భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/జుబైదా బేగం దావూది

మాతృదేశ సేవకు ఖరీదు కట్టనిరాకరించిన

జుబైదా బేగం దావూది

(1885-)

బ్రిటీష్ వ్యతిరేక పోరాటంలో సర్వసం త్యాగం చేసి, జీవిత చరమాంకంలో కటిక దారిద్య్రంలో మగ్గుతు న్నప్పటికి ఏమాత్రం చలించకుండ, ఎవరి అండను ఆశించకుండ,చివరివరకు ఆత్మగౌరవమే పెన్నిధిగా నిలచిన స్వాతంత్య్ర సమరయోధులు స్వాతంత్య్రసమరచరిత్రలో తక్కువ మంది తారసపడతారు. అటువంటి వారిలో చిరస్మరణయు రాలు జుదైదాబగం.

1885 అక్టోబర్‌లో బీహార్‌ రాష్ట్రం, ముజఫర్‌పూర్‌ జిల్లా పారో గ్రామంలోని అత్యంత సంపన్న కుటుంబంలో జుదైదా బేగం జన్మించారు.తండ్రి అబ్దుల్‌ ఫతహా సాహెబ్‌ భూస్వామి. ఆయన బ్రిటీష్ ప్రభుత్వంలో ఉన్నతా ధికారి. ప్రముఖ న్యాయవాది మౌలానాషఫీ దావూదిని ఆమె వివాహమాడారు. ఆయన మహాత్మా గాంధీ, డక్ట ర్‌ రాజేంద్రాప్రసాద్‌, పండిత మోతిలాల్‌ నెహ్రూ లాంటి ప్రముఖుల సహచరులు. మౌలానా దావూది స్వాతంత్య్ర సమరంలో క్రియాశీలక పాత్ర వహిస్తున్న ప్రముఖ నాయకులు. ఆయన రాజకీయాభిప్రాయాలను, జాతీయో ద్యమంలో ఆయన అనుసరిస్తున్న విధివిధానాలను జుబైదా బేగం యధావిధిగా స్వీకరించారు. మౌలానా అలీ సోదరుల తల్లి, జాతీయ ద్యమంలో బీబీ అమ్మగా ఖ్యాతిగాంచిన ఆబాది బానొ బేగం ఉద్యమ కార్యక్రమాలలో 151

భాగంగా దావూది ఇంటికి తరచుగా వచ్చేవారు. ఆ సందర్భంగా ఆమెను కలవటానికి వచ్చిన ప్రముఖులతో జరుగు చర్చలు, సభలు-సమావేశాలలో ఆమె చేస్తున్న ప్రసంగాల ద్వారా వ్యక్తంచేస్తున్న అభిప్రాయాలు జుబైదా బేగంను బాగా ప్రభావితం చేశాయి.

మౌలానా షఫీ దావూది ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. మహాత్ముని పిలుపు మేరకు తన ఇంట కనక వర్షం కురిపిసున్న న్యాయవాద వృత్తిని వదిలి జాతీయోద్యమానికి ఆయన పూర్తిగా అంకితమయ్యారు. భారీ ఆదాయాన్ని ఒక్కసారిగా వదాలుకోవటంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ ఇక్కట్లను భరిస్తూనే, జాతీయోద్యామకారులు దావూదితోపాటుగా జుబైదా బేగం జాతీయ కాంగ్రెస్‌ సభ్యత్వం స్వీకరించి ఆయన వెంట ముందుకు సాగారు.

జుబైదా ఖిలాఫత్‌ ఉద్యమం ద్వారా జాతీయోద్యమంలో ప్రవేశించారు. ఆనాటి నుండి దావూదితో కలిసి దాస్యవిముక్తి కోసం సాగుతున్న పోరులో క్రియాశీలక పాత్ర వహించారు. ఖిలాఫత-సహాయనిరాకరణ ఉద్యమంలో అవిశ్రాంతంగా శ్రమిసున్నభర్తకు అన్నివిధాల సహాయకారిగా నిలచారు. అత్యంత క్లిష్ట సమయాలలో భర్త బాధ్యతలను తాను స్వీకరించి సమర్థతతో నిర్వహించారు.

