీవాటంబు నాస్ఫోటించునోయని యవధ | |
| రించిన చందంబున నందం బగుమందాకినీసలిలపూరసంభరితం బైనశాతకుంభకుంభంబునుఁబోని కిరీటకటాహంబును, జంద్రఖండంబులుమూఁగినభంగి నంగీకరించిన యకించన శశాంకరేఖాలంకారంబును, జెంగలువ ఱెక్కడాలుఁ జక్కనేలిన కేలి యంగుటంబునం జనమత్ఖురపుటంబుల మోపి నింగికి నెగయ నంజచాఁచులీలాకురంగశాబకంబును గనుపట్టు సర్వకళారూపంబు ధరియించి సర్వమంగళాకుచకలశలేపనానైపుణ్య కుంకుమాంగరాగవాసనాసనాథంబును, గరళకూటపావకోత్పత్తినిరస్త మణికులప్రశస్తంబును నైన శ్రీహస్తంబు విస్తరించి యభయంబు ప్రసాదించి సజలజలధరధ్వానగంభీరోదారంబైన కంఠస్వనంబున నిట్లని యానతిచ్చె. | 123 |
మ. | అరవిందాసనతార్క్ష్యవాహనసహస్రాక్షాదిబృందారకుల్ | 124 |
ఆ. | అని ముహూర్తమాత్ర మద్దేవతాచక్ర, వర్తి దక్షువాటివల్లభుండు | 125 |
వ. | అనంతరంబ తదభిజ్ఞానప్రభామహామహిమంబునఁ దదాజ్ఞాతిశయంబున. | 126 |
సీ. | జలరాశిమేఖలావలయంబు రథ మయ్యె, రవియుఁ జందురుఁడుఁ జక్రంబు లైరి | |
తే. | గంధవాహంబు లేడును గఱులు గాఁగ, విలయకాలానలజ్వాల ములికి గాఁగ | 127 |
వ. | ఇవ్విధంబున సకలసాధనంబులు సన్నిహితంబు లైనక్షణంబ దక్షారామంబున నయనాభిరాముండు భీమేశ్వరుండు త్రిపురవిజయార్థంబు దివ్యస్యందనం బెక్కె నప్పుడు. | 128 |
సీ. | సరిబ్రాహ్మి మొదలైన సప్తమాతృకలు ద, న్గూడ సేసలు చల్లె గోఁగులమ్మ | |
తే. | ద్రిపురసంహార మొనరింప దీక్ష చేసి, భీమనాథేశ్వరేశ్వరస్వామి శివుఁడు | 129 |
సీ. | కమ్మినూకిననూత్నకలధౌతమునుబోలెఁ, జక్కంగ నిక్కి మై సొక్కు మానె | |
తే. | హాటకాద్రిధనుర్దండకూటకోటి, వంచి బాహావలేపదుర్వారలీలఁ | 130 |
క. | ముక్కంటి మేరుచాపం, బక్కిడి నారించెఁ బన్నగేంద్రగుణంబున్ | 131 |
క. | తాటించి నిటలనయనుఁడు, హాటకగిరిచాపవల్లి నహిశింజిని నా | 132 |
మ. | గిరిశస్థూలభుజాపరీతవిభవక్రీడాసమాస్ఫాలిత | 133 |
క. | మృడుఁడు కనకాద్రిచాపము, గుడుసువడం దివియ గూడి కుశలప్రశ్నం | 134 |
క. | తెగనిండ ఫాలనయనుఁడు, నగచాపము దిగిచినపుడు నాగేంద్రుం డ | 135 |
క. | విషధరపరివృఢనాసా, సుషిరవినిశ్వాసపవనఛూత్కారరవ | 136 |
క. | శ్రీకంఠకఠినభుజపరి, ఘాకృష్టసువర్ణగిరిశరాసన మౌర్వీ | 137 |
క. | కటకాముఖహస్తంబున, నిటలాక్షుఁడు కొండవిల్లు నెవ్వడిఁ దివియన్ | 138 |
