భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/సుగరా ఖాతూన్‌

ఆచరణాత్మక త్యాగశీలి

సుగరా ఖాతూన్‌

(-1968)

జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాల పట్ల అత్యంత ఆసక్తి చూపటమే కాక లోతైన అధ్యాయనంతో జ్ఞానపరంగా పరిణతి చెందిన మహిళలు జాతీయోద్యమంలో ఎందరో కన్పిస్తారు. అటువిం మహిళా మేధవులలో ఒకరు శ్రీమతి సుగరా ఖాతూన్‌.

ఆనాడు నిజాం సంస్థానంలో భాగంగా ఉన్న ఉస్మానాబాద్‌లో సుగరా ఖాతూన్‌ జన్మించారు. ఆమె తల్లి సైదాున్నీసా, తండ్రి సయ్యద్‌ హదీ. పదామూడు సంవత్సరాల వయస్సులో జమీందారీ కుటుంబానికి చెందిన మహమ్మద్‌ జమీర్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. వివాహం జరిగిన ఆరు సంవత్సరాలకే భరను కోల్పోయి వితంతువయ్యారు. ఆ తరువాత అత్తింట తలెత్తిన ఆస్థి వివాదాల కారణంగా ఆమె ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఉంటున్న తన మేనమామ ఇంట చేరారు.

ఆ సమయంలో ఖిలాఫత్‌ సహాయనిరాకరణ ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. ఆ వివరాలను ఆమె ఎప్పికప్పుడు తెలుసుకుంటున్నారు. ఉద్యామ వార్తలు ఆమెను నిలువనివ్వటం లేదు. ఆమెలోని దేశభక్తి భావనలు ఆమెను ఊపిరి సలుపనివ్వటం లేదాు. నిర్ల్లిప్తంగా కూర్చోనివ్వటంలేదు. ఆ పరిస్థితులలో ఆమె జాతీయోద్యమంలో ప్రవేశించారు. విదేశీ వస్తు బహిష్కరణ సందర్భంగా అత్యంత విలువైన తన వస్త్రాలను 165 సయ ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

విసర్జించటమే కాక విదేశీ వస్తు విక్రయశాలల ఎదుట జరిగిన పికిెంగ్‌ తదితర కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమాలలో సరోజినీ నాయుడు, మోతీలాల్‌ నెప్ర˙లతో కలసి పాల్గొని పోలీసుల లాఠీ దెబ్బలను రుచి చూశారు.

ఆమె ఉద్యమ కార్యక్రమాలలో చురుకైన భాగస్వామ్యాన్ని అందించటం, నిరంతరం ఆ కార్యకలాపాలలో మునిగితేలటం స్వజనులకు రుచించలేదు. చివరకు వస్త్రధారణ విషయంలో కూడ సంబంధీకుల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. సౌకర్యంగా ఉంటాయన్న ఉద్దేశ్యంతో ఆమె ఖద్దారు చుడుదార్‌-కుర్తాలను ధరించారు. వితంతువులు అలాిం వస్త్రధారణ చేయరాదాని సాంప్రదాయవాదులు విమర్శించారు. అంగాంగ ప్రదార్శన లేని సభ్యతగల వస్త్రధారణ ఏమాత్రం అభ్యంతకరం కాదంటూ ఆ విమర్శలను ఆమె తోసిపుచ్చారు.

ఖిలాఫత్‌ నిధాులకోసం ఆబాది బానో బేగం లక్నో పర్యటనకు రాగా సుగరా ఖాతూను అమెకు ఎంతగానో సహకరించారు. ఖిలాఫత్‌ ఫండ్‌ కోసం ఆమె తన వదానున్న పెళ్ళినాటి 50 తులాల బంగారాన్ని, విలువైన వజ్రాలను ఆబాది బానోకు జాతీయోద్యమ నిధికి విరాళంగా సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి ఆమె చక్కని ప్రసంగం చేసి సబికులను ప్రబావితులను చేశారు. ఆ ప్రబావంతో మహిళలు ముందుకు

వచ్చి భారీ ఎత్తున నిధులు సమకూర్చిన సంఘటన ఆనాడు నగరంలో చర్చనీయాంశమయ్యింది. సుగరా ఖాతూన్‌ నిరంతర అధ్యాయనశీలి. ఆమె రాసిన ఆలోచనాత్మక వ్యాసాలు, కవితలు హందార్ద్‌ జమిందార్‌, హందాం లాంటి ఉర్దూ పత్రికలలో ప్రచురితమై సంచలనం సృష్టించాయి. ఆమె నవలలు కూడ రాశారు.

సుగరా ఖాతూన్‌ క్విట్ ఇండియా ఉద్యామం ప్రారంభ దాశలో చాలా చురుగ్గా పాల్గొన్నారు. కుటుంబ సమస్యల కారణంగా ఆమె పలుమార్లు హైదారాబాద్‌ పర్యటనలు జరపాల్సిరావటంతో ఆ తరువాత జాతీయోద్యామంలో ప్రత్యేక పాత్ర నిర్వహించలేక పోయారు. భారత దేశ స్వతంత్ర భానుడు ఉదయించాక ఆమె హైదారాబాద్‌ నుండి లక్నో వెళ్ళిపోయారు. ఆ తరువాత జాతి పునర్నిర్మాణంలో భాగం పంచుకుంటూ, ప్రజాసేవలో నిరంతరం గడిపిన శ్రీమతి సుగరా ఖాతూన్‌ 1968 మే 10న తనువు చాలించారు.

166