ఖిలాఫత్‌-సహాయ నిరాకరణోద్యమంలో పోలీసులు మౌలానా షఫీ అహమ్మద్‌ గృహం షఫీమంజిల్‌ మీద ఆకస్మిక దాడిచేసి ఆయనను నిర్భంధంలోకి తీసుకున్నారు. ఆ సందర్భంగా ఆయన జుబైదా బేగంను పిలచి, తిలక్‌ మైదానంలోని కాంగ్రెస్‌ కార్యాలయానికి వెళ్ళ మని సూచించారు. ఆ సూచన మేరకు జుబెదా బేగం హుటాహుటిన కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయానికి వెళ్ళి భర్త స్థానంలో నాయకత్వపు బాధ్యతలు చేపట్టారు. దావూది అరెస్టు వలన నాయకత్వం లోపించిందన్న భావన కార్యకర్తలలో రాకూడదన్న ఆలోచనతో దావూది చేసిన సూచనను ఆమె పాటించారు. మౌలానా దావూది స్థానాన్ని మరొకరు భర్తీ చేసేవరకు ఎంతో ధైర్యసాహసాలతో భర్త కర్తవ్యాన్ని ఆమె నిర్వర్తించి శభాష్‌ అన్పించుకున్నారు.

సహాయనిరాకరణ ఉద్యమంలో భాగంగా సాగిన విదేశీవస్తు బహిష్కరణ, మద్యపాన నిషేధం, ఖద్దరు ప్రచారం తదితర కార్యక్రమాలలో ఆమె భాగం పంచుకున్నారు. తొలుత తన ఖరీదైన విదేశీ వస్తువులను తగులబెట్టి అందరికి ఆదర్శంగా నిలిచారు. భర్త, ఇతర కుటుంబ సభ్యులు ధరించే విదేశీ వస్త్రాలను ద్వంసం చేసేందుకు తిలక్‌ రోడ్డులో గల

152


కాంగ్రెస్‌ భవనానికి పంపి అక్కడ దాహనకాండను నిర్వహించారు. ఆ రోజుల్లో అతి ఖరీదైన దుస్తులు ధరించే న్యాయవాదిగా మౌలానా దావూది ప్రసిద్ధులు. ఆయన కూడ విలువైన బట్టలను విసర్జించారనడంతో ప్రజలు ఉత్తేజం పొంది విదేశీ వస్తువులు, వస్త్రాల బహిష్కరణలో చురుకుగా పాల్గొన్నారు. జుబెదా స్వయంగా ఇల్లిల్లు తిరిగి విదేశీ వస్త్రాలను సేకరించి, వాటిని షఫీమంజిల్‌కు చేర్చటం, ఆలా చేర్చిన బట్టలను ప్రజల సమక్షంలో అగ్నికి ఆహుతిచ్చే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి విదేశీ వస్త్రాల బహిష్కరణ కార్యక్రమాన్ని ఉదృతంగా నిర్వహించారు. ఖద్దరు ప్రచారంలో ప్రత్యేక శ్రద్దాచూపారు, స్వయంగా ఖద్దరు ధరించారు. ఖద్దరు ప్రచారంలో భాగంగా తన కుమార్తెల సహాయంతో ప్రత్యేక బగ్గీని ఏర్పాటు చేసుకుని పట్టణ వీధులలో, ఇతర గ్రామాలలో తిరుగుతూ స్వదేశీ వస్త్రధారణ ప్రచార కార్యక్రమాలను చేపట్టారు.

జుబైదా బేగం పర్దానషీ మహిళ అయినప్పికి భారత జాతీయ కాంగ్రెస్‌ నిర్వహించిన సభలు సమావేశాలన్నిటిలో భర్తతోపాటు పాల్గొన్నారు. ఇతర మహిళలు కూడ సమావేశాలలో పాల్గొనేట్టుగా ప్రోత్సహించారు. పలు ప్రాంతాలలో మహిళల సమావేశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి సమర్థవంతంగా ఆమె నిర్వహించారు. ఈపర్య టనలలో ప్రదానంగా మహిళలను ప్రబావితం చేయ ప్రయ త్నించారు. జాతీయోద్యామం లో పాల్గొంటున్న కుటుంబాలతో పరిచయాలు పెంచుకుని, ఆ కుటుంబాల లో మగవారు అరెస్టులు కావటం, జైళ్ళకెళ్ళటం వలన మహిళలు, కుటుంబీకులు భయపడకుండ ధైర్యం చెప్పారు. స్వాతంత్య్రోద్యామకారుల కుటుంబాల సంక్షేమం కోసం, తాము ఆర్థిక ఇక్కట్లను ఎదుర్కొంటూ కూడ బాధితులకు సహకరించారు.