వ. | ఇవ్విధంబున భీమనాథుండు త్రిపురదమనారంభసంరంభంబున శాతకుంభకుంభినీధరకోదండం బుద్దండభుజాదంచండిమంబునఁ గుడుసుపడం దిగిచినఁ దత్సమాకృష్టభారంబున భుజంగపుంగవుండు వేయుపడగలను విషంబుఁ గ్రక్క దృక్కర్ణవదననాసారంధ్రసముదీర్ణసంభవం బయినయక్కాలకూటవిషంబు కృపీటభవజిహ్వాకలాపంబులు గ్రోయుచుఁ దోయధిమథనంబున సంభవించినహాలాహలంబునుం బోలెఁ బ్రజ్వరిల్లి సముజ్జ్వలజ్వాలాజాలంబుల ద్రైలోక్యంబు నాక్రమింపందొణంగినం దెగ యుడిపి ఖట్వాంగపాణి యుత్తమాంగంబు జాడించి | |
| గంగాంభఃప్రవాహనిర్ఝరవారిపూరంబులు చల్లియు వామలోచనహిచుదామకిరణవ్రాతంబులం బ్రోక్షించియు నమ్మహోపద్రవం బుపశమింపం జేసి దుర్గాసహాయుండును విఘ్నరాజప్రసాదోపలబ్ధసంభావితంతుడు నై విషమలక్ష్యంబులయిన త్రిపురంబులు వీక్షించి వెండియు నాదినారాయణునిం బురాణబురుషునిఁ బురుషోత్తము ననాదినిధనుని బాణంబు చేసి యరింబోసి పాశుపతాస్త్రసమంత్రకంబుగా నభిమంత్రించి నాకర్ణాంతంబుగాఁ దిగిచి లలాటేక్షణజ్యాలాజాలంబు మునుముట్టనిగిడించి బిట్టుహుంకరించి యట్టహాసంబు చేసి యేసిన నమ్మహాస్త్రంబు. | 139 |
సీ. | కరపల్లవంబులు గబళించుఁ గబళించి, ప్రబలనితంబభారముల వ్రాలుఁ | |
తే. | నభవు కరముక్తనారాయణాస్త్రవహ్ని, కాముకునికోమలాంతసంగంబుపగిది | 140 |
క. | లోహమయదైత్యనగరీ, గేహంబులు హరశరాగ్నికీలాజ్వాలా | 141 |
వ. | అంత. | 142 |
సీ. | భస్మరేణువు లయ్యెఁ బ్రాకారగోపుర, ప్రాసాదకుట్టిమప్రాంగణములు | |
తే. | కాలకంఠభుజాదండగర్భధార, కుండలీకృతమేరుకోదండపరిధి | 143 |
క. | ఫాలేక్షణాస్త్రవహ్ని, జ్వాలాజాలముల నసురవరనగరంబుల్ | 144 |
తే. | ఆదిలింగోద్భనమునాఁటి యభవుభంగి, నింగి మోచిన యాశంభులింగమూర్తి | 145 |
మ. | అసురాధీశసమర్పితంబులగు లీలారామకల్పద్రుము | 146 |
వ. | ఇవ్విధంబుననున్నఁ జూచి భీమేశ్వరుండు ఋక్సామయజురథర్వణవేదపారాయణతురంగకంబును రవిశశాంకరథాంగకంబును గమలభవసారథికంబును నగు విశ్వరథం బెక్కి భుజంగమరాజిశింజినీకం బయిన కాంచనధరాధరధనుర్దండంబును బుండరీకాక్షబాణంబును సంధించి పురత్రయంబుల దహించి విజయలక్ష్మిఁ బరిగ్రహించి విశ్వావసుప్రధాననానాగంధర్వజేగీయమానభుజావధానుండై ప్రమోదాతిశయంబున. | 147 |
శా. | ఆడెం దాండవ మార్భటీపటహలీలాటోపవిస్ఫూర్జిత | 148 |
వ. | ఇట్లు త్రిపురవిజయానంతరంబునం గృతాంతగమనుండు వెండియు. | 149 |
చ. | డమరుకడిండిమప్రకటఠంకృతియుం గఠినాట్టహాసవి | 150 |
వ. | అనంతరం బాయంబికావల్లభుండు జాంబూనదశైలకోదండం బెక్కుడించి యథాస్థానంబున నునిచి నారి యగుపాపఱేనిని విశ్వంభరాభరణంబునకు నియోగించి క్షీరాంభోరాశితూణీరంబున వైకుంఠబాణంబు చేర్చి వేల్పుల వీడ్కొలిపి బ్రహ్మను సత్యలోకంబున కనిచి వేదంబులం దననిట్టూర్పుగాడ్పులలోనం గలిపి చంద్రసూర్యులం గాలంబు గడుప నియోగించి కృతకృత్యుండై త్రిపురదైతేయుల కులదైవతంబైన యద్దివ్యలింగంబును బంచబ్రహ్మపంచాక్షరీపంచతత్వపంచభూతమయం బగుటం జేసి పంచఖండంబులుగా ఖండించి కృష్ణవేణీమహానదీతీరంబున ధరణాలకోటయను గ్రామంబున నమరేశ్వమునిచేతం బ్రతిష్ఠితంబగుటం జేసి యమరలింగంబునాఁ బ్రసిద్ధంబైన యమరారామంబును గౌతమీతీరంబున దక్షిణకూలంబున గుణపూడియను గ్రామంబున సోమునిచేతఁ బ్రతిష్ఠితంబు సేయంబడుటం జేసి సోమలింగంబనఁ బ్రఖ్యాతంబైన సోమారామంబును బాలకోటయను గ్రామంబున శ్రీరామచంద్రునిచేఁ బ్రతిష్ఠితంబగుటం జేసి రామలింగంబునాఁ బ్రసిద్ధం బైన క్షీరారామంబును జాళుక్యవంశరాజధానియగు చాళుక్యభీమవరనామగ్రామంబునఁ గుమారరత్నంబైన కుమారస్వామిచేతం బ్రతిష్ఠితంబగుటం జేసి కుమారభీమలింగంబనఁ బ్రఖ్యాతంబు నొందిన భీమారామంబును మొదలిమామ యగుదక్షప్రజాపతి యునికిపట్టైన యారామంబగుట దక్షారామంబున | |
| శివసన్నిధానంబై దానుండునట్టుగా నీప్రకారంబున భోగమోక్షప్రదంబులైన పంచారామంబులను బ్రతిష్ఠనొందించి తానును దక్షవాటంబున మున్నీటితటంబున విశుద్ధస్ఫటికసంకాశంబును ద్రిదశలోకభామినీవిలోకనచ్ఛాయాగుళుచ్ఛాచ్ఛజ్యోత్స్నాభిషిక్తయుక్తాంగంబగు శ్రీభీమేశ్వరలింగంబునం దధివసించె నిది త్రిపురవిజయోపాఖ్యానంబు దీని వినినను బఠించిన వ్రాసినఁ బ్రశ్నచేసిన బోధించినవారికి సకలపాతకనివర్తనంబై భుక్తిముక్తులు గలుగును సకలకళ్యాణకరం బనిన విని. | 151 |
ఉ. | అప్పుడు సప్తదివ్యమును లంచితభక్తిరసప్రయుక్తులై | 152 |
సీ | ఆ ఖండపంచకం బాఖండలాదిక, విబుధమండల విషేవితము చంద్ర | |
తే. | మభవ మద్వయ మాద్యంబనాదినిధన, మప్రమేఁయం బజయ్యంబు నప్రధర్ష్య | 153 |
శా. | ఎంచన్ బెక్కువిశేషముల్ ధరణిలో నింపాడుచున్నట్టి శ్రీ | 154 |
శ్లో. | కాశీక్షేత్రమృతోజీవి పునర్జన్మశివాకృతిః | |