ఈ సమావేశాలలో ఆవేశం, ఆలోచనలతో కూడిన ప్రసంగాలు చేస్తూ మహిళల్లో ధైర్యసాహసాలను నూరిపోస్తూ, వారిలో దేశభక్తి, త్యాగనిరతిని పెంపొందించారు. స్వయంగా ఉద్యమంలో పాల్గొనేట్టుగా మహిళలను పురికొల్పారు. షఫీమంజిల్‌ వేదికగా మహిళలకు సంబంధించిన పలు కార్యక్రమాలకు జుబెదా బేగం నాయకత్వం వహించారు. ఈ సందర్బంగా జైలుకి వెళ్ళాల్సి వచ్చినా, పోలీసు లాఠీల దెబ్బల తీవ్రతను చవిచూడల్సి వచ్చినా ధైర్యంగా ముందుకు సాగారు.

సహాయ నిరాకరణోద్యామంలో భాగంగా ప్రభుత్వ కళాశాలలను బహిష్కరించిన విద్యార్థుల పట్ల ఆమె ప్రత్యేక శ్రద్ధచూపారు. ఆ విద్యార్థుల కోసం తమ షఫీ మంజిల్‌

153

ఆవరణలో జాతీయ కళాశాల ప్రారంభించారు. ఆ విద్యార్థుల భోజన వసతిని స్వయంగా చూశారు. ఈ సందర్భంగా తన పిల్లల చదువు సంధ్యాలను కూడ విస్మరించి జాతీయ భావాలకు ప్రతీకలైన విద్యార్థ్ధుల కోసం నిరంతరం శ్రమించారు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టగా ప్రతి ఇంట గుప్పెడు బియ్యం సేకరించి కొంతకాలం జాతీయ విద్యాసంస్థను నెట్టుకొచ్చారు. కాలం గడిచే కొద్ది ఆర్థిక ఇక్కట్లు మిక్కుటం కావటం, మరోవైపు నుండి బ్రిటిషు ప్రభుత్వాధికారుల వేధింపులు మితిమీరటంతో ఆ సంస్థలు ఎక్కువ కాలం మనుగడ సాగించలేకపోయాయి.

1928 నాి పండిత మోతీలాల్‌ నెహ్రూ సమర్పించిన నివేదికతో మౌలానా షఫీ దావూదీ విభేధించారు. అప్పటి నుండి ఆయన కాంగ్రెస్‌ పార్టీకి దూరమై అరహర్‌ పార్టీలో చేరారు. చివరకు 1937లో మౌలానా షఫీ దావూది రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. ఆయన మూడు సంవత్సరాల పాటు రోగగ్రస్తులవ్వటంతో చికిత్స కోసం అధిక వ్యయమైంది.

ఆ కారణంగా జుబైదా కుటుంబం ఆర్థిక పరిస్థితి తీవ్ర వెనుకబాటును చవి చూసింది. ఆదాయం తెచ్చిపెట్టే న్యాయవాద వృత్తిని వదలుకోవటం, జాతీయోద్యమంలో ఇతరుల సహకారం లేకుండ కార్యక్రమాలను నిర్వహించటంతో పొదుపు చేసిన ధనం కరిగిపోవటం, అనారోగ్యం వలన అదనపు వ్యయం ముంచుకు రావటంతో ఆ కుటుంబం కునారిల్లిపోయింది. రోజువారి జరుగుబాటు కూడ కష్టంకాగా ఎందరికో ఆశ్రయం కల్పించిన షఫీ మంజిల్‌ భవంతిని అద్దెకిచ్చి, ఆ కుటుంబం మరో చిన్న గృహంలోకి నివాసం మార్చాల్సి వచ్చింది. కుటుంబ ఆర్థిక పరిస్థితు లు ఎంతగా దిగజారినా, సన్నిహితుల నుండి గాని, ప్రభుత్వం నుండి గాని సహాయం స్వీకరించడానికి జుబైదా నిరాకరించారు.

చివరికి ఆసంతా కరిగిపోవటంతో మిగిలిన కొద్దిపాటి భూమిని అమ్ముకుని జీవిత చరమాంకం గడపాల్సివచ్చింది. ఆ దుర్బర పరిస్థితిలోనూ శ్రీమతి జుబేదా బేగం మాతృదేశ సేవకు ఖరీదు కట్టాలేనంటూ, ప్రబుత్వం, ప్రముఖులు అందించవచ్చిన ఆర్థిక సహాయాన్ని నిరాకరించి కడగండ్ల జీవితాన్ని నిశ్శబ్దంగా గడిపారు.

154