శ్లో. | మత్తోనాస్త్య పరందైవం నదేవీ గిరిజా సమా | |
శ్లో. | రత్యంతరేమూత్రపురీషమధ్యే । చండాలవేశ్మన్యధవాశ్మశానే | |
వ. | అట్టి దివ్యక్షేత్రంబునందు. | 155 |
క. | ఆలింగమూర్తి శశ్వ, జ్జ్వాలామాలాకరాళసందీప్తంబై | 156 |
తే. | సంస్మితం బైనమదనశాసనునిముఖము | 157 |
శా. | కారాగారనిబద్ధ లైనదివిషత్కాంతాజనుల్ వారికిం | 158 |
వ. | తదనంతరం బాభరద్వాజాదిమహామునులు శివున కర్ఘ్యపాద్యాచమనీయార్థంబు భీమనాథమహాదేవునిసమీపంబున గోదావరీవాహినిం బ్రవహింపఁజేయువారై ప్రారంభించి. | 159 |
సీ. | పంచభూతముయంబు పరమపంచబ్రహ్మ, తత్త్వతేజస్సముద్భాసితంబు | |
తే. | మంబరము మోచి యున్నలింగంబుఁ జూచి, సంప్రతిష్ట యొనర్పంగ సమ్మతించి | 160 |
తే. | గౌతమీగంగఁ బాపి యిక్కడికి నొక్క, సిద్ధవాహినిఁ బ్రవహింపఁజేసి కాని | 161 |
సీ. | ఆలగ్నవేళకు నమృతదివ్యస్వయం, భూమహాలింగైకమూర్తియైన | |
తే. | గౌతమీగంగ నాలోలఘనతరంగఁ, గేలిడోలావిహారసంక్రీడమాన | 162 |
క. | గౌతమకన్యాతటినిన్, బ్రీతిఁ బయఃపాన మాచరించిన మనుజ | 163 |
వ. | అని మునీంద్రులు తమలోన వెండియు నొండొరులం గనుంగొని. | 164 |
తే. | కంటిరే ఘోరపాతకౌఘముల నెల్లఁ, గడిమి జంకించుచున్నది గంగ యిపుడు | 165 |
తే. | యక్షగంధర్వసిద్ధవిద్యాధరోర, గామరవ్రాతభరితోభయప్రతీర | 166 |
తే. | అమృత మైనపయోధార నహరహంబు, సృష్టిఁ గల జంతుకోట్ల రక్షింతు వీవు | 167 |
క. | త్రైలోక్యవరదపావన, నాళీకాననకరాబ్జ నవమణికుండీ | 168 |
క. | గోదావరి గోదావరి, గోదావరి యంచుఁ బల్కు గుణనంతులకున్ | 169 |
క. | కంబుశశిరజతశుక్తివి, డంబసితచ్ఛాయకలిత డంబరములు నీ | 170 |
శా. | ఆపాతాళగభీరనీరకసుధాహారామలచ్ఛాయకున్ | 171 |
శా. | రంభోరూకరశాతకుంభఘటధారాపూరణప్రక్రియా | 172 |
క. | గౌతమికిన్ బంచమహా, పాతకసటలాంధకారపాటనవిధిరా | 173 |
వ. | అని ప్రార్థించి యిట్లనిరి. | 174 |
సీ. | విచ్చేయవమ్మ శ్రీవృషభవాహనధర, సామజకటమదాసారధార | |
తే. | తెరలతో వీచికలతోడఁ దరులతోడ, విమలడిండీరఖండదండకములతోడ | 175 |
మ. | అదె మాస్వామి సుధారసోద్భవుఁడు దక్షారామభీమేశుఁ డ | 176 |
తే. | సోమశేఖరుండు భీమేశ్వరస్వామి, తివిరినాఁడు సంప్రతిష్టఁ బొంద | 177 |
మ. | అని మెప్పించి మహర్షు లేడ్వురును నత్యాశ్చర్య మొప్పన్ బ్రభా | 178 |
వ. | అప్పుడు ప్రతిష్ఠావలోకంబునకు లోకపాలకగంధర్వయక్షసిద్ధసాధ్యవిద్యాధరోరగామరసహితుండై దేవేంద్రుం డంబరమార్గంబున ఋషుల ననుసరించి యేతెంచుచుండె నాసమయమ్మున. | 179 |
తే. | ఒక్కనదిపొంత గార్హస్థ్యయుక్తమైన, పుణ్యతప మాచరించుచుఁ బుణ్యజనులు | 180 |
తే. | ఋషులవెంబడి సంరంభ మెసఁగవచ్చు | 181 |
శా. | ప్రాగ్వంశంబులు స్రుక్స్రువంబులును యూపస్తంభపంక్తుల్ హవి | 182 |
క. | ఆకాశదివ్యమునులును, నాకౌకఃప్రత్యనీకనాయకమునులున్ | 183 |
తే. | శిఖలు వీడఁగ ముఖములు జేగురింప | 184 |
వ. | ఇట్లందుకొని దానవులు సప్తర్షిసమానీతయైనయవ్వాహిని శుష్కతోయ యయ్యెడుమనియును, మునులు దానవులకు సమాశ్రయంబైయప్పుణ్యవాహిని యపూజ్యయై యస్పృశ్య యయ్యెడు మనియును, శపియించి రప్పుడు. | 185 |
తుల్యభాగ యుత్పత్తిక్రమము
తే. | అమరులకు నాశ్రయంబైన యాస్రవంతి, తుల్యభాగాహ్వయుండు దైత్యుండు దేరఁ | 186 |
వ. | తుల్యభాగుం డనుదైత్యుండు పరమార్థతత్త్వజ్ఞుండై పక్షపాతంబు లేక సురాసురులకు మాధ్యస్థ్యంబున వివాదంబులు తీర్చుచుండుటకు సమర్థుం డగుట నద్దానవుండు తుల్యభాగాహ్వయుఁ డనంబరఁగుట నన్వర్థనామధేయుండు. | 187 |
క. | ఆతుల్యభాగుపేరను, నాతటికినిఁ దుల్యభాగ యనునామము ప్ర | 188 |
సీ. | ఆతుల్యభాగమహామునీంద్రుఁడు ప్రీతి, మునిదానవశ్రేణి మ్రోల నిలిచి | |
తే. | ననుటయును వార లామాట లాదరించి | 189 |
వ. | అని రాక్షసులు సప్తమునిసింధువునకు నంతఃప్రవాహంబును మునులు తుల్యభాగకు నుత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలంబులను సూర్యచంద్రగ్రహణంబులను బ్రతిభానువారంబునను దర్శ పౌర్ణమాసీ ప్రభృతిమహాపర్వకాలంబులను సంక్రమణంబులు మొదలైనవిశేషకాలంబులను స్నానదానజపదపోహోమశ్రాద్ధదేవార్చనావిధానంబు లక్షయఫలంబు లగునట్టుగాను బతిసమేతంబుగా సతికి రజస్వలాత్వాద్యంతరాయంబు లేక యధశ్శయనబ్రహ్మచర్యోపవాసనియమంబులతో భానువారచతుష్టయంబు స్నానంబు సిద్ధించిన సంతానప్రాప్తి యౌనట్టుగాను వరంబు ప్రసాదించిరి తదనంతరంబ. | 190 |
మ. | కెలనన్ ముందర సిద్ధకింపురుషులుం గీర్వాణులు న్నాగసా | 191 |
చ. | మలఁగి మలంగి భీమపతిమందిరమండలసిద్ధభూమికిన్ | 192 |
తే. | దేవదుందుభు లుడువీథి దీటుకొలుప, నమరు లందంద పుష్పవర్షములు గురియ | 193 |
వ. | ఇవ్విధంబున గోదావరీపుణ్యవాహినిం గొనివచ్చి సప్తర్షులు పరమహర్షోత్కర్షంబున. | 194 |
శ్రీ భీమనాథేశ్వరుఁడు దనకుఁదాన ప్రతిష్టితుండగుట
తే. | తారు దలఁచిన శుభవేళ దప్పకుండ, సంప్రతిష్ఠుఁడై సమర్చనము గొన్న | 195 |
వ. | ఆశ్చర్యంబునుం బొంది. | 196 |
ఉ. | తారు వినిశ్చయించిన ప్రధానముహూర్తము దప్పకుండఁగా | 197 |
తే. | రోషసంరంభములును సంతోషములును | 198 |
వ. | వచ్చి యభివాదనంబు చేసి ముకుళితకరకమలుండై కమలమిత్రుం డమ్మహామునుల కిట్లనియె. | 199 |
చ. | పరమమునీంద్రులార మిముఁ ప్రార్థన సేయుచు విన్నవించెదన్ | 200 |
క. | మీ రొనరించు ప్రతిష్టా, ప్రారంభము నాకుఁ జేయ నలవియె శ్రీద | 201 |
క. | మేలెట్టి దట్టి శోభన, కాలము సరిగడచెనేని కాదని కంఠే | 202 |
చ. | తనకుందాన ప్రతిష్ఠతుండయిన యీ దక్షాధ్వరధ్వంసి నే | 203 |
తే. | అనిన సంయములును గాలయాపనమునఁ , జంద్రశేఖరు సంప్రతిష్టాపనంబు | 204 |
ఉ. | ఓ పరమర్షులార కరుణోదధి యిందువతంసుఁ డాత్మసం | 205 |
తే. | అల్పమే మీరు చేసినయట్టి భక్తి, యభవమూర్ధాభిషేకార్థ మధికభక్తి | 206 |
మ. | అభిమానించిన మీర లేడ్వురు బ్రతిష్ఠారంభకాలంబునం | 207 |
తే. | మీర లెనమండ్రు భుజగేంద్రహారునొద్ద, భక్తిఁ బూజింపఁ బెట్టుఁడు పాశుపతుల | 208 |
తే. | అష్టమూర్తి విశిష్టాన్వయప్రసూతుఁ, డర్హుఁ డేపాటివాఁడైన నభపు నంట | 209 |
వ. | అని యాకాశవాణి మీరలును సూర్యుండును సములని యుద్దేశించి పల్కిన విని హర్షంబు నొంది మహర్షులు నభోమణి నభినందించి యతండును దామును హేమకుంభంబుల సప్తగోదావరప్రవాహాంబుపూరంబులు దెచ్చి యయ్యభవు నభిషేకించి పూజించిరి; సప్తర్షిసమానీత గావున నమ్మహానదికి సప్తగోదావరాహ్వయంబు సంభవించెనని చెప్పుటయు శ్రీభీమేశ్వరమహాదేవుమాహాత్మ్యంబు విన వేడుక యయ్యెడు నయ్యీశానుపుణ్యకథావిధానంబు వినిపింపవే యనుటయు. | 210 |
మ. | అవనీభారధురీణ రీణరిపుసైన్యాధీశ ధీశక్తివై | 211 |
క. | కాశ్యపగోత్రపవిత్ర య, వశ్యా యధరాధరోద్భవాధిపభక్తా | 212 |
మాలిని. | కమలభవవధూటీ కంఠకహ్లారమాలా | 213 |
గద్య. | ఇది శ్రీకమలనాభపౌత్ర మారయామాత్యసుపుత్ర సుకవిజనవిధేయ సకలవిద్యాసనాథ శ్రీనాథనామధేయ ప్రణీతం బైనశ్రీభీమేశ్వరపురాణం బనుమహాప్రబంధంబునందుఁ జతుర్థాశ్వాసము. | |